Sunday, 29 July 2018

Pranjali Prabha (30-07-2018)

ఓం శ్రీ  రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:

ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం  


అధిక్షేప ప్రేమలీల 
రచయత :  మల్లాప్రగడ రామకృష్ణ     

విరివై వెన్నలవై వికాస పథివైవిధ్వనివై 
- అలుకై వెన్నముద్దై సీమంత సిరివై సంభరమై      

పలుకై సన్నితమై సుమాల బరువై సుందరివై 
- కులకై కన్నుకొట్టై ఆనంద మేరుపై ముంబరమై 

చినుకై సుందరమై విశాల పరువై జీవకలై       
- తనువై దగ్గరకై తరించి తపనై మేఘములై  

సిరులై మంగళమై శుభాల కలలై దేవతలై 
- పిలుపై సంగమమై నవాంక పనులై సమ్మతులై    

నమ్రత, వినమ్రత కలసి 
జ్ఞానము విజ్ఞాము కలసి 
భయము సంతోషము కలిసే 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--


తేది : 30, జూలై 2018
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
వారము : సోమవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : విదియ
(నిన్న తెల్లవారుజాము 4 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు ఉదయం 6 గం॥ 40 ని॥ వరకు)
నక్షత్రం : ధనిష్ట
(నిన్న తెల్లవారుజాము 3 గం॥ 39 ని॥ నుంచి ఈరోజు ఉదయం 6 గం॥ 32 ని॥ వరకు)
యోగము : సౌభాగ్యము
కరణం : గరజ
వర్జ్యం :
(ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 31 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 17 ని॥ వరకు)
అమ్రుతఘడియలు :
ఈరోజు అమృతఘడియలు లేవు.
దుర్ముహూర్తం :
(ఉదయం 12 గం॥ 47 ని॥ నుంచి మద్యాహ్నం 1 గం॥ 38 ని॥ వరకు)(సాయంత్రం 3 గం॥ 23 ని॥ నుంచి సాయంత్రం 4 గం॥ 14 ని॥ వరకు)
రాహుకాలం :
(ఉదయం 7 గం॥ 31 ని॥ నుంచి ఉదయం 9 గం॥ 8 ని॥ వరకు)
గుళికకాలం :
(మద్యాహ్నం 1 గం॥ 59 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 36 ని॥ వరకు)
యమగండం :
(ఉదయం 10 గం॥ 44 ని॥ నుంచి ఉదయం 12 గం॥ 21 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 54 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 50 ని॥ లకు
సూర్యరాశి : కర్కాటకము
చంద్రరాశి : కుంభము
ఇది కలయని నేననుకోన ..కలనైన ఇది నిజమౌన.. 
కనులెదుటే నిలిచిన స్వర్గాన్ని ..కలదో? లేదో? అనుకోనా.. 

చిత్రం : సింహాసనం 
సంగీతం బప్పిలహరి 
గానం : రాజ్ సీతారాం, సుశీల 

ఇది కలయని నేననుకోన .. 
కలనైన ఇది నిజమౌన.. 
కనులెదుటే నిలిచిన స్వర్గాన్ని .. 
కలదో? లేదో? అనుకోనా.. (2) 

నీ ఊహల ఊయలలోన .. ఉర్వసినై ఊగిపోన 
నీ అడుగుల సవ్వడిలోన సిరిమువ్వై నిలిచిపోన (2) 
నీ కంటిపాపలోన నా నీడ చూసుకోన 
నీ నీడ కలువలలోన నూరేళ్ళు ఉండిపోన 

ఇది కలయని నేననుకోన .. 
కలనైన ఇది నిజమౌన.. 
కనులెదుటే నిలిచిన స్వర్గాన్ని .. 
కలదో? లేదో? అనుకోనా.. 

నీ జీవన గమనంలోన జానికినై నడచిరాన 
నీ మయూరి నడకలలోన లయ నేనై కలసిపోన 
నీ సిగ్గుల బుగ్గలలోన ఆ కెంపులు నే దోచుకోన 
నను దోచిన నీ దొరతనము నాలోనే దాచుకోన ..(2) 

ఇది కలయని నేననుకోన .. 
కలనైన ఇది నిజమౌన.. 
కనులెదుటే నిలిచిన స్వర్గాన్ని .. 
కలదో? లేదో? అనుకోనా 

https://www.youtube.com/watch?v=UJhJQCayFCc
Simhasanam Movies || Idhi Kala Ani Video Song || Krishna, Jayaprada, Radha
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...
మధూషిణి (part-2) 
****************************************** 
నేనత్తయ్యా మధూషిణిని రాఘవరావు గారి కూతురుని అన్నది. ఉద్వేగంతో ఆవిడ కళ్ళు చెమర్చాయి. తమాయించుకొని "ఎందుకొచ్చావ్ ఇక్కడికి ?" అన్నదామె. వెంటనే మధూషిణి అదేమిటత్తయ్యా నా అత్తారింటికి నే రాకూడదా అన్నది. జానకమ్మ దుఃఖం నిండిన స్వరంతో "మీ నాన్నేమీ అనలేదా నువ్విటు వస్తుంటే? అసలు మేమిక్కడున్నట్టు నీకెలా తెలుసు?" అన్నది. నేనిక్కడికి వస్తున్నట్టు నాన్నకు తెలీదు. " అమ్మ మీ గురించి అంతా చెప్పింది అన్నది " మధూషిణి. 

మధూషిణి వాళ్ళ నాన్న రాఘవరావుకు ఒక్కగానొక్క చెల్లెలు జానకి. ఆమెకి గొప్పింటి అబ్బాయిని భర్తగా తీసుకురావాలని రాఘవరావుకు కోరికుండేది. అనుకోకుండా జానకమ్మ జగన్నాథంను ప్రేమించి పెళ్ళి చేసుకొని రావటంతో రాఘవరావు షాక్ కి గురి అయ్యాడు. ఆ కోపంలో ఈ రోజు నుంచి నాకు చెల్లెలు లేదనుకుంటాను నీ మెుహం నాకు చూపించకు అని ఇంట్లోంచి పంపించేశాడు. అది జరిగిన విషయం. 
మధూషిణి తల్లి కూడా జానకిని ప్రేమగా చూసుకునేది. ఆ తర్వాత జానకి,జగన్నాథం ను పెళ్ళి చేస్కోవటంలో ఆమెకేమి తప్పు కనిపించలేదు. ప్రతీరోజు ఆమెని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే మధూషిణిని సమానంగా జానకిని చూసుకుందావిడ. జానకి గురించి రోజూ తల్లి చెప్తూ ఉంటే మధూషిణికి తన అత్తయ్యను ఒకసారి కలవాలనిపించింది. సమ్మర్ క్యాంప్ వంకతో ఆ ఊరొచ్చింది. 

జానకి అనునయంగా మధూషిణి చేయి పట్టుకొని " ఎప్పుడనగా తిన్నావో వెళ్ళి స్నానం చేసిరామ్మా వడ్డిస్తాను" అన్నది. అతి తక్కువ సమయంలో ఆ ఇంట్లో బాగా కలిసిపోయింది మధూషిణి. అత్తయ్య,మావయ్య చూపించే ప్రేమానురాగాలు చూస్తుంటే అసలు వాళ్ళను వదిలిపెట్టి వెళ్ళాలనే లేదు తనకి. ఒక రోజు నిండుగా పండువెన్నెల కురుస్తుండగా చంద్రునికి తానేమీ తీసిపోనన్నట్టుగా అందంగా తెల్లని పరికిణిలో మెరుస్తోందామె. వీణాపాణియై చక్రవాకరాగం ఆలపిస్తుంది. అది కొంచెం విషాదమిళితం. ఎక్కువమందికి నచ్చదు కూడానూ. కానీ మధూషిణి అలా లీనమైపోతూ వీణపై వేళ్ళు కనపడనంత వేగంగా ఆలపిస్తుంటే చూసేవారు ఎవరైనా మంత్రముగ్ధులు అవాల్సిందే. నిర్మలమైన వదనం , ఆమె రాగంలో లీనమై వాయిస్తుంటే తల లయబద్ధంగా ఊగుతోంది. ఆమె చెవికున్న జుంకీ రాగానికి అనుగుణంగా నాట్యమాడుతున్నట్టుంది. అప్పుడే పట్నం నుంచి వచ్చిన ఆనంద్ ఆ దృశ్యం చూస్తూ స్థాణువై నిలబడిపోయాడు. అదంతా ఒక కలగా అనిపిస్తుందతనికి. ఏదో అలజడి అవటంతో ఆపి తలుపువైపుకి తిరిగి చూసింది మధూషిణి. తను సరిగ్గా ఊహించగలిగింది అతను తన బావేనని. అనుకోకుండా అతను అక్కడ కనిపించేసరికి ఆమెకి నోట మాట రాలేదు. "నమస్కారం" అని మర్యాదపూర్వకంగా పలకరించి చెంగున అత్తయ్య దగ్గరికి పరిగెత్తుకెళ్ళి నిలుచుంది. జానకి ఆనంద్ ని చూసి సంతోషంతో "ఒరేయ్ ఎప్పుడొచ్చావురా వస్తున్నట్టు కబురు చేస్తే నాన్నగారు స్టేషన్ కి వచ్చేవారు కదా" అన్నది. " ఫరవాలేదమ్మా నాన్నగారికెందుకు ఇబ్బందనీ..అది సరే.. ఈ అమ్మాయి ఎవరు?" అనడిగాడు ఆనంద్. జరిగినదంతా చెప్పింది జానకి. 


|| నీడ || 

ఓ అభిజ్ఞా... 

ఈ పిలుపేంటి పిలగాడా అని మాత్రం అనుకోకేం. నీడ నీడతో ఇలాగే మాట్లాడాలి. నిజం చెప్పు! నీకు నా దగ్గరి తనపు స్పర్శ తెలియటం లేదూ. నీ మనసులో గోరువెచ్చని మమతల్లో దాగున్న నన్ను దూరంగా ఉన్నానంటూ ఆక్షేపించటం నీకు మాత్రమే చెల్లింది. నీకు నాతో జగడాలు ఆడటం ఇష్టమని తెలుసు కానీ ఇన్ని అభాంఢాలా? అన్యాయం కదా. ఒక్కసారి లో లోపల తడుముకుని చూడు. ఆ మనసు పరిమళంలో అదే స్వచ్ఛత అదే సువాసన అదే పరవశం మరి అది నేను కానా. 

నువ్వంటున్నావే విసిరిన మాటలు అని… అవి విసిరిన మాటలు కాదోయ్... అరవిరిసిన హృదయ సుమాలు! కాబట్టే మౌనం కోటి రకాలుగా మాటలాడుతుంది. నా నిశ్శబ్దపు హోరూ, నీ మౌనాల జోరూ… ఈ రెండూ మనల్ని ఇంకా ఇంకా దగ్గరే చేస్తాయి కానీ ఎప్పటికీ దూరాన్ని పెంచలేవులే. నీ ఏకాంతం నీకెలా ఉంటుందనుకున్నావ్ నన్ను ఊహలకి వెళ్లాడదీసాక? 

ఎందుకీ విరామాలంటూ వగపులేల? కొన్ని విరామాలు… వరాల ఆరామాలు ! విరామంలో వరమేంటి అంటే ఏమని చెప్పను నేను? సమయం మొత్తాన్ని తలపులకి అల్లేసిన సడిలో మామూలుగా కన్నా ఇంకా దగ్గరైనతనం చెప్పటం లేదూ అదెంత వరమో..! 

నువ్వనుకున్నట్లు మౌనమెప్పుడూ అందమైన గాజు పువ్వు మాత్రమే కాదురా… అది ఘనీభవించిన సజీవ పరిమళం. స్థితి ఏదైతేనేం దాని అలజడి తీరు మాత్రం ఎప్పుడూ ఒక్కలాగానే ఉంటుంది. నీకు తెలియనిది కాదనుకో… అయినా సరే మరో సారి చదివి చూడు మౌనం రాస్తున్న మనఃప్రతిని. నల్లని నీడలో… రంగు రంగుల వర్ణాలో… ఎలా అనిపించినా అవి పరిచయించేది మాత్రం నిన్నుగా రాసుకున్న నా ఊసుల లిపినే. 

నీడగా ఉండటం అంటే నిన్ను కాచుకోవటం అన్న మాటేగా… సమయాన్ని బట్టి తగ్గుతూ పెరుగుతూ రూపుని దాటేసిన రక్షా కవచమది. నీ హృదయ స్పందనలు వినిపించనంత దూరం అంటే నాకు తెలిసింది ఒక్కటే… అదే మరణం. 

ఏదేదో ఊహించు కుంటున్నావ్ గానీ నిజంగా నీకు తెలియదా చెప్పు? నిన్ను తలుచుకుంటే నా గుండె నిండుగా పరిమళించే తొలకరి చినుకు చీల్చే మట్టి వాసన, నీ పిలుపు వింటే చాలు పిల్లగాలిపై మనసు పడ్డ పైరులా పరవశం… ఒక్కొక్క అనుభూతీ ఒక్కోలా నిన్ను నాలో నింపేసాక నాకు నేను అతిధినయ్యానని ! 

గెలిపించేదీ నువ్వే... ఓడించేది నువ్వే... దిగులు పెట్టించేది నువ్వు… ధైర్యమిచ్చేది నువ్వే… బెదిరించేది నువ్వే... ఆదరించేది నువ్వే... 

ఎప్పటికీ నా నీడగా నన్నంటి ఉన్న నా తోడుగా నీకు నేనున్నానని తెలుపుకునే తలపుల తాయిలమిది. 

అనుకోకుండా తారసపడ్డా… నిశ్శబ్దంగా చేరువైనా… జత కలసిన అడుగులు ఒకటికి ఒకటి రెండుగా… రెండిటి తపమూ ఒకటిగా... బంధం అల్లుకుపోయాక జతలంటూ ఏమీ ఉండవు ఏకమైన మనో శబ్దం తప్ప. 

నీ 
“తోడూ నీడ”


కోకిల..కోకిల. 
కోకిలా కొక్కొకోకిలా కూతలా రసగీతలా 
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా 
నీ పాటతో మరు పూదోటలో మదిరేపింది మారాపిలా 
I love you 
ఒరేయ్ నువ్వు కాదురా I Love You నేనురా 
I Love you I Love You 
I Love you I Love You 
I Love you I Love You 
జాబిల్లిలో మచ్చలే తెల్లబోయే నీ పాట వింటే 
ఆకాశ దేశాన తారమ్మలాడే నీ కొమ్మ వాకిటే 
చుక్కమ్మ కోపం చి పొ ముద్దొచ్చే రూపం వదులు 
కన్నులో తాపం వెన్నెల్లో దీపం 
హోయ్ నాలోనీ లల్లాయికే నీకింక జిల్లాయిలే 
లయలేమో హోయలేమో ప్రియభామా కధలేమో 
కోకిలా కొక్కొకోకిలా కూతలా రసగీతలా 
నీ పాటతో మరు పూదోటలో మదిరేపింది మారాపిలా 
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా 
I Love you I Love You 
I Love you I Love You 
I Love you I Love You 
కొమ్మాపండే కొమ్మాపండే రెమ్మాపండే రెమ్మాపండే 
కొమ్మాపండే రెమ్మాపండే కొరుక్కుతింటావా 
కొమ్మాపండే రెమ్మాపండే కొరుక్కుతింటావా 
బుగ్గాపండే బుగ్గాపండే సిగ్గుపండే సిగ్గుపండే 
బుగ్గాపండే సిగ్గుపండే కొనుక్కుపోతావా 
బుగ్గాపండే సిగ్గుపండే కొనుక్కుపోతావా 
కొండల్లో వాగమ్మ కొంకర్లుపోయే నీ గాలిసోకీ 
ఈచైత్ర మాసాలు పూలారబోసే నీ లేత నవ్వుకే 
పైటమ్మ జారీ ప్రాణాలు తోడే వయ్యారమంతా వర్ణాలు పాడే 
జాలీగా నా జావళీ హాలీడే పూజావడీ 
ఇక చాలు సరసాలు కుదిరేనూ మురిపాలూ 
కోకిలా కొక్కొకోకిలా కూక్కుకూ కూతలా రసగీతలా 
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా 
నీ పాటతో మరు పూదోటలో మదిరేపింది మారాపిలా 
I Love you I Love You 
I Love you I Love You 
I Love you I Love You 

https://www.youtube.com/watch?v=YnLda2qgNyo
Kokila Title Song From Kokila Movie
Watch Kokila Video Song from Kokila Movie,
--((**))--
వారసత్వం 

ఎంత వారసత్వంగా వచ్చినా, కొత్తగా వ్యాపార పగ్గాలు చేపట్టాలనుకునేవాడికి తరాలుగా తాము చేస్తున్న వ్యాపారం గురించి పూర్తి అవగాహన ఉండాలి. 
తన ఉత్పత్తికెక్కడ మంచి గిరాకి ఉంది, తన ఉత్పత్తికి పోటీదారులెవరు, ఎంత గట్టిపోటి ఉంది, పోటీని ఎలా అధిగమించాలి, 
రాబోయె కాలంలో అవసరాలకనుగుణంగా తన ఉత్పత్తిని ఎలా ఎప్పుడు మార్చుకోవాలి, 
తదనుగుణమైన ప్రణాలికలేమిటీ, ఎవరి సహాయం తీసుకోవాలి, 
ఆర్ధిక, ఉత్పాదక, మానవవనురుల, మార్కెటింగ్ విభాగాలలో 
ఎవరి అర్హతేమిటీ, ఎవరి సామర్ధ్యమేమిటి, ఎవరి నైపుణ్యమేమిటి తెలుసుకుని ఎవరిని ఎక్కడ నియమించాలో అక్కడ ఆయా స్థానాల్లో అప్పుడు నియమించాలి. 
ఇన్ని తెలిసినవాడే వారసత్వంతో పనిలేకుండా ఒక మంచి వ్యాపారవేత్తగా రాణించగలడు..తన పూర్వీకులు స్థాపించిన సంస్థను మరిన్ని ఎత్తులకు తీసుకుపోగలడు. 
ఇవేమి లేకుండా కేవలం వారసుడన్న ఒక్క అర్హతతో తెచ్చి అందలమెక్కిస్తే ఆ సంస్థ దివాళా తీయటానికి ఎంతో సమయం పట్టదు.. 
ఏ అనుభవం లేకుండా కేవలం వారసుడైన అధ్యక్షుడికన్నా, ఆ సంస్థలో దశాబ్దాల తరబడి పనిచేసే ఒక చప్రాసి మేలు. వాడిని నమ్ముకుంటే మంచి ఫలితాలుంటాయి. 
భోగాలకి, రోగాలకి వారసత్వం పనికొస్తుందేమో గాని, అర్హతలు, నైపుణ్యానికి కాదు.
--((**))--
స్పర్శించే అక్షరాన్నై.................... 
అధిక్షేప ప్రేమ లీల
నిత్యం 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ  

నిత్యం స్పృశించే తనువు తాపానికి
 - మది మోస్తున్న తపన కారణాలెన్నో 

నిత్యం తపించే జ్ఞాపకాల గురుతుకి
 -  భారమై మోస్తున్న హృదయ సలుపులెన్నో  

నిత్యం శాసించే బలవంతపు బ్రతుకుకి
 - తనువు మోస్తున్న బాధతో నెప్పులెన్నో 

నిత్యం కలత కల్లోలాన్ని తొలగించటానికి
 - మనస్సును ఓదార్చిన సందర్భాలెన్నో 

నిత్యం మదిలో జరిగే మౌన పోరాటానికి
 -  విప్పలేని ఘర్షణ మాటలలో మర్మాలెన్నో 

నిత్యం కోరికలు కన్నీటిగా మారటానికి 
-  ఒప్పక భందాన్ని హత్తుకున్నా క్షణాలెన్నో   

నిత్యం నూతన ఉరవడి పోరాటానికి 
- తలపుల తప్పఁటడుగులు ఉలికిపాటులెన్నో 

నిత్యం అన్వేషణ కొత్త కొత్త మార్గానికి
- మార్పు, నేర్పు, ఓర్పుతో సత్యాన్వేషణాలెన్నో 

స్త్రీ అనగా నిత్యం పూచే పుష్పం 
ఉపయోగించే విధానాన్నిబట్టి 
పెరిగేదే గౌరవం అదే జీవితం 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా  
--((**))--

గాయకులు, కళాకారులు ఎక్కువైనారు. 
పోటీ ప్రపంచం. 
తమ గుర్తింపుకై ప్రాకులాట.. 
ఏ కీర్తనో, అష్టకమో ఇంతకుముందే ఉన్న రాగంలో పాడితేనో, మళ్ళీ అదే రాగం కూర్చితేనో గుర్తింపురాక పోగా విమర్శిస్తారు.. 
కొత్తదనం పేరుతో అక్షరాలని విరిచేసి, మధ్య మధ్య కొన్ని అరుపులు చేర్చి పాడేస్తున్నారు.. 
నోటికొచ్చినదే అయినా, బాగా విన్నదే అయినా అదేమిటో అర్థం చేసుకోవటానికి కాస్త ఎక్కువే కష్టపడాల్సి వస్తున్నది..
--((**))--

ఆపదలో ప్రాణాన్ని రక్షించువాడు నేటి కవిత 
ప్రాంజలి ప్రభ.కం 

ఆదుకొనేవాడు ఆరాధ్యుడు
కృషి వలుడు మధ్యముడు
స్వార్ధ పరుడు అధముడు
హింస పరుడు షండుడు

ప్రాణానికి ప్రాణం ఇచ్చువాడు
ఆపదలో ఆదు కొనేవాడు
కష్టసుఖాల్లో పంచుకొనేవాడు
మంచి మాటపంచెవాడు స్నేహితుడు

ఎవరు చెప్పిన వినని వాడు మూర్ఖుడు
లోకజ్ఞానం తెలియని వాడు అమాయకుడు
వివేకం చూపలేని వాడు అవివేకుడు
విచక్షణా హీనుడు దౌర్భాగ్యుడు

ప్రేమను గౌరవించేవాడు ప్రేమికుడు
భార్యను గౌరవించేవాడు తన్మయుడు
మాటను గౌరవించేవాడు శిష్యుడు
విద్యను భోధించేవాడు భోధకుడు

అధిక్షేప లీల 
ప్రాంజలి ప్రభ.కం 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

సమయానికి ఆదుకొనేవాడు ఉత్తముడు 
- నిరంతరం కృషి వలుడు మధ్యముడు

ఉంది లేదని స్వార్ధ పరుడు అధముడు
- స్త్రీ, పిల్లలను హింస పరుడు షండుడు

స్నేహానికి ప్రాణం ఇచ్చువాడు ఆరాధ్యుడు 
- ఆపదలో ఆదుకొనేవాడు స్నేహితుడు 

నిత్యం కష్టసుఖాల్లో పంచుకొనేవాడు మొగుడు  
- నిత్యం మంచి మాటచెప్పేవాడు ధర్మపరుడు 

ఎవరు చెప్పిన వినని వాడు మూర్ఖుడు
- లోకజ్ఞానం తెలియని వాడు అమాయకుడు

నిత్యం వివేకం చూపలేని వాడు అవివేకుడు
- అందరిపై విచక్షణా హీనుడు దౌర్భాగ్యుడు

నిత్యం ప్రేమను గౌరవించేవాడు ప్రేమికుడు
- నిత్యం భార్యను గౌరవించేవాడు తన్మయుడు

గురువు మాటను గౌరవించేవాడు శిష్యుడు
- వయసుకు విద్యను భోధించేవాడు భోధకుడు

కాలాన్ని బట్టి మంచిని గ్రహించి
ధర్మం, న్యాయం, సత్యం అనుకరిచేవాడే  
నిజమైన మానవుడు 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--
జ్ఞాన కంద గుళికలు (పొద్దు)   

పొద్దు వాలగానే లోకాన్ని
చీకటిలో వదిలి వెళ్ళేవాడు " రవి"
తాను చీకటిలో ఉన్నా
లోకానికి జ్ఞానాన్ని పంచేవాడు " కవి"

పొద్దు వాలగానే మత్తు 
సద్దు చేయక సాగు చక చక సూర్యుడు
వద్దన్నా కమ్ము యామిని
మద్దత గా నేనున్నాను వెన్నల జాబిల్లి 

దీప వెలుగులు కమ్ము 
గొప్పలు చెప్పుట మాని గూటికి చేరు శ్రీ వారు 
తప్పులు చేయుట మానే 
ఇప్పటి పిల్లల సుఖం కోసం కలిసే శ్రీమతి 

కన్ను తెరిస్తే చూడలేనిది
మన్ను ను కమ్ము కొని నీడలా మారే చీకటి
వెన్ను తట్టి వచ్చు వెలుగు 
నన్ను నా తోటి వారును ఆదుకొను లక్ష్మి      
-((**))--
సరదాగా తీసుకొవాలండొయ్!...మరి!! 
మా రోజుల్లో ,... 
"గులాబి పువ్వు" ఇస్తే చాలు.... 
ప్రేమ లో పడిపోయేవారు!! 

మరి...ఈ రోజుల్లో?? 
"ఆపిల్" ఇస్తే కానీ ప్రేమించడం లెదు!! 
....."ఆపిల్" అంటె పండు కాదండి బాబూ!! 
...."ఆపిల్" ఫోన్!!
--((**))--
సరదాగా తీసుకొవాలండొయ్!...మరి!! 
ఎందుకో, మరి!! 
ఇయ్యాల , పుట్టలో పాలు పొస్తొంటె ...... 
చాలా మంది గుర్తుకు వచ్చారు!! 
సరదాగా తీసుకొవాలండొయ్!... 
మీరు అస్సలు సీరియస్ అవ్వకూడదు!!!!
--((**))--
సరదాగా తీసుకొవాలండొయ్!...మరి!! 
1.పెళ్లి కాని వాడు.... 
"పెళ్లి చేసుకున్నాడు ఎంత లక్కీ నో" అనుకుంటాడు !! 

2.పెళ్లి అయినాడు, ' 
"బ్యాచులర్ ఎంత లక్కీ నో'' అనుకుంటాడు!! 

తేడా ఏమిటంటే గురువు గారూ.... 

మొదటి వాడు .....హొటల్ లో భోజనం చేస్తున్నప్పుడు అనుకుంటాడు!! 
రెండొ వాడు....ఇంట్లొ భుజనం చేస్తునప్పుడు అనుకుంటాడు!!
--((**))--
సరదాగా తీసుకొవాలండొయ్!...మరి!! 
"ప్రభాషితాలు"" 
ఒక అమ్మాయిని ప్రేమించారు!! 
అమ్మాయి మిమ్మల్ని ఎప్పుడు వదిలేస్తుందో (అదే ...బ్రేక్ అప్) మీకు ఒకటే టెన్షన్!! 
ఎం ఖంగారు పడకండి... 
సింపుల్.చిట్కా వుంది....... 
మీ గర్ల్ ఫ్రెండు దగ్గర అప్పు చెయ్యండి..!! 
మిమ్మల్ని వదిలితే వొట్టు!!
--((**))-- 
సరదాగా తీసుకొవాలండొయ్!...మరి!! 
ఆ మధ్య... 
"నాకు అబ్బాయి నచ్చలేదు డాడీ!!..... 
సినెమా హీరో లా వుండాలని చెప్పానుగా??!!" 
ఈ మధ్య... 
"అబ్బాయి కనీసం సీరియల్లో హీరో లా కూడా లేడు!!... 
నాకు నచ్చలేదు, డాడీ!!
--((**))--
ఇల్లు చక్కబెట్టుకుందాం 
***************************** 
ఇల్లు ఎంత పెద్దదన్నా కావచ్చు 
ద్వారం అదే తలుపు చిన్నగానే వుంటుంది. 
అదే తలుపుకి వేసే తాళం తలుపుకన్నా చిన్నదిగా వుంటుంది 
మరి తాళం చెవి తాళం కప్పకన్నా చిన్నగా వుంటుంది 
- అలాగే ఒక మంచి ఆలోచనతో అది చిన్నదైనా సరే ఇంటినే భద్రపరిచేటంతటి మహత్తరమైనపుడు ఆలోచించకుండా అమలు చెయ్యండి. 
దొంగలుపడి దోచుకున్నాక ఏమనుకుని ఎవరిననుకుని లాభం లేదు.
--((**))--
మేలిమి బంగరు మెలిక తిరిగినా విలువ తరిగేనా... 

చిత్రం : కలిసివుంటే కలదు సుఖం 
సంగీతం : మాస్టర్ వేణు 
గీత రచయిత : ఆరుద్ర 
నేపధ్యగానం : పి. సుశీల 

మేలిమి బంగరు మెలిక తిరిగినా విలువ తరిగేనా 
మీ దేహములో చిరు లోపములున్నా ప్రేమ కరువౌనా 

సింహము కాల్ళు చిక్కుపడిననూ శౌర్యము కొరవడునా -2 
చేతలు మాటలు ఒకటే అయితే త్యాగము కరువగునా 
త్యాగము కరువగునా - మేలిమి 

కాళ్ళే లేని కమ్మని చమ్ద్రుడు నిరతము పయనించునే - 2 
కరములు చాపే కలువను చేరి ముదము కలిగించునే 
ముదము కలిగించునే - మేలిమి 

పతి పదసేవా భాగ్యము నేనే సతతము నోచితినీ -2 
మీ చల్లని మదిలో సౌఖ్యములొసగే స్వర్గము చూచితిని 
స్వర్గము చూచితిని - మేలిమి 

https://www.youtube.com/watch?v=Rj1KRoMTzIg
Kalasi Vunte Kaladu Sukham - Telugu Songs - Melimi Bangaru - NTR - Savitri
Watch NTR Savitri's Kalasi Vunte Kaladu Sukham Telugu Old Movie Song With HD Quality Music - Master ...
--((**))--

--((**))-- 
రమ్మనె వనభోజనం.. కమ్మని వనభోజనం! 
------------------------------------------- 
(కార్తిక వనభోజన గేయం) 
సాకీ: 
పుణ్య కార్తికమందు కలుసుకొందామంటు.. 
ప్రేమతో పిలచింది పూల వనము.. 
భక్తి, శ్రద్ధల తోటి కలిసి తిందామంటు 
ఆహ్వానమందించె ఊరి జనము.. 
ఐకమత్యము కూడి, ఆధ్యాత్మికత తోడి 
జగతి నడచెడి ధర్మమార్గమెరిగి 
కలుసుకొందము రండి మిత్రులారా... 
కలుసుకొందము రండి మిత్రులారా... 

పల్లవి: రమ్మనె వనభోజనం.. కమ్మని వనభోజనం! 
కార్తిక మాసములో -పవిత్ర పంక్తి భోజనం! 

చరణం-1: సాంప్రదాయమొలుకు లక్ష్మి-దామోదర పూజలు! 
ఆధ్యాత్మిక పరిమళాల అలరు భక్తి సేవలు! 
ఉసిరి చెట్టు నీడన ప్రకృతితో సహజీవనం! 
పల్లెతల్లి ఒడిలో పరవశపు విందుభోజనం! 

చరణం-2: ఆట పాటలతొ సందడి చేసే పసి పాపలు 
ఆత్మీయత పంచు బంధు మిత్రుల చిరునవ్వులు 
ఆశీస్సులనిచ్చే పెద్దల మాటల మూటలు, 
కలిపి- తీపి గురుతుగ మిగిలేటి విందుభోజనం! 

చరణం-3: బ్రతుకునిచ్చు ప్రకృతిమాతకు చేసే వందనం 
భేదభావములనెరుగని మానవీయ సంగమం 
మన సంస్కృతి ఘనప్రతీక కార్తిక సమ్మేళనం 
ఇది తెలిసిన నాడే నిజమైన విందుభోజనం! 
-------------------------------------------------------------- 
విజ్ఞప్తి: 
ఈ గేయం నచ్చిన వారు, ఇతరులకు షేర్ చేయగలరు. Sound Cloud website లో స్వీయగానం తో అప్ లోడ్ చేయడం జరిగింది. విని మీ అభిప్రాయం తెలియజేయగలరు. 
సాంప్రదాయబద్ధమైన వనభోజనాలతో – సంస్కృతిని పరిరక్షించే అందరికీ వందనాలతో..... 
రచన: నూజిళ్ళ శ్రీనివాస్, రాజమహేంద్రవరం (94408 36041) 
https://soundcloud.com/noojillasrinivas/vanabhojanam-song-noojilla-srinivas
Vanabhojanam Song- Noojilla Srinivas
soundcloud.com

 చిరునగవు చిన్నది
మరువమాలతో మనసునే దోచేస్తున్నది
పరువములో ఉన్నది
కురులువిప్పి కులుకు దామా అన్నచిన్నది
తరుణి నీకు తగదు
తరతమ భేదాలు చూడ వెందుకు
కరములతో కవ్వించకు
నరములు లాగెట్టు మురిపాలెందుకు
చిరునవ్వెందుకు నన్ను చూ
సీ రుసరుస లెందుకు రసిక రాజశ్రీ
వరూధిని నేను ప్రవరా
తరుణిని తపనలు తగ్గించుటకు రా రా
ప్రమతో ఇద్దరు కలసి
ప్రేమను బ్రతికించాలని ఆలోచనతో
శ్రమలేకుండా సుఖానికి
తమకంతో, మత్తుతో తన్మయత్వం పొందెన్

   

సరదాగా తీసుకొవాలండొయ్!...మరి!! 
భర్త కి 2 అండర్వేర్ లు కొన్నది "సతీ లీలావతి".... 
రెండూ ఒకే రంగువి !! 
"రెండూ ఒకే రంగువి ఎందుకు కొన్నావ్??? 
చూసెవాళ్లు నేను అసలు.... 
అండర్వేర్ మార్చుకోనేమో అనుకుంటారు!!" అన్నాడు "తింగరి" భర్త!! 
"ఓహో!!....ఎవరో "వాళ్లు"!!" అంది "సతీ లీలావతి" గుడ్లెర్ర చెస్తూ!!
--((**))--

షికారి(కథ) 

సాహితీమిత్రులారా! 
ఈ కథ చదవండి- 

గప్పుడు పొద్దుగూకి నాలుగొట్టిండ్రు కావచ్చు. నేను గప్పుడే బడి కాడ్నించి అచ్చిన. బాపు కుక్కి మంచంల కూకోని ఏందొ ఆలోచన జేత్తండు. అమ్మ అంటింట్ల యేదొ సగవెడ్తంది. శాయ్ వెడ్తున్నదో ఏందొ, గిన్నెల సప్పుడు గలగల ఇనవడ్తంది. ఇంట్ల ఎవ్వలు లేరు, మే దప్ప. అన్నలు పట్నంల సదువుకుంటున్నరు. అక్కలు పెండ్లిల్లు చేసుకోని అత్తగారింటి కాడ ఉంటున్నరు. పండ్గకో పబ్బానికో అత్తరు. గప్పుడు ఇల్లంత కలకల లాడ్తది. 

నేను అంటింట్లకు అరుగు మీదికీ కోడ్రిగానోలె అటూ ఇటూ తిర్గుతన్న. నా మన్సంత ఇంటి ముందటి బజార్లనె ఉన్నది. ఎప్పుడు నా దోస్తులు రామడు , రవిగాడు, రాయేశడు అత్తరా – ఎప్పుడు ఆల్లతోని శిర్రగోనె, పెండల బుర్రి , గోటీలు, బొంగురాలు ఆడ్దామా అని గడె గడెకు పెద్దర్వాజ కాడికి బొయ్, బజార్లకు తొంగి సూత్తన్న. 

గింతట్ల అమ్మ రొండు జేతుల, రొండు కోపులల్ల శాయ్ దీస్కోని అచ్చి, బాపుకోటి నాకోటిచ్చింది. నాకిచ్చిందాంట్ల శాయ్ సగమే వుంది. ‘నాకు నిండ గావాలె! నాకు నిండ గావాలె!’ అని నేను మంకు పట్టు పట్టిన. 

అమ్మ ” ఏందిర పోరడ! ఎంతగనం దాగుతవ్ శాయ్ !” అని తిట్టుకుంటనె లోపల్కి బొయ్, కేతిరి దెచ్చి, నా కోపు నిండ శాయ్ నింపింది. 

ఇగ మేం శాయ్ దాగుడు షురు జేసినం. మా బాపు శాయ్ సాసర్ల వోస్కొని, ఒకటే జుర్రుతాండు. గా సప్పుడు బజార్ల కినిపిత్తంది. 
గింతట్ల బాపు శాయ్ దాగి, అమ్మను పిల్శి, “రాత్రికి కూరేం వండుతున్నవే” అని అడ్గిండు. 

” కూర పాడుగాను! ఏం కూర గాలవడ్డది! కూరగాయలు గిన్నెన్ని సూత లేవు.” అని అన్నది. 

బాపు మంచంల కెల్లి లేశి, దండెం మీదున్న శెల్ల నందుకోని తల్కాయకు రుమాల్ చుట్టుకుండు. సక్కగ అర్గు మీది అర్రలకు బోయిండు. మూలకు ఆనిచ్చున్న తుపాకి నందుకున్నడు. గిదంత నేన్ జూత్తనే ఉన్న. 

” ఇగొ! నేన్ షికారికి బోతన్న. పిట్టలొ శాపలొ కొట్టుకోని అత్త. నేనచ్చెటాల్లకు నువ్ అల్లమెల్లిపాయ రోట్లె దంచి పెట్టుకొ! ” అని అంకుంట తోలు శెప్పులు దొడుక్కున్నడు. 

” బాపు! బాపు! నేన్ గూడత్త ” అని నేనంగనె, అమ్మ ” నువ్వెంద్కురా పోరడా! గాడ్కి! పురుగూ బూశీ ఉంటయ్! ” అన్నది. 
నేను ” లే ! నేం గూడ బోత ” అని జిద్దు జేశిన. 

గప్పుడు బాపు నా దిక్కు ఓపారి జూశి, ” గట్లనే పా! ” అన్నడు. నా శేతికి వో చిన్న సంచిచ్చిండు. అండ్లేముంటయో నాక్ దెల్సు. శెర్రాలు, తుపాకి మందు, గంద్కం పూలు ఉంటయ్. ఇగ నేను ఊశిపోతున్న నెక్కర్ను నడుం మీద్కి అనుకుంట, పెరట్ల వడి బాపెంక ఉర్కుడు వెట్న. గీ తుపాకి మాకెట్లచ్చిందో జరంత జెప్త ఇనుండ్రి . దానెంక ఓ కతుంది. 

బాపు వైద్గుడు. అలొపతి ఆర్వేదం అన్ని గల్పి కొడ్తడు. ఎంతొ మందికి వైద్గం జేశిండు. ఇంక జేత్తండు. నేను పుట్టక ముందు అనుకుంట – రజాకార్ల లొల్లుల్ల, బాపు తను మందు జేశిన తాసిల్దారు నడిగి వో తుపాకి సంపాయించిండట ఎందుకైనా మంచిదని! గదే గిది. దీనికి లైసెన్సు సూత ఉంది. 
రజాకార్ల లొల్లి అయిపోయినంక మా బాపు షికార్కి బొయ్, పిట్టలను, కుందేల్లను, యేదులను కొట్క తెచ్చుడు మొదలు వెట్టిండు. ఇంతకు ముందు నేను బాపుతోటి మూన్నాల్గు సార్లు షికారికి బోయిన. 

బాపు తుపాకి బుజం మీద వెట్కొని, పెద్ద పెద్ద అడ్గులేస్కుంట పోతుండు. నేను యెంక సంచి వట్కోని ఉర్కుతున్న. తొవ్వల ఎవలెవలొ బాపుని మందలిత్తండ్రు. కొండ పోశడు గనవడి, ” ఏం పంతులు ! షికారికి వోతుండ్రా ? ” అని అడిగిండు. 
“అవ్ర పోశిగ ! అవ్ను గని శెర్ల శాపలేమన్న వున్నాయిర ?” అని బాపు వాడ్ని అడ్గిండు. 

” ఆ! శెర్లున్నయ్ ! గా లక్కోల్ల బాయిల సూత గింత గింత మొట్టలు వున్నయ్. పొయ్ రండ్రి ” అనుకుంట కొండ పోశడు ఎల్లిపోయిండు.

మే మడ్లల్ల వడి, యీదులల్ల వడి పోతున్నం. 

గింతట్ల బాపు, నడ్శేటోడల్ల ఒక్క మల్క ఆగి, ” అరేయ్ ! నువ్వెప్పుడన్న రొండు తల్కాయల పామును జూశినవారా ? ” అని అడ్గిండు. 
” లే! సూల్లేదు ” అన్న 
” అయ్తె సూడు . గదె రొండు తల్కాయల పాము ” అన్నడు బాపు. 

శాంతాడు పెట్టు దూరంల నల్లగ, దొడ్డుగ పండ్కోని వుంది పాము గెట్టు మీన. దాని తల్కాయెదొ! తోకేదొ! తెల్తలేదు. రొండేపుల ఒక్క తీర్గనే ఉన్నది. దాంకి ఇసముండది. కర్సినా మనిసి సావడు. దగ్గర్కి వొయ్ సూశిన. ” ఇగ వా! ” అనంగనె మల్ల నడ్సుడు వెట్టిన. 

నేన్ తల్కాయ లేపి ఒక్కపారి మొగుల్దిక్కుకు జూశిన. గువ్వలు, గోరెంకలు, కొంగలు, పాయిరాలు గూల్లల్లకు తిర్గి అత్తన్నయ్. శెట్ల నిండ ఆల్తన్నయ్. ” కీ! కీ! ” అని ఒక్కటె సప్పుడు. 

బాపు నడ్శేటోడల్ల మల్ల ఒక్క మల్క ఆగిండు. నేం సూత టక్కున ఆగిన. బాపు సప్పుడు జెయ్యకుంట, యీదులను సాటు జేసుకుంట, సాటు జేసుకుంట ఒక యీత మట్ట మీన తుపాకిని ఆనిచ్చి, కొమ్మల్ల గూసున్న గువ్వలకు సూటి వెట్టిండు. నేను దమ్మాప్కోని, బాపుని, తుపాకిని, గువ్వల్ను రెప్ప కొట్టకుండ సూత్తన్న. 

గింతట్ల బాపు ‘ ధన్ ‘ మన్నడు. గువ్వల్రొండు తపతప గొట్టుకుంట న్యాల మీన వడ్డై. నేనటు దిక్కు ఉర్కిన. నాకన్న మొదలె బాపు గువ్వల్ని దొర్కవట్టి , సంచిల ఏశిండు. వో ఈతాకు దెంపి సంచి మూతికి గట్టిక కట్టు గట్టిండు. సంచి నాకిచ్చిండు “పట్టుకోర” అని . నేన్ గట్లనె జేశిన. 

బాపు తుపాకిని మల్ల లోడు జేశిండు. ఇగ మేం మెల్లెమెల్లెగ లక్కోల్ల బాయి కాడ్కి బోయినం. అది పెద్ద మోట బాయి. అండ్ల సగం వడ లీల్లున్నయ్. ఇగ బాయి గడ్డ మీన కూసోని బాపు, లీల్ల దిక్కు సూసుడు వెట్టిండు. గింతట్ల వో బొమ్మె శాప లీల్ల మీన కచ్చి, గాలి దీస్కోని మల్ల లీల్లల్ల మునిగింది. ఒక్కొక్క శాప కిలో బరువు ఉంటది గావచ్చు. 

” సూత్తున్నావుర! ” అని అన్నడు బాపు. 

” సూత్తన్న బాపు! సూత్తన్న ! ” అని నేనన్న. 

బాపు దోతి, అంగి ఇడ్శి పారేశి, చిన్నపంచను గట్టుకున్నడు. తుపాకి లీల్లల్లకు సూటి వెట్టి కూసున్నడు. 

గింతట్ల ఇంకో బొమ్మె శాప మెల్లెగ లీల్ల మీన కచ్చింది. బాపు ‘ధన్ ‘ మన్నడు. శాప ఉడ్కు లీల్లు మింగి , క్యాల్ దప్పి తెల్ల బొత్తేస్కోని లీల్ల మీన ఎల్లెల్కల వడ్డది. బాపు తుపాకి ఆడ వారేశి, బాయిల దునికిండు. యీత కొట్టుకుంట బొయ్ శాపను దొర్కిచ్చుకున్నడు. మెల్లగ గడ్డపొంట, గడ్డపొంట దరి వట్టుకోని ఎక్కుకుంట మల్ల గడ్డ మీన కచ్చి శాపను సంచి లేశి బట్టలు దొడుక్కున్నడు. 

ఇగ మేం ఆడ్నుండి శింతామని శెర్వు కాడ్కి బోయినం. శెర్ల జిల్మలు మస్తుగున్నయ్. లీల్లల సగం మునిగిన తుమ్మ శెట్ల మీన కీ!కీ! అనుకుంట ఎక్కడ్నుంచో అచ్చి ఆల్తన్నయ్. శెట్టు కొమ్మలల్ల ఆటి గూల్లు గనవడ్తున్నయ్. గూల్లల్ల ఆటి పిల్లలు కీసు కీసు మని ఒకటే ఒర్రుతున్నయ్. బాపు మల్ల ఓ జిల్మకు సూటి వెట్టి ‘ ధన్ ‘ మన్నడు. అది కీ!కీ! అని రెక్కలు కొట్టుకుంట లీల్లల్ల వడ్డది. మిగిల్న జిల్మలన్ని ‘కెకెకె!’ అనుకుంట గాల్లెకు లేశినయ్. 

“దాన్ని తెత్తావుర !” అని బాపు నాతోని అనంగనె, నేను గట్లనె! అని అంగిడ్శి ఆడ వారేశి, నెక్కరు తోటె లీల్లల్ల దునికిన. యీత గొట్టుకుంట జిల్మ కాడ్కి వోతున్న. గింతట్ల ఒక్కపాలి నా కాల్లకేదొ సుట్టుకున్నట్టు అయింది. పానం గజ్జు మన్నది. ” నీరు గట్టెలా!? ఇంకేమన్న పాములా!?” లీల్లల్ల కాల్లు గట్టిగ కొట్టినాకొద్ది ఇంక కాల్లకు సుట్టుకుంటంది. కాల్లు గొట్టకుంటెనేమొ మునిగిపోతనాయె! ముంగల వోదమన్న యెంకకు అద్దామన్న నా వల్లైతలేదు. ఇగెట్ల! “అరె! గిది నాసు గావచ్చు ” అని గప్పుడు నాకనిపిచ్చింది. బాపు శెర్వు ఒడ్డు కాడ నిలవడి నన్నే సూత్తండు ,గని లీల్లల్ల నా కాల్లకేమైతందో గాయినకు సమజైతలేదు. ఇగ నేను ” ఓ బాపు! నా కాల్లకు నాసు సుట్టుకున్నదే ! ” అని లగాయించి ఒర్రిన. బాపు పరేశాన్ అయిపోయిండు. కొంచెం సోంచాయించి, ” అరెయ్! నీ ముంగల గడ్డున్నది సూడు! ఎట్లన్న ఆడ్కి బొయ్ గడ్డ మీన ఎక్కి కూకో!” అన్నడు. 

నాకు కడ్పులకెల్లి సలి వెట్టుడు మొదలైంది. పండ్లు టక టక కొట్టుకుంటున్నయ్. ఇగ ఎట్లనో ఉగ్గబట్టుకోని మెల్లమెల్లగ కాల్జేతులాడిచ్చుకుంట శెత్తోని నాసును తీశేసుకుంట, గడ్డకాడికి బోయి, గడ్డ మీనకు ఎక్కి కూకున్న. బాపు మల్ల ” గట్ల గట్ల గడ్డెంబడి లీల్లు తక్కువున్న జాగలకెల్లి యీడ్కి రా!రా! ” అని కీక వెట్టిండు. 
నేను బయపడుకుంట బయపడుకుంట గట్లనే మెల్లగ ఒడ్డు మీద్కి అచ్చి పడ్డ. బాపిచ్చిన శిన్నపంచెతోటి పెయ్ దుడ్సుకోని అంగి దొడ్కున్న. ఇగ మేం జిల్మను మర్శిపోయి ఇంటి మొకం బట్టినం. తొవ్వల బాపు ఒక్క మాట మాట్లాడలె! ఇంటి కచ్చినం. గప్పట్కే మా యమ్మ పెరట్ల నిలవడి పొయ్యినోల్లు ఇంకత్తలేరేంది” అని ఎదురు సూత్తంది. 

నేను లోపల్కి బొయ్, సంచి కింద దులిపిన. రొండు గువ్వలు,శాప తపుక్కున న్యాల మీన వడ్డయ్. ఇంక వాటి పానం పూర బోలె – గుడ్డి దీపం ఎల్గుల అటీటు మెసుల్తున్నయ్. 
అమ్మ ” ఆ! షికారి బాగనె చేస్కచ్చిండ్రు!” అనుకుంట నాదగ్గరి కచ్చి ” ఏందిర పోరడ ! నీ నెత్తి లాగు తడ్శినయ్ ! ” అన్నది.నేను జర్గిన కతంత జెప్పిన. 

ఇగ మా యమ్మ అందుకున్నది ” నీ షికారి పాడుగాను! ఎన్ని మల్కల జెప్పిన! పిట్టల్ని కొట్టద్దయ్యా! వాటి పిల్లలు అగాదం అయిపోతయ్ – గా పాపం మనకు సుట్టుకుంటది! అని. నువ్వింటవా! నీ శెటం నువ్వేనాయె! అట్టిగ పోరడు సచ్చిపోతుండె గద! ” అని బాపును తిట్టుకుంట , నన్ను మండుతున్న పొయ్ కాడ్కి దీస్కపొయ్ దాని ముంగల ఎచ్చగ కూకోవెట్టింది. తువ్వాలు దీస్కచ్చి నెత్తి దుడ్శింది. ” పొలగాడు బయపడ్డట్టున్నడు !” అని అనుకుంట జీడి గింజ తోటి జిష్టి దీసి దాన్ని పొయ్యి లేశింది. 
మా బాపు సప్పుడు జేత్తలేడు. ఊ! అంటలేడు, ఆ! అంటలేడు. మంచంల కూకోని ఎటో సూత్తండు. 


గీ కతయ్యి నాల్గు నెల్లయింది. బాపు మల్ల ఇగ షికారికి బోలె. ఏమనుకున్నడొ ఏమొ! వోనాడు తుపాకిని దీస్కోని కర్నారం బోయి, దాన్ని సర్కారుకు దఖల్ జేశి అచ్చిండు. నేను బడి కాడ్నుంచి గప్పుడే అచ్చిన. బజార్ల పోరగాండ్లు ఆడుకుంటున్న సప్పుడు ఇనవడ్తంది. గిర్న ఉర్కిపొయ్ ఇగ ఆల్లతోటి గల్సిన. 
---------------------------------------------------------- 
రచన - నాగరాజు రవీందర్, వాకిలి సాహిత్య పత్రిక 
---------------------------------------------------------- 

- ఏ.వి.రమణరాజు




No comments:

Post a Comment