పురాణాలలోని కొన్ని విషయాలను తెలుసుకొందాం!
1). తాటికి ఎవరి భార్య? జ : సుందుడు
2). అహం బ్రహ్మస్మి అను మహావాక్యం ఏ వేదంలోనిది? జ: యజుర్వేదం
3). దశరథుని గురువు ఎవరు? జ: వశిష్ఠుడు
4). లక్ష్మీదేవి సోదరుడు ఎవరు? జ: చంద్రుడు
5). ఆదిత్యహృదయాన్ని ఎవరు, ఎవరికి ఉపదేసించారు? జ: అగస్త్యుడు. శ్రీరామునికీ.
6). నరకాసురుడు ఏ రాజ్యాన్ని పాలించేవాడు? జ: ప్రాగ్జ్యోతిషపురం
7). ఆరుముఖాలు గల దేవుడెవరు? జ: కుమారస్వామి
😎. హేమలత అని ఎవరికి పేరు? జ: హిమవంతుని కుమార్తె, పార్వతీదేవి.
9). ఆదిశంకరులు జన్మించిన పుణ్యక్షేత్రమేది? జ: కాలడి
10). సంగీతానికి సంబంధించిన వేదం ఏది? జ: సామవేదం
( మరి కొన్ని మరో పోస్ట్లో చూద్దాం)
0----
*నాయనా! ఉన్న విషయమేమంటే, ఈ లోకమంతా నీచమైన ప్రాపంచికతతో నిండిపోయింది. కాని నైతిక బలం, వివేకం కలవాళ్ళు వీటివల్ల ఎప్పుడూ మోసపోరు. 'లోకం తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడనీ. నేను ధర్మ మార్గాన్నే అనుసరిస్తాను'... ఇది ధీరుని విధానం అని తెలుసుకో. లేకపోతే రాత్రింబవళ్ళు ఈ వ్యక్తి ఏమన్నాడు, ఆ వ్యక్తి ఏమి వ్రాసాడు అని ఆలోచిస్తే ఈ లోకంలో ఏ మహత్కార్యము సాధ్యం కాదు.
: దేహం ఉండాలంటే శ్వాస ఉండాలి; శ్వాస వల్ల దేహానికి లాభం. 'తన'కు (ఆత్మ) కాదు.
తనువు ద్వారా వ్యవహరించేది ఎవడో వాడే "నీవు".
మారే సకలానికి మారనిది ఒకటి ఆధారంగా ఉంది. దానినే మనం 'దేవుడు' అనేది.
నేను లో శరీరం ఉంది; శరీరంలో నేను ఉంది.
మొదటి నేను అహం స్వరూపం. (ఆత్మ)
రెండవ నేను అహంకార రూపం. (నామరూపాలు)
శ్రీరమణీయం - (576)
భక్తుని ప్రశ్న : 'ఆత్మవిద్య' అతి సులభమైనది ఎట్లవుతుంది ?
శ్రీరమణమహర్షి : మరే విద్యకైనా జ్ఞాత , జ్ఞానము, జ్ఞేయము అనే మూడు కావాలి. దీనికి అవేవీ అక్కర్లేదు. అది తానే. ఇంతకన్నా విస్పష్టమైనది వేరేమి ఉంది. అందుచేత అది సులభం. నీవు చేయవలసిన సర్వమూ "నేనెవరన్న" విచారణమే !
భక్తుని ప్రశ్న : మా పూర్వజన్మలో మేమెవరము ? గతంలోని విషయాలు మాకు ఏల గుర్తుకురావు !?
శ్రీరమణమహర్షి : దేవుని కృప ఎంతటిదో కదా ! మీకవి స్మృతికి రానివ్వటంలేదు. తాము పుణ్యశీలురమని తెలిస్తే వారి గర్వానికి మేరలుంటాయా ? కాదు. పాపులైవుంటే వారికెంత నిరుత్సాహం, దిగులు కలిగేవో ! ఇందులో ఏదీ మంచిది కాదు. 'తనను తాను ఎరిగితే' చాలు. దైవం వేసివుంచిన ప్లాన్ పాలించబడుతుంది. ఏమి జరిగితే మాత్రం సంతాపం ఎందుకు ? సముద్రాన్ని చేరాక నదికి ప్రవాహం ఆగినట్లే మనుజుడు కూడా ఆత్మలో విలీనమైనాక, అన్ని …
అరుణాచల శివ🙏
భక్తుడు ఒకరు భగవాన్ తో “భగవాన్ ఆత్మను తెలుసుకోవాలని అంటారు.అది ఎక్కడ ఉంది ?దానిని ఎట్లా గా తెలుసుకోవటం ?”అని ఎంతో అమాయకంగా అడిగారు.
*“ఇప్పుడు నన్ను రమణాశ్రమం ఎక్కడ ఉంది ?అక్కడికి నేను ఎట్లా వెళ్లాలి ?అని అడిగితే నేను ఏమని సమాధానం చెప్పను? నీవు చూసేదంతా ఆత్మయే.దానిని ఎప్పుడూ అనుభవంలోనికి తీసుకుంటూనే ఉన్నావు .
కానీ అది తెలియక ఆత్మ ఎక్కడుందని వెళుతున్నావు.*
దానిని ఎఱుగుటకు చేసే ప్రయత్నం ,పండరీపురం భజన చేయడం వంటిదే.
భజన ఆరంభిస్తున్నప్పుడు అందరూ కాళ్లకు గజ్జెలు కట్టుకుంటారు.ఒక ఇత్తడి దీపాన్ని వెలిగించి ఇంటి మధ్యలో పెట్టి ,దాని చుట్టూ తిరుగుతూ భజనలు చేయడం ప్రారంభిస్తారు.
పండరీపురం చాలా దూరం.యాత్ర చేద్దాం రండి ,అని పాడుతారు.
నిజానికి దీపం చుట్టి వస్తారు.కానీ యాత్ర అని పాడుతారు .ఇట్లాగే పొద్దు పొడిచే వరకు భజన నడుస్తూనే ఉంటుంది.
ఉదయం అవుతుందనగా ,ఇదిగో పండరి పురం కనపడుతోంది .ఇంకాస్త దూరం ఉంది ,అని పాడుతారు.
ఉదయం వెంటనే పండరీపురం చేరాము.ఇదిగో పాండురంగడు అని పాడి ఆ దీపానికి నమస్కరించి భజన ముగిస్తారు.
ఈ ఆత్మ విషయంలోనూ ఇలాగే మనము కూడా ఆత్మను ఎప్పుడు దర్శిస్తూనే,ఆత్మ ఎక్కడ ?ఇంకా ఆత్మను ఇంకా పొందలేదే అని భజన చేస్తున్నాము.
అజ్ఞానాంధకారం తొలగి జ్ఞానం ఉదయించి నప్పుడు ,ఈ ఆత్మ ఇప్పుడే ,ఇక్కడే ఉన్నది .అది “నేనే “అని గుర్తించి ,భజన పూర్తి చేస్తాము .”అన్నారు భగవాన్.
"ముక్తిస్థితి ఎందుకని అర్ధం కావటంలేదు ?"
మన అసలు పేరు ముక్తి. ఇప్పుడున్నది అదనంగా వచ్చి చేరిన స్వరూపం. మనకు పూర్వజన్మల గురించి తెలియటం దేవుని అనుగ్రహం అనుకుంటాం. కానీ మనం ఆ పూర్వజ్ఞానాన్ని మరిచిపోవటమే ఆయన అనుగ్రహం. ఎందుకంటే పూర్వపుణ్యం తెలుస్తే మనకు గర్వం వస్తుంది. చేసిన పాపాలు తెలిస్తే బాధ కలుగుతుంది. అందుకే వర్తమానంలో ఉన్న నేను ఎవరో తెలిస్తే చాలని భగవాన్ శ్రీరమణమహర్షి సెలవిచ్చారు. ఇప్పుడు మన గుణాలు మన మనసును అధిగమిస్తున్నాయి. అందుకే మన ముక్తిస్థితి మనకు అర్ధం కావటం లేదు !
: "ఋభుగీత " (43)
3వ అధ్యాయము [ప్రపంచము చిన్మాత్రము]
ప్రపంచానుభవం నీ విలువ నీకు తెలుసుకోడానికే !!
మనం దేన్నైనా 'అది' అని అంటున్నామంటేనే.. అలా అనటానికి మనం ఉండి తీరాలి. నిద్రలో మనం ఉన్నట్లు మనకు తెలియదు. మన పంచేంద్రియాలు ఏవీ అప్పుడు పనిచేయవు. నిద్రలో ప్రపంచమే కాదు మనం ఉన్నట్లే మనకు తెలియడం లేదు. ఈ ఏర్పాటు అంతా మనం ఉన్నట్లు మనకి తెలియడానికే. జాగృతిలో ప్రపంచానుభవం ఎందుకు కలుగుతుందంటే నీ విలువ నీకు తెలుసుకోడానికే. ఈ సృష్టి అంతా భగవంతుని శక్తి చాటుకోవడానికి కాదు, అసలు వస్తువు విలువ తెలుసుకోడానికే !!
......
11-28,29,30-గీతా మకరందము
విశ్వరూపసందర్శనయోగము
యథా నదీనాం బహవోఽమ్బువేగాః
సముద్రమేవాభిముఖా ద్రవన్తి |
తథా తవామీ నరలోకవీరా
విశన్తి వక్త్రాణ్యభివిజ్వలన్తి ||
తా:- ఏ ప్రకారము అనేక నదీప్రవాహములు సముద్రాభిముఖములై ప్రవహించుచు అందుప్రవేశించుచున్నవో, ఆప్రకారమే ఈ మనుష్యలోకమందలి వీరులు (రాజులు) లెస్సగ జ్వలించుచున్న మీనోళ్లయందు ప్రవేశించుచున్నారు.
॥ ఓం - గీతా మకరందము [11-29]॥
యథా ప్రదీప్తం జ్వలనం పతఙ్గా
విశన్తి నాశాయ సమృద్ధవేగాః |
తథైవ నాశాయ విశన్తి లోకా
స్తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః ||
తా:- ఏ ప్రకారము మిడుతలు వినాశముకొఱకు మిక్కిలివేగముతో గూడినవై బాగుగ మండుచున్న అగ్నియందు ప్రవేశించుచున్నవో ఆప్రకారమే జనులున్ను మిగులవేగముతో గూడినవారై నాశముకొఱకు మీనోళ్ళయందు ప్రవేశించుచున్నారు.
॥ ఓం - గీతా మకరందము [11-30]॥
లేలిహ్యసే గ్రసమానస్సమన్తా
ల్లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః |
తేజోభిరాపూర్య జగత్సమగ్రం
భాసస్తవోగ్రాః ప్రతపన్తి విష్ణో ||
తా:- ఓ విష్ణుమూర్తీ! మండుచున్న నీయొక్క నోళ్ళచే జనులందఱిని అంతటను మ్రింగుచున్నవాడవై ఆస్వాదించుచున్నావు. నీయొక్క భయంకరములైన కాంతులు తమ తేజస్సులచేత జగత్తునంతను వ్యాపించి మిగుల తపింపజేయుచున్నవి.
........
No comments:
Post a Comment