గీత. అ.2.సాంఖ్యయోగము. శ్లో.59💐
విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః
రసవర్జం రసోఽప్యస్య పరం దృష్ట్వా నివర్తంతే
భా.ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపనివానినుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలగును.కాని వాటిపై ఆసక్తి మిగిలియుండును.స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వానినుండి ఆ ఆసక్తిగూడ తొలగిపోవును.
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 62 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 15 🌴
15. యం హి ణ వ్యథయన్త్యేతే పురుషం పురుషర్శభ |
సమదుఖసుఖం ధీరం సోమృతత్వయ కల్పతే ||
తాత్పర్యం :
ఓ మానవశ్రేష్టుడా (అర్జునా)! సుఖదుఃఖములచే కలత నొందక, ఆ రెండింటి యందును ధీరుడై నిలుచువాడు నిక్కముగా మోక్షమునకు అర్హుడై యున్నాడు.
భాష్యము :
ఉన్నత ఆధ్యాత్మిక అనుభవ ప్రాప్తి యందు స్థిరనిశ్చయము కలిగి, సుఖదు:ఖముల తాకిడిని సమానముగా సహింపగలిగినవాడు నిక్కముగా మోక్షమును పొందుటకు అర్హుడై యున్నాడు. వర్ణాశ్రమ విధానమునందు నాలుగవ జీవనస్థితియైన సన్యాసము వాస్తవమునకు అత్యంత కష్టదాయకమైనది. అయినను జీవితమును పూర్ణమొనర్చుకొనవలెనను నిశ్చయము కలిగినవాడు కష్టములెన్ని ఎదురైనను తప్పక సన్యాసమును స్వికరించును.
ఆతి కష్టములు సాధారణముగా గృహసంబంధములను త్రెంపుకొనవలసి వచ్చునందున మరియు భార్యాపిల్లల సంబంధము త్యజింపవలసి యున్నందున కలుగుచుండును. కాని అట్టి కష్టములను సహించినచో మనుజుని ఆధ్యాత్మికానుభావమార్గము సంపూర్ణము కాగలదు. అదేవిధముగా స్వీయవంశీయులతో లేదా ప్రియమైన వారితో యుద్ధము చేయుట కష్టమైనను క్షత్రియునిగా ధర్మపాలన విషయమున అర్జునుడు ధృడనిశ్చయము కలిగియుండవలెనని భోదింపబడినది.
శ్రీచైతన్యమహాప్రభువు ఇరువదినాలుగేండ్ల ప్రాయమున సన్యాసము స్వీకరించినపుడు ఆయనపై ఆధారపడిన భార్యను మరియు తల్లిని పోషించువారు వేరోక్కరు లేకుండిరి. అయినప్పటికిని ఉన్నతప్రయోజనార్థమై ఆయన సన్న్యాసమును స్వీకరించి ఉన్నతధర్మ పాలనలో ధీరులై నిలిచిరి. భౌతికబంధము నుండి ముక్తిని సాధించుతాకు అదియే మార్గము.
🌹 🌹 🌹 🌹 🌹
ఓం మహేజ్యాయ నమః | ॐ महेज्याय नमः | OM Mahejyāya namaḥ
సర్వాసుదేవతాస్వేవ యష్టవ్యాసుప్రకర్షతః ।
వైకుంఠః శ్రీహరిర్మోక్షఫలదాతృత్వదేతుతః ।
యష్టవ్య ఇతి మహేజ్య ఇతి విద్వద్భిరుచ్యతే ॥
ఈతడు ఆరాధింపబడువాడును, అట్టివారిలో గొప్పవాడును. ఫలములన్నిటిలో గొప్పదియగు మోక్ష ఫలమునే ఇచ్చువాడగుటచే శ్రీ విష్ణువు యజింపబడదగిన అనగా యజ్ఞములందు ఆరాధించబడదగిన దేవతలందరలోను మిక్కిలిగా ఆరాధించబడదగినవాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్‍చ క్రతుస్సత్రం సతాం గతిః
।సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ ॥ ౪౮ ॥
🌻 448. క్రతుః, क्रतुः, Kratuḥ 🌻
ఓం క్రతవే నమః | ॐ क्रतवे नमः | OM Kratave namaḥ
యో యూపసహితో యజ్ఞస్తత్స్వరూపతయా క్రతుః యూపసహితమగు యజ్ఞమునకు క్రతువు అని వ్యవహారము. అట్టి క్రతువు శ్రీమహావిష్ణుని విభూతియే.
సశేషం...
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్‍చ క్రతుస్సత్రం సతాం గతిః ।సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ ॥ ౪౮ ॥
. వివేక చూడామణి - 100 / Viveka Chudamani - 100🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 23. ఆత్మ స్థితిని చేరుట - 1 🍀
339. విశ్వమంతా ఒకే ఆత్మ అని తెలుసుకొనుటయే బంధనాల నుండి విముక్తిని పొందుటకు మార్గము. విశ్వాన్ని ఆత్మతో సమానమని గుర్తించుట కంటే ఉన్నతమైనది ఏదీ లేదు. ఎవడైతే ఈ వస్తు ప్రపంచాన్ని వదలివేసి ఆత్మను గుర్తిస్తాడో, అందుకు శాశ్వతమైన ఆత్మవైపు స్థిరముగా మరలాలి. అతని కంటే ఉన్నతుడు ఎవడు ఉండడు.
340. ఎవడైతే తాను శరీరముగా భావిస్తారో అతడు ఈ వస్తు ప్రపంచానికి దూరముగా ఉండుట ఎలా సాధ్యమవుతుంది. అతని మనస్సు ఎల్లపుడు ఈ బాహ్య వస్తు సముదాయముపై లగ్నమై ఉంటుంది. తత్‌ఫలితముగా అతడు వాటిని పొందుటకు అనేక కార్యములు కొనసాగిస్తుంటాడు. సాధువు ఈ విధమైన వస్తు సముదాయముపై వ్యామోహము జాగ్రత్తగా గమనిస్తూ వాటికి దూరముగా ఉంటూ అలాంటి పనులను, విధులను, వస్తువులను వదలివేసి, ఉన్నతముగా ఆత్మ యందు నిమగ్నమై ఉంటారు. అపుడే వారికి నిరంతర ఆత్మానందము చేకూరుతుంది.
341. సాధువులు ఎవరైతే తమ గురువుల బోధనలు, సృతులను వింటారో వారు నిశ్చబ్దముగా, శాంతముగా, స్థితప్రజ్ఞతలో ఉంటూ సమాధి స్థితిలో ఉండి పరిపూర్ణానంద స్థితిలో నిమగ్నమై ఉంటారు.
సశేషం....
🌹. దేవాపి మహర్షి బోధనలు - 111 🌹
🌻 91. భౌతికలోక సత్యము - 1 🌻
సోదరత్వము, సమానత్వము, స్వతంత్రము అనుభావములకు భౌతిక ప్రపంచమున అస్థిత్వము లేదు. ఇవి సూక్ష్మము దివ్యము అయిన లోకములకు సంబంధించినవి. అమృతత్వలోకములకు
సంబంధించినవి. సూక్ష్మలోకమున సృష్టిధర్మములు పరిపూర్ణముగ నవగాహనము కాగలవు. భౌతిక లోకమున అవగాహన వక్రత చెంది యుండును. స్వభావమునకు బానిసలైన జీవులకు స్వాతంత్ర్యము మృగ్యము.
స్వభావమే బలీయమై జీవుని ఆశయములు దానికి లోబడి యుండుటచే జీవునకు స్వాతంత్ర్యము లేదు. స్వాభావిక భావములు స్వతంత్ర్యమునకై ప్రయత్నించినపుడు అవి పరస్పర విరుద్ధములై, ధర్మవిరుద్ధములై ఘర్షణ చెందును. సమానత్వము స్వభావమునకు లోబడిన వారికి అసాధ్యము. అందరూ జీవులే అను భావనము తెలిసియున్నప్పటికిని స్వభావము నందు సమానత లేకుండుట వలన సమానత్వము సిద్ధింపదు.
సమర్థులు, అసమర్థులు సమానులు కారు. తెలిసినవారు తెలియని వారు సమానులు కారు. స్వభావము వైవిధ్యమై యున్నప్పుడు సమానత్వము అసాధ్యమగును. దివ్యము, అమృతము అగులోకముల యందు సత్పురుషులు ఏర్పరచుకొన్న సోదరత్వము సమానత్వము స్వతంత్రత ధర్మమున కనుగుణమై యుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 43 🌹
🍀. అనంతం గురించి, శాశ్వతత్వం గురించి మాత్రమే ఆలోచించు. దానికి తక్కువగా ఆలోచిస్తే ఎవర్నీ సంతృప్తి పరచలేవు. సంతోష పెట్టలేవు. 🍀
అన్ని సరిహద్దుల్ని వదిలిపెట్టు. అనంతంగా వుండు. అనంతం గురించి, శాశ్వతత్వం గురించి మాత్రమే ఆలోచించు. దానికి తక్కువగా ఆలోచిస్తే ఎవర్నీ సంతృప్తి పరచలేవు. సంతోషపెట్టలేవు. శరీర సరిహద్దుల్ని వదులుకోవాలి. మనం మరీ ఎక్కువగా శరీరాన్ని బట్టి గుర్తింపు పొందుతున్నాం. మనం మన శరీరమే మనమని అనుకుంటున్నాం. ఒకటి గుర్తించు, మనం మన శరీరం కాదు. ఈ పొరపాటు అభిప్రాయాన్ని వదులుకోవాలి. దీనివల్ల మరిన్ని తప్పులకు అవకాశం వుంది.
శరీరం పొందితే అతను వృద్ధాప్యం గురించి, రోగాల గురించి, మరణం గురించి భయపడాల్సి వుంటుంది. శరీర హద్దుల్ని అధిగమించాలి. నిన్ను నువ్వొక స్వచ్ఛమైన చైతన్యంగా భావించు. నువ్వు శరీరానివి కావు, శరీరస్పృహ వున్న వాడిగా భావించు. నువ్వు మనసు కూడా కావు ద్వారా మొదట శరీరంతో నిర్వహించు. తరువాత పెళుసయిన మనసు దగ్గరికి వెళ్ళినపుడు నీలో గొప్ప స్వేచ్ఛా ఆరంభమవుతుంది. గోడలు కూలిపోతాయి. నీ ముందు అనంత విశ్వం విస్తరించి వుంటుంది.
మొదట శరీరం, రెండోది మనసు, మూడోది హృదయం. వ్యక్తి జ్ఞానోదయాన్ని పొందాలంటే హృదయాన్ని కూడా వదులుకోవాలి. ఒకసారి నువ్వు శరీరం, మనసు, హృదయం ఏదీ కాదని తెలుసుకుంటే నువ్వెవరో నీకు తెలిసి వస్తుంది. అస్తిత్వమంటే ఏమిటో ఈ జీవితమంటే ఏమిటో తెలిసివస్తుంది. అన్ని రహస్యాలూ పూలు విచ్చుకున్నట్లు విడిపోతాయి.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 288 / Sri Lalitha Chaitanya Vijnanam - 288 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 67. ఆబ్రహ్మ కీటజననీ, వర్ణాశ్రమ విధాయినీ ।
నిజాజ్ఞారూపనిగమా, పుణ్యాపుణ్య ఫలప్రదా ॥ 67 ॥ 🍀
🌻 288. 'పుణ్యాపుణ్య ఫలప్రదా'🌻
పుణ్యఫలము, అపుణ్యఫలము ప్రసాదించునది శ్రీమాత అని అర్థము. ధర్మమాచరించిన పుణ్యము. అధర్మాచరణము పాపము, ధర్మము నాచరించిన వారికి స్థిరత్వముండును. అధర్మము నాచరించు వారికి స్థిరముండదు. జీవితమున పుణ్యాత్ములు కాలమును, దేశమును బట్టి వచ్చు సుఖ దుఃఖములు, లాభ నష్టములు, జయాపజయములు స్థిరచిత్తముతో ఎదుర్కొనుదురు. ఇట్లు స్థిరముగ నుండుటకు లోబలము ధర్మమే. ధర్మము నాచరించని వారికే మతి స్థిమిత ముండదు. భయ భ్రాంతములు కలుగుచుండును.
రాగద్వేషములు, కామక్రోధములు, మదమాత్సర్యములు, ఈర్ష్యాసూయలు, లోభ మోహములు తరచూ వీరిని స్పృశించు చుండును. ధర్మమాచరించని వారికి లోబలము తక్కువ. ధర్మమాచరించు వారికి లోబలము ఎక్కువ. కష్ట నష్టములు, దుఃఖములు ధర్మమాచరించిన వారికి కూడ కలుగునని పురాణ గాథలు తెలుపుచున్నవి. కాని వారు కష్ట సమయమున లోబడక ధర్మమునందు నిలచి దాటుదురు.
శ్రీమాత మహా చైతన్య స్వరూపిణి. కార్యకారణముల కతీతముగ నుండును. జీవులు కార్యముల ద్వారా కారణములను సృష్టించుకొందురు. ఉదాహరణకు ఒక దీపపు వెలుగులో సభ్రంథ పఠనము, సద్భాషణము, సత్కర్మాచరణము చేయవచ్చును. అట్లే అదే దీపపు వెలుగులో దుర్భాషణము, దుష్కార్యములు చేయవచ్చును.
ఒకరు సద్భాషణము సత్కార్యము చేయుటకు, మరొకరు దుర్భాషణము దుష్కార్యము చేయుటకు వెలుగు కారణము కాదు కదా! ఇట్లు శ్రీమాత అందించిన సమస్త సృష్టి సౌకర్యములను సద్వినియోగము చేసుకొను వారు సత్పలములను పొందుచుందురు. దుర్వినియోగము చేయువారు దుష్ఫలములను పొందుదురు. ఇట్టి అమరికను సృష్టి యందేర్పరచినది శ్రీమాత. వర్ణ ధర్మము, ఆశ్రమ ధర్మము విహిత కర్మలుగ శాస్త్రము చెప్పుచున్నది. వీని ననుసరించక పోవుట వలన జీవులు పతనము చెందుచుందురు. అనుసరించు వారు వృద్ధి చెందుచు నుందురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*******
*అమృతస్య పుత్రా:*
*1- అన్నమయ్య జీవిత చరిత్ర*
అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 - ఫిబ్రవరి 23, 1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు).
అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉంది. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.
కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు.
సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉంది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు.
త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు.
చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు.
జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు.
అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయాయి;
జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడు.
అన్నమయ్య
మనుమడు తాళ్ళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు. ఈ గ్రంథం 1948లో లభ్యమై ముద్రింపబడింది.
అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు ఈ రచనే మౌలికాధారం.
కాని బహువిధాలైన నమ్మకాలూ, అనుభవాలూ, ఘటనలూ, కథలూ ఈ వివరాలలో పెనవేసుకొని ఉన్నాయి.
నందవరీకులు క్రీ.శ. 10వ శతాబ్దంలో కాశినుండి ఆంధ్ర దేశానికి వలస వచ్చిన శుద్ధవైదిక బ్రాహ్మణులని పరంపరాయాత ప్రతీత.
క్రీ.శ. 10వ శతాబ్దంలో నేటి కర్నూలు జిల్లాలోని "నందవరం" అనే గ్రామాన్ని నందుడనే రాజు పాలించేవాడు.
ఈ రాజు కాశియాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొందరు వైదిక బ్రాహ్మణులు చాముండేశ్వరీ ఉపాసకులు పరిచయం అయ్యారని, ఆ సమయంలో వారణాసిలో క్షామం రాగా ఆ బ్రాహ్మణ కుటుంబాలు కొన్ని ఆంధ్రదేశానికి వలసివచ్చి నంద రాజు ఆశ్రయంలో స్ధిరపడ్డారనీ, నందరాజుచే తీసుకొని రాబడిన వైదికులు కావడంచే నందవైదికులుగా ప్రచారం పొందారని జనవాక్యం.
కాలక్రమాన వీరు నేటి కర్నూలు, కడప జిల్లాలో స్ధిరపడ్డారని పరిశోధకులు అభిప్రాయం. తాళ్ళపాక గ్రామ నామం అన్నమయ్య వంశస్ధులకు ఇంటిపేరుగా నిలిచింది. అన్నమయ్య కూడా నందవరీకుడే.
ద్విపద కావ్యం ప్రకారం అన్నమయ్య తాత నారాయణయ్య.
చదువు అబ్బక, గురువులు పెట్టే హింసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలని అనుకొన్నాడట. వూరిలో గ్రామ దేవత చింతలమ్మ గుడివద్ద విషసర్పం పుట్టలో చేయి పెట్టాడట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో మూడవతరంలో హరి అంశతో ఒకబాలుడు జన్మిస్తాడని చెప్పిందట.
అన్నమయ్య తాతయ్య - నారాయణయ్య
కడప జిల్లా రాజంపేట తాలూకా పొత్తిపి నాడు మండలం నడిఒడ్డున తాళ్లపాక గ్రామం విరాజిల్లుతుండేది. ఆ గ్రామంలో వెలసిన చెన్నకేశవస్వామి, సిద్ధేశ్వరస్వామి కరుణాకటాక్షములతో ఆ గ్రామజనులు సుఖవంతులై జీవనం సాగించేవారు.
ఇచ్చట చెన్నకేశవస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసాడు.
సస్యశ్యామలమై విరాజిల్లే ఈ గ్రామం సన్మునులకు, అఖిల దేవతలకు నిజవాసమై వుండేదని అంటారు.
ఈ చెన్నకేశవస్వామిని దేవతలు, ఋషులు, సిద్దులు ప్రతి రోజు పూజిస్తారు. ఈ చెన్నకేశవస్వామి గుడిని ఆశ్రయించుకొని కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు జీవించేవి.
ఆ గ్రామ వాసులు తలపక ఇందిరారమణపదైక మానసులుగా జీవనం సాగించేవారు. వాళ్లల్లో నారాయణయ్య చాల ప్రసిద్దుడు.
ఇతని నాలుగోతరంలో మరో నారాయణయ్య వుండేవాడు. అన్నమయ్య పితృ పితామహులు నారాయణయ్య, విఠలయ్యలు విష్ణు భక్తిరతులై తాళ్ళపాక చెన్న కేశవస్వామిని సేవించుకొంటు జీవితం గడిపేవారు.
ఈ నారాయణయ్య కథ తోనే మన అన్నమయ్య కథ మొదలౌతుంది.
నారాయణయ్యకు చిన్నతనంలో ఎంతకీ చదువు రాలేదు. తండ్రి విఠలయ్య నయాన భయాన చెప్పి చూశాడు. లాభం లేక పోయింది. తన వద్ద ప్రయోజనం లేదని ప్రక్కనే వున్న ఊటుకూరులో తన బంధువుల వద్ద వుంచాడు.
ఊటుకూరు నేడు కడపజిల్ల రాజంపేట తాలూకాలో ఉంది. అన్నమయ్య మనవడు చినతిరుమలయ్య ఊటుకూరి చెన్నరాయని మీద కొన్ని సంకీర్తనలు కూడా రచించాడు.
అక్కడ బళ్ళో ఉపాధ్యాయులు శతవిధాల ప్రయత్నించారు.
(సశేషం)
ఓం శ్రీ రామ.. శ్రీ మాత్రే నమః..
No comments:
Post a Comment