Saturday, 14 July 2018

ప్రాంజలి ప్రభ (15 - 7 - 2018 )





--((**))--

































































 నేటి హాస్యం 
బావా -------------మరదలు 

ఓయ్ బావ ఏం చేస్తున్నావ్? 
ఏం లేదే మరదలు పిల్లా! 
just కూర్చున్నా! 
బావా! నాకు ice cream కావాలి! 
ఇప్పుడా మరదలు పిల్లా????? 
ఇప్పుడేరా బావా! 
ఇప్పుడు కుదరదే మరదలు పిల్లా! 
కొంచెం పనుంది! 
నా మురిపాల బావా! 
నాకంటే ఎక్కువనా నీ పని? 
అలా బుంగమూతి పెట్టకే కొంటె కోణంగి మరదలా! 
కొంచెం important 
కానీ నీ కంటే ఎక్కువ కాదురా! 
మరి వెళదాం పద బావలూ! 
వర్క్ అయిపోయాక వెళదాం లేవే మరదలా! 
పోరా కుంయ్యా బావా bye రా బావా! 
మరదలు పిల్లా! 5 minutes ఆగు మల్లీ call చేస్తా! 
పోరా గొట్టం బావా! bye 
hello మరదల్స్ 
Ha చెప్పరా బావగారూ, ఏంటి? 
ఒకసారి బయటికి రావే మరదల్స్ 
ఎందుకురా బావగాడూ? 
రావే తిక్క మరదలా! 
బావా! బావా! మంచీ బావా! Ha వస్తున్న 
ice cream తిందాం రావే చిట్టి మరదలా! 
మరి work ఉందన్నావ్ కదరా కంచర గాడిద బావా? 
నీకంటే నాకు important work ఏముంటుందే మర్దల్ పిల్లా? 
ఒరేయ్ బావా! మరి నేను అడిగింది ఇప్పుడేగా 
అప్పుడే ఎలా వచ్చావు? 
ప్రేమంటే అంతేనే పిచ్చి మరదలా! 
నీ గురించి నాకు తెలియదా 
నీకు ఎప్పుడు ఏమనిపిస్తుందో నాకు తెలియదా 
నా మనసుకి అనిపించింది 
నువ్వు ice cream 
అడుగుతావు అని మళ్ళి నువ్వు చెప్పాక నేను వస్తే late అయితదని ముందే తెచ్చేసా! 
ఒరేయ్ సన్నాసి బావా! 
మరి నాకు work ఉందని ఎందుకు చెప్పావురా? 
మరదలు మాణిక్యమా! 
నువ్వు అలిగితే బాగుంటావే 
కొద్దిసేపు నిన్ను ఆట పట్టించాలని అలా అన్నానే! 
నాకు తెలుసురా బావ నేనంటే నీకు పిచ్చిఅని 
I LOVE YOU BAVA 
Love you too పొట్టి 
సరే బావ తొందరగా పోదాంపా నా ice cream నాకోసం wait చేస్తుంది!
 --((**))--
మాష్టారూ! మీరొక్కరేగా స్టేషన్ ప్లాట్ ఫారమ్ మీద వున్నది? 
ఔను సారూ! 
అయితే నాలుగు ప్లాట్ ఫారమ్ టిక్కెట్లు ఎందుకు కొన్నట్టో? 
ఏమీ లేదు సారూ! 
ట్రైన్ నాలుగు గంటలు ఆలస్యం! 
టిక్కెట్ కాల పరిమితి కేవలం రెండు గంటలే, 
ఎనిమిది గంటలు ప్లాట్ ఫారం పై ఉన్నా పర్వా వుండదనే వుద్దేశం తో నాలుగూ ఒకేసారి కొనేసాను! 
హహ్హహ్హహ్హా!!!!!!!!!
--((**))--
Cutting files

సేకరణ 

మరదలా మజాకా :-బావామరదళ్ళ సరసాలంటే (యిప్పుడు లేవు లెండి)చిలిపిదనాల పరవళ్ళే.యిద్దరూ సమ వుజ్జీలైతే పరవా లేదు. కానీ మరదలిది పై చెయ్యి అయితే మాత్రం ఆ బావగారి కష్టాలు భగవంతుడి కెరుక.ఒకసారి ఒక మరదలు బావను యిలా ఆటపట్టించిందట. 
"ఒకరికి చేతులిచ్చాన్,ఒకరికి కాళ్ళనిచ్చాన్,ఒకరిని చేతబట్టి కూకున్నానోయ్ బావా" 
మరదలిలా పాడిందో లేదో బావకి ముచ్చెమటలు పట్టేశాయి.ఎలాగో మాటలు కూడబల్కు కొని ఎవరికి చేతులిచ్చావ్,ఎవరికి కాళ్ళనిచ్చావ్,ఎవరిని చేతబట్టి కూకున్నావే పిల్లా అన్నాడు.మరదలికి జాలేసి గుట్టు విప్పింది."గాజులకి చేతులిచ్చాన్,కడియాలకి కాళ్ళ నిచ్చాన్,డబ్బుల్ని చేత బట్టీ కూకున్నానోయి బావా". 
అని పాడింది. హమ్మయ్య అని గాలి పీల్చుకున్నాడు.బావ.యింతలో మరదలు యింకో బాంబు పేల్చింది."ఒకర్నీ నానేశాన్ 
ఒకరినీ చితగొట్టాన్,ఒకరిని చుట్టచుట్టి కూకున్నానోయ్ బావా"అంటూ పాడింది.బావ గాబరా పడిపోయాడు. 
నానేయడమేమిటి? చితగ్గొట్టడ మేమిటి? చుట్టచుట్టుకోడ మేమిటి?అంటూ తలపట్టుకొని కూచున్నాడు ఆ అమాయకపు బావ. అది చూసి ఆ సింగారాల చిన్నది గమ్మత్తుగా నవ్వుతూ,"సున్నాన్ని నానేశాన్. 
వక్కల్నీ చితగొట్టాన్,ఆకులనీ చుట్టచుట్టి కూకున్నానోయ్ బావా" అని బావని చిన్నగా మొట్టింది. 
తల బొప్పి కట్టితే కట్టింది కానీ 'తత్వం' బోధపడింది అనుకున్న బావ మరదల్ని చుట్టేసుకున్నాడు..
--((**))--
నేటి హాస్యం 
సార్! మీరోక్కరే వున్నారు 
రెండు గ్లాసులు, రెండు షోడాలూ, రెండు క్వార్టర్ బోటల్స్ తెమ్మంటున్నారు. 

ఓ! అదా! నాకోకటి, నా స్నేహితుడికోకటి 

అయితే రెండూ మీరే తాగేసారు. మీ స్నేహితుడికో? 

వాడు చచ్చిపోయాడు. వాడి ఙ్ఞాపకార్దం ఇలా 

రోజూ ఇదే పద్దతీ 
ఆర్నెల్ల తర్వాత 
అన్నీ ఓక్కోక్కటే ఆర్డర్ ఇఇచ్చాడు 
బేరర్ "మరి రెండేసి అఖ్ఖర్లేదా" అని అడిగేడు 

నేను మానేసాను డాక్టర్ మానేయమంటే 
కాని మా స్నేహితుడు మానలేకపోతున్నాడు 
అందుకే ఓక్కోక్కటీ అదీ వాడిగురించి మాత్రమే
--((**))--

Rainbow colors
సేకరణ
*గోమాత జననం* 

🌼 ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణంలో ఉంది. 
దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతమును త్రాగారు. 
త్రాగిన తరువాత వారు ప్రసన్నమయ్యారు. 
ఆ సమయములో వారి శ్వాస ద్వారా సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది. 
ఆ శ్వాస నుండి ఒక్క ఆవు జన్మించినది. 
సుగంధము ద్వారా జన్మించుట వలన దక్షప్రజాపతి దానికి ‘సురభి’అని పేరు పెట్టారు. 
సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. 
అందుకనే సురభిని గోవంశమునకు మాతగా, జననిగా పరిగణిస్తారు. 

🌼ఋగ్వేదంలో వేదంలో 4వ కాండలో 12వ సూక్తం గోసూక్తంగా గోమాత యొక్క మహత్యం వరించబడింది. 
శ్రీసూక్తం, పురుష సూక్తం, మన్యు సూక్తం లాంటి పవిత్ర సూక్తాలతోపాటు గోసూక్తం కూడా చెప్పబడింది. 
గోవు రుద్రులకు తల్లిగా, వసువులకు పుత్రికగా, ఆదిత్యులకు సోదరిగా, నెయ్యి రూపాన అమృతంగా చెప్పబడింది. 

🌼 ఋగ్వేదంలో ఆవును ‘‘అఘణ్య’’ అన్నారు. 
సముద్ర మధనము నుండి దేవతల కార్యసిద్ధికై, సాక్షాత్తు సురభి బయల్వెడలినది. 
సంతోషముగా ఉన్నది, కపిల వర్ణముగలది, పొదుగు బరువు చేత నెమ్మది, నెమ్మదిగా అలలపై నడుస్తూ వచ్చుచున్న కామధేనువును చూచిన దేవతలంతా గొప్పకాంతిగల ఆ ఆవుపై పుష్పములు కురిపించిరి. 
అపుడు అనేక విధములు వాధ్యములు, తూర్యములు మ్రోగింపబడినవి. 
లోకములో గోసంతతి వ్యాపించడానికి ఆమెయే ఆధారం. 
ఆ సురభిరోమకూపాల నుంచి కొన్ని లక్షల సంఖ్యలో గోవులు పుట్టాయి. 
వాటి మగ సంతతి వృషభాలు. 
*‘‘గావః విశ్వస్య మాతరః గవా మాంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశ’’* 

🌼ఆవు విశ్వజనులందరికీ తల్లి వంటిది. 
గోవు నందు చతుర్దశ భువనాలున్నాయని వేదం చెబుతుంది. 
అంటే గోవు పృథ్వీ రూపమని అర్థం. 
క్షీర సాగరమధన సమయంలో నంది, శుభద్ర, సురభి, సుశీల, బహుళ అనే అయిదు గోవులు ఉద్భవించాయని భవిష్యపురాణం తెలియజేస్తుంది. 
వీటినే కామధేనువులు అంటారు. 
వంద గోవుల చేత కూడివున్న ఆ ధేనువు, సురభిని నీటి మధ్య నుండి తీసుకొని వచ్చిరి. 
ఆ గోవులు దట్టమైన నీలిరంగులోనూ, నలుపు రంగులోనూ, ధూమ్రవర్ణములోను, 
బభ్రు వర్ణములోను, 
శ్యామ వర్ణములోనూ, ఎరుపు రంగు, 
పింగళ (చిత్ర) వర్ణములోనూ ఉండినవి. స్కాంద పురాణము. 

🌼గోశబ్దము స్వర్గమునకు, బాణమునకు, పశువునకు, వాక్కునకును, వజ్రాయుధమునకును, దిక్కునకును, నేత్రమునకును, కిరణమునకును, భూమికిని, నీళ్ళకును పేరు. 
‘‘ధేనునా మస్మి కామధుక్" అని గీతలో శ్రీకృష్ణుడు నేనే గోవునని చెప్పుకున్నాడు. 
గోవు లక్ష్మీ స్వరూపం. 
దీనికి ఒక పురాణ గాధ ఉంది. 
దేవతలందరూ వచ్చి గోవుతో తల్లీ మేమందరం నీ శరీరంలో నివసించడానికి కొంచెం భాగం ఇవ్వమని ప్రార్థిస్తే గోవు దేవతలందరికి భాగం ఇవ్వడం జరిగింది. 

🌼సురభి ఒక్కసారి తపస్సునారంభించనది. 
బ్రహ్మ దేవుడు ఆ తపస్సునకు మెచ్చి సంతుష్టుడయ్యారు. 
సురభికి అమరత్వమును ప్రసాదించారు. 
త్రిలోకముల కన్నా పైన ఉండే స్వర్గమును వరముగా ఇచ్చారు. 
దీనిని స్వర్గ గోలోకమనే పేరుతొ పిలుస్తారు. 
గోలోకములో సురభి నిత్యమూ నివసిస్తుంది, ఈమె కన్యలు, సుకన్యలు భూలోకములో నివసిస్తారు. 

🌼ఈ గోలోకమునకు అధిపతి గోవిందుడు అనగా శ్రీ కృష్ణుడు. 
శ్రీకృష్ణ పరమాత్ముడు ‘గోప్రేమికుడు’ అని అంతటా ప్రాచుర్యమైనదే! 
స్పర్శ మాత్రము చేత గోవులు సర్వ పాపముల నుండి మానవులను విముక్తులను చేస్తాయి. 
ప్రతి దినమూ స్నానం చేసి గోవును స్పృశించినవాడు సర్వపాపాల నుండి విముక్తుడౌతాడు. 
గోమయములో లక్ష్మీ దేవి, గోమూత్రములో గంగాదేవి నివాసముంటారు. 
గోమూత్రము, గోమయాలతో నేల పరిశుద్ధము, పరిపుష్ఠము అవుతుంది. 
గోమయమును అగ్నితో శుద్ధి చేసిన యెడల ఆ భస్మమే విభూతి యగును. 
ప్రతిదినము ఆవులకు నీరు త్రాగించి గడ్డిని మేతగా తినిపించేవారికి అశ్వమేధ యజ్ఞం చేసినంత చేసిన పుణ్యం వస్తుంది. 
‘‘ఒక గోవు తన జీవితకాలంలో సగటున 25వేల మందికి ఆకలి తీరుస్తుందని చెబుతూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని చెప్పారు. 
మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితోపాటు కొంత సమయం గడపటంవల్ల, మన శరీరంలో వున్న అనారోగ్యాన్ని, ఆ గోవు ముక్కులోవున్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది, తరువాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని, అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది, ఆ పాలు తాగడంవల్ల మన వ్యాధి నయం అవుతుంది. 
గోమాత - కీర్తనం శ్రవణం దానం, ధర్మం, గోరక్షణం, గోరక్షణ ప్రోత్సాహం, గోరక్షణ ప్రోత్సాహక ప్రేరణం… అన్నీ పుణ్యప్రదమైనవే. 

జై గోమాత జైజై గోమాత 
గోమాత పాదాలకు శతకోటి వందనాలు🌞 
--((**))--

Vector pattern
వాల్మీకి మహర్షి విరచిత యోగ వాశిష్ట సారము 

41. లవణుని చిత్తభ్రమ 
పూర్వకాలమున, హరిశ్చంద్రుని వంశమున జన్మించిన లవణచక్రవర్తి, ఒక దినమున, ఏకాంత ప్రదేశమున గూర్చున్నవాడై, ఇట్లు మనంబున చింతించెను. నా పితామహుడు పూర్వకాలమున రాజసూయయాగమొనర్చి పేరువడసెను. నేనును అట్టి యాగమును చేయవలయునని, తగిన యజ్ఞ సామాగ్రి లభించకుండుట, రాజాదులను భాధించవలసి వచ్చుట. మంత్రులు ఇతరుల అసమ్మతి వలనను, నేను మానసికముగనే రాజసూయ యాగమును సల్పెదనని నిశ్చయించి, మనంబుననే యజ్ఞ సామాగ్రిని సమకూర్చుకొని, యజ్ఞ దీక్షకు పూనుకొనెను. మనంబుననే బుత్విజులను పిలచెను. మౌనులను పూజించెను, దేవతలనాహ్వనించెను, హవిస్సుల ద్వారా అగ్నిని, ప్రజ్వలింపజేసెను. ఇట్లు యజ్ఞ వాటికను భావించి తన కోర్కె మేర యజ్ఞము నొనర్చెను. ఇట్లు ఒక సంవత్సరము గడచెను. తన సర్వస్యమును బ్రాహ్మణాదుల కొసగి రాజు తన యుధ్యానవనమున, మానసిక యజ్ఞము నుండి మేల్కొనెను. అంతట సంతుష్ణుడై యుండెను. అట్టితరి అతనికి యజ్ఞఫలము లభించవలసియున్నది. ఓరామా! ఆ ఇంద్ర జాలికుడు, లవణుని రాజసభయందు ప్రవేశించినపుడు, నేనచటనే యుంటిని గాన ప్రత్యక్షముగ నవలోకించితిని. ఈ ఇంద్రజాలికుడు ఇంద్రజాల మంతయునైన తదుపరి వెడలిపోగా, సభాసదులు, రాజు ఈ చిత్రమునకు కారణమేమియో తెలుపుడని నన్నడిగిరి. అపుడు నేను యోగబలముచే, నంతయు నెఱిగి, వారలకా వృత్తాంతమును తెలిపితిని. రాజసూయ యజ్ఞ మొనర్చినవారు, పలు విధముల ఆపవాదులు దు:ఖములు పండ్రెండు సంవత్సరములు వరకును పొందుదురు. కాన నోరామా! రాజసూయ మొనర్చిన, ఆ లవణునకు దు:ఖమును కలుగజేయుటకు గాను ఇంద్రుడు ఆకాశము నుండి, ఇంద్రజాలకుని, వాని చెంతకు పంపెను. ఆ దేవదూత లవణునకు, అరువది సంవత్సరముల వరకు, గొప్ప ఆపద గలగజేసి, ఆకశమున అంతర్గతుడయ్యెను. ఇందంతయు ప్రత్యక్షముగ జరిగియుండెను. కావున నోరామ! మనస్సే విలక్షణమగు ఈక్రియలన్నింటియొక్క కర్తయు, భోక్తయునగును. కావున ఈ చిత్తమే జీవులందరను మోహపర్చు అవిద్యయని యెరుంగుము. వృక్షము, తరు, శబ్దములవలె అవిద్య, చిత్తము, జీవుడు, బుద్ది మున్నగు వానియందు భేదము లేదు. ఇది తెలుసుకొని నీవు చిత్తమును సంకల్ప రహిత మొనర్చుము. చిత్త నైర్మల్యమను, సూర్యుడుదయించిన, అజ్ఞానాంధ కారమంతయు, సమసిపోవును. కావున స్వాత్మ దర్శనముచే నంతయు, యెల్ల కాలమందును, సర్వరూపమగు ఆత్మయె వెలగుచుండును. ఇదియె పరమార్ధ స్దితి. కాల్చని మట్టి పాత్రలు, నీటి యందు కలసిపోవునట్లు, ఈదృశ్య ప్రపంచము, అందలి జీవులు, బ్రహ్మైక్యము పొందును. 
అంతట శ్రీరాముడు, చంచలమగు ఈచిత్తమును ఎట్లు బ్రహ్మతత్వము వైపు మరల్చవలెనని అడగెను. అంతట వసిష్ఠుడు బ్రహ్మతత్వమును పొందవలెనన్న, మనస్సును బాహ్య వృత్తుల నుండి యింద్రియములను మరల్చి, బ్రహ్మత్వ మందు చేర్లి, మనోలయమును పొందవలెనని చెప్పెను. ఈబ్రహ్మండమున సాత్విక, తామసికి రాజసములని మూడు విధములగు జీవులు, బ్రహ్మ వలన సృష్టించబడుచున్నారు. ఇట్లు అనేక బ్రహ్మండములందు, అనేక జగత్‌ స్వరూపములు నుత్పన్నమగుచున్నవి. ఈయుత్పత్తి ఎల్లపుడును జరుగుచునే యుండును. కల్పాంతము నందు లయమగుచుండును.అలానే ప్రతి పరమాణువునందు, అసంఖ్యాకములగు జగత్తులు కలవు. ఈ జగత్తులలో మొదట శబ్ద తన్శాత్రమైన ఆకాశము, అందుండి స్పర్శ తన్శాత్రమైన వాయువు, అందుండి రూపతన్శాత్రమైన అగ్ని, అందుండి రుచి తన్శాత్రమైన జలము, అందుండి, వాసన తన్శాత్రమైన భూమి యుత్పన్నమగును. తదుపరి మనస్సు, బుద్ది, చిత్తము, అహంకారములు నగు అంత: కరణ చతుష్టయము లేర్పడును. ఇవి జీవకోటి యుత్పత్తికి కారణమగుచున్నవి. హిమవర్షాదుల ద్వారా ఔషద రూపమున, అన్న మందు ప్రవేశించి, పురుషులచే భుజింపబడి, క్రమముగ గర్బదశను పొందుచున్నవి.
 --((**))--

కథా శిల్పి చాసో.- చాగంటి సోమయాజులు - కథ 'కుంకుడాకు'! 

నేను చదివిన 'కుంకుడాకు' కథ 1943లో అరసం రచయితల తొలి సభాసంచికలో ప్రచురితమైన కథ. 
1985లో చాసో సప్తతి సందర్భంగా (ఆయనకు 70ఏళ్ళ సందర్భంగా) కళింగ కథల సంకలనం ఆయన తన సొంత ఖర్చుతో ప్రచురించారు.గురజాడ వారి ప్రాంతానికి, అంటే కళింగ ప్రాంతానికి చెందిన కథకుల సంకలనం ''కళింగ కథానికలు''పేరిట చాసో ప్రచురించారు. 
ఆ సంకలనంలోని కథలు చాసో తన భావాలకు అనుగుణంగా ఏర్చి కూర్చి నవి. 
''ఈ కథ నేను రాస్తే ఎంత బావుణ్ణు'' అనే భావం కలిగించిన కథలను ఎంపిక చేసుకున్నానని ఆయన తన ముందుమాటలో చెప్పుకున్నారు. అంటే అది కేవలం ఆయన వ్యక్తిగత ఇష్టాలతో కూడుకున్న సంకలనం అన్నమాట. అందులో ఆయన తన కథ 'కుంకుడాకు'ను ఎంపిక చేసుకున్నారు. ఆ రకంగా అది ఆయనకు నచ్చిన కథ కాబోలు అనుకున్నాను. అంటే కాదు, ఆ ముందు మాటలో ఆయన ఇంకో మంచి మాట అన్నారు. ''నేను కథా రచనా నేర్చిన రీతిలో ఈ సంకలనాన్ని రూపు దిద్ది యువతరానికి అందిస్తు న్నాను. యువతరం కోసమే ఈ సంకలనం'' అని చెప్పారు. 

ఇక 'కుంకుడాకు' కథ గురించి... ఇందులో వర్గ దోపిడీ లాంటి పడికట్టు పదాలు ఏవీ వుండవు. కానీ కథ మాత్రం అందుకు సంబంధించిందే. ఇద్దరు బాలికలు, అందులో ఒకమ్మాయి వయస్సు ఎనిమిదేళ్ళు, రెండో అమ్మాయి వయస్సు చెప్పరు. ఇద్దరూ పొలాల్లోకి వెళ్తారు. 
ఒకమ్మాయి మోతుబరి రైతు కూతురు. కొంచెం హోదా వున్నది. 
రెండో అమ్మాయి కూలివాడి కూతురు. రైతు కూతురు పారమ్మ చింకి పరికిణి కట్టుకుంటే, కూలి కూతురు గవిరి గోచి కట్టుకుంది. 
పారమ్మ ఊరగాయ తింటే. గవిరి ఇంట్లో పొయ్యి లేవక పస్తు ఉంది. నెత్తిమీద కొండంత సంసారభారం పెట్టుకున్న గవిరి ఆకు, అలమా, కర్ర ఏరుకుంటుంటే పారమ్మ పట్టుబడతా నన్న భయం లేకుండా పక్క పొలంలో పెసరకాయలు తెంపుకొని తింటుంది. ఎందుకంటే ఆ పిల్ల అప్పలనాయుడు బొట్టి. అదే పని గవిరి చేస్తే అది పెద్ద నేరమవుతుంది. అందుకని రాత్రంతా తిండిలేక కడుపు కాలుతున్నా, పారమ్మ చేసిన పని గవిరి చేయలేకపోయింది. కుంకుడాకు చూడగానే గవిరి ఆకలి కూడా మర్చిపోగలి గింది.ఎందుకంటే కుంకుడాకులు దళసరివి. నాలుగాకులు ఏరితే తట్ట నిండు తుందని గవిరి ఆశ. కుంకుడా లు గంపకెత్తుకొని ఇద్దరూ కాంభుక్తా కళ్ళాం వారపోతుం డగా సింతకాయలు కనిపిం చాయి. 
పాపం అవి తినాలని గవిరి రాళ్ళు విసురుతుంటే కాంభుక్తా వచ్చేశాడు. గవిరి తట్టని కిందపడేసి అక్కడ కనిపించిన పేడని కూడా అదే దొంగతనం చేస్తోందని అనుమానించి దాన్ని చెప్పుతోకొట్టి గవిరి కిందపడి ఏడుస్తుంటే తృప్తిగా వెళ్ళిపోయాడు. 
చెయ్యని తప్పుకి నెత్తినోరు కొట్టుకొని చెప్పినా వినకపోతే, వూరంతా భయపడే కాంభుక్తాని బూతులతో తిట్టడం ప్రారంభించింది గవిరి. 
''లమిడీ కొడకా! నీ సింత కంప లెవిడికి అక్కరనేదు'' అనుకుంటూ కుంకుడాకుని కూడదీసి తట్టకెత్తి ఇంటికి బయలుదేరింది. 
గవిరి, పారమ్మ పొలాల్లోకి వెళ్తున్నప్పుడు పక్కనున్న స్కూల్లో పిల్లలు తల్లీ నిన్ను దలంచి, సరస్వతీ నమస్తుభ్యం పాడుతున్నారు. గవిరి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు ఆ పిల్లలు ఎక్కాలు వల్లె వేస్తున్నారు. అంతే కథ. 

కథ చిన్నదే. విషయం మాత్రం పెద్దది. డబ్బున్నవాడు తప్పులు చేస్తే తప్పించుకోగలగటం. పేదవాడు చిన్న చిన్న తప్పులకు పెద్ద శిక్షలు అనుభవించటం అనే అంశాన్ని ఇద్దరు పిల్లల వైపు నుండి రచ యిత చూపించాడు. 
ఇక స్కూల్‌ పిల్లల ప్రస్తావన మామూ లుగా చూస్తే కథకి అనవ సరంగా కనిప ిస్తుంది. కానీ, ముందే చెప్పినట్లు రచయిత అనవసరమైనవేవీ కథలో చూపించడు.గవిరి వయస్సు పిల్లలు బళ్లో చదువుకుంటూ పాఠాలు నేర్చుకుం టున్నారు. 
ఆ చదువు సమాజంలో బతకటానికి పనికివస్తుందని మనందరి నమ్మకం. కానీ పేదవాళ్ళు జీవితం నుండి బతుకు పాఠం నేర్చుకుంటారని చెప్పాడు రచయిత ఈ కథ ద్వారా. తప్పుచేయలేదని కాంభుక్తాకి నెమ్మదిగా చెప్పింది గవిరి. వినలేదు. 
అతడ్ని బూతులతో తిట్టడానికి కూడా వెనుకాడలేదు. అలాగే అతని చింత కంపల్ని ఇవెవడికి కావాలి అని తిరస్కరించి తన అభిమానాన్ని చాటుకుంది. 
ఎవరి సొత్తు కానీ కుంకుడాకుని ఏరుకుంది.రైతు కూతురు అయివుండి పారమ్మ పొలంలో పెసరకాయలు తిని పబ్బం గడుపుకుంది. 
డబ్బు తక్కువైనా పేదవాడు గుణానికి మిన్న అని కూడా అర్థమవుతుంది 
. అభ్యుదయాన్ని కాంక్షిస్తూ, మార్క్సిజాన్ని నమ్మిన రచయిత చాసో సామాజిక 
అవగాహనకు అద్దం పట్టే కథ ఇది.

--((**))--


సరదాగా తీసుకోవాలి, మరి!! 
"ప్రభచనాలు" 
"అతితెలివి అనర్ధ దాయకం" 
ఒక పెద్ద మనిషి .... 
ఆఫీస్ లో పనిచేసే.... 
తన సెక్రటరీ ని పెళ్లి చేసుకున్నాడు!! 
"నేను ఎం చెప్పినా వింటుంది...చేస్తుంది" అని అనుకున్నాడు ట!!
--((**))--
సరదాగా తీసుకోవాలి, మరి!! 
"ఈ రోజు ఊరికి వెళతారన్నారు, వెళ్లలెదెమ్?!! అడిగింది "భారి కాయెశ్వరి" 
"పో దున్న పోతా....పడుకో" అన్నాడు "సింగిల్ ఫ్రేం" శంకరం! 
"ఇప్పుడు నేనేమన్నానని...నన్ను తిడుతున్నారు?? అని కళ్లెర్ర జేసింది "భారి కాయెశ్వరి " 
"నా ఖర్మ ... 
నిన్ను తిట్టే ధైర్యం కూడా నా నాకు??... 
పొద్దున్నపోతా ఊరికి అని అంటున్నాను " అన్నాడు "సింగిల్ ఫ్రేం" శంకరం! 
"అదే నేను అనుకున్నాను... 
అంత ధైర్యం మీకెక్కడిదీ అని" 
అనుకుంటూ పక్కకు తిరిగి పడుకుంది ''"భారి కాయెశ్వరి "

--((**))--
󾮞󾮞󾁁హర హర మహా దేవ శంభో శంకర ఓం నమః శివాయ󾁁󾮞󾮞 
󾁇󾁆󾁀పరమేశ్వరుని ఆశీస్సులతో... ఈ రోజు మనందరకీ మంచి జరగాలని ఆశిస్తు మిత్రులందరికీ శుభోదయం శుభదినం. 󾁀󾁆󾁇 
☝󾀽󾁅 లింగాష్టకం  󾁅󾀽☝ 
(1)బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం | 
జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం || 

(2)దేవమునిప్రవరార్చితలింగం కామదహన కరుణాకర లింగం | 
రావణదర్పవినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 

(3)సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం | 
సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 

(4)కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభిత లింగం | 
దక్షసుయజ్ఞ వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 

(5)కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం | 
సంచితపాపవినాశనలింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 

(6)దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం | 
దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 

(7)అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం | 
అష్టదరిద్రవినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 

(8)సురగురుసురవరపూజిత లింగం సురవనపుష్పసదార్చిత లింగం | 
పరాత్పరం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 

☝| లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ |☝ 
󾮞|| శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||󾮞


 --((**))--

 

No comments:

Post a Comment