: *భగవద్గీత పైన అందరికి ఉండవల్సిన అవగాహన కోసం...హిందూ ధర్మం పాటించే ప్రతీ ఒక్కరికీ షేర్ చేయండి*
*1.* భగవద్గీతను లిఖించినదెవరు?
=విఘ్నేశ్వరుడు.
*2.* భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము?
= భీష్మ పర్వము.
*3.* గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును?
=మార్గశిర మాసము.
*4.* గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును?
=హేమంత ఋతువు.
*5.* ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వసంత ఋతువు.
*6.* భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను?
=శ్రీకృష్ణుడు అర్జునునికి.
*7.* భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను?
=కురుక్షేత్ర సంగ్రామము.
*8.* భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యెను?
=కౌరవ పాండవులకు.
*9.* పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధిగా వుండెను?
=అర్జునుడు.
*10.* వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను?
=సామవేదము.
*11.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి?
=పాంచజన్యము.
*12.* భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు?
=పద్దెనిమిది (18)
*13.* “నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోథుడెవరు?
= వినోబా భావే.
*14.* “సంశయములు నన్నావరించినపడు, సంకటములు సంప్రాప్తమైనపుడు, నిరాశా నిస్పృహలు జనించినపుడు నేను భగవద్గీత తెరచి చూచెదను. అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించును.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?
= మహాత్మా గాంధీ.
*15.* భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు?
= సంజయుడు.
*16.* సేనానాయకులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=కుమారస్వామి.
*17.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి?
=దేవదత్తము.
*18.* భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి?
= ఐదు. (అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, ఉపజాతి, విపరీతపూర్వ.)
*19.* భగవద్గీతను సాక్షాత్తుగా (లైవ్) వినినవారెవరు?
=నలుగురు. అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు.
*20.* ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= శ్రీరామచంద్రుడు.
*21.* భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?
=అచ్యుత, అనంత, జనార్ధన.
*22.* భగవద్గీత యందు అర్జునునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?
=ధనుంజయ, పార్ధ, కిరీటి.
*23.* శ్రీకృష్ణపరమాత్మ తన అవతార సమయంలో రెండు గానములు చేసెను. ఒకటి మురళీగానం. మరి రెండవది ఏమిటి?
=గీతా గానం.
*24.* “ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్” అనే పేరుతో భగవద్గీతను ఆంగ్లభాషలో పద్యరూపమున వ్రాసిన ఆంగ్లకవి ఎవరు?
=ఎడ్విన్ ఆర్నాల్డ్.
*25.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరేమిటి?
=పౌండ్రము.
*26.* ఏకాదశ రుద్రులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=శంకరుడు.
*27.* “నా తల్లి చాలా కాలం క్రిందటే మరణించెను. కానీ అప్పటినుండి భగవద్గీత యను తల్లి ఆ స్ధానమును ఆక్రమించి, నా పక్కనే వుండి నన్ను కాపాడుచున్నది.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?
=మహాత్మాగాంధీ.
*28.* భగవద్గీత ఏ వేదములోనిది?
=పంచమ వేదం-మహాభారతం.
*29.* భగవద్గీత యందు ఎన్నవ అధ్యాయంలో భగవంతుని విశ్వరూప సందర్శన ప్రత్యక్షముగా వర్ణింపబడినది?
=11వ అధ్యాయము
*30.* ద్వాదశాదిత్యులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=విష్ణువు
*31.* భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి?
=అర్జున విషాద యోగము.
*32.* భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుధ్ధము చేయగలడు?
=పదివేలమంది.
*33.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి?
=అనంతవిజయము.
*34.* భగవద్గీత మొదటి శ్లోకం ఏ పదం (శబ్దము)తో ప్రారంభమవుతుంది?
= “ధర్మ” - శబ్దముతో గీత ప్రారంభమయినది.
*35.* ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతీ విషయమును గీత సంవాదముతో సహా ఎప్పటికపుడు ప్రత్యక్షంగా (లైవ్) వివరించినదెవరు?
=సంజయుడు.
*36.* భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటిరోజున పాండవుల తరపున వ్యూహ రచన చేసినది ఎవరు?
=దృష్టద్యుమ్నుడు.
*37.* ఆయుధములలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వజ్రాయుధము.
*38.* మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధవ్యూహము పేరేమిటి?
=వజ్ర వ్యూహం.
*39.* గీతా సంవాదము జరిగిన మహాభారత సంగ్రామ మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు?
=భీష్ముడు.
*40.* సర్పములలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాసుకి.
*41.* అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= అనంతుడు.
*42.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులుడు ఊదిన శంఖం పేరేమిటి?
=సుఘోషము.
*43.* అర్జునుని ధనస్సు పేరేమిటి?
=గాండీవము.
*44.* జీవునకు ఈ శరీరమునందు ఎన్ని అవస్థలు కలుగునని శ్రీకృష్ణుడు చెప్పెను?
=నాలుగు. (బాల్యము, యౌవనము, వార్థక్యము, దేహాంతర ప్రాప్తి)
*45.* నదులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= గంగానది.
*46.* ఆత్మ యెట్టిది?
=నాశరహితమైనది.
*47.* కొంత ఆచరించి మధ్యలో వదిలివేసిననూ నిష్ఫలము కాని కర్మను ఏమందురు?
=నిష్కామ కర్మ.
*48.* మనుజునకు దేనియందు అధికారము కలదు?
=కర్మలు చేయుటయందు మాత్రమే. (ఫలమునాశించుట యందులేదు.)
*49.* అర్జునుడు ఎవరి లక్షణములు-భాష, నివాసము, నడవడిక తెలుపమని శ్రీకృష్ణుని అడిగెను?
=స్థితప్రజ్ఞుడు (జీవన్ముక్తుని లక్షణములు.)
*50.* వృక్షములలో తాను ఏ వృక్షమని శ్రీ కృష్ణుడు చెప్పెను?
= రావిచెట్టు.
*51.* పంచభూతములచే నాశనము పొందనిది ఏది?
=ఆత్మ.
*52.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి?
=మణిపుష్పకము.
*53.* ప్రపంచమున పూర్ణానందమెచట లభించును?
=ఆత్మయందు.
*54.* మహాభారత సంగ్రామంలో అర్జునుని రధము యొక్క జెండాపై గల వానరుడెవరు?
=హనుమంతుడు.
*55.* పక్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= గరుత్మంతుడు.
*56.* ఏ జంతువు వలె యోగి అయినవాడు తన ఇంద్రియములను వెనుకకు మరల్చును?
=తాబేలు.
*57.* కర్మచేయుట మేలా, చేయకుండుట మేలా?
=చేయుటయే మేలు.
*58.* బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించునపుడు వారితో సహా మఱి వేనిని సృష్టించిరి?
=యజ్ఞములు (సత్కార్యములు, దైవకార్యములు)
*59.* వివేకవంతుడు కర్మలను ఎందుకు చేయవలెను?
=లోక క్షేమం కొరకు.
*60.* ఆవులలో తాను ఏ ఆవునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= కామధేనువు.
*61.* స్వధర్మ, పరధర్మములలో ఏది శ్రేష్ఠమైనది?
=స్వధర్మము.
*62.* పొగచేత అగ్నియు, మురికిచేత అద్దము, మావిచేత గర్భమందలి శిశువు కప్పబడి వున్నట్లు ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడియుండును?
=కామము చేత.
*63.* దేని ప్రేరణచే జీవుడు తాను వద్దనుకొన్ననూ పాపమును చేయుచున్నాడు?
= కామము యొక్క ప్రేరణచే.
*64.* భగవంతుడెపుడు అవతరించును?
=ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధిపొందునపుడు.
*65.* అసురులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ప్రహ్లాదుడు.
*66.* గంధర్వులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= చిత్రరథుడు.
*67.* హృదయ శుద్ధి తద్వారా మోక్షము దేనివలన కలుగగలదు?
=జ్ఞానతపస్సు.
*68.* జ్ఞానప్రాప్తి వలన కలుగు ఫలితమేమిటి?
=పరమశాంతి.
*69.* ఆత్మధ్యానమును అభ్యసించుచున్న యోగి యొక్క మనస్సు దేనితో పోల్చవచ్చు?
=గాలిలేనిచోట గల దీపంతో.
*70.* ఏ సాధనములచేత మనస్సు నిగ్రహింపబడగలదు?
=అభ్యాసము, వైరాగ్యము.
*71.* భయంకరమైన మాయను దాటుట ఎట్లు?
=భగవంతుని శరణుపొందుట వలన.
*72.* భగవంతుని సేవించువారిని ఎన్నిరకములుగా శ్రీకృష్ణుడు వర్గీకరించెను?
=నాలుగు రకాలు (ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని.)
*73.* భగవత్స్వరూపమును ఎవరు తెలిసికొనలేరు?
=అజ్ఞానులు.
*74.* విద్యలలోకెల్లా శ్రేష్ఠమైనది, అతిరహస్యమైనది ఏది?
=బ్రహ్మవిద్య.
*75.* మహర్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= భృగు మహర్షి.
*76.* బ్రహ్మవిద్యకు అర్హత యేమి?
=హృదయ శుద్ధి, అసూయాది దుర్గుణరాహిత్యము.
*77.* ఆకాశమునందు వాయువు వలె, సమస్త ప్రాణికోటి ఎక్కడ స్థితిగలిగి యున్నది?
=పరమాత్మయందు.
*78.* గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడెట్లు కాగలడు?
=పరమాత్మయందు అనన్యభక్తిచే.
*79.* ఎప్పటికీ దుర్గతి పొందనది ఎవరు?
=భగవంతుని భక్తుడు.
*80.* సమస్త ప్రాణికోటి యొక్క హృదయాంతరాళములందు నివసించు ప్రత్యగాత్మ ఎవరు?
=సాక్షాత్తు పరమాత్మయే.
*81.* ఇంద్రియములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=మనస్సు.
*82.* పర్వతములలో తాను ఏ పర్వతమని శ్రీకృష్ణుడు చెప్పెను?
=మేరువు.
*83.* పురోహితులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=బృహస్పతి.
*84.* వాక్కులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=ఓం కారము.
*85.* యజ్ఞములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు నుడివెను?
=జప యజ్ఞము.
*86.* ఏనుగులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ఐరావతము.
*87.* గుర్రములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ఉచ్ఛైశ్శ్రవసము.
*88.* శ్రీకృష్ణ భగవానునిచే ఆహారము ఎన్ని రకమలుగా పేర్కొనబడెను?
= మూడు (సాత్విక, రాజస, తామసాహారము)
*89.* దేవఋషులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= నారదుడు.
*90.* సిద్ధులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=కపిల మునీంద్రుడు.
*91.* భగవద్గీత చివరి అధ్యాయము పేరేమిటి?
= మోక్షసన్యాస యోగము.
*92.* లెక్కపెట్టువారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= కాలము.
*93.* జలచరాలలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= మొసలి.
*94.* ఆత్మను దేహమునందు ఉంచుటకు కారణమైన మూడు గుణములేవి?
= సత్త్వ, రజ, తమో గుణములు.
*95.* వేగముగా సంచరిస్తూ పవిత్రమొనర్చు వారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాయువు.
*96.* భక్తియోగమైన పన్నెండవ అధ్యాయంలో భక్తుని లక్షణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?
= 35.
*97.* విద్యలోల తాను ఏ విద్యనని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ఆధ్యాత్మ విద్య.
*98.* రాగద్వేష రహితముగా, తత్త్వ నిశ్చయము కొరకు వాదించువారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాదము.
*99.* అక్షరములలో తాను ఏ అక్షరమని శ్రీకృష్ణుడు చెప్పెను?
= "అ"-కారము.
*100.* భగవంతుని విశ్వరూప సందర్శనమును ఎవరు మాత్రమే చూసెను?
= అర్జునుడు. (వ్యాసుడు, వ్యాసుని వరం వలన సంజయుడు, రథ ధ్వజంపై అదృశ్యరూపంలో వున్న హనుమంతుడు కూడా)
*101.* మాసములలో తాను ఏ మాసమునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= మార్గశిరము.
*102.* క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమైన 13వ అధ్యాయములో జ్ఞానగుణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?
= 20 (ఇరువది).
*103.* శ్రీకృష్ణ భగవానునిచే దైవగుణములు ఎన్ని పేర్కొనబడెను?
= 26 (ఇరువదియాఱు).
*104.* శ్రీకృష్ణ భగవానునిచే అసుర గుణములు ఎన్ని పేర్కొనబడెను?
= 6 (ఆఱు).
*105.* తపస్సులెన్ని రకములు?
= మూడు (శారీరక, వాచిక, మానసిక)
*106.* పరబ్రహ్మమునకు ఎన్నిపేర్లు కలవు?
= మూడు (ఓమ్, తత్, సత్).
*107.* మోక్షమును పొందుటకు కర్మలను వదలవలెనా?
= లేదు. కర్మలు చేయునపుడు భగవంతుని యందు మనస్సు లగ్నమై వుండవలెను.
*108.* సంజయుడు ఎవరి అనుగ్రహముచే ఈ గీతాసంవాదమును నేరుగా (లైవ్) వినగలిగెను?
వేదవ్యాసుడు.
💐🙏💐
నేటి బ్రహ్మజ్ఞానము .. ప్రాంజలి ప్రభ .. 111
సేకరణ రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
అవమానాలు, దూషణలు, అహంకారాన్ని గాయపరచక మానవు. అయితే ఈ రెండూ జ్ఞాని దృష్టిలో, దూషించేవాని మనస్సులో కదిలే రెండు రకాల భావనా వీచికలు మాత్రమే!
సంతోషంతో నిండిన మనస్సులోంచి పొగడ్తల వంటి మంచి శబ్దాలు వస్తాయి. క్రోధ విచారాలతో ఈర్ష్యతో నిండిన మనస్సు నుండి తిట్లు అవమానాలు ఉదయిస్తాయి.
వస్తుతః రెండూ కూడా మనోవికార జనిత భావాలే! భావనాధారంగా ఆత్మ చైతన్యంగా తన్ను తాను తెలుసుకున్న జ్ఞాని భావాల క్రీడ అని శాంతంగా సమదృష్టితో వీక్షిస్తాడు.
సాధారణంగా మనలోని అహంకారమే బుద్ధితో తాదాత్మ్యం చెంది ఎదుటివారి మాటల అర్థాన్ని గ్రహించి సంతోష విచారాలను అనుభవిస్తూ ఉంటుంది.
ఆత్మతత్త్వాన్ని అర్థం చేసుకుని అహంకారపు మాయను జయించిన ధీరుని, మానావమానాలు ఏం చెయ్యగలవు? రెండూ అదే చైతన్యంలో ఉద్భవించి నర్తించి నమస్కార సూచకమైన మౌనంతో పాదాభివందనం చేసి అదృశ్యమయిపోతాయి.
ఒకసారి బుద్ధభగవానుడు బజారులో నుండి శిష్యసమేతంగా వస్తూ ఉన్నాడు. ఒకవ్యక్తి
ఆయనను సమీపించి దూషించి అవమానించడం మొదలు పెట్టాడు. అన్నిటినీ శాంతంగా వింటూ భగవానుడు నిలబడ్డాడు.
అవన్నీ పూర్తయిన తరువాత ఆదే శాంతంతో ఆయన ముందుకు సాగబోతుంటే ఆయన శిష్యుడు అపరిమితమైన ఆవేశంతో 'స్వామీ ఆ నీచునికి బుద్ధి చెప్పి వస్తాను అనుజ్ఞ " నీయండి, దైవస్వరూపులయిన మిమ్మల్ని అన్ని మాటలన్న అతడు క్షమార్హుడు కాడు" అన్నాడు. అందుకాయన చిరునవ్వుతో "వత్సా! అతడన్న మాటలన్నిటిని నేను విన్నాను కాని, స్వీకరించలేదు.
అందుకే నేనతనికి తిరిగి యివ్వవలసిందేదీ లేదు. ఒకవేళ నీవు స్వీకరించి ఉంటే తప్పకుండా వెళ్ళి బదులు తీర్చి రా నాయనా' అన్నారట. బుద్ధితో సాధించగలిగిన పూర్ణత్వం ఇదే. దీనినే సమబుద్ధి అంటారు.
ఆత్మజ్ఞానికి తన చైతన్యమే భావనా తరంగాలుగా సర్వత్రా నర్తిస్తూందనే సత్యం సర్వదా స్ఫురిస్తూనే ఉంటుంది. చూడబడే, గుర్తింపబడే సర్వమూ తన నర్తనలే అని అతడికి స్పష్టంగా తెలుసు.
అహంకారంలేని కారణంగా, మనో బుద్ధులతో తాదాత్మ్యం చెంది, సంఘటనలను యిష్టాయిష్టాల దృష్టితో చూడడు. మానఅవమానాలతనికి సమానమే. దేనిపైనా అతనికి ఆకర్షణా వికర్షణా ఉండవు.
సర్వత్రా, సర్వదా, సర్వ సంఘటనలలోనూ, చైతన్యమయిన తానే భావనా తరంగాలుగా నర్తించడాన్ని గుర్తిస్తూ మౌనసమయ మాధురీపూర్ణ మానసంతో శాంతుడై ఉంటాడు!
ప్రతి స్ఫురణము లేక స్పందన లేక కంపమునకు హేతువు అగు మహాశక్తి మాయ- దైవము.
ప్రతి చలనము నకు కావలసిన చలన శక్తి- దైవము. ప్రతి తేజమును వీక్షించు చూపు అనే కాంతి లక్ష్మి- దైవము. ప్రతి మాటలోని శబ్ధబ్రహ్మము-దైవము.
ప్రతి హృదయములోని జాగరూకమైన ప్రాణము- దైవము. ప్రతి శిరస్సు అందలి
ధ్యానము- దైవము. ప్రతి చూపు లో ప్రకాశము- దైవము ప్రతి మూలాధార చక్రమున
జ్వలించునది-దైవము.
***
శీర్షిక:-నాకు నేనే -- ప్రాంజలి ప్రభ (వ్యాసం) --1
*********
నిలదీసే తత్వాన్ని నిద్రపుచ్చకు, రాజీపడే తత్వాన్నిచేరనీకు, నిజాన్ని నిర్భయంగా తెలుపుట మరువకు, దేశ భక్తి , మాతృభాష రక్షణ, నరనరానికి ఎక్కించుకొన్నాక, తల్లి లేరు తండ్రి బంధువులు అసలే లేక, బాధ్యత క న్నా భయమే తోడు రానీక, చేయనెంచ దలచినది నిర్భయంగా, నిస్వార్ధంగా, నిర్ణయ పరంగా, హృదయం ఒక యంత్రంగా, విద్యుత్తై ఆయుధంగా, కనబడని గాలిలాగా దూసుకు పోయే ఇంధనంగా సేవలకై నిత్య ప్రయత్నం.
దేహమంతా ఆవహించి చిన్ని గుండెలో తిష్టేసింది ఆ ఉదయాన..!!
తప్పు చేయకున్నా, తప్పించుకునే దారులు వెతకకున్నా, వెతుకులాటలో వ్యక్తిత్వం చూపే హృదయమున్నా, రుధిరం చిందించకుండా, సమయం వ్యర్ధ అవ్వకుండా, దొడ్డి దారి లోకి దూర కుండా, నిర్మలమైన మనస్సుతో, నవ్వులమ్మ మొగం చూపిస్తూ, సర్వం నిగ్రహించె
హృదయాంతరంగాన. తిష్టేసింది ఆ ఉదయాన..!!.
నిత్యం నీళ్ళు పోసి పెంచిన సహజత్వం పూలమొక్కల వంటి ఎదుగుతున్న యువక వర్ధమాన శక్తి, వాడిపోయే వారికి చేయుట నిచ్చే శక్తి, మొగ్గలుగానే రాలిపో కుండా పులా పరిమాళాలను అందించేవిధముగా వికాసం కల్పించే శక్తి యువరక్తం, వృద్ధులకు, స్త్రీలకు, పిల్లలకు,
నడవడిక రాజమార్గాన.తిష్టేసింది ఆ ఉదయాన..!!.
నేరమొకడు చేసి శిక్షను వేరొకరి కేసిన, నోరు మెదపని ప్రజానీకం చుస్తే ఏమనాలో నాకు మాత్రం తెలియలేదు, ఇటువంటి పిరికి బందల మనస్సు మార్చాలని నా ప్రయత్నం,
ఆలవాలమై ఆలనాపాలనా లో అబద్రతా భావ ఆనవాళ్లు అడుగడుగునా ధనమదం, అధికార జులం, రక్షక భటుల అగమ్య గోచరం, మార్పు రావాలని తిష్టేసింది ఆ ఉదయాన..!!.
మొలకెత్తి నిలకడ తత్వం లేని మానవత్వం, పెరిగి పోతున్నా న్యాయ వాద రాజనీతి చదరంగం ఆటలు వెల్లువ ప్రజలకు నిదుర కరువైంది, ఆకలి మొదలైంది, మందుల మోసం ఎగసి పడుతున్నది, నకిలీ విత్తనాలు బాజారులో అమ్ముడవుతున్న పట్టించుకోని ప్రభుత్వాలు, కేవలము సంపాదన, సంపాదనా గుప్పెడు అన్నాని కోసం కోట్లు దాచటం తిష్టేసింది ఆ ఉదయాన..!!.
నన్ను నేను హింసించుకుంటు అనారోగ్యాన్ని ఆహ్వానించక, ధైర్యాన్ని ఊపిరిగా వివరించి, స ర్వే జనా సుఖినోభవంతు అంటూ నిలకడ లేని నా ప్రయాణం సాగిస్తూ, మనశ్శాంతి ఎక్కడ ఎక్కడ అంటూ ధర్మాన్ని రక్షించ దలిచాను మనసా, వాచా, కర్మణా, నిరీక్షనా జీవితం తిష్టేసింది ఆ ఉదయాన..!!.
మనఃపూర్వక భావవ్యక్తీకరణ మౌనం వహించక భాషలో అసహనం అపసృతులు తాండవించకుండా, మనసుకు బుద్ధి కి మద్య వైరుధ్యాల యుద్ధాలు సహజమైన, దాని భావాల్ని ఉత్తేజ పరచడానికి నిర్విరామ కృషిగా నిత్యం చేస్తూనే వున్నాక సత్యం ఎక్కడ లోన ఈ లోకానా తిష్టేసింది ఆ ఉదయాన..!!.
చేతకాని తనమో, కాదు కాదు చేవలేని తనమో అన్న మాటలకూ తలఒగ్గకుండా ప్రశ్నించలేని అస్తిత్వాన్ని కోల్పోక స్థిరత్వాన్ని నిలపడానికి శ్రావ్య శక్తులను ప్రజ్వలింప చేయ గలను, నిస్సహాయుడను కాను ఒక్కడినే అయినా తోడు రాక పోయినా ఎంత మంది ఉన్న గమ్యాన్ని మార్చను, ఆలోచనలను ఆచరణకు త్రికరసిద్ధిగా ప్రయాణాలు సాగె వారికీ చే యూత నివ్వ గలను అదే నా లక్ష్యం , నా ధ్యేయం, నా కర్మలు చేయు మర్మం, తిష్టేసింది ఆ ఉదయాన..!!.
అస్తవ్యస్తంగా మారిన జీవనశైలిలో స్థిరత్వం శిధిలమై పోకుండా, అంతరంగమంతా ఆత్మ తత్వంగా ప్రశ్నలే ప్రశ్నలు జవాబులు తెలియపరుస్తూ హృదయాంతరాలలో జీవిస్తూ,
జవాబు దారి తనాన్ని అందరికి అందిస్తూ, ఎడారి చేసిన మార్గాన్ని పరిశీలించి పునర్ నిర్మిస్తూ
రాజీ ధోరణిలో నన్ను నేను కోల్పోక జీవశ్చవంగా కనిపించక నిర్ణయాలన్ని ఆ భగవంతుడు చేయిస్తున్నాడని భవిస్తూ నలుగురికి సేవలు చేస్తూ ఆ హనుమంతుడ్ని ప్రార్ధిస్తూ నాగమ్యం పూల బాటగా మార్చుకోవాలని ఈ ప్రయత్నం అందుకే తెలుగును రక్షించు కుందా, పరభా షను తరిమేద్దాం ఓం శ్రీ రామ శ్రీ మాత్రే నమః తిష్టేసింది యీ ఉదయాన..!!.
*******
🌷శుభమస్తు🌷 🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
No comments:
Post a Comment