కనక రత్న వజ్ర వైడూర్య మకుటమ్ము
కల్గి ఉన్న శోభ నిచ్చు కృష్ణ
తళుకుల సుమలలిత ఫాలదేశముజూపు
సురుచిర కర సుముఖ వెల్గు కృష్ణ .... .... 1
లలిత ఫాల దేశ భ్రూలతా శోభితం
సుందర కనుగవ బెళుకుల కృష్ణ
లేత ముదురు మొగ్గ నాసిక మంద
స్మిత కనికరమును జూపు కృష్ణ ... .... 2
రత్న దంత వెలుగు మధురాతి మధురమ్ము
రమ్య మైన బింబ ఆధారమ్ము
సిరులు ఒలక పుచ్చు చిన్నయా రూపమ్ము
పలువురి మనసులను దోచు కృష్ణ ..... .... 3
--(())--
యస్మాన్నో ద్విజతేలోకో లోకాన్నో ద్విజతే చ యః
హర్ష మర్ష భయోద్వేగైః ముక్తోయ స్స చమేప్రియః
ఎవని వలన ప్రపంచము అనగా ప్రజలు భయమును పొందరో, లోకము వలన ఎవడు భయమును పొందడో, ఎవరు సంతోషము, క్రోధము, భయము, మనో వ్యాకులత మోదలగు నవి లేకుండా ఉంటారో అటువంటి వారు నాకు ఇష్టులు. స్త్రీ పురుషులు యైన శ్రీ రామ శ్రీ రామ అని జపంచెయ్యండి అక్కడే ఉండి మనస్సుకు శాంతి.
ప్రకృతి పాఠము నేర్పు తుంది, సమయం సుఖము అంధిస్తుంది, లోకం ఆశ నేర్పిస్తుంది, స్త్రీ పురుషుల మనోభావాలు, శరీర ఆకృతులు, లక్షణ ధర్మాలు వేరైన పెళ్లి అనే
యోగం .. ఒక దానితో మరొకటి అనుసంధానమైతే యోగం అని అంటారు. అనగా స్త్రీ పురుషుల కలయకె కొత్త జీవితం, ఆకర్షణ, ఆలోచన, ఆత్మీయతా, ఆనందం, వ్యక్తం చేస్తారు, వారి కర్మాను సారం బుద్ధులు ఉంటాయి, వారిని కాలమే మారుస్తుంది.
హఠయోగం - మన భౌతిక శరీరంతో మనం ఏకమై ఉండటం. (ఆసనాలు) ప్రవర్తన, ఆశయ లక్ష్యం ఒకటే మాదిరి చూపు కళలు
నాద యోగం - సంగీతంతో మనం ఏకమవడం. మనసు ఉల్లాసం, ఉత్సాహం, పలకులు ఏక
మలుపు సుఖం సంగీతం మేలవింపు
కర్మ యోగం - మనం చేసే కర్మలతో ఏకమవడం. వాద ప్రతిపాదన అనేది లేక నీ మాటే నామాట. నీతృప్తే నాతృప్తీ అనేయోగం
జ్ఞాన యోగం - జ్ఞానంతో ఏకం అవ్వడం. సమవిద్యలతో నిత్యము బోధలు సల్పి జ్ణానం విస్తరణ చేయటే జ్ణాణయోగం..
రాజ యోగం - మన యొక్క అతీంద్రియ శక్తులతో ఏకమవడం. ఇరువురి శక్తులు ఒకేరకంగా, మాట, నడక, సర్వము ఒకే విధముగా రాజ యోగం.
భక్తి యోగం - సకల చరాచర సృష్టి తో ఏకమై ఉండడం; నేను, నాది అనేది తీసివేసి..
వ్యంగ్యం కాదండీ ... వాస్తవం వివరణల నద్యాలు
పూర్వము పెద్దోళ్ళు పెళ్లి కట్నం ఇచ్చే మోగాడంటే చాలు పడుచు పిల్లను పెళ్లి చేసేవారు.
నోరం జేతులు రెండు చూపె భయమున్ నారీ సహాయమ్ము గా
సర్వాంగం పులకుంచి దాహము కళే స్వారీ ప్రమాదమ్ము గా
శ్రీ రమ్యం అణువంత పంచు దేహము కధే శ్రీ రంగ రాజ్యమ్ము గా
కారుణ్యం కమనీయ మే కలుయుటే కార్యమ్ము సౌఖ్యమ్ము గా
కలలు కనమనేను, కాల మందు, నెరవేర్చ మనేను
చిలక పలుకులేను, చాల మేలుచేసి మనసునే దోచే
పలక రింపులోను, పెద్ద చిన్న అనక అందరితో ప్రేమ.
వలదు అనే పదము, వాదము అసలొద్దు, నిజము తెల్పు మహిళ
తెలుగు వెలుగు నేల తీపి రుచులు తోను ధైర్య ముంచ గలరు,
కలుగజేయు ముదము కాలమందు బతుకు మృదుమధురము పొందు
విలువ లన్ని పెరిగి విరులు కమనీయత విధిని తెలుపు మహిళ
చెలగు సాగు నంత చేరు వగుటకు కృషి తెలుగు మల్లి కలలు
అలుపు అనుకుంటే, మనసు చెప్పఁ లేవు, ఓర్పు చూపలేవు,
మలుపు వచ్చి తీరు మనుగడ బతుకులో మంచి జీవితమ్ము .
వెలుగు పొంది పంచి వరుస కలిపి మంచి బోధ చేయు మహిళ
కలుగు కళప్రేమ కధలు కాదు నిజము వలన సంతృప్తియె.
విధేయుడు.. మల్లాప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ
శ్రీకృష్ణ రాయబారము లో పద్యం :.... 2 "అలుగుటయే యెఱుంగని మహామహితాత్ము డజాతశత్రుడే యలిగిననాడు సాగరములన్నియు నేకము గాకపోవు, క ర్ణులు పదివేవురైన నని నొత్తురు చత్తురు రాజరాజ! నా పలుకులు విశ్వసింపుము, విపన్నుల లోకులఁ గావు మెల్లరన్." (పాండవోద్యోగ నాటకము - తిరుపతివేంకటకవులు) అర్థములు: అలుగుట = ఆగ్రహించుట; అజాతశత్రుడు = శత్రువులు లేనివాడు, ధర్మరాజు; అని = యుద్ధము; విపన్నులు = ఆపన్నులు, ఆపదకు లోనైనవారు; కావుము = కాపాడుము. భావము: కోపమును దరిచేరనీయక, సదా శాంతస్వభావులై సౌమ్యులుగా కనిపించేవారు లోకములో చాలా అరుదుగా ఉంటారు. అలాంటివారికి ఆగ్రహం కలిగితే, అది ప్రళయభయంకరమే అవుతుంది...... మహాభారతములో ధర్మజుని పాత్ర అటువంటిది. ఆయనను వైరివర్గములోనివారు సైతం గౌరవిస్తారు. అందుకే "అజాతశత్రుడు" అనే పేరు వచ్చినది. దాయాదులైన తమ వద్దకు సంధిసందేశమును పంపిన ధర్మరాజు శక్తిసామర్థ్యములను శంకించిన దుర్యోధనుడు "పరాక్రమవంతులు పగవారి సముఖానికి రాయబారిని పంపిస్తారా?" అని అధిక్షేపిస్తాడు. అందుకు జవాబుగా శ్రీకృష్ణుడు పై పద్యములో అజాతశత్రుడు అలిగితే కలిగే అనర్థమును విస్తరించి చెప్పాడు. "సుయోధనా! ఆ ధర్మాత్ముడు కోపిస్తే, సప్తసముద్రములూ ఏకమై జలప్రళయం సంబవిస్తుంది సుమా! కర్ణుని అండ చూసుకుని నీవు అహంకరిస్తున్నావు. ఇలాంటి కర్ణులు పదివేవురైనా కదనరంగములో కన్నుమూయక తప్పదు. జాగ్రత్త!" అని హెచ్చరించాడు. రాధేయుని పరాక్రమమును కించపరచి మాట్లాడడం, మాధవుని భేదోపాయం; దుర్యోధనుని అంతరంగములో బెదురు పుట్టించడం. లోకులను "విపన్నులు" అనడంలో, రారాజు స్వార్థమునకు ఎంతమంది అమాయకప్రజలు మారణహోమం కాబోతున్నారో ఎత్తిచూపడం... ఇక, "నా పలుకులు విశ్వసింపుము" అని చెప్పుటలో, కురుపాండవపక్షములలో తనకు గల గౌరవమును, తన పరమాత్మతత్త్వమును పరోక్షంగా ప్రస్తావించడం! ధూర్తుడికి భయంచెప్పి, భక్తిని నేర్పే ప్రబోధశిల్పం పై పద్యములో ప్రతిధ్వనిస్తున్నది. "చెల్లియొ చెల్లకో" అనే మొదటిపద్యం ఎంత మెత్తగా ఉన్నదో, ఈనాటి ఈ రెండవపద్యం అంత గట్టిగా ఉన్నది. | |
🚩🙏🙏🙏🚩
*శ్రీఆది శంకరాచార్య విరచితం శ్రీగోవిందాష్టకం*
*1) సత్యం ఙ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశమ్ |*
*గోష్ఠప్రాంగణరింఖణలోలమనాయాసం పరమాయాసమ్ |*
*మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారమ్ |*
*క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందమ్ ||*
*2) మృత్స్నామత్సీహేతి యశోదాతాడనశైశవ సంత్రాసమ్ |*
*వ్యాదితవక్త్రాలోకితలోకాలోకచతుర్దశలోకాలిమ్ |*
*లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనా లోకమ్ |*
*లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందమ్ ||*
*3) త్రైవిష్టపరిపువీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నమ్ |*
*కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారమ్ |*
*వైమల్యస్ఫుటచేతోవృత్తివిశేషాభాసమనాభాసమ్ |*
*శైవం కేవలశాంతం ప్రణమత గోవిందం పరమానందమ్ ||*
*4) గోపాలం ప్రభులీలావిగ్రహగోపాలం కులగోపాలమ్ |*
*గోపీఖేలనగోవర్ధనధృతిలీలాలాలిత గోపాలమ్ |*
*గోభిర్నిగదిత గోవిందస్ఫుటనామానం బహునామానమ్ |*
*గోపీగోచరదూరం ప్రణమత గోవిందం పరమానందమ్ ||*
*5) గోపీమండలగోష్ఠీభేదం భేదావస్థమభేదాభమ్ |*
*శశ్వద్గోఖురనిర్ధూతోద్గత ధూళీధూసరసౌభాగ్యమ్ |*
*శ్రద్ధాభక్తిగృహీతానందమచింత్యం చింతితసద్భావమ్ |*
*చింతామణిమహిమానం ప్రణమత గోవిందం పరమానందమ్ ||*
*6) స్నానవ్యాకులయోషిద్వస్త్రముపాదాయాగముపారూఢమ్ |*
*వ్యాదిత్సంతీరథ దిగ్వస్త్రా దాతుముపాకర్షంతం తాః|*
*నిర్ధూతద్వయశోకవిమోహం బుద్ధం బుద్ధేరంతస్థమ్ |*
*సత్తామాత్రశరీరం ప్రణమత గోవిందం పరమానందమ్ ||*
*7) కాంతం కారణకారణమాదిమనాదిం కాలధనాభాసమ్ |*
*కాళిందీగతకాలియశిరసి సునృత్యంతమ్ ముహురత్యంతమ్ |*
*కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నమ్ |*
*కాలత్రయగతిహేతుం ప్రణమత గోవిందం పరమానందమ్ ||*
*8) బృందావనభువి బృందారకగణబృందారాధితవందేహమ్ |*
*కుందాభామలమందస్మేరసుధానందం సుహృదానందమ్ |*
*వంద్యాశేష మహాముని మానస వంద్యానందపదద్వంద్వమ్ |*
*వంద్యాశేషగుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందమ్ ||*
*9)గోవిందాష్టకమేతదధీతే గోవిందార్పితచేతా యః |*
*గోవిందాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి |*
*గోవిందాంఘ్రి సరోజధ్యానసుధాజలధౌతసమస్తాఘః |*
*గోవిందం పరమానందామృతమంతస్థం స తమభ్యేతి ||*
--(())--
తెలియఁ జీఁకటి వెలుగు ల దీపము ప్రేమ వల్లె
వెలుఁగు లోపలి అందమే విపులమై సేవ లొలికె
చెలియ నీ సుఖ సంతోష జ్వాలలు నన్ను చేరె
అలక మానుము రాధ మనసు నీదె యీ కృష్ణ ది
అర య నా మనసుకు కభయమ్ము గా ప్రేమ తెలుపు
నాకు ఇరు వైపులను సుఖిఁ నీ కృప వలననే
మరువ బోయెడు వానికి ప్రధమ సుఖము నిమ్ము
దరిన వానిఁ సుఖం తీర్చు దారి రాధకు యె వుంది
వేకువ న నీకొరకు నమ్మియు వచ్చితి కళలు గా
మక్కవనె చూపి అంకితమును ఇచ్చె మనసు గా
ఒక్క మాట వేణువు నొదలీ చేరు సుఖము గా
ఇక అధిరె పెదవుల దాహమును తీర్చు శుభము గా
ఆరని కురులతో ఉన్నా ఆహ్వానము అందుకో
చీర తడిసింది యదలోన యందమును దోచుకో
కరుణ చూపుటకు దిగిరా కానిది ఏది కాదు
చురుకుగా సంగమ హృదిలో జాప్యము వలదులే
మనము ఒక జంట వలపుల పంటగా కలిసె ద
అణువు యదలో న సెగలు గా ఆకలి పిలిచెను
తనువు మనసున తపన ల తో ప్రేమ కదిలించు
చినుకు పెడుతుంది ఉడుకు ల చింతను తగ్గించుమా
నిత్య రాధ మాధవ కేళి నిర్మల మనస్సుతో
సతత హరిత వనమ్ము న సొగసులు అందపుచ్చె
సత్య వాదమ్ము హృదయాన్ని చిగురించె ఈసమయం
కతలలో ప్రేమ కుశలమై కలలను తీర్చు చుండు
నువ్వుల రాజుగా నయనాల వెలుగు చూపు పరమాత్మా
రివ్వున సాగేటి రవ్వ ల వెలుగులే పంచు నల్లనయ్య
సవ్వమగు తృప్తీ సుఖము మెండు పంచు కృష్ణ పరమాత్మా
దివ్య మైనట్టిది వైభవం తో ధర్మాన్ని తెలియ పర్చు
No comments:
Post a Comment