రాగం: శుద్ధ సావేరి
నిర్గుణ రూపాయ, నిఖిలాత్మకాయ సగుణ స్వరూపాయ, శ్రీనివాసాయ. || నిర్గుణ||
1. చింతామణి, భక్త జన ఆశ్రితాయ, అ నంతకోటి బ్రహ్మాండ నాధాయ, భవ బంధ దుస్తర భయ నాశకాయ, మందార వనమాలి, మధుసూదనాయ. || నిర్గుణ||
2. చారు వదన స్మిత సుందర రూపాయ మరు మదన జనకాయ, మేఘశ్యామాయ సిరి హృదయవాసాయ సర్వేశ్వరాయ తిరు వేంకటాగిరి తత్వరూపాయ. || నిర్గుణ||
3. రత్న మణి యంకిత వజ్రకిరీటాయ, విశ్వ ఛత్ర దివ్య విస్ఫూర్జితాయ, ధ రిత్రి నాధాయ, దశకంఠ దమనాయ, వట పత్ర శయనాయ వేంకటేశాయ. || నిర్గుణ|| |
|
|
|
Pranjali Prabha
1. నేనొక మోటు మానసిని - నేర్చిన విద్య తక్కువయే
జ్ఞానము పంచె శారదని - ప్రార్ధన తో వరమ్ములను
కోరితి సేవ చేయుటకే.
2. సంఘము కోరి విద్యలను - పంచుట నిల్చి తోడ్పడుట
తల్లియు తండ్రియే మనకు - దీవెన నమ్ము టే కవిగ
సేవలు చేయు టే పనిగా.
3. పొద్దునె లేచి వ్రాయటయు - నిత్యము సత్య మార్గమున
విద్యయు ధర్మ మార్గము - దానము చేసి తృప్తి పడె
జీవన మే దినమ్ము సిరీ.
4. అగ్నిపు నీత లౌఅక్షర - బాణమే నాకు రక్షణయు
నిర్ణయం విజ్ఞ ప్రేరణయు - వచ్చిన బంధు దీవనలె
నిత్యమూ సత్యమే అగుటే.
5. కర్తల పాలనా క్రమము - సాక్షిగా మేలు చేయుటయు
మర్మము బట్టి తెల్పుటయు - శక్తిని బట్టి నేర్పుటయు
వ్యక్తి గ యుక్తి ప్రేరణయే.
6. సూక్తుల సాధనే మనకు - సాక్షుల ప్రేమ యే మనకు
పాఠము చెప్పు గాత్రముతొ - సౌఖ్యము పంచు మార్గమున
పాలన చేయు టేమనకూ.
7. అక్రమ వక్ర మార్గమున - మూర్కుల కోప తాపమున
తామస వళ్ళ జాతులను - పిచ్చిత నం తొ అనేకముగ
కష్టము పాలు చేయువక్రా.
8. ఏమియు ఉంది లోకమున - స్వర్గ సుఖాలు ఎక్కడను
లేకయు కష్ట మే ఉదయ - భానుల తిర్గి సేవలను
పంచుట యే యశస్సులదీ.
9. ఈ నిశి రాత్రి పువ్వులను - నవ్వుల కాంతి వెల్గులను
రమ్యముగా సరాగమును - తెల్పి సమాన ప్రేమలను
పంచి సమంగ బ్రతుకుటే.
|
|
|
No comments:
Post a Comment