సుప్రభాత సమయం, క్రమం మీకు తెలుసా?
ప్రతి రోజూ బ్రాహ్మీ ముహూర్తం (2.30 నుండి 3.00) గంటల మధ్యలో శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది. ఆ సమయంలోనే 'సన్నిథిగొల్ల' దివిటీ పట్టుకుని ఉత్తర మాడవీధిలో ఉంటున్న వైఖాసన అర్చకస్వామి ఇంటికి వెళ్తారు. వారు కూడా స్నానసంధ్యాది అనుష్ఠానాలన్నీ పూర్తిచేసుకుని సన్నిథిగొల్ల రాకకోసం ఎదురు చూస్తుంటారు. సన్నిథిగొల్ల శ్రీవారి ఆలయానికి విచ్చేయమని ఆయన్ను స్వాగతిస్తారు. అప్పుడు అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తెరవడానికి ఉపయోగపడే 'కుంచెకోల' అనే సాధనాన్ని తాళం చెవులను తీసుకుని శ్రీవారిని స్మరిస్తూ సన్నిథిగొల్లని అనుసరిస్తూ మహాద్వారం వద్దకు చేరుకుంటారు.
అర్చకస్వాములు మహాద్వారం వద్దకు రాగానే 'నగారా' మండపంలోని నౌబత్ ఖానా (పెద్ద పలకగంట)ని హెచ్చరికగా మోగిస్తారు.
ఆ ఘంటారావం తర్వాతే ముఖద్వారాన్ని తెరుస్తారు.
సన్నిథిగొల్ల వెంట నడుస్తున్న అర్చకులు ప్రధాన ద్వార దేవతా గణానికి మంత్రపూర్వక ప్రణామాలర్పిస్తూ ఆలయం లోపలికి ప్రవేశిస్తారు.
తమ వద్ద ఉన్న 'కుంచెకోల'ను, తాళం చెవుల్ని ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకిస్తారు.
వారు క్షేత్ర పాలకులకు, ధ్వజస్తంభానికి నమస్కరించి, ప్రదక్షిణం చేసి వెండివాకిలి దాటి, బంగారు వాకిలి ముందు శ్రీవారిని స్మరిస్తూ నిలుచుంటారు.
సన్నిథిగొల్ల అర్చకులను అక్కడే వదిలి శ్రీవారి సన్నిధి వీధిలోని బేడి ఆంజనేయస్వామి గుడి వద్దనున్న పెద్ద జియ్యంగార్ మఠానికి వెళ్తారు.
ఆ సమయానికి జియ్యంగారు కానీ వారి పరిచారకుల్లో ఎవరైనా ఏకాంగి కానీ సిద్ధంగా ఉంటారు కాబట్టి వారిని తోడ్కొని సన్నిథిగొల్ల ఆలయానికి వెళ్తారు.
సరిగ్గా ఆ సమయానికి ఆలయ అధికారి పేష్కారు, శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేదపండితులు అందరూ బంగారు వాకిలిముందు సిద్ధంగా ఉంటారు.
తాళ్ళపాక అన్నమయ్య వంశం వారిలో ఒకరు తంబూరతో స్వామివారికి మేలుకొలుపు సంకీర్తన పాడడానికి సిద్ధంగా ఉంటారు.
సుప్రభాత సేవ కోసం రుసుం చెల్లించిన భక్తుల్ని అప్పుడు బంగారు వాకిలి వద్దకు అనుమతిస్తారు. పైన పేర్కొన్న వారందరి ముందు అర్చకులు తమ దగ్గరున్న తాళం చెవితో గడియకు వేసిన తాళాన్ని తీస్తారు.
సన్నిథిగొల్ల పేష్కారు వద్దనున్న సీలువేసిన చిన్న సంచిలో ఉన్న తాళం చెవులతో, సీలువేసి ఉన్న మూడు పెద్ద తాళాలను తీస్తారు. తీసే సమయంలో అక్కడున్న అందరికీ చూపించడం ఆనవాయితీ.
తాళాలు తీసిన తర్వాత సన్నిథిగొల్ల బంగారు వాకిలి తెరచుకొని దివిటీతో లోనికి ప్రవేశిస్తారు. ఆ తర్వాతే అర్చకులు మధురస్వరంలో "కౌసల్యా సుప్రజా రామా ...'' అంటూ సుప్రభాతం అందుకొంటూ లోనికి ప్రవేశిస్తారు.
ఆ తర్వాత మహంతు, మఠం వారు తెచ్చిన 'పాలు, చక్కర, వెన్న, తాంబూలం' ఉన్న పళ్లెరాన్ని ఏకాంగి అందుకుని లోనికి తీసుకొని వెళ్తారు.
వారటు లోనికి వెళ్ళగానే బంగారు వాకిలిని దగ్గరకు వేస్తారు.
బంగారు వాకిలి ముందునున్న వేదపండితులు అర్చకులు సుప్రభాత గీతాలాపనాను కొనసాగిస్తారు.
సుప్రభాతంలో స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం పూర్తయిన తరువాత అన్నమయ్య వంశీయులు భూపాలరాగంలో ఒక మేలుకొలుపు కీర్తన గానం చేస్తారు.
సన్నిథిగొల్ల వద్దనున్న దివిటీ వెలుగులో అర్చకులందరూ రాములవారి మందిరానికి వేసిన తలుపు తాళాలను తీసి శయన మండపంలో పానుపుపై ఉన్న భోగ శ్రీనివాసమూర్తికి ప్రదక్షిణంగా సన్నిధికి చేరుకుంటారు.
దివిటీతో ముందుగా లోపలికి వెళ్ళిన సన్నిథిగొల్ల 'కులశేఖర పడి' వద్ద నిలిచి ఆ వెలుగులో శ్రీవారి దివ్యమంగళమూర్తిని తొలి దర్శనం చేసుకుంటారు.
ఆ తరువాత అర్చకులు, ఏకాంగి 'కులశేఖరపడి' దాటి లోపలికి ప్రవేశిస్తారు.
తరువాత సన్నిధిలోని దీపాలను వెలిగిస్తారు. అర్చకులు శ్రీవారికి పాద నమస్కారం చేస్తారు.
తరువాత శయన మండపంలో బంగారుపట్టు పరుపుపై పవళించి ఉన్న భోగ శ్రీనివాసమూర్తిని సమీపించి నమస్కరించి చప్పట్లు చరుస్తారు. ఆ విధంగా ఆయన్ని మేల్కొనవలసినదిగా ప్రార్థిస్తారు.
ఆపైన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని జీవస్థానంలో ... మూల మూర్తి సన్నిధిలో వేంచేపు చేస్తారు.
ఆనంద నిలయంలో కులశేఖరపడి వద్దనున్న తెరవేసి అర్చకులు శ్రీవారికి దంతధావన, ఆచమనాది అనుష్ఠాన క్రియలను సమర్పిస్తారు.
మహంతు మఠం వారు తెచ్చిన నవనీతం, పాలు, చక్కెరలను నివేదన చేసి, స్వామివారికి సుగంధ తాంబూలాన్ని సమర్పిస్తారు.
బంగారు వాకిలి ముంగిట్లో వేదపండితులు (సుప్రభాతం) మంగళా శాసనాన్ని ముగిస్తూ ఉండగా, లోపల అర్చకులు శ్రీవారికి నవనీత హారతి ఇస్తుంటారు. 'నవనీత హారతి' అంటే నివేదనాంతరం ఇచ్చే కర్పూర హారతిని నవనీత హారతి అని పిలుస్తారు. ఆ సమయంలోనే బంగారు వాకిళ్ళు తెరుస్తారు.
అపుడు శ్రీవారి పాదాలపై తులసీదళాలు, పుష్పాలు కూడా ఉండవు. భక్తులకు ఆపాదమస్తకం స్వామి దివ్యమంగళ విగ్రహ దర్శనం లభిస్తుంది. అందుకే ఈ దర్శనాన్ని 'విశ్వరూప సందర్శనం' అని భక్తితో పిలుస్తారు.
__(())__
: "శార్దూలము..
సత్యజ్ఞానమొసంగుదివ్యుఁబిలుతున్ సాయమ్ముకైయెప్పుడున్
నిత్యైశ్వర్యముఁగాంక్షగానడిగెదన్ నీరేజసంజాతనున్
సత్యమ్మో పదదర్శనమ్మునుమదిన్ సత్యాశ్రితానందినిన్
పథ్యమ్మౌనగునీడ్యదర్నమునే భాగ్యమ్ముగానెంచఁగా !!! "
----------------------------------------
🌼సుభాషితమ్🌼
శ్లో|| యాత్యధోఽధో వ్రజత్యుచ్చైర్నరః స్వైరేవ కర్మభిః।
కూపస్య ఖనితా యద్వత్ ప్రాకారస్యేవ కారకః॥
తా|| "మానవులు తమ తమ కర్మలవల్లనే అధోగతికో ఉచ్చైర్గతికో వెళ్తున్నారు. ఎట్లనిన బావి త్రవ్వువాడు అంతకంతకూ క్రిందకూ, గోడ కట్టువాడు అంతకంతకూ పైకి వెళ్లడం చూస్తున్నాం కదా!"
__(())__
పడుచు స్త్రీలు సన్యసించుటకు హిందూ ధర్మం సమ్మతించదు, ఎందుకు?
సనాతన ధర్మాన్ని అనుసరించి, యవ్వనంలో ఉన్న స్త్రీలు కాషాయాంబర ధారులై సవ్యసించుట, సరియై -నది కాదు. ఋతుస్రావము స్త్రీలోని కామవాంచమ సూచించునవి విశ్వాసం.
యవ్వన మరియు ప్రౌఢ దశ పూర్తయి ఋతుస్రావం ఆగిపోయిన అనంతరం స్త్రీలు భవబంధాలను వదలుకొని సన్యాసిగా మారి పోవచ్చు. ఈ విషయాన్ని మీరు స్త్రీ జాతిని కించపరచడమని తప్పుగా అర్థం చేసుకోవద్దు.
యవ్వన మరియు ప్రౌడ దశ పూర్తయ్యేత వరకు స్త్రీకి సన్యసిం చడం వీలుకాదు అని మాత్రమే మన ధర్మం చెబుతు న్నది కానీ బాల్య, యవ్వన మరియు ప్రౌఢ దశల్లో ఆధ్యాత్మిక సాధన చేయరాదని మాత్రం చెప్పడం లేదని గుర్తించండి.
సన్యసించి సాధించే దాని కంటే సంసారిగా ఉండియే అంతకు వెయ్యిరెట్లు ఆధ్యాత్మిక ఉన్నతిని కఠిన సాధనల ద్వారా సాధించవచ్చని మరవకండి.
సంసారియైన పార్వతీ దేవి తన తపస్సుతో భువనాలను ఏలే భువనేశ్వరియై, జగన్మారై, విశ్వనియంత్రణా శక్తికి అధిష్టాన దైవమై విలపిల్లు తోందని మనం మరువరాదు.
యవ్వనంలో ఉన్నప్పుడు పన్యసించి చెట్లు వెంట, పుట్టల వెంట, సమాజంలోనూ తిరుగుట స్త్రీకి ఎంత వరకు వీలవుతుంది! ఏకాంతంగా పంచ -రించే తను కామాంధుల కళ్ళ నుండి ఎంతకాలం తనని తాను రక్షించుకోగలదు!
కావున సన్యాసియై దేశదిమ్మరిగా తిరుగుట తనకు వీలు కాదు కాబట్టి సంఘములోనే అవివాహితగా ఉండి (వివాహం ఇష్టం లేకపోతే) తన స్వయంపోషనకు కావలసిన వనరులు ఏర్పాటు చేసుకొని ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సాధించుకోవచ్చు.
ఓక యువతి తాను తప్పకుండా సన్యసిస్తానని ధృఢనిశ్చయము కలిగి వుంటే అందంగా కనపడు కునట్లుగా గుండు గీయించుకొని లేదా వెంట్రుకలు చిన్నగా కత్తిరించుకొని, సంఘరహితయై, నిత్య సంతుష్టురాలై, కామం విషయంలో చలించని మనసు కలిగి వుండి, ఈశ్వరుడిని ఆరాధిస్తూ జపధ్యానాలలో మునిగిపోవచ్చు.
సన్యాసి అంటే సర్వస్వాన్ని త్యాగం చేసి దేశదిమ్మరియై, బిక్షపై ఆధారపడి తపస్సు చేయువాడు. కాషాయ వస్త్రం కట్టుకొని నాలుగు పూటలా తింటూ సుఖభోగ జీవితాన్ని గడుపుతున్న స్వామాజీలు కాదని మీరు గుర్తించాలి.
వారిని పెండ్లి కాని పూజారులు లేదా బ్రహ్మచారులు అని అనడం సమంజసం. పంసారుల కంటే సుఖంగా జీవితాన్ని గడుపుతున్న వీరు సన్యాసు లుగా పిలువబడడం నిజంగా హైందవ మతానికి చెదరని అపకీర్తి.
అలాంటి కఠినమైన సవ్యాస దీక్షను తట్టుకో -లేక పంచల క్రింద తలదాచుకొని, జనానికి పురా - ణకాలక్షేపం చేస్తూ, నాలుగు రాళ్ళు వెనకేసుకు టూ పురుషులే వేషగాళ్ళ మాదిరి బ్రతుకుతుంటే, ఇక ప్రకృతి తత్వం కలిగి వున్న స్త్రీలు సన్యాస దీక్షను ఎలా తట్టు కోగలరు.
ఈ కారణం చేతనే పడుచు స్త్రీ సన్యాసానికి తగదని ఋషివాక్కు.
__(())__
#🎾_ఎడమ వైపు నిద్ర పోవడం
భోజనం చేసిన తర్వాత ఆహారాన్ని పచనం ( జీర్ణం ) చెయ్యటానికి జఠరాగ్ని ప్రదీప్తమవుతుంది . మెదటగా మెదడు లోని రక్తం , తర్వాత ఇతర అవయవాల్లోని రక్తమంతా తిన్న ఆహారాన్ని పచనం చేయడానికి పొట్ట భాగానికి చేరుతుంది . అపుడు మెదడు విశ్రాంతిని కోరుకుంటుంది . అందు వలన నిద్ర వస్తుంది . నిద్ర పోవడం మంచిది .
ఉదయం లేక మధ్యాహ్న భోజనం తర్వాత 30 నుండి 40 నిమిషాల వరకు ఖచ్చితంగా నిద్ర పోవలెను . ఏ కారణం చేతనైనా విశ్రాంతి తీసుకునే అవకాశం లేని వారు కనీసం 10 నిమిషాల పాటు వజ్రాసనం వేయండి .
# రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్ర పోకూడదు . కనీసం 2 గంటల తర్వాత నిద్ర పోవాలి . మీరు వెంటనే నిద్ర పోవడం వలన డయాబెటీస్ , హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదముంది .
పడుకునే విధానం :----
ఎడమ ప్రక్కకు తిరిగి , ఎడమ చెయ్యి క్రిందకు వచ్చే విధంగా పడుకొని విశ్రమించాలి .
# దీనిని వామ కుక్షి అవస్దలో విశ్రమించటం అంటారు .
# మన శరీరంలో సూర్యనాడి , చంద్ర నాడి మరియు మధ్యనాడి అనే మూడు నాడులున్నాయి . సూర్యనాడి భోజనాన్ని జీర్ణం చెయ్యటానికి పనికొస్తుంది . ఈ సూర్య నాడి ఎడమ వైపు తిరిగి పడుకుంటే చక్కగా పని చేస్తుంది .
# మీరు అలసత్వానికి గురైయినపుడు , ఇలా ఎడమ వైపున తిరిగి పడుకొనుట వలన అలసత్వం తొలగి పోతుంది . మిగతా రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకుంటారు .
ప్రయోజనాలు ( Benefits ) :--
1 . గురక తగ్గి పోవును .
2. గర్బిణీ స్త్రీలకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది . గర్బాశయంకు , కడుపులోని పిండమునకు మరియు మూత్ర పిండాలకు చక్కని రక్త ప్రసరణ జరుగును . వెన్ను నొప్పి , వీపు నొప్పుల నుండి ఉపశమనం కలుగును .
3 . భోజనం తర్వాత జరిగే జీర్ణక్రియలో సహాయ పడుతుంది .
4 . వీపు , మెడ నొప్పులున్నవారు ఉపశమనం పొందెదరు .
5 . శరీరంలో వున్న విషాలని , వ్యర్ద పదార్ధలని తొలగించే రసాయనాలకు తోడ్పడుతుంది .
6 . తీవ్రమైన అనారోగ్యానికి కారణమైన విష పదార్ధాలు బయటికి నెట్టి వేయ బడును .
7 . కాలేయం మరియు మూత్ర పిండాలు సక్రమంగా పని చేస్తాయి .
8 . జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగును .
9 . గుండెకు శ్రమ తగ్గి సక్రమంగా పని చేయును .
10 . గుండెలోని మంటను నిరోధిస్తుంది . కడుపులోని ఆమ్లాలు శాంతిస్తాయి .
11 . ఉదయం అలసట లేకుండా ఉత్సాహంగా వుంటారు .
12 . కొవ్వు పదార్ధాలు సులభంగా జీర్ణం అవుతాయి .
13 . మెదడు చురుకుగా పని చేస్తుంది .
14 . పార్కిన్సన్ మరియు అల్జీమర్ వ్యాధులను కంట్రోలు చేస్తుంది .
15 . ఆయుర్వేధం ప్రకారం ఎడమ వైపున తిరిగి పడుకొనే విధానం చాలా ఉత్తమమైన పద్ధతి .
ప్రతి ఒక్కరు వారి వారి పద్దతులలో నిద్రపోతారు . కావున వెంటనే మీరు మీ పద్ధతిని మార్చుకోవాలంటే చాలా కష్టం . కాని మీరు మీ ఆరోగ్యం కొరకు కొద్దిగా ప్రయత్నం చేస్తే మార్పు చేసుకోవచ్చును .
ఎడమ వైపు తిరిగి పడుకొనిన యెడల , మీ శరీరంలో కలిగే మార్పులను ప్రతి రోజు మీరు గమనించ వచ్చును .
మీరు ఈ చిన్న మార్పుని చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి
గమనిక : ----
తల తూర్పు వైపు పెట్టి పడుకోవాలి . కుదరకపోతే దక్షిణం వైపు తలపెట్టి పడుకోవాలి .
# ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదు . చదువు కునేందుకు , ఏదైనా అభ్యాసానికి ఉత్తర దిశ మంచిది ...
సేకరణ
“అమ్మ దేవుడి అంశ అయితే, నాన్న సాక్ష్యాత్ దేవుడే”
*ఈ వ్యాసం ప్రతి ఒక్క నాన్నకు అంకితం...
నా మనస్సును కదిలించింది. నాన్న గొప్పదనాన్ని వచ్చే తరానికి,యువతకు తెలియాలి. నా బాధ్యత గా మీకు షేర్ చేస్తున్నాను. మీరు షేర్ చెయ్యండి. మంచిని పెంచుదాం.
మానస సరోవరం
ఆయుష్షు చెప్పటం అవసరమా ఆరోగ్యం ఉన్న అం తకాలం, నా అన్న వారు లేరు నాకన్నా బలవంతులు లేరు అనివీర్రా వీగిపోతారు దూదిపింజంలా ఎగురుతుంటారు గాలికి వెళ్ళ్లే మేఘంలా కదులుతూ వార్షమ్ కురుస్తూ బతుకుతారు.
ఆదాయాదులు : సంపద
ఆయుష్షు, ఆదాయాదులు, ఇంటిలోని కలహాలు, వ్యక్తిగత రహస్యాలు (తనకు మాత్రమే తెలిసిన లోపాలు) మంత్రం, ఔషథం, తపస్సు, దానం, అవమానం అను ఈ తొమ్మిది విషయాలు గోప్యంగా ఉంచుకోవాలి...అదే ఉదేశ్యం ఆనందం .. ఆరోగ్యం ... ఆధ్యాత్మికం . మా ఉద్దేశ్వ౦
మీ సహకారమే మాకు ఆదర్శం అదృష్టం మీస్నేహమే మాకు పెన్నిధి .
***
om sri rama
ReplyDelete