Friday 22 May 2020

మూడు మూల ప్రతిపాదనలు


మూడు మూల ప్రతిపాదనలు :


Three fundamental proposiitions 

 మొదటి ప్రతిపాదన :- 

సర్వవాపి, శాశ్వతం , హద్దులు లేనిది సుస్థిరము అయిన ఒకే ఒక్క తత్వం కలదు ..... అదీ మాటలకు అందనిది ..... మనసు , బుద్ధికి దొరకనిది . ఊహాతీతమైనది . ఈ తత్త్వాన్ని `` అగ్రాహ్యం , అవాచ్యం , అలక్షణం , అచింత్యం  అని మాండూక్యోపనిషత్తు వివరించింది .‌ అది అవాఙ్మానస గోచరం. అచింత్యం. ఈ తత్వాన్ని గురించి మరింత లోతుగా పరిశీలిద్దాం .. వ్యక్తమైన సృష్టికి పూర్వం ఉన్నది ఒక్కటే ఒక్కటి.. అది అనంతం . మూలకారణం . దీన్ని పాశ్చాత్య తత్వవేత్తలు rootless root ( కారణములేని కారణమూ, వేరులేని వేరు ) అనీ unconscious , unknowable ( (  ప్రజ్ఞ , అగ్రాహ్యం ) అని వర్ణించారు . తత్వతః దీనికి , వ్యక్త ప్రపంచానికి , ఎటువంటి సంబంధం లేదు . దీన్నే ప్రాజ్ఞులు సత్ అన్నారు ......


 ఇది అచింత్యం . దీన్ని being అనడం కంటే be- Ness అస్తి , అనడము సబబుగా ఉంటుంది. ఈ be - Ness ది సీక్రెట్ డాక్ట్రిన్ లో ద్విరూపిగా ప్రస్తావించబడింది . 

 అవ్యక్తాకాశం లేక మహాకాశం ( absolute abstract space )

 2 .  అవ్యక్తమైన సంచలనం ( absolute abstract motion ) ఈ రెండు విషయాలు మానవుని మేధస్సుకు అందనివి . అట్లని ఇవి లేవు అని చెప్పజాలం . చలనం ఉన్నచోట చైతన్యం లేక ప్రజ్ఞ ఉండే తీరుతుంది చలనం వున్నప్పుడు మార్పు తప్పనిసరిగా ఉండే తీరుతుంది . కనుక చలనం , పరివర్తన ఈ రెంటికీ అవినాభావ సంబంధం ఉంది. ఆదిలో సంచలనం అవ్యక్త పరబ్రహ్మ సంకల్ప ప్రభావంతో కలిగింది. ఈ మహాసంకల్పాన్నే మహా నిశ్వాసము ( the great breath ) అని అన్నారు .. ది సీక్రెట్ డాక్ట్రిన్ చేసిన మెదటి ప్రతిపాదన ఉన్నది ఒక్కటే . ఈ ఒక్కటీ పరిపూర్ణమైంది . ( One  absolute be ness ) దీనినే అస్తి అనవచ్చు . ఇదే సృష్టికి కారణం . ఈ ఒక్కటే ఒక్కటిగా చెప్పబడే తత్వ్తమే పరబ్రహ్మ . ఇది రసస్వరూపం . సృష్టికి దీనికి సంబంధం లేదు. అయినా సృష్టి అంతా దినికి పరిమితమైన ప్రతీక . ఇది అద్వితీయము . ఇది కాదు ఇది కాదు ( నేతి నేతి ) అని విచారిస్తూ పోగా , ఒక స్థితిలో ప్రకృతి - పురుషుడు , శక్తి , ద్రవ్యం అనేవి రెండు వైపులు మాత్రమే . ఈ రెండు సృష్టికి ఆధారం . అవ్యక్త స్థితిలో మూల ప్రకృతి , మూల పురుషుడు , వ్యక్త స్థితిలో ఇవి పదార్థం - శక్తిగా గోచరిస్తాయి .. మూలప్రకృతి చరాచరసృష్టిలో నామ రూపాలకు మూలమలనట్లు అవ్యక్త స్థితిలోని మూలపురుషుడు ( విరాట్ పురుషుడు ) చైతన్యానికి ప్రజ్ఞకు మూలాధారము ... అవ్యక్త స్థితి నుంచి , ఈశ్వర సంకల్పానురూపమైన జగత్తు వ్యక్తము కావసినప్పుడు , ప్రకృతి పురుషుల సంయోగం కావాలి . కేవలం పురుషునొక్కని వలనగాని , కేవలం ప్రకృతి వలన కానీ సృష్టి జరగదు . ప్రకృతి పురుషుల సంయోగానికి , ఒక సంధాన సూత్రం కావాలి. ఈ సంధాన సూత్రం ఫోహాత్ ( fohat ) అని పేర్కొన్నారు .. ఈ ఫోహాత్ ప్రభావం వల్లనే ప్రకృతి పురుషుల సంయోగం జరిగి సృష్టి వ్యక్తమైంది. పరబ్రహ్మ రాజసశక్తియే ఫోహాత్ . ఈ శక్తి , ధ్యాన చోహనుల ద్వారా ప్రకృతి పురుషుల సంయోగం జరిపింది . ధ్యాన చోహానులను విశ్వకర్మలు అనవచ్చు ( architects of the universe ) వీరి ప్రమేయము చేతనే ప్రకృతి పురుషుల సంయోగం జరిగి , ఉపాదులు నిర్మించబడ్డాయి . ఈ ఫోహాత్ శక్తియే మనసుకు పదార్థానికి సంబంధం కలుగజేస్తుంది. ఇంతే కాకుండా ప్రతి పరమాణువునకు జీవాన్ని అందజేస్తుంది .. 
ఈ పై వివరించిన విషయాల సారాంశం :- 
💧 వేదాంత పరిభాషలో పేర్కొన్న పరబ్రహ్మ తత్త్వము, సత్యము ఒక్కటే . దీన్నే సత్ అని కూడా అంటారు. ఇదే సత్ - అసత్ కూడా (absolute being and non - being ) 

💧 ఆదిలో ఈ పరబ్రహ్మ , ఈశ్వరుడుగ విరాట్ పురుషుడుగ (unmanifest logos ) వ్యక్తమయినాడు . ఇది సగుణబ్రహ్మ అవతరణకు పూర్వపు స్థితి .
💧 తదుపరి ప్రకృతి - పురుషుడు ( spirit- matter ) వ్వక్త మయింది . దీనినే జీవం అనవచ్చు .
💧 తదుపరి మహాత్తత్వ్తము ప్రకటితమైనది . ఇదియే చిత్ లేక విశ్వాత్మ ( universal soul ) ఇదే ప్రకృతికి దోహదం చేసే తత్వం .
💧 గుణాత్మకమైన విశ్వమందు అంతా వ్యాపించి ఉన్న ఈ పరమ తత్త్వం ద్వంద్వ రూపంగా ప్రకటితమైంది ..

రెండవ ప్రతిపాదన :

ది సీక్రెట్ డాక్ట్రిన్ ప్రతిపాదించిన రెండవ అంశం _ విశ్వం యొక్క నిత్యత్వం . అనేక బ్రహ్మాండాలకు నిలయమైన ఈ విశ్వం నిత్యమైంది . బ్రహ్మాండాలు అసంఖ్యాకం. అపు అడ్డులేకుండా అవి పుటుతూన్నాయి. అంతరిస్తున్నాయి . నక్షత్రాలలాగ విస్పులింగాలలాగా బాసిస్తూన్నాయి . బ్రహ్మండాల అవతరణ అదృశ్యం , సముద్రం యొక్క ఆటుపోటు వంటింది.బ్రహ్మాండముల వృద్ధి క్షయములు ఒక నియమానుసారంగ జరిగి పోతున్నాయి. ఇట్లాగే రాత్రి పగలు, నిద్ర మెలుకువ , మరణం , ఋతువులు ఒక నియమానుసారం జరిగిపోతున్నాయి. బ్రహ్మండాల సృష్టి సంహారాలు నియమానుసారంగ ఒక క్రమపద్ధతిలో జరిగిపోతున్నాయి. ఎప్పుడు ఏది స్థిరంగా ఉండటం లేదు. ఇది నిత్యత్వములోని అనిత్యత్వం . ఇదే సర్వేశ్వరుని లీలావిలాసము ( జగము అనుపదమునకు పోవుట అనేది వ్యుత్పత్యర్థము , ఎప్పుడు పోతూ ఉండేది కాబట్టి జగత్తు అని పేరు వచ్చింది....జాయతే గచ్ఛతే ఇతి జగత్..... ) 

మూడవ ప్రతిపాదన :

విశ్వంలోని జీవులన్నీ విశ్వాత్ముడైన పరబ్రహ్మ
 తో ఎడతెగని సంబంధం కలిగి ఉన్నాయి .. 

ఈ విశ్వాత్ముడైన పరబ్రహ్మ సర్వకారణుడు . నిష్కారణుడు. ( Root less root ) ప్రతి ఆత్మ ఈ విశ్వాత్మ అనే మహాఅగ్ని గోళంనకు సంబంధించిన విస్పులింగము ( అగ్నికణం ) . మహాగ్నిగోళం అయిన విశ్వాత్మ నుంచి ప్రభవించిన విస్పులింగాలకు , విశ్వాత్మకుగల అన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ ఆత్మలు అనంతకాలంలో కర్మవశమైన పునర్జన్మల ద్వారా ఎడతెగని యాత్ర సాగిస్తున్నాయి. ఈ ఆత్మలు అనేకానేకము లైన ఉపాదులను ఆశ్రయించి , జనన మరణాల ద్వారా ప్రకృతిలో పరిణామాన్ని పొందుతూ , ఈ అనంతకాలవాహినిలో ఎపుడో ఒకపుడు తప్పక విశ్వాత్మలో విలీనం అవుతాయి . ఈ పరిణామం కొన్ని మన్వంతరాలు కల్పాలు జరుగుతుంది. తదుపరి మానవ వర్గంలో ప్రవేశించి , స్వచైతన్యంతో , స్వేచ్చానుసారంగా పరిణామం జరుగుతుంది. బహుకాలం మానవుడు పరిణామాన్ని పొందుతూ తుదకు దివ్యమానవుడుగా రూపొందించవచ్చు . ఇంకా వికాసాన్ని పొంది ధ్యాన బుద్దుడు కావచ్చు. ఈ పరిణామ పద్దతిలో ప్రకృతికి ఏ మాత్రం పక్షపాతం లేదు. ప్రతిజీవి తన కృషి ఫలితంగా నెమ్మదిగానో త్వరితంగానో పురోగతి చెందగలడు. జీవుడు ప్రకృతిలో షడ్భావ వికారాదులకు లోనై తుదకు ఏడవదైన పర తత్త్వాన్ని పొందగలరు. ఈ ఏడవ తత్త్వమే పరమమైన సత్యం . తతిమ్మా అంతస్థులు మానసిక , ఆధ్యాత్మిక స్థూల స్థితులు . సృష్టి అంతటా అనేక నామరూపాలతో కూడి ఉంది. వేదాంతులు దీన్నంతా భ్రమ , మాయ అంటారు .. ఇదంతా పరమ సత్యం యొక్క రూపమే అయినా , వాని వ్యక్తరూపము , తాత్కాలిక దర్శనము , భ్రాంతి స్పూరకమే ....... 


--(())--

*నాలుగు మౌలిక అభిప్రాయాలు :





*నాలుగు మౌలిక అభిప్రాయాలు :


Four basic ideas 

మొదటిది - సృష్టిలో సర్వత్రా గోచరించే ఏకత ( the fundamental unity of all existence ) 

ఈ గ్రంథంలో ` ఏకత " అనే పదం ( unity ) ఒక ప్రత్యేకార్థంలో వాడబడింది . ఏకత , ఐకమత్యం అనే పదాలు , దేశం యొక్క ఐక్యత సైన్యంలోని ఐక్యత , గ్రహాలలోని పదార్థం ఆకర్షణ శక్తిచే ఒక్కటిగా నుండుట అనేది సామాన్యమైన అర్థం . కానీ ఈ పదం ఈ గ్రంథం లో ప్రత్యేకార్థం కలిగి ఉంది .. ఉన్నదంతా ఒక్కటే ( all existence is one thing ) ఇక్కడ విభిన్న పదార్థాలు ఒక్కటిగా వుండటం కాదు. విభిన్న పదార్థాలే లేవు . ఉన్నదంతా ఒక్కటే ( విభిన్నంగా ఉన్నట్లు మనకు గోచరిస్తున్నాయి ) అనే అర్థం స్పురించాలి .. ఇదే సత్ ( being ) ఉండేది ఒక్కటే అయినా రెండుగా వ్యక్తమవుతూ ఉంది . విద్యుత్ శక్తి ఒక్కటే అయినా ధనము - ఋణము ( positive - negative ) అనే రెండుగా వ్యక్తమవుతూ ఉంది. రెండుగా వ్యక్తమయ్యే ఒకే పదార్థం అయిన సత్ పదార్థము చైతన్యం - పదార్థం ( consciousness - substance ) అని రెండుగా వ్యక్తమవుతూ ఉంది. ఈ ఒకే పదార్దామైన సత్ పూర్ణం ,, అభిన్నం . భిన్న వస్తువులు ఎప్పటికీ పూర్ణ వస్తువులు కాలేవు . రెండవది ఉన్నప్పుడే పోల్చుట సాధ్యమవుతుంది . కానీ ఉండేది ఒక్కటే అయినప్పుడు పోల్చుట అనే ప్రసక్తే ఉండదు. ఈ సత్ అప్రమేయము ( కొలతకు వీలుకానిది ) , అద్వితీయము , పరిపూర్ణము అయినది . ఇట్లాంటి సత్ అన్ని రూపాల్లో పూర్ణంగా వెలసివుంది . అన్ని రూపాలు దాని రూపాలే ... మానవుడు , దేవుడు , అణువు , మహత్తు, ఇవి వ్యవహారం లో వేరుగా తోచినా తత్వ్తతః అవి పూర్ణములే - పరిపూర్ణతయే వీని లక్షణం. ‌ . 

2. సృష్టిలో నిర్జీవ పదార్థం అంటూ ఏదీ లేదు .( There are no dead matter ) 

సృష్టిలో నిర్జీవ పదార్థం అంటూ ఏదీ లేదు . ప్రతీ అణువు కూడా జీవంతో తొణికిసలాడుతూ ఉంది . సూక్ష్మ లోకాల్లో అన్ని అంతస్తుల్లో వుండే ప్రతీ ఒక్క సూక్ష్మాణువు జీవంతో నిండి ఉంది. 

3. విశ్వమంతా మానవునిలో సూక్ష్మంగా వెలసి ఉంది .

మానవునిలో దేవతలు దేవతాగణాలు నివాసం చేస్తూవున్నారు . చిన్న , పెద్ద అనేది వ్యవహార దృష్టిలో మాత్రమే . అంతా బ్రహ్మపదార్థమే అయినప్పుడు చిన్న లేదు , పెద్ద లేదు , అన్ని పరబ్రహ్మమే . 

4. ఒకే జీవం _ ఒకే ధర్మం 
(One life one law ) 

బయట లోపల , క్రింద పైన , చిన్న పెద్ద ఇవన్నీ పరిమితం , స్థూలము అయిన సంకుచిత దృష్టికి మాత్రమే. ఉండేది ఒక్కటే అయినప్పుడు , ఈ భేదాలకు అవకాశమే లేదు. పరిమితమైన మనసు ఈ భేదాలను సృష్టిస్తుంది. ఉన్నది ఒకే ఒక్క జీవం. ఒకే అంతర్లీనమైన ధర్మం . అదే సనాతన ధర్మం.

No comments:

Post a Comment