Wednesday, 11 July 2018


ఓం శ్రీ రాం     ఓం శ్రీ రాం     ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ. 
సర్వేజనా సుఖినోభవంతు 

మంచి మాట ప్రతివోక్కరి మనస్సుకు వెన్నల బాట 
                                                    
ఎందరో మహానుభావులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కీర్తిమ్చితూ  అనేక రచనలు చేసియున్నారు, ఇంకా భక్తులు రచనలు  చేస్తునే ఉ న్నారు, అదేవుని కృపకు పాత్రులవుతున్నారు. నేను వ్రాసినది  పాండిత్యము  కాదు,  పద్యము కాదు,  నేను ఆరాధించే శ్రీ రామ భక్త హనుమంతుని సహాయముతో శ్రీ తిరుమల  తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని ప్రార్ధిస్తూ,  ప్రతి ఒక్కరికి స్వామి వారి క్రుపాకటాక్షముల్  చెందాలని వ్రాసిన 108 కుసుమాలు, గూగుల్ మరియు జి మెయిల్ ద్వారా ప్రతి వొక్కరూ చదువు కొనే విధముగా నా శ్రీమతి, పుత్రికల ప్రోత్యాహముతో, మరియు శ్రీ వెంకటేశ్వరస్వామి వారి భక్తుల సహాయ సహకారముతో ఇది పూర్తిచేసినాను.
             
            నేను వ్రాసినా కవితలలో అక్షరతప్పులను,  వాక్య  దోషములను నేనే  భాద్యత వహిష్తున్నాను, మీ సలహాలు అభ్యంతరములు నాకు తెలియపర్చండి, సరిదిద్దు కోగలను. మీరు చదివి మరోక్క రిని చదవమని చెప్పగలరని ఆ శ్రీవెంకటేశ్వరస్వామి వారి కృపకు పాత్రులవ్వాలని, అందరికి అర్ధమయ్యే పదాలతో, సరళమైన శైలిలో తకముగా మీ కందిస్తున్నాను.          
                                             
             
1. నమోకేశవ, నమోనారాయణ, నమోమాధవ,
    నమోగోవింద, నమోవిష్ణు, నమోమధుసూధన,
    నమోత్రివిక్రమ, నమోవామన, నమోశ్రీధర,
    నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
 
                                    
  
2. నమోహృషేకేశ, నమోపద్మనాభ, నమోదామోదర, 
    నమోసంకర్షణ, నమోవాసుదేవ, నమో ప్రద్యుమ్న,
    నమోయనిరుర్ధ, నమోపురుషోత్తమ, నమోయధోక్షజ,
    నమోనమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


3. నమోనారసింహ, నమోఅచ్చుత, నమోజనార్ధన,
    నమోఉపేంద్ర , నమోశ్రీకృష్ణ , నమోశ్రీహరి,
   నమోవెంకటేశ, నమో శ్రీనివాస, నమోసర్వదేవ,
   నమోనమోశ్రీ తిరుమలతిరుపతి 
వేంకటేశ.

4. అగ్రత, అఖండ, అరుణోదయ,
     అమోఘ, అద్భుత, అభిరూప,
     అమృత, అభీష్ట, అమ్బుజనాధ,  
     నమోనమోశ్రీ తిరుమలతిరుపతి వేంకటేశ.

5.  అభిమాన, అభ్యు దయ, అష్టోత్తరకర్త,
     అభిజ్ఞాన, అలంకార ,అభివాద
ర్త,
     అమిత, అమూల్య, అరవిన్దభర్త,        

     
నమో నమో శ్రీ తిరుమల తిరుపతి 
వేంకటేశ.

6.  అకార, అకర్ష,ఆచార్యువు,
     ఆనంద, ఆత్రేయ,అధిపుర్షు
వు,
             ఆశ్రయ, ఆశ్రిత, ఆరాధకు
వు,       
                       నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


7.  సువర్ణ , సుందర, సుహృదయ,
     సురబి, సురత, సుభగాసుత,
     సుకుమార, సుకృత, సురోత్తమ,
     నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
  
8.  కరుణ,కటాక్ష,కమనీయరూప,
     కనువిందు 
 చేయు 
కమనీయ కవచధారి,
     
ప్పముకట్టే, కలియుగ కమలానాధ,  
     నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.  


*9.  గగన, గతీశ ,గతిప్రదాతా,
     గణక , గణకార,  గణదాతా,
     గమన, గణాకర,  గణరాజా,
     నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ. 
    

10. గోదేశ,గోదాన,గోధార,
      గోదేవ, గోద్యేత్య, గోధర,
      
గోధాత, గోధారణ, గొనాధ,
                         నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ. 

11. మహాస్వన:, మహామాయ:, మహాబల:
      మహాబుద్ధి:, మహావీర్య:,మహాశక్తి:
      మహాద్య్యుతి
:, మహాశన :, మహాభాగ :
      నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.




12. సుకుమార,  సుధామృత, సుభాగాసుత,
                సుముఖం,   సుహృదం,          సులభం,
                స్వాతికార,  సాహిత్య,       స్వభాగినేయ, 
                నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


                           13.  అభిరామ, అసహయ, అవనీతనయ,
                               అమాత్త్య,  అభిఘాత,   అసాధ్యాయ,
                              అక్షపాద,        ఆక్షేపక,    ఆర్యవర్తక,
                         నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


                           14.  జనార్ధన:,      జగద్రక్ష:, జగత్కర్త:,
                                  జగజ్జేత:,   జగత్జ్యోతిష:, జగజ్జీవ:,
                                 జగద్గురు:, జగత్జయ:, జగత్సాక్షి:,
                          నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


                            15.  కులక్షణ:, కులసంభవ:, కులసేష్ట:,
                                  కులీన:,     కులేస:,    కులేస్వర్య:,
                                  కూత్తమ:,  కూతేజార:,       కుధీర:,     
                          నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.*


                         16. గగనతల,  గగనకుసమ,    గగనధ్యజ,
                           గజవాహన, గరుడవాహన,  గణనీయ,
                             గజతుర,      గజప,     గానితవిశారద,
                         నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
                    17.  శ్రీకర:,        శ్రీనిధి:,          శ్రీమాన్ :
                           శ్రీవాస:, శ్రీ
వత్సవక్షా:, శ్రీమతావర :
                           శ్రీనివాస:, శ్రీవిభావన:,       శ్రీ ధర :
                  నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ. 


                    18   పరమాత్మ:,  పరంధామా:,  పద్మనాభా :
                    ప్రభాత:,  ప్రత్యర్ధన:,          పురుషోత్తమ:,
                    ప్రజాపతి:,  ప్రజాభవ:,        పుండరీకాక్ష:,
                    నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

                19.  ప్రాణదాత,  ప్రాణే నేశ్వర,     ప్రధమగణాధీశ,
                     ప్రత్యేకాత్మ,  ప్రసన్నాత్మ,   ప్రమేయాత్మ,
                     పద్మనిభేక్షణ,  పరమస్పష్ట,  పరమేశ్వర,
                     నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ. *

                

              20.  ఇతిహాస,       ఇతివృత్త,       ఇందువదన,
                     ఇష్టఘంధ,      ఇష్టభోజ,      ఇంద్రియలోల,
                     ఇల్లాలుఇష్టంతేలిసిన, ఇక్స్వాకువం
వర్ధన,
                     నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.



ప్రభావతీ ప్రద్యుమ్నం – 3

సాహితీమిత్రులారా!

ప్రభాతీ ప్రద్యుమ్నం మూడవ భాగం చివరిభాగం
ఆస్వాదించండి-

నీళ్ళు నవుల్తూ ఉండిపోయింది చిలక!
“చెప్తావా, చంపమంటావా?” బెదిరించింది శుచిముఖి దాన్ని నొక్కిపడుతూ.
“నన్ను కొట్టూ, చంపు. ఎవరికీ చెప్పనని ఒట్టేస్తే గాని ఆ విషయం బయటపెట్టను” అంది చిలక మొండిగా. అలాగే ఒట్టేసింది శుచిముఖి.
ఇలా చెప్పింది చిలక “వజ్రనాభుడికి సునాభుడనే తమ్ముడున్నాడు. అతనికి చంద్రవతి, గుణవతి అనే యిద్దరు కూతుళ్ళు. ఒకనాడు నారదుడు యిక్కడికి వస్తే వాళ్ళిద్దరూ ఆయన ఆశీర్వాదం కోసం ఆయన్ని పూజించేరు. ఆయన దానికి సంతోషించి “మీ భర్తలకి మీమీద చెరగని ప్రేమ ఉండుగాక! మీకు చక్కటి సంతానం కలుగ్గాక!” అని దీవించేడు. ఐతే అప్పుడు పక్కనున్న దాదులు ఊరుకోలేక “వీళ్ళకి ఎవరు భర్తలౌతారో కూడా దయచేసి మీరే చెప్పండి” అనడిగారాయన్ని.
కొంత సేపు ఆలోచించేడు నారదుడు.
“ద్వారకానగరంలో వుండే గద సాంబులనే వాళ్ళు వీళ్ళకి భర్తలౌతారు” అని ఆనతిచ్చేడు నారదుడు.
దాంతో బిత్తరపోయేరు వాళ్ళు!
“తిని కూర్చుని తిప్పలు తెచ్చి పెట్టుకున్నాం కదా! ఎక్కడి ద్వారక, ఎక్కడి గదసాంబులు? ఈ సంగతి రాజుకి తెలిస్తే ఇక మన మెడల మీద తలలుండవ్‌” అని గప్‌చుప్‌గా ఊరుకున్నారు వాళ్ళంతా.
ఐతే గుణవతీ చంద్రవతులు మాత్రం అప్పట్నుంచీ గదసాంబుల్నే తల్చుకుంటూ వాళ్ళకోసం నోములూ వ్రతాలూ చేస్తున్నారు. వాళ్ళు చిన్నప్పట్నుంచీ నన్ను పెంచి పెద్ద చేసేరు గనక వాళ్ళకి కొంత ఉపకారం చేద్దామని నేనే ద్వారకకి వెళ్ళి రాయబారం నడుపుతానని వాళ్ళతో చెప్పి వెళ్ళొస్తూ దార్లో ఆ ఉత్తరం తీసుకొచ్చా.నన్ను ప్రభావతి చూస్తే కొంపలంటుకుంటయ్‌. నేను త్వరగా వెళ్ళి వాళ్ళకి కనపడకపోతే వాళ్ళెంతో బాధపడతారు కూడా. దయచేసి నన్నొదులు” అని బతిమాలింది చిలక శుచిముఖిని.
“ఐతే వాళ్ళచేత ఈ కథ నిజం అని చెప్పించు. అప్పుడొదిలేస్తా నిన్ను”
అందుకు ఒప్పుకుంది చిలక. వాళ్ళ అంతఃపురానికి తీసికెళ్ళింది. చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూసి వాళ్ళని పిలిచింది.
ఆనందంగా పరిగెత్తుకొచ్చారు అక్కచెల్లెళ్ళు!
హంస రెక్కల్లో చిక్కుకుని ఉన్న చిలకని చూసేసరికి తెల్లబోయేరు!
“మీరేం భయపడొద్దు. ఈ హంస ప్రమాణం చేసింది “నీకూ నిన్ను పంపిన వాళ్ళకీ మంచేగాని ఏమీ చెడు జరగనియ్యన”ని.” అంటూ తనకీ ఆ హంసకీ జరిగిన కథ వినిపించింది చిలక, ప్రభావతి విషయం రానివ్వకుండా.
శుచిముఖి చిలకని వదిలేసింది.
“గదసాంబులిద్దర్నీ కలిసి మీ విషయాలు చెప్పేను. వాళ్ళకి మీరంటే ఇష్టం కలిగింది. మిమ్మల్ని తప్పక పెళ్ళాడుతామన్నారు. త్వరలో ఇక్కడికి వచ్చే ఉపాయం చూడబోతున్నారు” అని తను చేసుకొచ్చిన పని చకచక వినిపించింది చిలక.
శుచిముఖి కూడా, “వాళ్ళిక్కడికి రావటానికి నేనో ఉపాయం చేస్తాను. నేను మీ అక్క ప్రభావతి మిత్రురాల్ని.ఆమె యీ చిలకని పట్టుకు రమ్మంటేనే ఇలా వచ్చా. ఇప్పుడు మీతో కూడా స్నేహం కుదిరింది. మీ రహస్యం ఆమెకి తెలీకుండా సర్ది చెప్తాలే, మీరు భయపడకండి” అని వాళ్ళకి చెప్పి ఎగిరి ప్రభావతి దగ్గరికెళ్ళింది.

“అదృష్టం అంటే నీదే! అది ప్రద్యుమ్నుడు పంపిన లేఖేనటగా! చదువుకున్నావా?” అని పరామర్శించింది ప్రభావతిని.
ఆమె కూడా నవ్వుతూ, “అది సరే, ఆ చిలకెక్కడ? దాన్నెందుకొదిలేసొచ్చావ్‌?” అనడిగింది.
“ఇంకా దాని గొడవెందుకు? నీ ప్రియుడు నీకు రాసిన లేఖ ఇంకెవరి చేతా పడకుండా మనకే దొరికింది కదాని సంతోషంలో దాన్ని వదిలేశా” అని దాటేసింది శుచిముఖి. “ఆ లేఖంతా చదువుకున్నావ్‌ కదా! అప్పుడు నేను నీగురించి అంత చెప్పినా కిక్కురుమననివాడు యిప్పుడింతగా తపించిపోవటం ఆశ్చర్యమే! ఐనా నీ అందం గురించి విన్న వాడు నీరుగారి పోకుండా ఉండటానికి అతని గుండె ఇనుమా, రాయా? .. అంతా బాగానే ఉంది. ఇక అతన్ని యిక్కడికి రప్పించటానికి ఓ ఉపాయం ఉంది. నువ్వు అవకాశం చూసుకుని నీ తండ్రికి నా గురించి గొప్పగా చెప్పు. కథలు చెప్పటంలో నాకు నేనే సాటి అనీ, నాకు అన్ని విద్యలూ తెలుసుననీ, అతన్ని మెప్పించగలననీ బాగా బోధించు. ఆ తర్వాత విషయం నేను చూసుకుంటా” అని మార్గం ఉపదేశించింది ప్రభావతికి.

ఇంతలో ఓ రోజు వజ్రనాభుడు అంతఃపురానికి వచ్చేడు. ఆ సందర్భంలో, “మన కొనన్లలో తిరిగే హంసల్లో శుచిముఖి అనేదొకటి కనీవినీ ఎరగని విద్యలన్నీ తెలిసింది ఉంది. మాటల్లో, కథల్లో, రకరకాల విద్యల్లో దానికదే సాటి! మీరొకసారి దాని ప్రతిభని చూడాలి” అని చెప్పిందతంతో ప్రభావతి. “అలాగే, ఇప్పుడే చూద్దాం, పిలిపించు దాన్ని” అన్నాడతను ఆసక్తిగా.
శుచిముఖిని రప్పించింది ప్రభావతి. తన ముందు కూర్చోబెట్టుకుని, “శుచిముఖీ, నీ విద్యల గురించి చెప్తే ముచ్చట పడి నా తండ్రి వినాలనుకుంటున్నాడు. ఏదీ, నీకు తెలిసిన శాస్త్రాల గురించి చెప్పు” అనడిగింది.
ఇక విజృంభించింది శుచిముఖి. కాణాదం, గౌతమీయం, సాంఖ్యం, జైమినీయం, యిలా అన్ని మతాల్నీ పూర్వపక్షాలు పెంచుతూ,తర్వాత వాటిని ఖండిస్తూ సిద్ధాంతాలు చేసింది. కావ్యాలు, నాటకాలు, అలంకార శాస్త్రాలు, కామశాస్త్రం కరతలామలకాలుగా చూపించింది. వజ్రనాభుడు ఆనందపారవశ్యంతో ఉక్కిరిబిక్కిరయేడు.

ఆ శాస్త్రప్రసంగం అయాక, “నువ్వు అన్ని లోకాలూ తిరిగేదానివి. నీక్కూడా వింతగా అనిపించిన విశేషాలేవైనా ఉన్నాయా?” అనడిగేడతను కుతూహలంగా.
“ఎన్నో చూశా గాని అన్నిట్లోకీ విచిత్రంగా అనిపించింది భద్రుడనే ఓ నటుడి నాట్యప్రదర్శన. ఇదివరకో మునుల సభలో గొప్పగా నాట్యం చేసి వాళ్ళచేత వరాలు పొంది ఇప్పుడు ఏడుదీవుల్లోనూ ప్రదర్శనలిస్తున్నాడు” అంటూ అతని ప్రదర్శనలో చూసిన అద్భుతాల్ని వినిపించింది శుచిముఖి. వజ్రనాభుడికి కుతూహలం పెరిగిపోతోంది. “నేనూ అతని గురించి కొంత విన్నా. అతని నాట్యం చూడాలని అనుకుంటున్నా. నువ్వెలాగైనా అతనిక్కడికి వచ్చేట్టు చెయ్యి” అనడిగేడు శుచిముఖిని. “అలాగే” అని అతంతో చెప్పి, “ఇంక వెళ్ళి రానా?” అని ప్రభావతితో అంటూ ఆమె తనతో కొన్ని అడుగులు నడుస్తుంటే, “ఇదంతా నీ ప్రియుడి కోసమే చేస్తున్నా. తొందర్లోనే నీ కోరిక తీరబోతోంద”ని ఆమెకి చెప్పి వెంటనే ద్వారకకి వెళ్ళి కృష్ణుడితో భద్రుడికి వజ్రనాభుడి అనుమతి దొరికిందని చెప్పింది శుచిముఖి. అలాగే, గదసాంబుల గురించి నారదుడన్న విషయం కూడ చెప్తే ప్రద్యుమ్నుడితో వాళ్ళిద్దర్ని కూడా సహాయంగా పంపటానికి నిర్ణయించేడు కృష్ణుడు.
ఇక ఇంద్రుడికి యీ విషయం చెప్పాలి.
అంతలో ప్రద్యుమ్నుడు తన కోసం ఎదురుచూస్తూంటాడని గుర్తొచ్చి అతని భవనంలో దిగింది శుచిముఖి. వజ్రపురంలో ప్రభావతి అతని కోసం ఎదురుచూస్తూ తపిస్తోందని వివరించిందతనికి.
“ఇప్పుడే రెక్కలు కట్టుకు వెళ్ళి ఆమె ముందు వాలాలనుంది నాకు. కాని ఆ రాక్షసుడి అనుమతి దొరకటం ఎలా?” అని వాపోయేడు ప్రద్యుమ్నుడు.
“నీకేం బెంగక్కర్లేదు. దానిక్కావల్సిన పథకం అంతా సిద్ధంగా ఉంది. ఆ పని మీదే నీ తండ్రి నిన్ను పంపబోతున్నాడిప్పుడు. నేను కూడా స్వర్గానికి వెళ్ళి ఈ విషయం ఇంద్రుడికి చెప్పి అక్కణ్ణించి వజ్రపురానికి వెళ్ళి నీకోసం చూస్తుంటా” అని బయల్దేరింది శుచిముఖి.

కృష్ణుడు ప్రద్యుమ్నుణ్ణీ, గదసాంబుల్నీ పిలిపించేడు వెంటనే.
వాళ్ళు ముగ్గురూ కలిసి వజ్రపురానికి వెళ్ళి వజ్రనాభుణ్ణి చంపాలని ఆదేశించేడు.
ప్రద్యుమ్నుడు భద్రుడిగా, గదుడు పారిపార్శ్వకుడిగా, సాంబుడు విదూషకుడిగా వెళ్ళాలని వివరించేడు.
నటుల వేషాల్లో, అందుకు తగిన పరివారాల్తో, భద్రుడి కున్నలాటి సంగీత వాద్యాల్తో వెళ్ళి వజ్రపురం చుట్టుపక్కల ప్రదర్శన లివ్వసాగేరు వాళ్ళు.
వజ్రనాభుడు విన్నాడీ విషయం. వెంటనే వచ్చి తన ముందు ఆడమని కబురు పంపేడు.
అలా వజ్రపురం లోకి ప్రవేశించారు వజ్రనాభుడి పాలిటి యములు! కూతుళ్ళ ప్రియులు!!

ప్రదర్శన సమయం వచ్చింది!
శుచిముఖి కన్యలు ముగ్గురికీ వాళ్ళ ప్రియుల విషయం చెప్పి వుంచింది.
ప్రద్యుమ్నుడికి ప్రభావతి అతని ప్రదర్శనకి వస్తున్నట్టు చెప్పి ఆమె ఎక్కడ కూర్చుంటుందో కూడా చూపించింది.
తన వైభవాన్నంతా ప్రదర్శిస్తూ కొలువు తీరేడు వజ్రనాభుడు!
అంతఃపుర స్త్రీలు ఎవరికీ కనపడకుండా నాట్యప్రదర్శన చూట్టానికి వచ్చి కూర్చున్నారు.
తన అద్భుత మాయా ప్రభావంతో గంగావతరణం నాటకం ఆడించేడు ప్రద్యుమ్నుడు. దాన్లో ఉన్న పాత్రల ఆకారాలు ధరించటంలో, గంగ గమనాన్ని చూపటంలో, కైలాసం లాటి పర్వతాల్ని కళ్ళక్కట్టినట్టు చిత్రించటంలో, అడవులు, పక్షులు, మృగాల్ని సైతం పుట్టించటంలో అతని ఇంద్రజాలం జనాన్ని మంత్రముగ్ధుల్ని చేసింది. దగ్గరున్న డబ్బునీ సొమ్ముల్నీ బహుమతులుగా అతని మీదికి విసిరేరు వాళ్ళు.
అతను ఇన్ని వేషాల్లో అందరికీ కనిపిస్తున్నా ప్రభావతికి మాత్రం అతని అసలు రూపమే కనబడుతోంది!
ప్రదర్శన దిగ్విజయంగా ముగిసింది.
ప్రభావతి ఉన్న చోటు వంకా, వజ్రనాభుడి వంకా మార్చి చూస్తూ అతను చివరగా, “ప్రభావతీ! నా మీది నీ ప్రేమతో నా జన్మ తరించింది. నువ్వు పంపిన రాజహంసి నీ విషయం చెప్పిందగ్గర్నుంచి నిన్నే తల్చుకుంటున్నా. ఈ రాత్రికే మన కలయిక. ఇక నీ సేవకే నా జీవితం అంకితం” అనే సరికి
ఆమెకి ఎక్కడలేని సిగ్గూ, భయం ముంచుకొచ్చేయి.
చెక్కిళ్ళు ఎరుపెక్కేయి.
అది చూస్తున్న శుచిముఖి ఆమెని మందలించింది సున్నితంగా “ఇంత మంది మధ్య నువ్వంతగా సిగ్గుపడక్కర్లేదు. అతనన్న దాన్లో రెండో అర్థం నీకు తెలీలేదా ఏమిటి?”
“రెండో అర్థం ఏమిటింక మరీ ఇంత విచ్చలవిడిగా అందరిముందూ ఈ రాత్రికే వస్తున్నానంటుంటే!” అంది ప్రభావతి కంగారుగా.
“నీ ప్రియుణ్ణి మరీ అంత తేలిగ్గా అంచనా వెయ్యకు. అతనన్న మాటలు నీకలా అర్థమయ్యాయి తప్ప వజ్రనాభుడికి అవి తనని పొగుడ్తూ అన్నట్టు అనిపిస్తాయి. అలా ఎవరిక్కావల్సిన అర్థం వాళ్ళకొచ్చేట్టు మాట్టాడేడతను. కనక నీకేం బెంగక్కర్లేదు. నీ రహస్యం యింకెవరికీ తెలియదులే” అని వివరించింది శుచిముఖి.

                                                                                                  inka undi 




1 comment: