Saturday 23 May 2020

🌹 . శ్రీ శివ మహా పురాణము


🌹 . శ్రీ శివ మహా పురాణము - 150 🌹 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః  🌴 
36. అధ్యాయము - 11

🌻. శివపూజావిధి  - 3 🌻

ప్రాణాయామత్రయం కృత్వా మధ్యే ధ్యాయేచ్చ త్ర్యంబకమ్‌ | 
పంచవక్త్రం దశభుజం శుద్ధస్ఫటికసన్నిభమ్‌ || 34


మూడు ప్రాణాయామములను చేయవలెను. వాటి మధ్యలో మూడు కన్నులు, ఐదు ముఖములు, పది చేతులు కలిగి, స్వచ్ఛమగు స్ఫటికమువలె భాసించునట్టియు (34),  
కలిగినట్టియు, వ్యాఘ్ర చర్మము ఉత్తరీయముగా గల శివుని ధ్యానించవలెను.

సర్వాభరణ సంయుక్తం వ్యాఘ్రచర్మోత్తరీయకమ్‌ |
తస్య సారూప్యతాం స్మృత్వా దహేత్పాపం నరస్సదా || 35

శివం తతస్సముత్థాప్య పూజయేత్పరమేశ్వరమ్‌ | 
దేహంశుద్ధి తతః కృత్వా మూలమంత్రం న్యసేత్ర్కమాత్‌ || 36

సర్వత్ర ప్రణవేనైన షడంగ న్యాసమాచరేత్‌ | 
కృత్వా హృది ప్రయోగం చ తతః పూజాం సమారభేత్‌ || 37

పాద్యార్ఘ్యాచమనార్థం చ పాత్రాణి చ ప్రకల్పయేత్‌ | 
స్థాపయే ద్వివిధాన్‌ కుంభాన్‌ నవ ధీమాన్యథావిధి || 38

దర్భైరాచ్ఛాద్య తైవరేవ సంస్థాప్యాభుక్ష వారిణా | 
తేషు తేషు చ సర్వేషు క్షిపేత్తోయం సుశీలతమ్‌ || 39

శివుని తో సదాసారూప్యమును భావించి మానవుడు పాపములను పొగొట్టుకొనవలెను (35). 
అపుడు పరమేశ్వరుడగు శివుని ఆహ్వానించి పూజించవలెను. శరీరమును పవిత్రము చేసుకొని వరుసగా మూలమంత్ర న్యాసమును చేయవలెను (36). 
ఓం కారముతో ఆరు అంగన్యాసములను చేయవలెను. పూజా ప్రయోగమును మనసునందిడుకొని పూజను ఆరంభించవలెను (37). 
పాద్య, ఆర్ఘ్య, ఆచమనముల కొరకు పాత్రల నుంచవలెను. బుద్ధిమంతుడు యథావిధిగా తొమ్మిది విభిన్న కలశములను ఉంచవలెను (38). 
వాటిని దర్భలయందుంచి, దర్భలతో కప్పి, జలముతో ప్రోక్షించి, ఆ కలశములన్నిటి యందు చల్లని నీటిని పోయవలెను (39).

ప్రణవేన క్షిపేత్తేషు ద్రవ్యాణ్యాలోక్య బుద్ధిమాన్‌ | 
ఉశీరం చందనం చైవ పాద్యే తు పరికల్పయేత్‌ || 40

జాతీకం కలకర్పూర వటమూల తమాలకమ్‌ | 
చూర్ణయిత్వా యథాన్యాయం క్షిపే దాచమనీయకే || 41

ఏతత్సర్వేషు పాత్రేషు దాపయేచ్చందనాన్వితమ్‌ | 
పార్శ్వ యోర్దేవదేవస్య నందీశం తు సమర్చయేత్‌ || 42

గంధైర్ధూపై స్తథా దీపైర్వివిధైః పూజయేచ్ఛివమ్‌ | 
లింగశుద్ధిం తతః కృత్వా ముదా యుక్తో నరస్తదా || 43

యథోచితం తు మంత్రౌఘైః ప్రణవాదినమోంతకైః | 
కల్పయేదాసనం స్వస్తి పద్మాది ప్రణవేన తు || 44

బుద్ధిమంతుడగు సాధకుడు ప్రణవమునుచ్చరించి ఆ కలశములలో ద్రవ్యముల నుంచవలెను. పాద్యకలశమునందు ఉశీరము (వట్టివేరు) ను, చందనమును వేయవలెను (40). 

మల్లె, మిరియాలు, కర్పూరము, మర్రిచెట్టు వ్రెళ్లు, మరియు తమలపాకులను చూర్ణము చేసి ఆచమన కలశమునందుంచవలెను (41). 

మిగిలిన కలశములన్నిటియందు చందనమును వేయవలెను. దేవదేవుని పార్శ్వములయందు నందీశ్వరుని అర్చించవలెను (42). 

శివుని గంధము, ధూపము, దీపము ఇత్యాది ఉపచారములతో పూజించవలెను. తరువాత లింగమునుండి నిర్మాల్యమును తీసివేసి సాధకుడు ప్రీతితో కూడినవాడై (43), 

ఓంకారము ఆదియందు నమః అంతమునందు గల మంత్రములతో యథోచితముగా స్వస్తికాసనము, పద్మాసనము ఇత్యాదులను కల్పించవలెను (44).

తస్మా త్పూర్వదిశం సాక్షాదణిమామయమక్షరమ్‌ | 
లఘిమా దక్షిణం చైవ మహిమా పశ్చిమా పశ్చిమం తథా || 45

ప్రాప్తిశ్చైవోత్తరం పత్రం ప్రాకామ్యం పావకస్య చ | 
ఈశిత్వం నైర్‌ ఋతం పత్రం వశిత్వం వాయుగోచరే || 46

సర్వజ్ఞత్వం తథైశాన్యం కర్ణికా సోమ ఉచ్యతే | 
సోమస్యాధస్తథా సూర్యస్తస్యాధః పావకస్త్వయమ్‌ || 47

ధర్మాదీనపి తస్యాధో భావతః కల్పయేత్‌ క్రమాత్‌ | 
అవ్యక్తాది చతుర్దిక్షు సోమస్యాంతే గుణత్రయమ్‌ || 48

ఆ పద్మము యొక్క తూర్పూ దిక్కున గల పత్రము నాశము లేని అణిమా అనే సిద్ధి (సూక్ష్మరూపధారణ శక్తి) అనియు, దక్షిణ పత్రము లఘిమ (మిక్కిలి తేలిక అయ్యే శక్తి ) అనియు, పశ్చిమ పత్రము మహిమ (పెద్ద రూపమును ధరించగలిగే శక్తి) అనియు (45),

ఉత్తరపత్రము ప్రాప్తి (ఏ వస్తువునైననూ పొందగలిగే శక్తి) అనియు, ఆగ్నేయ పత్రము ప్రాకామ్యము (అమోఘ సంకల్పశక్తి) అనియు , నైర్‌ ఋతపత్రముఈశిత్వము (సర్వోత్కృష్టత్వము) అనియు, వాయవ్య పత్రము వశిత్వము (జితేంద్రియమత్వము) అనియు (46), 

ఈశాన్యపత్రము సర్వజ్ఞత్వమనియు, కర్ణిక చంద్రుడనియు చెప్పబడెను. చంద్రునికి క్రింద సూర్యుడు, ఆ క్రింద అగ్ని (47) 

గలరు. ఆ క్రింద ధర్మార్ధకామ మోక్షములను భావన చేయవలెను. నాలుగు దిక్కుల యందు అవ్యక్తము, మహత్తత్వము, అహంకారము, పంచ భూతములు అను తత్త్వములను, చంద్రునికి పైన త్రిగుణములను భావన చేయవలెను (48). 

సద్యో జాతం ప్రవక్ష్యామి అను మంత్రముతో పరమేశ్వరుని ఆ వాహన చేయవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 . శ్రీ శివ మహా పురాణము - 151 🌹 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః  🌴 
36. అధ్యాయము - 11

🌻. శివపూజావిధి  - 4 🌻

సద్యోజాతం ప్రవక్ష్యా మిత్యావాహ్య పరమేశ్వరమ్‌ |
వామదేవేన మంత్రేణ తిష్ఠేచ్చై వాసనోపరి || 49

సాన్నిధ్యం రుద్రగాయత్ర్యా అగఘోరేణ నిరోధయేత్‌ | 
ఈశానం సర్వవిద్యానామితి మంత్రేణ పూజయేత్‌ || 50

పాద్యమాచమనీయం చ విధాయార్ఘ్యం ప్రదాపయేత్‌ | 
స్నాపయేద్విధినా రుద్రం గంధచందన వారిణా || 51

పంచగవ్యవిధానేన గృహ్యా పాత్రేsభిమంత్ర్య చ | 
ప్రణవేనైవ గవ్యేన స్నాపయేత్పయసా చ తమ్‌ || 52

దధ్నా చ మధునా చైవ తథా చేక్షురసన తు | 
ఘృతేన తు యథా పూజ్య సర్వకామహితావహమ్‌ || 53

వామదేవాయ అను మంత్రముతో శివునకు ఆసనము నీయవలెను (49). 

తత్పురుషాయ అను మంత్రముతో శివుని ధ్యానించి, అఘోరేభ్యః అను మంత్రముతో శివుని స్థిరుని చేయవలెను. ఈశానం సర్వ విద్యానామ్‌ అను మంత్రముతో పూజించవలెను (50). 

పాద్యమును, ఆచమనమును, అర్ఘ్యమును ఈయవలెను. గంధ జలముతో రుద్రుని యథావిధిగా అభిషేకించవలెను (51). 

పంచగవ్యములను పాత్రలో నుంచి, ప్రణవముతో అభిమంత్రించి అభిషేకించవలెను. మరియు ఆవు పాలతో అభిషేకించవలెను (52). 

పెరుగు, తేనే, చెరుకు రసము, నేయి అను ద్రవ్యములతో అభిషేకించినచో, కామనలన్నియు ఈడేరి హితము చేకూరును (53).

పుణ్యౖర్ద్రవ్యైర్మహాదేవం ప్రణవేనాభిషేచయేత్‌ | 
పవిత్రజల భాండేషు మంత్రైస్తోయం క్షిపేత్తతః || 54

శుద్ధీకృత్య యథాన్యాయం సితవసై#్త్రణ సాధకః | 
తావద్దూరం న కర్తవ్యం న యావచ్చందనం క్షిపేత్‌ || 55

తందులైస్సుందరైస్తత్ర పూజయేచ్ఛంకరం ముదా | 
కుశాపామార్గ కర్పూర జాతి చంపకపాటలైః || 56

కరవీరైస్సితైశ్చైవ మల్లికాకమలోత్పతైః | 
అపూర్వపూషై#్పర్వివిధైశ్చనందనాధ్యైస్తథైవ చ || 57

పుణ్య ద్రవ్యములతో ప్రణవోచ్చారణ పూర్వకముగా మహాదేవుని అభిషేకించవలెను. తరువాత పవిత్ర కలశముల యందు మంత్ర పూర్వకముగా జలము నుంచవలెను (54). 

సాధకుడు ఆ జలమును తెల్లని వస్త్రముతో వడకట్టి శుద్ధి చేయవలెను. శివునకు చందనమును అర్పించువరకు ఆ జలమును దూరము చేయరాదు (55). 

అపుడు శంకరుని ఆనందముగా చక్కని అక్షతలతో పూజించవలెను. దర్భలు, అపామార్గ పుష్పములు, తెల్లని మల్లెలు, ముద్ద సంపెంగలు, పాటలు పుష్పములు (56), 

తెల్ల గన్నేరు పువ్వులు, మల్లెలు, పద్మములు, కలువలు ఇత్యాది వివిధ పుష్పములతో, చందనాదులతో పూజించవలెను (57).

జలేన జలధారాం చ కల్పయేత్పరమేశ్వరే | 
పాత్రైశ్చ వివిధైర్దేవం స్నాపయేచ్చ మహేశ్వరమ్‌ || 58

మంత్రపూర్వం ప్రకర్తవ్యా పూజా సర్వఫలప్రదా | 
మంత్రాంశ్చ తుభ్యం తాంస్తాత సర్వకామార్థ సిద్ధయే || 59

ప్రవక్ష్యామి సమాసేన సావధానతయా శృణు | 
పావమానేన మంత్రేణ తథా వాజ్మ ఇత్యనేన చ || 60

రుద్రేణ నీలరుద్రేణ సుశుక్లేన శుభేన చ | 
హోతారేణ తథా శీర్షా శుభేనాథర్వణన చ | 61

శాంత్యా వాథ పునశ్శాం త్యా భారుణ్డనారుణన చ | 
అర్థాభీష్టేన సామ్నా చ తథా దేవవ్రతేన చ || 62

రథం తరేణ పురుషేణ సూక్తేన యుక్తేన చ | 
మృత్యుంజయేన మంత్రేణ తథా పంచాక్షరేణ చ || 63

జలధారాస్సహస్రేణ శతేనైకోత్తరేణ వా | 
కర్తవ్యా వేదమార్గేణ నామభిర్వాథ వా పునః || 64

పరమేశ్వరునిపై పడునట్లు జలధారను కల్పించవలెను. వివిధి కలశములలోని జలముతో మహేశ్వరునకు అభిషేకము చేయవలెను (58). 

సమంత్రకముగా చేసే పూజ సర్వఫలముల నిచ్చును. ఓ వత్సా! కోర్కెలన్నియూ ఈడేరుట కొరకై నీకు ఆ మంత్రములను (59) 

సంగ్రహముగా చెప్పెదను. సావధానముగా వినుము. పవమాన సూక్తము, వాజ్ఞ్మే ఇత్యాది మంత్రము (60), 

రుద్ర నీలరుద్ర మంత్రములు, శుక్లయుజుర్వేదమంత్రములు, శుభకరములగు ఋగ్వేద మంత్రములు, మరియు అథర్వ శీర్ష మంత్రములు (61), 

వివిధ వేదశాఖలలోని శాంతి మంత్రములు, భరుండ మంత్రములు, అరుణ మంత్రములు, అర్థాభీష్టసామ, దేవ వ్రతసామ (62), 

రథంతర సామ, పురుషసూక్తము, మృత్యుంజయ మంత్రము, పంచాక్షరి (63) 

ఇత్యాది మంత్రములతో, వేయి జలధారలతో, లేదా నూట ఎనిమిది జలధారలతో అభిషేకించవలెను. ఇది వేదమార్గము. నామములతో నైననూ పూజించవలెను (64).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 . శ్రీ శివ మహా పురాణము - 152 🌹 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః  🌴 
36. అధ్యాయము - 11

🌻. శివపూజావిధి  - 5 🌻

తతశ్చందనపుష్పాది రోపణీయం శివోపరి | దాపయేత్ర్పణవేనైవ ముఖవాసాదికం తథా || 65

తతస్స్ఫటిక సంకాశం దేవం నిష్కలమక్షయమ్‌ | కారణం సర్వలోకానాం సర్వలోకమయం పరమ్‌ || 66

బ్రహ్మేంద్రోపేంద్ర విష్ణ్వాద్యైరపి దేవైరగోచరమ్‌ | వేదవిద్భిర్తి వేదాంతే త్వగోచరమితి స్మృతమ్‌|| 67

ఆదిమధ్యాంతరహితం భేషజం సర్వరోగిణామ్‌ | శివతత్త్వమితి ఖ్యాతం శివలింగే వ్యవస్థితమ్‌ || 68

ప్రణవేనైవ మంత్రేణ పూజయేల్లింగమూర్ధని |

తరువాత చందనము, పుష్పములు, తాంబూలము మొదలగు వాటిని శివునకు ఓం కారముతో అర్పించవలెను (65). 

తరువాత స్పటికమువలె తెల్లని వాడు, అంశములు లేనివాడు, నాశము లేనివాడు, సర్వలోకములకు కారణుడు, సర్వలోకస్వరూపుడు, సర్వోత్కృష్టుడు (66), 

బ్రహ్మ, ఇంద్రుడు, ఉపేంద్రుడగు విష్ణువు మొదలగు దేవతలకు కూడ గోచరము కానివాడు, ఉపనిషత్తులలో వేదవేత్తలచే అగోచరుడు అని వర్ణింపబడిన వాడు (67). 

ఆది, మధ్యము, అంతములు లేనివాడు, సర్వరోగములకు వైద్యుడు, సర్వమంగళకరమగు తత్త్వమని ప్రఖ్యాతి గాంచినవాడు, శివలింగమునందుండు వాడు అగు మహాదేవుని (68) 

లింగము నందు ఓం కారముచే పూజించవలెను.

ధూపై ర్దీపైశ్చ నైవేద్యై స్తాంబూలై స్సుందరైస్తథా || 69

నీరాజనేన రమ్యేణ యథోక్త విధినా తతః | నమస్కారై స్స వై శ్చాన్యై ర్మంత్రైర్నానావిధైరపి || 70

అర్ఘ్యం దత్త్వా తు పుష్పాణి పాదయోస్సువికీర్య చ | ప్రణిపత్య చ దేవేశ మాత్మ నారాధయేచ్ఛివమ్‌ || 71

హస్తే గృహీత్వా పుష్పాణి సముత్థాయ కృతాంజలిః | ప్రార్థయేత్పునరీశానం మంత్రేణానేన శంకరమ్‌ || 72

అజ్ఞానాద్యది వా జ్ఞానా జ్ఞపపూజాదికం మయా | కృతం తదస్తు సఫలం కృపయా తవ శంకర || 73

ధూపదీపనైవేద్యములతో, అందమగు తాంబూలములతో (69), 

మరియు రమ్యమగు నీరాజనముతో యథావిధిగా పూజించి తరువాత నమస్కారమును చేసి, ఇతర మంత్రములతో స్తుతించి (70) , 

ఆర్ఘ్యమును ఇచ్చి, పాదముల యందు పుష్పములను జల్లి, సాష్టాంగ ప్రణామమును చేసి, మనస్సులో దేవదేవుడగు శివుని ధ్యానించవలెను (71). 

చేతిలో పుష్పములను తీసుకొని, లేచి నిలబడి, దోసిలి యొగ్గి ఈ క్రింది మంత్రముతో మరల శంకరుని ప్రార్థించవలెను (72). 

హే శంకరా! తెలిసి గాని తెలియక గాని నేను చేసిన జపపూజాదులు నీ దయచే సఫలమగు గాక! (73).

పఠిత్వైవం చ పుష్పాణి శివోపరి ముదా న్యసేత్‌ | స్వస్త్యయనం తతః కృత్వా హ్యాశిషో వివిధాస్తథా || 74

మార్జనం తు తతః కార్యం శివస్యోపరి వై పునః | నమస్కారం తతః క్షాంతిం పునరాచమనాయ చ || 75

అఘోచ్చారణ ముచ్చార్య నమస్కారం ప్రకల్పయేత్‌ | ప్రార్ధయేచ్చ పునస్తత్ర సర్వభావ సమన్వితః || 76

శివే భక్తిశ్శివే భక్తిశ్శివే భక్తిర్భవే భవే | అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ || 77

ఇతి సంప్రార్థ్య దేవేశం సర్వసిద్ధిప్రదాయకమ్‌ | పూజయేత్పరయా భక్త్యా గలనాదైర్విశేషతః || 78

ఈ విధముగా పఠించి, ఆ పుష్పములను ఆనందముతో శివునిపై నుంచవలెను. తరువాత స్వస్తి మంత్రములను పఠించి, వివిధములగు ఆశీస్సులను కోరవలెను (74). 

తరువాత శివుని పై మరల జలమును ప్రోక్షించవలెను. తరువాత నమస్కారమును చేసి, అపరాధక్షమాపణను చెప్పి, మరల ఆచమనమును చేయవలెను (75). 

అఘోర మంత్రమునుచ్చరించి నమస్కారమును చేయవలెను. మరల పూర్ణశ్రద్ధతో గూడి ప్రార్థించవలెను (76). 

ప్రతిజన్మలో శివుని యందు దృఢమగు భక్తి కలుగవలెను. నాకు మరియొక శరణు లేదు. నీవే నాకు శరణు (77). 

సర్వసిద్ధులను ఇచ్చే దేవదేవుని ఈ తీరున ప్రార్థించి, జయజయ ధ్వానములను చేయుచూ పరమశ్రద్ధతో పూజించవలెను (78).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ శివ మహా పురాణము - 153 🌹 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః  🌴 
36. అధ్యాయము - 11

🌻. శివపూజావిధి  - 6 🌻

నమస్కారం తతః కృత్వా పరివారగణౖస్సహ | ప్రహర్షమతులం లబ్ధ్వా కార్యం కుర్యాద్యథాసుఖమ్‌ || 79

ఏవం యః పూజయేన్నిత్యం శివభక్తిపరాయణః | తస్య వై సకలా సిద్ధిర్జాయతే తు పదే పదే || 80

వాగ్మీ స జాయతే తస్య మనోభీష్టఫలం ధ్రువమ్‌ | రోగం దుఃఖం చ శోకం చ హ్యుద్వేగం కృత్రిమం తథా || 81

కౌటిల్యం చ గరం చైవ యద్యుద్దుఃఖముపస్థితమ్‌ | తద్దుఃఖం నాశయత్యేవ శివః శివకరః పరః || 82

తరువాత కుటుంబం సభ్యులతో కలిసి నమస్కరించి, గొప్ప ఆనందమును పొంది, సుఖముగా మిగిలిన కార్యములను చేసుకొనవలెను (79). 

ఈ విధముగా ఎవడైతే శివభక్తితో నిండిన హృదయము గలవాడై నిత్యము పూజించునో, వానికి అడుగడుగునా అన్ని కార్యములు సిద్ధించును (80). 

అతడు గొప్ప వక్త యగును. అతని మనస్సులోని కోర్కెలన్నియూ నిశ్చయముగా నీడేరును. రోగము, శోకము, కృత్రిమమగు ఉద్వేగము (81), 

మోసము, విషము ఇత్యాది ఆపదలు ఏవి సంప్రాప్తమైననూ, పరమమంగళకరుడగు శివుడు ఆ దుఃఖములను నిశ్చయముగా నాశనము జేయును (82).

కల్యాణం జాయతే తస్య శుక్లపక్షే యథా శశీ | వర్ధతే సద్గుణస్తత్ర ధ్రువం శంకర పూజనాత్‌ || 83

ఇతి పూజావిధిశ్శంభోః ప్రోక్తస్తే మునిసత్తమ | అతః పరం చ శశ్రూషుః కిం ప్రష్టాసి చ నారద || 84

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమ ఖండే సృష్ట్యుపాఖ్యానే శివపూజావిధి వర్ణనం నామ ఏకాదశేsధ్యాయః (11).

శంకరుని పూజించు భక్తునికి మంగళములు కలుగును. అతని సద్గుణము శుక్లపక్షమునందలి చంద్రుని వలె వృద్ధినొందును (83). 

ఓ మహర్షీ! నారదా! నీకింతవరకు శివపూజావిధిని చెప్పితిని. ఇంకనూ వినే కోరిక యున్నచో ప్రశ్నించుము (84).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు సృష్ట్యుపాఖ్యానమనే మొదటి ఖండలో శివపూజావిధివర్ణనమనే పదకొండవ అధ్యాయము ముగిసినది (11).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

154. 🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః  🌴 
37. అధ్యాయము - 12

🌻. సార, అసార వస్తు విచారము - 1 🌻

నారద ఉవాచ |

బ్రహ్మన్‌ ప్రజాపతే తాత ధ్యన్యస్త్వం శివసక్తధీః | ఏత దేవ పునస్సమ్యగ్‌ బ్రూహిమే విస్తరాద్విధే || 1

నారదుడిట్లు పలికెను -

ఓ ప్రజాపతీ! తండ్రీ! శివుని యందు లగ్నమైన మనస్సు గల నీవు ధన్యుడవు. హే బ్రహ్మన్‌! ఈ విషయమునే మరల వివరముగా చెప్పుము (1).

బ్రహ్మోవాచ |

ఏకస్మిన్‌ సమయే తాత ఋషీనాహూయ సర్వతః |నిర్జరాంశ్చావదం ప్రీత్యా సువచః పద్మ సంభవః || 2

యది నిత్యసుఖే శ్రద్ధా యది సిద్ధేశ్చ కాముకాః | ఆగంతవ్యం మయా సార్ధం తీరం క్షిరపయోనిధేః || 3

ఇత్యేతద్వచనం శ్రుత్వా గతాస్తే హి మయా సహ | యత్రాస్తే భగవాన్‌ విష్ణుస్సర్వేషాం హితకారకః || 4

తత్ర గత్వా జగన్నాథం దేవదేవం జనార్దనమ్‌ | ఉపతస్థుస్సురా నత్వా సుకృతాంజలయో మునే || 5

తాన్‌ దృష్ట్వా చ తదా విష్ణు ర్బ్రహ్మాద్యానమరాన్‌ స్థితాన్‌ | స్మరన్‌ శివపదాం భోజమబ్రవీత్పరమం వచః || 6

బ్రహ్మ ఇట్లు పలికెను -

వత్సా! ఒకప్పుడు పద్మ సంభవుడనగు నేను అన్ని చోట్ల నుండి ఋషులను , దేవతలను ఆహ్వానించివారితో ప్రేమగా నిట్లంటిని (2).

 మీకు శాశ్వత సుఖమునందు శ్రధ్ధ, మోక్షములనందు ఇచ్ఛ ఉన్నచో నాతో పాలసముద్ర తీరమునకు రండు (3). 

ఈ మాటను విని వారు నాతో బయల్దేరిరి. సర్వులకు హితమును చేసే విష్ణు భగవానుడు గల చోటికి వెళ్లితిమి (4). 

ఓ మహర్షీ! అచటకు వెళ్లి, జగన్నాథుడు, దేవదేవుడునగు జనార్దనుని నమస్కరించి, దేవతలు దోసిలి యొగ్గి దగ్గరకు వెళ్లిరి (5). 

అపుడు విష్ణువు ఆ బ్రహ్మాది దేవతలను చూచి, శివుని పాదపద్మములను స్మరించి, ఈ శ్రేష్ఠవచనములను పలికెను (6).

విష్ణురువాచ |

కిమర్థ మాగతా యూయం బ్రహ్మాద్యాశ్చ సురర్షయః | సర్వం వదత తత్ర్పీత్యా కిం కార్యం విద్యతేsధునా || 7

విష్ణువు ఇట్లు పలికెను -

దేవశ్రేష్ఠులగు మీరు బ్రహ్మతో గూడి ఇచటకు వచ్చుటకు గల ప్రయోజనమును ప్రీతితో పూర్ణముగా చెప్పుడు. నేనిప్పుడు చేయదగిన పనియేది ?(7).

బ్రహ్మో వాచ -

ఇతి పృష్టా స్తదా తేన విష్ణువా చ మయా సురాః | పునః ప్రణమ్య తం ప్రీత్యా కిం కార్యం విద్యతేsధునా || 8

వినివేదయితుం కార్యం హ్యబ్రువన్వచనం శుభమ్‌ |

బ్రహ్మ ఇట్లు పలికెను -

విష్ణువు ఇట్లు ప్రశ్నించగా, దేవతలు నాతో గూడి మరల ఆయనకు ప్రణమిల్లి, తాము కోరే కార్యమును  నివేదించుటకై ఈ శుభమగు మాటలను పలికిరి. (8)

దేవా ఊచుః |

నిత్యం సేవా తు కస్యైవ కార్వా దుఃఖాపహారిణీ || 9

ఇత్యేతద్వచనం శ్రుత్వా భగవాన్భక్తవత్సలః | సామరస్య మమ ప్రీత్యా కృపయా వాక్యమబ్రవీత్‌ || 10

దేవతలు ఇట్లు పలికిరి -

నిత్యము ఎవరిని సేవించినచో దుఃఖములు తొలగును? (9)

 భక్తవత్సలుడగు విష్ణుభగవానుడు ఈ మాటను విని దేవతలతో గూడిన నాతో ప్రేమతో నిట్లు పలికెను (10).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹



🌹 . శ్రీ శివ మహా పురాణము - 160 🌹 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః  🌴 
37. అధ్యాయము - 12

🌻. సార, అసార వస్తు విచారము - 7 

సంగత్యా గురురాప్యేత గురోర్మంత్రాది పూజనమ్‌ | పూజనాజ్ఞాయతే భక్తి ర్భక్త్యా జ్ఞానం ప్రజాయతే || 75

విజ్ఞానం జాయతే జ్ఞానా త్పర బ్రహ్మ ప్రకాశకమ్‌ | విజ్ఞానం చ యదా జాతం తదా భేదో నివర్తతే || 76

భేదే నివృత్తే సకలే ద్వంద్వ దుఃఖ విహీనతా | ద్వంద్వ దుఃఖ విహీనస్తు శివరూపో భవత్యసౌ || 77

ద్వంద్వా ప్రాప్తౌ న జాయేతాం సుఖదుఃఖే విజానతః | విహితావిహితే తస్య న స్యాతాం చ సురర్షయః || 78

సత్సంగతిచే గురువు లభించును. గురువు నుండి మంత్రము, పూజా విధి లభించును. పూజవలన భక్తి పుట్టును. భక్తి వలన జ్ఞానము పుట్టును (75). 

జ్ఞానము నుండి విజ్ఞానము పుట్టును. పరబ్రహ్మను ప్రకాశింప జేయును. విజ్ఞానము పుట్టగానే, భేదము తొలగి పోవును (76). 

సకల భేదములు తొలగినప్పుడు ద్వంద్వము (రాగద్వేషాదులు) ల వలన కలిగే దుఃఖము దూరమగును. ద్వంద్వ దుఃఖములు తొలగిన భక్తుడు శివస్వరూపుడగును (77). 

జ్ఞానికి ద్వంద్వములు ఉండవు. కాన, సుఖదుఃఖములు ఉండవు. ఓ దేవతలారా! ఋషులారా! జ్ఞానికి విధినిషేధములు కూడ లేవు (78)

ఈ దృశో విరో లోకే గృహాశ్రమ వివర్జితః | యది లోకే భవత్యస్మిన్ద ర్శనాత్పాపహారకః || 79

తీర్థాని శ్లాఘయంతీహ తాదృశం జ్ఞానవిత్తమమ్‌ | దేవాశ్చ మునయస్సర్వే పరబ్రహ్మాత్మకం శివ మ్‌ || 80

తాదృశాని న తీర్థాని న దేవా మృచ్ఛి లామయాః | తే పునంత్యురు కాలేన విజ్ఞానీ దర్శనాదపి || 81

యావద్గృహాశ్రమే తిష్ఠేత్తావదాకార పూజనమ్‌ | కుర్యాచ్ఛ్రేష్ఠస్య సంప్రీత్యా సురేషు ఖలు పంచసు || 82

గృహము గాని, ఆశ్రమముగాని లేని ఇట్టి జ్ఞాని లోకములో అరుదు. ఒకచో ఉన్నచో, ఆయనను దర్శించినంత పాపములు పోవును (79). 

అట్టి జ్ఞానిశ్రేష్ఠులు పరబ్రహ్మస్వరూపలనియు, శివమూర్తులనియు తీర్థములు (అధిష్ఠాన దేవతలు,) సురులు మరియు అందరు మునులు స్తుతించు చున్నారు (80). 

తీర్థములు గాని, మట్టితో రాతితో చేసిన దేవతా మూర్తులు గాని అట్టి జ్ఞానికి సరిగారు. ఏలయన, అవి చిరకాలమునకు మానవులను పవిత్రులను చేయును. కాని, జ్ఞాని దర్శనముచేతనే పవిత్రులను చేయును (81). 

సాధకుడు గృహస్థా శ్రమములో నున్నంతవరకు అయిదుగురు దేవతల (బ్రహ్మ, విష్ణు, రుద్ర , ఈశాన, సదాశివులు) లో శ్రేష్ఠుడగు శివుని, ప్రీతితో పూజించవలెను. మరియు మిగిలిన వారిని పూజించవలెను (82).

అథవా చ శివః పూజ్యో మూలమేకం విశిష్యతే | మూలే సిక్తే తథా శాఖాస్తృప్తాస్సంత్యఖిలాస్సురాః || 83

శాఖాసు చ సుతృపాస్తు మూలం తృప్తం న కర్హి చి త్‌ | ఏవం సర్వంషు తృప్తేషు సురేషు మునిసత్తమాః || 84

సర్వథా శివతృప్తిర్నో విజ్ఞేయా సూక్ష్మబుద్ధిభిః | శివే చ పూజితే దేవాః పూజితాస్సర్వ ఏవ హి || 85

తస్మా చ్చ పూజయే ద్దేవం శంకరం లోకశంకరమ్‌ | సర్వకామ ఫలావాపై#్య సర్వ భూతాహితే రతమ్‌ || 86

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమ ఖండే సృష్ట్యుపాఖ్యానే పూజా విధివర్ణనే సారాసార విచార వర్ణనం నామ ద్వాదశోsధ్యాయః (12).

లేదా, శివుని పూజించిన చాలును మూలము ప్రధానము గాదా! ఓ దేవతలారా! మూలమున నీరు పోసినచో అన్ని శాఖలు కూడ తృప్తిని చెందును (83). 

కాని, శాఖలకు నీరు పోసినచో, మూలము తృప్తి చెందుట అసంభవము. ఇదే తీరున , ఓ ముని శ్రేష్ఠులారా! దేవతలందరు తృప్తులైన నూ (84) 

శివుడు తృప్తుడు కాడని సూ క్ష్మ బుద్ధి గలవారు తెలియదుగును. కాని, శివుని పూజించినచో, దేవతలనందరినీ పూజించినట్లే యగును. (85). 

అందువలన సర్వప్రాణుల హితమును గోరునట్టియు, లోకములకు మంగళముల నిచ్చు శంకరదేవుని కోర్కెలన్నియూ ఈడేరుట కొరకై పూజించవలెను (86)

శ్రీ శివ మహాపురాణములోని రెండవది యగు రుద్ర సంహితయందు సృష్ట్యు పాఖ్యానమే మొదటి ఖండయందు సారాసార విచారవర్ణన మనే పన్నెండవ అధ్యాయము ముగిసినది (12).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 . శ్రీ శివ మహా పురాణము - 161 🌹 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః  🌴 
38. అధ్యాయము - 13

🌻. శివపూజ  - 1 🌻

బ్రహ్మోవాచ |

అతః పరం ప్రవక్ష్యామి పూజా విధి మనుత్తమమ్‌ | శ్రూయతా మృషయో దేవా స్సర్వకామ సుఖా వహమ్‌ || 1

బ్రహ్మే మూహూర్తే చోత్థాయ సంస్మరేత్సాంబకం శివమ్‌ | కుర్యాత్తత్ర్పార్థనాం భక్త్యా సాంజలిర్నతమస్తకః || 2

ఉత్తష్ఠోత్తిష్ఠ దేవేశ ఉత్తిష్ఠ హృదయేశయ | ఉత్తిష్ఠ త్వముమాస్వామిన్‌ బ్రహ్మాండే మంగలం కురు || 3

జానామి ధర్మం న చమే ప్రవృత్తిః జానా మ్యధర్మం న చ మే నివృత్తిః |

త్వయా మహాదేవ హృది స్థితేన యథా నియుక్తోsస్మి తథా కరోమి || 4

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ ఋషులారా! దేవతలారా! మీకీపైన సర్వశ్రేష్ఠము, సర్వకామనలను సుఖమును ఇచ్చునది యగు పూజావిధిని చెప్పగలను. వినుడు (1). 

బ్రాహ్మ మూహూర్తము నందు లేచి సాంబ సదాశివుని స్మరించవలెను. తలవంచి, అంజలి యొగ్గి భక్తి తో ఆయనను ప్రార్థించవలెను (2). 

ఓ దేవదేవా! లెమ్ము. హృదయము నందుండు వాడా! లెమ్ము. ఉమాపతే! నీవు లెమ్ము. జగత్తునకు మంగళములనిమ్ము (3). 

నేను ధర్మము నెరింగియూ, అనుష్ఠంపకున్నాను. అధర్మము నెరింగి యూ పరిహరింపకున్నాను. ఓ మహాదేవా! హృదయమునందున్న నీవు ఎట్లు ఆజ్ఞాపించిననూ, అటులనే చేసెదను (4).

ఇత్యుక్త్వా వచనం భక్త్వా స్మృత్వా చ గురుపాదకే | బహిర్గచ్ఛే ద్దక్షిణాశాం త్యాగార్ధం మలమూత్రయోః || 5

దేహ శుద్ధిం తతః కృత్వా సమృజ్జలవిశోధనైః | హస్తౌ పాదౌ చ ప్రక్షాల్య దంత ధావనమాచరేత్‌ || 6

దివానాథే త్వనుదితే కృత్వా వై దంతధావనమ్‌ | ముఖం షోడశవారం తు ప్రక్షాల్యాంజలిభిస్తథా || 7

షష్ఠ్యాద్యమాశ్చ తిథయో నవమ్యర్కదినే తథా | వర్జ్యాస్సురర్షయో యత్నాద్భక్తేన రదధావనే || 8

ఈ విధముగా భక్తితో స్తోత్రము చేసి, గురు పాదములను స్మరించి, మలమూత్ర విసర్జన కొరకు దక్షిణ దిక్కునకు వెళ్లవలెను (5). 

తరువాత మట్టితో, మరియు నీటితో దేహశుద్ధి గావించుకొని, చేతులను కాళ్లను కడుగు కొని దంతధావనమును చేయవలెను. (6). 

సూర్యుడు ఉదయించుటకు ముందే దంత ధావనము చేసి, దోసిలి లోని నీటితో ముఖమును పదునారు సార్లు కడుగు కొనవలెను (7). 

ఓ దేవతలారా! ఋషులారా! షష్ఠి, పాడ్యమి, అమావాస్య, నవమి, అను తిథుల యందు, ఆదివారమునాడు భక్తుడు (పుల్లతో) దంత ధావనమును వీడవలెను (8).

యథా వకాశం సుస్నాయా న్నద్యాదిష్వథవా గృహే | దేశకాలా విరుద్ధం చ స్నానం కార్యం నరేణ చ || 9

రవేర్దినే తథా శ్రాద్ధే సంక్రాంతౌ గ్రహణ తథా | మహాదినే తథా తీర్థే హ్యు పవాసదినే తథా || 10

ఆశౌచేప్యథవా ప్రాప్తే న స్నాయాదుష్ణవారిణా | యథా సాభి ముఖం స్నాయాత్తీర్థదౌ భక్తి మాన్నరః || 11

తైలా భ్యంగం చ కుర్వీత వారాన్‌ దృష్ట్వా క్రమేణ చ | నిత్యమ భ్యంగకే చైవ వాసితం వా న దూషి తమ్‌ || 12

శ్రాద్ధే చ గ్రహణ చైవోపవాసే ప్రతి పద్దినే | అథవా సార్షపం తైలం న దుష్యేద్గ్రహణం వినా || 13

అవకాశమును బట్టి నదిలో గాని, సరస్సులోగాని, లేదా గృహమునందు గాని, చక్కగా స్నానమును చేయవలెను. మానవుడు దేశకాలములకు విరోధము లేకుండా స్నానము నాచరించవలెను (9). 

ఆదివారమునాడు, శ్రాద్ధ దినము నాడు, సంక్రాంతి యందు, గ్రహణమునందు, శివరాత్రి నాడు,పుణ్యక్షేత్రము నందు ఉపవాసము చేసిన నాడు (10), 

మరియు ఆ శౌచము వచ్చినప్పుడు వేడినీటితో స్నానమాడరాదు. భక్తి గలవాడు మానవుడు తీర్థాదులయందు ప్రవాహమునకు అభిముఖముగా స్నానము చేయవలెను (11). 

వారములోని గుణదోషములను పరికించి, నూనెతో అభ్యంగనన స్నానమును చేయవలెను. నిత్యము అభ్యంగనము చేయు వ్యక్తి తైలమును వాడుటలో దోషము లేదు. సుగంధ ద్రవ్యములను కలిపిన తైలమును వాడుటలో దోషము లేదు (12).

 శ్రాద్ధమునాడు, గ్రహణకాలముందు , ఉపవాసమున్ననాడు, మరియు పాడ్యమి నాడు ఆవాల నూనెను వాడుట దోషము కాదు (13).

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
[16:30, 04/07/2020] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 162 🌹 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః  🌴 
38. అధ్యాయము - 13

🌻. శివపూజ  - 2 🌻

దేశం కాలం విచార్యైవం స్నాం కుర్యాద్యథావిధి | ఉత్తరాభిముఖశ్చైవ ప్రాజ్ఞ్ముఖోsప్యథవా పునః || 14

ఉచ్ఛిష్టైనైవ వసై#్రణ న స్నాయాత్స కదాచన | శుద్ధవస్త్రేణ స స్నాయాత్తద్దేవస్మరపూర్వకమ్‌ || 15

పరధార్యం చ నోచ్ఛిష్టం రాత్రౌ చ విధృతం చ యత్‌ | తేన స్నానం తథా కార్యం క్షాలితం చ పరిత్యజేత్‌ || 16

తర్పణం చ తతః కార్యం దేవర్షి పితృతృప్తిదమ్‌ | ధౌతవస్త్రం తతో ధార్యం పునరాచమనం చరేత్‌ || 17

శుచౌ దేశే తతో గత్వా గోమయాద్యుపమార్జితే | ఆసనం చ శుభం తత్ర రచనీయం ద్విజోత్తమాః || 18

ఈ విధముగా దేశకాలములను విచారణ చేసి, తూర్పువైపునకు, లేదా ఉత్తరాభిముఖముగా తిరిగి యథావిధిగా స్నానమును చేయవలెను (14). 

కట్టి విడిచిన వస్త్రముతో ఎన్నడునూ స్నానము చేయరాదు. శుద్ధవస్త్రమును ధరించి పరమేశ్వరుని స్మరిస్తూ స్నానము చేయవలెను (15). 

ఇతరులు ధరించిన వస్త్రము, రాత్రి కట్టి విడిచిన వస్త్రము స్నానమునకు పనికిరాదు. అట్టి వస్త్రమును ఉతుకుటకు ఈయవలెను (16). 

స్నానము చేసిన తరువాత దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణములనిచ్చి తృప్తిని కలిగించవలెను. తరువాత తెల్లని వస్త్రమును ధరించి, మరల ఆచమనమును చేయవలెను (17). 

తరువాత శుభ్రమగు గోమయముతో అలుకబడిన స్థానమును చేరవలెను. ఓ విప్రశ్రేష్ఠులారా! అట్టి స్థానము నందు శుభమగు ఆసనమును ఏర్పాటు చేసుకొనవలెను (18).

శుద్ధ కాష్ఠ సముత్పన్నం పూర్ణం స్తరిత మేవ వా | చిత్రాసనం తథా కుర్యాత్సర్వ కామఫలప్రదమ్‌ || 19

యథా యోగ్యం పునర్గ్రాహ్యం మృగచర్మాదికం చ యత్‌ | తత్రోపవిశ్య కుర్వీత త్రిపుండ్రం భస్మనా సుధీః || 20

జపస్తపస్తథా దానం త్రిపుండ్రాత్సఫలం భ##వేత్‌ | అభావే భస్మనస్తత్ర జలస్యాది ప్రకీర్తితమ్‌ || 21

ఏవం కృత్వా త్రిపుండ్రం చ రుద్రాక్షాన్థారయేన్నరః | సంపాద్య భస్మనస్తత్ర జలస్యాది ప్రకీర్తితమ్‌ || 21

ఏవం కృత్వా త్రిపుండ్రం చ రుద్రాక్షాన్థారయేన్నరః | సంపాద్య చ స్వకం కర్మ పునరారాధయే చ్ఛివమ్‌ || 22

చక్కని చెక్కతో చేసి పూర్తిగా విడదీసి యున్న పీటపై కోర్కెలన్నిటినీ ఈడేర్చు చిత్రాసనమును ఏర్పాటు చేయవలెను (19). 

ఆపైన మృగచర్మ మొదలగు వాటిని ఉచితమగు తీరున ఏర్పాటు చేసి, దానిపై కూర్చుండి విద్వాంసుడు భస్మతో త్రిపుండ్రమును ధరించవలెను (20). 

త్రిపుండ్రమును ధరించి చేసిన జపము, తపస్సు మరియు దానములు సఫలమగును (21). 

ఈ తీరున త్రిపుండ్రమును ధరించి సాధకుడు రుద్రాక్షలను ధరించవలెను. అటు పిమ్మట నిత్య కర్మను అనుష్ఠించి, మరల శివుని ఆరాధించవలెను (22).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 . శ్రీ శివ మహా పురాణము - 166 🌹 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

 🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః  🌴 
38. అధ్యాయము - 13

 🌻. శివపూజ  - 6 🌻 

సుగంధం చందనం దద్యాదన్యలేపాని యత్నతః | ససుగంధ జలేనైవ జలధారాం ప్రకల్పయేత్‌ || 58

వేదమంత్రైః షడంగైర్వా నామభీ రుద్రసంఖ్యయా | యథా వకాశం తాం దత్వా వస్త్రేణ మార్జయేత్తతః || 59

పశ్చాదాచమనం దద్యాత్తతో వస్త్రం సమర్పయేత్‌ | తిలాశ్చైవ జవా వాపి గోధూమా ముద్గమాషకాః || 60

అర్పణీయాశ్శివాయైవం మంత్రైర్నానావిధై రపి | తతః పుష్పాణి దేయాని పంచాస్యాయ మహాత్మనే || 61

సువాసనగల గంధమును, ఇతర లేపములను శ్రద్ధతో అర్పించవలెను. సుగంధముగల నీటితో మాత్రమే జలధారను కల్పించవలెను (58).

షడంగములతో కూడిన వేద మంత్రములతో గాని, పదకొండు నామములతో గాని వీలును బట్టి జలధారను అర్పించి, తరువాత వస్త్రముతో తుడువవలెను (59). 

తరువాత ఆచమనమును, వస్త్రమును అర్పించవలెను. తిలలను, యవలను, గోధుమలను, పెసలను, మినుములను (60) 

అనేక విధములగు మంత్రములతో శివునకు అర్పించవలెను. తరువాత ఐదు మోముల మహాదేవునకు పుష్పముల నర్పించవలెను (61).

ప్రతివక్త్రం యథా ధ్యానం యథాయోగ్యాభిలాషతః | కమలైశ్శతపత్రైశ్చ శంఖపుషై#్పః పరైస్తథా || 62

కుశపుషై#్పశ్చ ధత్తూరై ర్మందారై ర్ద్రోణసంభ##వై | తథా చ తులసీపత్రైర్బిల్వపత్రై ర్విశేషతః || 63

పూజయేత్పరయా భక్త్యా శంకరం భక్తవత్సలమ్‌ | సర్వాభావే బిల్వ పత్రమర్పణీయం శివాయ వై || 64

బిల్వ పత్రార్పణనైవ సర్వపూజా ప్రసిధ్యతి | తతస్సుగంధ చూర్ణం వై వాసితం తైలముత్తమమ్‌ || 65

అర్పణీయం చ వివిధం శివాయ పరయా ముదా | తతో ధూపః ప్రకర్తవ్యో గుగ్గలా గురుభిర్ముదా || 66

యోగ్యతకు, కామనకు అనురూపముగా భక్తుడు ఐదు మోములను ధ్యానించవలెను. వందరేకుల కమలములతో, గొప్పవి యగు శంఖపుష్పములతో (62), 

కుశపుష్పములతో, ధత్తూరపుష్పములతో, మందారములతో, ద్రోణపుష్పములతో, తులసీ పత్రములతో, మరియు విశేషించి బిల్వదళములతో (63), 

భక్తవత్సలుడగు శంకరుని గొప్ప భక్తితో పూజించవలెను. ఇతర పుష్పములు లేకపోయిననూ, శివునకు బిల్వ పత్రము నర్పించవలెను (64). 

బిల్వ పత్రము నర్పించినచో అన్ని పుష్పములతో పూజించినట్లగును. తరువాత సుగంధ చూర్ణమును, ఉత్తమమగు సుగంధినూనెను (65), 

శివునకు మిక్కిలి యానందముతో అర్పించవలెను. తరువాత గుగ్గిలముతో, అగరుతో ధూపమును ఆనందముగా నర్పిపవలెను (66).

దీపో దేయస్తతస్తసై#్మ శంకరాయ ఘృతప్లుతః | అర్ఘ్యం దద్యాత్‌ పునస్తసై#్మ మంత్రేణానేన భక్తితః || 67

కారయేద్భావతో భక్త్యా వస్త్రేణ ముఖమార్జనమ్‌ |రూపం దేహి యశో దేహి భోగం దేహి చ శంకర || 68

భుక్తిముక్తిఫలం దేహి గృహీత్వార్ఘ్యం నమోsస్తుతే | తతో దేయం శివాయైవ నైవేద్యం వివిధం శుభమ్‌ || 69

తత ఆచమనం ప్రీత్యా కారయేద్వా విలంబతః | తతశ్శివాయ తాంబూలం సాంగోపాంగం విధాయ చ || 70

తరువాత శంకరునకు నేయితో దీపమును పెట్టవలెను. అపుడు మరల శివునకు ఈ మంత్రమునుచ్చరించి భక్తితో అర్ఘ్యమునీయవలెను (67). 

వస్త్రముతో శివునకు, భక్తిశ్రద్ధాపూర్వకముగా ముఖమును వత్తవలెను. ' హే శంకరా! రూపమునిమ్ము. కీర్తిని ఇమ్ము. భోగమునిమ్ము (68). 

నీకు నమస్కారమగుగాక ఈ అర్ఘ్యమును స్వీకరించి, భుక్తిని, మోక్షఫలమును ఇమ్ము' . తరువాత శివునకు వివిధ శుభపదార్ధములను నైవేద్యమిడవలెను (69). 

తరువాత కొద్ది కాలము వేచియుండి శివునకు ప్రీతితో ఆచమనము నీయవలెను. పిమ్మట శివునకు వివిధ ద్రవ్యములతో కూడిన తాంబూలము నర్పించవలెను (70).

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

🌻. శివపూజ  - 2 🌻

అథ చతుర్దశోsధ్యాయః

రాజ్యస్య కాముకో యో వై పార్థివానాం చ పూజయా | తోషయేచ్ఛంకరం దేవం దశకోట్యా మునీశ్వరాః || 9

లింగం శివం తథా పుష్పమఖండం తందులం తథా | చర్చితం చందనేనైవ జలధారాం తథా పునః || 10

ప్రతిరూపం తథా మంత్రం బిల్వీదలమనుత్తమమ్‌ | అథవా శతపత్రం చ కమలం వా తథా పునః || 11

శంఖపుషై#్పస్తథా ప్రోక్తం విశేషేణ పురాతనైః || 12

ఓ మునిశ్రేష్ఠులారా! రాజ్యమును కోరువాడు పదికోట్ల పుష్పములతో పార్థివ లింగమును పూజించి శంకరదేవుని సంతోషపెట్టవలెను (9). 

శివలింగమునకు చందనము నద్దవలెను. జలధారతో అభిషేకించవలెను (10). 

మంత్ర సహితముగా మారేడు దళములతో పూజించుట సర్వశ్రేష్ఠము. పద్మములతో, కమలములతో (11), 

మరియు విశేషించి శంఖపుష్పములతో పూజించవలెనని పూర్వర్షులు చెప్పిరి. ఇట్లు పూజించుట వలన ఇహలోకమునందు మాత్రమే గాక, పరలోకమునందు కూడ కోర్కెలన్నియు ఈడేరును (12).

ధూపం దీపం చ నై వేద్యమర్ఘ్యం చారాత్రికం తథా | ప్రదక్షిణాం నమస్కారం క్షమాపన విసర్జనే || 13

కృత్వా సాంగం తథా భోజ్యం కృతం యేన భవేదిహ | తస్య వై సర్వథా రాజ్యం శంకరః ప్రదదాతి చ || 14

ప్రాధాన్య కాముకో యో వై తదర్థేనార్చయేత్పుమాన్‌ | కారాగృహగతో యో వై లక్షేనైవార్చయేద్ధరమ్‌ || 15

రోగగ్రస్తో యదా స్యాద్వై తదర్థేనార్చయేచ్ఛివమ్‌ | కన్యాకామో భ##వేద్యోవై తదర్థేన శివం పునః || 16

ధూపదీపనైవేద్యములను, అర్ఘ్యమును, హారతిని ఇచ్చి, ప్రదక్షిణ, నమస్కారములు చేయవలెను. క్షమార్పణ చేప్పి విసర్జించవలెను (13). 

తరువాత మృష్టాన్న భోజనమును పెట్టవలెను. ఇట్లు చేయు భక్తునకు శంకరుడు నిశ్చయముగా రాజ్యాధికారమును ఇచ్చును (14).

 ప్రధానాధికారమును కోరు పురుషుడు దీనిలో సగము పూజను చేయవలెను. కారాగృహమును పొందిన వ్యక్తి శివునకు లక్షార్చనను చేయవలెను (15). 

రోగపీడితుడగు భక్తుడు దానిలో సగము పూజను, కన్యను కోరువాడు మరల దానిలో సగము పూజను శివునకు చేయవలెను (16).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 . శ్రీ శివ మహా పురాణము - 168 🌹 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః  🌴 
39. అధ్యాయము - 14

🌻. శివపూజ  - 1 🌻

అథ చతుర్దశోsధ్యాయః
ఋషయ ఊచుః |

వ్యాసశిష్య మహాభాగ కథయ త్వం ప్రమాణతః | కైః పుషై#్పః పూజితశ్శంభుః కిం కిం యచ్ఛతి వై ఫలమ్‌ || 1

ఋషులు ఇట్లు పలికిరి -

ఓ వ్యాసశిష్యా! మహాత్మా! నీవు ప్రమాణ పూర్వకముగా చెప్పుము. శివుని ఏయే పుష్పములతో పూజించిన, ఏయే ఫలముల నిచ్చును ?(1).

సూత ఉవాచ |

శౌనకాద్యాశ్చ ఋషయ శ్శృణుతాదరతోsఖిలమ్‌ | కథయామ్యద్య సుప్రీత్యా పుష్పార్పణ వినిర్ణయమ్‌ || 2

ఏష ఏవ విధిః పృష్టో నారదేన మహర్షిణా | ప్రోవాచ పరమ ప్రీత్యా పుష్పార్పణ వినిర్ణయమ్‌ || 3

సూతుడిట్లు పలికెను -

శౌనకాది ఋషులారా! శ్రద్ధతో వినుడు. మీకీనాడు పుష్పములను అర్పించుటయందు గల సర్వ నిర్ణయములను ప్రీతితో చెప్పెదను (2). 

పుష్పములను అర్పించుటలో గల ఈ నిర్ణయమును నారదమహర్షి ప్రశ్నించగా బ్రహ్మ మిక్కిలి ప్రీతితో చెప్పియున్నాడు (3).

బ్రహ్మోవాచ |

కమలైర్బిల్వపత్రైశ్చ శతపత్రైస్తథా పునః | శంఖపుషై#్పస్తథా దేవం లక్ష్మీకామోsర్చయేచ్ఛివమ్‌ || 4

ఏతైశ్చ లక్ష సంఖ్యాకైః పూజితశ్చేద్భవేచ్ఛివః | పాపహానిస్తథా విప్ర లక్ష్మీ స్స్యాన్నాత్ర సంశయః || 5

వింశతిః కమలానాం తు ప్రస్థమేకముదాహృతమ్‌ | బిల్వో దలసహస్రేణ ప్రస్థార్థం పరిభాషితమ్‌ || 6

శతపత్రసహస్రేణ ప్రస్థార్థం పరిభాషితమ్‌ | పలైష్షోడశభిః ప్రస్థః పలం టంక దశః స్మృతః || 7

అనేనైవ తు మానేన తులామారోపయేద్యదా |సర్వాన్కామానవాప్నోతి నిష్కామశ్చేచ్ఛివో భ##వేత్‌ || 8

సంపదలను కోరు భక్తుడు శివదేవుని కమలములతో, బిల్వపత్రములతో, పద్మములతో, మరియు శంఖపుష్పములతో అర్చించవలెను (4). 

హే మహర్షీ! లక్ష సంఖ్య గల ఈ పుష్పములతో శివుని అర్చించినచో, పాపములు పోవుటయే గాక , సంపదలు కలుగుననుటలో సందియము లేదు (5). 

ఇరువది కమలములకు ఒక ప్రస్థము అని పేరు. వేయి బిల్వ దళములకు అర్థప్రస్థమను వాడుక (6). 

వేయి పద్మములు అర్థప్రస్థమగును. పది టంకములు ఒక పలమనియు, పదునారు పలములు ఒక ప్రస్థమనియు చెప్పబడినది (7). 

భక్తుడు ఈ మానముతో పుష్పములను తూచి శివునకు సమర్పించినచో, కోర్కెలన్నియూ ఈడేరును. భక్తుడు కామనలు లేనివాడైనచో శివస్వరూపుడగును (8).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

 🌹 . శ్రీ శివ మహా పురాణము - 170 🌹 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః  🌴 
39. అధ్యాయము - 14

🌻. శివపూజ  - 3 🌻
అథ చతుర్దశోsధ్యాయః

విద్యాకామస్తథా యస్స్యాత్తదర్థేనార్చయేచ్ఛివమ్‌ | 
వాణీకామో భవేద్యో వైఘృతేనైవార్చ యేచ్ఛివమ్‌ || 17

ఉచ్చాటనార్థం శత్రూణాం తన్మితేనైవ పూజనమ్‌ | 
మారణవై తు లక్షేణ మోహమే తు తదర్థతః || 18

సామంతానాం జయే చైవ కోటిపూజా ప్రశస్యతే | 
రాజ్ఞామయుత సంఖ్యం చ వశీ కరణకర్మణి || 19

యశ సే చ తథా సంఖ్యా వాహనాద్యైస్సహస్రికా | 
ముక్తికామోర్చయేచ్ఛంభుం పంచకోట్యా సుభక్తితః || 20

విద్యను కోరువాడు దానిలో సగము పూజను శివునకు చేయవలెను. మధురమగు కంఠ ధ్వనిని కోరువాడు శివుని నేతితో అభిషేకించవలెను  (17). 

శత్రు నాశమును కోరువాడు కోరికకు అనురూపముగా పూజించవలెను. శత్రు సంహారమైనచో లక్షార్చనను, శత్రుమోహనము కొరకై దానిలో సగము పూజను చేయవలెను.(18). 

సామంతులను జయించగోరు రాజులు కోటిపూజను చేయవలెను. వశీకరణమును కోరువాడు పదివేల పూజను (19), 

యశస్సును కోరువాడు కూడా అదే పూజను, వాహనాదులను కోరువాడు సహస్రార్చనను చేయవలెను. ముక్తిని కోరువాడు భక్తితో శివునకు అయిదు కోట్ల పుష్పములతో పూజను చేయవలెను (20).

జ్ఞానార్థీ పూజయేత్కో ట్యా శంకరం లోకశంకరమ్‌ | 
శివదర్శనకామో వై తదర్ధేన ప్రపూజయేత్‌ || 21

తథా మృత్యుంజయో జాప్యః కామనాఫలరూపతః | 
పంచలక్షా జపా యర్హి ప్రత్యక్షం తు భవేచ్ఛివః || 22

లక్షేణ భజతే కశ్చి ద్ద్వితీయో జాతి సంభవః | 
తృతీయే కామనాలాభశ్చ తుర్థే తం ప్రపశ్యతి || 23

పంచమం చ యదా లక్షం ఫలం యచ్ఛత్యసంశయమ్‌ | 
అనేనైవ తు మంత్రేణ దశలక్షే ఫలం లభేత్‌ || 24

జ్ఞానమును కోరువాడు లోకములకు మంగళములనిచ్చే శంకరునకు కోటిపూజను చేయవలెను. శివుని దర్శించగోరువాడు దానిలో సగము పూజను చేయవలెను (21). 

ఇదే విధముగా మృత్యుంజయమంత్రమును కోరికలను బట్టి జపించవలెను. అయిదు లక్షలు జపించినచో శివుడు ప్రత్యక్షమగును (22). 

లక్ష జపించగానే ఒక మహాత్ముడు భక్తుడై సేవించును. రెండు లక్షలు జపించగానే పూర్వ జన్మస్మృతి కలుగును. మూడు లక్షలు జపించినచో కోర్కెలు ఈడేరును. నాల్గవ లక్ష పూర్తి అయినచో శివుడు ప్రత్యక్షమై ఫలమునిచ్చుననుటలో సందేహము లేదు. ఈ మృత్యుంజయ మంత్రమును పది లక్షలు జపించినచో మహా ఫలము సిద్ధించును (24).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

: శ్రీ శివ మహా పురాణము - 171 🌹 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః  🌴 
39. అధ్యాయము - 14

🌻. శివపూజ  - 4 🌻

అథ చతుర్దశోsధ్యాయః

ముక్తికామో భవేద్యో వై దర్భైశ్చ పూజనం చరేత్‌ | లక్ష సంఖ్యా తు సర్వత్ర జ్ఞాతవ్యా మునిసత్తమ || 25

ఆయుః కామో భ##వేద్యే వై దూర్వాభిః పూజనం చరేత్‌ | పుత్రకామో భవేద్యో వై ధత్తూరకుసుమైశ్చరేత్‌ || 26

రక్తదండశ్చ ధత్తూరః పూజనే శుభదః స్మృతః | అగస్త్యకుసుమైశ్చైవ పూజకస్య మహద్యశః || 27

ముక్తిని కోరువాడు దర్భలతో పూజించవలెను. ఓ మునిశ్రేష్ఠా! ఈ పూజలనన్నిటిని లక్ష సంఖ్యలో చేయవలెనని యెరుంగుము(25).

ఆయుర్దాయమును కోరువాడు దూర్వలతో పూజించవలెను. పుత్రుని కోరువాడు ధత్తూర పుష్పములతో పూజించవలెను (26).ఎర్రని కాడగల ధత్తూర (ఉమ్మెత్త) 

పుష్పములతో పూజించినచో శుభములు కలుగునని చెప్పబడెను. అగస్త్య (అవిసె ) పుష్పములతో పూజించువానికి గొప్ప కీర్తి కలుగును (27).

భుక్తిముక్తి ఫలం తస్య తులస్యా పూజయేద్యది | అర్కపుషై#్పః ప్రతాఫశ్చ కుబ్జ కల్హారకైస్తథా || 28

జపాకుసుమపూజా తు శత్రూణాం మృత్యుదా స్మృతా | రోగోచ్చాటనకానీహ కరవీరాణి వై క్రమాత్‌ || 29

బంధుకైః భూషణావాప్తిర్జాత్యా వాహాన్న సంశయః | అతసీ పుష్పకైర్దేవం విష్ణువల్లభతామియాత్‌ || 30

శమీపత్రైస్తథా ముక్తిః ప్రాప్యతే పురుషేణ చ | మల్లికాకుసుమై ర్దత్తైస్త్స్రి యం శుభతరాం శివః || 31

తులసితో పూజించు భక్తునకు భుక్తి, ముక్తి లభించును. జిల్లేడు పుష్పములతో పూజించిన భక్తునకు పరాక్రమము కలుగును. ఎర్రకలువలతో, మరియు ఉత్తరేణి పుష్పములతో పూజించిననూ అదే ఫలము కలుగును (28). 

ఎర్ర గులాబి పువ్వులతో పూజించినచో, శత్రువునకు మృత్యువు కలుగును. ఎర్రగన్నేరు పుష్పములతో పూజించినచో రోగములు తొలగి పోవును. (29)

జాజి పువ్వులతో పూజించు వానికి వాహనములు లభించుననుటలో సందేహము లేదు. శివుని అవిసె పువ్వులతో పూజించువాడు విష్ణువునకు ప్రియుడగును (30). 

జమ్మిపత్రితో పూజించు భక్తుడు ముక్తిని పొందును. మల్లెలతో పూజించు భక్తునకు శివుడు పతివ్రత యగు భార్యను అను గ్రహించును (31).

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

: శ్రీ శివ మహా పురాణము - 171 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః  🌴
39. అధ్యాయము - 14

🌻. శివపూజ  - 4 🌻

అథ చతుర్దశోsధ్యాయః

ముక్తికామో భవేద్యో వై దర్భైశ్చ పూజనం చరేత్‌ | లక్ష సంఖ్యా తు సర్వత్ర జ్ఞాతవ్యా మునిసత్తమ || 25

ఆయుః కామో భ##వేద్యే వై దూర్వాభిః పూజనం చరేత్‌ | పుత్రకామో భవేద్యో వై ధత్తూరకుసుమైశ్చరేత్‌ || 26

రక్తదండశ్చ ధత్తూరః పూజనే శుభదః స్మృతః | అగస్త్యకుసుమైశ్చైవ పూజకస్య మహద్యశః || 27

ముక్తిని కోరువాడు దర్భలతో పూజించవలెను. ఓ మునిశ్రేష్ఠా! ఈ పూజలనన్నిటిని లక్ష సంఖ్యలో చేయవలెనని యెరుంగుము(25).

ఆయుర్దాయమును కోరువాడు దూర్వలతో పూజించవలెను. పుత్రుని కోరువాడు ధత్తూర పుష్పములతో పూజించవలెను (26).ఎర్రని కాడగల ధత్తూర (ఉమ్మెత్త)

పుష్పములతో పూజించినచో శుభములు కలుగునని చెప్పబడెను. అగస్త్య (అవిసె ) పుష్పములతో పూజించువానికి గొప్ప కీర్తి కలుగును (27).

భుక్తిముక్తి ఫలం తస్య తులస్యా పూజయేద్యది | అర్కపుషై#్పః ప్రతాఫశ్చ కుబ్జ కల్హారకైస్తథా || 28

జపాకుసుమపూజా తు శత్రూణాం మృత్యుదా స్మృతా | రోగోచ్చాటనకానీహ కరవీరాణి వై క్రమాత్‌ || 29

బంధుకైః భూషణావాప్తిర్జాత్యా వాహాన్న సంశయః | అతసీ పుష్పకైర్దేవం విష్ణువల్లభతామియాత్‌ || 30

శమీపత్రైస్తథా ముక్తిః ప్రాప్యతే పురుషేణ చ | మల్లికాకుసుమై ర్దత్తైస్త్స్రి యం శుభతరాం శివః || 31

తులసితో పూజించు భక్తునకు భుక్తి, ముక్తి లభించును. జిల్లేడు పుష్పములతో పూజించిన భక్తునకు పరాక్రమము కలుగును. ఎర్రకలువలతో, మరియు ఉత్తరేణి పుష్పములతో పూజించిననూ అదే ఫలము కలుగును (28).

ఎర్ర గులాబి పువ్వులతో పూజించినచో, శత్రువునకు మృత్యువు కలుగును. ఎర్రగన్నేరు పుష్పములతో పూజించినచో రోగములు తొలగి పోవును. (29)

జాజి పువ్వులతో పూజించు వానికి వాహనములు లభించుననుటలో సందేహము లేదు. శివుని అవిసె పువ్వులతో పూజించువాడు విష్ణువునకు ప్రియుడగును (30).

జమ్మిపత్రితో పూజించు భక్తుడు ముక్తిని పొందును. మల్లెలతో పూజించు భక్తునకు శివుడు పతివ్రత యగు భార్యను అను గ్రహించును (31).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 . శ్రీ శివ మహా పురాణము - 172 🌹 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః  🌴
39. అధ్యాయము - 14

🌻. శివపూజ  - 5 🌻

యూథికా కుసుమై స్ససై#్యర్గృహం నైవ విముచ్యతే | కర్ణికారైస్తథా వస్త్ర సంపత్తి ర్జాయతే నృణామ్‌ || 32

నిర్గుండీ కుసుమై ర్లోకే మనో నిర్మలతాం వ్రజేత్‌ | బిల్వపత్రైస్తథా లక్షై స్సర్వాన్కామానవాప్నుయాత్‌ || 33

శృంగార హారపుషై#్ప స్తు వర్ధతే సుఖ సంపదా | ఋతు జాతాని పుష్పాణి ముక్తి దాని న సంశయః || 34

రాజికాకుసుమానీహ శత్రూణాం మృత్యుదాని చ | ఏషాం లక్షం శివే దద్యాద్ద దాచ్చ విపులం ఫలమ్‌ || 35

మల్లెలతో, మరియు ధాన్యములతో ఆరాధించు వానికి నివాసగృహము చేయి జారిపోదు. కొండగోగు పువ్వులతో పూజించు మానవులకు వస్త్రసమృద్ధి కలుగును (32). 

లోకములో వావిలి పువ్వులతో పూజించు వారికి మనస్సు నిర్మలమగును. లక్ష బిల్వార్చన చేయు మానవునకు కోర్కెలన్నియూ ఈడేరును (33). 

సిందూరపుష్పములతో మరియు మాలతో అర్చించు వానికి సుఖసంపదలు వర్ధిల్లును. ఆయా ఋతువుల యందు లభించు పుష్పములతో పూజించినచో ముక్తి లభించుననుటలో సందేహము లేదు (34). 

ఆవ పుష్పములతో పూజించిన వాని శత్రువులు మరణించెదరు. వీటిని లక్షపుష్పములను శివునకు అర్పించినచో, శివుడు మహాఫలము నిచ్చును (35).

విద్యతే కుసుమం తన్న యన్నైవ శివవల్లభమ్‌ | చంపకం కేతకం హిత్వా త్వన్యత్సర్వం సమర్పయేత్‌ || 36

అతః పరం చ ధాన్యానాం పూజనే శంకరస్య చ | ప్రమాణం చ ఫలం సర్వం ప్రీత్యా శృణు చ సత్తమ || 37

తందులా రోపణ నౄణాం లక్ష్మీ వృద్ధిః ప్రజాయతే | అఖండితవిధౌ విప్ర సమ్యగ్భక్త్యా శివో పరి || 38

షట్కేనైవ తు ప్రస్థానాం తదర్ధేన తథా పునః | పలద్వయం తథా లక్ష మానేన సముదాహృతమ్‌ || 39

పూజాం రుద్ర ప్రధానేన కృత్వా వస్త్రం సుసుందరమ్‌ | శివో పరి న్యసేత్తత్ర తందులార్పణ ముత్తమమ్‌ || 40

శివునకు ప్రియము కాని పుష్పము లేనే లేదు. సంపంగి, మొగలి పువ్వులను విడిచి పెట్టి, మిగిలిన పుష్పములన్నిటినీ సమర్పించవలెను (36). 

ఓ మహర్షీ!శంకరునకు ధాన్యములతో చేయు పూజలకు ఫలమును, ధాన్యముల ప్రమాణమును వివరముగా ఇప్పుడు చెప్పెదను. ప్రీతితో వినుము (37). 

ఓ విప్రా! మానవులు శివునిపై చక్కని భక్తితో నూకలు లేని బియ్యమును పోసి పూజించినచో, సంపదలు అభివృద్ది చెందును (38). 

ఆరు ప్రస్థములు గాని దానిలో సగము గాని, రెండు పలములు గాని, మరియు లక్ష (ఒక మానము) గాని బియ్యముతో పూజించవలెను (39). 

ప్రధానముగా రుద్రాధ్యాయముతో పూజను చేసి, శివుని పై సుందరమగు వస్త్రమునుంచి, దానిపై శ్రేష్ఠమగు బియ్యమును అర్పించవలెను. (40)

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 . శ్రీ శివ మహా పురాణము - 173 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః  🌴
39. అధ్యాయము - 14

🌻. శివపూజ  - 6 🌻

ఉపరి శ్రీ ఫలం త్వేకం గంధపుష్పాదిభిస్తథా |రోపయిత్వా చ ధూపాది కృత్వా పూజిఫలం లభేత్‌ || 41

ప్రాజాపత్యం ద్వయం రౌప్య మాసంఖ్యా చ దక్షిణా | దేయా తదుపదేష్ట్రై హి శక్త్యా వా దక్షిణా మతా || 42

ఆదిత్య సంఖ్య యా తత్ర బ్రాహ్మణాన్‌ భోజయేత్తతః | లక్షపూజా తథా జాతా సాంగం చ మంత్ర పూర్వకమ్‌ || 43

శతమష్టోత్తరం తత్ర మంత్రే విధిరుదాహృతః | తిలానాం చ పలం లక్షం మహాపాతకనాశనమ్‌ || 44

ఏకాదశపలైరేవ లక్షమానము దాహృతమ్‌ | పూర్వవత్పూ జనం తత్ర కర్తవ్యం హిత కామ్యయా || 45

దానిపైన గంధపుష్పాదులచే అలంకరింపబడిన మారేడు ఫలము నొకదానిని ఉంచి ధూపాది ఉపచారములను చేసినచో పూజా ఫలము సిద్ధించును (41). 

ఆ బియ్యము నంతనూ రెండు రూప్యముల దక్షిణతో సహా ఈ వ్రతమును ఉపదేశించిన వానికి ఈయవలెను. దక్షిణ యథాశక్తి యైననూ కావచ్చును (42). 

తరువాత పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనమిడవలెను. ఇట్లు చేయట వలన మంత్ర పూర్వకముగా సంపూర్ణ లక్షార్చనా ఫలము లభించును (43). 

మంత్రమును నూట యెనిమిది సార్లు జపించవలెనని విధి గలదు. పలము, లేక లక్ష (ఒక మానము) తిలలతో ఇదే విధముగా పూజించినచో, మహాపాపములు తొలగిపోవును (44). 

పదకొండు పలములు ఒక లక్ష యగును. తిలలను శివుని పైనుంచి తరువాత పూర్వము చేసిన విధముగా పూజించు భక్తుడు హితములతను పొందును (45).

భోజ్యా వై బ్రాహ్మణాస్తస్మాదత్ర కార్యా నరేణ హి | మహాపాతకజం దుఃఖం తత్‌ క్షణాన్న శ్యతి ధ్రువమ్‌ || 46

యవపూజా తథా ప్రోక్తా లక్షేణ పరమా శివే | ప్రస్థానా మష్టకం చైవ తథా ప్రస్థార్ధకం పునః || 47

పల ద్వయ యుతం తత్ర మానమేత త్పురాతనమ్‌ | యవపూజా చ ముని భిస్స్వర్గ సౌఖ్య వివర్దినీ || 48

ప్రాజాపత్యం బ్రాహ్మణానాం కర్తవ్యం చ ఫలేప్సుభిః | గోధూమాన్నైస్తథా పూజా ప్రశస్తా శంకరస్య వై || 49

భక్తుడు అటు పిమ్మట బ్రాహ్మణులకు భోజనము నిడవలెను. ఇట్లు చేయుట వలన మహాపాపములనుండి పుట్టే దుఃఖము వెను వెంటనే నిశ్చితముగా నాశనమగును (46). 

లక్ష మానము గల సగ్గు బియ్యమును శివునకు అర్పించుట చాల శ్రేష్ఠము. మరియు ఎనిమిదిన్నర ప్రస్థములు (47), 

రెండు పలముల సగ్గు బియ్యమును అర్పించవలెనని పూర్వర్షులు మానమును నిర్ణయించిరి. ఇట్లు సగ్గు బియ్యమును అర్పించుట వలన స్వర్గసౌఖ్యములు లభించునని మహర్షులు చెప్పిరి (48). 

ఫలమును కోరు భక్తులు ఆ బియ్యమును అంతయూ బ్రాహ్మణులకు దానమీయవలెను. శంకరుని గోధుమలతోను, అన్నముతోను పూజించుట మిక్కిలి శ్రేష్ఠము (49).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 . శ్రీ శివ మహా పురాణము - 174 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః  🌴 
39. అధ్యాయము - 14

🌻. శివపూజ  - 7 🌻

సంతతి ర్వర్థతే తస్య యది లక్షావధిః కృతా | ద్రోణార్థేన భవేల్లక్షం విధానం విధిపూర్వకమ్‌ || 50

ముద్గానాం పూజనే దేవశ్శివో యచ్ఛతి సుఖమ్‌ | ప్రస్థానాం సప్తకేనైవ ప్రస్థార్ధేనాథ వా పునః || 51

పల ద్వయముతే నైవ లక్షముక్తం పురాతనైః | బ్రాహ్మణాశ్చ తథా భోజ్యా రుద్ర సంఖ్యా ప్రమాణతః || 52

ప్రియంగు పూజ నాదేవ ధర్మాధ్యక్షే పరాత్మని | ధర్మార్థ కామా వర్థంతే పూజా సర్వ సుఖావహా || 53

ప్రస్థైకేన చ తస్యోక్తం లక్షమేకం పురాతనైః | బ్రహ్మ భోజం తథా ప్రోక్తమర్క సంఖ్యా ప్రమాణతః || 54

లక్ష పరిమాణము గల బియ్యమును అర్పించు భక్తునికి సంతానము వర్ధిల్లును. ద్రోణము అనే పరిమాణములో సగము లక్ష అగును. ఇది శాస్త్రీయ విధానము (50). 

పెసలతో పూజించినచో శివుడు సుఖము నిచ్చును. ఏడున్నర ప్రస్థములకు (51) 

రెండు పలములను కలిపినచో లక్ష అగునని పూర్వర్షులు చెప్పిరి. మరియు, పదకొండు మంది బ్రాహ్మణులకు భోజనము నిడవలెను (52). 

ధర్మాధ్యక్షుడు, పరమాత్మయగు శివునకు ప్రియంగు ధాన్యము (కొర్ర ధాన్యము) ను సమర్పించినచో, ధర్మార్థకామములు వర్దిల్లి, సర్వసుఖములు కలుగును (53). 

ఈ ధాన్యమును ఒక ప్రస్థముతో కూడ ఒక లక్ష ప్రమాణములో అర్పించవలెనని పూర్వర్షులు చెప్పిరి. మరియు పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనము నిడవలెనని చెప్పబడినది (54).

రాజి కాపూజనం శంభోశ్శత్రోర్మృత్యుకరం స్మృతమ్‌ | సార్షపానాం తథా లక్షం పలైర్వింశతి సంఖ్యయా || 55

తేషాం చ పూజనాదేవ శత్రోర్మృత్యురుదాహృతః |ఆఢీకానాం దలైశ్చైవ శోభయిత్వార్చయేచ్ఛివమ్‌ || 56

వృతా గౌశ్చ ప్రదాతవ్యా బలీవర్దస్తథైవ చ | మహిచసంభవా పూజా శత్రోర్నాశకరీ స్మృతా || 57

నానా సుఖకరీ హ్యేషా పూజా సర్వఫలప్రదా | ధాన్యానామితి ప్రోక్తం మయా తే మునిసత్తమ || 58

శంభుని నల్ల ఆవాలతో పూజించినచో శత్రువు మృత్యువును పొందును. ఇరువది పలముల తెల్ల ఆవాలు ఒక లక్ష మానమగును. (55).

లక్ష ఆవాలతో శివుని పూజించుట తోడనే శత్రువు నశించును. కందిపువ్వుల దళములతో శివుని అలంకరించి పూజిచవలెను (56). 

దూడతో కూడిన ఆవును, ఎద్దును దానము చేయవలెను. మిరియాలతో పూజించినచో శత్రువు నశించునని చెప్పబడినది (57). 

ఈ పూజ సర్వసుఖములను, సర్వఫలములను ఇచ్చును. ఓ మునిశ్రేష్ఠా! నేను నీకింతవరకు ధాన్యములతో పూజచేయు విధమును తెలిపితిని (58).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 . శ్రీ శివ మహా పురాణము - 175 🌹 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః  🌴
39. అధ్యాయము - 14

🌻. శివపూజ  - 8 🌻

లక్ష మానం తు పుష్పాణాం శృణు ప్రీత్యా మునీశ్వర | ప్రస్థానాం చ తథా చైకం శంఖపుష్పసముద్భవమ్‌ || 59

ప్రోక్తం వ్యాసేన లక్షం హి సూక్ష్మమాన ప్రదర్శినా | ప్రస్థై రేకాదశైర్జాతీ లక్ష మానం ప్రకీర్తితమ్‌ || 60

యూథికాయాస్తథా మానం రాజికాయాస్తదర్ధకమ్‌ | ప్రస్థైర్వింశతికైశ్చైవ మల్లికామానముత్తమ్‌ || 61

తిలపుషై#్పస్తథా మానం ప్రస్థాన్న్యూనం తథైవ చ | తతశ్చ ద్విగుణం మానం కరవీరభవే స్మృతమ్‌ || 62

ఓ మునిశ్రేష్ఠా! పుష్పములకు వర్తించే లక్షమానమును ప్రీతితో వినుము. శంఖపుష్పముల ఒక ప్రస్థము ఒక లక్షయగునని (59) 

సూక్ష్మమానమును వివరించిన వ్యాసుడు చెప్పినాడు. పదకొండు ప్రస్థముల అడవి మల్లెలు ఒక లక్ష యగును (60). 

కొండమల్లెల మానము కూడా ఇంతే. దీనిలో సగము ఆవపువ్వులు లక్షయగును. ఇరువది ప్రస్థముల తీగమల్లె పువ్వులు ఒక లక్షయగును (61).

ప్రస్థము కంటె కొద్ది తక్కువ నువ్వుల పువ్వులు ఒక లక్షయగును. దీనికి రెండు రెట్లు ఎర్రగన్నేరు పువ్వులు ఒక లక్ష మానమగును (62).

నిర్గుండీకుసుమే మానం తథైవ కథితం బుధైః | కర్ణికారే తథా మానం శిరీషకు సుమే పునః || 63

బంధుజీవే తథా మానం ప్రస్థానాం దశకేన చ | ఇత్యాద్యైర్వివిధైర్మానం దృష్ట్వా కుర్యాచ్ఛివార్చనమ్‌ || 64

సర్వకామసమృద్ధ్యర్థం ముక్త్యర్థం కామనోజ్ఘితః | అతః పరం ప్రవక్ష్యామి ధారాపూజాఫలం మహత్‌ || 65

యస్య శ్రవణ మాత్రేణ కల్యాణం జాయతే నృణామ్‌ | విధాన పూర్వకం పూజాం కృత్వా భక్త్యా శివస్య వై || 66

పశ్చాచ్చ జలధారా హి కర్తవ్యా భక్తి తత్పరైః |

సిందూర పుష్పముల విషయములో కూడ మానము ఇటులనే అనియు, కొండగోగు పువ్వులకు మరియు దిరిసెన పువ్వులకు ఇదియే మానమనియు పండితులు చెప్పెదరు (63). 

మంకెన పుష్పముల వి,యములో నలభై మానికెల కొలత ఒక లక్షయగును. భక్తుడు ఈ వివిధ మానములను పరిశీలించి, శివుని అర్చించినచో (64), 

సర్వకామనలు సిద్ధించును. కామనలు లేని భక్తునకు ముక్తి లభించును. ఈపైన పరమ పవిత్రమైన ధారాపూజ యొక్క ఫలమును చెప్పెదను (65). 

దీనిని విన్నంత మాత్రానా మానవులకు మంగళములు కలుగును. శివునకు యథావిధిగా భక్తితో పూజసలిపి (66), 

ఆ తరువాత భక్తి తత్పరులగు సాధకులు శివునిపై జలధారను ఏర్పాటు చేయవలెను.

సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹

🌹 . శ్రీ శివ మహా పురాణము - 179 🌹 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః  🌴 
40. అధ్యాయము - 15

🌻. రుద్రావతార ఆవిర్భావము - 2 🌻

గమనేsధో వరాహస్య గతిర్భవతి నిశ్చలా | ధృతం వారాహరూపం హి విష్ణునా వన చారిణా || 14

అథవా భవకల్పార్థం తద్రూపం హి ప్రకల్పితమ్‌ | విష్ణునా చ వరాహస్య భువనావన కారిణా || 15

యద్దినం హి సమారభ్య తద్రూపం ధృతవాన్హరిః | తద్దినం ప్రతి కల్పో సౌ కల్పో వారాహసంజ్ఞకః || 16

ఇతి ప్రశ్నోత్తరం దత్తం ప్రస్తుతం శృణు నారద | స్మృత్వా శివపదాంభోజం వక్ష్యే సృష్టివిధిం మునే || 17

అంతర్హితే మహాదేవే త్వహం లోకపితామహః | తదీయం వచనం కర్తు మధ్యాయన్‌ ధ్యానతత్పరః || 18

క్రిందికి దూసుకుపోవుటలో వరాహమునకు స్థిరమైన గమనము గలదు. అందువలననే, వనములయందు సంచరించు విష్ణువు వరాహరూపమును ధరించెను (14). 

లేదా, లోకములను రక్షించు విష్ణువు సృష్టిలో కల్ప వ్యవస్థ కొరకై ఆ రూపమును ధరించియుండును (15). 

ఏనాడు హరి ఆ రూపమును ధరించెనో, ఆ నాటి నుండి ప్రవర్తిల్లిన కల్పముకు వరాహకల్పమని పేరు వచ్చెను (16). 

ఓ నారదా! నీప్రశ్నలలో కొన్నింటికి నీకు సమాధానముల నిచ్చితిని. ఓమహర్షీ! నేనిపుడు శివుని పాదపద్మములను స్మరించి సృష్టి ప్రకారమును చెప్పెదను (17). 

మహాదేవుడు అంతర్ధానము కాగానే లోకములకు పితామహుడనగు నేను శివుని ఆజ్ఞను పాలించుటకై ధ్యానమగ్నుడనైతిని (18).

నమస్కృత్య తదా శంభుం జ్ఞానం ప్రాప్య హరేస్తదా | ఆనందం పరమం గత్వా సృష్టిం కర్తుం మనో దధే || 19

విష్ణుశ్చాపి తదా తత్ర ప్రణిపత్య సదాశివమ్‌ | ఉపదిశ్య చ మాం తాత హ్యంతర్ధానముపాగతః || 20

బ్రహ్మాండాచ్చ బహిర్గత్వా ప్రాప్య శంభోరనుగ్రహమ్‌ | వైకుంఠనగరం గత్వా తత్రోవాస హరిస్సదా || 21

అహం స్మృత్వా శివం తత్ర విష్ణుం వై సృష్టికామ్యయా | పూర్వం సృష్టం జలం యచ్చ తత్రాంజలిముదాక్షిపమ్‌ || 22

అపుడు నేను శంభునకు నమస్కరించి, విష్ణువునుండి జ్ఞానమును పొంది, పరమానందమును పొంది, సృష్టిని చేయుటకు నిశ్చయించితిని (19). 

అపుడు విష్ణువు కూడా, ఓవత్సా! సదాశివునకు నమస్కరించి, నాకు ఉపదేశించి, అంతర్ధానమయ్యెను (20). 

విష్ణువు బ్రహ్మాండమునకు ఆవలనున్న వైకుంఠనగరమును శంభుని అనుగ్రహముచే పొంది అచట శాశ్వత కాలము నివసించెను (21). 

నేను సృష్టిని చేయగోరి, శివుని విష్ణువుని స్మరించి, పూర్వము సృష్టింపబడిన జలము నుండి దోసిలితో నీటిని స్వీకరించితిని (22).

అతోsండమభవత్తత్ర చతుర్విశతిసంజ్ఞకమ్‌ | విరాడ్రూపమ భూద్విప్ర జడరూపమపశ్యతః || 23

తతస్సంశయమాపన్నస్తపస్తేపే సుదారుణమ్‌ | ద్వాదశాబ్దమహం తత్ర విష్ణుధ్యానపరాయణః || 24

తస్మింశ్చ సమయే తాత ప్రాదుర్భూతో హరిస్స్వయమ్‌ | మామువాచ మహాప్రీత్యా మదంగం సంస్పృశన్ముదా || 25

హే విప్రా! ఆనీటి నుండి ఇరువది నాలుగు తత్త్వములతో గూడిన విరాట్‌ అండాకారముగా జన్మించెను. ఆ విరాడ్రూపములో జడత్వమే గాని, చైతన్యము కన్పట్టలేదు (23). 

అపుడు నాకు సందేహము కలిగి విష్ణుధ్యానతత్పరుడనై పన్నెండు సంవత్సరముల దారుణముగ తపస్సును ఆచరించితిని (24). 

ఓవత్సా! అపుడు విష్ణువు స్వయముగా ప్రత్యక్షమై ప్రీతితో నా దేహమును స్పృశించి నాతో ఇట్లు పలికెను (25).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 . శ్రీ శివ మహా పురాణము - 181 🌹 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః  🌴 
40. అధ్యాయము - 15

🌻. రుద్రావతార ఆవిర్భావము - 4 🌻

తం దృష్ట్వా మే సిసక్షోశ్చ జ్ఞాత్వాsసాధక మాత్మనః | సర్గోsవర్తత దుఃఖాఢ్యస్తిర్యక్‌ స్రోతా న సాధకః || 39

తంచాసాధకమాజ్ఞాయా పునశ్చింతయతశ్చమే | అభవత్సాత్త్వికస్సర్గ ఊర్ధ్వస్రోతా ఇతి ద్రుతమ్‌ || 40

దేవసర్గః ప్రతిఖ్యాత స్సత్యోsతీవ సుఖావహః | తమప్య సాధకం మత్వాsచింతయం ప్రభుమాత్మనః || 41

ప్రాదురాసీత్తతస్సర్గో రాజసశ్శంకరాజ్ఞయా | అర్వాక్‌ స్రోతా ఇతి ఖ్యాతో మానుషః పరసాధకః || 42

ఈ సృష్టి కూడ పురుషార్థ సాధకము కాదని భావించితిని. తరువాత పశు పక్ష్యాదులతో కూడిన (తిర్యక్‌ స్రోతస్సు), దుఃఖబహుళమగు సర్గమును చేసితిని. అదియు పురుషార్థసాధకము కాలేదు (39). 

అందువలన మరల నాకు చింత కలిగినది. అపుడు వెంటనే సత్త్వగుణ ప్రధానము, ఊర్ధ్వ స్రోతస్సు అను పేరు గలది (40). 

సత్యగుణము కలది, మిక్కిలి సుఖమును కలిగించునది యగు దేవ సర్గము ఆవిర్భవించెను. అది కూడా పురుషార్తసాధకము కాదని తలంచి, నా ప్రభువగు శివుని స్మరించితిని (41). 

అపుడు శంకరుని యాజ్ఞచే అర్వాక్‌ స్రోతస్సు అని ప్రఖ్యాతి గాంచినది, పురుషార్థసాధకము, రజోగుణప్రధానమైనది యగు మానుష సర్గము ఆవిర్భవించెను (42).

మహాదేవాజ్ఞయా సర్గస్తతో భూతాదికోsభవత్‌ | ఇతి పంచవిధా సృష్టిః ప్రవృత్తావై కృతా మయా || 43

త్రయస్సర్గాః ప్రకృత్యాశ్చ బ్రహ్మణః పరికీర్తితాః | తత్రాద్యో మహతస్సర్గో ద్వితీయ స్సూక్ష్మ భౌతికః || 44

వైకారికస్తృతీయశ్చ ఇత్యేతే ప్రాకృతాస్త్రయః | ఏవం చాష్ట విధాస్సర్గాః ప్రకృతేర్వైకృతైస్సహ || 45

కౌమారో నవమః ప్రోక్తః ప్రాకృతో వైకృతశ్చ సః | ఏషామవాంతరో భేదో మయా వక్తుం న శక్యతే || 46

తరువాత మహాదేవుని యాజ్ఞచే భూతాది సృష్టి జరిగెను. ఈ తీరున నేను ఐదు విధములుగా సృష్టిని ప్రవర్తిల్లజేసితిని (43). 

మరియు ప్రకృతి నుండి మూడు సర్గములు బయలుదేరినవి. మొదటి మహత్‌ (సమష్టిబుద్ధి) సర్గము. రెండవది భూతసూక్ష్మముల సృష్టి (44). 

మూడవది పాంచభౌతిక (వైకారిక) సృష్టి. ఇవి మూడు ప్రకృతి నుండి బయలుదేరిన సృష్టులు. ఈ విధముగా ప్రకృత్యుద్భవములగు వాటితో కలిసి ఎనిమిది రకముల సర్గములు గలవు (45). 

తొమ్మిదవది కౌమార సర్గము. అది ప్రాకృతము, వైకృతము కూడా. ఈ సర్గములలోని అవాంతర భేదములను నేను చెప్పజాలను (46).

అల్పత్వాదుపయోగస్య వచ్మి సర్గం ద్విజాత్మకమ్‌ | కౌమారః సనకాదీనాం యత్ర సర్గో మహానభూత్‌ || 47

సనకాద్యాస్సుతా మేహి మానసా బ్రహ్మసంమితాః | మహావైరాగ్య సంపన్నా అభవన్‌ పంచ సువ్రతాః || 48

మయాజ్ఞప్తా ఆపి చ తే సంసారవిముఖా బుధాః | శివధ్యానైక మనసో న సృష్టౌ చక్రిరే మతిమ్‌ || 49

ప్రత్యుత్తరం చ తైర్దత్తం శ్రుత్వాహం మునసత్తమ | అకార్షం క్రోధమత్యుగ్రం మోహమాప్తశ్చ నారద || 50

ఈ అవాంతర భేదముల ప్రయోజనము అల్పమగుటచే చెప్పుటలేదు. ఇపుడు ద్విజ సర్గమును చెప్పెదను. కౌమార సర్గమనగా నిదియే. దీనిలో సనకాది మహాత్ముల సృష్టి జరిగెను (47). 

నాకు నాతో సమమైనవారు, గొప్పవైరాగ్య సంపన్నులు, దృఢవ్రతులు అగు సనకాది మనసపుత్రులు అయిదుగురు కలిగిరి (48). 

పండితులు, శివధ్యానము నందు మాత్రమే నిమగ్నులు అగువారు సంసారమునందు అభిరుచి లేనివారై, నేను ఆజ్ఞాపించినప్పుటికీ, సృష్టియందు మనస్సును లగ్నము చేయరైరి (49). 

ఓ మహర్షీ! వారు ఇచ్చిన ప్రతివచనమును విని నేను తీవ్రమగు కోపమును చేసితిని. ఓ వారదా! నేను మోహమును కూడ పొంది యుంటిని (50).

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 . శ్రీ శివ మహా పురాణము - 182 🌹 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః  🌴 
40. అధ్యాయము - 15

🌻. రుద్రావతార ఆవిర్భావము - 5 🌻

క్రుద్ధస్య మోహితస్యాథ విహ్వలస్య మునే మమ | క్రోధేన ఖలు నేత్రాభ్యాం ప్రాపతన్నశ్రుబిందవః || 51

తస్మిన్న వసరే తత్ర స్మృతేన మనసా మయా | ప్రబోధితోsహం త్వరితమాగతేన హి విష్ణునా || 52

తపః కురు శివస్యేతి హరిణా శిక్షితోsప్యహమ్‌ | తపోకారి మహద్ఘోరం పరమం మునిసత్తమ || 53

తపస్యతశ్చ సృష్ట్యర్థం భ్రువోర్ఘ్రాణస్య మధ్యతః |అవిముక్తాభిధాదేశాత్‌ స్వకీయాన్మే విశేషతః || 54

త్రిమూర్తీనాం మహేశస్య ప్రాదురాసీద్ఘృణానిధిః | అర్ధనారీశ్వరో భూత్వా పూర్ణాంశస్సకలేశ్వరః || 55

ఓ మహర్షీ! మోహముచే కోపించి విహ్వలుడనైన నాకు కోపము వలన కళ్లనుండి కన్నీటి బిందువులు రాలినవి (51). 

ఆ సమయములో నేను మనస్సులో విష్ణువును స్మరించగా, ఆయన వెంటనే వచ్చి నాకు కర్తవ్యమును బోధించెను (52). 

శివుని గూర్చి తపస్సు చేయుమని విష్ణువు హెచ్చరించగా నేను ఘోరమగు తపమునాచరించితిని (53). 

ఓ మహర్షీ!నేను సృష్టిని చేయగోరి తపస్సు చేయుచుండగా, కనుబొమలకు నడుమ ముక్కుపై గల అవిముక్తమను పేరు గల స్థానము నుండి (54), 

త్రిమూర్తులకు ప్రభువు, దయానిధి,సర్వ జగత్ర్పభువునగు పరమేశ్వరుడు పూర్ణాంశతో అర్థనారీశ్వర స్వరూపుడై సాక్షాత్కరించెను (55).

తమజం శంకరం సాక్షాత్తేజోరాశిముమాపతిమ్‌ | సర్వజ్ఞం సర్వకర్తారం నీలలోహిత సంజ్ఞకమ్‌ || 56

దృష్ట్వా నత్వా మహాభక్త్యా స్తుత్వాహం తు ప్రహర్షితః | అవోచం దేవదేవేశం సృజ త్వం వివిధాః ప్రజాః || 57

శ్రుత్వా మమ వచస్సోsథ దేవదేవో మహేశ్వరః | ససర్జ స్వాత్మనస్తుల్యాన్రుద్రో రుద్రగణాన్‌ బహూన్‌ || 58

అవోచం పునరేవేశం మహారుద్రం మహేశ్వరమ్‌ | జన్మమృత్యుభయా విష్టాస్సృజ దేవ ప్రజా ఇతి || 59

ఏవం శ్రుత్వా మహాదేవో మద్వచః కరుణానిధిః | ప్రహస్యోవాచ మాం సద్యః ప్రహస్య మునిసత్తమ|| 60

పుట్టుక లేనివాడు, తేజోరాశి, పార్వతీ పతి, సర్వము దెలిసిన వాడు, సర్వమునకు కర్త, నీలలోహితుడను పేరుగలవాడు నగు ఆ శంకరుని ప్రత్యక్షముగా (56) 

చూచి, మహాభక్తితో నమస్కరించి, మహానందముతో స్తుతించితిని. దేవ దేవుడగు శివునితో విభిన్న ప్రజలను నీవే సృష్టింపుమని అంటిని (57). 

దేవదేవుడగు ఆ మహేశ్వరుడు అపుడు నా మాటను విని, తనతో సమానమైన అనేక రుద్రగణములను సృష్టించెను (58). 

అపుడు నేను మరల మహేశ్వరునితో 'దేవా! ప్రజలను జన్మమృత్యుభయము కలవారినిగా సృష్టింపుము' అంటిని (59). 

ఓ మహర్షీ! దయానిధియగు మహాదేవుడు నా మాటను విని, వెంటనే చిరునవ్వుతో నాతో నిట్లనెను (60).

మహాదేవ ఉవాచ |

జన్మమృత్యు భయావిష్టా నాహం స్రక్ష్యే ప్రజా విధే | అశోభనాః కర్మవశా విమగ్నా దుఃఖ వారిధౌ || 61

అహం దుఃఖోదధౌ మగ్నా ఉద్దరిష్యామి చ ప్రజాః | సమ్యక్‌ జ్ఞాన ప్రదానేన గురుమూర్తి పరిగ్రహః || 62

త్వమేవ సృజ దుఃఖాఢ్యాః ప్రజాస్సర్వాః ప్రజాపతే | మదాజ్ఞయా న బద్ధస్త్వం మాయయా సంభవిష్యసి || 63

మహాదేవుడిట్లు పలికెను -

ఓ బ్రహ్మా! జన్మ మృత్యు భయముచే నిండినవారు, శోభ లేనివారు, కర్మకు వశులై దుఃఖసముద్రములో మునిగిన వారు అగు ప్రజలను నేను సృష్టించను (61). 

నేను గురు రూపమును స్వీకరించి యథార్థ జ్ఞానమునిచ్చి దుఃఖ సముద్రమునందు మునిగి పోవుచున్న ప్రజలను ఉద్ధరించెదను (62). 

ఓ ప్రజాపతీ! నీవేనా యాజ్ఞచే దుఃఖితులగు ప్రజలనందరినీ సృజించుము. నీకు మాయా బంధము ఉండబోదు (63).

బ్రహ్మోవాచ |

ఇత్యుక్త్వా మాం స భగవాన్‌ సుశ్రీమాన్నీలలోహితః |సగణః పశ్యతో మే హి ద్రు త మంతర్దధే హరః || 64

ఇతి శ్రీ శివ మహాపురాణ ప్రథమ ఖండే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం సృష్ట్యు పక్రమే రుద్రావతారవిర్భావ వర్ణనం నామ పంచ దశోsధ్యాయః (15).

బ్రహ్మ ఇట్లు పలికెను -

శోభాయుతుడు, నీలరక్త వర్ణములతో కూడిన దేహము గల వాడు నగు హరభగవానుడు నాతో ఇట్లు పలికి గణములతో కూడి నేను చూచుచుండగనే వెంటనే అంతర్ధానమయ్యెను (64).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు మొదటిదియగు సృష్టి ఖండలో రుద్రావతారావిర్భావము అనే పదునైదవ అధ్యాయము ముగిసినది (15).

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment