యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-7
రావణ అంతఃపురమున హనుమ ప్రవేశించుట
హనుమ లంకానగరములో అనేకమైన భవనములను, పతివ్రతలగు స్త్రీలు వారి భర్తలతో నిదురించుటను, ప్రియురాండ్రపై తమ హస్తములు వేసిన స్త్రీలను, అనేకమైన పరిశుద్ధ స్వభావులు, మహానుభావలు, సుప్రభావలు, కాంతిమతులు, లజ్జావతులు, ప్రియుల ఒడిలో కూర్చున్నవారు, బంగారు కాంతుల గలవారు, మేలిముసుగు లేనివారు ఇలా అనేకమైన స్త్రీలను చూచెను. తరువాత రావణ అంతఃపురములోను వారి మంత్రుల భవనములలోను సీతకై వెదికెను. కానీ ఎచ్చటను కానరాలేదు. ఇంతకు మునుపు తాను సీతను చూడలేదు కావున, హనుమ తన మనస్సున సీతాదేవి యొక్క ఊహాచిత్రమును నిర్మించుకొనెను. వాస్తవముగా పదునారు కళలతో గూడి చంద్రుని వలె భాసిల్లు సీతాదేవి, శ్రీరాముని ఎడబాటు వలన విదియ చంద్రుని వలె కాంతిహీనమై, ధూళిధూసరితమై, రావణుని వాగ్భాణముల గుర్తులు ఆమె ముఖ కవళికపై యుండును. అట్టి జానకిని ఎంత వెదికినను తరుణీమణులలో కానరాకుండెను. పిమ్మట హనుమ మేఘము వలె మహోన్నతమైన పుష్పక విమానమును దర్శించెను.

తత స్తదా బహు విధ భావితా౭౭త్మనః
కృతా౭౭త్మనో జనక సుతాం సువర్త్మనః
అపశ్యతో౭భవ ద౭తి దుఃఖితం మనః
సుచక్షుషః ప్రవిచరతో మహాత్మనః 5 7 17
కృతా౭౭త్మనో జనక సుతాం సువర్త్మనః
అపశ్యతో౭భవ ద౭తి దుఃఖితం మనః
సుచక్షుషః ప్రవిచరతో మహాత్మనః 5 7 17
ఈ విధముగా అనేకవిధములుగా నిశిత బుద్ధితో ప్రయత్నమూ చేసినను సీత జాడ కాన రాకపోయేసరికి హనుమ మిగుల దుఃఖితుడు అయ్యెను. తరువాత నెమ్మదిగా రావణుని నిజ అంతఃపురమును చేరుకొన్నాడు. అందు రావణుడు అపహరించి తెచ్చిన కన్యలు, రావణుని పత్నులు, పానముచే అలసి యున్న స్త్రీ రత్నములు ఇలా అనేక మంది కనబడిరి. వారి మధ్య రావణుడు నక్షత్ర రాజు వలె యున్నాడు.
గౌరీం కనక వర్ణా౭౭భామ్ ఇష్టామ్ అన్తః పురేశ్వరీమ్
కపి ర్మన్దోదరీం తత్ర శయానాం చారు రూపిణీమ్ 5.10.52
కపి ర్మన్దోదరీం తత్ర శయానాం చారు రూపిణీమ్ 5.10.52
స తాం దృష్ట్వా మహాబాహు ర్భూషితాం మారుతా౭౭త్మజః
తర్కయా మాస సీతేతి రూప యౌవన సంపదా 5.10.53
తర్కయా మాస సీతేతి రూప యౌవన సంపదా 5.10.53
హర్షేణ మహతా యుక్తో ననన్ద హరియూథపః
*ఆస్హ్పోటయా మాస చుచుమ్బ పుచ్ఛం
ననన్ద చిక్రీడ జగౌ జగామ*
ననన్ద చిక్రీడ జగౌ జగామ*
స్తమ్భాన్ అరోహన్ నిపపాత భూమౌ
నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనామ్ 5.10.54
నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనామ్ 5.10.54
అక్కడ శయ్యపై పరుండి బంగారు రంగును పోలిన స్త్రీ మూర్తిని (రావణుని పట్ట మహిషి అయిన మండోదరి) చూసి హనుమ సీతమ్మ అనుకొని భ్రమపడి కోతి చేష్టలు చేసెను. ఆనందముతో హనుమ జబ్బలు, తొడలు చరచుకొనెను. తోక ముద్దుపెట్టుకొనెను. పాటలు పాడెను. నృత్యము చేసెను. స్తంభములెక్కి దుమికెను. ఈ విధముగా సంతోషముతో పిల్లవాని చేష్టలు చేసెను. తరువాత బుద్ధిశాలియైన ఆ మహాకపి భర్తని ఎడబాసిన సీత ఇలా సర్వాలంకారణ భూషితయై నిదురించదు, ఈమె సీత కాదని వేరొక వనితయని అని నిశ్చయమునకు వచ్చియుండెను. ఈ విధముగా అనేక మంది స్త్రీలను చూచినను సీత జాడ లేదు. ఈ విధముగా అనేకమైన భంగిమలలో స్త్రీలను చూచుటచే ధర్మ భంగమయ్యెనని ఒకింత చింతించెను. మరల తేరుకొని …
మనో హి హేతుః సర్వేషామ్ ఇన్ద్రియాణాం ప్రవర్తనే
శుభా౭శుభా స్వ౭వస్థాసు తచ్చ మే సువ్యవస్థితమ్ 5.11.41
శుభా౭శుభా స్వ౭వస్థాసు తచ్చ మే సువ్యవస్థితమ్ 5.11.41
మనస్సే కదా సర్వేంద్రియములను ప్రవర్తింపజేయుటలో కారణమైనది. కానీ నా మనస్సు నిలకడగా, ఎటువంటి వికారములు లోనుకాకుండా యున్నది. అయినను స్త్రీని వెతుకుటకు స్త్రీ సమూహములోనే వెతకాలి కదా! అనుకోని తాను ధర్మ భ్రష్టుడు కాలేదు అనుకొనెను. మరల ధైర్యము తెచ్చుకొని అనేకమైన లతాగృహములు మొదలుగాఁగలవి వెతుకుచుండెను.
అనిర్వేదః శ్రియో మూలమ్ అనిర్వేదః పరం సుఖమ్
అనిర్వేదో హి సతతం సర్వా౭ర్థేషు ప్రవర్తకః 5.11.10
కరోతి సఫలం జంతో:కర్మ య త్తత్ కరోతి సః
తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేష్టే౭హ ముత్తమం 5.11.11
తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేష్టే౭హ ముత్తమం 5.11.11
సర్వ విధముల అభివృద్ధికి నిర్వేదము లేకుండుటయే. ఉత్సాహము కలిగియుండుట ఐశ్వర్యమునకు మూలము. ఉత్సాహమే ఉత్తమ సుఖము. నిరుత్సాహవంతుడు కానివాడే అన్నిపనులను ఆరంభింపగలడు. కావున ఉత్సాహముతో మరల ఏయే ప్రదేశములలో శ్రద్ధ చూపలేదో ఆయా ప్రదేశములలో వెతుకుటకు హనుమ నిశ్చయించుకొనెను.
శ్రీరామ జయరామ జయజయ రామ
శ్రీరామ జయరామ జయజయ రామ
No comments:
Post a Comment