ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం
నేటి హాస్యం
అన్ని ఏర్పాటిలూ పూర్తయిపోవచ్చాయి బావగారూ!
నేను మా పార్టీలో ఎం. పి, మీరు ప్రతిపక్షం పార్టీలో ఎం. ఎల్. ఏ నా పార్లమెంటు నియోజకవర్గం లోనే!
మీ పార్టీ, మీ పేరు కలసి మీరు గెలిచేస్తారండీ,
నేను ఓడిపోయేలాగున్నాను!
పద్ధతిగా అయితే అది నిజమే బావగారూ!
నా మనుషులు అన్ని పార్టీలలోనూ వున్నారు,
నాకు వ్యతిరేకత వున్న శాసనసభ నియోజకవర్గం లో మీరు పోటీ చేస్తారు, నాకు వ్యతిరేకముగా ప్రచారం చేస్తారు, అదీ గాక మాకు క్రాస్ ఓటింగ్ పడేటట్టు ఏర్పాటు చేసేసాము,
నేనూ గెలుస్తాను, మీరూ గెలుస్తారు!
ధన్యవాదాలు బావగారు!
నా సందేహం తీర్చుకోవచ్చా?
తప్పకుండా!
అన్ని పార్టీలలోనూ మీ మనుషులున్నారన్నారు కదా, మీకు అంతులేని ఖర్చులే కదా?
ఔను బావగారూ! ఔను బావగారూ!
అందుకేగా ఏదో రకంగా ప్రజల సొమ్ము
ప్రభుత్వ పరంగానో మరో దారిలోనో దోచుకొనేది!
ఇంత ఖర్చు బాగానే వుంది
మరి మీకంటూ మిగులుతోందా?
పది సార్లు ఓడిపోయినా ఈ ఏడు తరాలూ, రాబోయే ఏడు తరాలూ ధర్జాగా కాలిమీద కాలేసుకు కూర్చుని తినే స్థితిలోనున్నాను బావగారూ!
--((**))--
ఇది నా ప్రాంతమని ఏ రీతిగా పలికెద - నేను ఒకచోటనే ఉండునని ఏల చెప్పద
ఎవ్వరికి చెందిన వాడవని నీకు తెల్పెద - నేను స్వేశ్చగా ప్రేమను అందరికీ ఇచ్చేద
నా వృత్తి, ప్రవృత్తి ఇదే నాని ఎలా చెప్పెద - పగలు రాత్రి మేల్కోగలనని వక్కాణించెద
సమస్త విద్యలను గురువుగా ఎలా నేర్పేద - స్త్రీ, సిరి, ఇచ్చి సహకరించేది కృష్ణే కదా కథ
ప్రతిఒక్కరు ఎవరికీ ఎవరు కారు
అయినా ప్రేమ, దయ, కృప, ధర్మం,
పశ్చాత్తాపం చుట్టూ తిరిగేవారే
ఇది వేణు గోపాల పేమ సుమా
--((**))--
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం
నేటి హాస్యం
అన్ని ఏర్పాటిలూ పూర్తయిపోవచ్చాయి బావగారూ!
నేను మా పార్టీలో ఎం. పి, మీరు ప్రతిపక్షం పార్టీలో ఎం. ఎల్. ఏ నా పార్లమెంటు నియోజకవర్గం లోనే!
మీ పార్టీ, మీ పేరు కలసి మీరు గెలిచేస్తారండీ,
నేను ఓడిపోయేలాగున్నాను!
పద్ధతిగా అయితే అది నిజమే బావగారూ!
నా మనుషులు అన్ని పార్టీలలోనూ వున్నారు,
నాకు వ్యతిరేకత వున్న శాసనసభ నియోజకవర్గం లో మీరు పోటీ చేస్తారు, నాకు వ్యతిరేకముగా ప్రచారం చేస్తారు, అదీ గాక మాకు క్రాస్ ఓటింగ్ పడేటట్టు ఏర్పాటు చేసేసాము,
నేనూ గెలుస్తాను, మీరూ గెలుస్తారు!
ధన్యవాదాలు బావగారు!
నా సందేహం తీర్చుకోవచ్చా?
తప్పకుండా!
అన్ని పార్టీలలోనూ మీ మనుషులున్నారన్నారు కదా, మీకు అంతులేని ఖర్చులే కదా?
ఔను బావగారూ! ఔను బావగారూ!
అందుకేగా ఏదో రకంగా ప్రజల సొమ్ము
ప్రభుత్వ పరంగానో మరో దారిలోనో దోచుకొనేది!
ఇంత ఖర్చు బాగానే వుంది
మరి మీకంటూ మిగులుతోందా?
పది సార్లు ఓడిపోయినా ఈ ఏడు తరాలూ, రాబోయే ఏడు తరాలూ ధర్జాగా కాలిమీద కాలేసుకు కూర్చుని తినే స్థితిలోనున్నాను బావగారూ!
--((**))--
ఇది నా ప్రాంతమని ఏ రీతిగా పలికెద - నేను ఒకచోటనే ఉండునని ఏల చెప్పద
ఎవ్వరికి చెందిన వాడవని నీకు తెల్పెద - నేను స్వేశ్చగా ప్రేమను అందరికీ ఇచ్చేద
నా వృత్తి, ప్రవృత్తి ఇదే నాని ఎలా చెప్పెద - పగలు రాత్రి మేల్కోగలనని వక్కాణించెద
సమస్త విద్యలను గురువుగా ఎలా నేర్పేద - స్త్రీ, సిరి, ఇచ్చి సహకరించేది కృష్ణే కదా కథ
ప్రతిఒక్కరు ఎవరికీ ఎవరు కారు
అయినా ప్రేమ, దయ, కృప, ధర్మం,
పశ్చాత్తాపం చుట్టూ తిరిగేవారే
ఇది వేణు గోపాల పేమ సుమా
ఆనాటి విషయం మరిచిపో - అది ఆవేశముతోనే, అనాలోచనతోనే చేసినది
జరగబోయే విషయం గుర్తు తెచ్చుకో - బంగారు భవిషత్తుకు వేయాలి పునాది
చెడును మరచి మంచి చేసి శోభా తెచ్చుకో - కాలంతో పాటు నడక అనేది అనాది
ప్రాణుల కోసమైన ప్రాణం నిల్పుకో - బ్రతికి బ్రతికించట మానవత్వానికి ఉగాది
ఏనాటికి మారదు, ఏనాటికి తెలియదు, ఏబుర్రకీ ఎక్కదు
ఆనుకోవటాం పొరపాటు, కాలు జారితే కడుక్కోవాలి
శీలం జారినా మృగాలను ఎదిరించి బ్రతకాలి
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--
ఆనాటి విషయం - ఏనాటికి మారదు
జరిగే విషయం - ఏనాటికి తెలియదు
మంచి విషయం - ఏబుర్రకీ ఎక్కదు
చెడ్డ విషయం - బుర్రఎక్కక తప్పదు
పుడమిలో లేరు - ధర్మబోధ చేయువారు
నిజము చెప్పువారు - కృపచూపే వారులేరు
తెలుగు భావమువేరు - ఇంగ్లీష్ భావంవేరు
బంధానికి ఎవరెవరు - ప్రేమకు ఎవరోకరు
--((**))--
మగపిల్లలతో దెబ్బలాటకు దిగడం అప్పుడప్పుడు అబ్బాయిని బాదడము అంతే సహజం.శాస్త్రి గారు దుబ్బు మీసాలు పెంచుతారు.యీ పద్యం ఆ మీసాలని ఎగతాళి చేస్తుంది
గోలీలాట మొగోల్ల ఆట!నువు కూకోమాకు యెల్లెల్లు, ల
చ్చీ!లచ్చీ అని ఆడు పుట్టువునె అచ్చేపిస్తే కూసోని,నీ
గోలీల్నీ,సహవాసగాళ్ళని సహా గొర్గింది గుర్తుంద! మీ
సాలింకెందుకు సత్తిబాబు!యికిలిస్తా వేంది పిల్లాటలా
సత్తిబాబు ఆడ పుట్టుకను ఆక్షేపిస్తే సుబ్బలక్ష్మి కి కోపం వచ్చి సత్తిబాబుతో గోలీ లాడి సత్తిబాబుకు శాస్తి చేసింది.ఎగతాళి చేస్తున్న సుబ్బలక్ష్మిని ఏడవలేక నవ్వుతూ బిక్కమొగం వేసుకున్న సత్తిబాబును మీరే ఊహించుకోండి.
నైపుణ్యం గల శిల్పి చేతిలోని ఉలి బండ రాయిని సౌందర్యమూర్తిగా యెలా మలచగలదో
ప్రతిభా వంతుడైన కవి కలమూ అంతే దానికి ప్రక్రియ,భాష అడ్డురావు.అంత ప్రతిభ గల కవులు కాబట్టే భాష మాండలికమైనా యతిభంగం జరిగినా కవన ప్రపంచం వారి ముందు మోకరిల్లింది.
--((**))--
79. వెల్లుల్లి వనములో వెలయంగ జోఱీఁగ, పికము, పాడూరను బేస్త రాజు
సాలె జేండ్రులలోన సాతాని పండితుం, డంధులలోన నేకాక్షి శ్రేష్టుఁ
డతిలోభి రాజున కర్ధంబు నడుగని, వాఁడె పో పండితవర్యుఁదరయ
గాఁపు మంత్రులలోనఁ గాటేరి దైవంబు, కొక్కెరాయలలోనఁ గొంగ ఘనము
గుడిసె వేటుల నిల్లాలు గిత్తలంజె
గనుక నీరీతిఁ బెక్కులు గలవు తలప
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల
--((**))--
తల్లో పూలు గొనిస్త! సేతులకు బందర్గాజు లేయిస్త! యీ
ఊల్లో గాని యెవుత్తికట్ట నసుమంటుప్పాడ చెమ్కీ బుటా
మల్లీ మొగ్గల తెల్లకోక యిగ యీమారెల్లి పట్కొత్తనే
సల్లా ఎంకట లచ్మీ బతుకేలా నీవు లేకుండినన్
తల్లోకి పూలు కొనిస్తా,బందరు గాజులేయిస్తాయీ వూళ్ళో ఏ స్త్రీ కట్టనటువంటి చెమ్కీలు,బుటాలు వున్న మల్లెమొగ్గ లాంటి తెల్లచీరెను ఉప్పాడ వెళ్లి కొనుక్కొస్తా
అందుకని సుబ్బలక్ష్మీ దయచూపవే నువ్వు లేకపోతే యీ బతుకు నాకెందుకే అంటూ సాగుతుందీ
--((**))--
ఏ నాటి పూజయో, ఏ నాటి తపమో - ఈనాడు నేనంద నిట్టిది కృప
ఏ ప్రేమ ఫలితమో, ఏ నీతి ఫలితమో - ఈ నాటి సంసార దయ దీప
ఏ ధర్మమో, ఏ సత్యమో, ఏ న్యాయమో - ఈ పగలు రాత్రిల్లు ఉండే జత పాప
ఈ ప్రేమ సుఖమో, ఈ బిడ్డ ఫలితామో - ఈ తల్లి జ్ఞానమిచ్చెడి సత్యస్వరూప
నిశ్చింతయే తాను నిలువ నా జతగఁ
నాశ్చర్యమిడుగాని యందించు హితము
ఇది వేణు గోపాల పేమ సుమా
__((**))--
సాహితీమిత్రులారా!
కార్తీకం అంటేనే వెన్నెలనెల. ఇక కార్తీకపౌర్ణమి నాటి ‘ఆ జాబిల్లి వెలుంగు వెల్లికల’ గురించి వేరే చెప్పేదేముంది. ఆ రోజు వెన్నెట్లో వనభోజనాలు ఒక మధురమైన అనుభూతి. అలాంటిది ఆ వెన్నెలే భోజనమైతే! మానవుని ఊహకి అంతేముంది. చకోరమనే పక్షి వెన్నెలని మాత్రమే తాగుతుందనీ, ఆ పక్షికి అదే ఆహారమనీ ఒక చిత్రమైన కల్పన చేశాడు. ఎవరు ఎప్పుడు చేశారో తెలియదు కానీ, అది కవుల కవిత్వానికి గొప్ప ముడిసరుకయ్యింది. వెన్నెలను వర్ణించే ప్రతిచోటా చకోరాల ప్రస్తావన తప్పనిసరి. ఇలాంటి కవుల కల్పనలకి ‘కవి సమయా’లని ముద్దు పేరు. ఆదికవి వాల్మీకితో మొదలుపెట్టి, ఇంచుమించుగా సంస్కృత కవులందరూ వెన్నెల గురించీ వెన్నెలపులుగుల గురించీ రకరకాల కల్పనలు చేసినవారే. మన తెలుగు కవులకి అదే ఒరవడి అయ్యింది. సంస్కృతం నుండి స్ఫూర్తి పొందినా తమ ప్రత్యేకతని ఎప్పటికప్పుడు చాటుకొంటూనే వచ్చారు తెలుగు కవులు. ఉదాహరణకి, వేసవి పండువెన్నెలని వర్ణిస్తూ, అది చకోర పక్షి కూనలకి భూమి అనే పెనం మీద ప్రకృతి వేస్తున్న చాపట్టుగా, అభివర్ణిస్తాడు శ్రీకృష్ణదేవరాయలు. ఎంతైనా తెలుగువాళ్లు భోజనప్రియులు కదా! దీనికంటే మరో నాలుగడుగులు ముందుకు వేశాడు పొన్నగంటి తెలగనార్యుడు!
సీ. అనుకువెన్నెల దాల్చి తునిచి సేవెలు చేసి
వెన్నెలపాలను జున్నొనర్చి
గట్టివెన్నెల పిండిగొట్టి వెన్నెలవెన్న
గలయ వెన్నప్పాలుగా నమర్చి
గడితంపు వెన్నెల గండ్రికల్ సిగరిగా
దియ్యవెన్నెలలోన దెచ్చిపెట్టి
యెడల వెన్నెల చక్కెరిడి జోర్కు వెన్నెల
బూనిక నాళీలుగాను గూర్చి
తే. పండువెన్నెల యను వెండిపళ్ళెరముల
జెలగి యిల్లాండ్రు వడ్డింప జెలులు దాము
వేడుకలు మీఱ బువ్వంపు గూడు గుడిచి
పొదలు తమితోడ వెన్నెలపులుగు లమరె
అనుకు అంటే పలుచని అని అర్థం. ఒక దగ్గర వెన్నెల పలుచగా కాస్తోంది. అలాంటి వెన్నెలను తీసుకొని, దాన్ని సన్న సన్నని ముక్కలుగా తునిమి సేవెలు తయారుచేశాయి చకోరాలు. సేవెలు అంటే సేమ్యా. పలుచని వెన్నెలతో వెన్నెలసేమ్యా తయార్! ఆ తర్వాత, వెన్నెలనే పాలను తీసుకొని జున్ను తయారుచేశాయి. కొంత వెన్నెలేమో గట్టిగా ఉందట! దాన్ని పిండికొట్టి, పాలవెన్నెలతోనే తయారుచేసిన వెన్నెల వెన్నతో కలిపి వెన్నప్పాలు చేశాయిట! వెన్నప్పాలు అంటే వెన్న కలిపి చేసే అప్పాలు. గడితంపు అంటే దట్టమైన. గండ్రికలు అంటే తునకలు. కాస్త దట్టంగా కాస్తున్న వెన్నెల తునకలని తెచ్చి, తీయని వెన్నెలలో కలిపి సిగరి తయారు చేశాయి. సిగరి అంటే మెంతి మజ్జిగలాంటిది. ఇక్కడ ‘తియ్యవెన్నెల’ అన్నాడు కాబట్టి, యిది తియ్యని లస్సీ అయి ఉండవచ్చును. కాస్త దళసరిగా ఉన్న వెన్నెలని తునిమి తెచ్చి, లస్సీ పైని వెన్నగా (మలాయి) వేశాయనుకోవచ్చు. కొంత వెన్నెల విడివిడిగా పొడిలాగా కురుస్తోంది. అదే ‘ఎడల వెన్నెల.’ ఆ వెన్నెల పంచదారలా ఉంది. అలాంటి వెన్నెలచక్కెర వేసి, ‘జోర్కు’ వెన్నెలని ‘నాళీ’లుగా తయారు చేశాయట. జోర్కు, నాళీ, అన్న పదాలు నాకు నిఘంటువులో ఎక్కడా కనిపించలేదు! నాళీలు అంటే బహుశా కేరళ వాళ్ళు తయారు చేసే ‘పుట్టు’ లాంటి వంటకం అయి ఉండవచ్చు. అవి గొట్టాల ఆకారంలో ఉంటాయి, చక్కెరతో కలిపి తింటారు. ఇలా ఎన్నో పిండివంటలని చేసి, పండు వెన్నెల అనే వెండి పళ్ళాలలో పేర్చి తమ ఇల్లాళ్లు వడ్డిస్తూ ఉంటే స్నేహితులతో కలిసి సంబరంతో విందుభోజనం చేస్తున్నాయట ఆ వెన్నెలపులుగులు. ‘బువ్వంపు కూడు'” అంటే ఇంగ్లీషులో feast అన్న పదానికి అచ్చమైన తెలుగుపదం.
కపాలే మార్జారః పయ ఇతి కరాన్ లేఢి శశినః
తరుచ్చాయాప్రోతాన్ బిసమితి కరీ సంకలయతి
రతాంతే తల్పస్థాన్ హరతి వనితాప్యంశుకమితి
ప్రభామత్తశ్చంద్రో జగదిదమహో విప్లవయతి
దీనికి నా అనువాదం:
గిన్నె ప్రతిఫలించు వెన్నెల పాలని
నాకుచుండెను పిల్లి! నాగ మొకటి
చెట్టునీడలయందు చిక్కిన నెలతీగ
బిసమటంచును తాను బిట్టు లాగె!
ప్రక్కపై పర్విన పలుచని జలతారు
వెండివెన్నెల జిగి, వేడ్కమీర
మరుకేళి దనిసిన మానిని యొక్కతె
తొలగిన పయ్యెదంచులికి తీసె
వెలుగునీడలందు విశ్వమ్ము తమకిల్ల
భ్రాంతిమతులు కాగ ప్రాణులెల్ల
వరలు సుధలు గురిసి ప్రతిరేయి జాబిల్లి
మరులు గొలిపె జగతి మత్తు జల్లి
ఇది అతను రచించిన యయాతి చరిత్రము అనే కావ్యం లోని పద్యం. గొప్ప చమత్కారమైన ఊహని, దేశి తెలుగు సొగసులతో అందంగా చిత్రించే పసందైన పద్యం. ‘అచ్చతెనుంగు బద్దె మొకటైనను గబ్బములోన నుండినన్ హెచ్చని యాడుచుండు‘ కాలంలో కావ్యమంతా అచ్చతెలుగులో రచించిన మొట్టమొదటి కవి తెలగన. సంస్కృతం తెలుగులో ఎంతగా కలిసిపోయిందంటే, అచ్చతెలుగులో పద్యం చెప్పడం చిత్రకవిత్వంగా మారిపోయింది. ఈ కవిగారు కూడా, అందరూ అబ్బురపడి తనను మెచ్చుకొంటారనే, కావ్యమంతా అచ్చతెలుగులో రచించాడు. ఈ పద్యంలో, భాషతో పాటు అచ్చతెనుగు పిండివంటలని కూడా మనకి రుచి చూపించాడు. ఏ కావ్యాన్ని చూసినా చకోరాలు వెన్నెలని త్రాగుతున్నట్లు చేసిన వర్ణనలే. మహా అయితే వెన్నెల తీగలని తమ ముక్కులతో కరుచుకొన్నట్టు, తునిమినట్లు అక్కడక్కడా కొన్ని వర్ణనలున్నాయి. ఈ వర్ణనలన్నీ చదివున్న ఈ కవికి కాస్తంత చిరాకు, చకోరాలపై కూసింత జాలీ కలిగింది కాబోలు! వెన్నెలని ఎంతసేపని త్రాగుతాయి, వాటికి మాత్రం మొహం మొత్తదూ! అవి కూడా మనలా రకరకాల వంటలని రుచి చూడకపోతే ఎలా? చక్కెర ఎంత తీయనిదైనా, ఎప్పుడూ దాని పాకాన్ని త్రాగుతూ కూర్చుంటామా? రకరకాల తీపి పదార్థాలు చేసుకొని తింటే కానీ తృప్తి ఉండదు కదా! అలా ఆలోచన వచ్చిందో లేదో, ఇలా చకోరాలకి వెన్నెలతో కమ్మని విందుభోజనం ఏర్పాటు చేశాడు తెలగన్న. వెన్నెల రకరకాల చోట్ల, రకరకాల సమయాల్లో, రకరకాలుగా కురుస్తుంది. అలాంటి వెన్నెలతో అతను వండిన వంటలేమిటో రుచి చూద్దాం పదండి.
ఇదీ పొన్నగంటి మనకి వండి వడ్డించిన వెన్నెల భోజనం! తన సహజమైన మగబుద్ధితో, చకోరాల ఇల్లాళ్లతోనే వంట వండించి, వడ్డన కూడా చేయించాడు! కథ మాట ఎలా ఉన్నా, ఇలాంటి అద్భుతమైన కల్పనలను చదివి ఆనందించడానికీ, మనకి తెలియని, మనం మరిచిపోయిన అనేక వేల అచ్చతెలుగు పదాలనీ పలుకుబళ్ళనీ తెలుసుకోడానికీ, ఈ యయాతిచరిత్రము చాలా గొప్ప సాధనం. ఈ పద్యం చదివినప్పుడు, వెన్నెల గురించిన భాసుని చాటువొకటి గుర్తుకువస్తుంది:
అనాదిగా వెండి వెన్నెల జిలుగులు కవుల మనసులని మురిపిస్తూనే ఉన్నాయి. మధురమైన కవిత్వాన్ని కురిపిస్తూనే ఉన్నాయి. అయినా, ఆ వెన్నెల మహిమలు వింటే సరిపోదు, స్వయంగా అనుభవించి ఎరుగ వలసిందే!
---------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, ఈమాట సౌజన్యంతో
---------------------------------------------------------
- ఏ.వి.రమణరాజు
--((**))--
Ramakrishna Mallapragada ప్రాంజలి ప్రభ - అదిక్షేప ప్రేమలీల
దైవాన్ని దూషించేవాడు, భారతా వనిపైన - బ్రతికి ఉన్నా లేనట్లు లెక్కే
మాత్రృ దేశం గురించి హీనంగా మాట్లాడిన - దేశంలో ఉన్నా లేనట్లు లెక్కే
తల్లి తండ్రలను ప్రేమతో గౌరవించకపోయిన - కుటుంబంలో ఉన్నా లేనట్లు లెక్కే
స్త్రీ ని ప్రేమించి ప్రేమ పోంద లేక పోయిన - సంసారిగా ఉన్నా లేనట్లు లెక్కే
కాలంతో పాటు, దేశాన్ని బట్టి, మనసును బట్టి
అర్ధం చేసుకొని జీవితమే మానవాభ్యుదయం
ఇది వేణుగోపాల ప్రేమ సుమ
--((**))--
ఉత్సాహ
--
చల్లఁబడెను వానవలన జగతి యంత హాయిగా
పెల్లుగాను రాలిచినుకు పృథ్వినంతఁ దడుపఁగా
నుల్లసిల్లి తరులు గూడ నూగుచుండ నవనిపై
వెల్లనైన మబ్బులన్ని వేగఁ బారె నింగిపై
--
ఉరిమి యురిమి మఱల మఱల యుడిగి పోయి శక్తులన్
దరుముచుండ గాలివెనుక తాళలేని యట్లుగాఁ
బరుగు దీసె నంబుదములు పయిపయినట నెచటికో
ధరణిపైన ఝరులు నిండి తనివిమీఱి యుండఁగా
--
చిట్టి చిట్టి చినుకులన్ని చిటపటమని రాలుచున్
జెట్టు గుట్టలన్నిఁ దడిపి చేరి పెక్కు వాగులై
గట్టులనవి యొరసికొనుచు ఘనత నేఁగుచుండఁగా
బట్టుకోక యెటుల కలము పరవశాన నేనునున్
--
అడుగు బెట్టకున్నఁ గాని యరిగి బైట వానలో
నెడఁద పొంగిపోవుఁ జూడ నిలను నున్న దృశ్యముల్
తడుముకొనెడి పనియు లేక తగిన పలుకు కోసమై
వడిగ వడిగ పదములిచ్చి వ్రాయఁజేయుఁ దల్లియున్
--
పచ్చనైన యాకుతోడఁ బ్రకృతి శోభలీనఁగా
వెచ్చఁదనము తగ్గిపోయి వేడుకవఁగఁ బరిసరాల్
నచ్చినట్టి తల్లి యిడఁగ నాల్గు పలుకు లీవిధిన్
హెచ్చుగాకయుండె ముదము హృదయమందు నాకునున్
--
వేరు కాన్కలేల నింక ప్రీతి గూర్చఁ బ్రకృతియే
కోరికలను బెంచుకొనియుఁ గ్రొత్త క్రొత్త వానికై
కూరఁగలద తృప్తి మదినిఁ గొన్ని యుగములైననున్
మేరలేని యాశలేల మేలయినదె యందఁగా
--
సుప్రభ
--((**))--
om
ReplyDelete