Friday, 27 July 2018

Pranjali prabha (28-07-2018)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:

ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం  

జ్ఞానామృతం పంచే గురు పౌర్ణమి 

వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువు అందుకే ఆయన పేరిట వ్యాస పూర్ణిమ రోజున గురు పూర్ణిమగా పండుగను జరుపుకుంటున్నాం. ఈ రోజున దేశమంతా గురు పూజా మహోత్సవాన్ని జరుపుకుంటారు. అసలు గురువు శబ్దానికి అర్థం; ఆచార్యుడంటే ఎవరు? వ్యాసుని కధ... గురుపూర్ణిమ చేసే విధానం తెలుసుకుందాం! 

గురువు అంటే: 

గురువు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకటై జన్మించిన రూపం అంటే సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపమే గురువు. గు అంటే అంధకారము లేదా అజ్ఞానాన్ని, రు అంటే నిరోధించుట లేక నశింప చేయుట అని అంటే గురువు అంటే అజ్ఞానాన్ని నశింప చే యువారు అని అర్ధము. గు శబ్దమంధకారస్యరుతన్నిరోధకః అని పెద్దల వచనం!గురువు చేయవలసినది తన శిష్యులను అంధకారంలోంచి వెలుగులోకి తీసుకు రావడం. ఈ భౌతిక జగత్తులో ఏ మానవుడూ సంసారయాతనలు అనుభవించకుండా చూడటం ఆ గురువు కర్తవ్యం. 
అందరూ గురువులే.. 

సాధారణంగా గురువు అనగానే విద్య బోధించేవాడనే భావం కలుగుతుంది. కానీ, గురువులు ఏడు రకాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏ గురువైనా శిష్యుడికి జ్ఞానాన్ని ప్రసాదించడమే లక్ష్యంగా కలిగి ఉంటారు. 
1. సూచక గురువు - చదువు చెప్పేవాడు 
2. వాచక గురువు - కుల, ఆశ్రమ ధర్మాలు బోధించేవాడు 
3. బోధక గురువు - మంత్రాలు ఉపదేశించేవాడు 
4. నిషిద్ధ గురువు - వశీకరణ విద్యలు బోధించేవాడు 
5. విహిత గురువు - భోగాల మీద విరక్తి కలిగించేవాడు 
6. కారణ గురువు - బ్రహ్మతత్త్వాన్ని ఉపదేశించేవాడు 
7. పరమ గురువు - పరమాత్మ అనుభవాన్ని ప్రత్యక్షంగా కలిగించేవాడు 

గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరు మిత్రులు,బంధువులు మరియు శ్రేయేభిలాశులకు 
--((**))--
అధిక్షేప ప్రేమ లీల 
లోకం తీరు 
మల్లాప్రగడ రామ కృష్ణ

నేర్చిన విద్య బ్రతికి బ్రతికించుటకు
 - విద్యార్ధుల మనస్సును మేపించేది సూచక గురువు  

కుల ఆశ్రమ ధర్మాలను బోదించుటకు
 - గ్రంధ గ్రాహ్య శక్తితో పరిష్కరించేది వాచక గురువు  

సంజీవ మంత్రాలను ఉపదేశించుటకు
 - ఆశ్రమధర్మాలను బట్టి నేర్పించేది బోధక గురువు 

సకల వశీకరణ విద్యాలను నేర్పుటకు
 - యుక్తాయుక్త విచక్షన బట్టి తెల్పేది నిషిద్ధ గురువు 

భోగాలమీద విరక్తి  కలిగింప చేయుటకు
 - జిహ్వ చాపల్యాన్ని తగ్గింప చేసేది విహిత గురువు 

వేదాంత బ్రహ్మత్వాన్ని ఉపదేశించుటకు
 - అహంకారం లేకుండా చేయగలిగేది కారణ గురువు

పరమాత్మను ప్రత్యక్ష్యంగా దర్శించుటకు
 - నిష్టా నిష్టాగా ప్రార్ధింప చేయగలిగేది పరమ గురువు 

రాజకీయంలో నీతిగా నడుచు కొనుటకు
- చట్టాలయొక్క అర్ధాలను తెలిపేది న్యాయ గురువు             

గురువులెందరున్నా కర్మానుసారే బుద్ధి
మతాలెన్ని ఉన్నా అనుకరణే గుణం 
కాలంలో మార్పులెన్నిఉన్నా ప్రేమే
జీవితం ఇది వేణుగోపాల ప్రేమ సుమా  
--((**))--

అధిక్షేప ప్రేమ లీల 
లోకం తీరు 
మల్లాప్రగడ రామ కృష్ణ

ఎక్కడ విశ్వాసం ఉంటుదో అక్కడ ఉంటుంది ప్రేమ
 - ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఉంటుంది  శాంతి 

ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ ఉంటాడు దేవుడు
 - ఎక్కడ దేవుడుంటాడో అక్కడ ఉంటుంది ఆనదం

ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడ ఉంటుంది తృప్తి
 - ఎక్కడ తృప్తి ఉంటుందో అక్కడ ఉంటుంది సంతృప్తి

ఎక్కడ సంతృప్తి ఉంటుందో అక్కడ ఉంటుంది ఆరోగ్యం
 - ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ ఉంటుంది ధైర్యం 

ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ ఉంటుంది నమ్మకం 
- ఎక్కడ నమ్మకం ఉంటుందో అక్కడ ఉంటుంది నిర్మలం 

ఎక్కడ నిర్మలం ఉంటుందో అక్కడ ఉంటుంది ఆశయం 
- ఎక్కడ ఆశయం ఉంటుందో అక్కడ ఉంటుంది ఆమోదం 
  
ఎక్కడ ఆమోదం ఉంటుందో అక్కడ ఉంటుంది అనురాగం 
- ఎక్కడ అనురాగం ఉంటుందో అక్కడ ఉంటుంది సంగమం 

ఎక్కడ సంగమం ఉంటుందో అక్కడ ఉంటుంది సంసారం 
- ఎక్కడ సంసారం ఉంటుందో అక్కడ ఉంటుంది అనుభవం 

గ్రహణానికి పట్టు విడుపు 
జీవితానికి నిత్య మలుపు
జాతకానికి ఆశ మెరుపు  
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--      
 గురుపౌర్ణిమ సందర్భంగా
గురు స్తుతి

శ్లోకం :

1) గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః !
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేన్నమః !!

2) అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ !
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవేన్నమః !!

3) ಓమ్ నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైక మూర్తయే !
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః !!

4) యదవిద్యావశాద్విశ్వం దృశ్యతే రశనా హివత్ !
యద్విద్యయా చ తద్ధాని స్తం వందే పురుషోత్తమం !!

5) వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్ర మకల్మషమ్ !
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ !!

6) అ చతుర్వదనో బ్రహ్మా ద్విబాహు రపరో హరిః !
అ ఫాలలోచన శ్శంభుర్ భగవాన్ బాదరాయణః !!

7) మునిం స్నిగ్దాంబుదాభాసం వేదవ్యాస మకల్మషమ్ !
వేదా వాసం సరస్వత్యావాసం వ్యాసం నమామ్యహం !!

8) నారాయణం పద్మభువం వసిష్ఠం, శక్తించ తత్పుత్ర పరాశరంచ!
వ్యాసం శుకం గౌడపదం మహాంతం ,గోవింద యోగీంద్ర మథాస్య
శిష్యమ్!!

9) శ్రీ శంకరాచార్య మథాస్య పద్మపాదం చ హస్తామలకంచ శిష్యమ్
తం తోటకం వార్తికకార మన్యాన్ అస్మద్గురూన్ సంతత 
‌ ‌ మానతోస్మి !!

10) శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణమ్ !
సూత్ర భాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః !!

11) హర లీలావతారాయ శంకరాయ పరౌజసే !
కైవల్య కలనా కల్పతరవే గురవే నమః !!

12) శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం !
నమామి భగవత్పాద శంకరం లోకశంకరమ్ !!

13) సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమామ్ !
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామ్ !!

14) బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞాన మూర్తిం 
విశ్వాతీతం గగనసదృశం తత్త్వమస్యాది లక్ష్యమ్ !
ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం
భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి !!

ఇతి పరమగురు పరమేష్ఠిగురు పరాపర గురూ న్నత్వా
భాష్యోప దేష్టారం స్వ స్వగురుం ధ్యాయేత్ !!

బంధు వులకు, సన్నిహితులకు, అందరికీ

శుభాభి నందనలతో 
శ్రీ గురుపౌర్ణిమ సందర్భంగా 
శుభాకాంక్షలతో 
మీ యందరి శ్రేయోభిలాషి


మీ
యందరివాడు

మునీశ్వరరావు
యనమండ్రం
--((**))--

అధిక్షేప ప్రేమ లీల
లోకతీరు
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

1౦9. గురు శిష్యుల మధ్య ఉండే రాశి
- గురువు విద్యను శిష్యులకు తెల్పే రాశి 

భార్య భర్తల మధ్య ఉండే రాశి
- ధర్మయుక్తముగా పంచుకొనే ప్రేమ రాశి 

సూర్య చంద్రుల మధ్య ఉండే రాశి
- వేడిని చల్లదనాన్ని అందించే మార్గ రాశి 

ఫలపుష్పాలు మధ్య ఉండే రాశి 
- రుచులతో పరిమలాలునందించే మధుర రాశి 

వెలుగు నీడల మధ్య ఉండే రాశి 
- నమ్మకం, అనుమానం మధ్య నలిగే బ్రమరాశి

సుఖ దు:ఖాల మధ్య ఉండే రాశి
- ప్రేమ అనురాగం, దు:ఖంతో నలిగే మౌన రాశి 

కావడి కుండల మధ్య ఉండే రాశి
- మంచి చెడుల మధ్య మనస్సు నలిగే త్రాసురాశి 

ప్రేమ పక్షులు మధ్య ఉండే రాశి
- ఆకలి దప్పులులేక ప్రేమతో నలిగే ప్రణయ రాశి 

బ్రతుకు జీవనకు స్నేహ రాశి
మనస్సు మొక్షానికి తత్వరాశి
ప్రపంచానికి దీక్ష, శాంతి రాశి
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--


1 comment: