Wednesday, 14 December 2016

శ్రీ.బాపు గారికి ...స్మృత్యంజలి......

ఓం శ్రీ  రామ్ - శ్రీ మాత్త్రే  నమ: 

శ్రీ శ్రీనివాస (ఛందస్సు - లీల  )

సుందరానన బ్రోవా - శోభలివ్వగ దేవా 
ఎందు కాంచిన నీవే - యీ జగ మ్మెల నీవే
మందిరానన దేవా - ఆటలాడగ రావా
పాటపాడుత  రావా -  శ్రీనివాస శ్రీ పాదా     
  
మందహాసపు మెఱుపై - మనసు మార్చేటి తెలివై 
సుందరాంగన తలపై - మనసు తెల్పేటి  పతివై 
కాలమంతయు సిరులై - మనసు దోచేటి  గురువై 
మార్గమంతయు వెతలై - మనసు పంచె శ్రీ నివాస   

లలిత సుందర ముఖమై - వంద పూవుల నెలవై
మధుర భావము మెరుపై -  మధు సంధ్యల యెఱుపై
 సకల భాదలు తరిమే  - హావ భావ భరితమై
వెతలు తీర్చిట జగమే - శ్రీనివాస ఎలుకోవా 

  
నాదగీతము పాడెద - నన్ను బ్రోవఁగ రారా 
ఛాదనమ్ముల బూవుల - స్వామి గొల్తును రారా 
బోధనమ్ములఁ జేయఁగ - బుద్ది నీయఁగ రారా 
కోర్కలు తీర్చు నీవెగ -  శ్రీనివాస ఎలుకోవా 

 ఆది దేవుఁడ వీవే - ఆది యంతము నీవే 
నాదబిందువు నీవే - నాయకుండవు నీవే 
వేదనలఁ బలు బాపెడు - వేదవేద్యుఁడ వీవే 
పేద నిఁక కరుణించర - పెద్ద హృదయము నీదే 

శ్రీ శ్రీనివాసాయనమ: శ్రీ వేంకటేశాయనమ :
గోవిందా గోవిందా - గోవిందా గోవిందా - గోవిందా గోవిందా 

--((*))-- 

లీల - జాతి పద్యము 

నిన్న "నిత్యమంగళ" అనే ఒక నూతన వృత్తమును మీకు పరిచయము చేసినాను. అందులోని ప్రత్యేకత ఏమంటే మిశ్రగతికి ఒక చతుర్మాత్రను తగిలించడము. అది మిశ్రజాతి త్రిపుట తాళమునకు సరిపోతుంది, దానిని లీల అంటారు. ఈ రోజు జాతి పాద్యముగా ఈ లీలావతారము! ప్రతి పాదములో 3,4,4 - 3,4,4 మాత్రలు, మొత్తము 22 మాత్రలు. 22 మాత్రలతో ఇలాటి మాత్రాగణములతో నాదగ్గర ఉండే 1000కి పైన వృత్తాలలో ఒకటి కూడ లేదు. కొత్త ఛందస్సులను ఎందుకు కల్పించాలనే ప్రశ్నకు ఇది ఒక జవాబు. క్రింద రెండు పాటలుగా నా ఉదాహరణములు - 

ప. సుందరానన రావా - శోభ లివ్వఁగ దేవా 
ఎందుఁ గాంచిన నీవే - యీ జగ మ్మెల నీవే 

అను. వంద రేకుల విరియై - వాన ధారల ఝరియై 
మందహాసపు మెఱుపై - మధుర సంధ్యల యెఱుపై 

చ 1. ఆటలాడఁగ రావా - యాకసమ్మున శశితో 
పాటఁ బాడఁగ రావా - పంచమమ్మున నళితో 
నీట నీఁదఁగ రావా - స్నేహవాక్యపు టలయై 
నోట నాడుచు రావా - నూఁగు తెలుఁగునఁ బదమై 

చ 2. మధుర మురళీస్వరమై - మదనదేవుని వరమై 
నిదురలోఁ బలు కలలై - నిండు పున్నమి వెలుఁగై 
వ్యధలఁ దీర్చెడు మందై - వలపునందు పసందై 
కథలఁ జెప్పఁగ రావా - కామలీలల పూవా 

చ 3. లలిత సుందరతరమై - లాస తాళభరితమై 
కళలఁ జిందిడు గళమై - కామజలధికి నలయై 
వలపు తలఁపుల సెలయై - వంద పూవుల నెలవై 
కలలు నిజమవ రారా - కామినీ హృచ్చోరా 

==== వినాయకునిపై ఒక పాట ==== 

ప. వారణమ్మగు నడ్డులు - వారణానన యనఁగా 
దూరమగు దురితమ్ములు - స్థూలకాయుని గనఁగా 

అను. ఆఱు ముగముల వానికి - నగ్రజుండై వెలసిన 
మేరు పర్వత ధీరుని - మృడుని సూనుని గొలువన్ 

చ 1. విశ్వమోహనుఁ డతఁడే - విష్ణురూపుం డతఁడే 
శాశ్వతమ్మన నతఁడే - చంద్రు నణచిన దతఁడే 
ఈశ్వరుండన నతఁడే - హిమజ హృదయ మ్మతఁడే 
నశ్వరమ్మగు భువిపై - నావ ముక్తికి నతఁడే 

చ 2. మోదకమ్ముల నిత్తును - మోద మొసగఁగ రారా 
నాదగీతము పాడెద - నన్ను బ్రోవఁగ రారా 
ఛాదనమ్ముల బూవుల - స్వామి గొల్తును రారా 
బోధనమ్ములఁ జేయఁగ - బుద్ది నీయఁగ రారా 

చ 3. ఆది దేవుఁడ వీవే - ఆది యంతము నీవే 
నాదబిందువు నీవే - నాయకుండవు నీవే 
వేదనలఁ బలు బాపెడు - వేదవేద్యుఁడ వీవే 
పేద నిఁక కరుణించర - పెద్ద హృదయము నీదే 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


No comments:

Post a Comment