Sunday, 30 May 2021

"వేదాంత పంచదశి"

 

261) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"




అస్తి కూటస్థ ఇత్యాదౌ పరోక్షం వేత్తి వార్తయా ౹ 

పశ్చాత్కూటస్థ ఏవాస్మీత్యేవం వేత్తి విచారతః ౹౹31౹౹

31. గురూపదేశాదుల వలన పరోక్షముగ కూటస్థము కలదు అని తెలిసికొనును.పిదప విచారణ పూర్వకముగ స్వానభవముననే 

"నేను కూటస్థమును" అని తెలియును. (ఇది అపరోక్షజ్ఞానము).

వ్యాఖ్య:- శబ్దం వల్ల వచ్చే జ్ఞానము సాధారణంగా పరోక్షజ్ఞానము.అది దూరవస్తువయితే ఎప్పటికీ పరోక్షజ్ఞానమే. "కాశీ"కి వెళ్ళని వానికి ఆశబ్దం వలన వచ్చిన జ్ఞానము సర్వదా పరోక్షమే.అనుభవంలోకి రాదుగదా ! 

ఇంద్రాది దేవతలు,స్వర్గం మొదలగునవన్నీ అంతే గదా !

దగ్గరలోనే ఉన్న ఘటమును 'ఘటమున్నది అని బోధిస్తే అదీ  పరోక్షమే', అలాగక ఎదురుగా చూపించి బోధిస్తే అది అపరోక్షజ్ఞానమగును.

ఇది ఘటము, నేను బ్రహ్మమును, నీవు దశముడవు మొదలగునవి ఉదాహరణలు. ఇందులో పదిమంది పరమానందయ్య శిష్యులు నదిలో స్నానము చేసి బయటకు వచ్చి లెక్క చూస్తే లెక్కచూచిన వానికి తాను తప్ప తొమ్మిది మంది లెక్కకు వస్తున్నారు.

అందువలన దశముడు అనగా పదవ వాడు నదిలో కొట్టుకొని పోయాడని ఏడుస్తున్నాడు.

ఒక బాటసారి వీరిని చూచి మీరు పది మంది ఉన్నారయ్యా (దశమః అస్తి) అన్నాడు.ఇది పరోక్షజ్ఞానము. అపుడు వారు పదవవాడు(దశముడు)ఏడి అని అడిగితే, ఆ లెక్కించినవాడే దశముడని(దశమః త్వమసి) చెప్పాడు.అప్పుడు కలిగినది అపరోక్షజ్ఞానము. అలాగే బ్రహ్మమున్నదని చెప్పినది, జీవుడు - ఆత్మ అన్నది పరోక్షజ్ఞానము. 

"ఆ ఆత్మ నీవే", "ఆ బ్రహ్మము నీవే" అని చెప్పిన వాక్యము  అపరోక్ష జ్ఞానము. కనుక

మహావాక్యం చెప్పేది అపరోక్షజ్ఞానమే. 

చర్చల ద్వారా,విచారణద్వారా,సద్గురువుచేత బోధింపబడినవాడై "కూటస్థుడున్నాడు కూటస్థోఽస్తి" అని తెలుసుకుంటాడు ఈ విధంగా తెలుసుకోవటం పరోక్షజ్ఞానం.

పిమ్మట శ్రవణాదులు పరిపక్వమైన పిమ్మట - 

"నేనే బ్రహ్మము కంటే భిన్నం కానట్టి కూటస్థుడను!కూటస్థోఽహమేవాస్మి" అని స్వానుభవమున తెలుసు కుంటున్నాడు.ఇది అపరోక్షజ్ఞానం.

--(())--

కర్తా భోక్తేత్యేవమాది శోకజాతం ప్రముఞ్చతి ౹ 

కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమిత్యేవ తుష్యతి ౹౹32౹౹


32.ఆపై 'పుణ్యాపుణ్య కర్మలకు నేను కర్తను,సుఖదుఃఖములను అనుభవించు భోక్తను నేనే ' మొదలగు దుఃఖసమూహమును వదలివేయును.

వ్యాఖ్య:-

శ్రవణమననాదుల ద్వారా "నేను బ్రహ్మం కంటే భిన్నం కానట్టి కూటస్థుడను" అని తెలుసుకుని స్థితుడైన వానికి ప్రపంచము నందలి వస్తుసముదాయమంతయు కేవలం వస్తువులు మాత్రమే కాక బ్రహ్మం నందు కదలాడు   అలలులాగా కనబడుతుంటాయి.

వస్తువులతో గల తాదాత్మ్యాన్ని విడనాడి సత్యవస్తువులకు అధిష్ఠానమయిన బ్రహ్మానుసంధానముతో వుండువానికి 

"నేను కర్తను,నేను భోక్తను" అనే వాటివల్ల కలిగే శోకాన్ని దుఃఖాన్ని వదిలివేస్తాడు.

"నేను చేయవలసినదంతా చేసాను", "పొందవలసినదంతా పొందాను" అనే సంతోషాత్మకమైన జ్ఞానాన్ని పొందుతాడు.

దీనినే తృప్తీ అంటారు.

క్రమం తప్పని నిరంతరాభ్యాసం వలన సాధకుడు ముందుగా అనంత చైతన్యాన్ని అప్పుడప్పుడు స్వానుభవంతో గ్రహిస్తాడు.

దీక్షతో సాధనను కొనసాగించగా చివరగా ఆనందనందమయమయిన స్వరూప స్థితిలో వ్యష్ఠి  భావననేది లేకుండా లీనమయిపోతాడు.

తానూ బ్రహ్మంకంటే వేరుకాదనీ,తానే బ్రహ్మమనీ గ్రహించాలి.

"అహం బ్రహ్మస్మి" అని తెలుసుకుంటూ ప్రజ్ఞాన ఘనమయి నిలుస్తాడు.


అజ్ఞాన మావృత్తీ స్తద్వద్విక్షేపశ్చ పరోక్షధీః ౹ 

అపరోక్షమతిః శోఖ మోక్ష స్తృప్తిర్నిరఙ్కుశా ౹౹33౹౹


 అజ్ఞానము, ఆవరణము, విక్షేపము, పరోక్షజ్ఞానము, అపరోక్షజ్ఞానము,దుఃఖనివృత్తి,

నిరతిశయమైన తృప్తి.


సప్తావస్థ ఇమాః సన్తి చిదాభాసస్య తాస్విమౌ ౹ 

బన్దమోక్షౌ స్థితౌ తత్ర తిస్రో బంధ కృతః స్మృతాః.. 34


చిదాభాసుడగు జీవుడు ఈ సప్తదశలనుగడచును.అందు మొదటి మూడూ బంధకారణములని చెప్పబడినవి.


ఓంశ్రీమాత్రే నమః


*న జానామీత్యుదాసీన వ్యవహారస్య కారణమ్ ౹ విచార ప్రాగభావేన యుక్తమజ్ఞానమీరితమ్ ౹౹35౹౹*

35. నాకు తెలియదు అనుభావము,సత్యమును గూర్చి నిర్లిక్ష్యము,వివేకము లేకపోవుట అనేవి అజ్ఞానమని చెప్పబడినవి.

వాఖ్య:-

అజ్ఞానము, ఆవరణము(ఆవృత్తి),

విక్షేపము,పరోక్షజ్ఞానము,

అపరోక్షజ్ఞానము,శోకనివృత్తి,

నిరతిశయానందము అనేవి చిదాభాసలోని సప్తావస్థలు.

ఇవే బంధమును మోక్షమును కూడా కల్పించును.

ఈ ఏడు అవస్థల్ని ఆత్మధర్మాలుగా అంగీకరిస్తే,

ఆత్మ అనేది నిర్వికారమైనది ఎట్లా అవుతుంది?

అంటే,సమాధానం -

ఈ ఏడు అవస్థలు చిదాభాసకు(జీవునికి) ఉండేవే తప్ప కూటస్థునివి కావు.ఈ ఏడు అవస్థల్లోనూ బంధమోక్షాలు రెండూ ఉన్నాయి.

మొదటి మూడు అవస్థలూ (అజ్ఞానం,ఆవరణ,విక్షేపం)

బంధాన్ని కలిగించేవి.

మిగిలిన నాలుగూ (పరోక్షజ్ఞానము,

అపరోక్షజ్ఞానము, దుఃఖనివృత్తి,

నిరతిశయమైన తృప్తి) మోక్షాన్ని కలిగించేవి.

ఇప్పుడు వీటిలో అజ్ఞానస్వరూపం -

ఎవనియందైనా సరే,

ఆత్మతత్త్వ విచారణకు సంబంధించిన ప్రావభావం -

ఆత్మ తత్త్వవిచారణ  లేకపోవటంతో కూడిన తూష్ణీ భావంతో ఉదాసీనుడుగా ఉండటం అనేవి కనిపిస్తే వాటికి కారణం అజ్ఞానం అన్నమాట.

అట్లాగే,

"నేను కూటస్థుని ఎరుగను" అనే ఈ విధమైన అనుభవానికి

విషయమైనదే అజ్ఞానం. ఔదాసీన్యం,సత్యత్వము పై నిర్లిక్ష్యము,వివేకము లేకపోవుట అనేవి అజ్ఞాన స్వరూపమని,

 "నేను ఎరుగను" అనే అనుభవం అజ్ఞానానికి కార్యం అన్నమాట.

ఏ చైతన్యస్వరూపమైన ఆత్మవల్ల సమస్తమూ తెలుసుకొనబడుతోందో,అటువంటి సత్యమును దేనివల్ల తెలుసుకోగలము ? అనే శ్రుతివచనాన్ని బట్టి ఏ ఆత్మతత్త్వంతో ఈ దృశ్యాన్నంతనూ తెలుసుకోగలుగుతున్నామో అటువంటి సత్యాన్ని ఏ జడవస్తువుతో చూడగలగుతాము?

తెలుసుకోగలుగుతాము?

జ్ఞానానికి సాధనమైన మనస్సు కూడా జ్ఞాతవ్యమైన విషయాన్నే తెలుసుకోగలుగుతుందేతప్ప జ్ఞాతయైన ఆత్మను తెలుసుకోలేదు.

మరొక శ్రుతి కూడా ఇదే చెపుతొంది.

"నైవ వాచా న మనసా ప్రాప్తుం శక్యోన చక్షషా..."  

కఠ 2-3-13.

ఆత్మను వాక్కుతో గాని,మనస్సుతోగాని,చక్షురాది ఇతర ఇంద్రియాలతో గాని పొందటానికి వీలులేదు.వాఖ్య:-అజ్ఞానము, ఆవరణము(ఆవృత్తి),

విక్షేపము,పరోక్షజ్ఞానము,

అపరోక్షజ్ఞానము,శోకనివృత్తి,

నిరతిశయానందము అనేవి చిదాభాసలోని సప్తావస్థలు.

ఇవే బంధమును మోక్షమును కూడా కల్పించును.

ఈ ఏడు అవస్థల్ని ఆత్మధర్మాలుగా అంగీకరిస్తే,

ఆత్మ అనేది నిర్వికారమైనది ఎట్లా అవుతుంది?

అంటే,సమాధానం -

ఈ ఏడు అవస్థలు చిదాభాసకు(జీవునికి) ఉండేవే తప్ప కూటస్థునివి కావు.ఈ ఏడు అవస్థల్లోనూ బంధమోక్షాలు రెండూ ఉన్నాయి.

మొదటి మూడు అవస్థలూ (అజ్ఞానం,ఆవరణ,విక్షేపం)

బంధాన్ని కలిగించేవి.

మిగిలిన నాలుగూ (పరోక్షజ్ఞానము,

అపరోక్షజ్ఞానము, దుఃఖనివృత్తి,

నిరతిశయమైన తృప్తి) మోక్షాన్ని కలిగించేవి.

ఇప్పుడు వీటిలో అజ్ఞానస్వరూపం -

ఎవనియందైనా సరే,

ఆత్మతత్త్వ విచారణకు సంబంధించిన ప్రావభావం -

ఆత్మ తత్త్వవిచారణ  లేకపోవటంతో కూడిన తూష్ణీ భావంతో ఉదాసీనుడుగా ఉండటం అనేవి కనిపిస్తే వాటికి కారణం అజ్ఞానం అన్నమాట.

అట్లాగే,

"నేను కూటస్థుని ఎరుగను" అనే ఈ విధమైన అనుభవానికి

విషయమైనదే అజ్ఞానం. ఔదాసీన్యం,సత్యత్వము పై నిర్లిక్ష్యము,వివేకము లేకపోవుట అనేవి అజ్ఞాన స్వరూపమని,

 "నేను ఎరుగను" అనే అనుభవం అజ్ఞానానికి కార్యం అన్నమాట.

ఏ చైతన్యస్వరూపమైన ఆత్మవల్ల సమస్తమూ తెలుసుకొనబడుతోందో,అటువంటి సత్యమును దేనివల్ల తెలుసుకోగలము ? అనే శ్రుతివచనాన్ని బట్టి ఏ ఆత్మతత్త్వంతో ఈ దృశ్యాన్నంతనూ తెలుసుకోగలుగుతున్నామో అటువంటి సత్యాన్ని ఏ జడవస్తువుతో చూడగలగుతాము?

తెలుసుకోగలుగుతాము?

జ్ఞానానికి సాధనమైన మనస్సు కూడా జ్ఞాతవ్యమైన విషయాన్నే తెలుసుకోగలుగుతుందేతప్ప జ్ఞాతయైన ఆత్మను తెలుసుకోలేదు.

మరొక శ్రుతికూడా ఇదే చెపుతొంది.

"నైవ వాచా న మనసా ప్రాప్తుం శక్యోన చక్షషా..."  

కఠ 2-3-13.

ఆత్మను వాక్కుతో గాని,మనస్సుతోగాని,చక్షురాది ఇతర ఇంద్రియాలతో గాని పొందటానికి వీలు లేదు.



ఓంశ్రీమాత్రే నమః

*ఆమార్గేణ విచార్యాథ నాస్తి నో భాతి చేత్యసౌ ౹ విపరీత వ్యవహృతి రావృతేః కార్యమిష్యతే ౹౹36౹౹*

36.అశాస్త్రీయమగు తర్కము ద్వారా కూటస్థము కన్పింపదు అది లేదు అనే విపరీత వ్యవహారము ఆవరణము యొక్క ఫలము.


*దేహద్వయ చిదాభాసరూపో విక్షేప ఈరితః ౹ కర్తృత్వా ద్యఖిలః శోకః సంసారాఖ్యోఽ స్య బంధక ౹౹37౹౹*

37.చిదాభాసుడు  శరీరములతో తాదాత్మ్యము నొందుట విక్షేపమనబడినది. దీని వలన కర్తృత్వభావనతో ప్రారంభమగు సకల దుఃఖములకు లోనగును.ఈ దుఃఖజాతమే సంసారము.అదే బంధము.

వ్యాఖ్య:-

శాస్త్రాల్లో ప్రతిపాదింపబడిన ప్రక్రియల్ని
ఉల్లంఘించి,కేవలం కుతర్కాలతో ఆలోచించినమీదట "కూటస్థుడు లేనూలేడు, కనపడనూ కనపడటం లేదు" అనే ఈ విధమైన విరుద్ధ వ్యవహారం ఆవరణకు కారణమౌతుంది.
అజ్ఞానావరణ వల్లనే ఈ విధంగా వ్యవహరిస్తారు.

స్థూలశరీరం,సూక్ష్మశరీరం ఈ రెంటితోనూ కూడి తాదాత్మ్యము నొంది ఉన్న చిదాభాసనే(జీవుణ్ణే)విక్షేపం అంటారు.
బంధనహేతువైనట్టి సంసారమనే పేరుతో వ్యవహరింపబడే 
కర్తృత్వ భోక్తృత్వాది రూపంలో ఉండే సమస్త శోకమూ చిదాభాస యొక్క కార్యమనే అంగీకరించాలి.

ఈ పై రెండు అవస్థలూ  చిదాభాసలో ఎట్లా ఉంటాయి ?
అజ్ఞానం,ఆవృత్తి అనేవి విక్షేపం పుట్టటానికి ముందు గూడా ఉన్నాయి గదా !
చిదాభాసమనేది విక్షేపాంతర్గతమైనదని అంటారేమి ? అంటే -

అజ్ఞానము, ఆవరణము (ఆవృత్తి)అనే ఈ రెండు అవస్థలూ విక్షేపం పుట్టటానికి పూర్వమే ఉన్నప్పటికీ అవి చిదాభాసకున్నవే తప్ఫ కూటస్థమైన చైతన్యానికి సంబంధించినవు కావు.

కూటస్థమనేది అసంగమైనది కాబట్టి,చిదాత్మ యందు అజ్ఞానము ఆవరణము అనేవి సంభవం కాదు.
ఇక పరిశేష న్యాయంగా ఆ రెండు అవస్థలూ చిదాభాసకు చెందినవే అని అంగీకరించాలి.

అంతఃకరణ వృత్తి అంతర్ముఖమయిన తరువాత సూక్ష్మమైన చైతన్యము ను అందుకొనుటకు నిరీక్షించాలి.
నిలకడ లేక బహిర్ముఖమయినచో అదే "విక్షేపం".

ఇంట్లో నిధి ఉన్నది.తవ్వాడు దానికి ఒక విష సర్పము కాపలా ఉన్నది.చాలా ప్రయత్నాలతో ఆ సర్పము అడ్డు తొలగినది.దీని వలన మనస్సుకు సంతోషం కలిగింది.
ఈ సంతోషంతో ఆగిపోతే"నిధి"
దొరకదు.

అలాగే మనలోనే బ్రహ్మరూప నిధి గలదు.దానికి కాపలాగా విక్షేపం వున్నది.అది తొలగితే వచ్చే ఆనందం దగ్గరే ఆగితే బ్రహ్మానందం లభించదు.

బాహ్య విషయాకార వృత్తి - విక్షేపం.
అంతర వాసనాకార వృత్త - రాగద్వేషాదులు.
విషయాలను దోషాలుగా గమనించటం ద్వారా దీనిని పోగొట్టవచ్చును.



Thursday, 27 May 2021

నేటి హాస్యం

శ్రీ లలితా అష్టకారికా స్తోత్రం
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

1) విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైక నాయకి |

లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ ||


2) ఆనందరూపిణి పరే జగదానందదాయిని |

లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ ||


3) జ్ఞాతృజ్ఞాన జ్ఞేయరూపే మహాజ్ఞానప్రకాశిని |

లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ ||


4) లోకసంహారరసికే కాళికే భద్రకాళికే |

లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ ||


5) లోకసంత్రాణరసికే మంగళే సర్వమంగళే |

లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ ||


6) విశ్వసృష్టిపరాధీనే విశ్వనాథే విశంకటే |

లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ ||


7) సంవిద్వహ్ని హుతాశేష సృష్టి సంపాదితాకృతే |

లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ ||


8) భండాద్యైస్తారకాద్యైశ్చ పీడితానాం సతాం ముదే |

లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ ||


ఇతి అష్టకారికా స్తోత్రమ్ ||

--(())--

*శ్రీ విష్ణు కవచ స్తోత్రం*

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

*అస్య శ్రీవిష్ణుకవచ స్తోత్రమహామంత్రస్య, బ్రహ్మా ఋషిః, అనుష్టుప్ ఛన్దః, శ్రీమన్నారాయణో దేవతా, శ్రీమన్నారాయణ ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |*


*ఓం కేశవాయ అంగుష్ఠాభ్యాం నమః |*

*ఓం నారాయణాయ తర్జనీభ్యాం నమః |*

*ఓం మాధవాయ మధ్యమాభ్యాం నమః |*

*ఓం గోవిందాయ అనామికాభ్యాం నమః |*

*ఓం విష్ణవే కనిష్ఠికాభ్యాం నమః |*

*ఓం మధుసూదనాయ కరతలకరపృష్ఠాభ్యాం నమః ||*


*ఓం త్రివిక్రమాయ హృదయాయ నమః |*

*ఓం వామనాయ శిరసే స్వాహా |*

*ఓం శ్రీధరాయ శిఖాయై వషట్ |*

*ఓం హృషీకేశాయ కవచాయ హుం |*

*ఓం పద్మనాభాయ నేత్రత్రయాయ వౌషట్ |*

*ఓం దామోదరాయ అస్త్రాయ ఫట్ |*

*భూర్భువస్సువరోమితి దిగ్బంధః ||*


*|| ధ్యానమ్ ||*

*శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం|*

*విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ |*

*లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం|*

*వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ||*


*ఓం పూర్వతో మాం హరిః పాతు పశ్చాచ్చక్రీ చ దక్షిణే |*

  *కృష్ణ ఉత్తరతః పాతు శ్రీశో విష్ణుశ్చ సర్వతః ||*


*ఊర్ధ్వమానందకృత్పాతు అధస్తాచ్ఛార్ఙ్గ భృత్సదా |*

*పాదౌ పాతు సరోజాంఘ్రిః జంఘే పాతు జనార్దనః ||*


*జానునీ మే జగన్నాథః ఊరూ పాతు త్రివిక్రమః |*

 *గుహ్యం పాతు హృషీకేశః పృష్ఠం పాతు మమావ్యయః ||*


*పాతు నాభిం మమానన్తః కుక్షిం రాక్షసమర్దనః |*

*దామోదరో మే హృదయం వక్షః పాతు నృకేసరీ ||*


*కరౌ మే కాళియారాతిః భుజౌ భక్తార్తిభంజనః |*

*కంఠం కాలాంబుద శ్యామః స్కన్ధౌ మే కంసమర్దనః ||*


*నారాయణోఽవ్యాన్నాసాం మే కర్ణౌ కేశిప్రభంజనః |*

 *కపోలే పాతు వైకుంఠో జిహ్వాం పాతు దయానిధిః ||*


*ఆస్యం దశాస్యహన్తాఽవ్యాత్ నేత్రే మే హరిలోచనః |*

 *[ పద్మలోచనః ] భ్రువౌ మే పాతు భూమీశో లలాటం మే సదాఽచ్యుతః ||*


*ముఖం మే పాతు గోవిందః శిరో గరుడవాహనః |*

 *మాం శేషశాయీ సర్వేభ్యో వ్యాధిభ్యో భక్తవత్సలః ||*


*పిశాచాగ్నిజ్వరేభ్యో మామాపద్భ్యోఽవతు వామనః |*

 *సర్వేభ్యో దురితేభ్యశ్చ పాతు మాం పురుషోత్తమః ||*


*ఇదం శ్రీవిష్ణుకవచం సర్వమంగళదాయకం |*

*సర్వరోగప్రశమనం సర్వశత్రువినాశనమ్ ||*


*ఇతి శ్రీవిష్ణుకవచమ్ ||*

🕉🌞🌏🌙🌟🚩

094... నేటి హాస్యం 


బావా! సాయంత్రము బయటికి తీసుకు వెళతానన్నావు కదా! 
ఏమేమి కొంటావు నాకు!

చూడు మరదలు పిల్లా! 
నువ్వూ వుద్యోగస్తురాలివేగా! 
అందుకే ఖర్చలు చెరిసగం!

అలా కాదు గాని మనిద్దర్లో ఎవరు చిన్నవాళ్ళం బావా?

నువ్వే!

అవునా! 
అయితే ఖర్చులు కూడా అలాగే వుంటాయిగా! 
నేను జొన్నపొత్తులు, బఠాణీలు, పల్లీలకూ ఖర్చు పెడతాను బావా! 
ఓకేనా?

నీవేమో రెస్టారెంట్. సినిమా ఖర్చు ఒకే నా ?

ఆ              ఆ  ....... 
--((095**))--

ఈ  నాటి జోకు ప్రాంజలి ప్రభ (*)
సరదాగా తీసుకొవాలండొయ్!...మరి!! 
"ఫై.సి.నారి" కి ఇంట్లొ పని చేస్తుంటే...కరెంట్ షాక్ కొట్టింది!! 
భార్య గాభరా పడుతూ ... 
"అయ్యో! అయ్యో!!..మీకు ఏమీ కాలేదు కదా?!" అంటూ పరుగు పరుగున వచ్చింది!! 
"నా సంగతి దేవుడెరుగు.... 
ముందు ఎన్ని యూనిట్లు కాలేయో చూడవే  ... 
వెర్రి మొహమా!!" అన్నాడు "పి.సి.నారి"

--((*))--

(*096 )

టీచర్ :ఒరేయ్ మాలోకం, స్కూటర్ ఎలా స్టార్ట్ అవుతుందో చెప్పు??
మాలోకం: ....బుర్ర్ ర్ర్ ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్...
టీచర్: ఆపు రా రాస్కెల్!!
మాలోకం: బుర్ర్ర్ర్ర్ర్ర్ర్...ర్ర్ర్ర్.ర్ర్..బ్లుప్ ...బ్లుప్ బ్లుప్..ప్ ప్ ప్!!

--((**))--

(* 097)
"కొత్తెం" గాడు రాత్రి తెల్లవార్లూ...
ఫేస్బుక్ లో చాటింగ్ చేస్తూనే వున్నాడు...
కళ్లు మండటం మొదలయాయి ...
అయిన అతి కష్టం మీద చాటింగ్ కంటిన్యూ చెస్తూనె వున్నాడు!!
ఆఖరికి...
"వుంటాను బాబు...తెల్లారి పోయింది మడిబట్ట కట్టుకుని వంట చెయ్యాలి!!" అని అనగానే
"అంటే మీరు....మీరు ..." హాస్చర్య పోయాడు "కొత్తెం" గాడు !!
"నువ్వు ఇదాకటినుండి...."మాలా"...మాలా" అని అన్నావు చూడూ...వాళ్ల బామ్మని ....ఏదో వెధవది నిద్ర పట్టి ఛావడమ్ లేదు....కాలక్షేపం గా వుందని చాటింగ్ చేశా!!..మనవరాలు నిద్దరోతోంది !!" అంది బామ్మ గారు
--((**))--

(*098 )
సరదాగా తీసుకొవాలండొయ్!...మరి!!
"నిద్ర" వెనుక పడకండి ...టైమ్ వేస్టు!!
"చదువు" వెనుక పరుగెత్తండి.....
నిద్ర మీ వెనుకే పరుగెడుతూ వస్తుంది!!
--((**))--

(* )...099

సరదాగా తీసుకొవాలండొయ్!...మరి!!

గాయని "గాత్రావళి"..ని ఒక ఫంక్షన్ కి పిలిచారు , పాటలు పాడటానికి!!
కానీ అమ్మడు ....ఎన్ని సార్లు అనౌన్స్ చేసినా పాడటానికి లేవలేదు!!
"ఏమైందమ్మా....మీరు పాట మొదలు పెట్టక పొతే ...
జనం నా ప్రాణం తీస్తారు....
త్వరగా పాట మొదలు పెట్టండి !!" అన్నాడు ఆర్గనైజరు!
"మూడ్ ఆఫ్ అయిందండీ ...
నా కొత్త చెప్పుల జత కనిపించడం లేదు...
ఎవరో కొట్టేసారు!!" అంది "గాత్రావళి"
"చెప్పులదేముండీ!!...
మీరు పాడటం మొదలు పెడితె ...
లెక్ఖ లేనన్ని విసురుతారు ఆడిఅన్స్ ....
లేవండి ....లేవండి ...పాట మొదలు పెట్టండి" అన్నాడు "ఆర్గనైజరు"!!
--((**))__
(* )

100.... సరదాగా తీసుకొవాలండొయ్!...మరి!!
"కంచి కి వెళ్ళని కధ ....."
ఒక "పెద్ద మనిషి" కి ...
3 స్నేహితులు వున్నారు!!
3 రూ డాక్టర్ లే!!
అందులో 2 రు పిచ్చివాళ్ళు..
1 కి ఏమీ అర్ధం కాదు!!!
--((**))--
*నవ్వుకోండి నవ్వుకోండి*

భార్య: 
నా గొప్పతనం చూడండి.. మిమ్మల్ని చూడకుండానే పెళ్ళిచేసుకున్నాను.

భర్త:
నాది నీకంటే ఇంకా గొప్పతనం...! నిన్ను చూసినతర్వాత కూడా పెళ్లి చేసుకున్నాను !!

          😄😁😄😃


భార్య :

ఇదిగో ఆఖరిసారిగా చెప్తున్నా. మీతలమీద వెంట్రుకలు ఇప్పటికే చాలా రాలిపోయాయి. ఇదేఇంకా కొనసాగితే మిమ్మల్ని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతా.

భర్త : 

జుట్టు రాలిపోతోందని ఇన్నాళ్లూ అనవసరంగా బాధపడ్డాను. ఈసంగతి ముందే తెలిసుంటే జుట్టు రాలిపోవటం గురించి అసలు పట్టించుకుని ఉండేవాణ్ణికాదు.

            😁😄😁😄😁

భార్య :

ప్రపంచం మొత్తంలో ఎంతవెతికినా నాలాంటిభార్య మీకు దొరకనేదొరకదు.

భర్త :

పిచ్చిదానా... ఒకవేళ నేను వెతకవలసివస్తే మళ్ళీకోరికోరి నీలాంటిదానికోసమే ఎందుకు వెతుకుతాను ? మరీ టూమచ్ గా మాట్లాడకు.

           🙂😄😋🙂😁

టాక్సీ డ్రైవర్ :

సార్..... బ్రేకులుపని చేయటంలేదు. ఏం చేయమంటారు ? 

పాసింజర్ : 

ముందు మీటర్ ఆపేయ్ రా... దరిద్రుడా !

              😄😁😆😁😄

భయంకరమైన తుఫాను లో తడిచిపోతూ ఒకడు పిజ్జా కొనుక్కోవటానికి షాపుకు వచ్చాడు.

షాపువాడు :
మీకు పెళ్ళి అయిందా ?

కొనేవాడు :
ఓరి వెధవా... ఇటువంటి భీభత్సమైన గాలివానలో పిజ్జా తీసుకురమ్మని *పెళ్ళాం కాక* కన్నతల్లి పంపిస్తుందా ?

             😁😆😆😆😁

*ప్రతిభకూ, దేవుడు ప్రసాదించిన వరానికీ మధ్య వ్యత్యాసం* :-

ఎవడైనా ఒకవిషయంమీద అనర్గళంగా మాట్లాడగలిగితే దాన్ని...

*ప్రతిభ* అంటారు.

కానీ...

అసలు విషయమేలేకుండా గుక్కతిప్పుకోకుండా ఏ ఆడదైనా మాట్లాడుతూంటే....
అది *దేవుడిచ్చిన వరం* అవుతుంది.

             😄😁🙂😇😄

అడుక్కుతినే సాధువు 
(కారులో కూర్చుని ఉన్న మహిళతో) :

మేడమ్..! ఓపదిరూపాయలివ్వండి.

ఆవిడ పదిరూపాయలు ఇస్తూ అన్నది :

ఏంటి స్వామీ..? నన్నేమీ దీవించరా ?

సాధువు :

ఇంకా ఏంకావాలి నీకు ? కారులో ఊరేగుతున్నావు చాలదా ? ఇక రాకెట్ లో కూర్చొని ఎగరాలనిఉందా ?

               😁🙃😁🙃😁

టీవీ రిపోర్టర్ ఒకడు బాంబు పేలిన ప్రమాదంలో గాయపడినవాడిని ఇలా పరామర్శించాడు...

*"బాంబు చాలా తీవ్రంగా పేలిందా?"*

గాయపడిన వాడికి అరికాలిమంట నెత్తికెక్కి..

*అబ్బేలేదు. బాంబు సీతాకోకచిలుక లాగా మెల్లగా ఎగురుకుంటూ వచ్చి నాచెవిదగ్గర గుసగుసలాడుతూ అన్నది..తుస్* !!!

         ⚡💥🔥😆😁😆

ఒకడు మెడికల్ షాప్ కు విషం కొనుక్కోవటానికి వెళ్ళాడు.

షాపువాడు :

నువ్వు ప్రిస్క్రిప్షన్ తెచ్చావా ?

కొనేవాడు తనజేబులోంచి పెళ్లి సర్టిఫికేట్ బయటకుతీసి చూపించాడు.

షాపువాడు : ఇక ఆపరాబాబు ! నిన్ను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఎన్ని బాటిల్స్ కావాలి ? ఒకటా..రెండా...?

Wednesday, 26 May 2021

శ్రీ వేంకటేశ్వర లీల లు (1 )



శ్రీ వేంకటేశ్వర లీల లు (1 )

రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ


వెనువెంటనే వేంకట రమణా ...  వెనక బంధ మవ్వు 

సంస్కరించే శక్తి యు రమణా .... సంక టమ్ము తీర్చు  

విక్సష్ సేనగను నీవు రమణా ..... విశ్వ విజయ నేత 

చేయలేను ఉపచారములు దేవ....  మొయ లేను ఎపుడు  


నమస్కార ములు తెల్పితిని దేవ ... సమము గాను చూడు  

కలశాభిషేకమ్ము యే దేవ .... .... .  కళలు తీర్చ వయ్య  

కర్పూరం వెలిగించి తిని దేవ  ... ఓర్పు ఇవ్వు మాకు  

తొలగించు జన్మపాపము దేవ  .... అలలు లాగ ఉన్న 


కోరను నే వరాలను దేవ .....  కోరికలను తీర్చు  

సకల జీవులను రక్షగా దేవ ...... వికటకవిని నేను    

దూరాన ఉన్నావు గా దేవ ....... నేరములను మాపు   

చిరకాల హృదయమందున దేవ ..... కరములు కలిపితిని   


అంతర్మధనము చూడుము దేవ  - పంత మేమి లేదు 

సర్వమ్ము అర్పించితిని  దేవ  .... సర్వ మాయ తుంచు 

నిత్యమూ వేడుచుంటిని దేవ  --- నిత్య సత్య దేవ    

ప్రాంజలి ప్రభ సోయగములు ... శ్రీ శ్రీ శ్రీ వెంకట రమణా 

--(())--

 శ్రీ వేంకటేశ్వరుని లీలలు..2..

విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ


చూసి చూడలేక  చూసినంత చెప్ప లేను వేంకటేశ  

నిలువ లేక నేను నియమ భధ్ధునిగా భక్తి వేంకటేశ 

మునిగితిని భక్తిన ముడుపు లన్ని కట్టె నీకు వేంకటేశ

కన్నులార నిన్ను, కాంచి మురిసితినే, విజయ వేంకటేశ

                    

ఎన్నిసార్లు పిలిచి, ఎంత వేడు కొన్న, నిన్నె వేంకటేశ                    

చేరి కొలుచుటకై, చేత నైనదియును చేసె వేంకటేశ

వేచియున్నాను ర వేకువగా పూజలు చేసె వేంకటేశ

అతిగఎవ్వరినీ, అసలు నమ్మలేను నేను వేంకటేశ


ఇదియె కీర్తనగా ఇదియె నిజమెపుడును నీకు వేంకటేశ

మరువ లేను నేను తరువు లాగ పెరుగు చుంటి వేంకటేశ

ప్రగతి కోరుచుంటి పగలు రేయి పూజ నీకు వేంకటేశ

 అందరి రోగమ్మే అంత మగుటకేను పూజ వేంకటేశ

--(())--

శ్రీ వేంకటేశ్వరుని లీలలు ... 3 

విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

 

నేస్తమా నే నున్నా తోడుగా...నేస్త  మాయె దెపుడు

నీడగా లాభమే ఇస్తాను... తోడు గుంటి నీకు

అంబరమ్ము కు సాక్షి గ వినుము... సంబరమ్ము ఇకను


మక్కువే గా తీపి చేదుగా... మొక్కు వైనదియును

తేనలా తీపిగా హాయిగా ....తేట మలుపు నీకు

ధైపమా మా కోర్కలను తీర్చు  .... దేవ పిలుపు లాగ

 

కోపమా  మాదరి రాకుమా  .... ... కోప తాప మొవ్వు  

లోపము చేయక ఉంచుము .... ... లోప మైన దిద్దు  

శాపము  మమ్ము కమ్మి నదిలే ... .. శాప మాప వలెను 


భయముగా మామధ్య రాకుము  ,,  భయమును తొలగించు 

కాలమా మంచి చేయుము మాకు ...  తాళ లేక ఉండె  . 

వేదమా పల్కు నేర్పుము మాకు  ....  వేద మోక్ష మొవ్వు 


మిత్రునిగా నన్ను కొలిచితి ...... మిత్ర సేవ కొరకు .  .  

ధర్మమే మాకు మార్గము దేవ .... ధర్మ సేవ చేయు 

సత్యమే మాలొ వాక్కులు దేవ  ... సతము నిరతి మాలొ  


న్యాయమే మాకు రక్షగ దేవ ... ...  న్యాయ దేవతవులె  

దేశ రక్షగ వేంకట రమణా   ... .... దేశ శాంతి కొరకు   

ప్రాంజలి ప్రభ సోయగములు - నిత్య సత్య దేవ 

--(()) - -

శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వరూనిలీలలు ..... 04

రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


ఊహలతో ఊపిరిపోసి -  దేహము కూ దప్పికతీర్చి 

ఆశలతో  ఆకలితీర్చి  - మాటలతో మంచినిచెప్పి 

మనసునే దోచావు దేవ --శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వరా    


స్వేదముతో సేవలు చేసి - దీపముతో  వెల్గునుపంచి  

భావముతో భయ్యముతుంచి - బాధ్యతతో భద్రతపెంచి 

మనసునే దోచావు దేవ - శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వరా 


కానుకతో ఏడ్పును తుంచి - గానముతో  గాయము మాన్పి 

రాగముతో రోగము మాన్పి - మాటలతో మోసముచేసి 

మనసునే దోచావు దేవ -శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వరా 


నవ్వులతో హాస్యముపంచి  - చిందులతో చింతనుతుంచి 

పల్కులతో ప్రేమనుపంచి  - వేదముతో  ఆశలు పెంచె  

మనసునే దోచావు దేవ - శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వరా 


--(())--

తనువు కుంది తృప్తి, తపన కుండ లేదు ఏల వేంకటేశ     
మనసు మర్మ మాయె, మగువ మాన సాఎ ఏల వేంకటేశ
వణకి ఉండలేను వధువు మార్చ  లేను ఏల వేంకటేశ   
తినక తిప్పలొచ్చు తిన్న తిట్లు వొచ్చు  ఏల వేంకటేశ

వినక పోతి దేవ, వినతి  సాయంగా జూపు వేంకటేశ  
ఘనము కాకపోయె, ఘనత చెందలేక  ఉన్నవేంకటేశ
ధనము ఇవ్వలేను, దరిన ఉండ లేను ఎట్లు వేంకటేశ      
దినము గడిచి ఉన్న, తినక ఉండ లేక ఉన్న వేంకటేశ     

కన్ను కదులు తుంది, కనిక రించుట కే నిజము వేంకటేశ   
నిన్ను చూసి నంత, నిలువ లేను అంది వేంకటేశ 
ఎన్ని సార్లు చూసి, ఎంతసేపు ఉన్న కలతె వేంకటేశ   
ఉనన్ విషయమంత ఉన్న చోటనుంచె తెలిపె వేంకటేశ


శ్రీ 

 


ఏనుగుపిల్ల::

ఓ అడవిలో ఎన్నో జంతువులు ఉండేవి. అవన్నీ దాహం తీర్చుకోవడానికి మధ్యలో ఉన్న చెరువుకి వెళ్లేవి. ఆ చెరువు చాలా పెద్దది. అందులో చేపలు, తాబేళ్లు, మొసళ్లు ఉండేవి.

అక్కడకు వచ్చే ఏనుగుల గుంపులో ఉండే పిల్ల ఏనుగుకు వెలక్కాయంత తిక్కుంది. తన బలం ముందు ఎవరూ సరిపోరని విర్రవీగుతూ, కోరి తగువులు తెచ్చుకుని ఏడిపించేది. చెరువు నీటిలో దాగి కాళ్లతో రొప్పుతూ బురద రేపేది. తొండంతో నీటిని జల్లి అలజడి సృష్టించేది. అలా చేయకూడదని చెప్పిన పెద్ద మొసలితో తగువు తెచ్చుకుని ‘దొంగతనంగా నీటిలో దాగి, గుటుక్కున మింగేసే కపట బుద్ధి మీది. నాకు నీతులు చెబుతావా’ అని ఎగతాళి చేసింది.

ఆ మాటలకు అన్ని మొసళ్లూ బాధపడ్డాయి. చేపలు, తాబేళ్లు వాటిని ఓదార్చాయి.

అది మొదలు పిల్ల ఏనుగు చెరువుకి వచ్చిన ప్రతిసారీ మరింత రెచ్చిపోయి చేపల్ని, తాబేళ్లని భయపెట్టి మొసళ్లని తిట్టి వెళ్లేది. రోజూ జరుగుతున్నది చూసిన ఓ కుర్ర మొసలికి పిల్ల ఏనుగుకి బుద్ధి చెప్పాలనిపించి పిల్ల ఏనుగు వచ్చినప్పుడు ‘కొండంత బలమున్న పిల్ల ఏనుగా! బాగున్నావా? ఓడిపోతానని తెలిసి నీతో పందెం కాయాలని ఉంది. నా కోరిక తీరుస్తావా?’ అని అడిగింది కుర్ర మొసలి.తాతల కాలంలో మొసలి చేతిలో భంగపడిన మచ్చ ఎలాగూ తమ జాతికి ఉంది. అది పోయే అవకాశం, సమయం వచ్చాయేమో అనుకున్న పిల్ల ఏనుగు పందెం గురించి అడిగింది. కుర్ర మొసలి ‘బలమైన తాడుకి ఒక చివర నేనూ రెండో వైపు నువ్వూ లాగుదాం. నా బలం నీటిలోనే కాబట్టి చెరువు అడుగుకి వెళతాను. నీ బలం ఉపయోగించి తాడు గుంజి ఒడ్డు మీదకి నన్ను రప్పించు. నువ్వు గెలిస్తే నీ మాట వింటాను. నేను గెలిస్తే మొసళ్లని ఏమీ అనకూడదు. నీటిని పాడు చేయకూడదు’ అంది.‘ఇంతేనా సరే’ అంది పిల్ల ఏనుగు.

పొలంలో ఉన్న రైతు దగ్గర్నించి తాడు తెచ్చింది కోతి. ఎలుగుబంటి ఏనుగు తరఫున, తాబేలు మొసలి తరుఫున న్యాయనిర్ణేతలుగా నిలబడ్డారు. తర్వాత రోజు పోటీ జరిగింది. బోలెడన్ని జంతువులు, పక్షులు పోటీని ఆసక్తిగా చూశాయి. తాడుకొస నోటితో పట్టుకుని నీట్లోకి వెళ్లింది కుర్ర మొసలి. రెండో కొస పట్టుకుని తొండంతో బలమంతా ఉపయోగించి తాడు లాగింది పిల్ల ఏనుగు. అంగుళమన్నా కదిలించలేకపోయింది. అలసిపోయింది తప్ప ఫలితం కనబడలేదు. పిల్ల ఏనుగు ఓటమిని ఒప్పుకొంది. తాబేలు వెళ్లి కుర్ర మొసలిని పిలిచింది. కుర్ర మొసలి ‘నీకూ చాలా బలముంది. ఒక దశలో ఓడిపోతానని అనుకున్నా’ అంది. ఆ మాటలకు పిల్ల ఏనుగు పొంగిపోయి బుద్ధిగా ఉంటానని మాట ఇచ్చింది. మొసళ్లు, చేపలు, తాబేళ్లు కుర్ర మొసలిని అభినందించి ‘నీలో ఇంత బలముందని ఊహించలేదు’ అన్నాయి. కుర్ర మొసలి నవ్వుతూ ‘గెలిచింది బలంతో కాదు తెలివితో’ అంది. అదెలా అని ఆశ్చర్యపోయి చూశాయి. అంతలో తాబేలు ‘మొసలన్నయ్య ఏం చేశాడో చెబుతా. నీళ్ల అడుగున బలమైన పురాతన చెట్టు మొదలు ఉంది కదా. దానికే తాడు కొసను కట్టేసి హాయిగా కూర్చున్నాడు. నేను రమ్మనగానే తాడు విప్పి నీటి మీదకు వచ్చాడు’ అంది.

విషయం తెలియగానే కుర్ర మొసలి తెలివికి ఆశ్చర్యపోయి ‘ఎలాగైతే నేం పిల్ల ఏనుగు తిక్క కుదిర్చి బుద్ధి చెప్పావని’ అభినందించాయి మొసళ్లు.

ఈనాడులో ప్రచురింపబడిన నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారి రచన.

191

ు. మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోండి' అని వేధించసాగింది. వాటిని వెళ్లగొట్టాలని అనుకుంటుండగా... ఓ రోజు వేటగాడు ఒక చిలుకను పట్టుకెళ్లి చిలుక జ్యోతిషం చెప్పేవానికి అమ్మడం కాకి చూసింది, జతలేని చిలుక బిక్కుబిక్కుమంటూ అల్లాడడం చూసి కాకి సంతోషంతో గంతులేసిందే కానీ,... చిలకల కిలకిలారావాలు, విన్యాసాలు కనపడకపోయే సరికి ఏదో వెలితిగా అనిపిస్తుండేది కాకికి.

కొన్ని రోజులు గడిచాయి. రచ్చబండ దగ్గరలోని బడిలో ఆ రోజు పర్యావరణ పరిరక్షణ గురించి, పక్షులు, జంతువులని కాపాడడం గురించి సైన్స్‌ టీచర్‌ ఇస్తున్న ఉపన్యాసం స్పీకర్లో వినబడుతోంది. కాకి ఉపన్యాసం వింటూ 'ఆ... ఈ మనుషులు, ఈ ఉపన్యాసాలూ, మాటలలో పక్షుల్ని, జంతువుల్ని రక్షించుకోవాలని చెప్పడం.. ఒకపక్క వాతావరణాన్ని కాలుష్యం చేస్తూనే ఉన్నారు'. అని నిట్టూర్చి ఆహార అన్వేషణకు బయలుదేరింది.

అప్పుడే ఒక ఇంటివద్ద కొందరు 'కావ్‌ ..... కావ్‌ అంటూ అరుస్తున్నారు. కాకికి పిండం పెట్టడానికి ఆ ఇంటి నుంచి కమ్మని పప్పు, వడలవాసన రావడంతో అక్కడే ఉన్న చెట్టుపై కాకి వాలింది. అంతలో అక్కడే ఉన్న ఇంటి అరుగుపై చిలకని కొన్న జ్యోతిష్యుడు కూర్చున్నాడు. అప్పుడే ఆ దారిలో పోతున్న ఒక పల్లెవాడు జ్యోతిష్యుడిని చూసి జ్యోతిషం చెప్పమన్నాడు. మంచి బేరం తగిలిందని సంతోషంతో వాడిని కూర్చోపెట్టి చిలకని బయటకురమ్మని పక్కన ఉన్న అట్టముక్కలలో ఒకదాన్ని తీయమన్నాడు. చిలక పంజరం నుంచి బయటకు వచ్చి కార్డు తీసిచ్చి నీరసంగా లోపలికి వెళ్లింది.

ఇదంతా గమనిస్తున్న కాకికి బడిలో వాళ్ల ఉపన్యాసం గుర్తుకొచ్చింది. 'మమ్మల్ని దేవతల వాహనాలుగాను, శాస్త్రాలకు ఆపాదించి ఉపయోగించుకోవడం తప్ప ఈ మనుషులు మనల్ని రక్షించడం అటుంచి... మమ్మల్ని మేమే రక్షించుకోవాలి. ఇందుకు మనలో ఐక్యత లేకపోవడం ఒక కారణం.. పాపం చిలుక..! ఎంతో తెలివిగలవాడైన మనిషి పనీ పాట లేకుండా ఈ చిన్న చిలకతో డబ్బు సంపాదిస్తున్నాడు. ఎలాగైనా రక్షించాలి' అని అనుకుంటుండగా అప్పటికే అక్కడకు కాకులు వచ్చి చేరగా వాటికి విషయం చెప్పి వాటితో సరేననిపించింది. అవకాశం కోసం చూస్తుండగా మరొకడు జ్యోతిషం చెప్పించుకోవడానికి రావడం, చిలుక పంజరం నుంచి బయటికి రావడం, కాకులన్నీ కలిసి జ్యోతిష్యుడిపై దాడి చేయడం అన్నీ ఒక్క సారిగా జరిగిపోయాయి. జ్యోతిష్యుడు పారిపోవడంతో వెంటనే 'రా చిలకమ్మా పోదాం.. నీ పెనిమిటి దిగులు పెట్టుకున్నాడు.' అనగానే ఎక్కడలేని హూషారుతో చిలుక రివ్వున ఎగిరింది.

అప్పుడే బడి పిల్లలు పర్యావరణ ర్యాలీ బయలుదేరి అటువైపు రాసాగింది. ఆకాశంలో ర్యాలీనీ చూస్తూ స్వేచ్ఛగా కాకులు, చిలుక ఎగిరిపోసాగాయి.

ప్రజాశక్తి లో ప్రచురించబడిన శ్రీ కంచనపల్లి ద్వారకానాథ్‌ గారి రచన.

--(())--

ఒక #గురువు తన ఇద్దరు 

#శిష్యుల్ని పిలిచి ‘ఈరోజు మీరిద్దరూ యాభై కోసుల దూరం వెళ్లాలి.’ అన్నాడు. ఒక శిష్యుడికి ఓ సంచిలో #తినుబండారాలు నింపి ఇచ్చి ‘ఎవరైనా వీటి అవసరం ఉన్నవాళ్లు కనిపిస్తే వారికి #పంచుకుంటూ వెళ్లు’ అన్నాడు. 

#రెండో శిష్యుడికి ఖాళీ సంచి ఇచ్చి ‘దారిలో విలువైన వస్తువు ఏదైనా కనిపిస్తే దాన్ని సంచిలో #వేసుకుంటూ వెళ్లు’ అన్నాడు. 

ఇద్దరూ #సంచుల్ని భుజాలకి తగిలించుకుని ప్రయాణం మొదలుపెట్టారు. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. 

ఖాళీ సంచివాడు ఆడుతూపాడుతూ నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్లాక అతనికి ఒక #బంగారురాయి దొరికింది. దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు. మరికొంత దూరం వెళ్లాక మరొకటి కనిపించింది. దాన్నీ తీసి సంచిలో వేసుకున్నాడు. అలా ఎక్కడ బంగారు రాయి కనిపిస్తే దాన్ని తీసుకుని సంచిలో వేసుకుంటూ నడక సాగించాడు. దాంతో సంచి #బరువెక్కసాగింది. 

నడక #భారంగా మారింది. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అయింది. ఉండేకొద్దీ అడుగు తీసి అడుగేయడమే చాలా కష్టమైపోయింది. 

ఇక #రెండోవాడు వెళ్తూ వెళ్తూ దారిలో ఆకలితో కనిపించిన వారికి తన సంచిలోని తిను బండారాలను కొంచెం కొంచెంగా పంచుకుంటూ వెళ్లాడు. క్రమంగా సంచి #బరువు_తగ్గినడక #సులభం అయింది. 

పంచుకుంటూ వెళ్లినవాడు తన గమ్యాన్ని తేలిగ్గా చేరుకోగలిగాడు. 

పోగేసుకుంటూ వెళ్లిన వ్యక్తి గమ్యాన్ని చేరుకోలేకపోయాడు. ప్రయాణమూ కష్టంగా సాగింది. 

మరి మీరూ మనసు పెట్టి ఆలోచించండి... 

మీ #గమ్యాన్ని ఎలా చేరుకోదలచుకున్నారు..?

.......(సేకరణ)........


--((***))--

ఏనుగుపిల్ల::

ఓ అడవిలో ఎన్నో జంతువులు ఉండేవి. అవన్నీ దాహం తీర్చుకోవడానికి మధ్యలో ఉన్న చెరువుకి వెళ్లేవి. ఆ చెరువు చాలా పెద్దది. అందులో చేపలు, తాబేళ్లు, మొసళ్లు ఉండేవి.

అక్కడకు వచ్చే ఏనుగుల గుంపులో ఉండే పిల్ల ఏనుగుకు వెలక్కాయంత తిక్కుంది. తన బలం ముందు ఎవరూ సరిపోరని విర్రవీగుతూ, కోరి తగువులు తెచ్చుకుని ఏడిపించేది. చెరువు నీటిలో దాగి కాళ్లతో రొప్పుతూ బురద రేపేది. తొండంతో నీటిని జల్లి అలజడి సృష్టించేది. అలా చేయకూడదని చెప్పిన పెద్ద మొసలితో తగువు తెచ్చుకుని ‘దొంగతనంగా నీటిలో దాగి, గుటుక్కున మింగేసే కపట బుద్ధి మీది. నాకు నీతులు చెబుతావా’ అని ఎగతాళి చేసింది.

ఆ మాటలకు అన్ని మొసళ్లూ బాధపడ్డాయి. చేపలు, తాబేళ్లు వాటిని ఓదార్చాయి.

అది మొదలు పిల్ల ఏనుగు చెరువుకి వచ్చిన ప్రతిసారీ మరింత రెచ్చిపోయి చేపల్ని, తాబేళ్లని భయపెట్టి మొసళ్లని తిట్టి వెళ్లేది. రోజూ

జరుగుతున్నది చూసిన ఓ కుర్ర మొసలికి పిల్ల ఏనుగుకి బుద్ధి చెప్పాలనిపించి పిల్ల ఏనుగు వచ్చినప్పుడు ‘కొండంత బలమున్న పిల్ల ఏనుగా! బాగున్నావా? ఓడిపోతానని తెలిసి నీతో పందెం కాయాలని ఉంది. నా కోరిక తీరుస్తావా?’ అని అడిగింది కుర్ర మొసలి.

తాతల కాలంలో మొసలి చేతిలో భంగపడిన మచ్చ ఎలాగూ తమ జాతికి ఉంది. అది పోయే అవకాశం, సమయం వచ్చాయేమో అనుకున్న పిల్ల ఏనుగు పందెం గురించి అడిగింది. కుర్ర మొసలి ‘బలమైన తాడుకి ఒక చివర నేనూ రెండో వైపు నువ్వూ లాగుదాం. నా బలం నీటిలోనే కాబట్టి చెరువు అడుగుకి వెళతాను. నీ బలం ఉపయోగించి తాడు గుంజి ఒడ్డు మీదకి నన్ను రప్పించు. నువ్వు గెలిస్తే నీ మాట వింటాను. నేను గెలిస్తే మొసళ్లని ఏమీ అనకూడదు. నీటిని పాడు చేయకూడదు’ అంది.

‘ఇంతేనా సరే’ అంది పిల్ల ఏనుగు.

పొలంలో ఉన్న రైతు దగ్గర్నించి తాడు తెచ్చింది కోతి. ఎలుగుబంటి ఏనుగు తరఫున, తాబేలు మొసలి తరుఫున న్యాయనిర్ణేతలుగా నిలబడ్డారు. తర్వాత రోజు పోటీ జరిగింది. బోలెడన్ని జంతువులు, పక్షులు పోటీని ఆసక్తిగా చూశాయి. తాడుకొస నోటితో పట్టుకుని నీట్లోకి వెళ్లింది కుర్ర మొసలి. రెండో కొస పట్టుకుని తొండంతో బలమంతా ఉపయోగించి తాడు లాగింది పిల్ల ఏనుగు. అంగుళమన్నా కదిలించలేకపోయింది. అలసిపోయింది తప్ప ఫలితం కనబడలేదు. పిల్ల ఏనుగు ఓటమిని ఒప్పుకొంది. తాబేలు వెళ్లి కుర్ర మొసలిని పిలిచింది.

కుర్ర మొసలి ‘నీకూ చాలా బలముంది. ఒక దశలో ఓడిపోతానని అనుకున్నా’ అంది. ఆ మాటలకు పిల్ల ఏనుగు పొంగిపోయి బుద్ధిగా ఉంటానని మాట ఇచ్చింది.

మొసళ్లు, చేపలు, తాబేళ్లు కుర్ర మొసలిని అభినందించి ‘నీలో ఇంత బలముందని ఊహించలేదు’ అన్నాయి. కుర్ర మొసలి నవ్వుతూ ‘గెలిచింది బలంతో కాదు తెలివితో’ అంది. అదెలా అని ఆశ్చర్యపోయి చూశాయి. అంతలో తాబేలు ‘మొసలన్నయ్య ఏం చేశాడో చెబుతా. నీళ్ల అడుగున బలమైన పురాతన చెట్టు మొదలు ఉంది కదా. దానికే తాడు కొసను కట్టేసి హాయిగా కూర్చున్నాడు. నేను రమ్మనగానే తాడు విప్పి నీటి మీదకు వచ్చాడు’ అంది.

విషయం తెలియగానే కుర్ర మొసలి తెలివికి ఆశ్చర్యపోయి ‘ఎలాగైతే నేం పిల్ల ఏనుగు తిక్క కుదిర్చి బుద్ధి చెప్పావని’ అభినందించాయి మొసళ్లు.

ఈనాడులో ప్రచురింపబడిన నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారి రచన.

--((***))--

దుష్టులతో స్నేహం::

{పంచతంత్ర కథ}

జంబూద్వీపంలో ఓ అడవి ఉంది. దాని పేరు కామ్యకం. అందులో పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు కింద ఓ పొద ఉంది. ఆ పొదలో ఓ పులి ఉండేది. దానికి దగ్గర్లోనే ఓ జువ్విచెట్టుంది. ఆ చెట్టు మీద ఓ కొంగ ఉండేది. గూడుకట్టుకుని ఉందక్కడ కొంగ. ఒక రోజు దుప్పిని వేటాడింది పులి.

తనివి తీరా దాని మాంసం తింది. మాంసం తింటుంటే ఓ చిన్న ఎముక ముక్క పళ్ళల్లో గుచ్చుకుపోయింది. బయటికి రాదు, లోనికి పోదు. భరించలేకపోయింది పులి. నానా బాధలూ పడింది దాంతో. నాలికతో ఎముకముక్కని లాగి లాగి చూసింది. రాలేదది. నాలిక కూడా తెగినట్టుగా ఉంది. మండుతోంది. దాంతో పిచ్చి పిచ్చిగా తయారయింది. పెద్ద పెద్దగా కేకలేస్తూ గాండ్రించసాగింది.

దాన్ని కొంగ గమనించి పులిని అడిగిందిలా. ‘ఏమయింది?’‘పళ్ళల్లో ఎముక ముక్క ఇరుక్కుంది. రావట్లేదు. చాలా బాధగా ఉంది.’ అంది పులి.‘ఎక్కడా?’ నోరు తెరవమంది కొంగ. తెరిచింది పులి.‘అదా’ చూసింది కొంగ.‘అవును, తీసిపెడదూ, నీకు పుణ్యం ఉంటుంది.’ బ్రతిమలాడింది పులి. కళ్ళు చెమర్చుకుంది. జాలిపడింది కొంగ. తన పొడుగాటి ముక్కుతో పులి నోట్లో ఇరుక్కున్న ఎముక ముక్కని తీసి పారేసింది. అది మొదలు, ఆ రెండూ మంచి స్నేహితులయ్యాయి. ఎవరి వేట వారు సాగిస్తూ, తిన్న తర్వాత సరదాగా కబుర్లు చెప్పుకునేవి.


కొన్నాళ్లు గడిచాయి. ఒకనాడు పులి అడవంతా తిరిగినా ఆహారం దొరకలేదు. దానికి ఆకలి బాధ చాలా ఎక్కువగా ఉంది.


పులి దుర్మార్గమైంది కదా! వెంటనే ఒక ఆలోచన చేసింది. తనకంత మేలు చేసిన కొంగను చంపి తిని, ఆకలి తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఇంతకు ముందులాగే బాధపడుతున్నట్లు నటించింది. కొంగ పులి మోసం తెలుసుకోలేక పోయింది. అంగిట్లో ఎముకను తీద్దామని పులి నోట్లో తన ముక్కును పెట్టింది. వెంటనే పులి దాని మెడ కొరికి చంపి, తినేసింది.

నీతి : దుష్టులను నమ్మి స్నేహం చేయకూడదు.

మరేమో #ఆషాడమాసం గురించి మొన్న ఒకళ్ళు అడిగారండి ... వాళ్ళకి ఒక్కలికే చెప్పేకంటే ఇలా ఇక్కడ చెప్తే దీని గురించి తెలియని కొంత మందికి తెలుస్తాది అని చెప్తునామండి 


#ఆషాడమాసం అంటే ... డిస్కౌంట్ సేల్ కాదండి బాబు దాని ఎనక చానా కథ ఉందండి .. ఓపిక చేసుకొని చదివేయండి మరి 😊


చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం సమీపంలోగాని, ఉత్తరాషాఢ నక్షత్రం సమీపంలో గాని సంచరిస్తాడు కనుక ఈ మాసాన్ని “ ఆషాఢమాసం ” అని అంటారు. ఇప్పుడే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. దీనిని సూన్యమాసం అని కూడా అంటారండి .. సూన్యమాసం అంటే శుభకార్యాలకు అనుగుణంగా లేని మాసం అని అర్ధం ... 

ఆషాడమాసం లో పూర్వం నుండి పాటించే కొన్ని సంప్రదాయాలు చూస్తే ఈ ఆషాఢమాసంలో కొత్తగా పెళ్లై అత్తవారింటికి వచ్చిన కొత్త కోడలు , అత్తగారు ఒకేచోట ఉండకూడదు అని అంటారు. అలాగే అత్తా అల్లుడు కూడా ఎదురు పడకూడదు అని అంటారు. అలా ఎందుకు అంటే పూర్వం మనకి వ్యవసాయమే జీవనాధారం. కొత్త వలపు మోజులో పడి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తారు అని పూర్వం ఈ నిబంధన పెట్టినట్టు మనకి పూర్వికులు చెబుతారు. ఏరువాక ( మొదటి పంట ) మొదలై పొలం పనులు జోరందుకునే సమయం ఇది ఈ సమయంలో కొత్త అల్లుడు ఇంటికి వస్తే అత్తింటివారు అతిధి మర్యాదలు చేయడానికి కుంచెం ఇబ్బంది పడతారని, అందులోను పెళ్ళైన మొదట్లో భార్య భర్తలకు ఒకరిమీద ఒకరికి విపరీతమైన ప్రేమ ఉంటుంది. ఈ మాసంలో దూరంగా ఉంటె ఎడబాటు బాధ కూడా వారికీ తెలుస్తుంది. అది వారి మధ్య ప్రేమను మరింత పెంచుతుంది అందుకే పెద్దలు ఈ ఆచారాన్ని పెట్టినట్టు చెబుతారు. 

ఇక సైన్స్ ప్రకారం చూస్తే కొత్తగా పెళ్ళైన జంట ఈ నెలలో కలిసి ఉన్న కారణంగా గర్భం వస్తే బిడ్డపుట్టే సమయానికి ఎండాకాలం వస్తుంది. అప్పుడు ఎండలు మరింత ఎక్కువగా ఉంది బాలింతరాలు (తల్లి), పసిపాపలు తట్టుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. అందువలన ఈ మాసంలో దూరంగా ఉండమని చెబుతారు. ఈ మాసంలో వాతావరణ మార్పులు కూడా చాలానే వస్తాయి ఎండలు తగ్గిపోయి వర్షాలు రావడం ఇప్పుడే మొదలవుతుంది ఆలా ఒక్కసారే వాతావరణం మారడం వలన శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి ఈ సమయంలో గర్భం వస్తే అవి పుట్టబోయే బిడ్డమీద ప్రభావం చూపుతాయని ఒక నమ్మకం ...


ఇకపోతే ఆషాఢమాసం అంటే మగువల చేతికి #గోరింటాకు

నిత్యం పనుల్లో ఉండే మహిళల చేతులు, పాదాలు పగిలిపోతూ ఉంటాయి. ప్రధానంగా వర్షాకాలంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. అందుకే ఆషాడంలో గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తీసేశక్తి ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే, గోరింటాకు రసంలో యాంటీ బ్యాక్టీరీయా లక్షణాలు ఉంటాయి. గోరింటాకు పెట్టుకున్న చేతులతో తినే టప్పుడు నోటి ద్వారా క్రిములు వెల్లకుండా కాపాడుతుందని చెబుతుంటారు. అందుకే ఆషాడంలో గోరింటాకు ఎక్కువగా పెట్టుకుంటారు. ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు అని కూడా అంటారనుకోండి అది వేరే విషయం ... కాని ఈ కోన్ లు పెట్టుకునే చేతుల కంటే గోరింటాకు పెట్టుకొని పండిన చేతులు చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు చాలా పద్ధతులు మారిపోయాయి కాబట్టి పట్టించుకోవడం లేదు పెద్దగా కాని ఒకప్పుడు గోరింటాకు కోసం పది మంది కలిసి ఎక్కడ చెట్లు ఉన్నాయా అని వెతికేవారు. రుబ్బి చేతులకు కాళ్ళకు పెట్టుకొని మరుసటి రోజు అందరికి భలే పండింది అని చాలా ఆనందంగా చెప్పుకునేవారు.

ఇంతకీ ఆషాఢమాసం ఎప్పుడో చెప్పలేదు చూసారా ... మొన్న " జులై 3 నుండి ఆగష్టు 1 వరకు " అండి ( తెలుగు పంచాంగం ప్రకారం )

వామ్మో ఇంత స్టోరీ రాస్తుంటే  ఇదంతా చదువుతున్నారో లేదో


ికి పోయాడు భటులు వాడిని జమీందారు దగ్గరకు తీసుకు వచ్చి సోదా చేస్తే వజ్రాల సంచీ కనిపించింది అయితే అందులో 99 మాత్రమే ఉన్నాయి.

ఏదీ మరో వజ్రం బయటకి తియ్‌ అంటూ జమీందారు గద్దించాడు ఆ దొంగ వణికి పోతూ నేను సంచీ విప్పి చూస్తే వజ్రాలు కనిపించాయి వాటిని సంచీలో వేసుకుని పారిపోయానేగానీ, ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు అన్నాడు ఆ సమాధానం విన్న మల్లన్నకి వణుకు పుట్టింది వెంటనే దొంగ దగ్గరకి వెళ్లి వాడి చెంప మీద కొట్టి నిజం చెప్పకపోతే వూరుకునేది లేదు అంటూ దబాయించాడు ఆ వూపులో అనుకోకుండా మల్లన్న తలపాగా కిందపడి వందో వజ్రం బయటకి దొర్లింది జమీందారు సంగతంతా గ్రహించి, ఇద్దరూ దొంగలే చెరో వంద కొరడా దెబ్బలు కొట్టి తరిమేయండి అన్నాడు కోపంగా.

అది విన్న మల్లన్న మొండిగా ఇది అన్యాయం 99 వజ్రాల దొంగకి, ఒకటి తీసుకున్న నాకూ శిక్ష ఒకటేనా అని ఎదిరించాడు జమీందారు ఒక్క క్షణం ఆలోచించి సరే నువ్వన్నట్టే శిక్ష మారుస్తాను అంటూ దొంగవైపు తిరిగి నువ్వు ఎన్ని దొంగిలించావు అని అడిగాడు, తొంభై తొమ్మిది అన్నాడు దొంగ, అయితే నీకు 99 కొరడా దెబ్బలు అన్న జమీందారు, ఆపై మల్లన్న వైపు తిరిగి, నువ్వు ఎన్నో వజ్రం దొంగిలించావు అని అడిగాడు, వందోది అన్నాడు మల్లన్న అయితే వందో దెబ్బ నీకు అన్నాడు జమీందారు అమ్మయ్య అనుకున్నాడు మల్లన్న.

భటులు ముందుగా దొంగకి తొంభై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టారు. మల్లన్న వెంటనే ఆ వందోది నాకు వేసేయండి అన్నాడు జమీందారు నవ్వి వందో దెబ్బ తినాలంటే మొదట తొంభైతొమ్మిదీ భరించాలి కదా కీలకమైన బాధ్యతలో ఉంటూ నమ్మకద్రోహం చేసిన నువ్వు ఆ దొంగ కన్నా ప్రమాదకారివి అన్నాడు. మల్లన్న తెల్లబోయి మొత్తం వంద కొరడా దెబ్బలూ తిన్నాడు.

--(())--


సెప్టెంబర్ 26, 2019 ప్రపంచ గర్భ నిరోధక దినోత్సవంగా జరుపబడుతుంది. 2007 లో ప్రారంభమైన ఈ కార్యక్రమం, యువతలో జనన నియంత్రణలలో విభిన్న పద్ధతుల గురించిన అవగాహన పెంచే లక్ష్యంతో ప్రారంభించబడింది. కేవలం ప్రపంచ జనాభాని దృష్టిలో ఉంచుకోవడమే కాకుండా, పరిస్థితుల కారణంగా పిల్లలు తాత్కాలికంగా వద్దు అనుకునే వారిని కూడా దృష్టిలో ఉంచుకుని ఈ రోజును ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం ప్రపంచ గర్భ నిరోధక దినం యుక్క నినాదం (థీమ్) "ఇది మీ జీవితం, ఇది మీ బాధ్యత". హిందూస్తాన్ టైమ్స్ గణాంకాల నివేదిక ప్రకారం, భారతదేశంలో 47.8% మంది మహిళలు గర్భ నిరోధక పద్దతులను వినియోగిస్తున్నారని వెల్లడించింది. కానీ వారికి పూర్తి స్థాయిలో ఇతర గర్భ నిరోధక పద్దతుల గురించిన వివరాలు తెలియవని, మరియు అనేకమందికి ఉత్తమమైన గర్భ నిరోధక పద్దతుల గురించిన అవగాహన లేదని కూడా చెప్పడం జరిగింది. మీ ప్రాధాన్యత మరియు ఆరోగ్య స్థితిని అనుసరించి మాత్రమే గర్భనిరోధక పద్ధతులు ఎంపిక చేయబడతాయి. వ్యక్తి వ్యక్తికి భిన్నంగా ఈ జనన నియంత్రణ పద్దతులు మారుతూ ఉంటాయి. ఈ వ్యాసంలో, వివిధ రకాలైన తాత్కాలిక జనన నియంత్రణ పద్ధతుల గురించిన పూర్తి వివరాలను పొందుపరచడం జరిగింది. మరియు ఇవి మహిళలకు ఏవిధమైన ఫలితాలను ఇస్తాయో కూడా చర్చించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు వ్యాసం చూడండి. ఇక్కడ వివిధ రకాల జనన నియంత్రణ పద్ధతులు ఉన్నాయి: 

1. కండోమ్ 2. గర్భ నిరోధక మాత్రలు 3. గర్భ నిరోధక ఇంజెక్షన్ 4. ఇంట్రా - యుటరిన్ (అంతర్గత గర్భాశయం) పరికరం (IUD) 5. వెజైనల్ (యోని) రింగ్.


 1. కండోమ్ : నిజానికి వాడకం తెలిస్తే దీనంత ఉత్తమమైన పద్దతి లేదు అని చెప్పవచ్చు. ఎటువంటి దుష్ప్రభావాల జోలికి వెళ్ళని ఆరోగ్యకర మార్గంగా సూచించబడుతుంది. కండోమ్ గర్భధారణను నివారించడానికి వినియోగించే సాధారణమైన పద్ధతిగా ఉండడమే కాకుండా, జంటను లైంగిక సంక్రమణ వ్యాధులు(STDs) మరియు ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది మరియు సురక్షితమైన లైంగిక సంభోగాన్ని ప్రోత్సహిస్తుంది. కండోమ్ వాడకం, మహిళల యోనిలోకి వీర్య కణాలను ప్రవేశించకుండా నిరోధిస్తుంది. క్రమంగా గర్భం రాకుండా అడ్డుకోగలుగుతుంది. ఏదిఏమైనా మిగిలిన అన్ని పద్దతుల కన్నా కండోం వాడకం శ్రేయస్కరం అని వైద్యులు సైతం సూచిస్తుంటారు. 

2. గర్భ నిరోధక మాత్రలు : నిజానికి ఈ గర్భ నిరోధక మాత్రలు, అండోత్సర్గ ప్రక్రియను ఆపి గర్భం రాకుండా నిరోధించగలుగుతాయి. ఈ మాత్రలు గర్భాశయంలో, గర్భవతికి సమానమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంటాయి. అనగా స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు అండం విడుదల కాని విధంగా. ఇటువంటి వాతావరణాన్ని గర్భాశయంలో సృష్టించడం ద్వారా, గర్భనిరోధక మాత్రలు గర్భం నివారించడంలో ప్రభావాన్ని కలిగి ఉంటాయి. గర్భనిరోధక మాత్రల వాడకం అనేకరకాల దుష్ప్రభావాలను కలుగజేస్తాయి. కావున వైద్యుని సూచనలు అవసరమని మరువకండి. మరియు దీర్ఘకాలికంగా వాడడం అనేక ఇతర తీవ్ర దుష్పరిమాణాలకు దారితీస్తుంది. ఈ దుష్ప్రభావాలలో కొన్ని, వికారం, తలనొప్పి, కడుపు ఉబ్బరం, తీవ్ర రక్తస్రావం, రొమ్ముల సున్నితత్వం, శరీరంలో నీరు చేరడం మొదలైనవిగా ఉంటాయి. ఈ మాత్రలు మహిళల హార్మోన్లను సైతం ప్రభావితం చేస్తాయి, మరియు హార్మోనుల అసమతుల్యానికి దారితీస్తుంది. కావున వారు తీసుకునే మందులు శరీరతత్వం మీద ఆధారపడి వైద్యులు ధృవీకరించవలసి ఉంటుందని గుర్తుంచుకోండి. 


3. గర్భ నిరోధక ఇంజెక్షన్ : ఇది మరొక ఉత్తమ గర్భ నిరోధక పద్ధతిగా చెప్పబడుతుంది. గర్భం నిరోధించడానికి హార్మోన్ షాట్లను మహిళలకు ఇస్తారు. గర్భ నిరోధక పద్దతులలో మాత్రల కన్నా, తక్కువ దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. ఈ షాట్స్ ప్రోజెస్టోజెన్ అని పిలువబడే హార్మోన్ను కలిగి ఉంటాయి. ఈ సూది మందులు ఎటువంటి ఈస్ట్రోజెన్ హార్మోనులను కలిగి లేనందున, మహిళలు ఎదుర్కొనే దుష్ప్రభావాల అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ ఇది వరకే హార్మోన్ సంబంధిత సమస్యలతో భాదపడుతున్న వారు మాత్రం వైద్యుని సూచనల ప్రకారం నడుచుకోవలసి ఉంటుంది. 


4. అంతర్గత గర్భాశయ పరికరాలు (IUD) : గర్భనిరోధక మాత్రలు మరియు ఇంజెక్షన్ రూపంలో కాకుండా, ఈ అంతర్గత గర్భాశయ పరికరాల వాడకం, హార్మోనులతో సంబంధంలేని సురక్షిత మార్గంగా చెప్పబడుతుంది కూడా. IUD అనేది ప్రాథమికంగా ఒక T - ఆకారపు పరికరంగా ఉంటుంది. ఇది ప్రత్యేకంగా శిక్షణ పొందిన వైద్యుల ద్వారా మాత్రమే గర్భాశయంలోకి చొప్పించబడుతుంది. ఇది 5 నుండి 10 సంవత్సరాల వరకు గర్భాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. మరియు అత్యంత సమర్థవంతమైన జనన నియంత్రణ పద్ధతిగా కూడా చెప్పబడింది. అయినా కూడా కొన్ని ప్రతికూల ప్రభావాల కారణంగా ప్రజలు దీనిపట్ల ఆసక్తిని కనపరచడం లేదు. ఈ పరికరంతో కూడా కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. పరికరం గర్భాశయంలోకి చొచ్చుకుని పోవడం, లేదా మీ శరీరంలో కొన్ని ప్రతికూల లక్షణాలను ప్రేరేపించడం వంటివి. క్రమంగా శస్త్రచికిత్స ద్వారా దీనిని తొలగించాల్సిన అవసరం ఉంటుంది.


 5. వెజైనల్ (యోని) రింగ్ : ఇది హార్మోన్స్ నిండిన రింగ్ వలె ఉంటుంది. ఇది గర్భ నిరోధకంగానే కాకుండా, మహిళలకు ఇతర దుష్ప్రభావాలు లేకుండా రక్షణ అందించేదిగా కూడా ఉంటుంది. ఈ రింగ్ మహిళ యొక్క యోనిలోకి మానవీయంగా చొప్పించాల్సిన అవసరం ఉంటుంది. కేవలం ఈ కారణం చేత అనేకమంది మహిళలు, ఈ పద్ధతి పట్ల అసౌకర్యానికి గురవుతుంటారు. గర్భ నిరోధక మాత్రలు ఉపయోగించినప్పుడు, అవి కాలేయం ద్వారా ప్రేగులలోనికి శోషించబడి, ఆ తర్వాత గర్భ నిరోధకంగా పనిచేస్తాయి. కానీ ఒక వెజైనల్ రింగ్ ఉపయోగించినప్పుడు, నేరుగా రక్త ప్రవాహంలోకి శోషించబడతాయి. క్రమంగా గర్భ నిరోధక మాత్రలు, ఇంజెక్షన్లతో పోల్చినప్పుడు హార్మోన్ అసమతుల్యత అనేది తక్కువగా ఉంటుంది. ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను తెలపండి  


భగత్ సింగ్ పుట్టినరోజు ఈరోజు

భరతమాత ముద్దుబిడ్డ జోహార్!!

ఇలాటి వీరుల బలిదానం వలన వచ్చిన స్వాతంత్రాన్ని అనుభవిస్తున్న మనం

కనీసంగా తలచుకోవలసిన రోజు-

ఒక పాట ఈ సందర్భంగా విందాం..

https://youtu.be/zkpm3pc585I


భగత్ సింగ్ జీవితచరిత్ర,స్వాతంత్ర సంగ్రామంలో అతని పాత్ర గురించిన విశేషాలు -(వికీపీడియానుండి)

భగత్ సింగ్ పంజాబ్‌లోని లాయల్‌‌పూర్ జిల్లా, బంగా సమీపంలోని ఖత్కర్ కలాన్ గ్రామంలో సర్దార్ కిషన్ సింగ్ మరియు విద్యావతి దంపతులకు పుట్టిన సంధు ఝాట్ కుటుంబీకుడు.భగత్ అనే పదానికి "భక్తుడు" అని అర్థం. సింగ్‌ యొక్క దేశభక్త సిక్కు కుటుంబంలోని కొందరు భారత స్వాతంత్ర్యోద్యమాల్లోనూ మరికొందరు మహారాజా రంజిత్ సింగ్ సైన్యంలోనూ పనిచేశారు భగత్ సింగ్ మూడేళ్ళ పిల్లాడిగా ఉన్నప్పుడు అతని తండ్రి కిషన్ సింగ్ భగత్ సింగ్‌ను చంకకెత్తుకొని, తన స్నేహితుడు నందకిశోర్ మెహతాతో పాటు కొత్తగా వేస్తున్న తోటను చూడ్డానికి పొలాల్లోకి వెళ్ళాడు. వెంటనే కిందికి దిగిన భగత్ సింగ్ ఆ మట్టిలో ఆడుకుంటూనే చిన్న చిన్న గడ్డిపరకలను నాటడం మొదలు పెట్టాడు. తండ్రి " ఏం చేస్తున్నావ్ నాన్నా" అని ప్రశ్నిస్తే, భగత్ సింగ్ ఇచ్చిన జవాబు విని వాళ్ళు అవాక్కయ్యారు. భగత్ సింగ్ అన్న మాటలివి " తుపాకులు నాటుతున్నా". భవిష్యత్తుకు బాల్యమే మొలక. మొలకలు వేసే వయస్సులో తుపాకులను మొలకెత్తించాలని చూడడం అతని వ్యక్తిత్వానికి మచ్చుతునక. విద్యార్థి దశలో స్కూల్లో కూడా ఆటపాటల్లోనే కాదు అందరితో కలివిడిగా ఉండేవాడు భగత్ సింగ్. బాబాయి సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ విదేశాల్లో ఉంటున్న సమయంలో, కంట నీరు పెట్టుకొనే చిన్నమ్మ హర్నామ్ కౌర్ ను చూసి నాలుగేళ్ళ భగత్ సింగ్ " పిన్నీ ఏడవొద్దు. నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటా" అని ప్రతిజ్ఞలు చేసేవాడు. స్వామి దయానంద సరస్వతి అనుచరుడైన సింగ్ తాత అర్జున్ సింగ్ హిందూ సంస్కరణ ఉద్యమం, ఆర్యసమాజ్‌లో భాగం కావడం కూడా ఆయనపై విపరీతమైన ప్రభావం పడేందుకు దోహదపడింది. ఆయన పినతండ్రులు అజిత్ సింగ్, స్వరణ్ సింగ్ తండ్రులు కర్తార్ సింగ్ సారభా గ్రివాల్ మరియు హర్ దయాల్ నేతృత్వంలోని గద్దర్ పార్టీ సభ్యులే. తనపై ఉన్న అపరిష్కృత కేసుల కారణంగా అజిత్ సింగ్ పెర్సియాకు పారిపోగా, కకోరి రైలు దోపిడీ 1925లో హస్తముందంటూ స్వరణ్ సింగ్‌ను 19 డిసెంబరు 1927న ఉరితీశారు. బ్రిటీషు సంస్థల యెడల పాఠశాల అధికారులకు ఉన్న విధేయత ఆయన తాతకు నచ్చకపోవడంతో భగత్ తన వయస్సు సిక్కులు వలె లాహోర్‌లోని ఖల్సా ఉన్నత పాఠశాలకు హాజరు కాలేదు.బదులుగా ఆర్యసామాజిక పాఠశాల దయానంద్ ఆంగ్లో వేదిక్ ఉన్నత పాఠశాలలో భగత్‌ను ఆయన తండ్రి చేర్పించాడు 13 ఏళ్ల ప్రాయంలోనే మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమానికి సింగ్ ప్రభావితుడయ్యాడు. ఆ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురుతిరిగిన భగత్ ప్రభుత్వ పాఠశాల పుస్తకాలు మరియు బ్రిటీషు దిగుమతి దుస్తులను తగులబెట్టడం ద్వారా గాంధీ సిద్ధాంతాలను అనుసరించాడు. ఉత్తరప్రదేశ్‌లోని చౌరీ చౌరా గ్రామస్తులు పోలీసులను హింసాత్మకంగా హతమార్చిన నేపథ్యంలో  ఉద్యమాన్ని గాంధీ ఉపసంహరించుకున్నాడు. ఆయన అహింసావాదంపై అసంతృప్తి చెందిన సింగ్ యువ విప్లవోద్యమంలో చేరి, తెల్లదొరలకు వ్యతిరేకంగా హింసాత్మక ఉద్యమాన్ని ఉధృతం చేశాడు.


1923లో పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళన్ నిర్వహించిన వ్యాసరచనా పోటీలో భగత్ విజయం సాధించాడు. దాంతో పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళన్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ భీమ్ సేన్ విద్యాలంకార్ సహా పలువురు సభ్యుల దృష్టిని ఆకర్షించాడు. ఆ వయసులోనే ప్రముఖ పంజాబీ సాహిత్యాన్ని ఉటంకించడమే కాక పంజాబ్ సమస్యల ను ప్రస్తావించాడు. పంజాబీ రచయితలు మరియు సియోల్‌కోట్‌కు చెందిన తనకెంతో ఇష్టమైన కవి అల్లామా ఇక్బాల్ రాసిన పలు కవితలు, సాహిత్యాన్ని ఆయన పఠించాడు. యుక్త వయస్సులో ఉన్నప్పుడు భగత్ సింగ్ లాహోర్‌]లోని నేషనల్ కాలేజ్‌లో విధ్యనభ్యసించాడు. అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని ఆయన ఇల్లు విడిచి పారిపోయి నౌజవాన్ భారత్ సభ ("భారత యువ సంఘం")లో చేరాడు నౌజవాన్ భారత్ సభ ద్వారా భగత్ ఆయన సహ విప్లవకారులు యువత దృష్టిని ఆకర్షించారు. ప్రొఫెసర్ విద్యాలంకార్ విజ్ఞప్తి మేరకు అప్పట్లో రామ్‌ప్రసాద్ బిస్మిల్ మరియు అష్ఫాఖుల్లా ఖాన్ నాయకత్వం వహిస్తున్న హిందూస్తాన్ గణతంత్ర సంఘంలోనూ సింగ్ చేరాడు.కకోరి రైలు దోపిడీ గురించి ఆయనకు అవగాహన ఉందని భావించారు. ఆయన అమృత్‌సర్ నుంచి ప్రచురించబడిన ఉర్దూ మరియు పంజాబీ వార్తాపత్రికలలో వార్తలను వ్రాశాడు మరియు సరిదిద్దాడు.సెప్టెంబరు 1928లో దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది విప్లవకారులు కీర్తి కిసాన్ పార్టీ పేరుతో ఢిల్లీలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. దానికి భగత్ సింగ్ కార్యదర్శిగా వ్యవహరించాడు. అనంతరం సంఘం అధ్యక్షుడిగా భగత్ పలు విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టాడు. HRA ప్రధాన నాయకులను పట్టుకుని ఉరితీయబడిన కారణంగా ఆయన తన సహ విప్లవకారుడు సుఖ్‌దేవ్ థాపర్‌తో పాటు అనతికాలంలోనే ప్రత్యేక అధికారాన్ని చేజిక్కుంచుకోవడానికి కారణమైంది.


ఉరిశిక్ష ఖాయమన్న సంగతి తెలిసిన తర్వాతే కాదు అంతకు ముందు నుంచి కూడా కటకటాల వెనకాల భగత్ సింగ్ ఒక అధ్యయనశీలిగా కాలాన్ని గడిపాడు. రాజనీతి, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్ర విషయాలను ప్రబోధించే అనేక గ్రంథాలను ఆయన అధ్యయనం చేశాడు. పుస్తకం చదువుతూ మధ్యలో హఠాత్తుగా లేచి అటూ ఇటూ తిరుగుతూ, విప్లవకారుడు రాంప్రసాద్ భిస్మిల్ వ్రాసిన ఈ పాటను పాడేవాడు.


మేరా రంగ్ దే బసంతీ చోలా

ఇసీ రంగ్ మే రంగ్ కే శివానే, మాకా బంధన్ ఖోలా

మేరా రంగ్ దే బసంతీ చోలా

యహీ రంగ్ హల్దీ ఘాటీ మే, ఖుల్ కర్కే థా ఖేలా

నవ్ బసంత్ మే, భారత్ కే హిత్ వీరోంకా యహ్ మేలా

మేరా రంగ్ దే బసంతీ చోలా


గంభీరమైన గొంతుతో భగత్ సింగ్ పాడుతున్న ఈ పాటను విని జైలు వార్డర్లు కూడా ముగ్ధులయ్యేవారు.


సింగ్ అరెస్టు అనంతరం అసెంబ్లీ పేలుడుపై విచారణ నేపథ్యంలో J. P. సాండర్స్ హత్య వెనుక ఆయన హస్తంపై బ్రిటీష్ ప్రభుత్వం ఆరా తీసింది. హత్యకు సంబంధించి భగత్ సింగ్, రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్‌లపై అభియోగాలు మోపారు. భారత స్వాతంత్ర్యానికి తన గళాన్ని వినిపించుకునేందుకు కోర్టునే ఒక ప్రచార వేదికగా మలుచుకోవాలని భగత్ సింగ్ నిర్ణయించుకున్నాడు.హత్యా నేరాన్ని అంగీకరించిన ఆయన విచారణ సమయంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశాడు.[విచారణ సమయంలో HSRA సభ్యులు లేకుండా కేసు విచారణ కొనసాగించాలని ఆదేశించారు. తద్వారా సింగ్ తన భావాలను ఇక ఎప్పుడూ ప్రచారం చేయలేడనే ఆవేదనతో ఆయన మద్దతుదారులు తీవ్రంగా మండిపడ్డారు.


ఖైదీలు మరియు విచారణ ఖైదీల హక్కుల కోసం భగత్ సింగ్ మరియు ఇతర ఖైదీలు జైలులోనే నిరాహారదీక్ష చేపట్టారు. చట్టం ప్రకారం ఉత్తమ హక్కులు కల్పించాల్సిన భారత రాజకీయ ఖైదీల కంటే బ్రిటీష్ హంతకులు మరియు దొంగలకు ప్రాధాన్యత ఇవ్వడం దీక్షకు దారితీసింది. రాజకీయ ఖైదీలకు పౌష్టికాహారం, పుస్తకాలు, దినపత్రికల సదుపాయం, మంచి బట్టలు, టాయిలెట్ ఇతర దైనందిన సదుపాయాలు కల్పించడం వారి డిమాండ్లు. అలాగే కార్మిక లేదా హోదాకు తగని పనిచేసే విధంగా రాజకీయ ఖైదీలపై ఒత్తిడి తీసుకురాకూడదని సింగ్ డిమాండ్ చేశాడు] 63 రోజుల పాటు కొనసాగిన నిరాహారదీక్ష సింగ్ డిమాండ్లకు బ్రిటీష్ ప్రభుత్వం తలొగ్గడం ద్వారా ముగిసింది. తద్వారా ఆయనకు సాధారణ భారతీయుల్లో ఆదరణ పెరిగింది. దీక్షకు ముందు ఆయన ప్రాభవం ప్రధానంగా పంజాబ్ ప్రాంతం వరకే పరిమితమైంది


కేంద్ర శాసనసభపై బాంబు దాడి జరిగినప్పుడుఅక్కడున్న రాజకీయ నాయకుల్లో ఒకరైన మహ్మద్ అలీ జిన్నా లాహోర్ ఖైదీలకు బహిరంగంగానే తన సానుభూతి తెలిపాడు. నిరాహారదీక్షపై మాట్లాడుతూ "నిరాహారదీక్ష చేసే వ్యక్తిలో ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మతోనే తను ముందుకు సాగుతాడు. తన పోరాటానికి న్యాయం జరుగుతుందని విశ్వసిస్తాడు" అని వ్యాఖ్యానించాడు. సింగ్ చర్యలపై మాట్లాడుతూ, "ఏదేమైనప్పటికీ, వారిని ఎక్కువగా నిందించినా మరియు ఎక్కువగా చెప్పినా వారు తప్పుదోవ పడుతారు. తద్వారా ఏర్పడే పాలనా ధిక్కార వ్యవస్థను ప్రజలు చీదరిస్తారు" అని అన్నాడు.


డైరీని వ్రాసే అలవాటు ఉన్న భగత్ సింగ్‌ చివరకి 404 పుటలను నింపాడు. తాను సమర్థించే పలువురు ప్రముఖుల ఉల్లేఖనాలు మరియు వారి గొప్ప వాక్యాలకు సంబంధించి సింగ్ తన డైరీలో పలు సూచనలు చేశాడు. అందులో కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడ్రిచ్ ఏంజిల్స్ ఆలోచనలను ప్రముఖంగా ప్రస్తావించాడు] భగత్ సింగ్ డైరీలోని పలు వ్యాఖ్యలు ఆయన విశిష్టమైన దార్శనిక అవగాహనకు అద్దం పడుతాయి.["దేవుడిపై విశ్వాసం లేని అహంకారి అనిపించుకున్న సింగ్ మరణానికి ముందు కూడా నేను ఎందుకు నాస్తికుడయ్యాను?" అనే శీర్షికతో ఒక వ్యాసాన్ని రాశాడు

23 మార్చి 1931న భగత్ సింగ్‌తో పాటు ఆయన సహచరులు రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్‌లను లాహోర్‌లో ఉరితీశారు. సింగ్ ఉరిని వ్యతిరేకిస్తూ నిరసన చేపడుతున్న ఆయన మద్దతుదారులు ఆయన్ను ఆ క్షణమే షహీద్ లేదా అమరవీరుడుగా ప్రకటించారు] అప్పటి సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ V.N. స్మిత్ ప్రకారం, సింగ్‌ను ముందుగానే ఉరితీశారు:


సాధారణంగా ఉదయం 8 గంటలకు ఉరితీశారు. అయితే ఏమి జరిగిందో ప్రజలు తెలుసుకునే లోగానే ఆయన్ను ఉరితీయాలని నిర్ణయించారు...సుమారు రాత్రి 7 గంటల ప్రాంతంలో జైలు లోపల నుంచి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు వినిపించాయి. సింగ్‌ జీవితానికి చివరగా తెర దించబోతున్నారన్న విషయానికి అది సంకేతమయింది.[


సట్లెజ్ నది ఒడ్డున ఉన్న హుస్సేనివాలా వద్ద సింగ్‌‌ను దహనం చేశారు. భగత్ సింగ్ స్మారకచిహ్నం నేడు భారత స్వాతంత్ర్య సమరయోధులను గుర్తుకు తెస్తుంది.

భగత్ సింగ్ మరణం భారత స్వాతంత్ర్యోద్యమ కొనసాగింపుకు సాయపడేలా వేలాది మంది యువకుల్లో స్ఫూర్తిని నింపింది. ఆయన ఉరి అనంతరం ఉత్తర భారతాన పలు ప్రాంతాల్లో బ్రిటీష్ ప్రభుత్వమునకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి.

భగత్ సింగ్ మరణం ఊరికే వృథా కాలేదు, ఎందరో యువకులను భారత స్వాతంత్ర్యోద్యమము వైపుకు మరల్చింది. భగత్ సింగ్ ఉరి శిక్ష అమలు తరువాత ఉత్తర భారతదేశంలో ఎందరో యువకులు బ్రిటిషు ప్రభుత్వం మరియు గాంధీ కి విరుద్ధంగా ఆందోళనలు చేపట్టారు.

--(())--


భోగి, సంక్రాంతి, కనుమ : పండుగలు (1/2019)


సంక్రాంతి అభ్యుధయ కాముకులను కూడా సంప్రదాయం వైపు మళ్ళిస్తుంది. పండుగలు, పర్వాలు వచ్చినప్పుడల్లా అభ్యుదయ కవులు సైతం సంప్రదాయం వైపు మొగ్గుచూపుతారు. అసలు అదే ఈ పండుగల లక్ష్యంగా కనబడుతుంది. భోగి, సంక్రాంతి, కనుమ సంక్రాంతికి ముందే నెల పెట్టడం అని ముగ్గులు పెట్టడం, గొబ్బెమ్మలతో అలంకరించడం నెలరోజులపాటు సాగుతుంది. చివరి రోజున రధం ముగ్గును వేస్తారు. జానపదుల కళలు ఈ సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా బహిర్గతమవడమే కాకుండా ప్రదర్శింపబడతాయి. వీటిలో చెప్పుకోతగ్గది "గంగిరెద్దుల" ఆట. కొన్ని గ్రామాలలో ఐతే 'కోడి పందాల ఆట' కూడా ఆడుతారు. 


ఇంకా సంక్రాంతి ప్రత్యేకత శాస్త్రపరంగా చాలా ఉంది. నక్షత్రాల ఇరువది ఏడు. మళ్ళీ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. మొత్తం 108 పాదాలుగా విభజింపబడినాయి. తిరిగి 108 పాదాల్నీ 12 రాశులుగా విభాగించారు. సూర్యుడు నెలకొకరాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి ఆ సంక్రాంతిగా వ్యవహరింపబడుతుంది. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని 'మకర సంక్రాంతి' అని అంటారు 


హిందువులు అంతా పెద్దల నుండి పిన్నల వరకు అత్యంత ప్రీతిపాత్రంగా ఆచరించే పండుగలలో "సంక్రాంతి" ప్రముఖస్ధానం సంపాదించుకుంది. ఇది పుష్యమాసంలో సూర్యుడు "మకరరాశిలో" ప్రవేశించిన పుణ్యదినం. ముగ్గులు ఈ సంక్రాంతిలో "సం" అంటే మిక్కిలి "క్రాంతి" అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని "సంక్రాంతి" గా పెద్దలు వివరణ చెబుతూ "మకరం" అంటే! మొసలి. ఇది పట్టుకుంటే వదలదు అని మనకు తెలుసు. కాని మానవుని యొక్క ఆధ్యాత్మిక మార్గానికి అడుగడుగునా అడ్డుతగులుతూ, మొక్షమార్గానికి అనర్హుని చేయుటలో ఇది అందవేసినచేయి! అందువల్ల ఈ "మకర సంక్రమణం" పుణ్యదినాలలో దీని బారినుండి తప్పించుకునేందుకు ఒకటేమార్గం అది ఎవరికి వారు యధాశక్తి 'లేదు' అనకుండా దానధర్మాలు చేయుటయే మంచిదని, శాస్త్రకోవిదులు చెబుతూ ఉంటారు. అలా! కేవలం అప్పుడే కాకుండా! నిత్య జీవనంలో కూడా దాని బారిని పడకుండా చూచుకుంటూ ఉండాలికదా! మరి. ఇక ఈ పండుగల లోని విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. 


తెలుగువారికి అత్యంత ప్రియమైన పండుగలు, వరుసగా మూడు రోజులు వచ్చే పండుగలు ఇవే! ముఖ్యంగా 'సంక్రాంతి' అని పిలుచుకుంటాం. దీనిని పెద్ద పండుగ అని కూడా అంటారు. పుష్యమాసంలో వచ్చే ఈ పండుగకు ఇంటికి ధనధాన్య రాశులు చేరతాయి. పౌష్యలక్ష్మితో కళకళలాడే గృహ ప్రాంగణాలతో, ఇల్లిల్లూ ఒకకొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది. ఇంకా ఈ పండుగ వస్తుందంటే పిండి వంటలతో ముఖ్యంగా అరిసెలు, చక్రాలలతో అందరి ఇళ్ళు ఘుమ ఘుమ లాడుతూ ఉంటాయి. 


మొదటి రోజు 'భోగి'. మూల మూలల చెత్తా, పనికిరాని కర్ర దుంగలూ ఓచోట చేర్చి, భోగి మంటలు వేసి, ఎముకలు కొరికే చలిని తరిమి కొడతారు. ఇళ్ళలో బొమ్మల కొలువులు, చిన్న పిల్లలకి భోగి పళ్ళు దిష్టి తీయడం వంటి ఆచారాలు సంబరాన్ని తెస్తాయి. పంట చేతికొచ్చిన ఆనందలో ఇళ్ళకు అల్లుళ్ళని, కూతుళ్ళని ఆహ్వానిస్తారు.  


రెండో రోజు 'సంక్రాంతి'. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే శుభదినం. ఈ పండుగకు కొత్తశోభ తీసుకురావడానికి, వారం, పది రోజుల ముందే ఇళ్ళకు సున్నాలు, రంగులు వేయడం ఆనవాయితీ. చనిపోయిన పెద్దలను తలచుకుని మొక్కుతారు. పిండివంటలు చేస్తారు. నలుగురికీ పంచిపెట్టి, తాము తిని సంబరంగా గడుపుతారు. 


మూడో రోజు 'కనుమ'. దీన్నే పశువుల పండుగ అని అంటారు. తమ చేతికొచ్చిన పంటను తామేకాక, పశువులూ, పక్షులూ పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. పల్లెల్లో పశువులే గొప్పసంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. గొబ్బెమ్మల పూజ, గంగిరెద్దుల హడావుడి, హరిదాసుల రాకడ, కోడిపందాలు, ఎడ్లపందాలు, బంతిపూల తోరణాలు, కొత్త జంటల విహారాలు, ఎంతో ఆహ్లదకరంగా కనిపిస్తాయి. 


ఇంతటి విశిష్టమైన పండుగ వింతశోభలు తిలకించాలి అంటే గ్రామసీమలే పట్టుగొమ్మలు. ప్రతి ఇల్లు నూతనంగా ముత్యాల ముగ్గులతో పచ్చని తోరణాలతో, కళకళలాడుతూ! "సంక్రాంతి" లక్ష్మీని ఆహ్వానిస్తూ ఉంటాయి. ఇక ధనుర్మాసము ప్రారంభమైన నాటినుండి వివిధ ఆలయాలలోని అర్చకస్వాములు "సంక్రాంతి" నెలపట్టి సూర్యోదయానికి పూర్వమే మంగళవాయిద్యాలతో నదీజలాలను "తీర్ధంబిందులలో" తోడ్కొని వచ్చి విశేషార్చనలు నిర్వహిస్తారు. ఇంటిముందు కన్నెపిల్లలు కళ్ళాపులు చల్లుతూ! ప్రతిరొజు వివిధ రకాల ముగ్గులతో! సప్తవర్ణాల రంగవల్లికలను తీర్చిదిద్ది "ఇంద్రధనుస్సులను" ముంగిట చూస్తున్నట్లు భ్రమింపచేస్తారు. 


ఇంత చక్కని ఆనందాన్నీ మనకు అందించే "సంక్రాంతి" పండుగలు మనం జరుపుకుని మహారాణిలావచ్చే ఆ సంక్రాంతి లక్ష్మీని మన ముంగిటలోనికి ఆహ్వానం పలుకుదాం.



ఒక్కండేమియు చేయలేను, 

నిజమారోపించి ధైర్యంబుగా

నొక్కాణించితినంతె కాని,

మనముల్ నొప్పించ కాదెంతయున్!

29 జనవరి 

“హికీ బెంగాలీ గెజిట్” లేదా “ కలకత్తా జెనరల్ అడ్వెర్టైసర్” పేరుతో 1790 సం>లో కలకత్తానుండి వెలువడ్డ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున జాతీయ వార్తాపత్రిక దినోత్సవంగా జరుపుకుంటారు. . 


30 జనవరి 

మహాత్ముడు మరణించిన తేదీయైన 30 జనవరియే కాకుండా పలువురు స్వాతంత్ర్య వీరుల మరణతేదీలనుకూడా అమరులదినోత్సవంగాలుగా వ్యవహరిస్తుండంటంవల్ల ఏర్పడే గందరగోళాన్ని నివారించడానికి గత సంవత్సరం ప్రధాని మోడీ జనవరి 30 వ తేదీని సర్వోదయ దివస్ గా ప్రకటించాడు. సర్వోదయ దివస్‌ను జాతీయ అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటాము. పాఠశాలు, కార్యాలయాలలో ఉదయం 11 గం. విజిల్ లేదా ఒక బడిగంట శబ్దం నుండి అమరుల ఆత్మకు శాంతిగా 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. 


మహాత్ముని స్మృతికి నివాళిగా జనవరి 30వ తేదీని జాతీయ పరిశుభ్రత దినోత్సవంగా నిర్వహిస్తారు. 


తెలంగాణా సమరయోధుడు, ఖమ్మం జిల్లాకుచెందిన రావెళ్ల వెంకటరామారావు జయంతి (1927). ఈయన రాసిన తల్లి తెలంగాణా గేయం 1950దశకాలలో బహుళ ప్రాచుర్యం . మలి తెలంగాణా ఉద్యమంలో దేశపతి శ్రీనివాస్ గాత్రంతో ఉద్యమ కారులను ఉర్రూతలూగించింది. రావెళ్ళ ‘జయశ్రీ’ కలంపేరుతో రాగజ్యోతులు, జీవన రాగం, చితన్య స్రవంతి, పల్లె భారతి అనే పుస్తకాలు రాశారు. 


మరిన్ని వివరాలతో మళ్ళి కలుద్దాం. 


22 జనవరి ఆంధ్రపితామహ మాడపాటి హన్మంతరావు జయంతి (1885) 

జన్మస్థలం కృష్ణా జిల్లాయైనప్పటికీ మాడపాటి హన్మంతరావు ప్రజాకార్య క్షేత్రం నాటి హైద్రాబాద్ రాజ్యం (నేటి తెలంగాణా రాష్ట్రం). ఆయన బహుముఖ ప్రతిభాశాలియే గాక బహుముఖ ప్రజ్ఞాశాలి. తనకున్న బహుముఖ సామర్ధ్యాలను స్వార్జితంకోసం కాకుండా తాను జీవిస్తున్న, తనకు జీవితాన్నిచ్చిన ప్రాంత ప్రజల సంక్షేమంకోసం, ఆ ప్రజల ప్రజల వికాసం కోసం ఉపయోగించిన మహానుభావుడు. 

నల్గొండజిల్లా సూర్యాపేటలోను, వరంగల్‌లోనూ విద్యను పూర్తిచేసుకున్న తర్వాత వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం‌లో ఎనిమిది సం.ల పాటు గుమాస్తాగా పనిచేశారు. ప్రజాసేవపట్ల ఆపేక్షగల మాడపాటికి ప్రభుత్వోద్యోగం బంధాలు వేసింది. నిజాం ప్రభుత్వం‌లో అనువాదకునిగా ఉద్యొగం వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని 5సం. ల కాలం‌లో న్యాయ విద్యను పూర్తిచేసి న్యాయవాద వృత్తిని అవిశ్రాంతంగా పాతిక సం. కొనసాగింఛాడు. 

రాజకీయాలు: 

హైద్రాబాద్ రాజ్యం‌లోని తెలుగుమాట్లాడేవారి వేదికగా ఆంధ్రజనసంఘాన్ని మాడపాటి 1921లో వ్యవస్థాపక కార్యదర్శిగా ప్రారంభించాడు. శాఖోపశాఖలను తెలంగాణా వ్యాప్తంగా విస్తరింపజేశాడు. ఈసంఘం 1930 నాటికి నిజాం రాజ్య ఆంధ్ర మహాసభగా రూపుదిద్దుకొన్నది. తెలంగాణా సాయుధపోరాటంగా రూపుదిద్దుకొనే దశలో మాడపాతి మితవాదిగానే మిగిలిపోయినప్పటికీ రావి నారాయణరెడ్డి ఆయన కృషిని ప్రస్తావిస్తూ "తెలంగాణాలో తెలుగుభాషకు ఒక గౌరవస్థానాన్ని కలిగించి, తెలుగువారికి తెలుగుభాషను నేర్పిన ఘనత కూడా వారిదే. నాతోటి యువకులెందరో ఆయన వల్ల ప్రాభావితులై ఆంధ్ర వాఙ్మయంతో పరిచయం ఏర్పరుచుకున్నారు. నాలాగే ఇంకెందరినో ప్రభావితులను చేసిన పంతులుగారికి ఆంధ్ర పితామహుడన్న బిరుదు ఆయన పట్ల సార్థకతను సంతరించుకుంది." 

మాడపాటి హైద్రాబాదు నగరపాలక సంస్థకు తొలి మేయరుగానూ, ఆం.ప్ర. శాసన మండలికి అధ్యక్షునిగానూ సేవలందించారు 

గ్రంథాలయోద్యమం: 

మాడపాటి గ్రంథాలయోద్యమంలోనూ ఇతోధిక కృషి చేశారు. తనకు సన్మానం ద్వారా లభించిన సొమ్మును కూడా గ్రంథాలయాల అభివృద్ధికే అందజేశారు. రావిచెట్టు రంగారావు, కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు తదితరులతో ప్రారంభమైన నిజాం పాలిత తెలుగు ప్రాంతంలోని తొలి తెలుగు గ్రంథాలయం . చారిత్రిక ప్రశస్తినొందిన శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం (హైదరాబాద్‌) , హన్మకొండలోని రాజరాజనరేంద్ర ఆంధ్ర భాషానిలయంల అభివృద్ధికి కార్యవర్గ సభ్యుడుగానూ, కార్యదర్శిగానూ సేవలందించారు.గ్రంథాలయాల ద్వారానే రాజకీయ చైతన్యాన్ని వ్యాప్తిచేయాలన్న దృక్పథంతో సాగిన ఆయన ప్రయత్నం సత్ఫలితాలనిచ్చింది. 

విద్యారంగం: 

విద్యారంగానికికూడా ఆయన తన సేవలను విస్తరించారు. వరంగల్ వాస్తవ్యులు అభ్యుదయవాదీయైన వడ్లకొండ నరసింహా రావు తోడ్పాటుతో దేశం‌లోనే తొలి బాలికల పాఠశాలలో ఒకటైన మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాల హైదరాబాదులోని నారాయణగూడలో స్థాపించాడు. అనేక బాలికల పాఠశాలల తోడ్పాటునందింఛారు. ఆయన పేర ఈనాటికీ హైదరాబాద్ నారాయణగూడలో ఈ పాఠశాల దాదాపు 3000మంది విద్యార్ధులతొ కొనసాగుతున్నది. 

సాహితీ సేవ 

మాడపాటి హనుమంతరావు బహుభాషావేత్త. ఆయన రాసిన పదమూడు కథలు 'మల్లికాగుచ్చం' పేరుతో 1911 లో పుస్తకరూపం‌లో ప్రచురించారు. అవి హృదయశల్యం, రాణీసారందా, ముసలిదాని ఉసురు, నేనే, అగ్ని గుండం, నాడు నీ పంతం- నేడు నా పంతం, ఆత్మార్పణం, తప్పు , ఎవరికి, విధి ప్రేరణం అనే కథలు, రచయితగా శాశ్వత కీర్తిని తీసుకొచ్చిన గ్రంథం 'తెలంగాణా ఆంధ్రోద్యమం'. తెలంగాణా రైతాంగ జీవితంపై 1912లో తొలి కథానిక ‘ఎవరికి? పలువురి ప్రశంసలు పొందింది. పాత్రికేయునిగా కూడా ఆయన తనసేవలనందించారు. 

పురుషులందు పుణ్య పురుషులు వేరయాయన్న రీతిన నేడు నిత్యం తెలుగు సెంటిమెంటునుచ్చరించే సీమాంధ్ర వ్యాపారవేత్తలకు మాడపాటి, ఆయన తరంవారు భిన్నం. 

వారు తెలంగాణా ప్రజలకు చిరస్మరణీయులు.

 శుభోదయం..


ఒక్కండేమియు చేయలేను, 

నిజమారోపించి ధైర్యంబుగా

నొక్కాణించితినంతె కాని,

మనముల్ నొప్పించ కాదెంతయున్!

29 జనవరి 

“హికీ బెంగాలీ గెజిట్” లేదా “ కలకత్తా జెనరల్ అడ్వెర్టైసర్” పేరుతో 1790 సం>లో కలకత్తానుండి వెలువడ్డ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున జాతీయ వార్తాపత్రిక దినోత్సవంగా జరుపుకుంటారు. . 

30 జనవరి 

మహాత్ముడు మరణించిన తేదీయైన 30 జనవరియే కాకుండా పలువురు స్వాతంత్ర్య వీరుల మరణతేదీలనుకూడా అమరులదినోత్సవంగాలుగా వ్యవహరిస్తుండంటంవల్ల ఏర్పడే గందరగోళాన్ని నివారించడానికి గత సంవత్సరం ప్రధాని మోడీ జనవరి 30 వ తేదీని సర్వోదయ దివస్ గా ప్రకటించాడు. సర్వోదయ దివస్‌ను జాతీయ అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటాము. పాఠశాలు, కార్యాలయాలలో ఉదయం 11 గం. విజిల్ లేదా ఒక బడిగంట శబ్దం నుండి అమరుల ఆత్మకు శాంతిగా 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. 

మహాత్ముని స్మృతికి నివాళిగా జనవరి 30వ తేదీని జాతీయ పరిశుభ్రత దినోత్సవంగా నిర్వహిస్తారు. 

తెలంగాణా సమరయోధుడు, ఖమ్మం జిల్లాకుచెందిన రావెళ్ల వెంకటరామారావు జయంతి (1927). ఈయన రాసిన తల్లి తెలంగాణా గేయం 1950దశకాలలో బహుళ ప్రాచుర్యం . మలి తెలంగాణా ఉద్యమంలో దేశపతి శ్రీనివాస్ గాత్రంతో ఉద్యమ కారులను ఉర్రూతలూగించింది. రావెళ్ళ ‘జయశ్రీ’ కలంపేరుతో రాగజ్యోతులు, జీవన రాగం, చితన్య స్రవంతి, పల్లె భారతి అనే పుస్తకాలు రాశారు. 

మరిన్ని వివరాలతో మళ్ళి కలుద్దాం. 


22 జనవరి ఆంధ్రపితామహ మాడపాటి హన్మంతరావు జయంతి (1885) 

జన్మస్థలం కృష్ణా జిల్లాయైనప్పటికీ మాడపాటి హన్మంతరావు ప్రజాకార్య క్షేత్రం నాటి హైద్రాబాద్ రాజ్యం (నేటి తెలంగాణా రాష్ట్రం). ఆయన బహుముఖ ప్రతిభాశాలియే గాక బహుముఖ ప్రజ్ఞాశాలి. తనకున్న బహుముఖ సామర్ధ్యాలను స్వార్జితంకోసం కాకుండా తాను జీవిస్తున్న, తనకు జీవితాన్నిచ్చిన ప్రాంత ప్రజల సంక్షేమంకోసం, ఆ ప్రజల ప్రజల వికాసం కోసం ఉపయోగించిన మహానుభావుడు. 

నల్గొండజిల్లా సూర్యాపేటలోను, వరంగల్‌లోనూ విద్యను పూర్తిచేసుకున్న తర్వాత వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం‌లో ఎనిమిది సం.ల పాటు గుమాస్తాగా పనిచేశారు. ప్రజాసేవపట్ల ఆపేక్షగల మాడపాటికి ప్రభుత్వోద్యోగం బంధాలు వేసింది. నిజాం ప్రభుత్వం‌లో అనువాదకునిగా ఉద్యొగం వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని 5సం. ల కాలం‌లో న్యాయ విద్యను పూర్తిచేసి న్యాయవాద వృత్తిని అవిశ్రాంతంగా పాతిక సం. కొనసాగింఛాడు. 

రాజకీయాలు: 

హైద్రాబాద్ రాజ్యం‌లోని తెలుగుమాట్లాడేవారి వేదికగా ఆంధ్రజనసంఘాన్ని మాడపాటి 1921లో వ్యవస్థాపక కార్యదర్శిగా ప్రారంభించాడు. శాఖోపశాఖలను తెలంగాణా వ్యాప్తంగా విస్తరింపజేశాడు. ఈసంఘం 1930 నాటికి నిజాం రాజ్య ఆంధ్ర మహాసభగా రూపుదిద్దుకొన్నది. తెలంగాణా సాయుధపోరాటంగా రూపుదిద్దుకొనే దశలో మాడపాతి మితవాదిగానే మిగిలిపోయినప్పటికీ రావి నారాయణరెడ్డి ఆయన కృషిని ప్రస్తావిస్తూ "తెలంగాణాలో తెలుగుభాషకు ఒక గౌరవస్థానాన్ని కలిగించి, తెలుగువారికి తెలుగుభాషను నేర్పిన ఘనత కూడా వారిదే. నాతోటి యువకులెందరో ఆయన వల్ల ప్రాభావితులై ఆంధ్ర వాఙ్మయంతో పరిచయం ఏర్పరుచుకున్నారు. నాలాగే ఇంకెందరినో ప్రభావితులను చేసిన పంతులుగారికి ఆంధ్ర పితామహుడన్న బిరుదు ఆయన పట్ల సార్థకతను సంతరించుకుంది." 

మాడపాటి హైద్రాబాదు నగరపాలక సంస్థకు తొలి మేయరుగానూ, ఆం.ప్ర. శాసన మండలికి అధ్యక్షునిగానూ సేవలందించారు 

గ్రంథాలయోద్యమం: 

మాడపాటి గ్రంథాలయోద్యమంలోనూ ఇతోధిక కృషి చేశారు. తనకు సన్మానం ద్వారా లభించిన సొమ్మును కూడా గ్రంథాలయాల అభివృద్ధికే అందజేశారు. రావిచెట్టు రంగారావు, కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు తదితరులతో ప్రారంభమైన నిజాం పాలిత తెలుగు ప్రాంతంలోని తొలి తెలుగు గ్రంథాలయం . చారిత్రిక ప్రశస్తినొందిన శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం (హైదరాబాద్‌) , హన్మకొండలోని రాజరాజనరేంద్ర ఆంధ్ర భాషానిలయంల అభివృద్ధికి కార్యవర్గ సభ్యుడుగానూ, కార్యదర్శిగానూ సేవలందించారు.గ్రంథాలయాల ద్వారానే రాజకీయ చైతన్యాన్ని వ్యాప్తిచేయాలన్న దృక్పథంతో సాగిన ఆయన ప్రయత్నం సత్ఫలితాలనిచ్చింది. 

విద్యారంగం: 

విద్యారంగానికికూడా ఆయన తన సేవలను విస్తరించారు. వరంగల్ వాస్తవ్యులు అభ్యుదయవాదీయైన వడ్లకొండ నరసింహా రావు తోడ్పాటుతో దేశం‌లోనే తొలి బాలికల పాఠశాలలో ఒకటైన మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాల హైదరాబాదులోని నారాయణగూడలో స్థాపించాడు. అనేక బాలికల పాఠశాలల తోడ్పాటునందింఛారు. ఆయన పేర ఈనాటికీ హైదరాబాద్ నారాయణగూడలో ఈ పాఠశాల దాదాపు 3000మంది విద్యార్ధులతొ కొనసాగుతున్నది. 

సాహితీ సేవ 

మాడపాటి హనుమంతరావు బహుభాషావేత్త. ఆయన రాసిన పదమూడు కథలు 'మల్లికాగుచ్చం' పేరుతో 1911 లో పుస్తకరూపం‌లో ప్రచురించారు. అవి హృదయశల్యం, రాణీసారందా, ముసలిదాని ఉసురు, నేనే, అగ్ని గుండం, నాడు నీ పంతం- నేడు నా పంతం, ఆత్మార్పణం, తప్పు , ఎవరికి, విధి ప్రేరణం అనే కథలు, రచయితగా శాశ్వత కీర్తిని తీసుకొచ్చిన గ్రంథం 'తెలంగాణా ఆంధ్రోద్యమం'. తెలంగాణా రైతాంగ జీవితంపై 1912లో తొలి కథానిక ‘ఎవరికి? పలువురి ప్రశంసలు పొందింది. పాత్రికేయునిగా కూడా ఆయన తనసేవలనందించారు. 

పురుషులందు పుణ్య పురుషులు వేరయాయన్న రీతిన నేడు నిత్యం తెలుగు సెంటిమెంటునుచ్చరించే సీమాంధ్ర వ్యాపారవేత్తలకు మాడపాటి, ఆయన తరంవారు భిన్నం. 

వారు తెలంగాణా ప్రజలకు చిరస్మరణీయులు.

--(())-- 


ప్రాంజలి ప్రభ .. ప్రతిరోజూ స్తోత్రం (1 to 10)

sekaana Mallapragada Dramakrishna 

001.... *శ్రీ సూర్య నారాయణ దండకం*


🕉ఓంశ్రీమాత్రేనమః🕉

శ్రీసూర్య నారాయణా వేదపారయణా లోకరక్షామణి దైవచూడమణీ!!
ఆత్మరక్షా నమః: పాపశిక్షా నమోవిశ్వకర్తా నమో విశ్వభర్తా
నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథాధినాథా
మహాభూతభేదంబులున్ నీవయై బ్రోచు మెల్లపుడున్ భాస్కరాహస్కరా!!


పద్మినీ వల్లభ వల్లకీ గానలోలా త్రిమూర్తి స్వరూపా విరూపాక్షనేత్రా
మహాదివ్యగాత్రా అచింత్యావతారా నిరాకార ధీరా పరాకయ్యయోయయ్య
దుర్థాంత నిర్థూత తాపత్రయా భీలదావాగ్ని రుద్రా తనూద్భూత నిస్సార
గంభీర సంభావితానేక కామాద్య నీకంబులన్ దాకి
ఏకాకినై చిక్కి ఏదిక్కులుం గానగాలేక యున్నాడ నీవాడనో తండ్రి!!

జేగీయమానా కటాక్షంబులన్ నన్ కృపాదృష్టి వీక్షించి రక్షించు
వేగన్ మునీంద్రాది వంద్యా జగన్నేత్రమూర్తీ ప్రచండస్వరూపుండవై యుండి చండాంశు
సారథ్యమన్ గొంటి నాకుంటి నశ్వంబులేడింటి చక్రంబులున్ దాల్చి ద్రోలంగ
మార్తాండరూపుండవై చెండవా రాక్షసాధీశులన్ గాంచి
కర్మానుసారాగ్ర దోషంబులన్ దృంచి కీర్తి ప్రతాపంబులన్ మించి
నీదాసులన్ గాంచి యిష్టార్ధముల్ కూర్తువో!!

దృష్టి వేల్పా మహా పాప కర్మాలకున్నాలయంబైన యీ దేహభారంబభారంబుగానీక
శూరోత్తమా యొప్పులందప్పులున్ నేరముల్ మాని పాలింపవే పట్టి నీకీర్తి కీర్తింప
నేనేర్తునా ద్వాదశాత్మా దయాళుత్వమున్ తత్వమున్ జూపి నాయాత్మ
భేదంబులన్ బాపి పోషింప నీవంతు నిన్నున్ ప్రశంసింప నావంతు
ఆ శేషభాషాధిపుల్ గానగాలేరు నీదివ్య రూప ప్రభావంబు గానంగ నేనెంత
నెల్లప్పుడున్ స్వల్పజీవుండ నౌదున్ మహా కష్టుడన్ నిష్టయున్లేదు
నీపాద పద్మంబులే సాక్షి దుశ్చింతలన్ బాపి నిశ్చింతుగన్ జేయవే కామితార్ధప్రదా!!

శ్రీ మహాదైవరాయ పరావస్తులైనట్టి మూడక్షరాలన్
స్వరూపంబు నీ దండకంబిమ్మహిన్ రాయ కీర్తించి
విన్నన్ మహాజన్మజన్మాంతర వ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్ధముల్
కొంగుబంగారు తంగేడు జున్నై ఫలించున్ మహా దేవ దేవా
నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః !!

--(())--

002...*శ్రీ హనుమదష్టకం*

ఓంశ్రీమాత్రే నమః

*హనుమదష్టకం అచ్యుత యతి కృతం*

*శ్రీరఘురాజపదాబ్జనికేతన పఙ్కజలోచన మఙ్గలరాశే|*

*చణ్డమహాభుజదణ్డసురారివిఖణ్డనపణ్డిత పాహి దయాలో ।*

*పాతకినం చ సముద్ధర మాం మహతాం హి సతామపి మానముదారం|*

*త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదామ్బుజదాస్యమ్ ॥*


*2) సంసృతి తాప మహానలదగ్ధతనూరుహమర్మతనోరతివేలం|*

*పుత్రధనస్వజనాత్మగృహాదిషు సక్తమతే రతికిల్బిషమూర్తేః ।*

*కేనచిదప్యమలేన పురాకృతపుణ్యసుపుఞ్జలవేన విభో వై|*

*త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదామ్బుజదాస్యమ్ ॥*


*3) సంసృతి కూప మనల్పమఘోరనిదాఘనిదానమజస్రమశేషం|*

*ప్రాప్య సుదుఃఖ సహస్రభుజఙ్గవిషైకసమాకులసర్వతనోర్మే ।*

*ఘోరమహాకృపణాపదమేవ గతస్య హరే పతితస్య భవాబ్ధౌ|*

*త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదామ్బుజదాస్యమ్ ॥*


*4) సంసృతిసిన్ధు విశాలకరాలమహాబలకాలఝషగ్రసనార్తం|*

*వ్యగ్రసమగ్రధియం కృపణం చ మహామదనక్రసుచక్రహృతాసుమ్ ।*

*కాలమహారసనోర్మినిపీడితముద్ధర దీన మనన్యగతిం మాం|*

*త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్స్వపదామ్బుజదాస్యమ్ ॥*


*5) సంసృతిఘోర మహాగహనే చరతో మణిరఞ్జితపుణ్యసుమూర్తేః*

*మన్మథభీకరఘోరమహోగ్రమృగప్రవరార్దితగాత్రసుసన్ధేః ।*

*మత్సరతాపవిశేషనిపీడితబాహ్యమతేశ్చ కథఞ్చిదమేయం|*

*త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్స్వపదామ్బుజదాస్యమ్ ॥*


*6) సంసృతివృక్ష మనేకశతాఘనిదానమనన్తవికర్మసుశాఖం|*

*దుఃఖఫలం కరణాదిపలాశమనఙ్గసుపుష్పమచిన్త్యసుమూలమ్ ।*

*తం హ్యధిరుహ్య హరే పతితం శరణాగతమేవ విమోచయ మూఢం|*

*త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్స్వపదామ్బుజదాస్యమ్ ॥*


*7) సంసృతిపన్నగ వక్త్రభయఙ్కరదంష్ట్రమహావిషదగ్ధశరీరం|*

*ప్రాణవినిర్గమభీతిసమాకులమన్దమనాథమతీవ విషణ్ణమ్ ।*

*మోహమహాకుహరే పతితం దయయోద్ధర మామజితేన్ద్రియకామం|*

*త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదామ్బుజదాస్యమ్ ॥*

*8) ఇన్ద్రియనామ కచౌరగణైర్హృతతత్త్వవివేకమహాధనరాశిం|*

*సంసృతిజాలనిపాతితమేవ మహాబలిభిశ్చ విఖణ్డితకాయమ్ ।*

*త్వత్పదపద్మమనుత్తమమాశ్రితమాశు కపీశ్వర పాహి కృపాలో|*

*త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్స్వపదామ్బుజదాస్యమ్ ॥*

*9) బ్రహ్మమరుద్గణ రుద్రమహేన్ద్రకిరీటసుకోటిలసత్పదపీఠం|*

*దాశరథిం జపతి క్షితిమణ్డల ఏష నిధాయ సదైవ హృదబ్జే ।*

*తస్య హనూమత ఏవ శివఙ్కరమష్టకమేతదనిష్టహరం వై|*

*యః సతతం హి పఠేత్స నరో లభతేఽచ్యుతరామపదాబ్జనివాసమ్ ॥*

*ఇతి శ్రీ అచ్యుత యతి కృతం శ్రీ హనుమదష్టకం సమ్పూర్ణమ్ ||*

--(())--

*శ్రీ హనుమత్ కవచమ్*

ఓంశ్రీమాత్రే నమః


03....*శ్రీమదానన్దరామాయణాన్తర్గత శ్రీ హనుమత్ కవచం*

*ఓం శ్రీ హనుమతే నమః!!*

*ఓం అస్య శ్రీ హనుమత్కవచ స్తోత్ర మహామన్త్రస్య| శ్రీ రామచన్ద్ర ఋషిః | శ్రీ హనుమాన్ పరమాత్మా దేవతా | అనుష్టుప్ ఛన్దః | మారుతాత్మజేతి బీజం | అఞ్జనీసూనురితి శక్తిః | లక్ష్మణప్రాణదాతేతి కీలకం | రామదూతాయేత్యస్త్రం | హనుమాన్ దేవతా ఇతి కవచం | పిఙ్గాక్షోమిత విక్రమ ఇతి మన్త్రః | శ్రీరామచన్ద్ర ప్రేరణయా రామచన్ద్ర ప్రీత్యర్థం మమ సకల కామనా సిద్ధ్యర్థం  జపే వినియోగః ||*

*కరన్యాసః:-*

*ఓం హాం అఞ్జనీసుతాయ అఙ్గుష్ఠాభ్యాం నమః | ఓం హీం రుద్ర మూర్తయే తర్జనీభ్యాం నమః |ఓం హూం రామదూతాయ మధ్యమాభ్యాం నమః | ఓం హైం వాయుపుత్రాయ  అనామికాభ్యాం నమః | ఓం హౌం అగ్నిగర్భాయ కనిష్ఠికాభ్యాం నమః | ఓం హః బ్రహ్మాస్త్ర నివారణాయ కరతల కరపృష్ఠాభ్యాం నమః ||*

*అంగన్యాసః:-*

*ఓం హాం అఞ్జనీసుతాయ హృదయాయ నమః | ఓం హీం రుద్ర మూర్తయే శిరసే స్వాహా | ఓం హూం రామదూతాయ శికాయై వషట్ | ఓం హైం వాయుపుత్రాయ  కవచాయ హుం |  ఓం హౌం అగ్నిగర్భాయ నత్రత్రయాయ వౌషట్ |  ఓం హః బ్రహ్మాస్త్ర నివారణాయ అస్త్రాయ ఫట్ |భూర్భువఃసువరోమితి దిగ్బన్ధః ||*

*అథ ధ్యానమ్:-*

*1) ధ్యాయేత్బాలదివాకరద్యుతినిభం దేవారిదర్పాపహం|*

*దేవేన్ద్ర ప్రముఖం ప్రశస్తయశసం దేదీప్యమానం రుచా ||*

*సుగ్రీవాది సమస్తవానరయుతం సువ్యక్త తత్త్వప్రియం |*

*సంసక్తారుణ లోచనం పవనజం |పీతామ్బరాలఙ్కృతం ||*

*2) ఉద్యన్ మార్తాణ్డకోటి ప్రకట రుచియుతం చారువీరాసనస్థం |*

*మౌఞ్జీ యఙ్యోపవీతాభరణ రుచిశిఖం శోభితం కుణ్డలాఙ్గం |*

*భక్తానామిష్టదం తం ప్రణతమునిజనం వేదనాద ప్రమోదం|*

*ధ్యాయేదేవం విధేయం ప్లవగ కులపతిం గోష్పదీభూత వార్ధిం ||*

*3) వజ్రాఙ్గం పిఙ్గకేశాఢ్యం స్వర్ణకుణ్డల మణ్డితం | నిగూఢముపసఙ్గమ్య పారావార పరాక్రమం ||*

*4) స్ఫటికాభం స్వర్ణకాన్తిం ద్విభుజం చ కృతాఞ్జలిం |*

*కుణ్డల ద్వయ సంశోభిముఖాంభోజం హరిం భజే ||*

*5) సవ్యహస్తే గదాయుక్తం వామహస్తే కమణ్డలుం |*

*ఉద్యద్ దక్షిణ దోర్దణ్డం హనుమన్తం విచిన్తయేత్ ||*

*అథ మన్త్రః:-*

*ఓం నమో హనుమతే శోభితాననాయ యశోలఙ్కృతాయ అఞ్జనీగర్భ సంభూతాయ |రామ లక్ష్మణానన్దకాయ |*

*కపిసైన్య ప్రకాశన పర్వతోత్పాటనాయ |సుగ్రీవసాహ్యకరణ పరోచ్చాటన | కుమార బ్రహ్మచర్య | గంభీర శబ్దోదయ |*

*ఓం హ్రీం సర్వదుష్టగ్రహ నివారణాయ స్వాహా |ఓం నమో హనుమతే ఏహి ఏహి |*

*సర్వగ్రహ భూతానాం శాకినీ డాకినీనాం విశమదుష్టానాం సర్వేషామాకర్షయాకర్షయ |*

*మర్దయ మర్దయ | ఛేదయ ఛేదయ | మర్త్యాన్ మారయ మారయ | శోషయ శోషయ | ప్రజ్వల ప్రజ్వల | భూత మణ్డల పిశాచమణ్డల నిరసనాయ | భూతజ్వర ప్రేతజ్వర చాతుర్థికజ్వర బ్రహ్మరాక్షస పిశాచః ఛేదనః క్రియా విష్ణుజ్వర |*

*మహేశజ్వరం ఛిన్ధి ఛిన్ధి | భిన్ధి భిన్ధి | అక్షిశూలే శిరోభ్యన్తరే హ్యక్షిశూలే గుల్మశూలే|*

*పిత్తశూలే బ్రహ్మ రాక్షసకుల ప్రబల నాగకులవిష నిర్విషఝటితిఝటితి ||*

*ఓం హ్రీం ఫట్ ఘేకేస్వాహా| ఓం నమో హనుమతే పవనపుత్ర వైశ్వానరముఖ|*

*పాపదృష్టి శోదా దృష్టి హనుమతే ఘో అఙ్యాపురే స్వాహా |*

*స్వగృహే ద్వారే పట్టకే తిష్ఠ తిష్ఠేతి తత్ర రోగభయం రాజకులభయం నాస్తి |*

*తస్యోచ్చారణ మాత్రేణ సర్వే జ్వరా నశ్యన్తి ||*

*ఓం హ్రాం హ్రీం హ్రూం ఫట్ ఘేఘేస్వాహా.*


*శ్రీ రామచన్ద్ర ఉవాచ:-*

*1)హనుమాన్ పూర్వతః పాతు దక్షిణే పవనాత్మజః | అధస్తు విష్ణు భక్తస్తు పాతు మధ్యం చ పావనిః ||*

*2) లఙ్కా విదాహకః పాతు సర్వాపద్భ్యో నిరన్తరం | సుగ్రీవ సచివః పాతు మస్తకం వాయునన్దనః ||*

*3) భాలం పాతు మహావీరో భృవోర్మధ్యే నిరన్తరం | నేత్రే ఛాయాపహారీ చ పాతు నః ప్లవగేశ్వరః ||*

*4) కపోలే కర్ణమూలే చ పాతు శ్రీరామకిఙ్కరః |నాసాగ్రం అఞ్జనీసూనుః పాతు వక్త్రం హరీశ్వరః ||*

*5) వాచం రుద్రప్రియః పాతు జిహ్వాం పిఙ్గల లోచనః | పాతు దేవః ఫాల్గునేష్టః చిబుకం దైత్యదర్పహా ||*

*6) పాతు కణ్ఠం చ దైత్యారిః స్కన్ధౌ పాతు సురార్చితః | భుజౌ పాతు మహాతేజాః కరౌ చ చరణాయుధః ||*

*7) నఖాన్ నఖాయుధః పాతు కుక్షౌ పాతు కపీశ్వరః | వక్షో ముద్రాపహారీ చ పాతు పార్శ్వే భుజాయుధః ||*

*8) లఙ్కా నిభఞ్జనః పాతు పృష్ఠదేశే నిరన్తరం | నాభిం చ రామదూతస్తు కటిం పాత్వనిలాత్మజః ||*

*9) గుహ్యం పాతు మహాప్రాఙ్యో లిఙ్గం పాతు శివప్రియః | ఊరూ చ జానునీ పాతు లఙ్కాప్రసాద భఞ్జనః ||*

*10) జఙ్ఘే పాతు కపిశ్రేష్ఠోః గుల్ఫౌ పాతు మహాబలః | అచలోద్ధారకః పాతు పాదౌ భాస్కర సన్నిభః ||*

*11) అఙ్గాన్యమిత సత్వాఢ్యః పాతు పాదరఙ్గులీస్తథా | సర్వాఙ్గాని మహాశూరః పాతు రోమాణి చాక్మవిత్ ||*

*12) హనుమత్ కవచం యస్తు పఠేద్ విద్వాన్ విచక్షణః | స ఏవ పురుషశ్రేష్ఠో భుక్తిం ముక్తిం చ విన్దతి ||*

*13) త్రికాలమేకకాలం వా పఠేన్ మాసత్రయం నరః | సర్వాన్ రిపూన్ క్షణాన్ జిత్వా స పుమాన్ శ్రియమాప్నుయాత్ ||*

*ఇతి శ్రీ శతకోటిరామచరితాంతర్గత శ్రీమదానన్దరామాయణే వాల్మికీయే|మనోహరకాణ్డే శ్రీ హనుమత్కవచం సంపూర్ణం ||*

--(())--

04...*శ్రీ పరమేశ్వర స్తుతిః (శ్రీ వసిష్ఠమహర్షి కృతమ్)*

ఓంశ్రీమాత్రే నమః


*1) లింగమూర్తిం శివం స్తుత్వా గాయత్ర్యా యోగమాప్తవాన్ |*

*నిర్వాణం పరమం బ్రహ్మ వసిష్ఠోన్యశ్చ శంకరాత్ ||*


*2) నమః కనక లింగాయ వేద లింగాయ వై నమః |*

*నమః పరమలింగాయ వ్యోమలింగాయ వై నమః ||*


*3) నమస్సహస్ర లింగాయ వహ్నిలింగాయ వై నమః |*

*నమః పురాణ లింగాయ శ్రుతి లింగాయ వై నమః ||*


*4) నమః పాతాళ లింగాయ బ్రహ్మ లింగాయ వై నమః |*

*నమో రహస్య లింగాయ సప్త ద్వీపోర్ధ్వలింగినే ||*


*5) నమస్సర్వాత్మ లింగాయ సర్వ లోకాంగలింగినే |*

*నమస్త్వవ్యక్తలింగాయ బుద్ధిలింగాయ వై నమః ||*


*6)నమోహంకార లింగాయ భూత లింగాయ వై నమః |*

*నమ ఇంద్రియ లింగాయ నమస్తన్మాత్రలింగినే ||*


*7) నమః పురుషలింగాయ భావలింగాయ వై నమః |*

*నమోరజోఽర్ధలింగాయ సత్త్వలింగాయ వై నమః ||*


*8) నమస్తే భవలింగాయ నమస్త్రైగుణ్యలింగినే |*

*నమో నాగతలింగాయ తేజోలింగాయ వై నమః ||*


*9) నమో వాయూర్ధ్వలింగాయ శ్రుతిలింగాయ వై నమః |*

*నమస్తే ధర్మలింగాయ సామలింగాయ వై నమః ||*

*10) నమో యజ్ఞాంగ లింగాయ యజ్ఞ లింగాయ వై నమః |*

*నమస్తే తత్త్వలింగాయ దేవానుగతలింగినే ||*

*11) దిశ నః పరమం యోగమపత్యం మత్సమం తథా |*

*బ్రహ్మ చైవాక్షయం దేవ శమం చైవ పరం విభో |*

*అక్షయత్వం చ వంశస్య ధర్మే చ మతిమక్షయామ్ ||*

*12) అగ్నిరువాచ :– వసిష్ఠేన స్తుత శ్శంభుస్తుష్టః శ్రీపర్వతే పురా |*

*వసిష్ఠాయ వరం దత్వా తత్రైవాంతరధీయత ||*

*ఇతి శ్రీమహాపురాణే ఆగ్నేయే అగ్ని వసిష్ఠ సంవాదే శ్రీవసిష్ఠకృత పరమేశ్వరస్తుతిర్నామ సప్తదశాధికద్విశతతమోధ్యాయః ||*

--(())--


05...* శ్రీ ఆదిశంకరాచార్య కృతం శ్రీగణేశ భుజంగ స్తోత్రం *


ఓంశ్రీమాత్రే నమః


*1) రణత్-క్షుద్ర ఘణ్టానినాదాభిరామం। చలత్తాణ్డ వోద్దణ్డ వత్పద్మతాలమ్ ।*

*లసత్తున్దిలాఙ్గో పరివ్యాలహారం।గణాధీశ మీశాన సూనుం తమీడే॥* 

*మ్రోగుచున్న చిరుగజ్జల సవ్వడిచే మనోహరుడు , తాళముననుసరించి ప్రచండ తాండవము చేయుచున్న పాదపద్మములు కలవాడు , బొజ్జపై కదులుచున్న సర్పహారములున్న వాడు , ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.*

*2) ధ్వనిధ్వంస వీణాలయోల్లాసివక్త్రం। స్ఫురచ్ఛుణ్డ దణ్డోల్ల సద్బీజపూరమ్ ।*

*గలద్దర్పసౌగన్ధ్య లోలాలిమాలం।గణాధీశ మీశాన సూనుం తమీడే ॥*

*ధ్వని ఆగుటచే వీణానాదమందలి లయచే తెరచిన నోరు కలవాడు , ప్రకాశించు తొండముపై విలసిల్లు బీజపూరమున్నవాడు , మదజలం కారుచున్న బుగ్గలపై అంటుకొన్న తుమ్మెదలు కలవాడు . ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించు చున్నాను.*

*3) ప్రకాశజ్జపారక్తరన్త ప్రసూన-। ప్రవాల ప్రభాతారుణ జ్యోతిరేకమ్ ।*

*ప్రలమ్బోదరం వక్రతుణ్డైకదన్తం।గణాధీశమీశాన సూనుం తమీడే ॥*

*జపాపుష్పము , ఎర్రని రత్నము , పువ్వు , చిగురుటాకు , ప్రాతఃకాల సూర్యుడు వీటన్నిటివలే ప్రకాశించుచున్న తేజోమూర్తి , వ్రేలాడు బొజ్జ కలవాడు , వంకరయైన తొండము , ఒకే దంతము కలవాడు , ఈశ్వర పుత్రుడు అగు గణాధీశుని స్తుతించు చున్నాను.*

*4) విచిత్రస్ఫురద్రత్న మాలాకిరీటం।కిరీటోల్లసచ్చన్ద్రరేఖా విభూషమ్ ।*

*విభూషైకభూశం భవధ్వంసహేతుం।గణాధీశమీశానసూనుం తమీడే ॥*

*విచిత్రముగా ప్రకాశించు రత్నమాలా కిరీటము కలవాడు , కిరీటముపై తళతళలాడుచున్న చంద్రరేఖాభరణమును ధరించినవాడు , ఆభరణములకే ఆభరణమైనవాడు , సంసార దుఃఖమును నశింపచేయువాడు , ఈశ్వర పుత్రుడు అగు గణాధీశుని స్తుతించు చున్నాను.*

*5) ఉదఞ్చద్భుజా వల్లరీదృశ్యమూలో-। చ్చలద్భ్రూలతావిభ్రమభ్రాజదక్షమ్ ।*

*మరుత్సున్దరీచామరైః సేవ్యమానం।గణాధీశమీశానసూనుం తమీడే ॥*

*పైకెత్తిన చేతుల మొదలులు చూడ దగినట్లున్నవాడు , కదులుచున్న కనుబొమ్మల విలాసముతో ప్రకాశించు నేత్రములు కలవాడు , దేవతాస్త్రీలచే చామరములతో సేవించబడుచున్నవాడు , ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.*

*6) స్ఫురన్నిష్ఠురాలోల పిఙ్గాక్షితారం। కృపాకోమలోదార లీలావతారమ్ ।*

*కలాబిన్దుగం గీయతే యోగివర్యై-। ర్గణాధీశ మీశానసూనుం తమీడే ॥*

*ప్రకాశించుచున్నవి , కఠినమైనవి , కదులుచున్నవి , పింగళవర్ణము కలవి అగు కంటిపాపలు కలవాడు , కృపచే కోమలుడై ఉదారలీలా స్వరూపుడు , కలాబిందువు నందు ఉన్నవాడుగా యోగి వరులచే స్తుతింపబడువాడు , ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించు చున్నాను.*

*7) యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం। గుణాతీతమానన్ద మాకారశూన్యమ్ ।*

*పరం పరమోఙ్కార మాన్మాయగర్భం ।వదన్తి ప్రగల్భం పురాణం తమీడే ॥*

*ఏ గణాధీశుని ఏకాక్షరము , నిర్మలము , నిర్వికల్పము , గుణాతీతము , ఆనందస్వరూపము , నిరాకారము , సంసార సముద్రమున కవతలి తీరమునందున్నది , వేదములు తనయందు కలది అగు ఓంకారముగా పండితులు చెప్పుచున్నారో, ప్రగల్భుడు , పురాణపురుషుడు అగు ఆ వినాయకుని స్తుతించుచున్నాను.*

*8) చిదానన్దసాన్ద్రాయ శాన్తాయ తుభ్యం। నమో విశ్వకర్త్రే చ హర్త్రే చ తుభ్యమ్ ।*

*నమోఽనన్తలీలాయ కైవల్యభాసే। నమో విశ్వబీజ ప్రసీదేశసూనో ॥*

*జ్ఞానానందముతో నిండినవాడవు , ప్రశాంతుడవు అగు నీకు నమస్కారము. విశ్వమును సృష్టించువాడవు , సంహరించువాడవు అగు నీకు నమస్కారము. అనంతమైన లీలలు కలిగి ఒకడిగానే ప్రకాశించు నీకు నమస్కారము. ప్రపంచమునకు బీజమైనవాడా! ఈశ్వరపుత్రుడా! ప్రసన్నుడవగుము.*

*9) ఇమం సుస్తవం ప్రాతరుత్థాయ భక్త్యా। పఠేద్యస్తు మర్త్యో లభేత్సర్వకామాన్ ।*

*గణేశప్రసాదేన సిధ్యన్తి వాచో। గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే ॥*

*ఉదయముననే నిద్రలేచి భక్తితో ఈ మంచి స్తోత్రమును ఏ మానవుడు పఠించునో అతడు అన్ని కోరికలను పొందును. గణేశుని అనుగ్రహముచే వాక్కులు సిద్ధించును. అంతటా వ్యాపించిన గణేశుడు ప్రసన్నుడైనచో పొందలేనిది ఏముండును?*

*॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం శ్రీగణేశభుజఙ్గమ్ సమ్పూర్ణమ్ ॥*

--(())--


06...*శ్రీ గాయత్రీ స్తోత్రం

ఓంశ్రీమాత్రే నమః


*శ్రీదేవిభాగవతము అంతర్గతం*

*నారద ఉవాచ:-*

 *1) భక్తానుకంపిన్ సర్వజ్ఞ హృదయం పాపనాశనం! గాయత్ర్యా కథితం తస్మాద్గాయత్ర్యాః స్తోత్రమీరయ!!*

*శ్రీనారాయణ ఉవాచ:-*


*2) ఆదిశక్తే జగన్మాతర్భక్తానుగ్రహకారిణి! సర్వత్ర వ్యాపికేఽనంతే శ్రీసంధ్యే తే నమోఽస్తు తే!!*

*3) త్వమేవ సంధ్యా గాయత్రీ సావిత్రీ చ సరస్వతీ! బ్రాహ్మీ చ వైష్ణవీ రౌద్రీ రక్తా శ్వేతా సితేతరా!!*

*4) ప్రాతర్బాలా చ మధ్యాహ్నే యౌవనస్థా భవేత్పునః! వృద్ధా సాయం భగవతీ చింత్యతే మునిభిః సదా!!

*5) హంసస్థా గరుడారూఢా తథా వృషభవాహినీ! ఋగ్వేదాధ్యాయినీ భూమౌ దృశ్యతే యా తపస్విభిః!!*

*6) యజుర్వేదం పఠంతీ చ అంతరిక్షే విరాజతే! సా సామగాపి సర్వేషు భ్రామ్యమాణా తథా భువి!!*

*7) రుద్రలోకం గతా త్వం హి విష్ణులోక నివాసినీ! త్వమేవ బ్రహ్మణో లోకేఽమర్త్యాను గ్రహకారిణీ!!*

*8) సప్తర్షి ప్రీతి జననీ మాయా బహువరప్రదా! శివయోః కరనేత్రోత్థా హ్యశ్రుస్వేదసముద్భవా!!*

*9) ఆనందజననీ దుర్గా దశధా పరిపఠ్యతే! వరేణ్యా వరదా చైవ వరిష్ఠా వరవర్ణినీ!!*

*10) గరిష్ఠా చ వరాహా చ వరారోహా చ సప్తమీ  నీలగంగా తథా సంధ్యా సర్వదా భోగమోక్షదా!!*

*11) భాగీరథీ మత్యర్లోకే పాతాలే భోగవత్యయి! త్రిలోకవాహినీ దేవీ స్థానత్రయనివాసినీ!!* 

*12) భూర్లోకస్థా త్వమేవాసి ధరిత్రీ లోకధారిణీ! భువో లోకే వాయుశక్తిః స్వర్లోకే తేజసాం నిధిః!!*

*13) మహర్లోకే మహాసిద్ధిర్జనలోకేఽజనేత్యపి! తపస్వినీ తపోలోకే సత్యలోకే తు సత్యవాక్!!*

*14) కమలా విష్ణులోకే చ గాయత్రీ బ్రహ్మ లోకదా! రుద్రలోకే స్థితా గౌరీ హరార్ధాంగ నివాసినీ!!*


*15) అహమో మహతశ్చైవ ప్రకృతిస్త్వం హి గీయసే! సామ్యావస్థాత్మికా త్వం హి శబలబ్రహ్మరూపిణీ!!*

*16) తతః పరా పరాశక్తిః పరమా త్వం హి గీయసే! ఇచ్ఛాశక్తిః క్రియాశక్తిర్జ్ఞానశక్తిస్త్రిశక్తిదా!!*

*17) గంగా చ యమునా చైవ విపాశా చ సరస్వతీ! శరయుర్దేవికా సింధుర్నర్మదైరావతీ తథా!!*

*18) గోదావరీ శతద్రుశ్చ కావేరీ దేవలోకగా! కౌశికా చంద్రభాగా చ వితస్తా చ సరస్వతీ!!*

*19) గండకీ తపినీ తోయా గోమతీ వేత్రవత్యపి! ఇడా చ పింగలా చైవ సుషుమ్నా చ తృతీయకా!!*

*20) గాంధారీ హస్తజిహ్వా చ పూషాఽపూషా తథైవ చ! అలంబుషా కుహూశ్చైవ శంఖినీ ప్రాణవాహినీ!!*

*21) నాడీ చ త్వం శరీరస్థా గీయసే ప్రాక్తనైర్బుధైః! హృత్పద్మస్థా ప్రాణశక్తిః కంఠస్థా స్వప్న నాయికా!!*

*22) తాలుస్థా త్వం సదాధారా బిందుస్థా బిందుమాలినీ! మూలే తు కుండలీశక్తివ్యాపినీ కేశమూలగా!!*

*23) శిఖామధ్యాసనా త్వం హి శిఖాగ్రే తు మనోన్మనీ! కిమన్యద్బహునోక్తేన యత్కించిజ్జగతీత్రయే!!*

*24) తత్సర్వం త్వం మహాదేవి శ్రియే సంధ్యే నమోఽస్తుతే! ఇతీదం కీర్తిదం స్తోత్రం సంధ్యాయాం బహుపుణ్యదం!!*

*25) మహాపాప ప్రశమనం మహాసిద్ధి విధాయకం! య ఇదం కీర్తయేత్ స్తోత్రం సంధ్యాకాలే సమాహితః!!*

*26) అపుత్రః ప్రాప్నుయాత్పుత్రం ధనార్థీ ధన మాప్నుయాత్! సర్వతీర్థతపోదానయజ్ఞయోగఫలం లభేత్!!*

*27) భోగాన్భుక్త్వా చిరం కాలమంతే మోక్షమవాప్నుయాత్! తపస్విభిః కృతం స్తోత్రం స్నానకాలే తు యః పఠేత్!!*

*28) యత్ర కుత్ర జలే మగ్నః సంధ్యా మజ్జనజం ఫలం! లభతే నాత్ర సందేహః సత్యం సత్యం చ నారద!!*

 *29) శృణుయాద్యోపి తద్భక్త్యా స తు పాపాత్ప్రముచ్యతే! పీయూషసదృశం వాక్యం సంధ్యోక్తం నారదేరితం!!*

*ఇతి శ్రీ గాయత్రీ స్తోత్రం సంపూర్ణం.*


 07...*శ్రీ రామ స్తవః (శంభు కృతం)*

సేకరణ సాక్షి గా

ఓంశ్రీమాత్రే నమః


*1) రాఘవం కరుణాకరం భవనాశనం దురితాపహం| మాధవం ఖగగామినం జలరూపిణం పరమేశ్వరమ్ |*

*పాలకం జనతారకం భవహారకం రిపుమారకం| త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ ||*


*2) భూధవం వనమాలినం ఘనరూపిణం ధరణీధరం| శ్రీహరిం త్రిగుణాత్మకం తులసీధవం మధురస్వరమ్ |*

*శ్రీకరం శరణప్రదం మధుమారకం వ్రజపాలకం| త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ ||*


*3) విఠ్ఠలం మథురాస్థితం రజకాంతకం గజమారకం| సన్నుతం బకమారకం వృకఘాతకం తురగార్దనమ్ |*

*నందజం వసుదేవజం బలియజ్ఞగం సురపాలకం|  త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ ||*


*4) కేశవం కపివేష్టితం కపిమారకం మృగమర్దినం|  సుందరం ద్విజపాలకం దితిజార్దనం దనుజార్దనమ్ |*

*బాలకం ఖరమర్దినం ఋషిపూజితం మునిచింతితం|  త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ ||*


*5) శంకరం జలశాయినం కుశబాలకం రథవాహనం సరయూనతం|ప్రియపుష్పకం ప్రియభూసురం లవబాలకమ్ |*

*శ్రీధరం మధుసూదనం భరతాగ్రజం గరుడధ్వజం| త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ ||*

*6)గోప్రియం గురుపుత్రదం వదతాం వరం కరుణానిధిం|భక్తపం జనతోషదం సురపూజితం శ్రుతిభిః స్తుతమ్ |*

*భుక్తిదం జనముక్తిదం జనరంజనం నృపనందనం | త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ ||*

*7) చిద్ఘనం చిరజీవినం మణిమాలినం వరదోన్ముఖం| శ్రీధరం ధృతిదాయకం బలవర్ధనం గతిదాయకమ్ |*

*శాంతిదం జనతారకం శరధారిణం గజగామినం| త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ ||*

*8)శార్ఙ్గిణం కమలాననం కమలాదృశం పదపంకజం| శ్యామలం రవిభాసురం శశిసౌఖ్యదం కరుణార్ణవమ్ |*

*సత్పతిం నృపబాలకం నృపవందితం నృపతిప్రియం | త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ ||*

*9) నిర్గుణం సగుణాత్మకం నృపమండనం మతివర్ధనం| అచ్యుతం పురుషోత్తమం పరమేష్ఠినం స్మితభాషిణమ్ |*

*ఈశ్వరం హనుమన్నుతం కమలాధిపం జనసాక్షిణం| త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ ||*

*10) ఈశ్వరోక్తమే తదుత్తమాదరాచ్ఛతనామకం| యః పఠేద్భువి మానవస్తవ భక్తిమాంస్తపనోదయే |*

*త్వత్పదం నిజబంధుదారసుతైర్యుతశ్చిరమేత్య నో| సోఽస్తు తే పదసేవనే బహుతత్పరో మమ వాక్యతః ||*


*ఇతి శ్రీశంభు కృత శ్రీరామ స్తవః |*

+-(())--


07....శ్రీ కూర్మ స్తోత్రం

ఓంశ్రీమాత్రే నమః


1) నమామ తే దేవ పదారవిందం| ప్రపన్న తాపోపశమాతపత్రమ్ |

యన్మూలకేతా యతయోఽమ్జసోరు| సంసారదుఃఖం బహిరుత్క్షిపంతి ||


2) ధాతర్యదస్మిన్భవ ఈశ జీవా-  -స్తాప త్రయేణోపహతా న శర్మ |

ఆత్మన్ లభంతే భగవంస్తవాంఘ్రి- -చ్ఛాయాం స విద్యామత ఆశ్రయేమ ||


3) మార్గంతి యత్తే ముఖపద్మనీడై- -శ్ఛన్దస్సుపర్ణైరృషయో వివిక్తే |

యస్యాఘమర్షోదసరిద్వరాయాః| పదం పదం తీర్థపదః ప్రపన్నాః ||


4) యచ్ఛ్రద్ధయా శ్రుతవత్యా చ భక్త్యా|సంమృజ్యమానే హృదయేఽవధాయ |

జ్ఞానేన వైరాగ్యబలేన ధీరా| వ్రజేమ తత్తేఽంఘ్రి సరోజపీఠమ్ ||


5) విశ్వస్య జన్మస్థితిసంయమార్థే|కృతావతారస్య పదాంబుజం తే |

వ్రజేమ సర్వే శరణం యదీశ| స్మృతం ప్రయచ్ఛత్యభయం స్వపుంసామ్ ||


6)యత్సాను బంధేఽసతి దేహగేహే|మమాహమిత్యూఢ దురాగ్రహాణామ్ |

పుంసాం సుదూరం వసతోపి పుర్యాం| భజేమ తత్తే భగవన్పదాబ్జమ్ ||


7) తాన్వా అసద్వృత్తిభిరక్షిభిర్యే|పరాహృతాంతర్మనసః పరేశ |

అథో న పశ్యంత్యురుగాయ నూనం| యేతే పదన్యాస విలాసలక్ష్మ్యాః ||


8) పానేన తే దేవ కథాసుధాయాః| ప్రవృద్ధభక్త్యా విశదాశయా యే |

వైరాగ్యసారం ప్రతిలభ్య బోధం|యథాంజసాన్వీయురకుంఠధిష్ణ్యమ్ ||


9) తథాపరే చాత్మసమాధియోగ- -బలేన జిత్వా ప్రకృతిం బలిష్ఠామ్ |

త్వామేవ ధీరాః పురుషం విశన్తి| తేషాం శ్రమః స్యాన్న తు సేవయా తే ||


10) తత్తే వయం లోకసిసృక్షయాద్య| త్వయానుసృష్టాస్త్రిభిరాత్మభిః స్మ |

సర్వే వియుక్తాః స్వవిహారతంత్రం|  న శక్నుమస్తత్ప్రతిహర్తవే తే ||


11) యావద్బలిం తేఽజ హరామ కాలే| యథా వయం చాన్నమదామ యత్ర |

యథో భయేషాం త ఇమే హి లోకా| బలిం హరన్తోఽన్నమదంత్యనూహాః ||


\12) త్వం నః సురాణామసి సాన్వయానాం| కూటస్థ ఆద్యః పురుషః పురాణః |

త్వం దేవశక్త్యాం గుణకర్మయోనౌ|రేతస్త్వజాయాం కవిమాదధేఽజః ||


13) తతో వయం సత్ప్రముఖా యదర్థే|బభూవిమాత్మన్కరవామ కిం తే |

త్వం నః స్వచక్షుః పరిదేహి శక్త్యా| దేవ క్రియార్థే యదను గ్రహాణామ్ ||

ఇతి శ్రీమద్భాగవతే శ్రీ కూర్మ స్తోత్రమ్ ||

--(())--


08...*శ్రీ నృసింహ మంత్ర రాజపద స్తోత్రం*

ఓంశ్రీమాత్రే నమః

ప్రాంజలి ప్రభ

*పార్వత్యువాచ :–*

*మన్త్రాణాం పరమం మన్త్రం గుహ్యానాం గుహ్యమేవ చ |*

.*బ్రూహి మే నారసింహస్య తత్త్వం మన్త్రస్య దుర్లభమ్ ||*

*శంకర ఉవాచ :–*

*1) వృత్తోత్ఫుల్ల విశాలాక్షం విపక్షక్షయదీక్షితం |*

*నినాదత్రస్తవిశ్వాణ్డం విష్ణుముగ్రం నమామ్యహమ్ ||*

*2) సర్వైరవధ్యతాం ప్రాప్తం సబలౌఘం దితేస్సుతం |*

*నఖాగ్రైశ్శకలీ చక్రేయస్తం వీరం నమామ్యహమ్ ||*

*3) పాదావష్టబ్ధ పాతాళం మూర్ధాఽఽవిష్టత్రివిష్టపం |*

*భుజప్రవిష్టాష్టదిశం మహావిష్ణుం నమామ్యహమ్ ||*

*4) జ్యోతీంష్యర్కేన్దు నక్షత్రజ్వలనాదీన్యనుక్రమాత్ |*

*జ్వలన్తి తేజసా యస్య తం జ్వలన్తం నమామ్యహమ్ ||*

*5) సర్వేన్ద్రియైరపి వినా సర్వం సర్వత్ర సర్వదా |*

*జానాతి యో నమామ్యాద్యం తమహం సర్వతోముఖమ్ ||*

*6) నరవత్సింహవచ్చైవ రూపం యస్య మహాత్మనః |*

*మహాసటం మహాదంష్ట్రం తం నృసింహం నమామ్యహమ్ ||*

*7) యన్నామ స్మరణాద్భీతా భూతవేతాళరాక్షసాః |*

*రోగాద్యాశ్చ ప్రణశ్యన్తి భీషణం తం నమామ్యహమ్ ||*

*8) సర్వేఽపి యం సమాశ్రిత్య సకలం భద్రమశ్నుతే |*

*శ్రియా చ భద్రయా జుష్టో యస్తం భద్రం నమామ్యహమ్ ||*

*9) సాక్షాత్స్వకాలే సమ్ప్రాప్తం మృత్యుం శత్రుగణానపి |*

*భక్తానాం నాశయేద్యస్తు మృత్యుమృత్యుం నమామ్యహమ్ ||*

*10) నమస్కారాత్మకం యస్మై విధాయాత్మ నివేదనం |*

*త్యక్తదుఃఖోఽఖిలాన్కామానశ్నుతే తం నమామ్యహమ్ ||*

*11) దాసభూతాస్స్వతస్సర్వే హ్యాత్మానః పరమాత్మనః |*

*అతోఽహమపి తే దాస ఇతి మత్వా నమామ్యహమ్ ||*

*13) శంకరేణాదరాత్ప్రోక్తం పదానాం తత్త్వముత్తమం |*

*త్రిసన్ధ్యం యో జపేత్తస్య విద్యాఽఽయుః శ్రీశ్చ వర్ధతే ||*

*ఇతి శ్రీ శంకరకృత శ్రీనృసింహ మంత్ర రాజపద స్తోత్రమ్ ||*

--(())--

09.....*!!.శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం.!!*

ప్రాంతంలోని ప్రభ

🔥ఓంశ్రీమాత్రే నమః🔥


*1) సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం!*

*భక్తిప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే!!*

*2) శ్రీశైలశృంగే విబుధాతి సంగే తులాద్రి తుంగేపి ముదావసంతం!*

*తమర్జునం మల్లిక మేకం నమామి సంసార సముద్రసేతం!!*

*3) అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం!*

*అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహం సురేశం!!*

*4) కావేరికా నర్మదాయోః పవిత్రే సమాగమే సజ్జన తారణాయ!*

*సదైవ మాంధాతృ పురే వసంత మోంకార మీశం శివ మేక మీడే!!*

*5) పూర్వోత్తరే ప్రజ్వలికా నిధానే సదా వసంతం గిరిజా సమేతం!*

*సురాసురారాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి!!*

*6) యామ్యే సదంగే నగరే తి రమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః!*

*సద్భక్తి ముక్తిప్రద మీశ మేకం శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే!!*

*7) మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః!*

*సురాసురైఃయక్ష మహోరగాదైః కేదార మీశం శివమేక మీడే!!*

*8) సహ్యాద్రి శీర్షే విమలే వసంతం గోదావరీతీర పవిత్రదేశే, యుద్దర్శనాత్!*

*పాతక మాశు నాశం ప్రయాతి తం త్ర్యంబక మీశ మేడే!!*

*9) సుతామ్రపర్ణీ జలరాశి యోగే నిబధ్య సేతుం విశిఖై రసంఖ్యైః!*

*శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి!!*

*10) యం ఢాకినీ శాకినికా సమాజే నిషేవ్యమాణం పిశాతాశనైశ్చ!*

*సదైవ భీమాది పదప్రసిద్దం తం శంకరం భక్తహితం నమామి!!*

*11) సానంద మానందవనే వసంత మానందకందం హతపాప బృందం!*

*వారాణసీనాథ మనాథ నాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే!!*

*12) ఇలాపురే రమ్య విశాలకే స్మిన్ సముల్లసంతం చ జగద్వేరేణ్యం!*

*వందే మహోదరాతర స్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే!!*

*13) జ్యోతిర్మయం ద్వాదశ లింగకానాం శివాత్మనాం ప్రోక్తం మిదం క్రమేణ!*

*స్తోత్రం పఠిత్వా మనుజేతి భక్త్యా ఫలం తదాలోక్య నిజం భజేచ్ఛ!!*

--(())--


*1. సోమనాధ లింగం:- (సౌరాష్ట్రం) పన్నెండు జ్యోతిర్లింగాలలోమొదటిది సోమనాధ స్వామి.. సోముడు అనగా చంద్రుడు. లింగరూపుడై ఇక్కడ వెలసిన శివుని చంద్రుడు ఆరాధించాడు కనుక దీనికి సోమనాధ క్షేత్రం అని పేరు వచ్చింది.ఈ క్షేత్రం "గుజరాత్ లోని సౌరాష్ట్ర" లో వుంది.*

*2. మల్లికార్జున లింగం:- (శ్రీశైలం) ఆంద్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి. 'శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే',శ్రీశైల శిఖర దర్శనం చేసిన వారికి పునర్జన్మ అనేది ఉండదని నమ్మిక.*

*3. మహాకాళ లింగం:- (ఉజ్జయిని) మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని లో శిప్రా నదీ తీరంలోని (మాళవ)  ఉజ్జయినీ నగరంలో వెలసిన క్షేత్రం మహాకాళేశ్వరుడు... సంధ్యా సమయంలో ఈ కాళేశ్వర లింగాన్ని దర్శించడం విశేష ఫలప్రదం.*

*4. ఓంకారేశ్వర, అమలేశ్వలింగం:- (ఓంకారం) మధ్యప్రదేశ్ లోని నర్మదాతీరంలో ఉన్న ఈ జ్యోతిర్లింగం, జ్యోతిర్లింగాలలో నాలుగవది. ఇక్కడ ఒకే లింగము రెండు బాగములుగా ఉండి, రెండు పేర్లతో పూజింపబడుతున్నది.*

*5.కేదారేశ్వర లింగం:- (కేదారనాథ్) హిమాలయ పర్వత శ్రేణులలో, ఒక కొండ కొనకొమ్ము ఆకృతిలో  సదాశివుడు కేదారనాధుడిగా అవతరించడానికి నరనారాయణులనే మునివర్యులే కారకులు. వారి ఉగ్రతపోదీక్షకు మెచ్చిన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపుడైనాడు.*

*6. భీమశంకర లింగం:- (ఢాకిని) మహారాష్ట్ర, పూనా లోని భువనగిరి లో వెలసిన జ్యోతిర్లింగ క్షేత్రం సంపూర్ణ శివభక్తులైన సుదక్షిణ - కామరూపుల జంట సంరక్షణార్థం పార్వతీపతి జ్యోతిర్లింగ రూపుడై సహ్యాద్రి కనుమలలో భీమనదీ ఉత్తర దిశాతీరాన భీమశంకర జ్యోతిర్లింగంగా వెలసిన క్షేత్రం.*

*7. విశ్వేశ్వర లింగం:- (వారణాశి) మహా క్షేత్ర తీర్థరాజమై, సర్వ విద్యాధామమై విరాజిల్లే ముక్తి క్షేత్రమైన వారణాశి లేదా కాశీ లో విశ్వేశ్వరుడు జ్యోతిర్లింగంగా వెలసిన క్షేత్రం.*

*8. త్రయంబకేశ్వర లింగం:- (త్రయంబకం) మహారాష్ట్ర , నాసిక్ లోని జ్యోతిర్లింగ క్షేత్రం.. బ్రహ్మగిరిపై గౌతమ మహర్షి తపస్సుకు అనుగ్రహించి, నాసిక్ వద్ద తన జటాజూటం నుండి గోదావరి నదిని ప్రవహింపజేసి అనుగ్రహించిన పరమేశ్వరుడు ఈ నదీ తీరాన త్రయంబకేశ్వరుడనే జ్యోతిర్లింగంగా వెలిశాడు.*

*9. వైద్యనాథ లింగం లేక అమృతేశ్వరుడు:- ( వైద్యనాదం, దేవఘర్) జార్ఖండ్ లోని దేవఘర్ లో జ్యోతిర్లింగంగా వైద్యనాధస్వామిగా వెలసిన క్షేత్రం.. శివుడు ప్రత్యక్షంగా రోగనివారకుడై ఇక్కడ అనుగ్రహిస్తున్నాడు.*

*10. నాగేశ్వర లింగం:- (ద్వారక) నాగనాధుడు లేక నాగేశ్వరుడుగా గుజరాత్ లోని ద్వారకా పట్టణాన విరాజిల్లు తున్న పరమేశ్వర జ్యోతిర్లింగం పదవది.*

*11. రామేశ్వర జ్యోతిర్లింగం:- (రామేశ్వరం) తమిళ నాడులోని రామేశ్వరం లో వెలసిన జ్యోతిర్లింగం త్రేతాయుగంలో రాముడు, రావణవధ అనంతరం, సేతుబంధనం చేసిన ప్రాంతంలో శివార్చన చేసి,జ్యోతిర్లింగ రూపంలో అక్కడే స్థిరుడిగా ఉండమని కోరగా పరమశివుడు వెలసిన క్షేత్రం.*

*12. ఘృష్ణేశ్వర లింగం:- (దేవగిరి) మహారాష్ట్రలోని ఎల్లోరా గృహలకి దగ్గరలో దేవగిరి పర్వత సమీపంలో ఘశ్మ అనే మహా భక్తురాలి కోరికపై ఘశ్మేశ్వర లింగరూపుడైనాడు మహేశ్వరుడు.*

--(())--

10....*శ్రీ దత్తాత్రేయ అజపాజప స్తోత్రం*

ఓంశ్రీమాత్రే నమః


*1) మూలాధారే వారిజపత్రే చతురస్రం |*

*వం శం షం సం వర్ణవిశాలైః సువిశాలైః |*

*రక్తం వర్ణం శ్రీగణనాథం భగవతం దత్తాత్రేయం|*

 *శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ||*


*2) స్వాధిష్ఠానే షడ్దలచక్రే తనులింగే|*

 *బాలాం తావత్ వర్ణవిశాలైః సువిశాలైః |*

*పీతం వర్ణం వాక్పతిరూపం ద్రుహిణం తం |*

 *దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ||*


*3) నాభౌస్థానే పత్రదశాబ్దే డఫ్ వర్ణే|*

 *నీలం వర్ణం నిర్గుణరూపం నిగమాద్యమ్ |*

*లక్ష్మీకాంతం గరుడారూఢం నరవీరమ్ |*

 *దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ||*


*4) హృత్పద్మాంతే ద్వాదశపత్రే కఠ వర్ణే |*

 *శంభో శేషం జీవవిశేషం స్మరయం తమ్ |*

*సృష్టిస్థిత్యంతం కుర్వంతం శివశక్తిం |*

 *దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ||*


*5) కంఠస్థానే పత్ర విశుద్ధే కమలాంతే |*

*చంద్రాకారే షోడశ పత్రే స్వరవర్ణే |*

*మాయాధీశం జీవవిశేషం నిజమూర్తిం |*

*దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ||*


*6) ఆజ్ఞాచక్రే భృకుటి స్థానే ద్విదలాంతే |*

 *హం క్షం బీజం జ్ఞానమయం తం గురుమూర్తిం |*

*విద్యుద్వర్ణం నందమయం తం నిటిలాక్షం |*

 *దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ||*


*7) నిత్యానందం బ్రహ్మముకుందం భగవంతం |*

 *బ్రహ్మజ్ఞానం సత్యమనంతం భవ రూపం |*

*బ్రహ్మా పర్ణం నందమయం తం గురుమూర్తిం |*

 *దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ||*


*8) శాంతాకారే శేషశయానం సురవంద్యం |*

*కాంతానాథం కోమలగాత్రం కమలాక్షమ్ |*

*చింత్యారత్నం చిద్ఘనరూపం ద్విజరాజం |*

 *దత్తాత్రేయం  శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ||*

*ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం అజపాజప స్తోత్రం సంపూర్ణమ్ ||*

--(())--