ఓం శ్రీ రాం - శ్రీ మాత్రేనమ: - శ్రికృష్ణా యనమ:
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం
నిను కలిసిన నిముసమున...నిను తెలిసిన క్షణమున...కనుల పండువాయెనే..
చిత్రం : సి.ఐ.డి (1965)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం : సుశీల
పల్లవి:
నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే
నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే
చరణం 1 :
ఆశాలత మొగ్గలేసి పూలు విరగపూసెనే
ఆశాలత మొగ్గలేసి పూలు విరగపూసెనే
తలపులెల్ల వలపులై.. పులకరింపజేసెనే
తలపులెల్ల వలపులై.. పులకరింపజేసెనే .. పరవశించి పోతినే..
నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే
చరణం 2 :
చందమామ నేడేలనో చలి వెన్నెల కాయడే
చందమామ నేడేలనో చలి వెన్నెల కాయడే
గాలి కూడా ఎందుకనో నులి వెచ్చగ వీచెనే
గాలి కూడా ఎందుకనో నులి వెచ్చగ వీచెనే.. మేను కందిపోయెనే..
నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే
నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
ఆ ఆ ఆ ఆ... ఓ ఓ ఓ ఓ... ఊ ఊ ఊ ఊ ...
https://www.youtube.com/watch?v=g6ASYRbxvGI
NENU KALISINA NIMISHAMUNA NINU TELISINA KSHANAMUNA.....CHITRAM:- C.I.D.1965.mp4
నిను కలసిన నిముషమున నిను తెలిసిన క్షణమున కనుల.......చిత్రం :- సి.ఐ.డి.1965 పాట గురించి :-గాయకులూ :- ...
--((**))--
సరదాగా తీసుకొవాలండొయ్!...మరి!!
"ఫై.సి.నారి" కి ఇంట్లొ పని చేస్తుంటే...కరెంట్ షాక్ కొట్టింది!!
భార్య గాభరా పడుతూ ...
"అయ్యో! అయ్యో!!..మీకు ఏమీ కాలేదు కదా?!" అంటూ పరుగు పరుగున వచ్చింది!!
"నా సంగతి దేవుడెరుగు....
ముందు ఎన్ని యూనిట్లు కాలేయో చూడవె ...
వెర్రి మొహమా!!" అన్నాడు "పి.సి.నారి"
రేయి పగలు నీకొరకే ఎదురు చూస్తు ఉన్నారూ
దిగులు తొలగు నీవలనని యాశ పడుతు ఉన్నారూ
రాయనయిన రాయవోయి కుములుతున్న వారి గాధ
అడగనేల వారి నిపుడు చెప్ప లేక ఉన్నారూ
నోటుకు ఓటమ్ముకొనిరి నోరు పెగలకున్నారూ
చదువు లేమి కారణమని తెలియ లేక ఉన్నారూ
ఆశ పడుచు సారాయికి కుటిల రాజ కీయానికి
ఎరకు చిక్కు చేపలమని నెరుక పడక ఉన్నారూ
ఒక వందకు అంగలార్చి యొకరివెనుక నొకరు పడుచు
ఒకటికి పది గుంజుదురని యునికి పడక ఉన్నారూ
ద్రోహి యనియు దుష్టుడనియు దొంగ యనియు తెలిసినా
దొరల వోలె ఓటడిగిన దునుమాడక ఉన్నారూ
నిజము తెలుపు కవితనుడివి “నాగమల్లి” పదము పట్టి
జ్ఞాన దీప మెలిగించుమ చరమ గతిని ఉన్నారూ........
--((**))--
వేనికిఁబుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి యేడ్చెడిని
నానొప్పు లోకమ్ము కోర్కులను ఱొమ్మునం గట్టుకొని, ర
మానాథ! యీదుచున్నావు గాన సంబరము సాగు, నత
సీ నటత్సుషమాంగ! వేంకటేశ్వరా! శేషాద్రినిలయ!
విశ్వనాథ సత్యనారాయణ "విశ్వనాథ మధ్యాక్కఱలు" లోని "శేషాద్రి శతకము" నుండి.
--((**))--
శివుడు.!
.
(నెట్ లో దొరికిన ఒక మంచి కవిత.)
ఇసుక రేణువులోన దూరియుందువు
నీవు బ్రహ్మాండమంతయును నిండియుందువు
నీవు చివురాకులాడించు గాలిదేవర
నీవు ఘన కానలను గాల్చు కారుచిచ్చువు
నీవు క్రిమికీటకాదులకు మోక్షమిత్తువు
నీవు కాలయమునిబట్టి కాలదన్ను
నీవు పెండ్లి జేయరాగ మరుని మండించినావు పెండ్లియాడి సతికి సగమిచ్చినావు దక్షయాగము ద్రుంచి సురలందరిని గొట్టి వికటాట్టహాసమున భయపెట్టినావు
కడలి చిలుకు వేళ కాలకూటము బుట్ట దాని త్రావి సురల గాచినావు
ఈ తిక్క శివునితో వేగలేననుచూ
ముక్కంటి కోపాన్ని ఓపలేననుచూ
వదిలిపోదమన్న వేరు దైవము లేదు .
--((**))--
రేయంత ఎదురుచూపులు నింపుకుంటున్నా..
తొలికిరణపు వెచ్చదనమై తను పలుకరిస్తుందని..
నా రెప్పలదోసిలిలో పొగుచేసుకున్న
క్షణాలకి నిరీక్షణలు నేర్పిస్తోంది తను..
నా కలల పల్లకిలో ..ఊరేగుతున్న ఆశలతో
అనుక్షణం ఉసులాడుతుంటుంది తను..
క్షణమైనా ఆగని కాలానికి
మా పరిచయ క్షణాలను గుర్తుచేస్తూ
వాడిపోతున్న తొరణాన్నై గతం గడపకి
నిన్నటి రంగులు అద్దుతుంటాను నేను..
ఆదాటుగా ఇటువైపు వచ్చిన తను
నీళ్ళనుండి పాలను వేరుచేయగల హంసలా
తన ప్రతిరూపాన్ని మాత్రమే చూసుకుని
నవ్వుకుంటూ తిరిగి అదృశ్యమయిపోతుంది..
తనని అనుకరిస్తూ అనుసరిస్తూ నన్ను నేను
చూసుకోవాలనుకున్నపుడు మాత్రం మళ్లీ
తానే నాలా మారి నను వెక్కిరిస్తోంది..
తను నా ప్రతిరూపమా??
నేనే తనకి ప్రతిబింబామా??
తేల్చుకుందామనుకునేలోగానే
నయనాలు మేఘాలయి జవాబిస్తుంటాయి..
చెమరింతలలో తడిసిన
కొన్ని జ్ఞాపకాలు డైరీలో
కొన్ని పేజీలను కప్పుకుంటాయి..
--((**))--
దేవరకొండ సుబ్రహ్మణ్యం
December 22 at 8:17pm
శా. దంతంబు ల్పడనప్పుడే తనువునం దారూఢి యున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు గానప్పుడే
వింత ల్మేన జరించునప్పుడె కురు ల్వెల్వెల్ల గానప్పుడే
చింతింప న్వలె నీపదాంబుజముల్ శ్రీకాళహస్తీశ్వరా!!
ధూర్జటి "శ్రీకాళహస్తీశ్వర శతకము" నుండి
--((**))--
// చిత్ర కవిత..//
పరుడను..కానే భామా! పరుగెత్తు.చుంటివేల?
పట్టుపావ డాలో..విచ్చినమరుమల్లెపూవ!
సిగ్గుమొగ్గలేసినట్టి కన్నెతనపు..జాజిమొగ్గ..
కనువిందగు రూపం తోకవ్విస్తివే..కలువలేమ..
కురులలో కనకాంబరాలు..అందగించుచున్నవే..
సిగ్గులమందారాలు.. నీబుగ్గల లోఉన్నవే..
ఒక్కసారి తిరిగిచూడు..నీ..కోసంవచ్చితినే..
ఎంతసిగ్గైనగాని..పంతమింతఏలనే..
కనుమరుగైన గడియ.నీవు కలయవెదకెదవే
గొప్పిoటి వాడనే..గోముపడివచ్చితినే..
కొమలి నీ రూపు . చూసి కోరికోరి వస్తినే
సిగ్గే కన్నెకుఅందం..మురిపిస్తివి ఈ చందం
ఈడు,,జోడు ఇద్దరికీ ఒద్దికగా అమరినదే..
నిన్నుగాకవేరొకరిని చేపట్టను...నమ్మవే..
కళ్యాణ గౌరి..
--((**))--
రవ్వకేసరి మన తెలుగు ఇళ్లలో తరచుగా చేసే స్వీటే. కానీ, అదే పద్ధతిలో తయారు చేసే ఒక విశేషమైన నివేదన అన్నవరం వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో మాత్రమే జరుగుతుంది. ఆ ప్రసాదం తింటే ఆహా అనాల్సిందే.
నిన్న వైకుంఠ ఏకాదశి కదా అని స్వామికి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం చేసి నివేదన చేద్దాం అనుకున్నాము. ఏముంది 15 నిమిషాల్లో సిద్ధం!
కావలసిన పదార్థాలు:
గ్లాసు గోధుమ నూక రవ్వ (మరీ సన్నటిది కాదు, కాస్త పలుకుగా ఉండేది)
రెండు గ్లాసుల తురిమిన బెల్లం
అరగ్లాసు పంచదార
ఏలకుల పొడి
తగినంత నెయ్యి (నేనైతే దేవుని నివేదనకు ఆవు నెయ్యి వాడతాను)
వేయించిన జీడిపప్పు, కిస్మిస్
(లేత కొబ్బరి ముక్కలు, అరటి పండు ముక్కలి, కాసిని ఆవు పాలు - ఇవి ప్రసాదానికి మరింత రుచినిస్తాయి)
ముందుగా దాదాపు మూడు గ్లాసుల నీళ్లు బాణలిలో పోసి వేడి చేయండి. అవి మరిగాక గ్లాసు రవ్వ వేయండి. 5 నిమిషాలు రవ్వ ఉడికాక, అందులో బెల్లం, పంచదార, కాస్త నెయ్యి, ఏలకులపొడి వేయండి. మొత్తం మిశ్రమాన్ని 7-8 నిమిషాల పాటు సన్న సెగపై కలియబెడుతూ ఉండంది. పాకం బాగా పట్టింది అన్న దానికి సూచిక నెయ్యి పైకి కనిపించటం. అప్పుడు నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ ఆ మిశ్రమంలో కలపండి. ఒక పాత్రలో చేతి వేళ్లతో కాస్త నెయ్యి పూసి అందులోకి ఈ ప్రసాదాన్ని తీయండి. అంతే, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం స్వామి నివేదనకు సిద్ధం.
(ప్రసాదంపై చిన్న చిన్న ముక్కలుగా కోసిన అరటి పండు, లేత కొబ్బరి ముక్కలు వేస్తే ప్రత్యేకమైన రుచి వస్తుంది.పాలతో స్వామికి నివేదన చేయాలనుకునే వాళ్లు కాచిన పాలు కాసిని కలిపితే ఇంకొక రకమైన రుచి వస్తుంది. ఇవన్నీ ఆప్షనల్)
గమనిక - చక్కెర తక్కువ కావాలి అనుకునే వాళ్లు పంచదార వేయనక్కరలేదు. ఈ ప్రసాదం బొంబాయి రవ్వతో కన్నా గోధుమ నూక రవ్వతోనే బాగుంటుంది.
అన్నవరం వెళితే విస్తరాకులో పొట్లం కట్టి ఇస్తారు ఈ ప్రసాదం. ఆ స్వామి సన్నిధిలో ఓ పక్కన కూర్చొని ఓ ముక్క కొబ్బరి నంజుకొని తింటే పరమాత్మ రసాలలో ఎలా నివసిస్తాడో అవగతమవుతుంది. తమాషా ఏమిటంటే ఈ ప్రసాదం తింటే కొన్ని గంటల పాటు ఆకలి వేయదు.
--((**))--
మంగళగీతి లో- (ఇం/ఇం - ఇం/ఇం) యతి లేక ప్రాసయతి మూడవ గణముతో....సుందరకాండ లో మరికొంత భాగము మీ ముందుకు తెస్తున్నాను...తప్పులుంటే (చాలా ఉంటాయి) దయతో సరిదిద్దమని పెద్దలకు మనవి ...
సరిగ్గా క్రితం సంవత్సరం..డిసెంబర్ 23 వ తేదీ, మంగళవారము నాడు మంగళ గీతిలో సుందరకాండ వ్రాయాలని అదాటున మొదలుపెట్టాను....అందుకు నాకున్న భాషాపరిజ్ఞానమూ, భావ పరిణితీ, వ్యాకరణసూత్రాల అవగాహనా లేమీ ఇవేమీ ఆలోచించనీయలేదు హనుమ....నవంబర్ 6 , 2014 లో శ్రీ యుతులు J K మోహన గారు పరిచయం చేసిన మంగళ గీతి ఆ రోజు మళ్ళీ నా కళ్ళబడినదెందుకో ....సుందరకాండ వ్రాయటం ఎంత కష్టమో అనే భావన కూడా రాలేదు....అది నా గురువులుగా తప్పులను దిద్ది ప్రోత్సహించిన మోహన గారూ,సుప్రభ గారూ...ఇంకాఎందరో పెద్దల తోడ్పాటు వల్ల కావచ్చు .....
మొత్తానికి ఒక ఏడాది పాటు సాగిన సుందరకాండ ఎన్నో సార్లు హనుమ దర్శనం చేయించింది నాకు .....ఎన్నో శుభకార్యాలు చేయించింది మా ఇంట్లో...అంతే కాక ప్రతి చిన్న దానికీ డీలా పడిపోయే నాకు ఒడిదుడుకులు ఎదురయినా తట్టుకుని నవ్వుతూ పరిష్కరించుకోగలిగే మానసిక స్థైర్యాన్ని కూడా అనుగ్రహించింది .....
ఇక్కడ ఉన్న మిత్రులకు , శ్రేయాభిలాషులకూ....అడుగడుగునా ప్రోత్సహించిన మిత్రులందరికీ కృతజ్ఞతాభివందనములు తెల్పుకుంటున్నాను..... నేను వ్రాసిన సుందరకాండలో ఉన్న ఛందో వ్యాకరణ దోషాలను సరిజేయటానికి మోహన గారు దయతో ఒప్పుకున్నారు...వారికి నా అనేకానేక నమస్కారములు తెలుపుకుంటూ .....మీ ముందుకు సుందరకాండ లో చివరి అంకమును తెచ్చాను మిత్రులూ ....సదా మీ ఆశీర్వాదాభిలాషి ...నాగ జ్యోతీ రమణ సుసర్ల
హనుమ నావల్ల జరిగిన దోషాలను మదిదలపక ...కృపజూడాలని ప్రార్ధిస్తున్నాను
148. జనని జానకి దేవి -జాడరాముని చేర్చ
ననిలాత్మజుని తోడ-యరుగ కిష్కింధకున్
వనచరులుమహేంద్ర-వసుధాధరము వీడి
మనములుప్పొంగగా-మధువనికేతెంచ్రి
149. మధువనమ్మును చేరి- మధువులన్ గ్రోలుచు
నదుపు లేని యెలమి- యందించు మత్తునన్
యదుముచేయు కపుల-మధువనపాలుండు
దధిముఖుండరికట్ట- దండించ్రి వానరుల్
150. తేనె వనాంతపు- వైనమ్మునుందెల్సి
వీనులవిందుగా- తేనెరాయుడు బల్కె
వానరులు సాదించి-రానతిచ్చిన పనిన్
సానుకూలమయెను- స్వామి కార్యంబనెన్
151. హనుమజాంబవదాది- వనచరులన్ గూడి
ప్రణమిల్లి రాముకున్- ప్రస్రవణ గిరినన్
కనుగొంటి సీతమ్మ-నని ముందుగా బల్క
యిన వంశ తిలకుకున్- యనుమోదముప్పొంగె
152. సీతమ్మ క్షేమమున్- శ్రీరాముడుం దెల్సి
వాతాత్మజునడిగె- సీతమ్మ వివరముల్
మాతను దలచిదా-మారుతి కైమోడ్చి
సీతచూడామణిన్- శ్రీరాముకున్నిడెన్
153. మణిగొని రాముండు- మౌనియై మది చేర్చె
కనులనశ్రువులూర- కౌసలేయుడుబల్కె
హనుమ నీ వెట్టులన్- యవనిజన్ గంటివొ
యనయమున్ దెల్పుమా- యనివివరమడిగెన్
154. శతయోజనమ్ముల -సంద్రమ్ము దాటినే,
నతివ సీతమ లంక- యంతఃపురవనిన్
వెతచెంది శింశుపా- విటపఛాయలయందు
సతతమ్ము రామ ,నీ- స్మరణచేయగ గంటి
155. నినుమనస్సున నిల్పి- నిరసించి రావణున్
తనువు చాలించంగ- తల్లియత్నించుటన్
కని ,రామ కథను నే-ననువుగా బల్కంగ
వినిన సీతమ తల్లి- విశ్వసించెను నన్ను ...
156 . తలపోయుచున్ నిన్నె - తపమాచరించుచున్
నిలిచె సీతమ, దైత్యు-నిర్బంధమున ,రామ
విలపించు తలి నిన్ను -వేగ తెమ్మని బల్కె
నెలరోజుల గడువె- నిలవంగ తనకంచు
157. మితిలేని సీతమ్మ- వెతలు గాంచితి రామ
దితిసుతులన్ గూల్చి- దీవి రాయుని గాంచి
హితము బల్కితి నంత- హింసించ గా నేను
ప్రతిగ లంకను గాల్చి -పయనమైతినిటకున్.
158. తలి నిన్ను గొనిపోగ-తగుదు నేనని బల్క
వలదంచు, రాముడే - వలయునని బలికెన్
కలికి కష్టము జూసి- కడు చింత పడు , నాకు
సెలవిడెన్ తనగతిన్-దెలుప వేగమె నీకు
159. అరుదెంచు రాముండు- హతమార్చు రావణున్
పరగునయ్యోధ్యకున్ - పట్టాభిషిక్తులై
యరుసమొందెదరంచు- అవనిజారాములున్
మఱలి వచ్చితినయ్య- మాతదీవెన తోడ...
160. శ్రీరామ చండ్రుండు - సీత క్షేమము దెల్సి
శూర! నీ వలననే- సూర్య వంసము నిల్చె
నేరీతి గౌరవ-మీయగలననుచున్
మారుతి సర్వస్వమైన కౌగిటజేర్చె.....
161.. సౌభాగ్యమొసగంగ- సాకేత రాముడున్
నాభాగ్య వశముచే-నన్నెంచి సీతమ్మ
అభయమ్ములీయుచు- నాంజనేయుడు నిల్చి
శుభమంచు వ్రాయించ్రి- సుందర కాండమున్...
162. మంగళమ్మౌగాక- మహిని సుందరకాండ
మంగళ గీతినన్- మనుజులున్ చదవంగ
మంగళా కారుడౌ- మారుతి నొసగంగ
మంగళా శాసన-మ్మది జ్యోతి వెలుగులన్
163. తప్పులన్ మన్నింప- తలవంచి వేడెదన్
తప్పులొప్పౌ రీతి - దయగొనన్ హనుమయ్య
తప్పు జ్యోతిది సామి- వొప్పు నీ కృపయున్
మెప్పు గురువులకున్- మేల్ సర్వ జనులకున్......
సర్వే జనాః సుఖినో భవంతు .
సర్వం శ్రీ హనుమదాశ్రిత శ్రీ సీతారామ పాదపద్మార్పణమస్తు
ఓం శాంతిః శాంతిః శాంతిః .
--((**))--
ముగ్గురు పిల్లలకి ఆ తల్లి ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది, "మీరు లేవగానే మీ పక్కలు చక్కగా సర్దుకుని అప్పుడు మొహాలు కడుక్కోండి. ఎవరి పక్కన్నా నలిగి కనిపిస్తే, వాళ్ళకి ఆరోజు టిఫిను పెట్టను.
అప్పట్నించి పిల్లలు ముగ్గురూ లేవగానే పక్కలు సర్దేసుకునే వారు. ఐతే ఆఖరమ్మాయి పక్క మాత్రం అందరి పక్కల కన్నా చాలా శుభ్రంగా వుంటోంది. ఆ తల్లికి ఆశ్చర్యమేసింది. అస్సలు ముడతలు లేకుండా ఎల్లా సద్దుతోందా అని.
ఒకరోజు ఆ అమ్మాయి లేచే లోపునే తల్లి ఆమె గదిలోకి తొంగిచూసింది. పాపం, ఆ అమ్మాయి తల్లి ఆంక్షలకి భయపడి మంచం మీద పడుకోకుండా కింద పడుకుంటోంది!
--((**))--
ఆనందమౌగా పల్లెసీమా మా పల్లెసీమా...దాన ధర్మాలకిల్లు మా పల్లె సీమా
చిత్రం : జీవితం (1950)
సంగీతం : ఆర్.సుదర్శనం
సాహిత్యం : తోలేటి
గానం : ఎస్.వరలక్ష్మి
ఓఓఓఓఓ...ఒహొహొఓఓఓఒహొ..లాలాలాల...
ఆనందమౌగా ఆనందమౌగా
పల్లెసీమా మా పల్లెసీమా
దాన ధర్మాలకిల్లు మా పల్లె సీమా
మా పల్లెసీమా పల్లెసీమా
ఆనందమౌగా పల్లెసీమా మా పల్లెసీమా
దాన ధర్మాలకిల్లు మా పల్లెసీమ
మా పల్లెసీమాఆఆ.. పల్లెసీమా
రంగు బంగారు పైరులు పొంగారు పంటలూ
నాట్యాలు చేయు మా పల్లెసీమలో...ఓఓ...
రంగు బంగారు పైరులు పొంగారు పంటలూ
నాట్యాలు చేయు మా పల్లెసీమలో పల్లెసీమలో
మామంచి తీరు మా ఊరు
మామంచి తీరు మా ఊరు
తీయని నీరు కోనేరు
తీయని నీరు కోనేరు
ఆనందమౌగా ఆనందమౌగా
పల్లెసీమా మా పల్లెసీమా
దాన ధర్మాలకిల్లు మా పల్లె సీమా
మా పల్లెసీమా పల్లెసీమా
దేశా దేశాలు పూజించు పల్లెసీమా..ఆఆ...
దేశా దేశాలు పూజించు పల్లెసీమ
ఆశలే లేని సర్కారి పల్లెసీమా ఆఆ...
దేశా దేశాలు పూజించు పల్లెసీమా..ఆఆ...
దేశా దేశాలు పూజించు పల్లెసీమ
ఆశలే లేని సర్కారి పల్లెసీమా ఆఆ...
మాతోడ కూడి మా తోవ చేరి
మాతోడ కూడి మా తోవ చేరి
మన దేశానికి సేవ చేయాలి
మన దేశానికి సేవ చేయాలి
ఆనందమౌగా ఆనందమౌగా
పల్లెసీమా మా పల్లెసీమా
దాన ధర్మాలకిల్లు మా పల్లెసీమ
మా పల్లెసీమా..ఆ.. పల్లెసీమా
http://n3.filoops.com/telugu/Jeevitham%20%281950%29/04%20-%20Anandamougaa.mp3
No Title
n3.filoops.com
--((**))--
నీలమోహనా.. రారా ...నిన్ను పిలిచె నెమలి నెరజాణ
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: దేవులపల్లి
నేపధ్య గానం: సుశీల
పల్లవి:
నీలమోహనా.. రారా
నిన్ను పిలిచె నెమలి నెరజాణ
నీలమోహనా.. రారా
నిన్ను పిలిచె నెమలి నెరజాణ
నీలమోహనా.. రారా
జారువలపు జడివాన కురిసెరా.. జాజిలత మేను తడిసెరా
జారువలపు జడివాన కురిసెరా.. జాజిలత మేను తడిసెరా
లతలాగే నా మనసు తడిసెరా.. నీలమోహనా.. రారా
రారా..రారా..
చరణం 1:
ఏలాగె మతిమాలి? ఏడే నీ వనమాలి?
ఏలాగె మతిమాలి? ఏడే నీ వనమాలి?
అతడేనేమో అనుకున్నానే.. అంత దవుల శ్రావణ మేఘములగనీ
అతడేనేమో అనుకున్నానే.. అంత దవుల శ్రావణ మేఘములగనీ
ప్రతిమబ్బు ప్రభువైతే... ప్రతికొమ్మ మురళైతే ఏలాగె
ఆ... ఏలాగె మతిమాలి.... ఏడే నీ వనమాలి?
హ హా హా..
హా హా..
నీలమోహనా.. రారా.. నిన్ను పిలిచె నెమలి నెరజాణ
నీలమోహనా.. రారా.. రా రా రా...
చరణం 2:
ఆ... సారెకు దాగెదవేమి?
నీ రూపము దాచి దాచి
ఊరించుటకా స్వామీ?
సారెకు దాగెదవేమి..?
నీ కన్నుల తోడు నీ కలికి నవ్వుల తోడు
నీకోసం ఎంత వేగిపోయానో కృష్ణా
కృషా కృష్ణా కృష్ణా...
సారెకు దాగెదవేమి..?
చరణం 3:
అటు... అటు... ఇటు... ఇటు...
ఆ పొగడకొమ్మవైపు
ఈ మొగలి గుబురువైపు
కార్తీక రాతిరిలో కఱి మబ్బుంటుందా...
నీలిమేఘమాకాశము విడిచి... నేల నడుస్తుందా ?
కార్తీక రాతిరిలో కఱి మబ్బుంటుందా...
నీలిమేఘమాకాశము విడిచి... నేల నడుస్తుందా ?
నడిచే మబ్బులకు నవ్వే పెదవుందా?
నవ్వే పెదవులకూ మువ్వల మురళుందా?
పెదవి నందితే పేద వెదుళ్ళు కదిలి పాడుతాయా?
నడిచే మబ్బులకు నవ్వే పెదవులు
నవ్వే పెదవులకు మువ్వల వేణువులు
మువ్వల వేణువులు... మువ్వల వేణువులు
https://www.youtube.com/watch?v=W_i8IJtMsZA
Doctor Anand - Telugu Movie Superhit Songs - NTR, Anjali Devi, Kanchana
Subscribe For More Telugu Movies: http://goo.gl/V65dIk Subscribe For More Tamil Movies: http://goo.g...

| |||

No comments:
Post a Comment