ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
సర్వేజనాసుఖినోభవంతు
జయలలితా -
సార్థకనామ గణాక్షరవృత్తము జయలలితా -
జయలలితా - జ/య/న/య/య/ల IUII UU - IIII UUI UUI
16 అష్టి 37838
జయమ్ముల నెన్నో - జయలలితా యీయు మోయమ్మ
భయమ్ముల బల్ నీ - వభయము సేయంగ రావమ్మ
ప్రియమ్ముగ నా యీ - వినతుల నాలించ వేలమ్మ
నయమ్ముగ నీ యా - నగవులఁ జిందించు మాయమ్మ
వసంతము వచ్చున్ - వనమున బుష్పాలు పూయంగ
విసంధియు వచ్చున్ - విరహపు బాష్పాలు రాలంగ
రసార్ద్రము లెల్లన్ - రమణుఁడు రమ్మంచుఁ బిల్వంగ
నసీమము నిక్క - మ్మరుసము నిమ్మంచుఁ గోరంగ
నిరాశయు వద్దోయ్ - నిజముగ నాశాప్రసూనమ్ము
బిరానను నేఁడే - విరియును మోదమ్ము నీయంగ
నిరీక్షణమే యా - నిజమగు ధైర్యమ్ము నీకిచ్చు
వరమ్ముల నెన్నో - వరదుఁడు నీకొసమే దెచ్చు
అనంతము గాదా - యగపడు స్వర్గంగ మార్గమ్ము
లనంతము గాదా - యగపడు తారార్క విశ్వమ్ము
లనంతము గాదా - యవనియు నాదూర తీరమ్ము
లనంతము గాదా - యనుపమ సృష్టుల్ వినాశమ్ము
నీ మనికి మార్చునిక..
------------------------------
మాధురి వృ.
జయలలిత (నూతన వృత్తము)
సార్థకనామవృత్తము
గణములు - జ,య,లఘువు,న,త ( IUI IUU IIII UUI )
యతి- 8
భయమ్మెది లేకుండఁ బనులఁ జేయించి
జయమ్ముల నీవమ్మ సకలకార్యాల
రయమ్ముగ నిమ్మట్లె లలిత! సద్భక్తిఁ
బ్రియమ్ముగ నేఁ బాడి కృతుల మెప్పింతు
విమోహమునున్ బాపి విమల, వాగ్దేవి
ప్రమాణముగానుండు పలుకులే రాల్చ
రమాసతితోఁ గూడ రమణనిప్పించు
ప్రమోదముగాఁ గొన్ని పసిడి నాణేలు
ఎడందను నున్నట్టి యెలమితో నీకుఁ
గడంకను నేఁజేయఁ గలిమితో సేవ
గడించఁగ లేదమ్మ ఘనముగా డబ్బు
కడిన్ దినఁగా నేదొ కలదు కొంచెమ్ము
విశేషముగా నేది విధియు నీకున్న
ప్రసాదముగాఁ దల్చి బ్రతుకు సాగింతు
నసాధ్యము గాకుండ నడుగు నీ సేవ
ప్రసిద్ధిగ నాకిమ్ము వలయు ధీశక్తి /ధైర్యమ్ము
హతాశను గాకుండ నడుగువందించి
సతమ్మును దీవించి జతగ నీవున్న
వితానముగా గూర్చి విమల వాక్యాల/వృత్తాల
స్తుతించెదనేనాఁడు శుభదగా నిన్ను
గణములు - భ,జ,స,న,భ,య
యతి - 9
సాధనల సల్పితివి శారదనుఁ గొల్చుకొని భక్తిన్
బోధనయుఁ జేసితివి మోదముగ నెందఱికొ భూమిన్
మాధుకరవృత్తిమెయి మౌనివలె జీవనము సాగన్
సాధువుగ నుంటివొక జన్మమున ధాతయును మెచ్చన్
వ్రాసితివి గ్రంథములు రమ్యమగు ఛందములనెన్నో
గాసినిడ నన్నియునుఁ గాలినవి చూడకయె వెల్గున్
వాసినిడ గల్గెడివి వ్రాతలవి నిల్చినను ధాత్రిన్
వేసరిలకేవిధిని వెళ్ళితివి నీదయిన దారిన్
ఈసుగొని కొందఱిల నింపయిన నీకృతులఁ గాల్చన్
వ్రాసెనటులా విధియె , బాధపడుటెందులకు నంచున్
నీ సములు లేరనఁగ నివ్వటిలినావపుడు నేలన్
వాసరములన్నియును వత్సరములై చనఁగ వేగన్
చింతలెవి లేవనుచుఁ జిత్తమును సుస్థిరత నుండన్
స్వాంతమున నిల్పుకొని సంతతము విద్యలిడు తల్లిన్
కాంతలకు దూరముగఁ, గారడవినో తపసి వౌచున్
దాంతివయి సాగితివి దైవకృప తోడగుచు నుండన్
ధీమతిగ సన్మతిగ దివ్యమగు జ్ఞానమును బొందన్
భ్రామరినిఁ గొల్చితివి భారమనకెట్టి నియమంబుల్
సామములఁ బాడితివి సాదరముతోఁ దలికి నిచ్చల్
పామరులు పండితులు ప్రత్యహము వందనములీయన్
గమ్యమునుఁ జేరకయె కాయమది నేలపయి రాలన్
కామ్యమది యందకయె కన్నుగవ మూతవడి పోగా
సౌమ్యతను నీదయిన సాధనయు నెర్గినది యౌటన్
రమ్యకునుఁ గన్నులను రాలినవి బాష్పములు నీకై
ప్రేమమెయి వచ్చినది వెంటబడి యీజనమ నందున్
నీమనములో నిలిచి నీస్మృతిని నీకునిడి నీతో
నీమహియు మెచ్చునటు లెన్నొ నుతులందుకొని ప్రీతిన్
కామితము నీకొసఁగి గమ్యమునుఁ జేర్చు మతి తోడన్
నేమమున నేర్పినది నేర్పరిగ మర్చినది విద్యన్
నీమదినిఁ బల్కుచును నిత్యమును నీవడుగకున్నన్
భూమికిని శ్రేయమవ, పుట్టువిది ధన్యమవ నీకున్
నామ, గుణ గానముల నాణ్యముగఁ జేయ నిడి స్ఫూర్తిన్
నీమనికి మార్చునిక నివ్వెఱఁగు నెల్లరునుఁ గాంచన్
క్రొత్త గణములతో పద్యములు - 7
ఈ రోజు బుధ-గురు-గురు గణములతో కొన్ని అమరికలను మీకు తెలుపుతాను. ప్రతి పాదమును 7.17.17 = 2023 విధములుగ వ్రాయ వీలగును. సూర్య-ఇంద్ర-ఇంద్ర గణములతో (తేటగీతి పూర్వార్ధము) 2.6.6 = 72 విధములుగా మాత్రమే వ్రాయ వీలగును. బుధ గురు గణముల పరిధి, వైశాల్యము ఎంత అధికమో అనే విషయము మనకు ఇప్పుడు బోధ పడుతుంది. కొత్త కొత్త లయలు గతులు సాధించుట సులువు ఈ గణముల ఉపయోగమువలన. క్రింద కొన్ని ఉదాహరణములు -
చంపకమాల (రుక్మవతి) - UII UUU IIUU
కానఁగ రావేలా కమలాక్షీ
గానము పాడంగాఁ గలకంఠీ
ధ్వానము లేచున్గా వరవీణన్
స్నానము సేయంగా స్వరవార్ధిన్
(ఈ వృత్తమును చతుర్మాత్రలతో UII UU - UII UU వివరించుట సామాన్యము)
సాంద్రపదా - UII UUII IIUU
చూచితి సౌందర్యము నడువంగా
దోచితి నా నవ్వుల విరియంగా
దాచితిఁ బీయూషము కురియంగా
వేచితి నందమ్మును మడువంగా
(ఇది కూడ ఒక చతుర్మాత్రా వృత్తమే)
బృహతికా - III UIU UIU
మధుర భావముల్ నిండఁగా
మధుర రావముల్ మెండుగా
మధుర వాహినుల్ పారఁగా
మధుర మోహన మ్మయెఁగా
సుందరలేఖా - UU UUU IIUU
బేలా నీకేలా వగలింకన్
శ్రీలన్ దానిచ్చున్ సఖుఁడింకన్
చాలే యాయశ్రుల్ జలజాక్షీ
లీలాలోలుండే తను వచ్చున్
(ఇది కూడ ఒక చతుర్మాత్రా వృత్తమే)
అభిహితా (ముఖచపలా) - UU IIIII IIIU
రామా రవికులపు తిలకమా
శ్యామా యదుకులపు తిలకమా
స్వామీ మనుజకుల తిలకమా
కామీ వలపులకు తిలకమా
ఇప్పుడు బు/గు/గు గణములను రెండు మారులు ఉపయోగించుదామా? అలా చేస్తే 40 లక్షలకన్న ఎక్కువ రీతులలో ఒకపాదమును వ్రాయ వీలగును! సుప్రసిద్ధ వృత్తములైన చంపకోత్పలమాలలు కూడ ఇందులో ఉన్నాయి. కొన్ని ఉదాహరణములు -
చంపకమాల గణములు - IIII UIU IIIU - IIU IIUI UIU
దినమున నెండలోఁ దను విటన్ - దెలివిన్ విడనాడె గ్లానిలో
ఘనముగ నెందుకో పులుగులున్ - గసితో సడి లేపె మ్రానిలో
వనమునఁ బూచెఁగా కుసుమముల్ - వ్యధగా మధుమాస వేళలో
మనమున నిన్ను నేఁ దలఁతుఁగా - మరులన్ హృది వేఁగ జ్వాలలో
ఉత్పలమాల గణములు - UII UIU IIIU - IIU IIUI UIU
నిండెను నింగిలోఁ గళలతో - నెలయున్ నిశిలోనఁ జల్లఁగా
వెండిగఁ గౌముదీ ద్యుతులఁ దాఁ - బ్రియమై మహిపైనఁ జల్లెఁగా
మండెను నీదు యా కలలు నా - మదిలో విడకుండ మెల్లఁగా
దండుగ యయ్యె వెన్నెల కళల్ - తలపుల్ దహియించె నుల్లమున్
(ఇక్కడ యతి స్థానము సంపఁగివలె ఒక అక్షరము తఱువాత వస్తుంది)
మందాకినీ - UU IUU UIU - UU IUU UIU
నిన్నే వసంత మ్మందునా - నిన్నే లతాంత మ్మందునా
నిన్నే ప్రశాంత మ్మందునా - నిన్నే ప్రమోద మ్మందునా
నిన్నే ప్రభాత మ్మందునా - నిన్నే ప్రభాస మ్మందునా
నిన్నే యనంత మ్మందునా - నిన్నే యనూహ్య మ్మందునా
టంకణము - UI UIII UIU - III UIU IIIU
ఏమి మాయ యిది సెప్పరా - హృదయ మెక్కడో వెడలెరా
నామ మెప్పుడును నీదెరా - నవము నాకు నిన్ వదలరా
స్వామి నీవెగద నాకు నీ - వసుధపైన నీ యెడఁదలో
భూమి మిన్ను లీట నేకమై - ముదము నీయఁగాఁ ద్వరగ రా
సువదనా - UU UUI UUII - IIII UUU IIIU
కావన్ నన్నిందు కారుణ్యము - కనఁబడ రావేలా నగవుతో
దేవీ నీకేల నీకిన్కయు - దినముల లెక్కింతున్ గనులతో
బూవుల్ బుష్పించె నీయామని - ముదముల ఫేనమ్మై వనములో
దీవెల్ వెల్గింతు నీయామిని- తృషలను దీర్చన్ రా క్షణములో
సూచన - అన్ని పద్యాలలో సామాన్యముగా గణమునకు తగ్గట్లు పదములు ఉపయోగించబడినవి.
| ||||
తమిళనాడు ముఖ్య మంత్రి జయలలితకు
శ్రద్ధాంజలి ఘటిస్తూ పుష్పగుచ్ఛాలు అర్పిస్తున్నాను
అమ్మ అమ్మా భువి నుంచి దివికి ఎగసినావమ్మా
మా హృదయంలో నీకున్న స్థానం పదిలమమ్మా
మా భాదలు, నష్టాలూ ఎవరికీ చెప్పు కోవాలమ్మా
నీవు చూపిన మంచిమార్గాన్నే ఎంచుకుంటావమ్మా
మా కోసం నీవుకన్న కలలన్నీ మేము నిర్వహిస్తావమ్మా
ఇకలేవని అనుకోవమమ్మా, హృదయంలోనే ఉన్నావమ్మా
మానత్వం నిలిపి అందనంతదూరములో ఉన్నావమ్మా
మా హృదయంతో పుష్పాంజలిని ఆర్పిస్తున్నా మ్మమ్మా
ప్రాంజలి ఘటించి నీకు వందనాలు ఆర్పిస్తున్నామమ్మా
సత్య,ధర్మ,న్యాయం కోసం పోరాడుతామని శబధంమమ్మా
అమ్మ అమ్మా మామనసును అంతర్గతముగా చూడాలమ్మా
అమ్మా నింగి నుండి మాకు హితబోదచేసే జయలలిత వమ్మా
--((*))--
కన్నీరుతో సమర్పిస్తున్నది ప్రాంజలి ప్రభ
తాకఁగఁ దలఁపగు ...
----------------------------
ద్విపద
ఎండిన తరువులె యెచ్చటఁ గనిన
కొండల, దారుల గుబురుగ నిండి
రంగును మార్చియు రాలని యాకు
హంగుగ నున్నది యద్దిన యటుల
సతతహరితములు చక్కనివెన్నొ
తతులుగ నిలువగ దారుల ప్రక్క
వివిధవర్ణములతో వింతగనుండె
నవనియంతయును నేఁడందము లొలికి
మోడులై యుండియున్ భూజములన్ని
వేడుకఁ గొలుపును బెక్కుతీరులుగ
ఎండిన పత్రము లిలపయి రాల
పండిన యాకులు పసిడి కాంతులిడ
నిలుచుని యుండును నింగినిఁ గనుచు
వెలుఁగుల రేనికి వినతుల నిడుచు
మారెను ఋతువని మ్రగ్గక మదిని
నేరము మోపక నీరజాప్తుపయి
నాశల నింపుక నంతరంగమున
మాసములెన్నియొ మనుచుండునటె
నేర్పును చక్కని నీతిని మనకు
నోర్పునుఁ జూపుచు నుర్విని నిలిచి
చెందవు కలతలు, సేయవు నింద
నందము బాసియు నవని మార్పులను
ధీరత నిలుచును స్థిరమతులటుల
భారము నొందక బ్రహ్మ చేతలకు
తల్లియొడిని నున్న తనివియె యెపుడు
నుల్లసిల్ల నెడద యుర్వరకైన
ఎండిన శాఖల నెఱ్ఱని యాకు
పండిన తీరున పసిడి యాకులును
నిండిన యాకుల నిత్యహరితము
కొండొకచోనటఁ గూర్చును ముదము
విరియఁగ రంగులు పృథ్వి నెల్లెడల
మఱి మఱి మురియఁగ మనమిది లోన
మిన్నగ సొబగుల మించుచుండి తరు
లెన్నియొ కనఁబడ నింపుగ నెదుట
దాకగఁ దలఁపగు తరుశిఖరముల
నాకుల యందము లావిధి జూడ
No comments:
Post a Comment