Friday, 22 May 2020

- యోగదర్శనం శ్రీశంకరాచార్య విరచితం శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రం


శ్రీశంకరాచార్య విరచితం శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రం
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
1)విశుద్ధం పరం సచ్చిదానందరూపం – గుణాధారమాధారహీనం వరేణ్యమ్ |

మహాంతం విభాంతం గుహాంతం గుణాంతం – సుఖాంతం స్వయం ధామ రామం ప్రవద్యే || 


2)శివం నిత్యమేకం విభుం తారకాఖ్యం – సుఖాకారమాకారశూన్యం సుమాన్యమ్ |

మహేశం కలేశం సురేశం పరేశం – నరేశం నిరీశం మహీశం ప్రవద్యే ||


3)యదావర్ణయత్కర్ణమూలేతకాలే – శివో రామ రామేతి రామేతి కాశ్యామ్ |

తదేకం పరం తారకబ్రహ్మరూపం – భజేహం భజేహం భజేహం భజేహమ్ ||


4)మహారత్నపీఠే శుభే కల్పమూలే – సుఖాసీనమాదిత్యకోటిప్రకాశమ్ |

సదా జానకీలక్ష్మణోపేతమేకం – సదా రామచంద్రం భజేహం భజేహమ్ ||


5)క్వణద్రత్నమంజీరపాదారవిందం – లసన్మేఖలాచారుపీతాంబరాఢ్యమ్ |

మహారత్నహారోల్లసత్కౌస్తుభాంగం – నదచ్చంచరీమంజరీలోలమాలమ్ ||


6)లసచ్చంద్రికాస్మేరశోణాధరాభం – సముద్యత్పతంగేందుకోటిప్రకాశమ్ |

నమద్బ్రహ్మరుద్రాదికోటీరరత్న – స్ఫురత్కాంతినీరాజనారాధితాంఘ్రిమ్ ||


7)పురః ప్రాంజలీనాంజనేయాదిభక్తా- న్స్వచిన్ముద్రయా భద్రయా బోధయంతమ్ |

భజేహం భజేహం సదా రామచంద్రం – త్వదన్యం న మన్యే న మన్యే న మన్యే ||


8)యదా మత్సమీపం కృతాంతః సమేత్య – ప్రచండప్రకోపైర్భటైర్భీషయేన్మామ్ |

తదావిష్కరోషి త్వదీయం స్వరూపం – సదాపత్ప్రణాశం సకోదండబాణమ్ || 


9)నిజే మానసే మందిరే సన్నిధేహి – ప్రసీద ప్రసీద ప్రభో రామచంద్ర |

ససౌమిత్రిణా కైకయీనందనేన – స్వశక్త్యానుభక్త్యా చ సంసేవ్యమాన || 


10)స్వభక్తాగ్రగణ్యైః కపీశైర్మహీశై-రనీకైరనేకైశ్చ రామ ప్రసీద |

నమస్తే నమోస్త్వీశ రామ ప్రసీద – ప్రశాధి ప్రశాధి ప్రకాశ ప్రభో మామ్ ||


11)త్వమేవాసి దేవం పరం మే యదేకం – సుచైతన్యమేతత్త్వదన్యం న మన్యే |

యతోభూదమేయం వియద్వాయుతేజో – జలోర్వ్యాదికార్యం చరం చాచరం చ ||


12)నమః సచ్చిదానందరూపాయ తస్మై – నమో దేవదేవాయ రామాయ తుభ్యమ్ |

నమో జానకీజీవితేశాయ తుభ్యం – నమః పుండరీకాయతాక్షాయ తుభ్యమ్ ||


13)నమో భక్తియుక్తానురక్తాయ తుభ్యం – నమః పుణ్యపుంజైకలభ్యాయ తుభ్యమ్ |

నమో వేదవేద్యాయ చాద్యాయ పుంసే – నమః సుందరాయేందిరావల్లభాయ ||


14)నమో విశ్వకర్త్రే నమో విశ్వహర్త్రే – నమో విశ్వభోక్త్రే నమో విశ్వమాత్రే |

నమో విశ్వనేత్రే నమో విశ్వజేత్రే – నమో విశ్వపిత్రే నమో విశ్వమాత్రే ||


15)నమస్తే నమస్తే సమస్తప్రపంచ – ప్రభోగప్రయోగప్రమాణప్రవీణ |

మదీయం మనస్త్వత్పదద్వంద్వసేవాం – విధాతుం ప్రవృత్తం సుచైతన్యసిద్ధ్యై ||


16)శిలాపి త్వదంఘ్రిక్షమాసంగిరేణు – ప్రసాదాద్ధి చైతన్యమాధత్త రామ |

నరస్త్వత్పదద్వంద్వసేవావిధానా-త్సుచైతన్యమేతీతి కిం చిత్రమత్ర ||


17)పవిత్రం చరిత్రం విచిత్రం త్వదీయం – నరా యే స్మరన్త్యన్వహం రామచంద్ర |

భవంతం భవాంతం భరంతం భజంతో – లభంతే కృతాంతం న పశ్యన్త్యతోన్తే ||


18)స పుణ్యః స గణ్యః శరణ్యో మమాయం – నరో వేద యో దేవచూడామణిం త్వామ్ |

సదాకారమేకం చిదానందరూపం – మనోవాగగమ్యం పరం ధామ రామ || 


19)ప్రచండప్రతాపప్రభావాభిభూత– ప్రభూతారివీర ప్రభో రామచంద్ర |

బలం తే కథం వర్ణ్యతేతీవ బాల్యే – యతోఖండి చండీశకోదండదండమ్ ||


20)దశగ్రీవముగ్రం సపుత్రం సమిత్రం – సరిద్దుర్గమధ్యస్థరక్షోగణేశమ్ |

భవన్తం వినా రామ వీరో నరో వా – సురో వామరో వా జయేత్కస్త్రిలోక్యామ్ ||


21)సదా రామ రామేతి నామామృతం తే – సదారామమానందనిష్యందకందమ్ |

పిబంతం సమంతం సుదంతం హసంతం – హనూమంతమంతర్భజే తం నితాంతమ్ ||


22)సదా రామ రామేతి రామామృతం తే – సదారామమానందనిష్యందకందమ్ |

పిబన్నన్వహం నన్వహం నైవ మృత్యో-ర్బిభేమి ప్రసాదాదసాదాత్తవైవ ||


23)అసీతాసమేతైరకోదండభూషై – రసౌమిత్రివంద్యైరచండప్రతాపైః |

అలంకేశకాలైరసుగ్రీవమిత్రై – రరామాభిధేయైరలం దైవతైర్నః ||


24)అవీరాసనస్థైరచిన్ముద్రికాఢ్యై – రభక్తాంజనేయాదితత్త్వప్రకాశైః |

అమందారమూలైరమందారమూలై – రరామాభిధేయైరలం దైవతై ర్నః ||


25)అసింధుప్రకోపైరవంధ్యప్రతాపై – రబంధుప్రయాణైరమందస్మితాఢ్యైః |

అదండప్రవాసైరఖండప్రబోధై – రరామాభిధేయైరలం దేవతై ర్నః ||


26)హరే రామ సీతాపతే రావణారే – ఖరారే మురారేసురారే పరేతి |

లపంతం నయంతం సదాకాలమేవం – సమాలోకయాలోకయాశేషబంధో ||


27)నమస్తే సుమిత్రాసుపుత్రాభివంద్య – నమస్తే సదా కైకయీనందనేడ్య|

నమస్తే సదా వానరాధీశవంద్య – నమస్తే నమస్తే సదా రామచంద్ర ||


28)ప్రసీద ప్రసీద ప్రచండప్రతాప – ప్రసీద ప్రసీద ప్రచండారికాల |

ప్రసీద ప్రసీద ప్రపన్నానుకంపిన్ – ప్రసీద ప్రసీద ప్రభో రామచంద్ర ||


29)భుజంగప్రయాతం పరం వేదసారం – ముదా రామచంద్రస్య భక్త్యా చ నిత్యం|

పఠన్సంతతం చింతయన్స్వాంతరంగే – స ఏవ స్వయం రామచంద్రః స ధన్యః ||


శ్రీశంకరాచార్య కృత శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రం సంపూర్ణం.

🕉🌞🌎🌙🌟🚩

2 - యోగదర్శనం
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
యోగదర్శనం – ఆస్తిక దర్శనం

ఈ చిత్త వృత్తులే - నేను, నాది అనే అహంకారంగా  అవిద్యవల్ల ఏర్పడి ; పురుషునికి క్లేశాలను కల్గించి దుఖానికి కారణం అవుతాయి.  చిత్తవృత్తులను పూర్తిగా అరికట్టడమే యోగం. ఈ వృత్తులన్నిటినీ  అభ్యాస , వైరాగ్యాల ద్వారా నిరోధించ వచ్చును.


ప్రకృతిలో మనకు కన్పించే జ్ఞాన శక్తి అంతా ప్రకృతి యందు పురుషుని ప్రతిబింబమే. ప్రకృతి జడము, అచేతనము.  మనస్సు కూడా అలాంటి ప్రకృతిలోదే. సంకల్పం మొదలుకొని అత్యంత స్థూల భూతాల వరకు అంతా ప్రకృతి లోనివే . అంటే ప్రకృతి వ్యక్తీకరణాలే.  సాంఖ్యులు చెప్పే ఇరవైనాల్గు తత్వాలూ జడప్రకృతి తత్వాలే. ప్రకృతి పురుషుని ఆవరించి ఉంది. పురుషుడు నిత్యుడు. జ్ఞానమే శక్తి. మనం ఒక విషయాన్ని గ్రహించడం మొదలు పెడితే , అది మనకు వశమవుతూ ఉంటుంది. అలా ప్రకృతి తత్వాలను చిత్తంలో గ్రహిస్తుంటే అవి చిత్తానికి వశం అవుతుంటాయి. ప్రకృతి తత్వాలనుధ్యానించటం అంటే ప్రకృతి శక్తులను / రహస్యాలను వశం చేసుకోడానికి విచారణ చెయ్యడం అని చెప్పవచ్చు. 

 సమాధిని పొందిన వ్యక్తికి , ఇంకా సూక్ష్మ శరీర భావన ఉంటుంది. ముక్తిని పొందకుండా లయమయ్యే విదేహులను , ప్రకృతి లయులు అంటారు.

గమ్యంవేపు సాధన సాగించే యోగులు , ముక్తులవుతారు. 


సంప్రజ్ఞాత సమాధిలో ‘నేను’ అనే జ్ఞానం భాసిస్తూ ఉంటుంది. చిత్త వృత్తులు ఇంకా సంస్కార రూపంలో నిలిచి ఉంటాయి. వీటి బీజాలు సరైన సమయం రాగానే వృత్తి  రూపంలో అంకురిస్తాయి. వీటిని కూడ నాశనం చేస్తేనే నిర్బీజ సమాధి సిద్ధిస్తుంది. దాంతో జనన మరణ రూపమైన సంసారం నశిస్తుంది.


ఇదే అతీంద్రియ జ్ఞానావస్థ- అసంప్రజ్ఞాత సమాధి. అపుడు సర్వ వ్యాప్తము, ద్వందాతీతము , స్వయంప్రకాశము అయిన ప్రత్యగాత్మ శేషిస్తుంది .దానితో యోగి తను జన్మ మరణ రహితుడననీ, కేవలం ప్రకృతే వికారం చెందుతోందనీ ఆ వికారమే పురుషునిలో ప్రతిబింబం చెందుతోందని తెలుసు కుంటాడు. వివిధ రూపాలు పొందుతూ చిత్తం చలిస్తుంటే , ఆ రూపాలన్నీ మనమే ఆనుకొని భ్రమ చెందుతాం. అతీంద్రియ జ్ఞానం కలగగానే , ఈ భ్రమలన్నీ తొలగిపోతాయి.


కొంతమంది పరిపూర్ణులైనపురుషులు ఉన్నారు. కాని సిద్ధులను పూర్తిగా వదలక పోవడంవల్ల పరమావధిని పొందక, ప్రకృతితో లయించి కొంత కాలం ఉంటారు. వీరే ప్రకృతికి అధిపతులై దేవతలుగా ఉంటారు. వేదాలలో చెప్పే పరమాత్మ ఇలాంటి వారిలో ఒకడు.  అంతేకాని స్వతంత్రుడు, శాశ్వతుడు అయిన సృష్టికర్త మరొకడు లేడని వాదిస్తారు సాంఖ్యులు. పంచభూతాలను,ఇంద్రియాలు అనే వికృతి తత్వాలను; అవ్యక్తము, మహత్తు, అహంకారము, పంచతన్మాత్రలు అనే ప్రకృతి తత్వాలను ఆత్మ భావంతో ధ్యానించడం వల్ల జీవులు దేవతా పదవులను ఆక్రమించే వారవుతారు. వీరిలో ఎవరూ పరిపూర్ణులు గాని , ముక్తులు గాని కాదు.  సరైన తత్వ విచారణ వల్ల సమాధి స్థితి కల్గుతుంది.


పురుషులు అంటే వ్యక్తిగతమైన ఆత్మలు. ఆత్మలు అనేకం ఉంటాయి. ఈశ్వరుడు పురుష విశేషుడు . సర్వజ్ఞుడు, సర్వవ్యాపి. ప్రకృతి వికారాలచేత అంటబడని వాడు. సర్వ స్వతంత్రుడు.  'ఓం'- అనే 


ప్రణవం చేత తెలియబడేవాడు. పతంజల యోగం సాంఖ్యంపై ఆధారపడి ఉంది. భగవంతుని సృష్ట్యాది ధర్మాలను అంతగా చెప్పరు. కాని శృతి ప్రమాణ రీత్యా ఈశ్వరుడే జగద్కర్త. విశ్వంలో ఏకత్వం ఉండటంవల్ల ఒకే సంకల్ప శక్తి జగత్తును సృష్టించిందని అంటారు. యోగులు పురుషులందరి కన్నావిలక్షణమైన పురుషుడు ఉన్నాడని, అతడే సృష్టికర్త  , సదా ముక్తుడు, గురువులందరికీ గురువు అని చెబుతారు. వీరు సాంఖ్యులు చెప్పే ప్రకృతి లయులను కూడా అంగీకరిస్తారు. శృతి ప్రమాణం చేత ఈశ్వరుడే సృష్టికర్తగా భావిస్తారు. ఇతరులలో బీజమాత్రంగా ఉండే సర్వజ్ఞత్వం , ఈశ్వరునిలో అనంతంగా ఉంటుందని చెబుతారు.ఈ అనంత జ్ఞానాన్నే యోగులు ఈశ్వరుడంటారు. అతడే త్రికాలాతీతుడవటం చేత పరమ గురువుగా చెబుతారు.


చిత్త చాంచల్యం అరికట్టడానికి మనసును ఒకే విషయం మీద నిలిపి ఏకాగ్రత పొందేలా చెయ్యాలి. 


ఇలా ఏకాగ్రమైన మనస్సు ఇతర సంస్కారాల నన్నిటినీ నిరోధించడంచేత అవాక్మానస గోచరమైన అఖండ సచ్చిదానంద స్థితి కల్గుతుంది. ఇతర సంస్కారాల నన్నిటినీ నిరోధించే ఈ సంస్కారాన్ని కూడ నిరోధిస్తే , అన్నీ నిరోధించబడి నిర్బీజ సమాధి ఏర్పడుతుంది. అపుడు మరణరహితము, నిర్వికారము, అద్వితీయము , స్వయంజ్యోతి అయిన పురుషుడు ప్రకాశించటాన్ని దర్శిస్తాం. ఇదే మన పరమావధి.


మనం ప్రకృతి, మనస్సు, శరీరాలతో ఏకత్వం చెందటం వల్ల పురుషుడిని చూడలేకున్నాం. ఈ ఏకత్వాన్ని కల్గించేవి వివిధ చిత్త వృత్తులే. చిత్త వృత్తుల ఆవరణం చేత పురుషుని ప్రతిబింబం చాయా మాత్రంగా కనబడుతుంది. ఈ వృత్తులు ఆవరించి ఉన్నంత కాలము పురుషుడిని దర్శించ లేము. 


ప్రకృతి తత్వాలను సరిగ్గా అవగాహన చేసుకొని , అవిద్య తొలగించుకొంటే మనకు ప్రకృతికి ఏర్పడిన బంధం తొలగి జీవుడు కైవల్యాన్ని పొందుతాడు.  మనసును ఏకాగ్రం చేయడం వల్ల ఒక విషయం మీద మాత్రమే చిత్తం నిలుస్తుంది. అపుడు ఆఒక వృత్తిని నిరోధించటం సులభమై నిర్బీజ సమాధి కల్గుతుంది.

🕉🌞🌏🌙🌟🚩

ఓం నమః శివాయ:
3 - యోగదర్శనం
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
యోగదర్శనం – ఆస్తిక దర్శనం

పురుష/ జీవాత్మ అవిద్య చేత తాను నిర్మలుడననేది మరచిపోయి, ప్రకృతి విషయాలతో సంబంధమేర్పడి, సుఖ దుఖాది అనుభవాలకు లోనవుతూ ఉంటాడు. సాధనలతో ప్రయత్నం చేస్తే ఈ సంసారమనే జనన మరణ రూపకమై ఉన్న బంధంనుంచి విడివడి మోక్షాన్ని/ కైవల్యాన్ని పొందవచ్చునని చెబుతారు.


తపస్సు , స్వాధ్యాయం , ఈశ్వర ప్రణిదానం అనే ఈ మూడూ కలసి క్రియాయోగం అంటారు.

మనస్సు, శరీరాన్ని వశం చేసుకొని తగిన రీతిలో నిరోధించటం- తపస్సు.

ముక్తి మార్గాన్ని అందించే సద్గ్రంద పఠనం – స్వాధ్యాయం. ఇది తన సిద్ధాంతాలని దృఢ పరచుకోడానికే. కర్మలను ఈశ్వరార్పణ చెయ్యడమే ఈశ్వర ప్రణిదానమంటే. చేసే కార్యం ఫలించినా భగ్నమైనా ఫలితాన్ని ఈశ్వరునికే అర్పించి స్వస్థ చిత్తంతో ఉండాలి.


అవిద్య, అస్మిత(అహంకారం), రాగం, ద్వేషం,అభినివేశం (ప్రాణం మీద తీపి) అనే అయిదూ క్లేశాలు. ఇవి సంసార బంధాలు. ఈ క్లేశాలను నివారించి సమాధి స్థితిని కల్గచెయ్యడానికే క్రియా యోగం ఏర్పడింది.


మొదట స్థూల మనోవికారాలను పిదప సూక్ష్మ వికారాలను వాటి వ్యతిరేక భావాలతో నిరోధించాలి.


అవిద్యాది క్లేశాలు కర్మలకు మూల కారణం. మనోవృత్తులు మంచివైనా, చెడువైనా క్లేశాలే. ఆత్మ స్వాతంత్ర్యానికి ప్రతి బంధకాలు. కర్మ పరిపాకం వల్ల జాతి, ఆయువు, సుఖ దుఃఖాలు కల్గు తాయి. పుణ్య పాప కర్మలు ఈ సుఖ దుఃఖాలకు హేతువు. ప్రకృతి దృశ్యాల సంయోగం వల్ల దుఃఖాలు కల్గుతుంటాయి. అంచేత వాటిని వదలాలి. పురుషుడు- మనస్సు మొదలుకొని స్థూల భూతాల వరకు ఉన్న ప్రకృతిని దృశ్యాలుగా చూస్తాడు. స్వతఃగా శుద్ధుడైన పురుషుడు ఈదృశ్యాల సంయోగంతో సుఖ దుఃఖాలు తనమీద ప్రతిబింబించే సమయంలో వాటిని తనే అనుభవిస్తున్నట్లు భావిస్తాడు. పురుషుడు ప్రకృతితో సంయోగం వల్ల తన దివ్యత్వాన్ని మరచి ఉన్నాడు. పురుషునికి అనుభవాన్ని కూర్చడమే ప్రకృతి ప్రయోజనం.


ఈ దుఃఖమయమైన ప్రపంచంలో కొన్ని బంగారు బంతులు దొర్లుతుంటే , లోకం వాటి వెంట పడుతుంది. ఐహిక జీవితం క్షణభంగురం. ఇది తాత్కాలిక అనుభవం మాత్రమే.  సంసారాన్నుండి తరించాలన్నది గుర్తించండి. మన స్వస్వరూపాన్ని మరువకుంటే సమస్త బంధాలూ తొలగి పోతాయి. మనంత మనమే ఈ ప్రకృతితో సంయోగమనే వలలో చిక్కుకొని దీనులమను కొంటున్నాం.


పురుషుడు ప్రకృతికన్న అతీతుడు,వాటి తత్వాలకన్నభిన్నుడు. బుద్దికన్న, మనస్సుకన్న,తన్మాత్రల కన్నస్థూల భూతాలకన్నను వేరైనవాడు. కేవలుడై ఉండటం వల్ల శాశ్వతుడని సాంఖ్యులు చెబుతారు. సంయోగ జనితం కాని వస్తువుకు ఎట్టి వికారాలూ కలుగవు. ఇలాంటి పురుషులు /లేక ఆత్మలు అనేకం ఉన్నాయంటారు.


బుద్దితత్వం స్వయం ప్రకాశం కాదు. అత్మవల్ల ఇది ప్రకాశవంతమవుతుంది. సాక్షి పురుషుడు చైతన్య మాతృడై , శుద్దుడై ఉన్నప్పటికీ బుద్ధిలో భాసించే వృత్తులననుసరించి చూస్తుంటాడు. స్పటికం ఎదుట ఎర్రని పూవును ఉంచితే ఎలా ఎర్రగా స్ఫటికం కన్పిస్తుందో, అలాగే సుఖదుఃఖాలు కూడ పురుషునిలో కేవలం ప్రతిబింబాలు మాత్రమే. స్వయంగా పురుషుడు నిర్వికారుడు.బుద్దితత్వం వృద్ది క్షయాలను చెందుతూ వికారాలను కలిగి ఉండటం వల్ల అది శాశ్వతమైనది కాదు. బుద్ది స్వతంత్రమైనది కాదు.ప్రకృతితో సంబంధపడి  ఉండేవన్నీ ప్రకృతి యందే ఉండటంవల్ల బద్దమై ఉంటాయి. వివిధ ఇంద్రియానుభవాలు, సుఖదుఃఖాలు దేన్లో ఏకత్వం పొందు తున్నాయో ఆ పురుష తత్వం బుద్ధికి అతీతమై ఉంది.


ఇంద్రియాలన్నిటికీ పురుషుడే కేంద్ర స్థానం. బుద్దితత్వం నుండి భాసించే సమయంలో జ్ఞాన రూపం పొంది దేశ, కాల, నిమిత్తాల వల్ల బధ్ధమవుతుందని యోగులు  గ్రహిస్తారు.పురుషునికోసం ఏర్పడిన ప్రకృతి స్వయం ప్రకాశం కాదు. పురుషుని సంపర్కం ఉన్నంత కాలం మాత్రమే ప్రకాశవంతంగా కనిపిస్తుంది. తాను ప్రకృతి కన్న అతీతుడననే నిజాన్ని గ్రహించిన ముక్తుడుని, ప్రకృతి మోహింప చెయ్యదు. కాని మిగిలిన బధ్ధజీవులకు యధాతధంగానే ఉంటుంది. అంచేత సాంఖ్యులు ప్రకృతి నిత్యమైనది అంటారు. నాకో శరీరము, నీకో శరీరమూ ఉందనుకోవడం మిధ్య. జగత్తంతా ఏక పదార్ధ రాశి. దాన్లో నువ్వొక కణం, నేనొక కణమూను.


జగత్తు ఎపుడూ మార్పు చెందుతూనే ఉంటుంది. అవిద్యయే ఈ శరీర భ్రాంతికి కారణం. సత్యాన్ని తెలుసుకొని ప్రకృతి అధీనం నుంచి తొలగటమే యోగానికి ప్రధాన ఆశయం. బాహ్య, అంతర ప్రకృతిల నంతా నిరోధించి, దివ్యత్వాన్ని వ్యక్తం చెయ్యడమే జీవిత ఆశయం. అంతర ప్రకృతిని నిరోధిస్తే బాహ్య ప్రకృతిని నిరోధించడం సులభం. దృశ్య ప్రపంచమంతా సూక్ష్మప్రపంచం యొక్క వ్యక్తీకరణ. అలాగే భౌతిక శక్తులు సూక్ష్మ శక్తుల వ్యక్తీకరణ.


పురుషుడు ఎట్టి వికారాలు పొందడని గ్రహించటమే మన పరమావధి. ఉత్పత్తి ప్రళయాలను పొందుతూ నిరంతరం మార్పు చెందేది ప్రకృతే. నిశ్చలమైన దీక్షతో నితానిత్య వివేకం చెయ్యడం మొదలు పెట్టగానే అజ్ఞానం తొలగి, పురుషుడు స్వయం జ్యోతిగా ప్రకాశిస్తాడు. ఈ స్థితిలో జ్ఞానం నిరాశ్రయమై ఉండటం వల్ల అన్ని విషయాలూ జ్ఞానతేజం వల్లనే భాసిస్తుంటాయి. ఇదే చరమావస్థ.


యోగాచార్యుడైన పతంజలి ; యమము, నియమము, ఆసనము, ప్రాణయామము, ప్రత్యాహారము అనే అయిదు బహిరంగ

యోగమార్గాలనీ ; ధారణ , ధ్యాన, సమాధి అనే మూడు అంతరంగిక యోగమార్గాలనీ బోధించాడు. వీటిలో మొదటి అయిదూ మనసులో నాటుకుంటే సమాధి స్థితికి చేరుకోడం సులభమవుతుందని అంటారు.యమము లో అయిదు దీక్షలు చెప్పబడ్డాయి.


అవి అహింస , సత్యము, అస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము. ఇక శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము , ఈశ్వర ప్రణిధానము అనేవి నియమాల్లోకి వస్తాయి. ఇలా యోగ దర్శనానికి ఎనిమిది సాధనా౦గాలు చెప్పబడటం వల్ల దీన్ని అష్టాంగ మార్గంగా చెబుతారు.

🕉🌞🌏🌙🌟🚩

No comments:

Post a Comment