Thursday, 8 July 2021




*శ్రీ కృష్ణ శరణాష్టకం*


ఓం శ్రీ రామ్ఓం....శ్రీమాత్రే నమః..ప్రాంజలి ప్రభ


*1)సర్వసాధన హీనస్య పరాధీనస్య సర్వతః!*

*పాప పీనస్య దీనస్య శ్రీకృష్ణః శరణం మమ!!*


*2) సంసార సుఖ సంప్రాప్తి సన్ముఖస్య విశేషతః!*

*వహిర్ముఖస్య సతతం శ్రీకృష్ణః శరణం మమ!!*


*3) సదా విషయ కామస్య దేహా రామస్య సర్వథా!*

*దుష్ట స్వభావ వామస్య శ్రీకృష్ణః శరణం మమ!!*


*4) సంసార సర్వ దుష్టస్య ధర్మ భ్రష్టస్య దుర్మతేః!*

*లౌకిక ప్రాప్తి కామస్య శ్రీకృష్ణః శరణం మమ!!*


*5)విస్మృత స్వీయ ధర్మస్య కర్మ మోహిత చేతసః!*

*స్వరూప జ్ఞాన శూన్యస్య శ్రీకృష్ణః శరణం మమ!!*


*6) సంసార సింధు మగ్నస్య భగ్న భావస్య దుష్కృతేః!*

*దుర్భావ లగ్న మనసః శ్రీకృష్ణః శరణం మమ!!*


*7) వివేకధైర్య భక్త్యాది రహితస్య నిరంతరం!*

*విరుద్ధ కరణాసక్తేః శ్రీకృష్ణః శరణం మమ!!*


*8)విషయాక్రాంత దేహస్య వైముఖ్య హృతసన్మతేః!*

*ఇంద్రియాశ్వ గృహితస్య శ్రీకృష్ణః శరణం మమ!!*


*9) ఏతదష్టక పాఠేన హ్యేత దుక్తార్థ భావనాత్!*

*నిజాచార్య పదాం భోజసేవకో దైన్య మాప్నుయాత్!!*


*ఇతి శ్రీహరి దాసవర్య విరచితం శ్రీకృష్ణ శరణాష్టకం సంపూర్ణం*


OoooooooO


సమ్మోహనాలు .. కోయిలా 


తెల్లారె కోకిలా  - కోకిల కూయనెలా 

కూయగానె సంతోషం గలిగె ఈశ్వరా 

 

అదియు వసంత పిలుపు - పిలుపే  మేలుకొలుపు 

మేలుకొలుపు తోను ఆనందం ఈశ్వరా 


తరువులే చిగురించు - చిగురుతొ సంతసించు 

సంతసము కోయిల పంచుకొనును ఈశ్వరా 

 

మాటకు మాట లాగ  - మాటల కూతలాగ

కూతతోనె పిలిచే కోయిలా ఈశ్వరా 


రూపము చూడ నలుపు - నలుపు తో మైమరపు

మైమరపు గానముతొ కోయిలా ఈశ్వరా 

  

చల్లని వేళయనీ   - వేళలొ  పిలుపులనీ  

పిలుపులు హాయిని గొలుపు మనసుకు ఈశ్వరా 


ప్రకృతి పరవశముతో - పరవశ ప్రేమతో 

ప్రేమ పిలుపు కోయిల రాగమే ఈశ్వరా 


కోయిల రాగాల తొ - రాగ అనురాగముతొ

అనురాగము కుహు కుహు అనిపిలుచు ఈశ్వరా 

 --(())--

ఈ రోజు పూరీ జగన్నాధ్ బ్రహ్మపరివర్తన ఉత్సవం

పూరీ జగన్నాద్ క్షేత్రంలో ఆలయంలోని జగన్నాథుడి మూలవిరాట్టులో ఉండే బ్రహ్మ పదార్థాన్ని.. కొత్తగా రూపొందించిన దారుశిల్పంలోకి మార్చే ఉత్సవాన్ని బ్రహ్మపరివర్తన వేడుక అంటారు. ఇది జ్యేష్ఠ మాసపు కృష్ణ చతుర్దశి నాడు అర్ధరాత్రి 'బ్రహ్మం' మార్పిడి అత్యంత గోప్యంగా జరుగుతుంది , ఈ బ్రహ్మపదార్థం మార్పిడి పూర్తయితే కొత్త దారు విగ్రహాలకు జీవం వచ్చినట్టే భావిస్తారు. ఆ విగ్రహాలకు పట్టువస్త్రాలు ధరింపజేసి బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు.

పక్రియ

సాధారణంగా అధిక ఆషాఢ మాసం వచ్చిన సంవత్సరంలో పూరీలో కొయ్యతో చేసిన మూలవిగ్రహాలను ఖననం చేసేసి , కొత్తగా ఎంపిక చేసిన చెట్ల దారువుతో మూలవిరాట్టులను తయారుచేసి ప్రతిష్ఠిస్తారు. ఈ వేడుకను నవకళేబర అంటారు. పాత విగ్రహాలను ఖననంచేసే ముందు.. ఆలయ పూజారి కళ్లకు గంతలు కట్టుకుని , చేతికి వస్త్రం చుట్టుకుని.. జగన్నాథుడి విగ్రహంలో ఉండే బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలోకి మారుస్తారు, ఇది ఇన్నేళ్లకోసారి జరుగుతుందని కచ్చితంగా చెప్పలేం. సాధారణంగా 8, 11, 19 సంవత్సరాలకోసారి వస్తుంది. క్రీ.శ.1039లో 27 సంవత్సరాల వ్యవధి తీసుకుంది. 1912, 1920, 1931, 1950, 1969, 1977, 1996...తర్వాత మళ్లీ 2015 జూలై 15 న జరిగినది. ఈ శతాబ్దిలో ఇదే మొదటి యాత్ర.

నవకళేబరయాత్ర

నవకళేబరయాత్రలో ప్రధాన ఘట్టం వనయాగయాత్ర. దేవతా విగ్రహాల తయారీకి కలపను అన్వేషించడమే యాత్ర లక్ష్యం. జగన్నాథ రథయాత్రకు 65 రోజుల ముందు , చైత్ర శుద్ధ దశమినాడు వనజగయాత్ర మొదలవుతుంది. దైతాపతులూ (దేవుని సేవకులూ , సేవాయతులూ), బ్రాహ్మణులూ , విశ్వకర్మలూ కలసి ఇందుకో ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. అనంతరం నలుగురు ప్రధాన దైతాపతులు ఒక్కొక్కరుగా బలభద్రుడు , జగన్నాథుడు , సుభద్ర , చివరగా సుదర్శనుని వద్దకు వెళ్లి 'ఆజ్ఞామాల' తెచ్చుకుంటారు. అనంతరం , వీరికి జయవిజయుల మండపం దగ్గర కొత్తబట్టలు పెడతారు. దారు అన్వేషణ కార్యభారమూ అక్కడే అప్పగిస్తారు. ఆ బృందం మంగళ వాద్యాలతో బయల్దేరి ఆలయం వెలుపలికి వస్తుంది. అక్కడి నుంచే యాత్ర మొదలవుతుంది. పూరీ గజపతి మహరాజ్‌ దివ్యసింగ్‌దేవ్‌ శ్రీనహర్‌ దైతాపతులకు దుస్తులూ తాంబూలం అందించి , యాత్రకు అనుమతిస్తాడు. ప్రయాణమంతా ఎడ్ల బండ్ల మీదో కాలినడకనో సాగుతుంది. రెండో రోజు పూరీ పట్టణానికి ఈశాన్య ప్రాంతంలోని మా మంగళాదేవి ఆలయానికి చేరుకుంటారు. దేవి అనుగ్రహం అందితేనే దారు లభిస్తుందని విశ్వాసం. ఆ రాత్రి అక్కడే బస. దైతాపతుల దళపతికి అమ్మవారు కలలో కనిపించి విగ్రహాల తయారీకి అవసరమైన దారు ఎక్కడ దొరుకుతుందో ప్రతీకాత్మకంగా చెబుతారు. ఆ ప్రకారం , రెండొందలమంది దైతాపతులు కలప అన్వేషణకు బయల్దేరతారు. .

దారు వృక్షం

పురాతనమైన వేపచెట్టునే దారు వృక్షంగా ఎంచుకుంటారు. మరొక్క కారణమూ ఉంది. పురాతనమైందే ఎందుకంటే...బాగా చేవ తేలి ఉంటుంది , ఛేదించిన వెంటనే విగ్రహం తయారీకి పనికొస్తుంది. దారు ఎంపికలో చాలా అంశాల్ని పరిశీలిస్తారు. ఊరికి వెలుపలా , నదికీ శ్మశానానికీ దగ్గర్లో ఆ చెట్టు ఉండాలి. ఇతర వృక్షాల కొమ్మలు దీంతో కలవకూడదు. మెరుపులూ ఇతర కారణాలతో ఎక్కడా కాలిన గుర్తులు ఉండకూడదు. పక్షుల నివాసాలూ అక్కడ కనిపించకూడదు. మొదలు పది నుంచి పన్నెండు అడుగులు వంకర లేకుండా ఉండాలి. తొర్రలుంటే పనికిరాదు. వృక్షం నాగేంద్రుని రక్షణలో ఉన్నట్టు చెట్టుకు సమీపంలో పుట్ట ఉండాలి. వృక్ష శాఖలనూ , రంగునూ దారు ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. బలభద్రుని దారూ సుదర్శనుని దారూ ఎర్రగా , సుభద్ర దారు హరిత వర్ణంలో కానీ పసుపు వర్ణంలో కానీ ఉండాలి. జగన్నాథుని దారు మాత్రం కృష్ణ (నీలం) వర్ణంలో ఉండాలి. సుదర్శనుని దారుకు మూడు ప్రధాన శాఖలు ఉండాలి , గద గుర్తు కనిపించాలి. బలభద్రునికి ఏడు శాఖలూ నాగలి గుర్తు , సుభద్రకు ఏడు శాఖలూ పద్మం గుర్తు , జగన్నాథునికి నాలుగు శాఖలూ శంఖచక్రాల గుర్తులుండాలి.

మొదటి విడతలో , ఇలాంటి లక్షణాలున్న 105 చెట్లను గుర్తిస్తారు. దైతాపతులు పరిశీలించి , అందులోంచి పదిహేను చెట్లను మాత్రమే ఎంపికచేస్తారు. ఆతర్వాత మళ్లీ , అందులోంచి నాలుగు వృక్షాల్ని ఖరారుచేస్తారు. మొదటగా సుదర్శనుని వృక్షాన్నీ , అనంతరం బలభద్రుడు , సుభద్ర , చివరన జగన్నాథుని దారువృక్షాలనూ ప్రకటిస్తారు. ఆ ప్రక్రియ పూర్తయమ్యూంక , అదే
ప్రాంతంలో తాటాకులతో గుడిసెలు వేస్తారు. యజ్ఞం ప్రారంభమైన నాటి నుంచీ దారును ఛేదించి తరలించే వరకూ దైతాపతుల నివాసం ఇక్కడే. మూడురోజుల యజ్ఞం పూర్తిచేసి , పూర్ణాహుతి ఇచ్చాక దారు ఛేదన మొదలవుతుంది. మొదట బంగారు , వెండి గొడ్డళ్లను తాకిస్తారు. అనంతరం ఇనుప గొడ్డళ్లతో ఛేదిస్తారు. వృక్షం నేలకూలిన తర్వాత , అవసరమైన మేర కలపను తీసుకుని... అవశేషాలను గొయ్యి తీసి పాతేస్తారు. పూరీ దేవాలయ ఉత్తర ద్వారం వరకూ దారు తరలింపు మహా వేడుకగా సాగుతుంది. చింత , పనస , రావి చెట్ల కలపతో తయారు చేసిన బండినే తరలింపు కోసం వినియోగిస్తారు. దారును గుర్తించిన ప్రాంతంలోనే ఈ బండినీ తయారు చేస్తారు.
స్వయంగా దైతాపతులే దారువులను బండిలోకి ఎక్కించి...చుట్టూ పట్టువస్త్రాలు కప్పుతారు. అక్కడి నుంచి పూరీ వరకూ ... భజనలూ భగవన్నామ స్మరణల మధ్య ఆ బండిని భక్తులు లాక్కువస్తారు. ఈ కార్యక్రమం మహత్తరంగా సాగుతుంది. దారిపొడవునా ఆయా గ్రామాల ప్రజలు ముగ్గులతో వీధుల్ని అలంకరిస్తారు. చీరలు పరచి దేవరూప దారువులను స్వాగతిస్తారు. పూరీ దేవాలయ ఉత్తరద్వారం గుండా 'కైవల్య మందిరం' (కొయిలీ వైకుంఠ , వైకుంఠ మండపం) చేరుస్తారు.

పాత విగ్రహాలను ఖననంచేసే ముందు.. ఆలయ పూజారి కళ్లకు గంతలు కట్టుకుని , చేతికి వస్త్రం చుట్టుకుని.. జగన్నాథుడి విగ్రహంలో ఉండే బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలోకి మారుస్తారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఆ పదార్థం ఏమిటో ఎవ్వరు దానిని తయారు చేశారో..? ఎలా ఉంటుందో కూడా తెలుసుకునే అవకాశం కనీసం పూజారికి కూడా ఉండదు. కేవలం పూజారి దానిని ఒక వస్త్రం ద్వారా దానిని స్పర్శిస్తారే తప్ప తాకను కూడా తాకలేరు. ఇది అత్యంత రహస్యంగా జరగాల్సిన ప్రక్రియ.

🚩జై జగన్నాథ్..🚩

[04:51, 09/07/2021] +91 98494 71690: 🌹. గీతోపనిషత్తు  -224 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము  📚

శ్లోకము 10 - 3


🍀 9 - 3 . ధ్యాన మార్గము -  ధ్యాన మార్గ మిట్లున్నది. 🍀


7. ముమ్మారు శ్వాసను సున్నితముగను, దీర్ఘముగను, లోతుగను, నెమ్మదిగను నిర్వర్తించ వలెను. అటు పైన మూడు శ్వాసలు సామాన్యముగ నిర్వర్తించి, మరల మూడు మార్లు దీర్ఘముగ నిర్వర్తించవలెను. అట్లు నిర్వర్తించుట వలన సున్నితముగ జరుగుతున్న స్పందనము తెలియ వచ్చును. అనగా మనసు గ్రహించును.  గ్రహింప బడిన స్పందనమున మనోప్రజ్ఞను లగ్నము చేయవలెను. స్పందనమునే గుర్తించుచు, స్పందనముతో కూడి యుండవలెను.


స్పందనము గ్రహింపబడనపుడు మరల ముమ్మారు దీర్ఘముగ శ్వాసను నిర్వర్తించుకొనవలెను. అపుడు మరల స్పందనము స్పష్టమగును. విస్పష్టమైన స్పందనముతో ప్రజ్ఞను కూర్చి యుంచవలెను. 


8. నిరంతర అభ్యాసవశమున, ప్రజ్ఞ స్పందనముతో కూడి యుండుట వలన స్పందన ఎరుక ప్రధానమై, శ్వాసయందు ఎరుక తగ్గుముఖము పట్టును. శ్వాసను గూర్చిన భావన నుండి స్పందనను గూర్చిన భావనలోనికి ప్రజ్ఞ ప్రవేశింపగ, బహిర్ముఖమగు మనస్సు అంతర్ముఖమగుట ఆరంభించును. స్పందనముతో కూడియే అంతర్ముఖ మగును.


9. స్పందనముతో కూడి అంతర్ముఖమైన మనస్సు సూక్ష్మ స్పందనమును గ్రహించును. సూక్ష్మ స్పందనమున ప్రజ్ఞ క్రమముగ అభ్యాసవశమున స్థిరపడును. ఇట్లు స్థిరపడుట హృదయమును చేరుట. ఇట్టి సమయమున సూక్ష్మ స్పందనముతో కూడిన ప్రజ్ఞ మనస్సను కక్ష్యను వీడి, హృదయకక్ష్యలో ప్రవేశించును. 


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


[04:51, 09/07/2021] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 424🌹 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః  🌴 

అధ్యాయము - 25


🌻. సప్తర్షులు పార్వతిని పరీక్షించుట   - 1 🌻


నారదుట్లు పలికెను-


బ్రహ్మ, విష్ణువు మొదలగు ఆ దేవతలు, మునులు అందరూ ఆనందముతో మరలి వెళ్లిన తరువాత ఏమాయెను? (1)

తండ్రీ! శంభువు ఏమి చేసినాడు? ఆయన ఎంత కాలము తరువాత వరము నిచ్చుటకు వచ్చినాడు? ఎట్లు వచ్చినాడు? ఆ విషయమును చెప్పి ప్రీతిని కలిగించుము (2). 

బ్రహ్మ ఇట్లు పలికెను-

బ్రహ్మ మొదలగు ఆ దేవతలు తమ స్థానములకు వెళ్లిన తరువాత, శివుడు ఆమె యొక్క తపస్సును బాగుగా పరీక్షింపగోరి సమాధిలోనికి వెళ్లిపోయెను (3). సర్వము కంటె శ్రేష్ఠమైనది, స్వరూపభూతమైనది, మాయకు అతీతమైనది, ఆటంకములు లేనిది అగు ఆత్మ తత్త్వమును ఆయన మనస్సుతో హృదయమునందు ధ్యానించెను (4). ఆ హరుడు తత్పద వాచ్యమగు వస్తు స్వరూపుడు, భగవానుడు, ఈశ్వరుడు, వృషభము ధ్వజము నందు గలవాడు, తెలియబడని స్వరూపము గలవాడు, సర్వకారణుడు మరియు పరమేశ్వరుడు (5). వత్సా! ఆపుడా పార్వతి ఉగ్రతపస్సును చేయుచుండెను. ఆ తపస్సును గని రుద్రుడు కూడ మిక్కిలి విస్మయమును పొందెను (6).

ఆయన భక్తులకు అధీనుడే గాని మరియొకటి కాదు. ఆయన సమాధి నుంచి చలించెను. జగత్కారణుడగు హరుడు వసిష్ఠాది సప్తర్షులను స్మరించెను (7). ప్రసన్నమగు ముఖము గల సప్తర్షులు స్మరించినంత మాత్రాన తమ భాగ్యమును అనేక విధములుగా వర్ణించుకొనుచున్నవారై విచ్చేసిరి (8). వారు ఆనందభరితులై ఆ మహేశ్వరునకు ప్రణమిల్లి, చేతులు జోడించి, తలలు వంచి, గద్గమగు వాక్కుతో నిట్లు స్తుతించిరి (9). 

సప్తర్షులిట్లు పలికిరి-

ఓ దేవదేవా! మహాదేవా! కరుణాసముద్రా! ప్రభూ! నీవీనాడు మమ్ములను స్మరించుటచే మేము మిక్కిలి ధన్యలమైతిమి (10). ఓ స్వామీ! నీవు మమ్ములను దేనికొరకు స్మరించితివి? నీవా విషయమును మాకు ఆజ్ఞాపించుము. నీ దాసులయందు చూపించే కృపవంటి కృపను చూపుము. నీకు నమస్కారమగు గాక ! (11)


సశేషం....



 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 101  / Sri Lalita Sahasranamavali - Meaning - 101 🌹

🍀 101. కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా ।

మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥ 🍀


🍀 491. కాళరాత్ర్యాది శక్త్వౌఘవృతా - 

కాళరాత్రి మొదలైన పన్నెండి మంది శక్తి దేవతలచే పరివేష్టింపబడి యుండునది.


🍀 492. స్నిగ్థౌదన ప్రియా - 

నేతితో తడిపిన అన్నములో ప్రీతి కలది.


🍀 493. మహావీరేంద్ర వరదా - 

శ్రేష్ఠులైన ఉపాసకులకు అవసరమైన వన్నీ సమకూర్చునది.


🍀 494. రాకిణ్యంబా స్వరూపిణీ - 

రాకిణీ దేవతా స్వరూపిణి.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 101  / Sri Vishnu Sahasra Namavali - 101 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ 


🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷


ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రధమ పాద శ్లోకం


🍀 101. అనాది ర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః|

జననో జన జన్మాదిః భీమో భీమపరాక్రమః|| 101 ‖ 🍀

 

 🍀 941) అనాది: - 

ఆదిలేనివాడు.


🍀 942) భూర్భువ: - 

సర్వభూతములకు ఆధారమైన భూమికి కూడా భూ: ఆధారమైనవాడు.


🍀 943) లక్ష్మీ: - 

లక్ష్మీ స్వరూపుడు.


🍀 944) సువీర: - 

అనేక విధములైన సుందర పోకడలు గలవాడు.


🍀 945) రుచిరాంగద: - 

మంగళమైన బాహువులు గలవాడు.


🍀 946) జనన: - 

సర్వ ప్రాణులను సృజించినవాడు.


🍀 947) జన జన్మాది: - 

జన్మించు ప్రాణుల జన్మకు ఆధారమైనవాడు.


🍀 948) భీమ: - 

అధర్మపరుల హృదయములో భీతిని కలిగించు భయరూపుడు.


🍀 949) భీమ పరాక్రమ: - 

విరోధులకు భయంకరమై గోచరించువాడు.


సశేషం.... 

🌹 🌹 🌹 🌹 🌹 



No comments:

Post a Comment