PRANJALI PRABHA STORIES
(MALLAPRAGADA SRIDEVI RAMAKRISHNA)
Sunday, 22 July 2018
Pranjali Prabha
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీకృష్ణాయాణమ:
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం
నేటి కవిత - ప్రాంజలి ప్రభ
Ramakrishna Mallapragada
తత్వ వేదాంతాన్ని అర్ధం, చేసుకొని
హ్రుదయ జ్వాలతో అర్ధాంగిని, కలుసుకొని
పరమార్ధాన్ని తపనా తపస్సుతో, తెలుసుకొని
మోనాన్ని వీడి, చిత్తబుధ్ధితో, కన్నీటితో, చెపుతున్నా
ఆదిత్యుని వెలుగు నడకను, తెలుసుకొని
ఆరాధ్య దైవాన్ని మనసున, తలచుకొని
మానవత్వం మేల్కొల్పుటకు, రాయబడని
కావ్యాలను తేలికగా తెలియ, పరుస్తున్నా
నమ్మిన నీతులు, అందరికీ తెలియపరచాలని
మాయతో కమ్మిన చీకట్లను, తొలగించాలని
బ్రతుకు భ్రమల మనస్సును, క్రమపరచాలని
హ్రుదయ వేదనలు తగ్గించాలని, శ్రమిస్తున్నా
తరములు మారిన, తపనలు మారవని
మనుష్యులుగా మారిన, స్వార్ధం మారదని
వాదనలు వేరైన, వావి వరుస మారదని
తనువు తపన కవిత్వంగా, తెలియపరుస్తున్నా
రాజ రాజ రాజేందర్ సహకారం తీసుకొని
ఓర్పు, ఓదార్పు, శక్తిని క్రమబధం చేసుకొని
కుల, ధర్మ, కర్మ, సిధ్ధాంతాన్ని, అర్ధం చేసుకొని
ఆశ, పాశానికి, చిక్కని బతుకు వేదాన్ని, అందిస్తున్నా
--((**))--
ప్రాంజలి ప్రభ - అదిక్షేప ప్రేమలీల
లోకం తీరు
రచయత.మల్లాప్రగడ రామకృష్ణ
104. మానవత్వానికి పుస్తకం ఒక భూషణం
- మనో నేస్తంగా అది ఒక నిలయం
మమకారానికి ఆశయ నేత్రాలయం
- మేధస్సుకు ఒక జ్ణాణ భాండాగారం
మనోవాంఛ సిధ్ధికి ఒక దేవాలయం
- మోన నీతి తెలిపే ఒక గ్రంధాలయం
మార్గదర్శిగా మలిచే ఈశ్వరాలయం
- మనస్సు పరిష్కారం చూపే దిక్కులయం
సాహిత్య పుస్తకం ఒక ఊట బావి తోడిన కొద్ది ఊరే అమృతం,
ఆకలిని తీర్చే అక్షయ పాత్ర,
మాత్రృదేశ ఆత్మగౌరవం నిలిపే అనురాగ సంగమం
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--
" కుంకుమ తయారు చేసుకోండి సొంతం గా "
కుంకుమ. … కుంకుమపువ్వు ఒకటికావు . కుంకు మపువ్వు ఒక సుగందద్రవ్యము . కుంకుమ… బొట్తుపెట్టుకోవడానికి వాడే రంగు పదార్ధము . కుంకుమ హిందువులకు చాలా పవిత్రమైనది. స్వచ్ఛమైన కుంకుమను తయారుచేయడానికి పసుపు, పటిక మరియు నిమ్మరసం వాడతారు. హిందువులలో పెళ్ళి జరిగిన తర్వాత ఆడవారు నుదురు మీద కుంకుమ బొట్టు పెట్టుకుంటారు.
మీకు ఎంత కావలి ? ముందుగా నిర్ణయం అయిన తర్వాత క్రింద నిష్పత్తి ప్రకారం తయారు చేసుకొని వాడండి .
* కావలిసిన సామానులు *
10 కిలోలు , పసుపుకొమ్ములు ,
1 కిలో పటిక ,
1 కిలో ఎలిగారం ,
400 నిమ్మకాయలు ,
1/2 కిలో నువ్వుల నూనె .
ముందుగా నిమ్మకాయలను రసము తీసుకొని , ప్లాస్టిక్ బకెట్ లో పోసుకోవాలి . పటిక , ఎలిగారం ను కచ్చాపచ్చాగా దంచి , ఆ రసములో ,కరిగి పోయేటట్లుగా కలపాలి . తరువాత పసుపు కొమ్ములు వేసి బాగాకలిపి ఒక రోజు వుంచాలి . మరునాడు వాటిని , ఇంకో ప్లాస్టిక్ బకెట్లోకి పూర్తిగా వంచేయాలి . ఆ విధముగా , నిమ్మరసము , పసుపు కొమ్ములకు పూర్తిగా పట్టేవరకు ,ప్రతిరోజూ ఒక బకెట్ లో నుండి , ఇంకో బకెట్ లో కి గుమ్మరించాలి .. ఇలా మార్చటము వలన పసుపు కొమ్ములకు నిమ్మరసము చక్కగా అంటుతుందన్నమాట. పసుపుకొమ్ములకు నిమ్మరసము పూర్తిగా పట్టిన తరువాత , అంటే ,ఈ సారి బకెట్ వంచుతే ,ఒక్క చుక్క కూడ నిమ్మరసము , పడకూడదన్నమాట , ఎవరూ తిరగని చోట , దుమ్మూ ధూళీ పడని చోట , నీడలో నేల శుభ్రముగా తుడిచి , చాప వేసి , దానిమీద , శుబ్రమైన బట్టను పరిచి , ఈ పసుపు కొమ్ములను ఎండపెట్టాలి . నీడలోనే సుమా ! అవి పూర్తిగా ఎండిన తరువాత , రోటిలో వేసి దంచాలి . ఆ పొడిని , తెల్లటి , పలచటి బట్టలో వేసి , జల్లించాలి . తరువాత ఆ పొడిలో కొద్ది కొద్దిగా నూనె వేస్తూ కలపాలి . నూనె తో కలపటము వలన , కుంకుమ నుదుటి మీద నిలుస్తుంది . లేకపోతే పెట్టుకోగానే రాలిపోతుంది . సరిపడా నూనె కలిపాక , సువాసన కొరకు ,కొద్దిగా రోజ్ వాటర్ కాని , ఉడుకులోన్ కాని కలపాలి . ఈ కుంకుమ మంచి ఎరుపురంగు లో వుంటుంది . ( సింధూరం రంగు కాదు , ఎరుపు ) .
ఎవరైనా ప్రయత్నము చేయాలంటే 100 గ్రాముల పసుపు కొమ్ములతో , మిగితావి ఆ కొలతకు సరిపడా తీసుకొని చేసుకోవచ్చు. పటిక , ఎలిగారము , కిరాణాదుకాణాలలో దొరుకుతాయి . చక్కని సువాసన తో ఈ కుంకుమ చాలా బాగుంటుంది .
పసుపు కొమ్ములలో , కుంకుమ రాళ్ళు వేసి , దంచి , తెల్లనిబట్టతో జల్లించి , నూనె కలుపుకొని , తోపురంగు కుంకుమ ( మెరూన్ కలర్ ) తయారు చేసుకోవచ్చు . కుంకుమరాళ్ళు , పటికలాగా వుంటాయి . తొందరగానే నలుగుతాయి .కుంకుమ రాళ్ళు కూడా కిరాణా దుకాణాలలో దొరుకుతాయి . బజారులో దొరికే కుంకుమ ఇదే .
మీ ..... " వాగ్దేవి విజయం "
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment