"మిత్రులకు శ్రేయోభలాషులకు sri ramanavami శుభాకాంక్షలు"
శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-10
రావణుడు అశోక వాటికకు వచ్చుట
మంగళకరమైన చతుర్వాద్య ధ్వనులచే వేకువనే మేల్కొన్న ప్రతాపశాలియైన రావణుడు కామ వికారముచే సీతాదేవిని చూచుటకు అశోక వనమున ప్రవేశించెను. అప్పుడు హనుమ ఆకుల మధ్య నక్కి పరికించి చూచుచుండెను. అప్పుడు సీతాదేవి తొడలతో ఉదరమును, బాహువులతో వక్షస్థలమును కప్పుకొని (ముడుచుకొని) ఏడ్చుతూ కూర్చొనెను.

(ఆచ్ఛా
ద్యోదర మూరుభ్యాం బాహుభ్యాం చ పయోధరౌ, ఉపవిష్టా విశాలా౭క్షీ రుదన్తీ
వరవర్ణినీ). వైవాహికో విధిః స్త్రీణాం ఔపనాయనికః స్మృతః అను స్మృతి
వాక్యమును అనుసరించి స్త్రీలకు వివాహము పునర్జన్మ. వివాహ సంస్కార ఫలితముగా
సీత ఇక్ష్వాకు వంశమున మెట్టినది.
రావణుడు సీతను చూచి "సీతా నీవు భయపడనవసరము
లేదు. స్వధర్మో రక్షసాం భీరు సర్వథైవ న సంశయః గమనం వా పర స్త్రీణాం హరణం
సంప్రమథ్య వా, ఏవం చైత ద౭కామాం చ న త్వాం స్ప్రక్ష్యామి మైథిలి కామం కామః
శరీరే మే యథా కామం ప్రవర్తతామ్ బలాత్కారముగా పరస్త్రీలను పొందుట
రాక్షసులమైన మాకు స్వధర్మము.
(మరి అయితే మానవ కాంతయైన సీత ధర్మములకు విలువ
ఈయక పోవడంలో రావణుని నీచ ప్రవ్రుతిని తెలియజేస్తుంది. మన ధర్మము అనుసరిస్తూ
పర ధర్మములను గౌరవించాలి. ప్రస్తుత కాలంలో ఇది పాటించబడుట లేదు. మిక్కిలి
శోచనీయం) అయినను
నేను కామాతురడను, కానీ బలాత్కారముగా నిన్ను తాకను. ఓ
మైథిలీ! నీవు అనేకమైన దివ్యమైన సుగంధములు, వస్త్రములు ధరించి నన్ను
చేరుము". ఈ విధముగా అనేక విధములుగా రావణుడు తన పరాక్రమమును చూపి,
ప్రలోభములను పెట్టి సీతను తన వైపుకు త్రిప్పుకొనుటకు ప్రయత్నము చేసెను.
సీత రావణునికి హితవు పలుకుట
సీత రావణునికి హితవు పలుకుట
ఆ
రాక్షసుని మాటలకు దుఃఖార్తియై, దీనురాలై శ్రీరాముని తలంచుతూ ఒక గడ్డి
పరకను అడ్డుపెట్టుకొని ఇట్లు పలికెను. "నా నుండి మనసును మరల్చుకొని నీ
వారిపై మనసును నిలుపుకొనుము. పాపము చేసినవాడు సిద్ధిని కాంక్షించుట ఎంత
అయుక్తమో నీవు నన్ను
కాంక్షించుట అంత అయుక్తము.
యథా తవ తథా౭న్యేషాం దారా రక్ష్యా నిశాచర 5.21.7
ఆత్మానమ్ ఉపమాం కృత్వా స్వేషు దారేషు రమ్యతామ్
అకృతా౭౭త్మానమ్ ఆసాద్య రాజానమ్ అనయే రతమ్ 5.21.11
సమృద్ధాని వినశ్యన్తి రాష్ట్రాణి నగరాణి చ
అకృతా౭౭త్మానమ్ ఆసాద్య రాజానమ్ అనయే రతమ్ 5.21.11
సమృద్ధాని వినశ్యన్తి రాష్ట్రాణి నగరాణి చ
మిత్రమ్ ఔపయికం కర్తుం రామః స్థానం పరీప్సతా 5.2119
వధం చా౭నిచ్ఛతా ఘోరం త్వయా౭సౌ పురుషర్షభః
వధం చా౭నిచ్ఛతా ఘోరం త్వయా౭సౌ పురుషర్షభః
విదితః స హి ధర్మజ్ఞః శరణాగత వత్సలః 5.2120
తేన మైత్రీ భవతు తే యది జీవితు మిచ్ఛసి
తేన మైత్రీ భవతు తే యది జీవితు మిచ్ఛసి
పరుని
భార్యను అనుభవించవలెనని కోరిక కలిగినప్పుడు ఒక్కసారి తన విషయమున గూడ నా
భార్యను వేరొకడు బలాత్కరించి చెరబట్టినచో ఎట్లుండును? ఆలోచించుకొనుము. ధృడ
మనస్కుడు కాక పాపకార్యములను ఆచరించు రాజును పొందినచో ఎంతటి సమృద్ధములైన
రాజ్యములు నశించక మానవు. లోకములో నిలకడ కావాలని కోరినచో రామునితో మైత్రి
చేసికొనుము. ఘోరమైన చావు చావకుండుటకైనను రామునితో మైత్రి చేసికొనుము.
రావణునకు సీతమ్మ చేసిన ఈ ఉపదేశము సంసారులకు అందరికి ఉపదేశమే. ఇట్లు పలికిన సీత వాక్కులను విని రావణుడు కోపముతో .. బ్రతిమాలుచున్న కొలది స్త్రీకి చులకన యగును. నీపై కల్గిన కామముచే నా కోపమును ఆపి వేయుచున్నది.

వామః కామో మనుష్యాణాం యస్మిన్ కిల నిబధ్యతే
జనే తస్మిం స్త్వ౭నుక్రోశః స్నేహ శ్చ కిల జాయతే 5 .22 4
జనే తస్మిం స్త్వ౭నుక్రోశః స్నేహ శ్చ కిల జాయతే 5 .22 4
ఏ
మనుజులపై కామము కలుగునో ఆ మనుజులు శిక్షింపదగిన వారైనను వారిపై దయా
స్నేహములు కలుగును. నీవు నన్నాడిన పరుష వాక్యములకు నిన్ను క్రూరముగా
సంహరింపవలసి యున్నది సీతా! నీకు సంవత్సరము గడువు ఒసగితిని. ఇంకా నీకు రెండు
మాసములు మాత్రమే వ్యవధి యున్నది. అప్పటికి నీవు నన్ను అంగీకరింపనిచో
నిన్ను నాకు ప్రొద్దుటి భోజనమునకు వినియోగింతురు అని పరుషముగా మాట్లాడి
వెడలిపోయెను. తరువాత రాక్షస స్త్రీలు, సీతకు నయానా, భయానా అనేక రకములుగా
రావణుని పొందమని నచ్చచెప్పుటకు ప్రయత్నము చేసిరి. కానీ సీత వారి మాటలను
నిరాకరించెను. అశోక వృక్షముపై యున్న హనుమ వీరి మాటలను నిశ్చలముగా వినెను.
శ్రీరామ జయరామ జయజయ రామ
ఓం శ్రీ రామ
ReplyDelete