🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 182 / Sripada Srivallabha Charithamrutham - 182 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 22
🌴. గురుదత్తభట్టు వృత్తాంతము 🌴
🌻. జ్యోతిష శాస్త్రములో భక్తులకు జాతకఫలము కూర్చగలవారు శ్రీపాదులోక్కరే - 8 🌻
నరసింహవర్మకు యిదంతయునూ వింతగా నుండెను. అపుడు శ్రీపాదులవారు "తాతా! దీనిలో ఆశ్చర్యపోవలసినదేమియూ లేదు. వాయసపురాగ్రహారము నందలి ఒక పండితునికి సదా నాపై, "ఎంతటి అపచారము! వేదస్వరూపుడైన ఆ పరమాత్మ ఎక్కడ! పసికూన అయిన శ్రీపాదుడెక్కడా! ఇతడు సృష్టి, స్థితి, లయ కారకుడట. ఆదిమూలమాట. ఇదంతయునూ దంభము, అసత్యము.' అనువిధమైన ధ్యాస ఉండెడిది. ఈ మధ్యనే ఆ పండితుడు మరణించెను. వానికి బ్రహ్మరాక్షసత్వము కలిగెను. ఒకానొక జన్మమున శివయ్య ఆ పండితునికి కించిత్ ఋణపడి ఉన్నాడు. నేను యోగకాలమును కల్పించి యోగదేశముగా శ్మశానమును నిర్ణయించి యోగకర్మగా మోదుగకట్టెలతో దహన సంస్కారములను చేయించి ఆ పండితునికి బ్రహ్మ రాక్షసత్వము నుండి విమోచనము కలిగించినాను. మన శివయ్యను ఆ బ్రహ్మరాక్షసుడి బారి నుంచి రక్షించినాను." అని వివరించిరి.
నాయనా! శంకరభట్టూ! పీఠికాపురమున అవతరించిన యీ మహాతేజస్సు, ధర్మజ్యోతి నేడు యీ కురుంగడ్డను పవిత్రము చేయుచున్నది. శ్రీపాదుల వారి సంకల్పముననుసరించి గ్రహములు ఫలితముల నిచ్చుచుండెను. ఏ రకములయిన జ్యోతిష ఫలితములయిననూ నిర్దేశిత భౌతికాలము నందు భౌతికదేశము నందు జరిగి తీరవలెననెడి నియమము లేదు. అది యోగకాలమును బట్టి, యోగదేశమును బట్టి నిర్ణయింప బడుచుండెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 184 / Sripada Srivallabha Charithamrutham - 184 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 23
🌴. శివపూజా రహస్య వివరణము--1 🌴
🌻. శివయోగి భక్తిమహిమ - వారికి శ్రీపాదుల వారి ఉపదేశములు - 1 🌻
నేను కృష్ణ యీవల ఒడ్డు నుండి కురుంగడ్డకు ప్రయాణమగునంతలో ధర్మగుప్తుడను సద్వైశ్యుడు తారసిల్లెను.
అతను కూడా శ్రీపాదుల వారి దర్శనార్థము కురుంగడ్డకు వచ్చుచుండెను. ప్రసంగవశమున వారు పీఠికాపుర వాస్తవ్యులయిన శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి బంధువులని తెలిసినది. నాకు కలిగిన ఆశ్చర్యమునకు అంతులేదు.
నాకు తారసిల్లెడి శ్రీపాద శ్రీవల్లభుల వారి భక్తులందరునూ శ్రీపాదుల వారి దివ్య చరితమును, లీలలను, మహిమలను, వారు చేయు అద్భుత సంఘటనలను తెలియజేయుటలో ఒక్కొక్క ప్రత్యేకమైన వింత, విశేషత సంతరించుకొనియున్నవి. శ్రీవారి దివ్య చరిత్రలో ఒక్కొక్క సంవత్సరము జరిగిన వాటిలో కొద్ది సంఘటనలు మాత్రమే తెలియజెప్పబడెడివి.
అవి ఒకదానికొకటి ఎంత మాత్రమూ సంబంధము లేని వింతవింతలు. ఇదివరకెన్నడునూ నేను వినియుండని చిత్రవిచిత్ర సంగతులు. నాకు ఇప్పటివరకు శ్రీపాదుల వారి పది సంవత్సరముల వరకూ జరిగిన లీలా విశేషములు ఒక క్రమపద్ధతిలో వారి భక్తుల ద్వారా బోధింపబడినవి.
నేను నా మనసున యిట్లాలోచించుచుంటిని. ధర్మగుప్తులవారు శ్రీవారి 11వ సంవత్సరములో జరిగిన సంఘటనలను ఏవయినా నాకు తెలియజేతురేమోనని అనుకుంటిని. శ్రీపాదుల వారు క్షణక్షణ లీలావిహారి. అంతలోనే శ్రీ ధర్మగుప్తులు నాతో యిట్లు చెప్పనారంభించిరి.
అయ్యా!శంకరభట్టూ! నేను శివభక్తుడను. శ్రీపాదుల వారి 11వ సంవత్సరములో శివయోగి ఒకడు పీఠికాపురమునకు వచ్చెను. అతడు చాలా యోగ్యుడు. కరతలభిక్ష చేయువాడు.
తనయొద్ద ఏ రకమైన సంచిని గాని, కంచమును గాని, మరే పాత్రను గాని ఉంచుకొనువాడు కాడు. అతడు చూపరులకు పిచ్చివానివలె నుండెను. అతడు తొలుదొల్త శ్రీ కుక్కుటేశ్వరాలయమునకు వచ్చెను.
అతని పిచ్చివాలకమును, ధూళిధూసరిత విగ్రహమును చూచి అర్చకస్వాములు ఆలయములోనికి రానీయరైరి. అతడు దేహస్పృహయే లేని అవధూత.
అతడు మాటిమాటికీ శివపంచాక్షరి జపించుచుండెను. ఆ సమయమున నేను మాకు బావగారి వరుస అయిన వెంకటప్పయ్య శ్రేష్ఠి గారింటికి గుఱ్ఱము మీద వచ్చుచుంటిని. మార్గమధ్యమున శ్రీ కుక్కుటేశ్వరాలయమును దర్శించుట నాకు అలవాటు.
నేను వైశ్య ప్రముఖుడనయిన కారణమున అర్చకస్వాములు నా పేరిట ఘనమైన పూజను నిర్వహించిరి. వారికి మంచి సంభావనలనిచ్చుట నా అలవాటు. నేను అయిదు వరహాలను అర్చకస్వాముల కీయదలంచితిని. ఆ అయిదు వరహాలను అర్చకస్వాములు పంచుకొందురు.
వారి ఆర్థికపరమైన కష్టములను, వెతలను, బాధలను నాతో చెప్పుకొందురు. సనాతన ధర్మమును రక్షించుటకు మీ వంటి సద్వైశ్యుల అండదండలు అత్యంత ఆవశ్యకమనిరి.
ఇంతలో బయటనున్న శివయోగి విసురుగా లోనికి వచ్చెను. వానితో పాటు రెండు త్రాచుపాములు కూడా లోనికి ప్రవేశించినవి. అర్చకస్వాములకు ముచ్చెమటలు పట్టినవి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
అధ్యాయము 23
🌴. శివపూజా రహస్య వివరణము - 2 🌴
🌻. శివయోగి భక్తిమహిమ - వారికి శ్రీపాదుల వారి ఉపదేశములు - 2 🌻
ఆ శివయోగి, "అర్చకస్వాములారా! మీకు భయమేమియును వలదు. మనము ఆరాధించు కుక్కుటేశ్వరునకు యివి ఆభరణములు. తండ్రిని బిడ్డలు కౌగిలించుకొనునట్లు ఈ నాగుబాములు మన తండ్రియైన కుక్కుటేశ్వరుని కౌగిలించుకొనుటకు ఆతృతపడుచున్నవి.
అవి మనకు సోదరులతో సమానమైనవి. మనము మన సోదరులను జూచి భయపడుట, పారిపోవుట, లేదా చంపబూనుట మహాపాపము. అర్చకస్వాములు చేయు విశేషపూజ వలన అవి యిక్కడకు ఆకర్షింపబడినవి.
నాగాభరణుడైన కుక్కుటేశ్వరుని మనము మరింత శ్రద్ధగా ఆరాధించెదము గాక! నమకచమకములను సుస్వరముతో, రాగయుక్తముగా ఆలపించుడు." అనెను.
అర్చకస్వాములకు ఏమి చేయుటకునూ పాలుపోలేదు. అర్చకస్వాములకు కొంత వందిమాగధ జనముండెడివారు. అచ్చటికి వచ్చు భక్తజనులలో ఎవరయినా ధనవంతులైయుండి విశేషముగా సంభావనల నిచ్చువారయినచో వారిని సంతోషపెట్టు పెక్కు వచనములను పలికెడివారు.
ఈ అర్చకస్వాములలో పీఠికాపురములో నున్న సూర్యచంద్రశాస్త్రి అనునతడు మంచి పండితుడే గాక నిష్ఠ గల అనుష్ఠానపరుడు. అతనికి శ్రీపాదుల వారి యందు భక్తి ప్రేమలు మెండు.
అతడు శ్రీపాదుల వారిని స్మరించి నమకచమకములను సుస్వరముతో రాగయుక్తముగా ఆలపించుచుండెను. అచ్చటకు వచ్చిన నాగుపాములు కూడా రాగతాళ బద్ధముగా తమ పడగలను కదల్పుచూ తమ ఆనందమును వ్యక్తము చేసెను.
సూర్యచంద్రశాస్త్రి శివయోగిని బాపనార్యుల యింటికి తీసుకుని వచ్చెను. శివయోగికి సంతృప్తి కరమయిన భోజనమొసంగబడెను.
అనంతరము శివయోగికి శ్రీపాదుల వారి దర్శనము కూడా అయ్యెను. శ్రీపాదుల వారు వానికి శివశక్తిస్వరూపులుగా దర్శనమిచ్చిరి. ఆ శివయోగి మూడురోజుల పాటు సమాధిస్థితి నందుండెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 186 / Sripada Srivallabha Charithamrutham - 186 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 23
🌴. శివపూజా రహస్య వివరణము - 3 🌴
🌻. శివయోగి భక్తిమహిమ - వారికి శ్రీపాదుల వారి ఉపదేశములు - 3 🌻
మూడు రోజుల తరువాత శ్రీపాదుల వారు తమ దివ్యహస్తముతో వానికి అన్నమును తినిపించి, తదుపరి వానికి, "నాయనా! సనాతన ధర్మమునందు చెప్పబడిన ధర్మకర్మలనాచరించి తరించవలసినది. పురాణములందలి విషయములు కల్పనలు గాని, అసత్యములు గాని కానేకావు. వాటిలోని సామాన్య అర్థము వేరు. నిగూఢమైన రహస్యార్థము వేరు.
అనుష్ఠానము చేసెడి సాధకులకు మాత్రమే. దానిలోని అంతరార్థములు, నిగూఢ రహస్యములు, అంతఃకరణములో స్ఫురించును. ఋతుకారకులగు సూర్యచంద్రులలో సూర్యుడు పరమాత్మకు ప్రతీక కాగా, చంద్రుడు మనస్సుకు ప్రతీక.
చిత్సూర్యతేజస్సు, మనోరూపమయిన చంద్రుడును కూడిననే గాని సృష్టి కార్యము నెరవేరదు. అమావాస్య అనునది మాయకు ప్రతీక. ఈ మాయా స్వరూపమే ప్రథమమున వసువులు అనెడి పేరుగల కళలను సృజించుచున్నది.
చంద్రబింబమందు కళలను ప్రవేశపెట్టుట, తిరిగి వానిని తనయందు లయము చేసికొనుట జరుగుచున్నది. పరమాత్మ తేజస్సును మాయ మనోరూప చంద్రుని యందు ఏ విధముగా ప్రసరింపచేయుచున్నదో అదే విధముగా చంద్రుని యందు రవికిరణ ప్రసారము కలుగుచున్నది.
మాయయునూ, అమావాస్యయును జడస్వరూపములయిననూ వాని వలన పుట్టిన జగత్తు మాత్రము చిత్సాన్నిధ్యమును బట్టి చిజ్జడాత్మకమయినది. వసంతాది కాలార్తవము సృష్టికెట్లు కారణమగుచున్నదో స్త్రీల ఆర్తవము కూడ శిశుజనాదులకు కారణభూతమగుచున్నది.
బ్రహ్మ జ్ఞాన వాంఛ స్త్రీ యొక్క రజోజాత జీవగణమునకే యుండును. స్త్రీలయందుండెడి రజస్సు అనగా ఆర్తవము బ్రహ్మకు వ్యతిరేకమయినది గనుక ఇది బ్రహ్మహత్య వలన పుట్టినది అని పండితులు చెప్పెదరు.
ఛందస్సులచే కప్పిపుచ్చబడినది గనుక వేదరహస్యములను ఛాందసమందురు.
వంక లక్షణము ఆర్తవమునకుండును గావున ఋతిమతియైన స్త్రీని మూడు రోజులు దూరముగా నుంచెదరు. స్వర్గమనునది స్వతసిద్ధ కాంతి గల తేజోగోళము. మర్త్యలోకమనునది చావుపుట్టుకలు గల లోకము.
పాతాళములన్నియు సూర్యకాంతి వలననే కాంతివంతములగుచున్నవి గనుక వీనికి పృశ్నులు అని పేరు. సప్త పాతాళములకునూ జాతవేదాది అధిష్ఠాన దేవతలు కలరు. మనము నివసించు భూమి ఈ సప్తపాతాళములకునూ ముందున్నది. దీనికి అగ్నియను వాడు అధిదేవత.
ఈ ఎనమండుగురు అధిదేవతలకునూ అష్టవసువులని పేర్లు గలవు. సూర్యకాంతి వలన శోభను పొందెడివారు గనుక వీరిని వసువులని పిలుచుచున్నారు. ఈ ఎనిమిది గోళములకునూ మధ్యనున్న వాయుస్కంధములను సప్తసముద్రములందురు.
వాయువులకు సముద్రము అనెడి సంజ్ఞ కలదని యాచ్యమహర్షి సెలవిచ్చెను. సామాన్య మానవులు సప్తసముద్రములను జలస్వరూపముగా భావింతురు కాని అది సరికాదు." అని తెలియజేసిరి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 187 / Sripada Srivallabha Charithamrutham - 187 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 23
🌴. శివపూజా రహస్య వివరణము - 4 🌴
🌻. శివమహిమ, ఆంద్రప్రదేశమందలి ఏకాదశ శివ క్షేత్రములలోని శివ స్వరూపములు 🌻
శివుడు ఏకాదశ రుద్రస్వరూపము. ఆంద్రదేశము నందు పదునొకండు శివ క్షేత్రములు కలవు. వాటి దర్శనము మహాఫలమునందించును.
అవి 1) బృహత్ శిలానగరము నందలి నగరేశ్వరుడు 2) శ్రీశైలము నందలి మల్లికార్జునుడు 3) ద్రాక్షారామము నందలి భీమేశ్వరుడు 4) క్షీరారామము నందలి రామలింగేశ్వరుడు 5) అమరావతి నందలి అమరలింగేశ్వరుడు 6)కోటీఫలీ క్షేత్రము నందలి కోటీఫలీశ్వరుడు 7) పీఠికాపురము నందలి కుక్కుటేశ్వరుడు 8) మహానంది యందలి మహానందీశ్వరుడు 9) కాళేశ్వరము నందలి కాళేశ్వరుడు 10)శ్రీకాళహస్తి నందలి కాళహస్తీశ్వరుడు మరియు 11) త్రిపురాంతకము నందలి త్రిపురాంతకేశ్వరుడు.
వాస్తవమునకు శివునకు మూర్తి లేదు. శివలింగము ఆత్మలలో వెలిగే జ్యోతిస్వరూపము గాక మరేమియు కాదు. సిద్ధి కలిగిన తదుపరి నిర్మలమనస్సు రూపములో నుండెడి నిర్మలతయే స్ఫటిక లింగము.
మన శిరస్సులో ఉండే మెదడులో మనలో జ్ఞానము కలుగుటకు సహకరించు రుద్రుడే కపాలి అనబడును. మెదడు నుండి నరముల రూపములో మెడ క్రింది వరకూ వ్యాపించి యుండు నాడులను రుద్రజడలందురు. శివుని హఠయోగి రూపములో లకులీశుడందురు.
శివుడు భిక్షాటనము చేసి జీవుల పాపకర్మలను హరించును. ఈ సృష్టియందు రాగతాళ బద్ధమయిన సృష్టి, స్థితి, లయములనెడి మహాస్పందనల కనుగుణంగా ఆనంద తాండవమును చేయును గనుక శివుని నటరాజు అని అందురు.
శివుడు పరమానందకారకమైన మోక్షసిద్ధిని కూడా యీయగలడు. చిత్ అనగా మనస్సు, అంబరమనగా ఆకాశము లేక బట్ట. ఆకాశ రూపములో ఉండువాడే చిదంబరుడు.
నీవు చూచెడి యీ విశాల విశ్వములోని రోదసీస్వరూపము రుద్రస్వరూపమే! ద్వాదశ జ్యోతిర్లింగములు రాశి చక్రములోని 12 రాసులకు ప్రతీకలు. కనుక శివుడు కాలస్వరూపుడు. అష్ట దిక్కులు ఆ అష్టమూర్తి యొక్క చిదాకాశ స్వరూపమే. పంచభూతములు అతని పంచముఖములు.
పంచజ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు కలిసి ఏకాదశ రుద్ర కళలగుచున్నవి. వీరినే ఏకాదశ రుద్రులందురు. ఉమామహేశ్వర రూపము నిత్యప్రసన్న రూపము.
త్రిగుణములను భస్మం చేసిన రూపమే త్రిపురాంతకరూపము. జ్ఞాననేత్రమే మూడవకన్ను సమాధిస్థితిలో ప్రసన్నమైన ధ్యానములో నుండగా నిరంతరాయముగా ప్రవహించు పవిత్రతయే శివజటాజూటములోని ఆ పరమపావని గంగామాత.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 188 / Sripada Srivallabha Charithamrutham - 188 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 23
🌴. శివపూజా రహస్య వివరణము - 5 🌴
🌻. శివమహిమ, ఆంద్రప్రదేశమందలి ఏకాదశ శివ క్షేత్రములలోని శివ స్వరూపములు - 2 🌻
అది మిధునమైన శివపార్వతుల స్వరూపమే మిధునరాశి. ఆర్ధ్రా నక్షత్రం ఆకాశంలో వెలుగుతున్నప్పుడే శివుడు దర్శనం యిస్తాడు. మిధునరాశిని సమీపించుటకు ముందు వృషభరాశిని దాటి వెళ్ళవలెను గదా! ఆ వృషభమే నందీశ్వరుడు. అది ధర్మస్వరూపము.
భ్రూమధ్యమున వెలిగే జ్యోతియే లలాట చంద్రకళ! యోగస్థితి వలన ఏర్పడే కామజయము వలన స్త్రీ పురుష భేదము నాశనమై ఏకత్వ స్థితిని పొందుచున్న స్వరూపమే అర్థనారీశ్వరరూపము.
సహస్రారంలో లింగోద్భవకాలములో కర్పూరకళిక భగవత్ జ్యోతిగా వెలుగుతూ ఉంటుంది. లింగమనగా స్థూల శరీరములో లోపల దాగియుండే లింగశరీరం. ఇది జ్యోతిరూపంలో వెలుగుతూ ఉంటుందని వేదము చెప్పుచున్నది.
శివపూజారహస్యములు అనుష్ఠానము చేతను, గురుకటాక్షము చేతను మాత్రమే తెలుసుకొన వీలు కలుగును. భౌతికరూపమైన పీఠికాపురమెట్లుండునో జ్యోతిర్మయి స్వరూపమైన స్వర్ణపీఠికాపురమనునది ఒకటున్నది.
అది నా చైతన్యముచే నిర్మితమయినది. దానిని నన్ను నిరంతరము స్మరించే భక్తులు, జ్ఞానులు అనుభవముతో తెలుసుకొనగలరు. వారు ఎంతెంత దూరములలో ఉన్ననూ స్వర్ణ పీఠికాపురవాస్తవ్యులే అగుదురు. వారికి నేను సర్వదా సులభుడను.
భౌతిక పీఠికాపురములోని కుక్కుటేశ్వరాలయము నందు నీవు చూచిన అర్చకస్వాములు ప్రమధ గణముల అంశచే జన్మించినవారు. భూతప్రేత పిశాచాది మహాగణములు ఎన్నియో ఉండును.
యోగాభ్యాసము చేయుకొలదినీ, శ్రీపాద శ్రీవల్లభుని ఆరాధించు కొలదినీ, ఆయా భూతప్రేతములు అలజడి సృష్టించుచునే యుండును. ఈ అడ్డంకులను దాటి నన్ను చేరువారు ధన్యులు. నా పేరిట మహాసంస్థానము మా మాతామహ గృహమున ఏర్పడితీరునని అనేక పర్యాయములు చెప్పితిని.
నా సంకల్పము అమోఘము. చీమలబారుల వలె లక్షోపలక్షల భక్త గణములు, యోగి గణములు నా సంస్థానమును దర్శించగలరు. ఎవరు, ఎప్పుడు, ఎంతమంది, ఏ విధానముగా రావలయునో నేనే నిర్ణయించెదను.
పీఠికాపుర వాస్తవ్యులయినంత మాత్రమున శ్రీపాద శ్రీవల్లభుని సంస్థానమునకు వచ్చి దర్శనము పొందగలరనుకొనుట సర్వకల్ల. నా అనుగ్రహము యోగ్యులపై అమృత వృష్టి కురిపించును. అయోగ్యులకు అది ఎండమావివలె నుండును.
శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!
(అధ్యాయము 23 సమాప్తము)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 211 / Sripada Srivallabha Charithamrutham - 211 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయం 38
🌻. బైరాగి కథనం (బగళాముఖీ) (శ్రీపాదులకు 14ఏళ్ళు) 🌻
మాకు దారిలో రావిచెట్టు కింద కూర్చున్న ఒక బైరాగి కన్పించారు. ఆయన ముఖం ఎంతో తేజోవంతంగా ఉంది.
వారు మమ్మల్ని మీరు శంకరభట్టు, ధర్మగుప్తులేనా? అని అడిగి మేము ఔనని చెప్పడంతో మీ దగ్గర ఉన్న పాదుక లను నాకు ఇచ్చి నా దగ్గరున్న కాలనాగమణిని తీసుకో మని చెప్పారు.
తరువాత తాము బగళాముఖీ ఉపాసకుడనని చెప్పి ఆదేవి గురించి ఇలా వివరించారు," బగళాముఖీ దేవి దశమహా విద్యలలో ఒకటి. ఈ దేవి ఆరాధన వలన వాక్సిద్ధి కలుగు తుంది. సత్యయుగంలో సమస్త జగత్తును నాశనం చేసేంత తుఫాను వచ్చింది.
విష్ణుమూర్తి చింతాక్రాంతుడై జీవులను రక్షించడానికి తపస్సు చేసారు. శ్రీవిద్యామహాదేవి బగళా ముఖీ రూపంలో దర్శనమిచ్చి ఆ భయంకరమైన తుఫా నుని స్తంభింపచేసింది.
మంగళవారం చతుర్దశి అర్ధరాత్రి ఈమె ఆవిర్భవించింది. సాధకుని జీవితంలో అల్ల కల్లోలం లేపే దుష్ట శక్తులని, అంధశక్తులని స్తంభింపచేసి సాధకుని పురోగతికి తోడ్పడుతుంది.
విష్ణువు, పరశు రాముడు ఈ దేవి ఉపాసకులలో ముఖ్యులు," అని చెప్పి పీఠికాపురంలో తమ అనుభవాలని చెప్పడం మొదలు పెట్టారు,
"నేను నా తీర్థయాత్రలలో పీఠికాపురంలోని కుక్కు టేశ్వరాలయా నికి వెళ్ళాను.
అక్కడ ముద్దులు మూటగట్టే మూడేళ్ళ బాలుడు కనిపించి తాను చాలా కాలంనుండి ఈ మధ్య కాలంవరకు స్వయంభూదత్తుడి పేరుతో లోపల బందీయై ఉన్నానని, అర్చకులు శీతలోపచారాలు సరిగా చేయడానికి తిరస్కరిం చడంతో బయటకు వచ్చేసానని చెప్పాడు.
నాకు వారు దత్తులని, కర్మఠులైన బ్రాహ్మణులు అస్పృశ్యులను లోనికి రానీయకపోవటంవల్ల ఖిన్నులైన దత్తప్రభువులు ఆర్తులను రక్షించడానికి స్వయంగా అవతరించారని తెలిసింది.
నేను వారిని బగళాముఖీ రూపంలో దర్శనమిమ్మని అడిగాను. శ్రీపాదులు ఆ దేవి రూపంలో దర్శనమిచ్చారు.
పీఠికాపురం - అపప్రథల నిలయం
ఆ మహాతేజస్వరూపిణిని చూడగానే ఎనిమిది రోజులు ఒళ్ళు తెలియని బ్రహ్మానంద స్థితిలో ఉండిపోయాను.
ఊరిలో నేనొక క్షుద్ర మాంత్రికుణ్ణని, ఏదో ప్రయోగంద్వారా కుక్కుటేశ్వరుని, స్వయంభూదత్తుని శక్తిని అపహరించ బోయానని, కాని పూజారుల నియమనిష్ఠల వల్ల అది బెడిసికొట్టి, మూర్ఛలో పడి ఉన్నానని వదంతులు పుట్టి అర్చకస్వాముల ప్రాముఖ్యత పెరిగి పోయింది.
అర్చక స్వాములతో విశేష పూజలు చేయించు కొన్నట్లయితే అరి ష్టాలన్నితొలగిపోయి ఇతోధిక శ్రేయస్సు కలుగుతుందనే ప్రచారం ఉద్ధృతం అయ్యి పీఠికాపుర వాస్తవ్యులు వేలం వెర్రిగా అర్చకస్వాములతో పూజలు చేయించుకోవడం మొదలు పెట్టారు. అర్చకులకు పెద్ద మొత్తంలో దక్షిణలు దొరకసాగాయి.
అయితే ఇంటికి తెచ్చుకున్న ధనం తెల్లవారే సరకి మాయం అయ్యేది. అందరికి అర్చనలు చేయించ డానికి ఒప్పుకొని కష్టపడి పూజలు చేయించడమే అవు తుంది తప్ప వారికి ఫలితం శూన్యంగా ఉంది.
మనసు విప్పి వారి గోడు ఎవ్వరితోనూ చెప్పు కోలేరు. ఎందుకంటె ఈ విషయం కనుక బయటికి పొక్కితే కొత్త గానూ అపురూపం గానూ దొరుకుతున్నవారి గౌరవం దెబ్బ తింటుంది.
వాళ్ళ ఇబ్బంది ఇలా ఉండగా, నా విషయం పెద్ద చర్చనీయాంశం అయ్యింది, ఈ బైరాగి బ్రతికి ఉన్నాడా? మరణించాడా? దహనం చేస్తే మంచిదా? చేస్తే బైరాగి శక్తులు ఇంకా విజృంభిస్తాయా? అనే మీమాంసలో మొత్తానికి నా శరీరాన్ని దహనం చేయడం జరగలేదు. ఇదంతా శ్రీపాదుల విచిత్ర లీల.
ఎనిమిదవ రోజు నేను స్పృహలోకి వచ్చాను. బ్రాహ్మణులు ఎవ్వరు భిక్ష ఇవ్వకపొవడంతో నన్ను గొల్లవారి వాడలో ఉంచారు. అందులో ఒక గొల్లవనిత పేరు లక్ష్మి. ఆమెకు ఇటివలె వైధవ్యం సంప్రాప్తించింది.
శ్రేష్ఠిగారి ఇంటి ఆవు వట్టి పోవడంతో లక్ష్మి వారి ఇంటికి పాలు తీసికొని వెళ్ళేది. శ్రేష్ఠిగారి ఇంటిలో శ్రీపాదులు ఈ పాలను తాగుతుండేవారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[06:28, 15/07/2020] +91 98494 71690: 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 216 / Sripada Srivallabha Charithamrutham - 216 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయం 40
🌻. భాస్కరశాస్త్రితో బహుముఖ గోష్ఠి 🌻 (శ్రీరాజరాజేశ్వరిదేవి)
మేము వీలునుబట్టి అనేక ప్రయాణ సాధనాల ద్వారా ప్రయాణం చేస్తూ త్రిపురాంతకం అనే పుణ్యక్షేత్రం చేరాము.
ప్రభువుల పాదుకలు మాతో ఉండటంతో వారు మాతోపాటు ప్రయాణం చేస్తున్నట్లు, మమ్మల్ని వారే ముందుకు నడి పించుతున్నట్లు, మేము మాట్లాడే మాటలు కూడా వారే పలికిస్తున్నట్లుగా మాకు ఒక వింత అనుభూతి కలుగు తుండేది.
త్రిపురాంతకంలోని అర్చకస్వామి భాస్కరశాస్త్రి గారు పీఠికాపుర వాస్తవ్యులు, శ్రీషోడశీ రాజరాజేశ్వరి ఉపాసకులు.
వారికి శ్రీపాదులు కలలోనే శ్రీరాజరాజేశ్వరిదేవి మంత్రదీక్షను ఇచ్చారట. మేము శ్రీచరణుల పాదుకలను వారి పూజా మందిరంలో ఉంచాము. వెంటనే ఆ పాదుకల నుండి దివ్యవాణి వినిపించింది.
🌻. శ్రీపాదుల దివ్య భవిష్య వాణి 🌻
"నాయనలారా! మీరెంతో ధన్యులు. భాస్కరశాస్త్రి ఈ పాదుక లను కొంతకాలం పూజించిన తరువాత ఈ రాగి పాదుకలు బంగారు పాదుకలుగా మారిపోతాయి.
మహాపురుషులు కొందరు వీటిని హిరణ్యలోకం, కారణలోకం తీసికొని పోయి అర్చనాదికాలు చేసిన తరువాత మహాకారణలోకంలో ఉన్న నా దగ్గరకు తీసుకొని వస్తారు.
నేను వాటిని ధరించి ఈ మూడు లోకాల సిద్ధులను, మహాపురుషులను ఆశీర్వ దించాక వాటికి దివ్యతేజోమయ సిద్ధి కలుగుతుంది.
తరువాత వీటిని సిద్దపురుషులు స్వర్ణ విమానంలో తీసు కొని వెళ్ళి శాస్త్రోక్తంగా నా జన్మస్థలంలో భూమికి 300 నిలువు లోతున ప్రతిష్ఠిస్తారు. యోగదృష్టి కల వారికి మాత్రమే ఈ స్వర్ణ పీఠికాపురపు ఉనికి తెలుస్తుంది.
సరిగ్గా ఈ స్వర్ణ పాదుకలకు పైన పీఠికాపురంలో నా పాదుకలు ప్రతిష్ఠింపబడుతాయి". దివ్యవాణి చెప్పిన విషయాలు విని మేమెంతో ఆనందించాము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 222 / Sripada Srivallabha Charithamrutham - 222 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయం 42
🌻. మొట్టమొదటిసారిగా పీఠికాపురవాసుల చేత దత్త దిగంబర ! దత్త దిగంబర ! శ్రీపాద వల్లభ దత్త దిగంబర ! " అనే నామస్మరణ ప్రారంభించబడి, విశ్వమంతా విఖ్యాతమవడం. 🌻
భాస్కరశాస్త్రి ఇంకా ఇలా చెప్పసాగారు :
శ్రీపాదులవారు ఏకరాత్రి దత్త దీక్షలను శూద్ర గృహంలో ఇవ్వడం, అంతర్ధానం అవడం, పీఠికాపురంలో చర్చనీయాంశమయ్యింది.
కొందరు బ్రాహ్మణులు పైకి సానుభూతి ప్రకటిస్తూ, బాపనార్యులవారి, శ్రీపాదులవారి, శ్రేష్ఠిగారి. వర్మగారి ఇళ్ళకు వెళ్ళి, ప్రతిచోటా అందరూ మహదానందంతో ఉండడం, ఇంకా శ్రీపాదులు తమతో నిరంతరం స్థూల దేహంతో వారి వద్దనే ఉన్నారని చెప్పడంతో, పరిస్థితులు ఊహించిన దానికి భిన్నంగా ఉన్నాయని భావించారు. దత్త దీక్షలను ఇచ్చిన సన్యాసికి ఇది అంతా గుండెలలో గుబులు పుట్టించసాగింది.
ఇంతలో సన్న్యాసి దగ్గరకు మహారాష్ట్ర దేశం నుంచి నరసింహఖాన్ అనే వృద్ధ
బ్రాహ్మణుడు వచ్చి, తన దగ్గర ఉన్న వరహాలను దక్షిణగా సమర్పించి, దత్త దీక్షను కోరాడు. సన్న్యాసి దీక్షను ఇవ్వడానికి అతని చేతిలో నీటిని పోయగానే ఒక తేలు కూడా వచ్చింది.
వృద్ధ బ్రాహ్మణుడు సన్న్యాసితో... అతని తపఃఫలాన్ని అతడు తనకు ధారపోశాడు, తాను దానిని పీఠికాపురానికే ధారపోస్తున్నానని చెప్పి... అదృశ్యుడయ్యాడు.
ఇంతలో ఒక బ్రాహ్మణుడు తేలు కుట్టిందని అరిచాడు. తేలు మంత్రం వేసినా, అభిషేకాలు చేసినా, ఎన్ని
ప్రయత్నాలు చేసినా బాధ తగ్గలేదు. అతని నోటిలో నుండి నురగలు వచ్చి, కుట్టింది తేలు కాదు పాము అనుకున్నారు. రకరకాల వదంతులు మొదలైనాయి. చివరకు దయ్యం అన్నారు. ఆ దెయ్యం నుంచి తప్పించుకోడానికి ప్రతి ఇంటి ముందు ఓదెయ్యమా ! రేపు రా! అని వ్రాసారు.
వెంకయ్య అనే పంటకాపు... శ్రీపాదులవారు ఇచ్చిన మంత్రాక్షతలను తేలు కరచిన వాడికివ్వగానే... అతడు బాగయ్యాడు.దీనితో అందరికీ ఆ సన్యాసి మీద నమ్మకం పోయి,అతని దగ్గర ఉన్న దక్షిణ అంతా తీసుకొని పంపించేశారు.
ఆ ధనంతో అష్టాదశ వర్ణాల వారికి కుక్కుటేశ్వర ఆలయానికి ఎదురుగా , అన్న సంతర్పణ జరిగింది. మొట్ట మొదటిసారి జనులందరూ " దత్తదిగంబర!దత్తదిగంబర!శ్రీపాద వల్లభ దత్త దిగంబర!" అనే దివ్యనామాన్ని జపించారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sripada Srivallabha Charithamrutham - 222 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj
🌻 Sripada can prevent prarabdha karma and death also 🌻
Thus he explained. My Dear! Shankar Bhatt! The same Maha Tejas (the grand effulgence) the dharma jyothi, which took birth in Peethikapuram is now making this Kurungadda sacred.
The planets give results according to the ‘will’ of Sripada. There is no rule that the results in horoscope will materialize in a particular physical time or a physical place. That will be decided by the yoga kalam and yoga desam.
Sripada can make the incidents, which are supposed to happen after 1000 years according to horoscope, happen now itself.
That means he can decide the yoga kalam now itself. Things that are destined to happen in a some far of place, will happen here if He wills.
That means he can decide the yoga desam also. All incidents happen in ‘time and place’ (kaalam and desam). Sripada can change those ‘times and places’ at His ‘will’.
Once in Shresti’s house, at the time of breaking a coconut while worshipping God, Sripada Himself broke the coconut into pieces. The coconut was full of blood.
Sripada said, ‘Thatha! Today there is a death yogam to you. Your head was supposed to break into pieces and blood should have flowed.
I invoked those ‘time and place’ into this coconut and saved you. Every one was surprised.’ Meanwhile it became dusk.
All three of us took leave of Sripada, left Kurungadda and reached the other shore of Krishna river.
End of Chapter 22
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sripada Srivallabha Charithamrutham - 216 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj
CHAPTER 22
🌻 The Story of Gurudatta Bhatt Only Sripada will give the fruit written in Horoscope - 1 🌻
Gurucharana, Krishna Dasu and myself were in an extremely happy ecstacy in the presence of Sripada.
One astrologer by name Guru Datta Bhatt had already come for Sripada’s darshan. Sripada received him with honours. He ordered us to sit at a peaceful place and do satsang. Our conversation turned to astrology.
I asked Sri Bhatt Mahasay, ‘Sir, will the results said in astrology happen definitely or will there be any change or addition in the results? or will it depend on human effort?’ Sri Bhatt Mahasay said, ‘Bha’ chakram means the orbit of stars. The starting point is Aswini Star.
To determine the place of this star, there are two methods ‘chitra paksham’ and ‘raivatha paksham’. Revathi star stays in a place 8 kalas less than its original position, so it can not be understood. It is difficult to identify the Aswini star.
Chitta star, which is 180 ‘amsas’ (amsa is part of 1 sign of the zodiac in horoscope) from Aswini star, is conspicuous as a single globe and shines clearly. So adding 6 rasis, it will be Aswini star.
So chaitra paksham can be understood easily. Aswini star is found to be the confluence of three globes called ‘Turaga mukhaswini Shreni’ (Aswini ranges having the shape of a horse face). There is also a special reason for Sripada taking birth in Chitta star.
Aswini star having three globes and looking as one star is also His form. That is the starting point of ‘Bha’ chakram. That is His Dattatreya form. His first avathar in kaliyugam is Sripada Srivallabha avathar.
Chitta star is the janma star of Sripada. It’s poisiton is at a distance of 180 amsas from Aswini star and is parallel to it. The power of any star or planet gets concentrated at a distance of 180 amsas.
Human being gets born in the constellation of planets, mathematically suitable to the ‘prarabda’ gained in previous janma. The planets will not have any feeling of love or hatred towards human beings.
The different rays and vibrations emanating from them will have the power to cause the incidents to jeevas in appropriate place, and appropriate time.
To escape from the undesirable results, we should have the suitable vibrations and rays which can stop those vibrations and rays coming from the planets.
This power can be acquired by mantra tantras, dhyanam and prayers or yoga Shakti acquired by self effort.
But if the karma of previous birth is extremely strong, the above methods do not work. In such situations, only Sripada can rewrite our fate.
For him to write in that way, there must be a situation where some good work was supposed to be done by us for the welfare of the society. In ordinary situations, it will not happen.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 217 / Sripada Srivallabha Charithamrutham - 217 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. శ్రీ రాజరాజేశ్వరీ దేవి 🌻
తరువాత మేము భాస్కరశాస్త్రిని రాజరాజేశ్వరీదేవి గురించి తెల్పమని ప్రార్థించాము.
"రాజరాజేశ్వరిదేవి మన మనస్సుకు, ఇచ్ఛకు పైన ఉన్న విశాలమైన సీమలో ఆసీనురాలై ఉంటుంది. ఆలోచించే మన మనస్సు సాధారణంగా మేధాశక్తిగా మారు తుంది. ఆ మేధాశక్తిని వివేకవంతం చేయడానికి ఈ దేవి సహాయం చేస్తుంది. సాధారణంగా శక్తి, వివేకం కలిసి ఉండవు.
కాని రాజరాజే శ్వరీదేవి శక్తితో కూడిన వివేకాన్ని, వివేకయు తమైన శక్తిని ప్రసాదిస్తుంది. రాజరాజేశ్వరీ శక్తిని పెంపొందించు కున్న సాధకులు తమ వివేకబలంతో విరోధి శక్తులను నిర్మూలించ గల్గుతారు.
ఆమె దృష్టిలో అందరూ తన బిడ్డలే, అసురు లను, రాక్షసులను, పిశాచాలను కూడా తన బిడ్డలుగానే పరిగణి స్తుంది. ఆమె శక్తికి ఙ్ఞానమే కేంద్రం. అందువల్ల ఆమె అనుగ్రహం కలిగితే సత్యబోధ కలుగుతుంది.
నేను శ్రీపాదుల దయకు పాత్రుడనైనందున నాకు రాజరాజేశ్వరీ దీక్షలో సఫలత ప్రాప్తించింది," అని దేవి గురించి వివరించి శ్రీపాదులు ఎలా పీఠికాపురంనుండి సంచారానికి బయలు దేరారో తరువాత చెప్తానని, మేమిద్దరం అక్కడకు చేరే ముందే శ్రీపాదులు రాజరాజేశ్వరి రూపంలో దర్శనమిచ్చి తాను చేసిన పులిహోర కొద్దిగా స్వీకరించారని, శ్రీపాదులు సాక్షాత్తు మహాసరస్వతీ, మహాలక్ష్మి, మహాకాళీ, రాజరాజేశ్వరీ స్వరూపులని చెప్పి ఆ ప్రసాదాన్ని మాకు కూడా ఇచ్చారు. తరువాత మేము ముగ్గురం ధ్యానస్థులం అయ్యాము.
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే

🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 189 / Sripada Srivallabha Charithamrutham - 189 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 24
🌴. శివుని ఆయుధాల విశిష్టత - 1 🌴
తరువాత నేను శివుని ఆభరణాలు, ఆయుధాలకి సంబం ధించి ఏదైనా అంతరార్థం ఉందా? అని ధర్మగుప్తులని ప్రశ్నించాను. దానికి వారు ఈ వివరణ ఇచ్చారు: "గణపతికి పాశాంకుశాలు, విష్ణువుకి సుదర్శన చక్రం ఎలాంటి ముఖ్య ఆయుధాలో శివునికి త్రిశూలం అలాంటి ముఖ్య ఆయుధం.
త్రిశూలానికి మూడు కొనలుండి అడుగున వాటిని కలుపుతూ శూలహస్తం ఉంటుంది. మూడు కొనలు సత్వ, రజస్, తమో గుణాలను సూచిస్తే ఆ శూలహస్తం వాటి ఏకత్వాన్నిసూచిస్తుంది.
ఇక్కడ త్రిగుణాల ఏకత్వం అంటే వాటికి అతీతమైన తత్త్వం అని అర్థం. అంతేకాకుండా ఇడ, పింగళ, సుషుమ్ననాడులు మూడూ శిరస్సులోని జ్ఞాన కేంద్రం దగ్గర కలుస్తాయి. దీన్నే త్రివేణి సంగమం అంటారు.
ఆ మూడు నాడులు మూడు కొనలని సూచిస్తే జ్ఞానకేంద్రం శూలహస్తాన్ని వాటి ఏకత్వం త్రిగుణ సంగమాన్ని సూచి స్తుంది. ఆకాశం శబ్ద గుణంతో కూడుకొని ఉంది. ఆకాశంలో ధ్వనుల ప్రకంపనలు ప్రయాణం చేస్తుంటాయి.
మనం పవిత్ర మైన మంత్రాలను శ్రద్ధాసక్తులతో చదివేటప్పుడు కాని, వినేట ప్పుడు కాని వాటినుండి మధురమైన ఢమరుక నాదం వినిపిస్తుంది. యోగులకు ఇది మహదానందాన్ని కలిగి స్తుంది.
దీన్ని సూచిస్తూ శివుని త్రిశూలానికి ఢమరుకం కట్టి ఉంటుంది.
సర్పిలాకారంలో ఉండే కుండలినీశక్తిని సూచిస్తూ శివుడు సర్పాలను మెడలో ధరిస్తారు. అందుకే నాగాభరణుడు అనే పేరు ఉంది.
ఈ కుండలినీ శక్తి విజృభించినపుడు అష్ట సిద్ధులు కలుగుతాయి. ఈ అష్టసిద్ధులు శివుని నియం త్రణలో ఉండటం వల్ల, వారు అష్టసిద్ధులకు ప్రభువు అవడం వల్ల ఆయన్ని ఈశ్వరుడు అని పిలుస్తారు. ఈశ్వరుడు అనే పదానికి ప్రభువు అని అర్థం.
జ్ఞానికి యోగదృష్టి కలగ డానికి, భూత, భవిష్యత్, వర్తమానాలు గ్రహించడానికి ఆజ్ఞాచక్రం వికసించాలి, అది వికసించిన దన్న సంకేతమే శివుని మూడోకన్ను.
తాంత్రిక సిద్ధులు పులిలా భయంకరమైనవి. వాటిని పూర్తిగా లొంగదీసి తమ అధీనంలో పెట్టుకున్నానని తెలుపుతూ శివుడు వ్యాఘ్రచర్మం ధరిస్తారు.
నిర్మలమైన బ్రహ్మ జ్ఞానానికి, అమృతత్త్వ సిద్ధికి పరమ పావని గంగ సంకేత మయితే నిత్య ప్రసన్నత్వంవల్ల కలిగే ప్రశాంత ఆనందాన్ని నెలవంక సూచిస్తుంది.
స్త్రీ పురుషులు ఇద్దరిలోను స్త్రీ, పురుష తత్త్వాలు రెండూ కలిసే ఉంటాయి. శరీరం కుడిభాగంలో ఉండే శక్తి పురుష శక్తి, ఎడమభాగంలో ఉండే శక్తి స్త్రీశక్తి.
ఈ శక్తుల అవిచ్ఛిన్న సంయోగమే అర్థనారీశ్వరత్వం. ఇంతేకాక కాలచక్రం కూడా అర్థనారీశ్వర తత్త్వమని, ఎన్నడూ విడదీయరాని జంట అని తెలుసుకోగలగాలి. రాత్రి-పగలు, పౌర్ణమి-అమావాస్యల వంటివి అన్నీ ఒక దానిమీద ఒకటి ఆధార పడి ఉంటాయి. ఒకటి లేనిదే మరొకటి లేదు.
శివుడు సంహారకారకుడు అంటే పాతసృష్టిని తీసి కొత్త సృష్టిని కల్పించేవాడని అర్థం. ధనుస్సు ధరించి ఆర్ద్రా నక్షత్రంలో గోచరమయ్యే రుద్రుడు పరుగులు తీస్తూ పారిపో తున్న జింకను వెన్నంటి వేటాడే వేటగానిలా కనిపిస్తారు.
ఇది ఆకాశంలో మిథున కర్కాటక రాసులకు అడ్డంగా ఐమూలగా ఉంటుంది. ఈ నక్షత్ర మండలానికి దగ్గరగా క్రూరగ్రహాలైన శని, కుజ, రాహు, కేతువులు సంచారం చేసి నట్లయితే ప్రపంచ యుద్ధాలు, ప్రళయాలు జరుగుతాయి.
యోగాగ్ని వల్ల అన్ని కోరికలు భస్మమైనట్లయితే ఏ కోరికలూ లేని వైరాగ్యస్థితి కలిగి, ఆ వైరాగ్య స్థితిలో చక్కటి ప్రశాంతతతో కూడిన నిర్వాణస్థితి అనుభవంలోకి వస్తుంది. దీన్ని సూచిస్తూ శివుని స్మశానవాసి అంటారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 193 / Sripada Srivallabha Charithamrutham - 193 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 26
🌴. శ్రీ కన్యకా పరమేశ్వరీ జన్మ వృత్తాంతం - 1 🌴
శ్రీపాదులవారు ధర్మగుప్తులవారికీ, శంకరభట్టుకు తెలియజేసిన విశేషాలు:
కాలం మానవుడికి రాత్రి, పగలుగా... పితృదేవతలకు కృష్ణ శుక్ల పక్షాలుగా... సంవత్సర పురుషుడికి ఉత్తరాయన దక్షిణాయనాలుగా లెక్కించ బడుతుంది. సూర్యుడు కాలాతకుడు.
సూర్యుడు దనుష్ట నుంచి ప్రారంభించి, తిరిగి ధనిష్ట నక్షత్రాన్ని చేరడానికి పట్టే కాలం బ్రహ్మకల్పం. దీనిలో సగభాగం సృష్టి కల్పం, మిగిలింది ప్రళయ కల్పం.
తారకరాజయోగంలో శరీరం బ్రహ్మాండం, శిరస్సులోని ఆలోచనా స్థానం బ్రహ్మలోకం, నాభి విష్ణు లోకం, హృదయం రుద్ర లోకం.
గత కర్మలను అనుభవింపజేసే జన్యు దేవతలు వీర్య కణాలలో ఉంటారు. జన్యు దేవతలే చనిపోయిన వారికి పెట్టే శ్రాద్ధఫలాలను స్వీకరించి, వారికి ఉత్తమ గతులు కలిగించే పితృదేవతలు.
వీరికి జన్మ ఉండదు. తారక రాజయోగి తనలోని ఆరు చక్రాల వలన సంవత్సరంలోని ఆరు ఋతువులను దర్శిస్తాడు.
ద్వాపర యుగం అంతమవడానికి 2800 సంవత్సరాలకు ముందు, కలి పురుషుడు... తన యుగ ధర్మాలను వ్యాపింప చేయడానికి... పశ్చిమ సముద్రంలోని ద్వీపంలో ఘోర తపస్సు చేశాడు. ఆదాముడు, హవ్యవతి అనే తోబుట్టువులతో అక్రమ కామాన్ని ప్రేరేపించడానికి, నీలాచలం దగ్గర కలి సర్పంలాగా ప్రవేశించి, వాళ్ళు అక్రమ సంతానం కనేటట్టు చేశాడు.
వారే మ్లేచ్చ జాతికి చెందిన
ఆనాచారవంతులు, నానా భక్షకులు, కలిధర్మానికి మూలమైన వాళ్ళు కలియుగాంతమప్పుడు నదులు పొంగి అపార నష్టాన్ని కలిగిస్తాయి. భూకంపాలు, తోకచుక్కలు, సూర్యుడు కనపడకపోవడం మొదలైనవి సంభవిస్తాయి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 194 / Sripada Srivallabha Charithamrutham - 194 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 26
🌴. శ్రీ కన్యకా పరమేశ్వరీ జన్మ వృత్తాంతం - 2 🌴
తర్వాత శ్రీపాదులవారు స్కాందపురాణాంతర్గత సనత్సుజాత సంహితలోని శ్రీమతి
కన్యకాపురాణాన్ని చెప్పసాగారు:
బృహత్ శిలానగరాన్ని (పెనుగొండ) రాజధానిగా చేసుకుని కుసుమశ్రేష్టి అనే వైశ్యరాజు పాలిస్తుండేవాడు. అతడు శ్రీకృష్ణ పరమాత్మ సమకాలికుడైన అగ్రసేన మహారాజు యొక్క వంశీకుడు. భాస్కరాచార్యులవారు వారికి గురువులు.
ఈ రాజ్యానికి తూర్పున, ఉత్తరాన గోదావరి నది... పశ్చిమాన గోస్తనీ నది... దక్షిణాన అంతర్వేది ఎల్లలు, ఈ రాజ్యంలో ఉన్న 18 నగరాలలో 714 గోత్రాల వైశ్యులు ఉన్నారు. వారిలో 102 గోత్రాలవారు ముఖ్యమైన వాళ్ళు, వీళ్ళు ఆర్య మహాదేవిని ఆరాధించడం వల్ల వీళ్ళని ఆర్యవైశ్యులు అనేవారు.
విపరీత భక్తి వల్ల తమ సంతానాన్ని పరమేశ్వరికి అర్పించేవారు. వారిని గౌర బాలికలు, గౌర నగరులు అనేవారు.
వీరికి చైతన్య క్రియా యోగ దీక్షను ఇచ్చి యోగులుగా తయారుచేసి వివాహం చేసేవారు. వీరికి జన్మించిన సంతానం యోగ్యంగా ఉంటుందని భాస్కరాచార్యుల
భావన.
పుత్రకామేష్టి యాగఫలంగా కుసుమశ్రేణి దంపతులకు వైశాఖ శుద్ధ దశమి, శుక్రవారం, పునర్వసు నక్షత్రం వాసవీ కన్యక జన్మించింది. ఆమెకు కవల సోదరుడిగా నందీశ్వరుడి అంశతో విరూపాక్షుడు జన్మించాడు.
ఇతడే పూర్వం శిలలను ఆహారంగా గ్రహించిన శిలాదుడు అనే మహర్షి. ఇతడు అంబిక పరమేశ్వరుని కోసం తపస్సు చేసిన శిలను జేష్టశైలానికి (పెనుగొండ) చేర్చాడు. దానిని భూగర్భంలో వేసి కుసుమశ్రేష్టి కోటను నిర్మించాడు.
కలియుగాంతంలో శ్రీపాద శ్రీవల్లభులు కల్కి అవతారంలో శంబలలోనూ, పద్మావతీదేవి సింహళంలోనూ జన్మించి, వివాహం తరువాత బృహత్ శిలానగరానికి వస్తారు. వాసవీ కన్యక
శ్రీపాదులకు రక్షా బంధనం కడుతుంది.
శ్రీపాదులు వాసవీ కన్యకకూ, శ్రీనగరేశ్వరుడికీ వివాహం జరిపిస్తారు. ఆ తర్వాత నవదంపతులు పీఠికాపురానికి వస్తారు. కల్కి తన పూర్వపు అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ రూపంలో అందరి సమక్షంలో దర్శనమిస్తారు.
ఇంతవరకు వినిపించిన తరువాత శ్రీపాదులవారు మరునాడు కన్యకా చరిత్రను పూర్తిగా వినిపిస్తాననీ... అక్కడ నుంచి పంచదేవపహాడ్ ప్రాంతంలో తాను దర్భారు చేస్తాననీ.... అందుకు అక్కడ రెల్లుగడ్డితో చిన్నగృహాన్ని నిర్మించమని శంకరభట్టు ధర్మగుప్తులకు ఆదేశించారు.
రాబోయే శతాబ్దాలలో భారతదేశం మ్లేచ్ఛుల (ముస్లింల) శ్వేతజాతీయుల (ఆంగ్లేయుల) ఆధీనంలోకి పోతుందని... దత్తుని మరువనంతవరకూ దత్తుడు మరువడని... మరపు మరణతుల్యం, స్మరణ నూతన జన్మదాయకం అని తెలిపారు.

🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 203 / Sripada Srivallabha Charithamrutham - 203 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 34
🌻. మానవత్వమే అసలైన దైవత్వం (ధూమావతి) - 1 🌻
🌻. బ్రాహ్మణుని దీనావస్థ 🌻
మేమిద్దరం శ్రీపాదుల నామ స్మరణ చేస్తూ మా ప్రయాణం సాగిస్తూ ఒక గ్రామం చేరుకున్నాం. శ్రీపాదుల దయ వల్ల మా ప్రయాణంలో మాకు ప్రతిచోట అడగకుండానే ఆతిథ్యం లభించింది. ఆ గ్రామంలో విశేషం ఏమిటంటే ఒక ఋణదాత ఒక బ్రాహ్మణుడి ఇంటిలోని సామానంతా వీధిలో పారేస్తు న్నారు. పాపం! అతని భార్యా, పిల్లలు కూడా వీథిలో నిల్చు న్నారు.
ఒక గిరి గీసి పాపం ఆ బ్రాహ్మణుని అందులో నిల్చోబెట్టి ఎన్ని రోజుల్లో అప్పు తీరుస్తావో యఙ్ఞోపవీతం పట్టుకొని ఖచ్చితంగా చెప్పమని ఋణదాత నిర్బంధం చేస్తున్నాడు. ధర్మగుప్తులకు జాలి వేసి ధన సహాయం చేయాలనుకున్నారు.
కాని అప్పుడు అంత మొత్తం వారి వద్ద లేదు. ఆ బ్రాహ్మణుని దీనావస్థ చూసి జాలి వేసి నేను కల్పించుకొని ఋణదాతతో మరియొక రెండు వారాలు గడువు ఇచ్చినట్లయితే అతను అప్పు తీర్చగలడని, దానికి నేను హామీ అని చెప్పాను.
వెంటనే నా ప్రతిపాదనని ఒప్పుకుంటూ బాకీ తీర్చేవరకు మేమిద్దరం ఆ గ్రామంలోనే ఉండాలని, బ్రాహ్మణుడు ఋణం తీర్చక పోయిన పక్షంలో న్యాయాధికారి వేసే శిక్షను నేను అనుభవించవలసి ఉంటుందని షరతులు విధించారు ఆ ఋణదాత.
పూర్వాపరాలు ఆలోచించకుండా ఎవరి విషయంలోనో తల దూర్చినందుకు, నాతోపాటుగ ధర్మగుప్తులను కూడా సంకట పరిస్థితులలో ఇరికించినందుకు నన్ను నేనే నిందిం చుకున్నాను. కాని ఇద్దరం శ్రీపాదులవారిదే భారమని, వారే మమ్మల్ని కాపాడుతారని నమ్మకంతో ఉన్నాము.
🌻. పందాల జోరు 🌻
ఆ బ్రాహ్మణుని చూడబోతే చాలా బీదవాడు. వంటకి సంభారాల మాట అటుంచి, దేవుడి దీపారాధనకైనా నూనె, వత్తి లాంటివి కూడా లేవు. కాలే కడుపులతో మేమిద్దరం కూర్చొని శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అనే మంత్రాన్ని పాడుతుంటే ఆ వీధిలోని పిల్లలు, పెద్దలు కూడా మాతో కలిసి నామ సంకీర్తన చేసారు.
వారిలో కొందరు పంట కాపులు ఉన్నారు. నేనొక మహాపురుషుడి శిష్యుడినని, నా వద్ద దైవీశక్తులు ఉన్నాయని, అందుకే ధైర్యంగా హామీ ఇవ్వ గలిగానని, నాకు జోస్యంకూడా బాగా వచ్చని వాళ్ళు ఊరిలో ప్రచారం చేసారు.
నేనిచ్చిన హామీపైన ఆధారపడి బ్రాహ్మణుడు అప్పు తీరుస్తాడని కొందరు, తీర్చలేడని మరి కొందరు ఊళ్ళో పందాలు కాయడం మొదలు పెట్టారు. అనా లోచితంగా తమ భక్తుడు పలికిన మాటలను భగవంతుడే నిజం చేయాలని నేను మనసులో అనుకున్నాను.
ఆ ఊళ్ళోనే శరభేశ్వరశాస్త్రి అనే పండితుడు ఉన్నారు. వారు మంత్ర శాస్త్రవేత్త కూడా. వారు ఏదో ప్రేతాత్మ సహాయంతో భూత, భవిష్యత్, వర్తమానాలు తూచా తప్పకుండా చెప్పే వారు. పందెగాళ్ళు కొందరు వారి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పగానే అతడు ప్రేతాత్మని ప్రశ్నించారు.
అది బ్రాహ్మణుడు అప్పు తీర్చలేడని చెప్పడంతో ఆయన అదే నొక్కి చెప్పారు. దీనితో నూర్ల వరహాలలో పందాలు కాయ సాగారు. శంకరభట్టుకి వత్తాసు ఇస్తున్నవాళ్ళు పేద బ్రాహ్మ ణుడి ఇంటికి సంభారాలు పంపడం మొదలు పెట్టారు.
కాని నాకు పరిస్థితి అంతా అయోమయంగా ఉంది. “తండ్రీ! శ్రీపాదా! అంతంత మాత్రం చదువుతో, ఏ ఆధ్యాత్మిక శక్తి, జపతపాలు, యోగాభ్యాసాలు, నియమ నిష్ఠలు లేని నేను, కేవలం మీమీద ప్రగాఢ భక్తితో మీ చరిత్ర వ్రాయడానికి కుతూహల పడుతున్న నేను అనాలోచితంగా ఈ పరిస్థితు లలో ఇరుక్కున్నాను. నన్ను గట్టెక్కించు ప్రభూ, మీదే భారం,” అని ప్రార్థించాక ఎంతో ధైర్యంగా అనిపించింది.
🌻. శరభేశ్వరశాస్త్రి సోదరి 🌻
శరభేశ్వరశాస్త్రికి ఆ గ్రామంలోనే నివసిస్తున్న ఒక చెల్లెలు ఉంది. భర్త చనిపోయి తనకు వైధవ్యం వచ్చినట్లు ఆమెకు కల వచ్చింది. అన్నగారికి తన కల గురించి చెప్పితే ఆయన ప్రేతాత్మను అడిగి దేశాంతరంలో ఉన్న ఆమె భర్తని దొంగలు దోచుకొని చంపివేసారని చెప్పారు.
కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్న ఆమెను ఓదార్చడానికి వెళ్ళిన పంటకాపులు ఆమెని నా వద్దకు తెచ్చారు. వస్తూనే ఆమె, “అన్నా! నా మాంగల్యాన్ని రక్షించండి,” అంటూ నా కాళ్ళ మీద పడింది.
నేను అప్రయత్నంగా నీ భర్తకు ఏమీ కాదు, అని చెప్పి పంచదేవ్పహాడ్లో పంటకాపు మాకు ఇచ్చిన అక్షతలు కొన్ని ఇచ్చి పూజగదిలో భద్ర పరచమని చెప్పి ఆమె భర్త కొద్ది రోజులలో తిరిగి వస్తారని ధైర్యం చెప్పాను.
ఈ విషయం విన్న శరభేశ్వరశాస్త్రి అగ్గి మీద గుగ్గిలంఅయి తన చెల్లెలి భర్త తిరిగి వచ్చి తన జోస్యం తప్పినట్లయితే తానే ఆ బ్రాహ్మణుడి బాకీ పూర్తిగా తీరుస్తానని, శంకరభట్టుని గురువుగా స్వీకరించి శ్రీపాదులను ఆరాధిస్తానని ప్రతిఙ్ఞ చేసారు. నాల్గవరోజు చెల్లెలి భర్త దేశాంతరం నుండి తిరిగి వచ్చారు.
మార్గ మధ్యంలో దొంగలు తనను చంపబోగా సమయానికి ఒక ముస్లిం పహల్వాన్ వచ్చి తనను ఆదు కున్నారని చెప్పడంతో నేను ఇచ్చిన మంత్రాక్షతల వల్ల తన భర్త బ్రతికాడని ఆమె భావించింది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 204 / Sripada Srivallabha Charithamrutham - 204 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 34
🌻. మానవత్వమే అసలైన దైవత్వం (ధూమావతి) - 2 🌻
🌹. గర్వభంగం 🌻
శరభేశ్వరశాస్త్రి అహంకారం తగ్గి, బ్రాహ్మణుని అప్పు పూర్తిగా తీర్చి వారి యింట ఆతిథ్యం స్వీకరించమని మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. వారు మాతో, “అయ్యా! దశ మహావిద్యలలో ఒకటైన ధూమావతీ దేవిని నేను ఆరా ధించేవాడిని.
తంత్ర గ్రంథాల ప్రకారం ఆమె ఉగ్రతారాదేవే. ఆమె ప్రసన్నురాలయితే సర్వ సుఖాలు ప్రాప్తిస్తాయి, కోపిస్తే జీవనం దుఃఖప్రదమే.
నేను ఆ మహాతల్లి అనుగ్రహం పొందాను. చాతబడివల్ల, ప్రేతాత్మతో పీడింపబడటం వల్ల బాధ పడుతున్న వారి దుఃఖాలు ఆ తల్లి దయతో పోగొట్టే వాడిని. మొదట ధనాశ లేకుండా చేసినా మెల్లగా నేను ధనాకర్షణకి లోనయ్యాను.
ఇది ఆ మహాతల్లికి సమ్మతం కాదు. ఇంతలో ప్రాణమయ జగత్తులోని శక్తివంతమైన ప్రేతా త్మతో నాకు అనుబంధం ఏర్పడింది. ఇటువంటి వాటిని ఉపాసిస్తే చివరికి దుఃఖమే మిగులుతుంది అని తెలిసినా కూడా నేను ధన వ్యామోహంలో ఇరుక్కున్నాను.
అయితే ఆవిధంగా సంపాదించిన ధనాన్ని ప్రజల క్షేమం కోసం ఉపయోగిస్తే ప్రేతాత్మ మన అధీనంలో ఉంటుంది, లేదా ఇలా తప్పుడు జోస్యాలు చెప్పి అవమానాలపాలు చేస్తుంది,” అని మాకు వివరించి తనను శిష్యునిగా స్వీకరించమని నన్ను ప్రార్థించారు.
“ఈ ప్రపంచానికే శ్రీపాద శ్రీవల్లభులు తప్ప వేరే గురువు ఎవరూ లేరు. శ్రీపాదులు దశమహావిద్యల గురించి సంక్షిప్తంగా చెప్పి మిగిలిన విషయాలు ఎవరి ద్వారా ఎంతవరకు తెలియచేయాలో అంతవరకు బోధపడేలా చేస్తాను అని చెప్పారు మాకు దశ మహావిద్యలలో కాళి, మరియు ధూమావతి గురించి తెలిసింది.
శ్రీపాదులు ఇక్కడ మమ్మల్ని విచిత్ర పరిస్థితు లలో ఇరికించి తిరిగి వారే ఒడ్డున వేసారు. శ్రీపాదులవారు చిక్కులను కలిగించుటలో బహు నేర్పరి. వాటినుంచి భక్తులను బయట పడవేయుటలో బహు చమత్కారులు. శ్రీపాద నామస్మరణం ఇహపర సాధనం,”అని చెప్పాను.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 205 / Sripada Srivallabha Charithamrutham - 205 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయం 35
🌻. దుష్ట శిక్షణ -శిష్ట రక్షణ (శ్రీపాదులకు 12 ఏళ్ళు) (ఉగ్రతారాదేవి) 🌻
🌻. తారా ఉపాసకుడు 🌻
మేము తిరిగి మా ప్రయాణం కొనసాగించాము. మార్గ మధ్యంలో ఒక ఆశ్రమం బయట ఇద్దరు శిష్యులు నిలుచొని శంకరభట్టు, ధర్మగుప్తులు మీరేనా? అని ప్రశ్నించారు. మేము ఔనని చెప్పడంతో మమ్మల్ని లోపలకు తీసుకొని వెళ్ళారు.
అక్కడ తారాదేవి విగ్రహం చూసి ఆ సిద్ధుడు తారా దేవి ఉపాసకుడని గ్రహించాము. శ్రీపాదుల పూజ, భజన, మా భోజనం అయ్యాక సిద్ధుడు తారాదేవి గురించి ఇలా వివరించారు:
మోక్షాన్ని ప్రసాదించి తరింపచేసేది కాబట్టి ఈమెను తార అని పిలుస్తారు. భయంకరమైన విపత్తుల నుండి భక్తు లను రక్షించే దేవి కనుక, వాక్శక్తిని ప్రసాదించే తల్లి కనుక ఈమెను నీలసరస్వతి అని కూడా పిలుస్తారు.
ఈ దేవి ఉపాసన వల్ల సామాన్యులు కూడా బృహస్పతి అంత విద్వాంసులు అవుతారు. భారతదేశంలో మొట్టమొదటగా తారా ఉపాసన చేసినది వశిష్ఠ మహర్షియే.
🌻. అందాల బహూకృతి 🌻
మిథిలదేశంలోని మహిషి అనే గ్రామంలో ఉగ్రతారా సిద్ధ పీఠంలో ఉగ్రతారా, ఏకజట, నీలసరస్వతి ముగ్గురూ ఏక స్థానంలో ఉంటారు.
మాతని దర్శించి నేను బయటకు రాగానే ముద్దులు మూటగట్టే 13ఏళ్ళ బాలిక కనిపించి, "నాయనా! నాకోసమేనా నీవు లోకాలంతా గాలిస్తున్నావు?" అని అడిగింది. ఆ ముగ్ధ మోహన రూపాన్ని మైమరచి చూస్తుండగా ఆమె శరీరంలోని కణాలు తేజోభరితమై అందుండి ఒక బాలుని రూపం ఉద్భవించింది. ఆ బాలుని రెండు కాళ్ళకు అందెలు ఉన్నాయి, కాని అవి చాలా బిగుతుగా ఉండటంతో నన్ను విప్పమని అడిగి విప్పాక అవి నా చేతికే ఇచ్చి వాటిలో జీవశక్తి ఉందని, అవి నాకు మార్గదర్శకంగా ఉంటాయని చెప్పి అదృశ్యమయ్యారు.
🌻. గుణపాఠం 🌻
తరువాత అన్ని పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ పీఠికాపురం వచ్చాను. అక్కడ స్వయంభూదత్తుని మందిరంలో ఉన్న సర్ప దర్శనంతో నాలోని కుండలినీ శక్తి విజృంభించి, శరీరం స్వాధీనం తప్పి పిచ్చివానిలా తిరుగుతూ నరసింహవర్మ గారింటికి చేరాను. అక్కడ మహిషీ గ్రామంలో చూసిన బాలుడినే చూసాను. వర్మగారి ఇంటి వద్ద మనిషిలాగే జట్కాబండి ఒకటి ఉంది.
అందులో శ్రీపాదులు తాత గారింటికి వెళ్తుండటం కద్దు. వర్మగారు జట్కాలాగే నౌకర్ని పిలిచారు. శ్రీపాదులు జట్కాలో తాము కూర్చొని, ఆ నౌకర్ని కూడా కూర్చోబెట్టి నన్ను బండి లాగమని ఆదేశించారు.
నేను ఆ పని చేయనని మొరాయిస్తే బెదిరించి బండి లాగేలా చేసారు. వారిద్దరి బరువు 20మంది బరువులా ఉంది. అసలే లాగలేక అవస్థ పడుతుంటే ఆ కసాయి బాలుడు దుడ్డుకర్రతో నన్ను మోదడం ప్రారంభించాడు. ఒంటి నిండా రక్తంతో, అర్ధనగ్నంగా వాళ్ళని వారి ఇంటి వరకు తీసుకొని వెళ్ళాను.
బాలుడు లోపలికి వెళ్ళి రెండు చేతుల నిండా మిరప పొడి తెచ్చి నా శరీరంపై దట్టించాడు. పుండుమీద కారం చల్లడం, కాదు కాదు రుద్దడం అంటే ఇదే కాబోలు. గాయాల బాధకి తోడు, భగభగ మంటలు.
తల్లితండ్రుల సమ్మతం లేని సన్యాసం-గురువు లేని దీక్ష వ్యర్థం
ఇంతలో వారి అమ్మమ్మ రాజమాంబ బయటకు వచ్చారు. ఆమెను చూడటంతోనే నా బాధ చాలా వరకు తగ్గింది. ఆ నౌకరు జరిగినదంతా ఆవిడకు చెప్పితే శ్రీపాదులవారు అదంతా అబద్ధమని, నాకు చల్లగా గంధమే రాసానని చెప్పారు నౌకరు వచ్చి చూస్తే వారు చెప్పిందే నిజమ యింది.
శ్రీపాదులు తమ తాతగారితో నాగురించి చెప్పుతూ వీడు తారా ఉపాసకుడు, మంచిదే కాని సన్యాస దీక్షను గురు అనుమతితో కాక తన ఇష్టం వచ్చినట్లు తీసుకు న్నాడు. ఇతని తండ్రి అష్ట కష్టాలు పడి వీడిని పెంచి పెద్ద చేసారు.
ఇతని తల్లి వీడు గర్భమందున్న పుడు ఎంతో కష్టాన్నిఅనుభవించింది, వీడు జన్మించేటపుడు ఎంతో రక్తం పోగొట్టుకొని, గాయాలపై కారం అద్దినపుడు కల్గే బాధని అనుభ వించింది. కాలాంతరంలో వారిద్దరు మరణించి పీఠికాపురంలో జన్మించారు.
వర్మగారి ఇంట్లో పనిచేసే ఈ నౌకరే పూర్వ జన్మలో వీడి తండ్రి. ఆ నౌకరు భార్యయే వీడి తల్లి. వీడు తాను సన్యసించానని చెప్పి తల్లి తండ్రులకు పిండప్రదానం చేయలేదు. స్వల్ప బాధను ఇచ్చి వీడిని కర్మ విముక్తుడిని చేసాను.
ఇతడు 9 రోజులు తన పూర్వ జన్మలోని తల్లితండ్రులయిన ఈ భార్యా భర్తలకు సేవ చేసి నట్లయితే పితృదేవతల శాపం తొలగి పోతుంది”, అని చెప్పారు.
నేను ఆ రకంగానే చేసి, వారి అనుగ్రహ ఆశీర్వా దాలు పొంది, మహిషి గ్రామంలో ఇచ్చిన కాలి అందెలను పూజ గదిలో భద్ర పరిచి ఉగ్రతారా సిద్ధిని పొంది నా తంత్ర శక్తితో జనుల బాధలు దూరంచేస్తూ జీవిస్తు న్నాను. మీరు రావడానికి ముందే శ్రీపాదులు కనిపించి ఆ కాలి అందెలు మీకు ఇమ్మని ఆదేశించారని చెప్పి అందెలు మాకు అందచేసారు.