ఓం శ్రీ రామ్ - శ్శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణయాణమ:
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం
కానగా లేనురా కన్నులార - ధ్యానమే నీదిగా ధ్యాస మీర
గానమే సేతురా గతులు జార - ప్రాణమే నీదిగా ప్రభో రార
కాముకా రావేల కన్నె చోర - ప్రేమలో మునగంగ ప్రియము లేర
ఏమదీ కోపమా వీడి రార - నామదీ నీదెగా నమ్మవేర
రార,చోర,జార ప్రేమతో అనుట తప్పు కాదు
కల్ముషం లేని పలుకు ప్రేమపలుకౌనుర
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--
ఓరగా చూడకూ వలపు లూర - దోరగా పండేను దోచు కోర
హారమే వేయ రా హాయి తీర - సారమే నీదిగా సమరవీర
కోరుతూ పిలిచేను కోర్కె మీర - మారుడా రావేల మనసు తీర
జోరుగా రావేల చెంత జేర - జారుగా వెన్నెలా చింత తీర
రార,చోర,జార ప్రేమతో అనుట తప్పు కాదు
కల్ముషం లేని పలుకు ప్రేమపలుకౌనుర
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--
అప్పు చేయకురా నరుడా - తప్పు చేయకురా నరుడా
అప్పు తప్పు చేసిన వాడికి - చిప్ప కూడే గతిరా
అవసరం ఉంటె కాదు లాభం ఉంటెనే చేయాలిరా అప్పు
ఆపదనుండి గత్యంతరం లేనప్పుడు చేయాలిరా తప్పు
--((**))--
నూతన వర్ష సంకల్పము !!!
1. ఆ.వె. మంచి చేయ గాను మార్గమ్ము జూపించి
మనసు బుద్ధి రెండు మసల గలసి
లేని పోని యూసు లేకుండ సాగింప
క్రొత్త యేట ప్రభుని కోరు కొనెద !!
2. ఆ.వె. న్యాయ మార్గ మందు నడిపించి నిత్యము
తోటి మనిషి నలగ దుఃఖ మందు
చేత నైన సేవ జేయింప నాజేత
క్రొత్త యేట ప్రభుని కోరు కొనెద !!
3.ఆ.వె. సంఘ మందు నేడు సహన విహీనులు
నీతి తప్పు వారె నేత లవగ
బెదురు లేక వాని , నెదిరించి నిల్వగ
క్రొత్త యేట ప్రభుని కోరు కొనెద !!
4. ఆ.వె.చదువు లబ్బె నాకు చదువులమ్మ చలువ
చదువు లేని వాని సాయ ముండి
తల్లి ఋణము దీర్చ దపన లివ్వ మనచు
క్రొత్త యేట ప్రభుని కోరు కొనెద !!
5. ఆ.వె. గర్వ మున్న వాడు కళ్ళు యున్న కబోది
క్రోధ మెక్కు వైన కుదురు దప్పు
వీని నదుపు జేయ వేడుకొనుచు నేను
క్రొత్త యేట ప్రభుని కోరు కొనెద !!
6. ఆ.వె. గొప్ప నీది చూపి జెప్ప మిగులు నేమి ?
స్వంత వారె వీడు సాయ మొదలి
నిండు కుండ బోలి యుండ తొణక కుండ
క్రొత్త యేట ప్రభుని కోరు కొనెద !!
7. ఆ.వె. పెద్ద రికము రాదు బెత్తమ్ము జూపించ
కలిమి తోన రాదు గౌరవమ్ము
పొందు జేయ పరువు బుద్ధి నివ్వ మనుచు
క్రొత్త యేట ప్రభుని కోరు కొనెద !!
8.ఆ.వె కుటిల బుద్ధి యున్న కూడును కష్టమె
చపల చిత్త మున్న సఫల మెపుడు
పెంచి బుద్ధి , మదిని వికసింప మనుచును
క్రొత్త యేట ప్రభుని కోరు కొనెద !!
9 .ఆ.వె. స్వార్ధ ప్రీతి బెంచు సంకుచితమ్మును
తనివి యుండ వలయు దరిని జూసి
కలిగి నంత జాలు , గరుణింప మనచును
క్రొత్త యేట ప్రభుని కోరు కొనెద !!
10. ఆ.వె.చార బడక నొకని స్వంత పనిని జేయ
సంత సమ్ము కాదె సాదు మతికి
శక్తి యుండ నదియె సంపద నాకని
క్రొత్త యేట ప్రభుని కోరు కొనెద
సరదాగా తీసుకోవాలి, మరి!!
"డాక్టర్ గారూ!!!!!.....
మీరు నొప్పి లేకుండా పళ్లు బయటకి తీయగలరా??" అడిగాడు "తిరకాసు"
"కొంచెం నొప్పి వుంటుంది, మరి!!" అన్నాడు పళ్ల డాక్టర్!!
"ఓస్! అంతేనా..నేను అస్సలు నొప్పి లెకుండా తియ్యగాలను!" అన్నాడు "తిరకాసు"
"అబ్బా!!అలాగేం! .....ఏదీ తియ్యి చూద్దమ్!" అన్నాడు పళ్ల డాక్టర్!
"హిహిహిహి ......కనిపించాయా నా పళ్లు !!" అన్నాడు "తిరకాసు!"
--((**))--
సరదాగా తీసుకోవాలి, మరి!!
"ప్రభచనాలు "
అమెరికా ఆహ్వానం!!
"డాడీ!! సారీ డాడీ...
నేను నిన్న పెళ్లి చేసుకున్నాను...
నిన్ను పిలవడం మర్చిపోయాను!!"
"వావ్!!ఎం పర్లేదు...నెక్స్ట్ టైం మర్చిపోవద్దు, మరి!!"
"డాడీ....మై స్వీట్ డాడీ..ఒకే!!
--((**))--
సరదాగా తీసుకోవాలి, మరి!!
"ప్రభచనాలు "
మన దేశం లో....
ప్రతి 1000 మంది పురుషులకి ....
సగటున ...
842 మహిళలు వున్నారు!!
కాబట్టి....అమ్మాయలని కాపాడండి!!
పులుల సంఖ్య తగ్గినా పర్లేదు....వాటిని తరువాత కాపాడు కోవచ్చు!!
మీకు, మీ స్కూటర్ వెనుక సీటు మీద ,అమ్మాయి కావాలా...
పులి కావాలా????
--((**))--
అన్వేషి. //తను-నేను71//
నేను పుస్తకమై విచ్చుకున్నపుడల్లా
తను అక్షరాలుగా నాలో ఒదిగిపోతుంటుంది...
నేను భావమై వినిపిస్తుంటే
తను అనుభూతిగా నా ప్రతీ అణువుని పలుకరిస్తుంది..
నేను అధరాల చిరుతడినై
తన అనువణువుని స్పర్శిస్తుంటే...
కాసేపు
అత్తిపత్తిలా తనలో తాను ముడుచుకుపోతుంది...
మరుక్షణంలోనే ఆకాశమై విస్తరిస్తూ
నను పూర్తిగా ఆక్రమించుకుంటోంది...
మా తనువు రాపిడిలో
రాలిపడుతున్న కూజితాలు కొన్ని
పాన్పుకి పలుకులు నేర్పిస్తుంటాయి..
మా ఒరవడిలో కొట్టుకుపోతున్న
క్షణాలు కొన్ని మనసులో మధురోహలై
కాలానికి అందకుండా తలదాచుకుంటాయి..
మేమున్న ప్రాంగణంలో
ఎప్పటికీ ప్రణయమొక ప్రయాగ..
సంగమిస్తున్న మా శ్వాసలలో
చెలరేగుతున్న కోరికల అంతర్వాహినిగా...
--((**))--
కంద గుళిక
కడలి కెరటంలా నీకోసం
వడ్డు దాకా వచ్చి నీ స్మృతులు తలుస్తూ
ఉండ లేక వెనక్కు వెళ్ళి
కొండ దాటి నదిలా నన్ను కలుస్తావనుకున్నా
ఆకాశంలో మేఘంలా
ప్రకాశిస్తున్న నాదగ్గరికి గాలిలా
పక్షి లా నన్ను కలుస్తూ
శకలాలు లాగ కరుగుతూ నీకోసం
వసంతున్నై వస్తున్నా
పసందైన కోయిల పాట వినిపించవా
రసమాదుర్యం అందిమ్చవా
కసిగా ఉన్నది నాకు వస్తున్నా నీకోసం
కొండ గాలి సోకింది
మండే గుండె చల్లబరుస్తావని వున్నా
గుండె చిక్క బట్టి కలా
కండ తినిపిస్తావని ఉన్నా నీకోసం
ప్రణయ భావం పెరిగి
తృణ భావంలా విపత్తులో నిల్చున్నా
రణము నీతో చేయను
వణికే చలిలో నైనా ఉంటాను నీకోసం
సత్యం పలుకుతున్నా
ముత్యాల దండను పట్టుకొని ఉన్నా
సత్య వదూతగా ఉన్నా
సత్వరం నీ ప్రేమ కోసం వేచి ఉన్నా
--((**))--
|| తుషార ధూపం ||
ఒక హేమంతపు తుషార ధూపం
గుండెని కాస్త తడిపి వెళ్ళిందనుకుంటా
నిన్నటి వ్యధలన్నీ నిశ్శేషమయ్యాయి
ఒక పరిచయాన్ని సశేషం చేస్తూ
బహుశా అప్పుడేనేమో
ఒక చిన్ని పువ్విక్కడ రాలిపడినట్లుంది
ఇక్కడంటే ఇక్కడే
ఈ పిడికిటంత హృదయంలో
అప్పుడొక నిశ్శబ్దాన్ని జాలువార్చుతూ
పరిమళమొకటి పరవశంగా
ప్రవహించటం మొదలయ్యింది
నాకింకా పరిచయమవ్వని
కొన్ని నవ్వులని వశీకరించుకుంటూ
నీకు నన్ను వశం చేస్తూ
--((**))--
సరదాగా తీసుకోవాలి, మరి!!
డబల్ హార్ట్ అట్టాక్ మెస్సేజ్ (ఎసెమెస్) లు....
"నీతో నేను తెగతెంపులు చేసుకుంటున్నాను....
రేపటి నుండి నీతో మాట్లాడను!!" ఫస్ట్ మెస్సేజ్ ఇచ్చింది అమ్మాయి !!
అబ్బాయి , చాలా బాధ పడుతుండగా.....
"సారీ....సారీ ...
పొరపాటున ఆ మెస్సేజ్ నీకు పంపించాను!!"
అని రెండొ మెస్సేజ్ ఇచ్చింది ఆ అమ్మాయే!!
--((**))--
చంద్రశేఖర్ వేములపల్లి || ఆశల ఉయ్యాలలో ||
ఎన్ని రాత్రులు అలా ఉలిక్కిపడి నిద్దుర లేచానో
అంతకు ముందు రాత్రి అలసిన శరీరం
పొందుతున్న విశ్రామము నుంచి .... తలగడ తడిచి
నాకు తెలియకుండా అనుకోకుండానే
నా కలలో నేను ఒక ప్రత్యక్ష సాక్షిని
సామాజికం గా జరుగుతున్న ఎన్నో
దుర్మార్గ, అలక్ష్య అత్యాచారాలకు
నొప్పి, మానసిక అశాంతి, ప్రశ్నార్ధక సంఘటనలకు
అపనమ్మకం, ప్రేమ రహిత ద్వేషమే ఎటుచూసినా
ఏవో కట్టుబాట్ల దారాలతో ముడిపడి
తెగని అనుబంధాల చెరలే అన్నీ
ఎన్ని కష్టాలో .... ఆ అనుబంధాలను అపసవ్యం చేస్తూ
అన్నీ సమశ్యలే ఎన్నో పరిక్షలు .... చివరికి
నాకు నేను మూల్యత ఆపాదించుకునేందుకు కూడా
అన్ని వైపులా చీకటి అంధకారమే .... అందులోంచి బయటపడటానికి
జీవితాన్ని మొత్తంగా ఖర్చు చెయ్యాల్సి వస్తూ
కాలి ఖర్చైపోతున్న ఆ క్షణాల్లోనే ఒక కొత్త కల ....
మరో జీవితాన్ని పొందుతున్నట్లు .... ఈ తెల్లవారు జామున
జీవితము, వ్యక్తిత్వము .... ప్రేమను పొందుతున్నట్లు
ఏనాటి ఏ దాస్యబంధం నుంచో విముక్తుడ్ని కాబోతున్నట్లు
ఎంత అందమైన కల, తడవకుండానే తలగడ
నిద్దుర మెలుకువొచ్చింది. ఉలిక్కిపాటు లేని చీకటమ్మ ఒడి లో
తెల్లవారుఝామున .... ఏ ఆనందబాష్పాల తడి స్పర్శతోనో
ఏ కొత్త జననంపై ఆశతోనో .... కళ్ళముందు అంతా కాంతిమయమై
--((**))--
అక్షరాలతో అందాన్ని వర్ణించనా
- ముక్తి సరిగా ముచ్చట్లు చెప్పనా
పద మాలలను పదిలంగా చెప్పనా
- గుప్పెడు భావాలు తెలియ పరచనా
గుండెచిక్క బెట్టుకొని ఎదురు చూడనా
- నునువెచ్చని గాలులు కోసం ఉండనా
ప్రకృతిలో నీ ప్రేమ కోసం వేచిఉండనా
- తాళి విలువ తెలిపి నాదానిగా చేసుకోనా
ఓర్పు చూపి కాలాన్ని బట్టి
గమ్యమేదో తెలిపి, కరుణ చూపి
ప్రేమతో మనసును జాయించాలి
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--
నీ పెదాల తడి పోడులు దోచుకోనా
పసిడి దరహాసంతో మాట మాట్లాడనా
కాల్ల గజ్జల శబ్దాలు కు పరవ సించనా
చిరకట్టులో ఒంపుసొంపులకే తరించనా
నీచెవి కుండలాలు చూసి మురిసిపోనా
--((**))--
మంత్రి – మహిషం (రాజకీయ వ్యంగ్య రచన) - 1
సాహితీమిత్రులారా!
పాలకుడు భ్రష్టుపట్టిపోయిన వేళ, భరించరాని మనోవేదన చవిచూసిన మంత్రి ఏం చేస్తాడు? రెండు పనులు చేస్తాడు. ఒకటి. పాలకుడికి నచ్చచెప్పి, ప్రజలకు మేలు చేయించాలని చూస్తాడు. రెండు. అది అసాధ్యమయితే, పదవి వదలిపెట్టుకొని దూరంగా పోయి ఏ వ్యవసాయమో చేసుకుంటాడు.
వాంఛేశ్వర మంత్రి సరిగ్గా ఇదే చేశాడు. అంతటితో ఆగక ఆ పాలకుడి అలసత్వాన్ని, ఆయన్ని ఆశ్రయించుకు బతుకుతూ ప్రజల్ని కాల్చుకుతినే మోతుబరుల ఆగడాలనీ చీల్చి చెండాడుతూ, సంస్కృతంలో, నూరు శ్లోకాలతో ” మహిష శతకం” అనే వ్యంగ్య రచన చేశాడు. తన రచన చదివి, పాలకుడు సిగ్గుపడి చెంపలు వేసుకునేలాగా చేశాడు.
మహిషం అంటే దున్న పోతు. పల్లెటూళ్ళల్లో ప్రజలకు దగ్గిరగా దీనికి విశేషించి ఏ గౌరవం లేదని గమనించాలి. ఇటువంటి జంతువుని “సంకేతం” గా తీసుకుని దానిని స్తుతిస్తున్నట్టు నటిస్తూ సమాజంలో చెడుని చెండాడేడు. ఇదంతా ఎలాజరిగిందంటే —
తంజావూరు రాజ్యాన్ని క్రీ.శ. 1674 నుండి 1885 వరకూ మహారాష్ట్ర రాజులు పరిపాలించారు.వారిలో పదకొండవ పాలకుడు, రెండవ ఏకోజీ కొడుకు ప్రతాప సింగు 1739 నుంచి 1763 వరకూ పరిపాలించాడు. ఈతని తండ్రి కాలం నుంచి వాంఛేశ్వర మంత్రి వీరి కొలువులో తెలివైన వ్యక్తిగా మన్ననలు పొందుతూ, సమర్థంగా మంత్రిత్వం నిర్వహిస్తుండేవాడు. రెండవ ఏకోజి మరణించాక, రాజ్యపరిపాలన అరాచకం లో పడింది. దానికి తోడు ప్రతాపసింగు, చాలా కుర్రవాడు సింహాసనమెక్కాడు. యౌవనం, ధనసంపత్తిః ప్రభుత్వమవివేకతా ఏకైకమప్యనర్థాయ కిము యత్ర చతుష్టయం. యౌవనం, బాగాడబ్బుండడం, పాలకపదవిలో వుండడం, అజ్ఞాని కావడం, వీటిలో ఒక్కొక్కటి ఉంటేనే మనిషికనర్థం. ఇంక ఈ నాలుగూ ఒక మనిషికే ప్రాప్తిస్తే, ఇంక చెప్పేందుకేముంది? అని సూక్తి చెప్పినట్టే అయింది ప్రతాపసింగు పని. చుట్టూ ఇచ్చకాలు చెప్పేవాళ్ళు చేరి తమపబ్బం గడుపుకొన్నారు. రాజు పేరు చెప్పి సుబేదారులు ప్రజలను పడరాని పాట్లకు గురి చేయ సాగారు. పరిపాలన నిరంకుశంగా తయారయింది. మంచితనంతో, నెమ్మదితనంతో, చదువుసంధ్యలతో, మెత్తగా పనిచేసే అధికారులని పదవులనుంచి తొలగించి, నిరంకుశులని దేశం మీదికి వదిలారు. బలవంతంగా ప్రజలనుంచి ధనధాన్యాలను దోపిడి చేయ సాగారు. మానాభి మానాలను కోరుకునే చాలామంది రాజ్యం వదిలి వెళ్ళిపోయారు. అమాత్యుడుగా వున్న వాంఛేశ్వరుడు ఈ దుర్భర పరిస్థితిని సరిచేసే ప్రయత్నాలు చేశాడు. ఫలితం దక్కలేదు. ఒక దశలో వాంచేశ్వర మంత్రి, ప్రతాపసింగుని కలుసుకొనే మాట్లాడే అవకాలు సైతం దూరమయ్యాయి. వ్యక్తిగతంగా అవమానాలకు పాలయ్యాడు. దీనితో ఒళ్ళు మండిపోయి, కడుపులో కసి వెళ్ళగ్రక్కడానికి మహిష శతకం వ్రాసి ప్రచారం చేయించాడు. ఈ శతకం ప్రతాపసింగు చదివి, తప్పు తెలుసుకొని, మళ్ళీ వాంఛేశ్వర మంత్రిని దగ్గరకు తీసుకొని, ఆయన సలహా పాటించి మంచి రాజనిపించుకున్నాడు.
దుష్టపాలనను ఖండించడం, దుర్మార్గుల ఆగడాలను చీల్చి చెండాడడం ప్రధాన లక్ష్యాలుగా గల ఈ శతకానికి చారిత్రకంగానే కాదు, నైతికంగా, సామాజికంగా కూడా ఎంతో విలువ వుంది. వాంఛేశ్వర మంత్రి గొప్ప పండిత వంశంలో పుట్టాడు. అతి చిన్నతనంలోనే శాహాజీ మహరాజు మెప్పుపొంది, తకుట్టికవిత (బాలకవి) అనే బిరుదం పొందాడు. పెద్దవాడయ్యాక రెండవ ఏకోజీ కొలువులో అమాత్యపదవినే కాదు, ఆస్థాన విద్వాంసుడి పదవికూడా నిర్వహించాడు. శహాజీ మహరాజు తిరువిశనల్లూరు గ్రామాన్ని శహాజీ పుర అగ్రహారం చేసి 47 మంది ఉద్దండ పండితులకు దానం చేశాడు. ఆ 47 గురిలో వాంఛేశ్వర మంత్రి తండ్రి కూడా ఒకరు. వాంఛేశ్వర మంత్రి జన్మస్థలం ఈ తిరువిశనల్లూరే.
వాంఛేశ్వర మంత్రి ఈ మహిష శతకమే కాక, ధాటీ శతకమనీ, ఆశీర్వాద శతకమనీ మరో రెండు పుస్తకాలు వ్రాశాడట. ఈ మహిష శతకానికి వాంఛేశ్వర మంత్రి ముని మనుమడు ( అతని పేరూ వాంఛేశ్వరుడే) “శ్లేషార్థ చంద్రిక” అనే పేరుతో సంస్కృతంలో వ్యాఖ్యానం వ్రాశాడు. ఈయన మహా పండితుడు. తర్కశాస్త్ర నిధి. 80 ఏళ్ళవరకు జీవించి, 1849 ప్రాంతంలో మరణించాడు. తెలుగులో 1952 లో కావ్యతీర్థ మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి తేటగా తాత్పర్య రచన చేశారు. ఇక ఒక్కొక్క శ్లోకం పరిశీలిద్దాం.
మంత్రి మహిషం 1
వాంఛేశ్వర మంత్రి తన రచన ప్రారంభాన్ని కావ్య సాంప్రదాయ ప్రకారం, ఆశీర్వాదంతో ేస్తున్నాడు.
స్వస్తస్య్తు ప్రథమం సమస్త జగతే శస్తా గుణస్తోమత
స్సంతో యే నివసంతి సంతు మఖిన స్తే మీ శివానుగ్రహాత్
ధర్మిష్ఠేపధి సంచర న్వ్తవనిపా ధర్మోపదేశాదృతా
స్తేషాం యే భువి మంత్రిణ స్సుమనస స్తే సంతు దీర్ఘాయుషః
మొట్టమొదట, పరమశివుడి దయవల్ల మొత్తం ప్రపంచానికి మేలు జరగాలి. దయ, ఓర్పు, అసూయారహితం, పరిశుద్ధత, శ్రమలేమి, మంగళం, కార్పణ్యరాహిత్యం, ఆశలేమి వంటి గుణాలున్న మంచివాళ్ళకు సుఖం కలగాలి. పాలకులు ధర్మబద్ధంగా నడవాలి. వాళ్ళదగ్గిర పనిచేసే మంత్రులు మంచిమనస్సుతో పాలకులకు ధర్మం బోధించగలిగి మసలాలి. అటువంటివారు ఆయుర్దాయం కలిగి సుఖంగా జీవించాలి. తను మంత్రిగా కొలువు సాగిస్తున్నది, భోసలరాజవంశం వారికి. తరతరాల పాటు వాళ్ళకు మేలు జరగాలని కూడా తను అవమానపడినప్పటికీ కూడా కవి కోరుకుంటున్నాడు.
యే జాతా విమలేత్ర భోసలకులే సూర్యేందు వంశోపమే
రాజానశ్చిర జీవిన శ్చ సుఖిన స్తే సంతు సంతానినః
యే తద్వంశ పరంపరాక్రమవశా త్సభ్యా స్సమాభ్యాగతా
స్తే సంతు ప్రథమాన మాన విభవా రాజ్యాం కటాక్షోర్మిభిః
సూర్య, చంద్రవంశాలతో సమానంగా , మచ్చలేని విధంగా భోసల రాజవంశంలో పుట్టిన వాళ్ళందరూ, దేవుడి దయవల్ల చిరంజీవులు, సుఖసంపన్నులు, సంతానవంతులు కావాలి. అంతే కాదు. ఈ రాజవంశం వాళ్ళకు వంశపారంపర్యంగా మంత్రిపదవులు నిర్వహించేవారికి కూడా, శుభాలు జరగాలి. వాళ్ళు తమపాలకులకు అనుగ్రహ పాత్రులై గౌరవాలు, వైభవాలు పొందుతూ అభివృద్ధి చెందాలి. పాలకుల కడగంటిచూపుల తరగలతో మంత్రులు సుఖవంతులు కావాలని వాంఛేశ్వర మంత్రి వాంఛ.
------------------------------------------------------
రచన: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఈమాట సౌజన్యంతో
-------------------------------------------------
- ఏ.వి.రమణరాజు
నీరు కావాలంటే మట్టిని తవ్వాల్సిందే -
- పంట పండాలంటే నేలను దున్నాల్సిందే
తోడు కావాలంటే ప్రేమను ఇవ్వాల్సిందే
- మైత్రి పొందాలంటే మంచిగ ఉండాల్సిందే
వెలుగు రావాలంటే పొద్దులు పొడవాల్సిందే
- తెలుగు నిలవాలంటే బుద్ధులు మారాల్సిందే
వాన కురవాలంటే మబ్బులు పట్టాల్సిందే
- కవిత వ్రాయాలంటే బావన పొంగాల్సిందే
మనిషి మెఱవాలంటే సౌఖ్యం కావాల్సిందే
నిజం తెలియాలంటే లోతుల కెళ్లాల్సిందే
- చరిత కెక్కాలంటే ఎత్తుల కెదగాల్సిందే
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
తావి వీచాలంటే పువ్వులు పూయాల్సిందే
- కళను చూడాలంటే కళ్లను తెఱవాల్సిందే
వ్యాథి తీఱాలంటే వైద్యం జరగాల్సిందే
- తిక్క కుదరాలంటే దెబ్బలు తగలాల్సిందే
పాట అమరాలంటే పల్లవి పుట్టాల్సిందే
- వలపు కలగాలంటే తలపులు కదలాల్సిందే
గెలుపు నాశిస్తుంటే పరిశ్రమించాల్సిందే
- ఫలితముండాలంటే సాధన చెయ్యాల్సిందే
చెడుపు పోవాలంటే తప్పులు తొలగాల్సిందే
మంట లాఱాలంటే మమతలు చిందాల్సిందే
శాంతి వెలయాలంటే దౌష్ట్యం చావాల్సిందే
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
మమతలనే వెలుగులు
మదిని తొలిచే పురుగులు
వెలుగివ్వని మిని గురులు
ఫలితము కానరాని ఎత్తులు
అంతలోనే అంధ కారాలు
గ్రుడ్డివాని ముందు దివిటిలు
కళ్ళున్న చూడలేని గాలులు
కొండెనుక వెలుగు చూడలేని కళ్ళు

om
ReplyDelete