Friday 22 May 2020

శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము




🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 79 / 🌻. చతుర్థ దత్తావతారము 🌻 


 ☘. శిష్య బృందం - 4 ☘

🌸. లక్ష్మి నృసింహ శాస్త్రి 🌸

     ప్రభు భక్తిలో మమేకమైన ఈ శాస్త్రి ఆంధ్ర ప్రాంతంలో నివసించేవారు. ప్రభు యొక్క కీర్తి మహారాష్ట్ర, కర్ణాటకలోనే కాక ఆంధ్రలో కూడా వ్యాపించింది. 

లక్ష్మి నృసింహ శాస్త్రి ప్రభు కీర్తి విని మాణిక్ నగర్ కి వెళ్లి ప్రభు దర్శనం అయిన తరువాత ఈయన వ్యవహారంలో మార్పు కలిగి ప్రియమైన భక్తులు అయ్యారు. ఆంధ్రాలో వీరు ప్రభు సంప్రదాయాన్ని ప్రచారం చేశారు.

🌸. రామన్నపంత్ దుబుల్ గుండి 🌸

      రామన్నపంత్ తన పన్నెండు సంవత్సరాల వయస్సులో ప్రభు దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రభు ద్రుష్టి వీరి వైపుకు మళ్లింది. అప్పుడు ప్రభువు నా దగ్గర ఉంటావా? అని అడిగారు. 

ఋణానుబంధం ఉంటే అలాగే కానివ్వండి అని సమాధానం ఇచ్చాడు. తరువాత మళ్ళీ మైలార్ గ్రామంలో ప్రభు దర్శనం అయ్యింది. ఆ సమయంలో ప్రభు వైపు మనస్సు లాగింది. ఈయన ఎప్పుడూ ప్రభు పాదుకలను సంరక్షించేవారు.

🌸. శరణ సాధువు 🌸

        శరణ అనే పేరుగల ఒక వైశ్య సాధువు ప్రభు భక్తులై ఉండిరి. ఆయన చిటుగుప్ప గ్రామంలో ఉన్నప్పుడు ఒకసారి సంకట పరిస్థితి వచ్చింది. అతనిని ఒక దొంగతనం విషయంలో జైలులో వేశారు. వాస్తవంగా ఆయనకు ఆ దొంగతనంతో ఏ సంబంధం లేదు. 

కానీ ఆ సాధువును ద్వేషించే కాశీనాథ్ అను పేరుగల మాంత్రికుడు రాజేశ్వర్ నవాబ్ కు చాడీలు చెప్పి సంకటంలో ఇరికించారు. నిరపరాధి అయిన శరణ్ జైల్లో నుండే ప్రభువును ప్రార్ధించాడు.

     అప్పుడు ప్రభువు స్వయంగా చిటుగుప్పకు వెళ్లారు. ప్రభు చిటుగుప్పకు స్వయంగా వెళ్లి రామ మందిరంలో దిగి నవాబుకు కబురు పంపించారు. శరణు నిరపరాధి అందుకని అతనిని విడిచిపెట్టమని చెప్పారు. 

నవాబుకు మాంత్రికునితో ముందే విషయం (చెడ్డగా) తెలియడం వలన ప్రభు చెప్పిన కూడా అతనిని విడుదల చేయలేదు. శరణుని విడిపించకుండా అక్కడ నుండి కదలకూడదని ప్రభు ఆలోచన. అందుకని అక్కడ ప్రభు మూడు రోజులు బస చేశారు. 

రాత్రి నవాబుకు స్వప్నంలో శరణుని విడవవలసిందిగా ఆజ్ఞ అయింది. ఆ ఆజ్ఞ ప్రకారంగా తాలూకుదారుకి హుకుం జారీ చేశారు. కానీ ఆరోజు శరణుని విడువలేదు. ఇక్కడ నవాబుకి మళ్ళీ స్వప్నంలో ఒక సాధువు కర్రతో కొడుతూ క్రిందకి పడవేశారు. వెంటనే నవాబు భయపడి శరణ్ ని వెంటనే విడుదల చేశారు.

🌸. రామక్రిష్ణపంత్ తహసీల్దార్ 🌸

       రామకృష్ణపంత్ తండ్రి శ్యామ్ రావ్. వీరు ప్రభువుపై చాలా భక్తితో ఉండేవారు. ప్రభు ఒకసారి మంగళగి గ్రామంలోని ఒక తోటలో కూర్చుని ఉన్నప్పుడు శ్యామ్ రావ్ కొడుకు రామకృష్ణపంత్ తండ్రితో పాటు ప్రభు దర్శనం చేసుకున్నారు. 

అప్పుడు చిన్నవారిగా ఉండిరి. ప్రభుతో పాటు ఎప్పుడూ వేల సట్కాలు (యోగదండములు) ఉండేవి. రామకృష్ణపంత్ ప్రభువుని ఒక సటకా ఇవ్వవలసిందిగా అడిగారు. ప్రభు భక్తులు తమ ఇంట్లో సర్వారిష్టాలు నివారించుటకు భక్తులు ప్రభు వద్ద సటకా అడిగి తీసుకొని ఎప్పుడూ తమ పూజలో పెట్టుకునేవారు. 

పిల్లవాడు సటకా అడిగాడని శ్యామ్ రావ్, రామకృష్ణపంత్ ను కోపగించసాగారు. కానీ, ప్రభు కరుణించి పిల్లవానిని ప్రక్కకు తీసుకొని వెళ్లి జామచెట్టు కొమ్మ తీసుకొని సటకా చేయించి ఇచ్చారు. 

ఆ సటకా ఇప్పటికీ రామకృష్ణపంత్ వాళ్ళ వంశీకులు పూజలో పెట్టి ఉంచడం వలన వారి వంశాభివృద్ధి జరిగింది. రామకృష్ణపంత్ కు చిన్న ఉద్యోగం లభించింది. ఉద్యోగానికి వెళ్లే ముందు రామకృష్ణపంత్ ప్రభు దర్శనానికి వచ్చారు. 

ప్రభు ప్రసాదం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇలా చెప్పారు. "ఎవరికీ అపకారం చేయకుండా ఎప్పుడూ మన శక్తి వంచన లేకుండా ఉపకారం చేస్తూండు. 

బాలా! నీకు తరువాత పెద్ద ఉద్యోగం దొరుకుతుంది. ఎవరికీ చెడు మాత్రం చేయకు". ప్రభు యొక్క ఈ వాక్యాలు జీవితాంతం వారి స్మృతిలో ఉండేవి.  తరువాత అతనికి తహసీల్దార్ గా ఉద్యోగం వచ్చింది.

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏


🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 80  /  SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 23 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻 
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ  

 ☘. శిష్య బృందం - 5 ☘

 🌸. విట్టల్ రావ్ తేర్ పల్లి 🌸

     ఈయన చాలా సామాన్య స్థితి నుండి తాలూకుదారై చివరి వరకు ప్రభుసేవ భక్తితో చేశారు.

🌸. రావ్ జీబువా 🌸

     గోపాల్ రావ్ జీ అనే యువకుడైన బ్రహ్మచారి ప్రభు సన్నిధికి వచ్చారు. రావ్ జీబువా యొక్క బుద్ధి కౌశల్యం చూసి ప్రభు అతనికి సమర్ధ రామదాసు విరచిత దాసబోధలోని కొన్ని ప్రకరణలు అర్ధయుక్తంగా చెప్పారు. రావ్ జీబువా ఆ గ్రంథాన్ని చివరివరకు పరిశీలన చేస్తూ ఉండిపోయారు.

🌸. చింతామణి బువా 🌸

       ఈయన ప్రభు నామస్మరణ చేస్తూ చాలా చోట్లకి తిరిగారు. వీరు ఎక్కడివారో, వీరికి సంబంధించిన విషయములు ఏవీ ఎవరికీ తెలియలేదు.

🌸. సంత్ రామ్ దాదాగవండి 🌸

    చింతామణిబువా లాగానే బయట తిరుగుతూ శిష్యగణాన్ని వృద్ధి చేయడంలో సంత్ రామ్ దాదా అత్యంత మహత్తరమైన పని చేశారు. ప్రభు సమాధి తరువాత సమాధి దేవాలయం కట్టే పని మొదలయినప్పుడు ఆ పని చేయడానికి సంత్ రామ్ దాదాను నియమించారు.

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏 


సశేషం.....


సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment