Wednesday 14 December 2016

పొడుపు కధలు



పొడుపు కధలు  

1. కణుపు కణుపు పెరుగుతూ కట్టేలాగ కనబడు
పచ్చ  జండా  తొడ  బడుగు తరువు
తెచ్చి చీల్చి తినగ తెలుగంత తియ్యన  
ఇంతకీ నేనెవ్వరో చెప్పగలరా ?

2. మొదటి రెండక్షరాలు మాసమును తెలుపు
రెండు మూడు అక్షరాలూ రెమ్మయగు
మూడు గూడ నొకట ముద్దు గుమ్మ పేరు
ఆపేరు ఏమిటో చెపుతారా మీరు ?

3. రాగమునకు తోడుగా  ఉండు  
గాచు చుండు చోర గుణము నుండి
చెవి  ఉంటేనే  దీని  విలువ  
ఇంతకీ నేనెవరు ?  

4. చీకటి  కమ్ముకొని కప్పు ఉండు
పూలు బూయు నెల రాలకుండు
గాయును రేవగుల్ కాయలేమో రెండు
ఇంతకీ ఇవి ఏమిటి ?

౧. చెరకు ౨. నెలత  త్రీ. తాళము ౪. ఆకాశము, నక్షత్రములు, సూర్యచంద్రులు 


No comments:

Post a Comment