తేట గీతి నేటి పద్యాలు
వృద్ధాప్యం -
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మనిషి యద్భవ తత్భావ మేను అనక
మనసు భౌతిక వాస్తవ మేది గనక
వినయ భావపు మర్మము వింత కొనక
విషయ వాంఛల వెంటనే వేళ్ళు వాయె ......
యుక్త మధ్యమ వృద్ధాప్య యుజ్వలమ్ము
త్యాగ బుద్ధియు ఉన్నచో తృప్తి గనుము
శక్తి అంతయు ఖర్చుగా శపధ మాయె
తార తమ్యము తెలిసికో తప్పు గనుము ........
దేహ కాంతియు వృద్ధాప్య దీనబందు
మేధ శక్తియు వృద్ధాప్య మోక్ష మిచ్చు
మూడు కాళ్ళను మోసియు ముందు నడుచు
చూపు మంద గిస్తుందని చూసి నడుచు ........
ప్రకృతి మౌనముండినదని ప్రభల తీరు
వికృతి తాండవించినదని వీనులగుట
సుకృతి ఇదియును అదియును శుభము కలుగు
ఎశృతి విన్నను మంచిని ఎంచి కదులు ......
మనకు నైతిక భౌతిక మలుపు లుండు
మనము అద్భుత ఆనంద మార్గ ముండు
మనసు చట్రంలొ చిక్కితే మాయ మెండు
మనమె ఆచార సంస్కృతి మనసు నందు
నీలొ నమ్మక వ్యవస్థ నియమ మగుట
కాల నిర్ణయ మార్పులు కధల మెండు
హోళి ఆడేటి కాంక్షయు హాయి తెలుపు
జాలి చూపియు సంపద జడ్జ్య మెండు
--(())--
No comments:
Post a Comment