గురు శబ్దం లో 'గు'అంటే అంధకారం అని అర్థము. 'రు' అంటే దాన్ని నిరోధించే వాడు అని అర్థము మనలోని నిరక్షరాస్యత అనే అంధకారాన్ని పోగొట్టి విద్యా దీపం వెలిగించే వాడు.
కానీ ఈ కాలం లో అంతా తారుమారు అయింది.
గురుశిష్య బంధాలు గుంటలో పాతేసి
విద్య లన్నియు విక్రయ వీధి కొచ్చే
పాశ్చాత్య విద్యలే పరమ సత్యాలనుచు
ఆర్ష విజ్ఞానమ్ము అడుగు తాకె
తల్లిదండ్రు లింక తమవారు కాదని
భార్య బిడ్డలపై ప్రేమ హెచ్చె
ద్రవ్య మార్జించుటే తారక మంత్రమై
ధన దేవతకు సదా దాసులైరి
వక్ర మార్గాన పడుచున్న వారి నెల్ల
చక్క జేయగవలిసిన తరుణమొచ్చే
కాన గురువు లందరు బాధ్యత గుర్తెరింగి
మాన వత పెంచుడో మాన్యులార
ఉపాధ్యాయులు కూడా నేడు ధన సంపాదన మీదే దృష్టి నిల్పి కార్పొరేట్ బడులకు బానిసలై 'వాగ్దేవిని'వాణిజ్య
వీధిలో పెట్టి ప్రశ్నాపత్రాలు సంపాదించి సమాధానాలు ముందుగానే చెప్పడం,జవాబు పత్రాలు తిరగ రాయించడం,డబ్బు ఎర చూపిన వారికి మార్కు లేయ్యడం ,ఇలా తమ జ్ఞానాన్ని వక్ర మార్గం పట్టించి విద్యా దేవతకు తీరని అవమానం,అపకారం చేస్తున్నారు.ఇది ఎంతైనా గర్హించ వలిసిన విషయం.ఇలాగ వక్ర మార్గాన
ఉత్తీర్ణు లైన వారు వైద్యులైతే కొన్ని ప్రాణాలు పోవచ్చు ఇంజనీరులైతే కొన్ని భవనాలో,ప్రాజెక్టులో కూలి పోవచ్చు.ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకునే వారు ముందుగా తమ శీలాన్ని సరిచేసుకొని వృత్తి పట్ల అంకిత భావం ఉంటేనే ఆ వృత్తిని ఎంచుకోవాలి. ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలు కావాలి,సమాజ విఘాతకులు కారాదు.దురదృష్ట వశాత్తు నేడు కొందరు ఉపాధ్యాయులు కీచక పాత్ర పోషిస్తూ దుశ్శాసనులు గా మారి బిడ్డల వంటి ఆడపిల్లలతో నీచంగా,నికృష్టంగా ప్రవర్తిస్తున్నారు.కొంతమంది ఉపాధ్యాయులు నేడు ధన సంపాదన మీదే దృష్టి నిల్పి కార్పొరేట్ బడులకు బానిసలై 'వాగ్దేవిని'వాణిజ్య
వీధిలో పెట్టి ప్రశ్నాపత్రాలు సంపాదించి సమాధానాలు ముందుగానే చెప్పడం,జవాబు పత్రాలు తిరగ రాయించడం,డబ్బు ఎర చూపిన వారికి మార్కు లేయ్యడం ,ఇలా తమ జ్ఞానాన్ని వక్ర మార్గం పట్టించి విద్యా దేవతకు తీరని అవమానం,అపకారం చేస్తున్నారు.ఇది ఎంతైనా గర్హించ వలిసిన విషయం.ఇలాగ వక్ర మార్గాన
ఉత్తీర్ణు లైన వారు వైద్యులైతే కొన్ని ప్రాణాలు పోవచ్చు ఇంజనీరులైతే కొన్ని భవనాలో,ప్రాజెక్టులో కూలి పోవచ్చు.ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకునే వారు ముందుగా తమ శీలాన్ని సరిచేసుకొని వృత్తి పట్ల అంకిత భావం ఉంటేనే ఆ వృత్తిని ఎంచుకోవాలి. ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలు కావాలి,సమాజ విఘాతకులు కారాదు.దురదృష్ట వశాత్తు నేడు ఉపాధ్యాయులు కీచక పాత్ర పోషిస్తూ దుశ్శాసనులు గా మారి బిడ్డల వంటి ఆడపిల్లలతో నీచంగా,నికృష్టంగా ప్రవర్తించడం ఎంతో హేయమైన విషయం.శీల నిర్మాత కావలిసిన ఉపాధ్యాయుడు శీలం లేని వారుగా మారడం సమాజం సిగ్గుతో తలదించు కోవలిసిన పరిస్థితి కి
కారణ మవుతున్నది.ఈవిషయం లో ప్రభుత్వం,సమాజం తగిన చర్య తీసుకోవలిసిన అవసరం ఎంతో
వుంది.(ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా 'ఆంధ్రభూమి'మాస పత్రిక లోని వ్యాసం ఆధారంగా)2015 సెప్టెంబర్ 5
No comments:
Post a Comment