Monday, 19 July 2021








--(())__

కాన రావా ఈశ్వరా ధ్యానించి తే

ప్రేమ లేదా ఈశ్వరా మాపై ననే

దేహం ముందీ ఈశ్వరా నీ సేవకే

దాహం తీర్చూ ఈశ్వరా నీ దాసి గా


మానసమ్మూ  మాయ లో నే నుంటినే

దేహ బాధే తెల్ప కే నే నంటినే

దారి అంతా ధర్మ మే నీ సృష్టి గా

నేను చేసే న్యాయ మే ధ్యేయమ్ము గా


కానరాదే కండ్ల ముందా హాసమే

చెప్ప లేనే కాల మంతా నీదియే

ఒప్పు కున్నా జీవి తానా ధైర్యమే

పెంచు చున్న శక్తి నీదే ఈశ్వరా


వెన్నలయ్యా వెల్లకో యీ కాంతితో

దేశ మంతా నమ్మి ఉందీ ప్రేమతో

శ్వాస అంతా హాయి గొల్పే నిద్రతో

ప్రేమతోనే కల్చు చున్నా ఈశ్వరా


నిమ్మ కమ్మే భ్రాంతి అంతా తొల్గునే

నమ్మి కొల్చే కాంతి నంతా నీదిలే

భక్తి నంతా చూపు చున్నా యోగిగా

తప్పులున్నా కావు మయ్యా ఈశ్వరా


మన్ను నందే పుట్టి యున్నా  మాయకే

చిక్కి యున్నా నన్ను నీవే కావుమా

కాల మాయే ఉంది నన్నూ చూడుమా

సాహ సొమ్మే నాది కూడా ఈశ్వరా


బీద వానిన్ ప్రేమ తోడన్ చూడవా

ఆశ పాశమ్ తోనె ఉన్నన్ మార్చవా

సేయు సేవల్ దాన ధర్మమ్ సల్పితీ

భక్తి భావమ్ తెల్పు చున్నాన్ ఈశ్వరా


వ్యక్తి త్వం తో నీవు విలువల కళ చూపించూ 

యుక్తి త్వం తో ధైర్యముయె కలిగియు పోరాడూ

 రక్తి త్వం తో ఏపని సలపకయె సాగాలీ

శక్తి త్వం నీ లక్షమును తెలుపుటె ధర్మం మే


దురాశే కర్తృత్వం చరితము లకు సంభావ్యం పశుపతినాథ్

విరోధం దుర్మార్గం పెరుగుట వలనే భయ్యం పశుపతినాథ్

సరాగం సందర్భం మనుగడ కల శోకం పశుపతి నాథ్

జరా మిత్రా భావం కరుణ దయయు లేదే పశుపతినాథ్


నా లలాటము లో ఉన్న బ్రహ్మ వ్రాతను మార్చే శక్తి నీకే ఉంది పశుపతినాథ్


బిక్షమ్మే కరువై క్షమించు గుణమే ప్రేమ త్వ మే లేకయే

కక్షల్లో మనసే విశాల పరుగే కాట్లా ట దౌర్భాగ్య మే

కాంక్షల్తో బతుకే అగమ్య మగుటే కాఠిన్య మింకేలనో

రక్షించే శివుడే సమర్ధు డయినా క్రూరత్వ మయ్యేను లే


అనంతం ఆత్మీయం సహనమునకు దూరం పశుపతినాథ్

వినోదం విధ్వంసం వివరములకు భారం పశుపతినాథ్

అనేకం ఆశ్చర్యం కధ మలుపు న భోగం  పశుపతినాథ్

గణాంక శాస్త్రమ్మే కుడుములు వలె వైనం పశుపతినాథ్


దీనులను రక్షించుటలో నిపుణుడు వి మమ్ము రక్షించుటలో ముల్లోకాలలో మీకంటే మరొకరు ఎవరున్నారు 


ప్రభుత్వం తీర్మానం హృదయ పరబంధం పశుపతినాథ్

ప్రభావం ప్రాబల్యం మనుగడకు కష్టం పశుపతినాథ్

ప్రభంతే వైరాగ్యం కలుగుటయు నేస్తం పశుపతినాథ్

ప్రభా ప్రేమారోగ్యం కనుమరుగు వైనం పశుపతినాథ్


నాతప్పులన్ని నీచేతనే క్షమింప బడతగినవి.నా రక్షణార్ధం ప్రయత్నించడం నీకర్తవ్యం దేవాది దేవ పశుపతినాథ్


శుభం శోభిల్లే కాలం ఇదియే

భయం లోగిల్లో మోనం మదియే

వైనం సేవల్లో ఆశా విలియం

ప్రాణం గుప్పెట్లో కాలం సహనం


మీ విధేయుడు.. మల్లాప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ


*****

పార్వతీ కలియుగము కొంతవింతలతో అభివృద్ధి చెందుతున్నది

మనుష్యులలో మార్పు కనబడుతున్నది 


పేదగా పుట్టిన పేరును పొందు

వాదిగా మారిన వాదము నందు 

పొందిక ఉండియు సహనము చూపు  

ఆది మహాలక్ష్మి ఆరాధనులుగ


కష్టాలు నెట్టిన కాలము మార్చు

ఇష్టాలు చూపిన ఈశ్వర  తీర్పు  

నష్టాలు తెచ్చినా నాన్యథ ఓర్పు 

అష్టమ శని అన్న  ఆరాధ్య నేర్పు 


యువకుల భవితకు ఏర్పాటు చూడు 

సవరణ చరితను  సేవగా చూడు 

అవసర మవ్వును ఆకలి చూడు   

నవవిధ పూజలు భక్తిని చూడు    


బాలల ప్రగతిని బాధ్యతై చూడు  

కాలపు ప్రకృతిఏ కరుణను చూడు 

లాలన ప్రభలతో మనసును చూడు 

కాలము  ప్రతిభతో సుఖమును చూడు


భావాల కలయిక బంధము గాను

అనుభవ పలుకులు ఆనందం అగును

అనుభూతి కవితగా అలకలు మాను

ఆత్మీయత మనసు ఆకర్షణ గను


 గత కాల మసాధ్యం కాలము తీర్చు

జతకూడి సాధ్యము జాతి న నేర్పు

తాతచెప్పెడి మాట తధ్యము మార్పు

మాతపలుకులన్ని పూర్తిగా ఓర్పు


ఆవాహనలు నేర్పు అతిథిని మార్చు

నీవా మనసు మార్చి నియమాల తీర్పు

సేవా కథలు అచ్చ తెలుగులో నేర్పు

భావాల కధ తెల్పి కళలన్ని తెల్పు


ఆలోచనలే అవగాహనం పెంచు

ఆలాపనలే స్వభావము తెంచు

ఆవేదనలు అక్షర ము భాష యెంచు

సేవా సదనమందు భాషయే మంచు


భవబంధముయె ఇంధనమ్ముగా వుండు

అవకాశముయె బంధనమ్ముగా వుండు

నవరాగముయె నందనమ్ముగా వుండు

యువసఖ్యతయె చందనమ్ముగా వుండు


నిధి నిశ్శమున లబ్ధి పొందుటే జగతి

విధి శబ్ధ సమ్మతి చెందుటే ప్రగతి

తిధి శుభ ఫలితాలు కలిగించు వినతి

మదిలోన భావము తెలుపుటే సమితి


జన్మ సౌఖ్యమ గాను చిత్ర జగత్తు

కొన్ని ప్రేమలో వల్ల కాలము మత్తు

మన్న నంతయు మాయ భక్తిగా చిత్తు

అన్ని ఉన్నాను చిత్రంలో ఆశ గమత్తు





ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు అప్పుడే ఒక బైరాగి వచ్చి ఈవిధముగా చెపుతున్నాడు  ....

ఓ మనిషీ!  తెలుసుకో , ఓ మనిషీ!! తెలుసుకొని మసలుకో 


చేష్ట వెనుక చేవ ఎంతో?  ... ప్రేమ వెనుక ఆశ అంతే ?

మాట వెనుక భక్తి ఎంతో ?.... మంచి వెనుక చెడ్డ అంతే  ?

:

సారం వెనుక సాధన ఎంతో? ... వేషం వెనుక వేతన అంతే  ?

మౌనం వెనుక మోసము ఎంతో ? ... గానం వెనుక గాత్రము అంతే  ?


ప్రశంస వెనుక ప్రతిభ ఎంతో? .... ప్రలోభ వెనుక ప్రభొధమంతే ? 

ప్రవేశ వెనుక ప్రభవ మెంతో  ? ......ప్రమాద మె నుక  ప్రజలు అంతే ?  


అందం వెనుక పొందిక ఎంతో? .... దాహం వెనుక ఆకలి అంతే ? 

లాభం  వెనుక నష్టము ఎంతో ? ..... స్నేహం వెనుక దానము అంతే ?  


పంట వెనుక పరిశ్రమ ఎంతో?......మంట వెనుక ఒకక్రియ అంతే ?  

వంట వెనుక  నిజభృతి  ఎంతో ... గంట వెనుక గనస్రుతి అంతే ?  


కథనం వెనుక మథనం ఎంతో?.... రిపం వెనుక వినయం అంతే ? 

పరువం వెనుక  నరకం ఎంతో ?  ... ప్రణయం వెనుక ప్రళయం అంతే ?  


విజయం వెనుక వినియోగం ఎంతో?.... ఫలితం వెనుక పనియోగం అంతే ? 

చరితం వెనుక కధయోగం ఎంతో ? ..... వినయం వెనుక విధియోగం అంతే ? 


ప్రగతి వెనుక ప్రయాసం ఎంతో?  .... ప్రతిన వెనుక  ప్రమాదం అంతే ? 

ప్రజల వెనుక ప్రమోదం ఎంతో  ..... ప్రతిభ వెనుక ప్రయోగం అంతే ? 


నిజం వెనుక నిజాయితీ ఎంతో?  ..... గళం  వెనుక సరాగమే  అంతే ? 

దళం వెనుక దయాగుణం ఎంతో ?..... భయం వెనుక మనోజపం అంతే ?  


జీవితం వెనుక జీవితార్థం ఎంతో? ..... కీలకం వెనుక కామితార్ధం అంతే 

లోలకం వెనుక లోభితార్ధం ఎంతో .... భోజనం వెనుక ఆశపాశం  అంతే ? 


ఓ మనిషీ!  తెలుసుకో  , ఓ మనిషీ!! తెలుసుకొని మసలుకో 


**** *** *****

ప్రేమికుల మధ్యే నిస్సహాయంగా చూస్తూ


శాంతి లేదు నిన్ను చూడగా  - బ్రాంతి చెందె నీవు ఉండినా

కాంతి రాదు మానసమ్మునా  -- వెల్తి నాలో వేద నమ్ముగా


నవ్వు లేక నల్గి పోతినే   - పువ్వు చూసి ముర్సి పోతినే 

ఇవ్వు అన్న ఇవ్వ పోతినే  - కొవ్వు అన్న నోరు విప్పనే 


ప్రేమ నీదె సృష్టికిన్ సదా - వాణి నీవే  విధ్యకిన్  సదా

జ్యోతి  నీవే భూతలమ్ము పై - స్వాతి నీవే మబ్బు లమ్మపై


సిద్ది పొందలేక ఉంటినే  - బుద్ధి చిన్న బోయి ఉంటినే   

చద్ది తిన్న భీతి గొంటినే  - ఇచ్చి పుచ్చు కున్న నిప్పునే  


వట్టి మాట ఇప్పు డేందుకే - గట్టి మూట పట్టి పట్టకే 

తట్టి నువ్వు నిద్ర లేపకే....  మట్టి నమ్మి బత్కు నెట్టకే


జ్యోతి నీవె భూతలమ్ముపై - భాతి నిచ్చు భాస్కరా రవీ

హేతువీవె సృష్టికిన్ సదా  - చేతనమ్ము జీవితమ్ములో


మాటలొద్దు నన్ను చూడవే - చేత లొద్దు విందు చేయవే 

ఆట లొద్దు సేవ చేయవే -  లేత బుగ్గ సద్దు చేయవే


*"**"""**


తొలకరిజల్లుకే తొలి వలపు లు పొంది తన్ను తాను మరచె

అలసట లేకయే ఆది ఆనందం పొంది సంత సించె

తలుపు లన్ని మెరసి తప్పులుచేయకే హృదయ మివ్వదలచె

మలుపు తిరుగుతున్న మదిని తెల్యపరిచి సుఖము మెండు అనెను


అధిక దుఃఖం రోగార్తునకు ఔషదంబు సురచిరంబుగు భార్యే

మదిలొ భయ్యం దాహార్తునకు  ఔషదంబు విషయవాంఛకు భార్యే

నది గ సాగే స్నేహార్తును గ ఔషదంబు కడలి తృప్తి కి భార్యే

విధిగ ఉండే దేహార్తునకు ఔషదంబు మగని రంభగభార్యే


ఆనందం వాస్తవానికి దుఃఖానికి మధ్య విరామమే

అన్యూన్యం కాల నిర్ణయ దాహానికి మధ్య విరామమే

సన్మార్గం ఆశ పాశము దేహానికి మధ్య విరామమే

విన్యాసం ప్రేమ బంధము ధర్మానికి మధ్య విరామమే


చిలకలకే చెప్పు చిరు నగవులతోను చెప్పు పాఠ మయ్యే

కలల కోకిలయే కాలపాటలన్ని నేర్పు పుస్తకమ్ము

మెళుకువ పాఠాలు మేలు చేయూతలు పెంచు చదువు తల్లి

కళలు నేర్పటయే కధలు తెల్పు వనిత జీవ రక్షణగా


కామిత ఫలములు ఘటియించు కల్పవృక్షపు రెమ్మగా 

ఆమని కలలను మనసు తో మందు ఇచ్చియు తీర్పుగా

భామిని సుఖము ను వయసుతో పంచి పొందుట నేర్పుగా

కోమలి సహనము వరము గ సేవ ధర్మము భర్తకే


మెచ్చినా పెళ్ళా మే అలుక మిథ్యయె సేవలనందు చూడగన్

వచ్చినా కళ్ళల్లో మెరుపు మిథ్యయె అప్పులు పొందు వానికిన్

మచ్చికా చేతుల్లో కదులు మిథ్యయె తప్పులు చేయు లక్షణమ్

మెచ్చే వ్రాయు బ్రహ్మలిపి మిథ్యయె లోకమునందు చూడగన్


సహాయం సమ్మోహం సమ కరుణయె నా మనసు లో 

విహా రమ్మే పొందే సుఖమనుట యూబీ  వయసు లో 

స్వహాసం మ్మే నాకే భయములను తెచ్చే విషయ మే 

స్వహస్తా లతో భాగ్యం పదములను పట్టే తరుణమే


తమవిధేయుడు..మల్లాప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ




అందరి దగ్గర నుండి అన్ని ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి.

సమయం క్షణమైనా వృధా ఎప్పుడూ చేయ కుండా ఉండాలి  .

శక్తి అణుమాత్రమైనా వృధా ఎప్పుడు చేయ కుండా ఉండాలి.

ఈ వర్తమాన జన్మనే దానధర్మాలు చేస్తూ ఆఖరి జన్మగా చేసుకోవాలి

 ఇది కలియుగ ధర్మం మనిషి మనిషిగా చూడాలి, మనిషిని తృప్తి పరచి, తృప్తి పొందుట, అసలు జీవితం అనగా ప్రేమ ఒక్కటే, మాట ఒక్కటే, గమ్యం ఒక్కటే, ప్రాణం ఒక్కటే అని భావించే భారతీయుల సంప్రదాయ సంసారము.       

మిడి మిడి ఆధ్యాత్మిక జ్ఞానం కలవారు - గమ్యం ఒక్కటే, దారులు వేరు వేరు అని అంటారు.

సరైన ఆధ్యాత్మిక విజ్ఞానం ఏమిటంటే - గమ్యం ఒక్కటే, దారి ఒక్కటే.

మహా పరినిర్వాణం అనునది నిశ్శబ్దం (ధ్యానం, తపస్సు) ద్వారానే సాధ్యం.

పుడమి తల్లికి నీరు పెట్టి విత్తనాలు నాటాలి 

కడలి పొంగుల గాలి చేను చేరు చుండ చూడాలి  

తడిక లల్లిన తీరు వచ్చి విన్నపాలు చూపాలి  

మడిమ తిప్పిన మేలు మార్పు వచ్చు చుండాలి     


సుగుణ వల్లికి ప్రేమ చేసి సద్దు చేసి కోరాలి 

నగల మోజున మాయ వీడి ఒప్పు చేసి తీరాలి 

మగణి మాటకి మాయ వీడి మంచి చేయు చుండాలి  

వగల మారికి ప్రేమ వళ్ళు కళ్ళు విప్పి ఉండాలి  


అరకు ఆశను తీర్చి వేటు నుంచి మార్పు తేవాలి 

మరక పట్టిన మోటు వేటు పొంటి ఉండి తీర్చాలి    

చెరకు తీపియు చూసి ఘాటు ప్రేమ తీర్పు ఇవ్వాలి 

మరుపు మార్పుయు చేసి దియా ప్రేమ ఘాటు పొందాలి 


మమత అంతయు చూపి కాల మార్పు అందు కోవాలి     

సమత బంధము చూసి ధర్మ నేర్పు పొందు చేరాలి     

కలల పంతము మాని అన్న దాత ప్రేమ పండాలి

కళలు చూపియు నిత్య సేవ సల్పి ప్రేమ పొందాలి 


ప్రేమ వళ్ళనేను పెద్దల నొప్పించి పెళ్లి చేసుకున్నా  

ప్రేమ ఆర్భాటము పలుకు సరస మైన రాగ మధురిమలై   

ప్రేమ మల్లెల తో పడక పుణ్య మగును వరద నదుల పొంగు 

ప్రేమ లస్వర్గమే మదిన ఉల్లాసం  వళ్ళ ఉత్త్సాహం 


--(())--


ప్రణయం మూలంబు ఆశ పాశము మర్మం 

తృణమే భాగంబు వీడ మన్నను యుద్ధం  

మనమే మౌనంబు వీడి  పోరుకు సిద్ధం

సమమై ధైర్యము తోను పొందుట ధర్మం

ధనమే మూలంబు రక్తి దారికి మార్గం


చూపులే వలయమ్ము గ చట్టి యుండిన మౌనికా

తాపమంతయు తెల్పియుండియు తృప్తి పొందుము వెంటనే

ఓప్పుతప్పులు నాకు తెల్వదు ఓర్పు చూపితి ఇంకయూ

పాప మేనని భావ మోద్దుయు భార్య భర్తల ఆటయే


ఇద్దరం ఒక తాడుపైనను ఈప్సితమ్ము గ ఆశతో 

సద్దు చేయక చిల్కకొట్టని సొంత సొమ్ముని చూడవా

తొందరొద్దని చెంత వున్నను వేచి వుండుము అంటివా

అద్దమందు న చూచి వుంటివి ఆర్తి అంతయు ముద్దగా


రెండు తాళ్ళను కల్పి చూడుము ‌‌రొక్కమాదిరి గుండునే

రెండు మేనులు కల్సి పోయిన రమ్య గుండెను ఎందుకో

రెండు కత్తుల నిప్పు రవ్వలు  రేగు చుండును కోపమై

రెండు మూడు గ మారు మార్గము రంజు గుండును బత్కులో


స్వేచ్ఛ కోరును  నిత్య వెన్నల సంత సమ్ము న తృప్తిగా

స్వచ్ఛ మైనవి నువ్వు పువ్వులె సంద డంతయు చేయగా

ఇచ్చి పుచ్చును ఒక్కరొక్కరు ఈశ్వ రేచ్ఛ గ జీవితం

ఇచ్చ కంబుగ ఆశతీర్చియు ఈమనస్సుకు హాయిగా


ऊँ!

----

"కౌసల్యప్రముదాత్మజాప్తహనుమా కాకుస్త్థ భక్తాగ్రణీ !

ఆసౌమిత్రివరాప్తసోదరసమా ! ఆశ్చర్య దేహాంచితా !

ఆసాధ్వీమణిజానకీసుతసమా ! ఆచాంత శాస్త్రజ్ఞుఁడా !

మాసాయమ్ముగనీవెయుండుమనిలాత్మాంశోద్భవా.. దండముల్ !!! "


 

"త్యాగమయుండునౌనరుఁడు తారకరామునిఁగొల్వనెంచుచున్

రాగవిదూరుఁడై మదిని రక్తినిఁద్రెళ్ళుచు నిగ్రహుండునై
నాగశయానుఁడౌ హరికి నర్మిలిఁబూజగ కీర్తనాసుధల్
త్రాగెడు వారలెల్లరకుఁదానగనెప్పుడు రామరక్షయై !!! "
--
( ఇందులో.. చివరి పాదమే..సమస్య )



No comments:

Post a Comment