Thursday, 30 March 2023

***

 



శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-11
త్రిజట స్వప్నము
సీతాదేవి ఆ రక్కసుల మాటలకు మిగుల పరితాపము చెందుచు ..

హా రామేతి చ దుఃఖా౭౭ర్తా పున ర్హా లక్ష్మణేతి చ
హా శ్వశ్రు మమ కౌసల్యే హా సుమిత్రేతి భామినీ 5 25 11
 
లోక ప్రవాదః సత్యో౭యం పణ్డితైః సముదా౭౭హృతః
అకాలే దుర్లభో మృత్యుః స్త్రియా వా పురుష స్య వా      5 25 12           
 
య త్రా౭హ మేవం క్రూరాభీ రాక్షసీభి: ఇహా౭ర్దితా
 
జీవామి హీనా రామేణ ముహూర్తమ్ అపి దుఃఖితా         5 25 13
ధిగ్ అస్తు ఖలు మానుష్యం ధిగ్ అస్తు పర వశ్యతామ్
న శక్యం యత్ పరిత్యక్తుమ్ ఆత్మ చ్ఛన్దేన జీవితమ్    5 25 20
 
సీతాదేవి రామా, లక్ష్మణా, కౌసల్యా, సుమిత్రా అనుచు దుఃఖించెను. స్త్రీ, పురుషులలో ఎవ్వరికైనను తాము కోరుకొన్నప్పుడే మరణము సంభవించదు అను ప్రాజ్ఞుల మాట సత్యము. ఇట్టి రాక్ష స్త్రీలచే బాధింపబడుతూ ఒక్క క్షణమైనను జీవించి యుండరాదు. మరల స్వస్థత తెచ్చుకొని నా జీవితము శ్రీరాముని అధీనములోనిది కావున ఈ జీవితమును త్యజించుటకు నాకు అవకాశము లేదు[1].  ఈ విధముగా జానకి అధోముఖియై నిరంతరము కన్నీరు కార్చుచు విలపించుచుండెను. అప్పుడు ఆ రాక్షస స్త్రీలలోని త్రిజట తనకు కలిగిన స్వప్న వృత్తాంతము చెపుతూ శ్రీరాముని విజయము, రాక్షసుల వినాశనం సూచించింది అని చెపుతుంది.
 
చన్ద్ర సూర్యౌ మయా దృష్టా పాణిభ్యాం పరిమార్జతీ
తత స్తాభ్యాం కుమారాభ్యామ్ ఆస్థితః స గజోత్తమః       5.27.16
 
సీతయా చ విశాలా౭క్ష్యా ల౦కాయా ఉపరి స్థితః
పాణ్డు రర్షభ యుక్తేన రథే నా౭ష్ట యుజా స్వయమ్        5.27.17
 
ఆ స్వప్నములో ఏనుగు అంబారీపై శ్రీరామునితో గూడి సీత ఊరేగుచుండగా, సీత తన పతి యొడినుండి లేచి సూర్యచంద్రులను స్పృశించుచుండుట చూచితిని. (ఆదిత్య మండలం వాతు, చంద్రమండలం మేవ వా| స్వప్నే గృహ్ణతి హస్తాభ్యాం రాజ్యం సంప్రాప్నుయాన్మహాత్|| ఆరోహణం గోవృషకుంజరాణాం ప్రాసాదశైలాగ్ర నానస్పతీనాం| స్వప్నమున సూర్యమండలముగాని, చంద్రమండలముగాని తన చేతులతో స్పృశించిన మహారాజ్యము ప్రాప్తించును. ధ్రువమండలము, శైలాగ్రమునకు చేరుకొనుట, గజారోహణము తప్పకుండ సంపదలు కల్గును). త్రాగుచు, యెర్రని  వస్త్రములు ధరించి, నూనె పూయబడిన దేహముతో గన్నేరు దండలు దాల్చి   పుష్పకముపై నుండి రావణుడు పడిపోవుటను స్వప్నములో గాంచితిని. (బలి పశువు మెడలో గన్నేరు దండలు అలంకరించుట ఆచారము). శ్రీరాముడు దివ్యమైన పుష్పక విమానమును ఎక్కి ఉత్తర దిశకు సీతాలక్ష్మణ సమేతుడై వెళ్లెను. (ఈ విషయము అనంతరము శ్రీరాముడు అయోధ్యకు రాజుకాగలడని సూచిస్తున్నది).రావణుడు శిరోముండనం గావించుకుని, నల్లని వస్త్రములు ధరించి, నూనె త్రాగుచు, పిచ్చివాడివలె గాడిదలు కట్టిన రథముపై దక్షిణ దిశకు వెడలెను. రావణుని సుతులు, కుంభకర్ణుడు నూనె పూసిన దేహములతో దక్షిణ దిశకు వెడలిరి. ఒక్క విభీషణుడు మాత్రము దివ్య గజమును అధిరోహించి ఆకాశమునందు యుండెను. ఈ విధముగా త్రిజట తన స్వప్న వృత్తాంతమును తెలిపి రాక్షస స్త్రీలతో సీత యెడల జాగరూకతతో, మర్యాదగా మెలుగుడు, ఆమెను శరణు వేడుడు అని చెప్పింది. అంత సీతకు శుభశకునములు కంబడినవి.
శ్రీరామ జయరామ జయజయ రామ
 
[1] మానవ జన్మను ఇచ్చినది భగవంతుడు, కావున ఇది భగవధీనమైనది. కావున జీవితమును త్యజించుటకు  ఎవ్వరికిని అధికారములేదు కావున ఎవ్వరును ఆత్మహత్యకు పాల్పడరాదు.

Tuesday, 28 March 2023

sri Ramanavami .. 30-03

 



 "మిత్రులకు శ్రేయోభలాషులకు sri ramanavami  శుభాకాంక్షలు"
 
శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-10
రావణుడు అశోక వాటికకు వచ్చుట
మంగళకరమైన చతుర్వాద్య ధ్వనులచే వేకువనే మేల్కొన్న ప్రతాపశాలియైన రావణుడు కామ వికారముచే సీతాదేవిని చూచుటకు అశోక వనమున ప్రవేశించెను. అప్పుడు హనుమ ఆకుల మధ్య నక్కి పరికించి చూచుచుండెను. అప్పుడు సీతాదేవి తొడలతో ఉదరమును, బాహువులతో వక్షస్థలమును కప్పుకొని (ముడుచుకొని) ఏడ్చుతూ కూర్చొనెను. 
 
(ఆచ్ఛా ద్యోదర మూరుభ్యాం బాహుభ్యాం చ పయోధరౌ, ఉపవిష్టా విశాలా౭క్షీ రుదన్తీ వరవర్ణినీ). వైవాహికో విధిః స్త్రీణాం ఔపనాయనికః స్మృతః అను స్మృతి వాక్యమును అనుసరించి స్త్రీలకు వివాహము పునర్జన్మ. వివాహ సంస్కార ఫలితముగా సీత ఇక్ష్వాకు వంశమున మెట్టినది. 
 
రావణుడు సీతను చూచి "సీతా నీవు భయపడనవసరము లేదు. స్వధర్మో రక్షసాం భీరు సర్వథైవ న సంశయః గమనం వా పర స్త్రీణాం హరణం సంప్రమథ్య వా, ఏవం చైత ద౭కామాం చ న త్వాం స్ప్రక్ష్యామి మైథిలి కామం కామః శరీరే మే యథా కామం ప్రవర్తతామ్ బలాత్కారముగా పరస్త్రీలను పొందుట రాక్షసులమైన మాకు స్వధర్మము. 
 
(మరి అయితే మానవ కాంతయైన సీత ధర్మములకు విలువ ఈయక పోవడంలో రావణుని నీచ ప్రవ్రుతిని తెలియజేస్తుంది. మన ధర్మము అనుసరిస్తూ పర ధర్మములను గౌరవించాలి. ప్రస్తుత కాలంలో ఇది పాటించబడుట లేదు. మిక్కిలి శోచనీయం) అయినను 
 
నేను కామాతురడను, కానీ బలాత్కారముగా నిన్ను తాకను. ఓ మైథిలీ! నీవు అనేకమైన దివ్యమైన సుగంధములు, వస్త్రములు ధరించి నన్ను చేరుము". ఈ విధముగా అనేక విధములుగా రావణుడు తన పరాక్రమమును చూపి, ప్రలోభములను పెట్టి సీతను తన వైపుకు త్రిప్పుకొనుటకు ప్రయత్నము చేసెను.
సీత రావణునికి హితవు పలుకుట
 
ఆ రాక్షసుని మాటలకు దుఃఖార్తియై, దీనురాలై శ్రీరాముని తలంచుతూ ఒక గడ్డి పరకను అడ్డుపెట్టుకొని ఇట్లు పలికెను. "నా నుండి మనసును మరల్చుకొని నీ వారిపై మనసును నిలుపుకొనుము. పాపము చేసినవాడు సిద్ధిని కాంక్షించుట ఎంత అయుక్తమో నీవు నన్ను 
కాంక్షించుట అంత అయుక్తము.
 
యథా తవ తథా౭న్యేషాం దారా రక్ష్యా నిశాచర 5.21.7
 
ఆత్మానమ్ ఉపమాం కృత్వా స్వేషు దారేషు రమ్యతామ్
అకృతా౭౭త్మానమ్ ఆసాద్య రాజానమ్ అనయే రతమ్ 5.21.11
సమృద్ధాని వినశ్యన్తి రాష్ట్రాణి నగరాణి చ
 
మిత్రమ్ ఔపయికం కర్తుం రామః స్థానం పరీప్సతా        5.2119
వధం చా౭నిచ్ఛతా ఘోరం త్వయా౭సౌ పురుషర్షభః
 
విదితః స హి ధర్మజ్ఞః శరణాగత వత్సలః                      5.2120
తేన మైత్రీ భవతు తే యది జీవితు మిచ్ఛసి
 
పరుని భార్యను అనుభవించవలెనని కోరిక కలిగినప్పుడు ఒక్కసారి తన విషయమున గూడ నా భార్యను వేరొకడు బలాత్కరించి చెరబట్టినచో ఎట్లుండును? ఆలోచించుకొనుము. ధృడ మనస్కుడు కాక పాపకార్యములను ఆచరించు రాజును పొందినచో ఎంతటి సమృద్ధములైన రాజ్యములు నశించక మానవు. లోకములో నిలకడ కావాలని కోరినచో రామునితో మైత్రి చేసికొనుము. ఘోరమైన చావు చావకుండుటకైనను రామునితో మైత్రి చేసికొనుము.  
రావణునకు సీతమ్మ చేసిన ఈ ఉపదేశము సంసారులకు అందరికి ఉపదేశమే. ఇట్లు పలికిన సీత వాక్కులను విని రావణుడు కోపముతో .. బ్రతిమాలుచున్న కొలది స్త్రీకి చులకన యగును. నీపై కల్గిన కామముచే నా కోపమును ఆపి వేయుచున్నది.
 
వామః కామో మనుష్యాణాం యస్మిన్ కిల నిబధ్యతే
జనే తస్మిం స్త్వ౭నుక్రోశః స్నేహ శ్చ కిల జాయతే        5 .22 4
 
ఏ మనుజులపై కామము కలుగునో ఆ మనుజులు శిక్షింపదగిన వారైనను వారిపై దయా స్నేహములు కలుగును. నీవు నన్నాడిన పరుష వాక్యములకు నిన్ను క్రూరముగా సంహరింపవలసి యున్నది సీతా! నీకు సంవత్సరము గడువు ఒసగితిని. ఇంకా నీకు రెండు మాసములు మాత్రమే వ్యవధి యున్నది. అప్పటికి నీవు నన్ను అంగీకరింపనిచో నిన్ను  నాకు ప్రొద్దుటి భోజనమునకు వినియోగింతురు అని పరుషముగా మాట్లాడి వెడలిపోయెను. తరువాత రాక్షస స్త్రీలు, సీతకు నయానా, భయానా అనేక రకములుగా రావణుని పొందమని నచ్చచెప్పుటకు ప్రయత్నము చేసిరి. కానీ సీత వారి మాటలను నిరాకరించెను. అశోక వృక్షముపై యున్న హనుమ వీరి మాటలను నిశ్చలముగా వినెను.
 
శ్రీరామ జయరామ జయజయ రామ
 

Monday, 27 March 2023



 యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-7
రావణ అంతఃపురమున హనుమ ప్రవేశించుట
హనుమ లంకానగరములో అనేకమైన భవనములను, పతివ్రతలగు స్త్రీలు వారి భర్తలతో నిదురించుటను, ప్రియురాండ్రపై తమ హస్తములు వేసిన స్త్రీలను, అనేకమైన పరిశుద్ధ స్వభావులు, మహానుభావలు, సుప్రభావలు, కాంతిమతులు, లజ్జావతులు, ప్రియుల ఒడిలో కూర్చున్నవారు, బంగారు కాంతుల గలవారు, మేలిముసుగు లేనివారు ఇలా అనేకమైన స్త్రీలను చూచెను. తరువాత రావణ అంతఃపురములోను వారి మంత్రుల భవనములలోను సీతకై వెదికెను. కానీ ఎచ్చటను కానరాలేదు. ఇంతకు మునుపు తాను సీతను చూడలేదు కావున, హనుమ తన మనస్సున సీతాదేవి యొక్క ఊహాచిత్రమును నిర్మించుకొనెను. వాస్తవముగా పదునారు కళలతో గూడి చంద్రుని వలె భాసిల్లు సీతాదేవి, శ్రీరాముని ఎడబాటు వలన విదియ చంద్రుని వలె కాంతిహీనమై, ధూళిధూసరితమై, రావణుని వాగ్భాణముల గుర్తులు ఆమె ముఖ కవళికపై యుండును. అట్టి జానకిని ఎంత వెదికినను తరుణీమణులలో కానరాకుండెను. పిమ్మట హనుమ మేఘము వలె మహోన్నతమైన పుష్పక విమానమును దర్శించెను.
 
తత స్తదా బహు విధ భావితా౭౭త్మనః
కృతా౭౭త్మనో జనక సుతాం సువర్త్మనః
అపశ్యతో౭భవ ద౭తి దుఃఖితం మనః
సుచక్షుషః ప్రవిచరతో మహాత్మనః  5 7 17
 
ఈ విధముగా అనేకవిధములుగా నిశిత బుద్ధితో ప్రయత్నమూ చేసినను సీత జాడ కాన రాకపోయేసరికి హనుమ మిగుల దుఃఖితుడు అయ్యెను. తరువాత నెమ్మదిగా రావణుని నిజ అంతఃపురమును చేరుకొన్నాడు. అందు రావణుడు అపహరించి తెచ్చిన కన్యలు, రావణుని పత్నులు, పానముచే అలసి యున్న స్త్రీ రత్నములు ఇలా అనేక మంది కనబడిరి. వారి మధ్య రావణుడు నక్షత్ర రాజు వలె యున్నాడు.
 

గౌరీం కనక వర్ణా౭౭భామ్ ఇష్టామ్ అన్తః పురేశ్వరీమ్
కపి ర్మన్దోదరీం తత్ర శయానాం చారు రూపిణీమ్  5.10.52
 
స తాం దృష్ట్వా మహాబాహు ర్భూషితాం మారుతా౭౭త్మజః
తర్కయా మాస సీతేతి రూప యౌవన సంపదా  5.10.53
 
హర్షేణ మహతా యుక్తో ననన్ద హరియూథపః
*ఆస్హ్పోటయా మాస చుచుమ్బ పుచ్ఛం
ననన్ద చిక్రీడ జగౌ జగామ*
 
స్తమ్భాన్ అరోహన్ నిపపాత భూమౌ
నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనామ్   5.10.54
 
అక్కడ శయ్యపై పరుండి బంగారు రంగును పోలిన స్త్రీ మూర్తిని (రావణుని పట్ట మహిషి అయిన మండోదరి) చూసి హనుమ సీతమ్మ అనుకొని భ్రమపడి కోతి చేష్టలు చేసెను. ఆనందముతో హనుమ జబ్బలు, తొడలు చరచుకొనెను. తోక ముద్దుపెట్టుకొనెను. పాటలు పాడెను. నృత్యము చేసెను. స్తంభములెక్కి దుమికెను. ఈ విధముగా సంతోషముతో పిల్లవాని చేష్టలు చేసెను. తరువాత బుద్ధిశాలియైన ఆ మహాకపి భర్తని ఎడబాసిన సీత ఇలా సర్వాలంకారణ భూషితయై నిదురించదు, ఈమె సీత కాదని వేరొక వనితయని  అని నిశ్చయమునకు వచ్చియుండెను. ఈ విధముగా అనేక మంది స్త్రీలను చూచినను సీత జాడ లేదు. ఈ విధముగా అనేకమైన భంగిమలలో స్త్రీలను చూచుటచే ధర్మ భంగమయ్యెనని ఒకింత చింతించెను. మరల తేరుకొని  …
 
మనో హి హేతుః సర్వేషామ్ ఇన్ద్రియాణాం ప్రవర్తనే
శుభా౭శుభా స్వ౭వస్థాసు తచ్చ మే సువ్యవస్థితమ్        5.11.41
 
మనస్సే కదా సర్వేంద్రియములను ప్రవర్తింపజేయుటలో కారణమైనది. కానీ నా మనస్సు నిలకడగా, ఎటువంటి వికారములు లోనుకాకుండా యున్నది. అయినను స్త్రీని వెతుకుటకు స్త్రీ సమూహములోనే వెతకాలి కదా! అనుకోని తాను ధర్మ భ్రష్టుడు కాలేదు అనుకొనెను. మరల ధైర్యము తెచ్చుకొని అనేకమైన లతాగృహములు మొదలుగాఁగలవి వెతుకుచుండెను.

అనిర్వేదః శ్రియో మూలమ్ అనిర్వేదః పరం సుఖమ్
అనిర్వేదో హి సతతం సర్వా౭ర్థేషు ప్రవర్తకః                5.11.10
 
కరోతి సఫలం జంతో:కర్మ య త్తత్ కరోతి సః
తస్మాత్ అనిర్వేద కృతం యత్నం  చేష్టే౭హ ముత్తమం 5.11.11
 
సర్వ విధముల అభివృద్ధికి నిర్వేదము లేకుండుటయే. ఉత్సాహము కలిగియుండుట ఐశ్వర్యమునకు మూలము. ఉత్సాహమే ఉత్తమ సుఖము. నిరుత్సాహవంతుడు కానివాడే అన్నిపనులను ఆరంభింపగలడు. కావున ఉత్సాహముతో మరల ఏయే ప్రదేశములలో శ్రద్ధ చూపలేదో ఆయా ప్రదేశములలో వెతుకుటకు హనుమ నిశ్చయించుకొనెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

Sunday, 26 March 2023

ప్రాంజలి ప్రభ..27/03

 



 



ప్రాంజలి ప్రభ పద్య పుష్పాలు 

ఎంతజీవకళవహించుచిత్రంబైన
జడముకాదెజీవజగతినద్దిప్రాంజలి 
సుగుణరహితుడైనసుందరునకుదాని
కించుకంతభేదమెన్నదరమె.

భా:-ఎంతగా జీవకళ ఉట్టి పడుతున్నా చిత్రం జడపదార్ధమైనట్టే... ఎంత అందంతో మెరిసిపోతున్నవాడైనా గుణంలేని వాడూ జడపదార్ధంతో సమానమే.

శ్లో:-అర్ధనాశం మనస్థాపం
గృహేదుశ్చరితానిచ
వంచంనం చావమానంచ
మతిమాన్ నప్రకాశతే.

భా:-బుధ్ధిమంతుడు...ధననష్టాన్ని,విచారాన్ని,ఇంట్లోజరిగినచెడను,తనకుజరిగినమోసాన్ని,అవమానాన్ని..ఇతరులకు చెప్పుకోడు.

--(())--
నేటి సూక్తులు

ప్రాంజలిప్రభ

సమ్మోహయంతి మదయంతి విడంబయంతి
నిర్భర్త్పయంతి రమయంతి విషాదయంతి
ఏతాః ప్రవిశ్య సదయం హృదయం నరాణాం
కిం నామ వామనయనా న సమాచరంతి

తాఃః నరుల సదయ హృదయము లందు చొరబారి సమ్మోహింప చేస్తున్నారు. మత్తు కలిగిస్తున్నారు. బ్రమింప జేస్తున్నారు , బెదిరిస్తున్నారు , ఆనందింప జేస్తున్నారు , ధుఖం కలిగిస్తున్నారు, ఒకటేమిటి ఏమిచేసిన ఓర్పతో చూడటమేగా 


51...* నేటి కథ *


*సత్యం పవిత్రమైనది, సత్యం సర్వజ్ఞం. సత్యం బలదాయకంగా ఉండాలి! జ్ఞానదాయకంగా ఉండాలి! జవసత్వదాయకమై ఉండాలి!*

*మనకు కావలసింది స్పందించే హృదయం ఆలోచించే మెదడు, పని చేసే బలిష్టమైన హస్తం కర్మ చేసే యోగ్యతను సంపాదించు.*


🕉🌞🌎🌙🌟🚩

*** *శ్రీగురుభ్యోనమః*

*మన సంప్రదాయమున కార్తీక మాసము, వృశ్చికరాశి అమితమగు పుణ్యకార్యములకు కేటాయింపబడినది. సూర్యుని వృశ్చికరాశి ప్రవేశము కార్తీక మాసముగా పరిగణింప బడుచున్నది. హడావిడి, అలజడి, డంబాచారము విసర్జించి, మౌనముగా మనలోని ఈశ్వరునితో అనుసంధానం చెంది సాధకుడు ముందుకు సాగవలెనని ఈ మాసము సందేశము ఇచ్చుచున్నది.*

*ఈ మాసములో శివానుగ్రహము అనూహ్యమైన రీతిలో అవతరిస్తూ ఉంటుంది. క్షరుడుగా తాను మరణించి, అక్షరుడుగా మేల్కొనే అద్భుతమగు మార్పు శివసంకల్పంగా జరుగును. శివలీల తన లీల కన్నా చాలా విశిష్టమైనదని మహావిష్ణువే పలికిన సందర్భములు పురాణములలో కలవు.*

***

*🌹. గీతోపనిషత్తు  - 75 🌹*

*🍀 13. కర్తవ్యాచరణము  - నాకు కర్మఫలము నందపేక్ష లేదు. నన్ను కర్మలంటవు" అని నన్ను గూర్చి ఎవడు తెలుసుకొనునో అతడు కర్మములచే బంధింపబడడు.   జీవుని పేరుకూడ 'నేను'యే . నాకు కర్మఫలము నందపేక్ష లేదు. నన్ను కర్మలంటవు." ఇది అనునిత్యము ధ్యానము చేయుచు కర్మలాచరించు వానిని కూడ కర్మలు బంధింపవు. 🍀*

*📚. 4. జ్ఞానయోగము  - 14  📚*

న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహా |

ఇతి మాం యో జానాతి కర్మభి ర స బధ్యతే || 14

“నాకు కర్మఫలము నందపేక్ష లేదు. నన్ను కర్మలంటవు" అని నన్ను గూర్చి ఎవడు తెలుసుకొనునో అతడు కర్మములచే బంధింపబడడు. శ్రీకృష్ణుడు పలికిన ఈ వాక్యములో రెండు విధములగు అవగాహన గోచరించును. దైవము నిర్లిప్తుడని, కోరికల కతీతుడని, కావున అతడిచే నిర్వర్తింపబడుచున్న సృష్టి కర్మఫలము, అతనిని అంటదని ఒక అవగాహన. 

దైవము పేరు 'నేను'. జీవుని పేరుకూడ 'నేను'యే. జీవుడు కూడ పై తెలిపిన వాక్యమును మరల మరల జ్ఞాపకము చేసుకొనవచ్చును. అది యేమనగా “నాకు కర్మఫలము నందపేక్ష లేదు. నన్ను కర్మలంటవు." ఇది అనునిత్యము ధ్యానము చేయుచు కర్మలాచరించు వానిని కూడ కర్మలు బంధింపవు.

కోరిక యున్నచోట బంధముండును. కోరిక లేనిచోట బంధముండదు. కావున ఫలము కోరక, కర్తవ్య మాచరించుట కర్మబంధము నుండి బయల్పడుటకు మార్గము. ఇది గీత బోధించు ప్రధాన సూత్రము.

సశేషం....

***

*🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴* 

64. అధ్యాయము - 19

*🌻. సతీకల్యాణము - శివలీల -4 🌻*

విష్ణువు ఇట్లు పలికెను -

భూతనాథా! సృష్టికర్త, జగత్ర్పభువు అగు బ్రహ్మను సంహరించవద్దు. ఈతడీనాడు నిన్ను శరణు పొందుచున్నాడు. నీవు శరణాగత వత్సలుడవు (50). నేను నీకు మిక్కిలి ప్రియమగు భక్తుడను. నాకు భక్తరాజు అను కీర్తి గలదు. నీవు నా విన్నపమును మన్నించి నాపై దయను చూపుము (51). 

హే నాథా! నేను యుక్తి యుక్త మగు మరియొక్క మాటను చెప్పెదను. వినుము. మహేశ్వరా! నీవు నాపై దయచేసి నా మాటను మన్నింపుము (52). హే శంభో! ఈ నాల్గు మోముల బ్రహ్మ ప్రజలను సృష్టించుటకే ఆవిర్భవించినాడు. ఈయనను సంహరించినచో మరియొక సృష్టికర్త ఉండడు. మరియొక సృష్టికర్తను నీవిదివరలో సృష్టించలేదు (53).

హే నాథా! శివరూపములో నున్న నీ ఆజ్ఞచే మనము త్రిమూర్తులము సృష్టిస్థితిలయ కర్మలను మరల మరల చేయు చుందుము (54). 

హే శంభో! ఈ బ్రహ్మను సంహరించినచో, ఆ సృష్టికర్మను ఎవరు చేసెదరు? హే లయకర్తా! హే ప్రభో! కావున నీవు సృష్టి కర్త యగు ఈతనిని సంహరించవలదు (55). దక్షుని కుమార్తె యగు సతీదేవి రూపములో నున్న ఉమా దేవిని, హే ప్రభో! ఈతడే మంచి ఉపాయముతో నీకు భార్య అగునట్లు వ్యవస్థను చేసినాడు (56).

బ్రహ్మ ఇట్లు పలికెను -

దృఢమగు వ్రతము గల మహేశ్వరుడు విష్ణువు చేసిన ఈ విన్నపమును విని, వారందరికి వినపడునట్లుగా, ప్రత్యుత్తరమును ఇట్లు చెప్పెను (57).

మహేశ్వరుడిట్లు పలికెను -

హే దేవదేవా ! రమాపతీ ! విష్ణూ! నీవు నాకు ప్రాణములవలె ప్రియుడవు. వత్సా! నేనీతనిని సంహరింపబోగా నీవు నన్ను నివారించవద్దు. ఈతడు దుష్టుడు (58). పూర్వము నీవు చేసిన విన్నపమును నేను అంగీకరించితిని. దానిని ఇప్పుడు పూర్తిచెసెదను మహాపాపమును చేసినవాడు, దుష్టుడు, నాల్గు ముఖములు గలవాడు అగు ఈ బ్రహ్మను నేను సంహరించెదను (59). 

స్థావర జంగమాత్మకమగు సర్వప్రాణులను నేనే సృష్టించెదను. లేదా, నా శక్తిచే మరియొక సృష్టికర్తను నేను సృష్టించెదను (60). ఈ బ్రహ్మను సంహరించి, నేను చేసిన శపథమును పూర్తిచేసి, మరియొక సృష్టికర్తను సృజించెదను. ఓ లక్ష్మీ పతీ! నీవు నన్ను నివారించకుము (61).

బ్రహ్మ ఇట్లు పలికెను -

గిరీశుని ఈ మాటను విని, చిరునవ్వుతో ప్రకటమైన కరుణాహృదయము గల అచ్యుతుడు 'వద్దు' అని మరల పలుకుచూ, ఇట్లనెను (62).

అచ్యుతుడు ఇట్లు పలికెను -

పరమ పురుషుడవగు నీవు ప్రతిజ్ఞను చెల్లించు కొనుట యోగ్యమైన విషయమే. కాని, నీవు విచారించుము. హే ప్రభూ! ఈశ్వరా! తనను తాను వధించు కొనుట తగదు (63). 

సశేషం....

***

: *🌹. శివగీత  - 114  / The Siva-Gita - 114 🌹*

 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*

📚. ప్రసాద్ భరద్వాజ 


అధ్యాయము 15

*🌻. భక్తి యోగము - 3 🌻*

అన్యత్ర భూతాద్భ వ్యాచ్చ - యత్ప్ర వక్ష్యామి తచ్చ్రుణు,

వదంతి యత్పదం వేదా - శ్శాస్త్రాణి వివిదానిచ 11

సర్వోప నిషదాం సారం -దద్నో ఘ్రుత మినోద్ద్రుతమ్,

యదిచ్చంతో బ్రహ్మ చర్యం - చరంతి మున యస్సదా. 12

తత్తే పదం సంగ్రహేణ - బ్రవీ మ్యోమితి యత్పదమ్ ,

ఏత దేవాక్షరం బ్రహ్మ - ఏత దేవాక్షరం పరమ్ 13

ఏత దేవాక్షరం జ్ఞాత్వా -బ్రహ్మ లోకే మహీయతే,

ఏత దాలంబనం శ్రేష్ఠ - మేత దాలంబనం పరమ్ 14

ఛందసాం యస్తు దేనూనా - మృత భత్వేన చోదితః,

ఇదమే వావధి స్సేతు- రమృత స్యచ ధారణాత్ 15

ఎటువంటి పరమ పదమును కలుగ చేయు వస్తువు పెరుగు నుండి దీయబడిన వెన్నవలె సమస్త శాస్త్రముల చేతను  వేదములతోడను దీయబడినదో -ఏ వస్తువు కోరబడిన  దై మునులచేత బ్రహ్మచర్య మాచరించ బడు చుండెనో అట్టి దానిని నీకు సంక్షిప్తముగా వివరింతును.  

అదేమి టందువా ఓం కారము,  అదే నాశరహిత మగు పరబ్రహ్మము. దానిని తెలసి కొనియే బ్రహ్మలోకమును పొందుదురు.  ఇదే అక్షరము, ఇదే పరము. 

ఛందస్సు లనెడు గోవుల కేది ఋషభ స్థానము పొందెనో  (ప్రదానత్వ మనుట )అట్టిదే అక్షరము అవధి ( నియామకమనుట)  మోక్ష ధారణ వలన సంసార సాగరమునకు దీరము వంటి దగును ( అజ్ఞాన నాశకమై మోక్షమును ప్రాపిం చేయు ).

సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹

*🌻. నారద మహర్షి  - 34 🌻*

240. “తనకు క్రోధం వస్తే తప్పనిసరిగా అవతలి వాడు నశిస్తాడు. అలా అనుకున్నప్పుడు క్రోధాన్ని దగ్గరికి రానివ్వకూడదు. క్షమ తప్ప ఇంకొకటి ఉండకూడదు. లేకపోతే అందులోంచి కర్మ పుడుతుంది. 

241. ఒకడు పాపం చేస్తున్నాడంటే, ఈ ప్రపంచంలో పాపం చేసిన వాడికి ఏం జరగాలో అది శాసించబడే ఉంది, అలా జరగనే జరుగుతుంది. కనుక తాను శాంత స్వభావంతో ఉండాలి. జ్ఞానలక్షణం అదే. 

242. లేకపోతే ఒక కార్యం ఆచరించి, ఒక క్రోధం చేత ఒక దుఃఖానికి హేతువై ఒక కర్మ పుట్టి, ఆ కర్మకు ఫలం అనుభవించవలసి వస్తుంది” అని బోధించాడు నారదుడు. మహర్షులు, జ్ఞానులు ఎవరిని శపించినా, శిక్షించినా, తిట్టినా కొట్టినా అది వాళ్ళకు కల్యాణ హేతువే అవుతుంది. 

243. కృష్ణపరమాత్మ తన అవతారంలో 125 సంవత్సరములు జీవించి చేసిన పనులలో నూరోవంతు ఎవరైనా చేయాలంటే, నూరు జన్మలెత్తాలి. ఎన్ని పనులు చేసాడు! ఎన్ని పనులు ఎంత మందితో చేయించాడు! అదంతా కర్మకదా! కర్మకు ఫలం ఉండితీరాలి కదా ఎవరు చేసినా! 

244. కృష్ణుడు ఎన్ని జన్మలెత్తాలి ఆ కర్మఫలం కోసమని? అన్న ప్రశ్నలు కలుగకమానవు. ఆయన ఎన్ని కర్మలు చేసినప్పటికీ, నిస్సంగబుద్ధితో శుద్ధబ్రహ్మవస్తువైనటువంటి – తన స్వస్థితియందే ఉన్నాడు. 

245. బయట నిర్వర్తించిన కార్యములన్నీ కూడా మనసు, ఇంద్రియములు లోకకల్యాణం కోసమని చేసాయి. అంతేగాని, ఆయన యందు కర్తృత్వభావనే లేదు. కర్తృత్వభావన వల్ల కర్మ ఫలప్రదమవుతుంది. 

246. కర్మ స్వతహాగా జడమయినటువంటిది. భావనచేతనే-నేను పనిచేస్తున్నాననే భావనచేతనే-కర్మలోంచి ఫలం పుడుతుంది.

247. పూర్వం గాలవుడు అనే ముని నారదుని దగ్గరికి వచ్చి, “స్వామీ! జ్ఞానప్రవృత్తి ఎలా కలుగుతుంది? ఆశ్రమాచారాలైన గృహస్థధర్మం, సన్యాసము అనే వాటిలో ఏది మేలయినది? అనేక శాస్త్రాలు అనేకమార్గాలు చూపిస్తవికదా! శ్రేష్ఠమయిన ఒక్కమార్గం నాకు చెప్పు” అని అడిగాడు. 

248. అందుకు నారదుడు, “గాలవా! ఆశ్రమధర్మాలు నాలుగు ఉన్నాయని నువ్వు వినిఉన్నావు కదా! శాస్త్రాలలో ఆ ఆశ్రమధర్మాలు పైకి పరస్పరవిరుద్ధంగా కనబడతాయి. అందులోని ధర్మసూక్ష్మం సద్గురువును ఆశ్రయిస్తేనే తెలుస్తుంది. 

249. స్థూలంగా చూస్తే ఒక ధర్మానికి, మరొక ధర్మానికి వ్యతిరేకలక్షణం కనబడుతుంది. “గృహస్థధర్మంలో, ‘జాగ్రత్తగా ధనం సంపాదించుకుని దాచుకుని భార్యాపిల్లలను బాగా చూచుకో, అతిథి అభ్యాగతులకు పెట్టు’ అని అంటారు. సన్యాసాశ్రమంలో, ‘ధనంమాట ఎత్తవద్దు, ఆ మాట అసలు మనసులోకి రానీయకు’ అంటారు. 

250. అయితే ఈ ప్రకారంగా ఒకే వస్తువును గురించి వివిధ ధర్మాలు, ఆయా ఆశ్రమాల్నిబట్టి ఉంటాయి. అసలు ధర్మంయొక్క లక్షణం ఏమిటి? ఏది ఆచరిస్తే ఆ జీవాత్మకు క్షేమమో, ఆ జీవుడికి క్షేమకరమైన భవిష్యత్తు ఉంటుందో దాన్ని ధర్మము అంటాము.

సశేషం....

*🌻. మానసిక గోళము - మనోభువనము - 4 🌻*

*. సూక్ష్మ, మానసిక, గోళముల ద్వారా పొందుచున్న ఆధ్యాత్మిక ప్రగతి, కేవలము ఊహ మాత్రమే.

*. ఆత్మ, మనస్సు ద్వారా, మనోమయ గోళమందు ఎరుకను పొందుచున్నప్పుడు మానసిక శరీరముతో తాదాత్మ్యతను చెందుచున్నది.

*. నాల్గవ భూమికను దాటి అయిదవ భూమికలో ప్రవేశించుట యనగా-స్వర్గ ద్వారమును చేరుటయని అర్థము. 

*. ఆత్మ మానసిక సంస్కారములను కలిగి ఉండి, మనస్సు యొక్క చైతన్యమునే కలిగి, మానసిక లోకానుభవమును పొందుచుండును.

*. మానసిక లోకానుభవము :-

(అంతర్దృష్టి, దివ్యదృష్టి) కేవలము చుచుటే భగవద్దర్శనము.

*. ఆత్మ, మానసిక సంస్కారములను కలిగివుండి, మానసిక శరీరంతో తాదాత్మ్యము చెంది, మనస్సే తానని భావించును.


సశేషం...

***

శ్రీనాథ కవి సార్వభౌముడు: సంక్షిప్త కధ 

అయినా ఎల్లవేళలా ఈ ఆత్మ ప్రత్యయం, ఈ ఠీవీ చెలామణి కాదు. సందర్భాన్ని బట్టి ప్రయత్నించాలి. అందుకే శ్రీనాథుడు ఒక్కొక్కసారి సహనం అవసరమేనంటూ చెప్పిన పద్యమిది -

"నికటముననుండి శ్రుతి నిష్ఠురముగ

నడరి కాకులు బిట్టు పెద్దఱచినప్పు

డుడిగి రాయంచ యూరక యుంట లెస్స

సైప రాకున్న నెందేని జనుట యొప్పు"

- కాకులు గోలపెడుతున్నప్పుడు ఓర్పుతో సహించాలి. లేదా వాటినుండి దూరంగా వెళ్ళాలి. అంటే ఆ కాకులతో మనమూ గోలచేస్తే మన స్థాయి పతనమైనట్టే గదా! ఇది మన జీవితంలో చాలా సందర్భాలకి ఉపకరిస్తుంది.

శ్రీనాథుడు భోగి. రసికుడు. ఎన్నో సుఖాలు అనుభవించాడు. అవకాశాలను అనుకూలంగా మలచుకోవడంలో తనకు తానే సాటి. అయినా రాజుల రోజులు ముగిసిన తర్వాత కష్టాల పాల్పడ్డాడు. బ్రాహ్మీదత్త వరప్రసాదుడు, ఈశ్వరార్చన కళాశీలుడూ, కవిసార్వభౌముడు, ఆగమ జ్ఞాననిధి అయిన శ్రీనాథుడు ఎన్నో బాధలు పడ్డాడు.

"కుల్లాయుంచితి కోక చుట్టుతి మహాకూర్పాసముండొడ్లితిన్

వెల్లులిందిల పిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా

చల్లాయంబలి ద్రావితిన్ రుచులు దోసంబంచు పోనాడితిన్, తల్లీ

కన్నడ రాజ్యలక్ష్మీ! దయలేదా, నేను శ్రీనాథుడిన్"

అని వాపోయాడు. గతకాలంలో ఎప్పుడూ చేయలేని, ఇష్టపడని పనులు చేశాడు. అలవాటు లేనివన్ని అనుభవించాడు. ఎంతటివాడికైనా కాలం బాగుండకపోతే అష్టకష్టాలు తప్పవని అనుభవాలు చెప్తాయి.

జొన్నకూడు తిన్నాడు. సన్నన్నం దొరకలేదు. తన పంటపొలాలకు శిస్తు కట్టలేక పోయాడు. శిస్తు కట్టనందుకు కఠినమైన శిక్షలు అనుభవించాడు. వాటిని ఒక పద్యంలో వివరించి మనకి వ్యకిత్వ వికాస తరగతులు నిర్వహించాడు.

జీవితం "చక్రార పంక్తి రివ గచ్చతి భాగ్యపంక్తిః"కి నిదర్శనం. ఎప్పుడూ కష్టాలే ఉండవ్. ఎప్పుడూ సుఖాలే ఉండవ్. వెలుగునీడలు సహజాతి సహజం. సుఖాలకి పొంగిపోకూడదు. కష్టాలకు కుంగిపోకూడదు. అదే స్థిత ప్రజ్ఞత్వం. మనం మంచి జరిగితే విర్రవీగి పోతాం. కష్టం లేదా దుఃఖం వస్తే న్యూనతాభావంతో ఇతరులను తిట్టిపోస్తాం. ఇది సరైన పద్ధతి కాదు. "బాధే సౌఖ్యమనే భావన " రావాలి. సుఖదుఃఖాల్ని స్వాగతించగలవాడే జీవితాన్ని ఆస్వాదించగలడు. మరొకరికి ఆదర్శప్రాయుడూ కాగలడు. శ్రీనాథుడు అటువంటి వ్యక్తిత్వం కలవాడు కాబట్టే ఈ పద్యం వెలువడింది -

"కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా

పురవీధి నెదురెండ పొగడదండ

సార్వభౌముని భుజాస్తంభమెక్కెను గదా

నగరి వాకిటనుండు నల్లగుండు

వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత

వియ్యమందెను గదా వెదురు గడియ

ఆంధ్ర నైషధకర్త యంఘ్రి యుగ్మంబున

తగిలియుండెను గదా నిగళయుగము "


ప్రాంజలి ప్రభ ... అంతర్జాల హాస్యప్రభ (101)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


26. పెళ్ళి

ఒక అమ్మాయి  గుడికి వచ్చి నాకు మంచి భర్తను ప్రసాదించు అని వేడుకుంది

మంచి కనబడిని , మంచిని గ్రహించలేని ఈ లోకంలో దొరకుట కష్టం అన్నాడు

దేముడు. మంచివాడు అసలు పెళ్ళికి సాహసించాడు, ఇక ఇంటికి పో అమ్మాయి.


27.ఉంగరం                                                                                                                            డాక్టర్ పేషంటు  ఫోన్ చేసి మీరు అర్జంటుగా నర్సింగ్ హోం రావాలి 

ఎందుకు సార్  నాకు మొన్ననేగదా  ఆపరేషన్ చ్చేసారు, నేను ఆరోగ్యముగానే ఉన్నాను

నీవు రాకపోతే నా ఆరోగ్యం దెబ్బతింటుంది ఎందుకు డాక్టర్ ముందు రావయ్య తరువాత

చెపుతా అన్ని ఇప్పుడే చెప్పలా, అనగానే పేషంటు వచ్చాడు    

ముందు ఆపరేషన్ థియటర్ పోదాం పదా, ఎందుకు సార్ నేను బాగానే ఉన్నానుగా 

నీ కడుపులో మాఆవిడ పెళ్ళి  ఉంగరము పెట్టి కుట్టేసా, అది తీసురాకపోతే ఫుడ్,బెడ్ లేదు 


28. కోడి

విందు భోజనానికి వెళ్లి గోవిందరావు కోడి మాంసము గబ గబా తింటున్నాడు

గోవింద్  ఎందుకు అంత తొందరా  కోడి ఎక్కడికి పారిపోదు ఎప్పుడో చచ్చిన

దానిని తింటున్నావు ............నవ్వులే నవ్వులు    

***






Saturday, 25 March 2023

 


పురాణాలలోని కొన్ని  విషయాలను తెలుసుకొందాం!
1). తాటికి ఎవరి భార్య? జ : సుందుడు
2). అహం బ్రహ్మస్మి అను మహావాక్యం ఏ వేదంలోనిది? జ: యజుర్వేదం
3). దశరథుని గురువు ఎవరు? జ: వశిష్ఠుడు
4). లక్ష్మీదేవి సోదరుడు ఎవరు? జ: చంద్రుడు
5). ఆదిత్యహృదయాన్ని ఎవరు, ఎవరికి ఉపదేసించారు? జ: అగస్త్యుడు. శ్రీరామునికీ.
6). నరకాసురుడు ఏ రాజ్యాన్ని పాలించేవాడు? జ: ప్రాగ్జ్యోతిషపురం
7). ఆరుముఖాలు గల దేవుడెవరు? జ: కుమారస్వామి
😎. హేమలత అని ఎవరికి పేరు? జ: హిమవంతుని కుమార్తె, పార్వతీదేవి.
9). ఆదిశంకరులు జన్మించిన పుణ్యక్షేత్రమేది? జ: కాలడి
10). సంగీతానికి సంబంధించిన వేదం ఏది? జ: సామవేదం 
  ( మరి కొన్ని మరో పోస్ట్లో చూద్దాం)
0----






*నాయనా! ఉన్న విషయమేమంటే, ఈ లోకమంతా నీచమైన ప్రాపంచికతతో నిండిపోయింది. కాని నైతిక బలం, వివేకం కలవాళ్ళు వీటివల్ల ఎప్పుడూ మోసపోరు. 'లోకం తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడనీ. నేను ధర్మ మార్గాన్నే అనుసరిస్తాను'... ఇది ధీరుని విధానం అని తెలుసుకో. లేకపోతే రాత్రింబవళ్ళు ఈ వ్యక్తి ఏమన్నాడు, ఆ వ్యక్తి ఏమి వ్రాసాడు అని ఆలోచిస్తే ఈ లోకంలో ఏ మహత్కార్యము సాధ్యం కాదు.


: దేహం ఉండాలంటే శ్వాస ఉండాలి; శ్వాస వల్ల దేహానికి లాభం. 'తన'కు (ఆత్మ) కాదు.


తనువు ద్వారా వ్యవహరించేది ఎవడో వాడే "నీవు".


మారే సకలానికి మారనిది ఒకటి ఆధారంగా ఉంది. దానినే మనం 'దేవుడు' అనేది.


నేను లో శరీరం ఉంది; శరీరంలో నేను ఉంది.

మొదటి నేను అహం స్వరూపం. (ఆత్మ)

రెండవ నేను అహంకార రూపం. (నామరూపాలు)

శ్రీరమణీయం - (576)


భక్తుని ప్రశ్న : 'ఆత్మవిద్య' అతి సులభమైనది ఎట్లవుతుంది ?

శ్రీరమణమహర్షి : మరే విద్యకైనా జ్ఞాత , జ్ఞానము, జ్ఞేయము అనే మూడు కావాలి. దీనికి అవేవీ అక్కర్లేదు. అది తానే. ఇంతకన్నా విస్పష్టమైనది వేరేమి ఉంది. అందుచేత అది సులభం. నీవు చేయవలసిన సర్వమూ "నేనెవరన్న" విచారణమే !

భక్తుని ప్రశ్న : మా పూర్వజన్మలో మేమెవరము ? గతంలోని విషయాలు మాకు ఏల గుర్తుకురావు !?

శ్రీరమణమహర్షి : దేవుని కృప ఎంతటిదో కదా ! మీకవి స్మృతికి రానివ్వటంలేదు. తాము పుణ్యశీలురమని తెలిస్తే వారి గర్వానికి మేరలుంటాయా ? కాదు. పాపులైవుంటే వారికెంత నిరుత్సాహం, దిగులు కలిగేవో ! ఇందులో ఏదీ మంచిది కాదు. 'తనను తాను ఎరిగితే' చాలు. దైవం వేసివుంచిన ప్లాన్ పాలించబడుతుంది. ఏమి జరిగితే మాత్రం సంతాపం ఎందుకు ? సముద్రాన్ని చేరాక నదికి ప్రవాహం ఆగినట్లే మనుజుడు కూడా ఆత్మలో విలీనమైనాక, అన్ని …
అరుణాచల శివ🙏

         భక్తుడు ఒకరు భగవాన్ తో “భగవాన్ ఆత్మను తెలుసుకోవాలని అంటారు.అది ఎక్కడ ఉంది ?దానిని ఎట్లా గా తెలుసుకోవటం ?”అని ఎంతో అమాయకంగా అడిగారు.

*“ఇప్పుడు నన్ను రమణాశ్రమం ఎక్కడ ఉంది ?అక్కడికి నేను ఎట్లా వెళ్లాలి ?అని అడిగితే నేను ఏమని సమాధానం చెప్పను? నీవు చూసేదంతా ఆత్మయే.దానిని ఎప్పుడూ అనుభవంలోనికి తీసుకుంటూనే ఉన్నావు .
కానీ అది తెలియక ఆత్మ ఎక్కడుందని వెళుతున్నావు.*

దానిని ఎఱుగుటకు చేసే ప్రయత్నం ,పండరీపురం భజన చేయడం వంటిదే.

భజన ఆరంభిస్తున్నప్పుడు  అందరూ కాళ్లకు గజ్జెలు కట్టుకుంటారు.ఒక ఇత్తడి దీపాన్ని వెలిగించి ఇంటి మధ్యలో పెట్టి ,దాని చుట్టూ తిరుగుతూ భజనలు చేయడం ప్రారంభిస్తారు.

పండరీపురం చాలా దూరం.యాత్ర చేద్దాం రండి ,అని పాడుతారు.

నిజానికి దీపం చుట్టి వస్తారు.కానీ యాత్ర అని పాడుతారు .ఇట్లాగే పొద్దు పొడిచే వరకు భజన నడుస్తూనే ఉంటుంది.

ఉదయం అవుతుందనగా ,ఇదిగో పండరి పురం కనపడుతోంది .ఇంకాస్త దూరం ఉంది ,అని పాడుతారు.

ఉదయం వెంటనే పండరీపురం చేరాము.ఇదిగో పాండురంగడు అని పాడి ఆ దీపానికి నమస్కరించి భజన ముగిస్తారు. 

ఈ ఆత్మ విషయంలోనూ ఇలాగే మనము కూడా ఆత్మను ఎప్పుడు దర్శిస్తూనే,ఆత్మ ఎక్కడ ?ఇంకా ఆత్మను ఇంకా పొందలేదే అని భజన చేస్తున్నాము.

అజ్ఞానాంధకారం తొలగి జ్ఞానం ఉదయించి నప్పుడు ,ఈ ఆత్మ ఇప్పుడే ,ఇక్కడే ఉన్నది .అది “నేనే “అని గుర్తించి ,భజన పూర్తి చేస్తాము .”అన్నారు భగవాన్.


"ముక్తిస్థితి ఎందుకని అర్ధం కావటంలేదు ?"

మన అసలు పేరు ముక్తి. ఇప్పుడున్నది అదనంగా వచ్చి చేరిన స్వరూపం. మనకు పూర్వజన్మల గురించి తెలియటం దేవుని అనుగ్రహం అనుకుంటాం. కానీ మనం ఆ పూర్వజ్ఞానాన్ని మరిచిపోవటమే ఆయన అనుగ్రహం. ఎందుకంటే పూర్వపుణ్యం తెలుస్తే మనకు గర్వం వస్తుంది. చేసిన పాపాలు తెలిస్తే బాధ కలుగుతుంది. అందుకే వర్తమానంలో ఉన్న నేను ఎవరో తెలిస్తే చాలని భగవాన్ శ్రీరమణమహర్షి సెలవిచ్చారు. ఇప్పుడు మన గుణాలు మన మనసును అధిగమిస్తున్నాయి. అందుకే మన ముక్తిస్థితి మనకు అర్ధం కావటం లేదు !

: "ఋభుగీత " (43)


3వ అధ్యాయము [ప్రపంచము చిన్మాత్రము]

ప్రపంచానుభవం నీ విలువ నీకు తెలుసుకోడానికే !!

మనం దేన్నైనా 'అది' అని అంటున్నామంటేనే.. అలా అనటానికి మనం ఉండి తీరాలి. నిద్రలో మనం ఉన్నట్లు మనకు తెలియదు. మన పంచేంద్రియాలు ఏవీ అప్పుడు పనిచేయవు. నిద్రలో ప్రపంచమే కాదు మనం ఉన్నట్లే మనకు తెలియడం లేదు. ఈ ఏర్పాటు అంతా మనం ఉన్నట్లు మనకి తెలియడానికే. జాగృతిలో ప్రపంచానుభవం ఎందుకు కలుగుతుందంటే నీ విలువ నీకు తెలుసుకోడానికే. ఈ సృష్టి అంతా భగవంతుని శక్తి చాటుకోవడానికి కాదు, అసలు వస్తువు విలువ తెలుసుకోడానికే !!

......

11-28,29,30-గీతా మకరందము
         విశ్వరూపసందర్శనయోగము

యథా నదీనాం బహవోఽమ్బువేగాః
సముద్రమేవాభిముఖా ద్రవన్తి | 
తథా తవామీ నరలోకవీరా 
విశన్తి వక్త్రాణ్యభివిజ్వలన్తి || 
 
తా:- ఏ ప్రకారము అనేక నదీప్రవాహములు సముద్రాభిముఖములై ప్రవహించుచు అందుప్రవేశించుచున్నవో, ఆప్రకారమే ఈ  మనుష్యలోకమందలి వీరులు (రాజులు) లెస్సగ జ్వలించుచున్న మీనోళ్లయందు ప్రవేశించుచున్నారు. 


॥ ఓం - గీతా మకరందము  [11-29]॥
యథా ప్రదీప్తం జ్వలనం పతఙ్గా 
విశన్తి నాశాయ సమృద్ధవేగాః | 
తథైవ నాశాయ విశన్తి లోకా 
స్తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః || 

తా:-  ఏ ప్రకారము మిడుతలు వినాశముకొఱకు మిక్కిలివేగముతో గూడినవై బాగుగ మండుచున్న అగ్నియందు ప్రవేశించుచున్నవో ఆప్రకారమే జనులున్ను మిగులవేగముతో గూడినవారై నాశముకొఱకు మీనోళ్ళయందు ప్రవేశించుచున్నారు. 


॥ ఓం - గీతా మకరందము  [11-30]॥
లేలిహ్యసే గ్రసమానస్సమన్తా 
ల్లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః | 
తేజోభిరాపూర్య జగత్సమగ్రం 
భాసస్తవోగ్రాః ప్రతపన్తి విష్ణో || 
 
తా:- ఓ విష్ణుమూర్తీ! మండుచున్న నీయొక్క నోళ్ళచే జనులందఱిని అంతటను మ్రింగుచున్నవాడవై ఆస్వాదించుచున్నావు. నీయొక్క భయంకరములైన కాంతులు తమ తేజస్సులచేత జగత్తునంతను వ్యాపించి మిగుల తపింపజేయుచున్నవి.

........

Thursday, 23 March 2023

శ్రీనివాస గద్యం

 

శ్రీమదఖిలమహీమండలమండనధరణీధర మండలాఖండలస్య, నిఖిలసురాసురవందిత వరాహక్షేత్ర విభూషణస్య, శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచలాంజనాచలాది శిఖరిమాలాకులస్య, నాథముఖ బోధనిధివీథిగుణసాభరణ సత్త్వనిధి తత్త్వనిధి భక్తిగుణపూర్ణ శ్రీశైలపూర్ణ గుణవశంవద పరమపురుషకృపాపూర విభ్రమదతుంగశృంగ గలద్గగనగంగాసమాలింగితస్య, సీమాతిగ గుణ రామానుజముని నామాంకిత బహు భూమాశ్రయ సురధామాలయ వనరామాయత వనసీమాపరివృత విశంకటతట నిరంతర విజృంభిత భక్తిరస నిర్ఘరానంతార్యాహార్య ప్రస్రవణధారాపూర విభ్రమద సలిలభరభరిత మహాతటాక మండితస్య, కలికర్దమ మలమర్దన కలితోద్యమ విలసద్యమ నియమాదిమ మునిగణనిషేవ్యమాణ ప్రత్యక్షీభవన్నిజసలిల సమజ్జన నమజ్జన నిఖిలపాపనాశనా పాపనాశన తీర్థాధ్యాసితస్య, మురారిసేవక జరాదిపీడిత నిరార్తిజీవన నిరాశ భూసుర వరాతిసుందర సురాంగనారతి కరాంగసౌష్ఠవ కుమారతాకృతి కుమారతారక సమాపనోదయ దనూనపాతక మహాపదామయ విహాపనోదిత సకలభువన విదిత కుమారధారాభిధాన తీర్థాధిష్ఠితస్య, ధరణితల గతసకల హతకలిల శుభసలిల గతబహుళ వివిధమల హతిచతుర రుచిరతర విలోకనమాత్ర విదళిత వివిధ మహాపాతక స్వామిపుష్కరిణీ సమేతస్య, బహుసంకట నరకావట పతదుత్కట కలికంకట కలుషోద్భట జనపాతక వినిపాతక రుచినాటక కరహాటక కలశాహృత కమలారత శుభమంజన జలసజ్జన భరభరిత నిజదురిత హతినిరత జనసతత నిరస్తనిరర్గళ పేపీయమాన సలిల సంభృత విశంకట కటాహతీర్థ విభూషితస్య, ఏవమాదిమ భూరిమంజిమ సర్వపాతక గర్వహాపక సింధుడంబర హారిశంబర వివిధవిపుల పుణ్యతీర్థనివహ నివాసస్య, శ్రీమతో వేంకటాచలస్య శిఖరశేఖరమహాకల్పశాఖీ, ఖర్వీభవదతి గర్వీకృత గురుమేర్వీశగిరి ముఖోర్వీధర కులదర్వీకర దయితోర్వీధర శిఖరోర్వీ సతత సదూర్వీకృతి చరణఘన గర్వచర్వణనిపుణ తనుకిరణమసృణిత గిరిశిఖర శేఖరతరునికర తిమిరః, వాణీపతిశర్వాణీ దయితేంద్రాణిశ్వర ముఖ నాణీయోరసవేణీ నిభశుభవాణీ నుతమహిమాణీ య స్తన కోణీ భవదఖిల భువనభవనోదరః, వైమానికగురు భూమాధిక గుణ రామానుజ కృతధామాకర కరధామారి దరలలామాచ్ఛకనక దామాయిత నిజరామాలయ నవకిసలయమయ తోరణమాలాయిత వనమాలాధరః, కాలాంబుద మాలానిభ నీలాలక జాలావృత బాలాబ్జ సలీలామల ఫాలాంకసమూలామృత ధారాద్వయావధీరణ ధీరలలితతర విశదతర ఘన ఘనసార మయోర్ధ్వపుండ్ర రేఖాద్వయరుచిరః, సువికస్వర దళభాస్వర కమలోదర గతమేదుర నవకేసర తతిభాసుర పరిపింజర కనకాంబర కలితాదర లలితోదర తదాలంబ జంభరిపు మణిస్తంభ గంభీరిమదంభస్తంభ సముజ్జృంభమాణ పీవరోరుయుగళ తదాలంబ పృథుల కదలీ ముకుల మదహరణజంఘాల జంఘాయుగళః, నవ్యదల భవ్యమల పీతమల శోణిమలసన్మృదుల సత్కిసలయాశ్రుజలకారి బల శోణతల పదకమల నిజాశ్రయ బలబందీకృత శరదిందుమండలీ విభ్రమదాదభ్ర శుభ్ర పునర్భవాధిష్ఠితాంగుళీగాఢ నిపీడిత పద్మావనః, జానుతలావధి లంబ విడంబిత వారణ శుండాదండ విజృంభిత నీలమణిమయ కల్పకశాఖా విభ్రమదాయి మృణాళలతాయిత సముజ్జ్వలతర కనకవలయ వేల్లితైకతర బాహుదండయుగళః, యుగపదుదిత కోటి ఖరకర హిమకర మండల జాజ్వల్యమాన సుదర్శన పాంచజన్య సముత్తుంగిత శృంగాపర బాహుయుగళః, అభినవశాణ సముత్తేజిత మహామహా నీలఖండ మదఖండన నిపుణ నవీన పరితప్త కార్తస్వర కవచిత మహనీయ పృథుల సాలగ్రామ పరంపరా గుంభిత నాభిమండల పర్యంత లంబమాన ప్రాలంబదీప్తి సమాలంబిత విశాల వక్షఃస్థలః, గంగాఝర తుంగాకృతి భంగావళి భంగావహ సౌధావళి బాధావహ ధారానిభ హారావళి దూరాహత గేహాంతర మోహావహ మహిమ మసృణిత మహాతిమిరః, పింగాకృతి భృంగార నిభాంగార దళాంగామల నిష్కాసిత దుష్కార్యఘ నిష్కావళి దీపప్రభ నీపచ్ఛవి తాపప్రద కనకమాలికా పిశంగిత సర్వాంగః, నవదళిత దళవలిత మృదులలిత కమలతతి మదవిహతి చతురతర పృథులతర సరసతర కనకసరమయ రుచిరకంఠికా కమనీయకంఠః, వాతాశనాధిపతి శయన కమన పరిచరణ రతిసమేతాఖిల ఫణధరతతి మతికరవర కనకమయ నాగాభరణ పరివీతాఖిలాంగా వగమిత శయన భూతాహిరాజ జాతాతిశయః, రవికోటీ పరిపాటీ ధరకోటీ రవరాటీ కితవీటీ రసధాటీ ధరమణిగణకిరణ విసరణ సతతవిధుత తిమిరమోహ గార్భగేహః, అపరిమిత వివిధభువన భరితాఖండ బ్రహ్మాండమండల పిచండిలః, ఆర్యధుర్యానంతార్య పవిత్ర ఖనిత్రపాత పాత్రీకృత నిజచుబుక గతవ్రణకిణ విభూషణ వహనసూచిత శ్రితజన వత్సలతాతిశయః, మడ్డుడిండిమ ఢమరు జర్ఘర కాహళీ పటహావళీ మృదుమద్దలాది మృదంగ దుందుభి ఢక్కికాముఖ హృద్య వాద్యక మధురమంగళ నాదమేదుర నాటారభి భూపాళ బిలహరి మాయామాళవ గౌళ అసావేరీ సావేరీ శుద్ధసావేరీ దేవగాంధారీ ధన్యాసీ బేగడ హిందుస్తానీ కాపీ తోడి నాటకురుంజీ శ్రీరాగ సహన అఠాణ సారంగీ దర్బారు పంతువరాళీ వరాళీ కళ్యాణీ భూరికళ్యాణీ యమునాకళ్యాణీ హుశేనీ జంఝోఠీ కౌమారీ కన్నడ ఖరహరప్రియా కలహంస నాదనామక్రియా ముఖారీ తోడీ పున్నాగవరాళీ కాంభోజీ భైరవీ యదుకులకాంభోజీ ఆనందభైరవీ శంకరాభరణ మోహన రేగుప్తీ సౌరాష్ట్రీ నీలాంబరీ గుణక్రియా మేఘగర్జనీ హంసధ్వని శోకవరాళీ మధ్యమావతీ జేంజురుటీ సురటీ ద్విజావంతీ మలయాంబరీ కాపీపరశు ధనాసిరీ దేశికతోడీ ఆహిరీ వసంతగౌళీ సంతు కేదారగౌళ కనకాంగీ రత్నాంగీ గానమూర్తీ వనస్పతీ వాచస్పతీ దానవతీ మానరూపీ సేనాపతీ హనుమత్తోడీ ధేనుకా నాటకప్రియా కోకిలప్రియా రూపవతీ గాయకప్రియా వకుళాభరణ చక్రవాక సూర్యకాంత హాటకాంబరీ ఝంకారధ్వనీ నటభైరవీ కీరవాణీ హరికాంభోదీ ధీరశంకరాభరణ నాగానందినీ యాగప్రియాది  విసృమర సరస గానరుచిర సంతత సంతన్యమాన నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందః శ్రీమదానందనిలయ విమానవాసః, సతత పద్మాలయా పదపద్మరేణు సంచితవక్షస్తల పటవాసః, శ్రీశ్రీనివాసః సుప్రసన్నో విజయతాం. శ్రీ​అలర్మేల్మంగా నాయికాసమేతః శ్రీశ్రీనివాస స్వామీ సుప్రీతః సుప్రసన్నో వరదో భూత్వా, పవన పాటలీ పాలాశ బిల్వ పున్నాగ చూత కదళీ చందన చంపక మంజుళ మందార హింజులాది తిలక మాతులుంగ నారికేళ క్రౌంచాశోక మాధూకామలక హిందుక నాగకేతక పూర్ణకుంద పూర్ణగంధ రస కంద వన వంజుళ ఖర్జూర సాల కోవిదార హింతాల పనస వికట వైకసవరుణ తరుఘమరణ విచుళంకాశ్వత్థ యక్ష వసుధ వర్మాధ మంత్రిణీ తింత్రిణీ బోధ న్యగ్రోధ ఘటవటల జంబూమతల్లీ వీరతచుల్లీ వసతి వాసతీ జీవనీ పోషణీ ప్రముఖ నిఖిల సందోహ తమాల మాలా మహిత విరాజమాన చషక మయూర హంస భారద్వాజ కోకిల చక్రవాక కపోత గరుడ నారాయణ నానావిధ పక్షిజాతి సమూహ బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర నానాజాత్యుద్భవ దేవతా నిర్మాణ మాణిక్య వజ్ర వైఢూర్య గోమేధిక పుష్యరాగ పద్మరాగేంద్ర నీల ప్రవాళమౌక్తిక స్ఫటిక హేమ రత్నఖచిత ధగద్ధగాయమాన రథ గజ తురగ పదాతి సేనా సమూహ భేరీ మద్దళ మురవక ఝల్లరీ శంఖ కాహళ నృత్యగీత తాళవాద్య కుంభవాద్య పంచముఖవాద్య అహమీమార్గన్నటీవాద్య కిటికుంతలవాద్య సురటీచౌండోవాద్య తిమిలకవితాళవాద్య తక్కరాగ్రవాద్య ఘంటాతాడన బ్రహ్మతాళ సమతాళ కొట్టరీతాళ ఢక్కరీతాళ ఎక్కాళ ధారావాద్య పటహకాంస్యవాద్య భరతనాట్యాలంకార కిన్నెర కింపురుష రుద్రవీణా ముఖవీణా వాయువీణా తుంబురువీణా గాంధర్వవీణా నారదవీణా స్వరమండల రావణహస్తవీణాస్తక్రియాలంక్రియాలంకృతానేకవిధవాద్య వాపీకూపతటాకాది గంగాయమునా రేవావరుణా

శోణనదీశోభనదీ సువర్ణముఖీ వేగవతీ వేత్రవతీ క్షీరనదీ బాహునదీ గరుడనదీ కావేరీ తామ్రపర్ణీ ప్రముఖాః మహాపుణ్యనద్యః సజలతీర్థైః సహోభయకూలంగత సదాప్రవాహ ఋగ్యజుస్సామాథర్వణ వేదశాస్త్రేతిహాస పురాణ సకలవిద్యాఘోష భానుకోటిప్రకాశ చంద్రకోటి సమాన నిత్యకళ్యాణ పరంపరోత్తరోత్తరాభివృద్ధిర్భూయాదితి భవంతో మహాంతోzనుగృహ్ణంతు, బ్రహ్మణ్యో రాజా ధార్మికోzస్తు, దేశోయం నిరుపద్రవోzస్తు, సర్వే సాధుజనాస్సుఖినో విలసంతు, సమస్తసన్మంగళాని సంతు, ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు, సకలకళ్యాణ సమృద్ధిరస్తు ॥


హరిః ఓమ్ ॥

-- శ్రీ శ్రీనివాస గద్యం

Wednesday, 22 March 2023

pranjali prabha 24.03

 



శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-3
హనుమ సాగరయానము

తతో రావణ నీతాయాః సీతాయాః శత్రు కర్శనః
ఇయేష పదమ్ అన్వేష్టుం చారణా చరితే పథి 5.1.1
 
అంగదాది వానరుల అభ్యర్థనను అనుసరించియు, జాంబవంతుని ప్రోత్సాహముతో హనుమ సముద్రమును లంఘించుటకు మహేంద్ర పర్వతమును అధిరోహించి సీతాన్వేషణకు చారణాది దివ్య జాతుల వారు సంచరించు ఆకాశ మార్గమున వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. ఇచట ఆకాశమున వెళ్ళుట యనగా బ్రహ్మనిష్ఠ కలిగి యుండుట. ఆకాశమనగా పరబ్రహ్మము (అంతటా పూర్ణముగా ప్రకాశించువాడు). దాని యందు విహరించువాడే సంసార సముద్రమును తాను దాటి జీవులను తరింప చేయగలడు.
 
ముమోచ చ శిలాః శైలో విశాలాః సమన శ్శిలాః
మధ్యమేనా౭ర్చిషా జుష్టో ధూమ రాజీ రివా౭నలః 5.1.16
 
ఆ మహాబలుడి చే అదుమబడిన మహేంద్రగిరి తన పగుళ్లనుంచి బంగారు, వెండి, కాటుక ధారలను వెలిగ్రక్కును. ఏలనన అగ్ని యొక్క సప్తార్చులలో [1]"మాధ్యమార్చి" అనునది సులోహిత. దాని జ్వాలల నుండి పొగలు వెలువడుచున్నట్లు హనుమచే అదుమబడిన ఆ మహేంద్రగిరి నుండి పెద్ద పెద్ద ఎర్రని శిలలు ముక్కలు ముక్కలుగా బయటపడ సాగెను. హనుమ పైకి ఎగుర సన్నద్ధుడై అంగదాది వానరులతో ఇట్లనెను.
 
వానరాన్ వానర శ్రేష్ఠ ఇదం వచనమ్ అబ్రవీత్
యథా రాఘవ నిర్ముక్తః శరః శ్వసన విక్రమః     5.1.39
 
గచ్ఛేత్ త ద్వద్గమిష్యామి ల౦కా౦ రావణ పాలితామ్
న హి ద్రక్ష్యామి యది తాం లఙ్కాయాం జనకా౭౭త్మజామ్  5.1.40
 
అనేనైవ హి వేగేన గమిష్యామి సురా౭౭లయమ్
యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యా౭మ్యకృత శ్రమః        5.1.41
 
బద్ధ్వా రాక్షస రాజానమ్ ఆనయిష్యామి రావణమ్
సర్వథా కృత కార్యో౭హమ్ ఏష్యామి సహ సీతయా       5.1.42
 
ఆనయిష్యామి వా లఙ్కాం సముత్పాట్య సరావణామ్
ఏవమ్ ఉక్త్వా తు హనుమాన్ వానరాన్ వానరోత్తమః         5.1.43
 
ఉత్పపాతా౭థ వేగేన వేగవాన్ అవిచారయన్
సుపర్ణ మివ చా౭౭త్మానం మేనే స కపికుంజరః 5.1.44
 
రామబాణము వలె మిక్కిలి వాయువేగముచే రావణ పాలిత లంకకు ఎగెదను. అక్కడ సీతమ్మ కనబడనిచో, అదే వేగమున సురలోకమునకు పోయెదను. అక్కడ గూడ సీతాదేవి కనబడనిచో రావణుని బంధించి తీసుకొని వచ్చెదను. ఏదిఏమైనా కృతకృత్యుడనై వచ్చెదను. లేనిచో రావణనునితో సహా లంకను పెకిలించుకొని తీసుకొని రాగలను. అని చెప్పి మిక్కిలి వేగముతో గరుడుని వలె అంతరిక్షమునకు ఎగిరెను. ఆత్మీయులను వీడ్కోలినప్పుడు వారిని కొంతదూరము అనుసరించి, వాటి ఎడబాటునకు తట్టుకొనలేక దుఃఖాశ్రువులను రాల్చి శోక తప్తులగుదురు. అదేవిధముగా అచ్చటి మహావృక్షములు ఆయన వేగమునకు కొంతదూరము అనుసరించి పుష్పములను రాల్చుతూ సముద్రముపై పడిపోయెను.
 
దశ యోజన విస్తీర్ణా త్రింశ ద్యోజనమ్ ఆయతా            
ఛాయా వానర సింహస్య జలే చారుతరా౭భవత్ 5.1.76
 
సంధ్యా సమయము కావడం మూలాన మారుతి యొక్క శరీరచ్చాయ పొడవు పది యోజనములు, వెడల్పు ముప్పది యోజనములుగా కనబడెను. త్రోవలో సాగరుని యొక్క ప్రోద్బలముచే మైనాకుడు (సముద్రములో నున్న పర్వతము) హనుమను  కొంచెము తడవు విశ్రాంతి తీసుకొనమని ప్రార్ధించగా, అందుకు సున్నితముగా తిరస్కరించి హనుమ తన ప్రయాణమును కొనసాగించెను.

శ్రీరామ జయరామ జయజయ రామ
జానకి రామ, పట్టాభి రామ, కారుణ్య రామ,
ఆరోగ్య రామ, గుణాభి రామ, సార్వ భౌమ,
ఓం శ్రీ రామ, మాత్రేనమః 


 

: *భగవద్గీత పైన అందరికి ఉండవల్సిన అవగాహన కోసం...హిందూ ధర్మం పాటించే ప్రతీ ఒక్కరికీ షేర్ చేయండి*

*1.* భగవద్గీతను లిఖించినదెవరు?

=విఘ్నేశ్వరుడు.

*2.* భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము?

= భీష్మ పర్వము.

*3.* గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును?

=మార్గశిర మాసము.

*4.* గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును?

=హేమంత ఋతువు.

*5.* ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వసంత ఋతువు.

*6.* భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను?

=శ్రీకృష్ణుడు అర్జునునికి.

*7.* భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను?

=కురుక్షేత్ర సంగ్రామము.

*8.* భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యెను?

=కౌరవ పాండవులకు.

*9.* పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధిగా వుండెను?

=అర్జునుడు.

*10.* వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను?

=సామవేదము.

*11.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి?

=పాంచజన్యము.

*12.* భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు?

=పద్దెనిమిది (18)

*13.* “నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోథుడెవరు?

= వినోబా భావే.

*14.* “సంశయములు నన్నావరించినపడు, సంకటములు సంప్రాప్తమైనపుడు, నిరాశా నిస్పృహలు జనించినపుడు నేను భగవద్గీత తెరచి చూచెదను. అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించును.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?

= మహాత్మా గాంధీ.

*15.* భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు?

= సంజయుడు.

*16.* సేనానాయకులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=కుమారస్వామి.

*17.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి?

=దేవదత్తము.

*18.* భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి?

= ఐదు. (అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, ఉపజాతి, విపరీతపూర్వ.)

*19.* భగవద్గీతను సాక్షాత్తుగా (లైవ్) వినినవారెవరు?

=నలుగురు. అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు.

*20.* ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= శ్రీరామచంద్రుడు.

*21.* భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?

=అచ్యుత, అనంత, జనార్ధన.

*22.* భగవద్గీత యందు అర్జునునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?

=ధనుంజయ, పార్ధ, కిరీటి.

*23.* శ్రీకృష్ణపరమాత్మ తన అవతార సమయంలో రెండు గానములు చేసెను. ఒకటి మురళీగానం. మరి రెండవది ఏమిటి?

=గీతా గానం.

*24.* “ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్” అనే పేరుతో భగవద్గీతను ఆంగ్లభాషలో పద్యరూపమున వ్రాసిన ఆంగ్లకవి ఎవరు?

=ఎడ్విన్ ఆర్నాల్డ్.

*25.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరేమిటి?

=పౌండ్రము.

*26.* ఏకాదశ రుద్రులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=శంకరుడు.

*27.* “నా తల్లి చాలా కాలం క్రిందటే మరణించెను. కానీ అప్పటినుండి భగవద్గీత యను తల్లి ఆ స్ధానమును ఆక్రమించి, నా పక్కనే వుండి నన్ను కాపాడుచున్నది.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?

=మహాత్మాగాంధీ.

*28.* భగవద్గీత ఏ వేదములోనిది?

=పంచమ వేదం-మహాభారతం.

*29.* భగవద్గీత యందు ఎన్నవ అధ్యాయంలో భగవంతుని విశ్వరూప సందర్శన ప్రత్యక్షముగా వర్ణింపబడినది?

=11వ అధ్యాయము

*30.* ద్వాదశాదిత్యులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=విష్ణువు

*31.* భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి?

=అర్జున విషాద యోగము.

*32.* భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుధ్ధము చేయగలడు?

=పదివేలమంది.

*33.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి?

=అనంతవిజయము.

*34.* భగవద్గీత మొదటి శ్లోకం ఏ పదం (శబ్దము)తో ప్రారంభమవుతుంది?

= “ధర్మ” - శబ్దముతో గీత ప్రారంభమయినది.

*35.* ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతీ విషయమును గీత సంవాదముతో సహా ఎప్పటికపుడు ప్రత్యక్షంగా (లైవ్) వివరించినదెవరు?

=సంజయుడు.

*36.* భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటిరోజున పాండవుల తరపున వ్యూహ రచన చేసినది ఎవరు?

=దృష్టద్యుమ్నుడు.

*37.* ఆయుధములలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వజ్రాయుధము.

*38.* మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధవ్యూహము పేరేమిటి?

=వజ్ర వ్యూహం.

*39.* గీతా సంవాదము జరిగిన మహాభారత సంగ్రామ మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు?

=భీష్ముడు.

*40.* సర్పములలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాసుకి.

*41.* అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= అనంతుడు.

*42.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులుడు ఊదిన శంఖం పేరేమిటి?

=సుఘోషము.

*43.* అర్జునుని ధనస్సు పేరేమిటి?

=గాండీవము.

*44.* జీవునకు ఈ శరీరమునందు ఎన్ని అవస్థలు కలుగునని శ్రీకృష్ణుడు చెప్పెను?

=నాలుగు. (బాల్యము, యౌవనము, వార్థక్యము, దేహాంతర ప్రాప్తి)

*45.* నదులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= గంగానది.

*46.* ఆత్మ యెట్టిది?

=నాశరహితమైనది.

*47.* కొంత ఆచరించి మధ్యలో వదిలివేసిననూ నిష్ఫలము కాని కర్మను ఏమందురు?

=నిష్కామ కర్మ.

*48.* మనుజునకు దేనియందు అధికారము కలదు?

=కర్మలు చేయుటయందు మాత్రమే. (ఫలమునాశించుట యందులేదు.)

*49.* అర్జునుడు ఎవరి లక్షణములు-భాష, నివాసము, నడవడిక తెలుపమని శ్రీకృష్ణుని అడిగెను?

=స్థితప్రజ్ఞుడు (జీవన్ముక్తుని లక్షణములు.)

*50.* వృక్షములలో తాను ఏ వృక్షమని శ్రీ కృష్ణుడు చెప్పెను?

= రావిచెట్టు.


*51.* పంచభూతములచే నాశనము పొందనిది ఏది?

=ఆత్మ.

*52.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి?

=మణిపుష్పకము.

*53.* ప్రపంచమున పూర్ణానందమెచట లభించును?

=ఆత్మయందు.

*54.* మహాభారత సంగ్రామంలో అర్జునుని రధము యొక్క జెండాపై గల వానరుడెవరు?

=హనుమంతుడు.

*55.* పక్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= గరుత్మంతుడు.

*56.* ఏ జంతువు వలె యోగి అయినవాడు తన ఇంద్రియములను వెనుకకు మరల్చును?

=తాబేలు.

*57.* కర్మచేయుట మేలా, చేయకుండుట మేలా?

=చేయుటయే మేలు.

*58.* బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించునపుడు వారితో సహా మఱి వేనిని సృష్టించిరి?

=యజ్ఞములు (సత్కార్యములు, దైవకార్యములు)

*59.* వివేకవంతుడు కర్మలను ఎందుకు చేయవలెను?

=లోక క్షేమం కొరకు.

*60.* ఆవులలో తాను ఏ ఆవునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= కామధేనువు.

*61.* స్వధర్మ, పరధర్మములలో ఏది శ్రేష్ఠమైనది?

=స్వధర్మము.

*62.* పొగచేత అగ్నియు, మురికిచేత అద్దము, మావిచేత గర్భమందలి శిశువు కప్పబడి వున్నట్లు ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడియుండును?

=కామము చేత.

*63.* దేని ప్రేరణచే జీవుడు తాను వద్దనుకొన్ననూ పాపమును చేయుచున్నాడు?

= కామము యొక్క ప్రేరణచే.

*64.* భగవంతుడెపుడు అవతరించును?

=ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధిపొందునపుడు.

*65.* అసురులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ప్రహ్లాదుడు.

*66.* గంధర్వులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= చిత్రరథుడు.

*67.* హృదయ శుద్ధి తద్వారా మోక్షము దేనివలన కలుగగలదు?

=జ్ఞానతపస్సు.

*68.* జ్ఞానప్రాప్తి వలన కలుగు ఫలితమేమిటి?

=పరమశాంతి.

*69.* ఆత్మధ్యానమును అభ్యసించుచున్న యోగి యొక్క మనస్సు దేనితో పోల్చవచ్చు?

=గాలిలేనిచోట గల దీపంతో.

*70.* ఏ సాధనములచేత మనస్సు నిగ్రహింపబడగలదు?

=అభ్యాసము, వైరాగ్యము.

*71.* భయంకరమైన మాయను దాటుట ఎట్లు?

=భగవంతుని శరణుపొందుట వలన.

*72.* భగవంతుని సేవించువారిని ఎన్నిరకములుగా శ్రీకృష్ణుడు వర్గీకరించెను?

=నాలుగు రకాలు (ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని.)

*73.* భగవత్స్వరూపమును ఎవరు తెలిసికొనలేరు?

=అజ్ఞానులు.

*74.* విద్యలలోకెల్లా శ్రేష్ఠమైనది, అతిరహస్యమైనది ఏది?

=బ్రహ్మవిద్య.

*75.* మహర్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= భృగు మహర్షి.

*76.* బ్రహ్మవిద్యకు అర్హత యేమి?

=హృదయ శుద్ధి, అసూయాది దుర్గుణరాహిత్యము.

*77.* ఆకాశమునందు వాయువు వలె, సమస్త ప్రాణికోటి ఎక్కడ స్థితిగలిగి యున్నది?

=పరమాత్మయందు.

*78.* గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడెట్లు కాగలడు?

=పరమాత్మయందు అనన్యభక్తిచే.

*79.* ఎప్పటికీ దుర్గతి పొందనది ఎవరు?

=భగవంతుని భక్తుడు.

*80.* సమస్త ప్రాణికోటి యొక్క హృదయాంతరాళములందు నివసించు ప్రత్యగాత్మ ఎవరు?

=సాక్షాత్తు పరమాత్మయే.

*81.* ఇంద్రియములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=మనస్సు.

*82.* పర్వతములలో తాను ఏ పర్వతమని శ్రీకృష్ణుడు చెప్పెను?

=మేరువు.

*83.* పురోహితులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=బృహస్పతి.

*84.* వాక్కులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=ఓం కారము.

*85.* యజ్ఞములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు నుడివెను?

=జప యజ్ఞము.

*86.* ఏనుగులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఐరావతము.

*87.* గుర్రములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఉచ్ఛైశ్శ్రవసము.

*88.* శ్రీకృష్ణ భగవానునిచే ఆహారము ఎన్ని రకమలుగా పేర్కొనబడెను?

= మూడు (సాత్విక, రాజస, తామసాహారము)

*89.* దేవఋషులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= నారదుడు.

*90.* సిద్ధులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=కపిల మునీంద్రుడు.

*91.* భగవద్గీత చివరి అధ్యాయము పేరేమిటి?

= మోక్షసన్యాస యోగము.

*92.* లెక్కపెట్టువారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= కాలము.

*93.* జలచరాలలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= మొసలి.

*94.* ఆత్మను దేహమునందు ఉంచుటకు కారణమైన మూడు గుణములేవి?

= సత్త్వ, రజ, తమో గుణములు.

*95.* వేగముగా సంచరిస్తూ పవిత్రమొనర్చు వారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాయువు.

*96.* భక్తియోగమైన పన్నెండవ అధ్యాయంలో భక్తుని లక్షణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?

= 35.

*97.* విద్యలోల తాను ఏ విద్యనని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఆధ్యాత్మ విద్య.

*98.* రాగద్వేష రహితముగా, తత్త్వ నిశ్చయము కొరకు వాదించువారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాదము.

*99.* అక్షరములలో తాను ఏ అక్షరమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= "అ"-కారము.

*100.* భగవంతుని విశ్వరూప సందర్శనమును ఎవరు మాత్రమే చూసెను?

= అర్జునుడు. (వ్యాసుడు, వ్యాసుని వరం వలన సంజయుడు, రథ ధ్వజంపై అదృశ్యరూపంలో వున్న హనుమంతుడు కూడా)

*101.* మాసములలో తాను ఏ మాసమునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= మార్గశిరము.

*102.* క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమైన 13వ అధ్యాయములో జ్ఞానగుణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?

= 20 (ఇరువది).

*103.* శ్రీకృష్ణ భగవానునిచే దైవగుణములు ఎన్ని పేర్కొనబడెను?

= 26 (ఇరువదియాఱు).

*104.* శ్రీకృష్ణ భగవానునిచే అసుర గుణములు ఎన్ని పేర్కొనబడెను?

= 6 (ఆఱు).

*105.* తపస్సులెన్ని రకములు?

= మూడు (శారీరక, వాచిక, మానసిక)

*106.* పరబ్రహ్మమునకు ఎన్నిపేర్లు కలవు?

= మూడు (ఓమ్, తత్, సత్).

*107.* మోక్షమును పొందుటకు కర్మలను వదలవలెనా?

= లేదు. కర్మలు చేయునపుడు భగవంతుని యందు మనస్సు లగ్నమై వుండవలెను.

*108.* సంజయుడు ఎవరి అనుగ్రహముచే ఈ గీతాసంవాదమును నేరుగా (లైవ్) వినగలిగెను?

వేదవ్యాసుడు.

💐🙏💐



నేటి బ్రహ్మజ్ఞానము .. ప్రాంజలి ప్రభ .. 111

సేకరణ రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

 

అవమానాలు, దూషణలు, అహంకారాన్ని గాయపరచక మానవు. అయితే ఈ రెండూ జ్ఞాని దృష్టిలో, దూషించేవాని మనస్సులో కదిలే రెండు రకాల భావనా వీచికలు మాత్రమే! 


సంతోషంతో నిండిన మనస్సులోంచి పొగడ్తల వంటి మంచి శబ్దాలు వస్తాయి. క్రోధ విచారాలతో ఈర్ష్యతో నిండిన మనస్సు నుండి తిట్లు అవమానాలు ఉదయిస్తాయి.

 వస్తుతః రెండూ కూడా మనోవికార జనిత భావాలే! భావనాధారంగా ఆత్మ చైతన్యంగా తన్ను తాను తెలుసుకున్న జ్ఞాని భావాల క్రీడ అని శాంతంగా సమదృష్టితో వీక్షిస్తాడు.

 సాధారణంగా మనలోని అహంకారమే బుద్ధితో తాదాత్మ్యం చెంది ఎదుటివారి మాటల అర్థాన్ని గ్రహించి సంతోష విచారాలను అనుభవిస్తూ ఉంటుంది.

 ఆత్మతత్త్వాన్ని అర్థం చేసుకుని అహంకారపు మాయను జయించిన ధీరుని, మానావమానాలు ఏం చెయ్యగలవు? రెండూ అదే చైతన్యంలో ఉద్భవించి నర్తించి నమస్కార సూచకమైన మౌనంతో పాదాభివందనం చేసి అదృశ్యమయిపోతాయి.

ఒకసారి బుద్ధభగవానుడు బజారులో నుండి శిష్యసమేతంగా వస్తూ ఉన్నాడు. ఒకవ్యక్తి 

ఆయనను సమీపించి దూషించి అవమానించడం మొదలు పెట్టాడు. అన్నిటినీ శాంతంగా వింటూ భగవానుడు నిలబడ్డాడు. 

అవన్నీ పూర్తయిన తరువాత ఆదే శాంతంతో ఆయన ముందుకు సాగబోతుంటే ఆయన శిష్యుడు అపరిమితమైన ఆవేశంతో 'స్వామీ ఆ నీచునికి బుద్ధి చెప్పి వస్తాను అనుజ్ఞ " నీయండి, దైవస్వరూపులయిన మిమ్మల్ని అన్ని మాటలన్న అతడు క్షమార్హుడు కాడు" అన్నాడు. అందుకాయన చిరునవ్వుతో "వత్సా! అతడన్న మాటలన్నిటిని నేను విన్నాను కాని, స్వీకరించలేదు. 

అందుకే నేనతనికి తిరిగి యివ్వవలసిందేదీ లేదు. ఒకవేళ నీవు స్వీకరించి ఉంటే తప్పకుండా వెళ్ళి బదులు తీర్చి రా నాయనా' అన్నారట. బుద్ధితో సాధించగలిగిన పూర్ణత్వం ఇదే. దీనినే సమబుద్ధి అంటారు.

ఆత్మజ్ఞానికి తన చైతన్యమే భావనా తరంగాలుగా సర్వత్రా నర్తిస్తూందనే సత్యం సర్వదా స్ఫురిస్తూనే ఉంటుంది. చూడబడే, గుర్తింపబడే సర్వమూ తన నర్తనలే అని అతడికి స్పష్టంగా తెలుసు. 

అహంకారంలేని కారణంగా, మనో బుద్ధులతో తాదాత్మ్యం చెంది, సంఘటనలను యిష్టాయిష్టాల దృష్టితో చూడడు. మానఅవమానాలతనికి సమానమే. దేనిపైనా అతనికి ఆకర్షణా వికర్షణా ఉండవు. 

సర్వత్రా, సర్వదా, సర్వ సంఘటనలలోనూ, చైతన్యమయిన తానే భావనా తరంగాలుగా నర్తించడాన్ని గుర్తిస్తూ మౌనసమయ మాధురీపూర్ణ మానసంతో శాంతుడై ఉంటాడు!

ప్రతి స్ఫురణము లేక స్పందన లేక కంపమునకు హేతువు అగు మహాశక్తి మాయ- దైవము.

ప్రతి చలనము నకు  కావలసిన చలన శక్తి- దైవము.  ప్రతి తేజమును  వీక్షించు  చూపు  అనే కాంతి లక్ష్మి- దైవము.   ప్రతి మాటలోని  శబ్ధబ్రహ్మము-దైవము.

ప్రతి హృదయములోని జాగరూకమైన ప్రాణము- దైవము.  ప్రతి శిరస్సు అందలి 

ధ్యానము- దైవము.  ప్రతి చూపు లో ప్రకాశము- దైవము ప్రతి మూలాధార చక్రమున 

జ్వలించునది-దైవము.

***

శీర్షిక:-నాకు నేనే -- ప్రాంజలి  ప్రభ  (వ్యాసం)  --1  

*********

నిలదీసే తత్వాన్ని నిద్రపుచ్చకు, రాజీపడే తత్వాన్నిచేరనీకు, నిజాన్ని నిర్భయంగా తెలుపుట మరువకు, దేశ భక్తి , మాతృభాష రక్షణ, నరనరానికి ఎక్కించుకొన్నాక, తల్లి లేరు తండ్రి బంధువులు అసలే లేక, బాధ్యత క న్నా భయమే తోడు రానీక, చేయనెంచ దలచినది నిర్భయంగా, నిస్వార్ధంగా, నిర్ణయ పరంగా, హృదయం ఒక యంత్రంగా, విద్యుత్తై ఆయుధంగా, కనబడని గాలిలాగా దూసుకు పోయే ఇంధనంగా సేవలకై నిత్య ప్రయత్నం.           

దేహమంతా ఆవహించి చిన్ని గుండెలో తిష్టేసింది ఆ ఉదయాన..!!

తప్పు చేయకున్నా, తప్పించుకునే దారులు వెతకకున్నా, వెతుకులాటలో  వ్యక్తిత్వం చూపే హృదయమున్నా, రుధిరం చిందించకుండా, సమయం వ్యర్ధ అవ్వకుండా,  దొడ్డి దారి లోకి దూర కుండా, నిర్మలమైన మనస్సుతో, నవ్వులమ్మ మొగం చూపిస్తూ, సర్వం నిగ్రహించె 

హృదయాంతరంగాన. తిష్టేసింది ఆ ఉదయాన..!!. 

నిత్యం నీళ్ళు పోసి పెంచిన సహజత్వం పూలమొక్కల వంటి ఎదుగుతున్న యువక వర్ధమాన శక్తి, వాడిపోయే వారికి చేయుట నిచ్చే శక్తి, మొగ్గలుగానే రాలిపో కుండా పులా పరిమాళాలను అందించేవిధముగా  వికాసం కల్పించే శక్తి యువరక్తం, వృద్ధులకు, స్త్రీలకు, పిల్లలకు,       

నడవడిక రాజమార్గాన.తిష్టేసింది ఆ ఉదయాన..!!.

నేరమొకడు చేసి శిక్షను  వేరొకరి కేసిన, నోరు మెదపని ప్రజానీకం చుస్తే ఏమనాలో నాకు మాత్రం తెలియలేదు, ఇటువంటి పిరికి బందల మనస్సు మార్చాలని నా ప్రయత్నం,     

ఆలవాలమై ఆలనాపాలనా లో అబద్రతా భావ ఆనవాళ్లు అడుగడుగునా ధనమదం, అధికార జులం, రక్షక భటుల అగమ్య గోచరం, మార్పు రావాలని  తిష్టేసింది ఆ ఉదయాన..!!.

మొలకెత్తి  నిలకడ తత్వం లేని మానవత్వం, పెరిగి పోతున్నా న్యాయ వాద రాజనీతి చదరంగం ఆటలు వెల్లువ ప్రజలకు నిదుర కరువైంది, ఆకలి మొదలైంది, మందుల మోసం ఎగసి పడుతున్నది, నకిలీ విత్తనాలు బాజారులో అమ్ముడవుతున్న పట్టించుకోని ప్రభుత్వాలు, కేవలము సంపాదన, సంపాదనా గుప్పెడు అన్నాని కోసం కోట్లు దాచటం తిష్టేసింది ఆ ఉదయాన..!!.         

నన్ను నేను హింసించుకుంటు అనారోగ్యాన్ని ఆహ్వానించక, ధైర్యాన్ని ఊపిరిగా వివరించి, స ర్వే జనా సుఖినోభవంతు అంటూ నిలకడ లేని నా ప్రయాణం సాగిస్తూ, మనశ్శాంతి  ఎక్కడ ఎక్కడ అంటూ ధర్మాన్ని రక్షించ దలిచాను మనసా, వాచా, కర్మణా, నిరీక్షనా జీవితం తిష్టేసింది ఆ ఉదయాన..!!. 

మనఃపూర్వక  భావవ్యక్తీకరణ మౌనం వహించక భాషలో  అసహనం అపసృతులు తాండవించకుండా, మనసుకు బుద్ధి కి మద్య వైరుధ్యాల యుద్ధాలు సహజమైన, దాని భావాల్ని ఉత్తేజ పరచడానికి నిర్విరామ కృషిగా నిత్యం చేస్తూనే వున్నాక సత్యం ఎక్కడ లోన ఈ లోకానా తిష్టేసింది ఆ ఉదయాన..!!.  

చేతకాని తనమో, కాదు కాదు చేవలేని తనమో అన్న మాటలకూ తలఒగ్గకుండా ప్రశ్నించలేని  అస్తిత్వాన్ని కోల్పోక స్థిరత్వాన్ని నిలపడానికి శ్రావ్య శక్తులను ప్రజ్వలింప చేయ గలను, నిస్సహాయుడను కాను ఒక్కడినే అయినా తోడు రాక పోయినా ఎంత మంది ఉన్న గమ్యాన్ని మార్చను, ఆలోచనలను ఆచరణకు త్రికరసిద్ధిగా ప్రయాణాలు సాగె వారికీ చే యూత నివ్వ గలను అదే నా లక్ష్యం , నా ధ్యేయం, నా కర్మలు చేయు మర్మం,  తిష్టేసింది ఆ ఉదయాన..!!.  

అస్తవ్యస్తంగా మారిన జీవనశైలిలో స్థిరత్వం శిధిలమై పోకుండా,   అంతరంగమంతా ఆత్మ తత్వంగా ప్రశ్నలే ప్రశ్నలు జవాబులు తెలియపరుస్తూ హృదయాంతరాలలో జీవిస్తూ,  

జవాబు దారి తనాన్ని అందరికి అందిస్తూ,  ఎడారి చేసిన మార్గాన్ని పరిశీలించి పునర్ నిర్మిస్తూ 

రాజీ ధోరణిలో  నన్ను నేను కోల్పోక జీవశ్చవంగా కనిపించక నిర్ణయాలన్ని ఆ భగవంతుడు చేయిస్తున్నాడని భవిస్తూ నలుగురికి సేవలు చేస్తూ ఆ హనుమంతుడ్ని ప్రార్ధిస్తూ నాగమ్యం పూల బాటగా మార్చుకోవాలని ఈ ప్రయత్నం అందుకే తెలుగును రక్షించు కుందా, పరభా షను తరిమేద్దాం ఓం శ్రీ రామ  శ్రీ మాత్రే నమః  తిష్టేసింది యీ ఉదయాన..!!.       

*******

  🌷శుభమస్తు🌷        🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏


సూనున్ శాంతగుణప్రధాను నతి సంశుద్ధాంచితజ్ఞాను న
జ్ఞానారణ్య కృశాను నంజలిపుటీ సంభ్రాజమానున్ సదా
శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద నా
ధీనున్ ధిక్కరణంబుజేసి పలికెన్ దేవాహితుం డుగ్రతన్.

భావము:- ఆ ప్రహ్లాదుడు మహాశాంతమూర్తి, గొప్ప గుణవంతుడూ; బహు పరిశుద్ధమైన జ్ఞానం అనే సంపదకు గనిలాంటి వాడు; అజ్ఞానం అనే అరణ్యానికి అగ్నిలాంటివాడు; నిరంతరం చేతులు జోడించి మనసులో పరంధాముని పాదపద్మాలనే ధ్యానిస్తూ ఉండేవాడు; అటువంటి సకల సద్గుణ సంశీలుడిని కన్న కొడుకును ధిక్కరించి, కోపించి; విబుధవిరోధి యైన హిరణ్యకశిపుడు ఇలా విరుచుకుపడ్డాడు.

   ఏనాడైనను వినయము
   మానకుమీ మత్సరమున మనుజేశులతోఁ 
   బూనకు మసమ్మతయు బహు
   మానమునను బొందు మిదియె మతము కుమారా!

ఓ కుమారా! ఎన్నడునూ వినయ స్వభావమును వీడరాదు. ఈర్ష్యా అసూయలతో తమ కంటే పెద్దవారితో కలహించుట పనికిరాదు. పేదవారి కోపం పెదవికి చేటు అనే నానుడిని మన
స్సునందుంచుకొని మెలగుము.అట్లు చేసినచో నీకు సంఘంలో గౌరవ మర్యాదలబ్బును. సన్మానాలు జరుగును.

దినముం చిత్తములో సువర్ణముఖరీ తీరప్రదే శామ్రకా
నన, మధ్యోపరివేది కాగ్రమున, నానందంబునం పంకజా
సననిష్ట నిన్ను జూడగన్న నదివోసౌఖ్యంబు లక్ష్మీ విలా
సిని మాయానటనల్ సుఖంబులగునే శ్రీ కాళహస్తీశ్వరా! 

తా:-  శంకరా! సువర్ణముఖీ నదీతీరం దగ్గరి మామిడితోటలోని రాతిఅరుగు మీద పద్మాసనం వేసుకుని కూర్చున్న నిన్ను, ప్రతిరోజూ మనసులో చూడగలిగితే, అదే ఆనందం, అదే సౌఖ్యంగానీ చంచలస్వభావం గల లక్ష్మీదేవి చూపు నటనలు (ఒకసారి అనుగ్రహించుట, ఒకసారి తిరస్కరించుట అను భిన్న భావములు) సౌఖ్యం కలిగించునా?

కనబడెడు సూర్యచంద్రుల 
నిను,నన్నున్, సర్వజగము, నేర్పున సృజియిం 
చిన పరమేశ్వరుడొక్కరు ,
డనయము కలడని యెఱుంగుమయ్య; కుమారా!

ఆస్థా స్వాస్థ్యే యది స్యాతాం మేధయా కింప్రయోజనం
తే ఉభే యది స్యాతాం  మేధయా కింప్రయోజనం

ఆసక్తి, ఆరోగ్యము యివి రెండూ వున్నచో ఎక్కువ తెలివితేట లక్కరలేదు. అవి రెండూ లేనట్లయితే తెలివితేటలు ఎంతవున్నా    ప్రయోజనము లేదు. అనగా 
ఆసక్తివుండి,ఆరోగ్యము వుండి పట్టుదలతో ప్రయత్నించిన చో ఎట్టి కార్యమైననూ నెరవేర్చగలరని భావము.

అప్పు దీయ రోత హరిహరాదుల కైన
మొప్పె తోడ మైత్రి మొదలె రోత 
తప్పుబలుక రోత తాకట్టిడిన రోత 
విశ్వదాభిరామ వినురవేమ !

   తా:-- అప్పు చేయడం హరిహరాదుల కైనా పనికిరాదు.రోత కలిగించును. చెడ్డవాడితో స్నేహము కూడా అంతే, తప్పుడు మాటలు మాట్లాడుట, సొమ్ము తాకట్టు పెట్టుట మొదలైనవన్నీ చేయరాదు.

శారద నీరద వర్ణా
సారసభవ చక్రపాణి శంకరవినుతా
కీర మనోహర హస్తా
భారతి! నీ పాదపద్మ భజన మొనర్తున్

*పాలించవే నన్ను పద్మసంభవు రాణి  బహుశాస్త్ర పుస్తకపాణి వాణి
కరుణించవే నన్ను గలహంస గామినీ కోరి మ్రొక్కెద నీకు గీరవాణి
రక్షించవేనన్ను రాజబింబాననా దయ గావవే సర్వధవళ వర్ణ
మన్నించి నీవు నా మదిలోన నుండవే మాధవు కోడలా మదను వదినె

   నిన్ను నెప్పుడు సేవింతు నీలవేణి
   నన్ను గృపజూడు మెప్పుడు నళిన నేత్రి
   భారతీదేవి నా జిహ్వ బాయకుండు
   శరణులోకైక వినుతాంబ శారదాంబ

పెట్టక కీర్తి రాదు వలపింపక యింతికి యింపు లేదు తా
దిట్టక వాదులేదు కడుధీరత వైరుల సంగరంబులో
కొట్టక వాడ లేదు కొడుకొక్కడు పుట్టక ముక్తి రాదయా
పట్టపు రాజుకైన నిది పద్ధతి పెమ్మయ సింగధీమణీ

పట్టుచుఁదండ్రి యత్యథమువర్తనుఁడైననుగాని వానికిం
బుట్టిన పుత్రకుండ తన పుణ్యవశంబున దొడ్డ ధన్యుఁడౌ
నెట్టన మఱ్ఱివిత్తు మునుపెంతయు గొంచెము దానబుట్టునా
చెట్టు మహోన్నతత్వమును జెందదే శాఖలనిండి భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! మర్రిచెట్టు విత్తనము చిన్నదైననూ దాని నుండి పెరిగిన వృక్షము శాఖోపశాఖలుగా మహావృక్షమగును. అలాగే తండ్రి నీచప్రవర్తన గలవాడైననూ వానికి పుట్టిన కుమారుడు తన పూర్వపుణ్యాన గొప్పవాడుగా కావచ్చని భావం.

వేద మూల మిదం జ్ఞానం  
భార్యా మూల మిదం గృహం 
కృషి మూల మిదం ధాన్యం 
ధన మూల మిదం జగత్ 

అర్థము:-జ్ఞానానికి మూలము వేదము, గృహానికి మూలము భార్య, కృషి (వ్యవసాయము)కి మూలము ధాన్యము, ఈ జగత్తుకు మూలము ధనము.

పయః పానం భుజంగానాం కేవలం విష వర్ధనం 
ఉపదేశో  హి మూర్ఖాణాం  ప్రకోపాయ న శాంతయే 

అర్థము:-- పాముకు పాలు ఎంత పోసిననూ అది దాని కోరలలోని విషము వృద్ధి చెందును. అట్లే మూర్ఖునకు మంచిని బోధించ ప్రయత్నము చేసినచో వాని కోపము,కక్ష పెరుగునే కానీ మంచి దారికి రాడు.

***
వివాహ సంభంద విచిత్రాలు - ఇనప బెండకాయ?

పెళ్లి చూపులలో అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్నారు. చూడబోతే వాళ్ళు ఒకళ్ళను ఒకళ్ళు ఇష్టపడట్లే వున్నారు. ఇద్దరూ మంచి ఉద్యోగులు. పెద్ద జీతాలు. 

ఎన్ని అనుకున్నాకన్యాదానం చేయవలసింది పిల్ల తండ్రి కాబట్టి అందరం అనగా ఆయన పిల్లతో సహా,  అందరం ఆయన వంక చూసాము. 

అయన అప్పటికే వీర గంభీర ముద్రలోకి ప్రవేశించి వున్నాడు.

"అబ్బాయితో కొంచెం మాట్లాడేది వుంది" అని అభిప్రాయం వ్యక్తం చేసాడు. 

అలాగే మాటాడండి అని పిల్లాడి తల్లి అన్నది.  

ఇక్కడ కాదు, అలా డాబా మీదకు వెళ్లి మాటాడుకుంటాం అని అయన పిల్లవాడిని తీసుకొని డాబా మీదకు వెళ్ళాడు. 

ఇదో కొత్త పోకడ కాబోసు అని మేము సరిపెట్టుకున్నాము.  

వారు అరగంట తరువాత కిందకి తిరిగి వచ్చారు. 

సంభందం - భజ గోవిందం అయిందని మాలో ప్రతి ఒక్కరికి అర్ధం అయ్యింది. అందరం నిరుత్సాహంతో బయట పడ్డాము. ఉత్సాహం కోసం లిమ్కా లు తాగాము. 

నేను ఇరువురికి బాగా పరిచయం వున్నా వాడిని, పైగా ఈ సంభందం ఇక్కడి వరకు తెచ్చిన వాడిని కూడా. ఆయనది నాదీ ఒకే ఆఫీస్ కూడాను. 

మీరు ఏమి మాట్లాడుకున్నారు అని  పిల్లవాడిని ఎంతో అడిగి కూడా సంభందం ఎందుకు బెడిసింది కనుక్కోలేక పోయాము. 

వాళ్ళు చివరి ప్రయత్నంగా నాతో "విషయం ఏమిటో తెలుసుకుందాము. ఇకముందట జాగర్త పడవచ్చు. మీరు అడిగి తెలుసుకొని రండి" అని నన్ను బ్రతిమాలారు. 

ఆ బ్రతిమిలాటకు లొంగి కొంతా, ఏమిటో తెలుసు కుంటే ఎందుకైనా మంచిది అని కొంతా అలోచించి నేను పిల్ల తండ్రిని ఆయన తీరికగా వున్నప్పుడు మా ఆఫీసులోనే కదలేసాను. 

అయన పేరు పురుషోత్తమ దాస్ రూప్ చెందు జ్ఞ్యానేంద్రు. పేరు ఎట్లావున్నాగాని అయన, అచ్చం మనవాడే. 

పురుషోత్తం దాసు గారు ఇలా అన్నాడు.  

"పిల్ల వాడు  చదువుకి సంబంధించని ఎన్నో పుస్తకాలు చదివినట్లు తెలుసుకున్నాను. లోకజ్ఞనం, సొంత తెలివి, మనో వికాసం  కోసం ఆ బుక్స్ చదివాడుట. ఒక్క ఆధ్యాత్మిక పుస్తకం కూడా లేని   లైబ్రరీ ఇంట్లో ఉందట. మీరు భగవత్ గీత చదివారా అని అడిగితే,అది ఆధ్యాత్మిక గ్రంధం కాదు జ్ఞ్యాన భాండం" అని దాని గొప్పని  గురించి మాట్లాడాడు. అతడి మనసు బాగా వికాసం చెంది వుంది. మేము అల్లుడి  మర్యాదలు చేసినపుడు పొంగిపోయి మాఇంట్లో బోర్లా పడే మనిషి కాదు. అల్లాగే మేము అతని మీద నిరసన వ్యక్తం చేయటానికి అని అతన్ని చిన్న చూపు చూస్తే, కుంగి పోయి మా దారికి వచ్చే మంచి  మనిషి కూడా కాదు. దేనికైనా ఉక్కు కడ్డీలా స్థిరంగా వుండే మనిషి అనిపించింది. అతని ముందు ఎవరి పప్పులూ ఉడకవు. ఫదిమంది ఫ్రెండ్స్ సర్కిల్ కి ఇతడే నాయకుడట. ఆఫీసులో కూడా సొంత నిర్ణయాలను తీసుకొని ఆ  నిర్ణయాలను చక్కగా  అమలు పరుచుకో గలుగుతాడుట! అంటే కొండను ధీ కొట్టే అంత  సాహసం వున్నవాడు. ముక్కుసూటి మనిషి అని తెలుస్తోంది. తల్లి తండ్రులంటే భక్తీ వినయం వున్నాయి. పిల్లాడికి జ్ఞ్యానం మరీ ఎక్కువగా వుంది. పెళ్లి తరువాత తల్లి తండ్రులని ఎలా చూడాలి వాళ్ళని ఏమి చేయాలి అన్నది కూడా ప్లానింగ్ చేసి పెట్టుకున్నాడు. 

"ఇల్లాంటి ఆదర్శ పురుషుడికి నా పిల్లనిస్తే నాకేమి ప్రయోజనం? అల్లుడు అంటే అట్టు మీద ఉల్లి పాయలాగా, పులుసులోకి ముక్కలాగా, చెట్టునున్న చిక్కుడు కాయలాగా, కొమ్మకున్న కరేపాకు రెమ్మ లాగా, మనం ఏమనుకుంటే దానికి పనికొచ్చ్చేట్లు ఉండాలి. ఏపని చెపితే ఆ పని గురించి తర్కించకుండా ప్రతి పనికి "వూ" కొట్టేవాడై  ఉండాలి. వాళ్లకు పెళ్లి కావాల్సిన పిల్లాడిని పెంచే విధానం తెలీదు. పిల్లాడిని మంచి వ్యక్తిత్వంతో, స్థిరమైన సొంత భావాలతో పెంచారు. అలా సొంత వ్యక్తిత్వం వున్న అబ్బాయి అంటే ఇనప బెండకాయ లాంటి వాడు. మాకు పెళ్లి పులుసులోకి పనికి రాడు" అని తేల్చి చెప్పాడు. 

ఇది చదివి సంతోషించిన వారు సంతోషించగా, స్వర్గీయులు శ్రీ  కొడవటి గంటి కుటుంబరావు గారని ఒక ప్రముఖ రచయిత, ఇది చదివి స్వర్గంలో కన్నీరు మున్నీరు అయ్యారు. ఆయనకు నా క్షమాపణలు.
***

Tuesday, 21 March 2023

ప్రాంజలి ప్రభ...22/03

 




ఓం శ్రీ రామ్ ... శ్రీ మాత్రే నమ: 
  • *శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-1*002 

*హనుమ స్వరూపము*
*వేదవేద్యే పరే పుంసి జాతే దశరాత్మజే*
*వేద: ప్రాచేతసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా*

వేదములచే తెలియబడు పరమపురుషుడు దశరధునికి కుమారుడైనట్లుగా,వేదము,వాల్మీకి వలన , రామాయణ రూపముతో ఉండినది..

శ్రీమన్నారాయణుడు ఈ భూమిపై మరల నసించిపోవు చున్న ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీరాముడు గా అవతరించాడని  మన భారతీయుల ప్రగాఢ విశ్వాసము. శ్రీరాముని మీద మనకు లభించినన్ని పరిశోధనా గ్రంథాలు వేటి యందు లభించవు. శ్రీరాముడు మానవునిగా జన్మించి తన శిష్య ప్రజ్ఞచే సకల శాస్త్రాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి, అకుంఠిత దీక్షతో ఆయా యోగ రహస్యాలను అభ్యాసం చేసి, తన సత్య సంధతతో భగవంతునిగా రూపాంతరము చెందినవాడు. తనను గూర్చి *"ఆత్మానాం మానుషం మన్యే"* (నేను మానవ మాత్రుడను) అని పేర్కొన్న శ్రీరాముడు *"సత్యేన లోకాన్ జయతి"*  అను ప్రమాణము ననుసరించి సత్యనిష్టాగరిష్ఠుడు అయినందున శ్రీరాముడు అన్ని లోకములను జయించ గలిగిన వాడై భగవంతునిగా ఈ లోకుల దృష్టిలో ఉండిపోయాడు. దుర్లభమైన మానవ జీవితమును వ్యర్థము చేసుకొనకుండా బాహ్యమున ధర్మాచరణమును, అంతరమున జ్ఞానము కలిగి ఉండవలెనని మనకు శ్రీరాముని ద్వారా తెలియు చున్నది.
రామలక్ష్మణులు సీతను అన్వేషించుతూ పంపా తీరమునకు వచ్చినప్పుడు, సుగ్రీవుని భయము పోగొట్టుటకై హనుమ సుగ్రీవునితో ఇది ఋశ్యమూకం గాన ఇక్కడికి వాలి, వాలి సంబంధీకులు రాలేరు అని చెపుతాడు. ఆ విధంగా రామాయణంలో హనుమ పాత్ర పరిచయము అయింది. రామసౌందర్యమును చూడగానే హనుమ ఆకర్షితుడయ్యెను. హనుమను చూచి, అతని సంభాషణ విని నంతనే రాముడు అతనిలోని గుణగణములను తెలుసుకొనెను. రాముడు లక్ష్మణుతో హనుమను గురించి చెపుతూ ..

వాక్యకుశలః,(వాక్యకుశలుడు),  ఋగ్వేదమునందు బాగుగా శిక్షణ పొందినాడు, యజుర్వేదమును ధారణ చేసినాడు,  సామవేదమును చక్కగా ఎరిగిన వాడు, వ్యాకరణమును అనేక మార్లు వినినాడు, మాట్లాడినప్పుడు సందిగ్ధము లేకుండా, తొందరగా గాని, మెల్లగా గాని గాకుండా ముఖము నందు ఎట్టి వికార భావములు లేకుండా, మధుర స్వరముతో, సంస్కారముగా, మంగళకరమైన మధుర స్వరముతో మాట్లాడినాడు అనెను. ఇట్టివాడు దూతగా ఉన్నచో కార్యము తప్పక సిద్ధించునని దూతగా హనుమ యొక్క విశిష్టతను  చెప్పినాడు.  హనుమ యొక్క ఉత్పత్తి ప్రకారమును పరిశీలించిన శబ్దమునకు హనుమతో గల సామ్యము గోచరించును. మనలోని ఒక భావమును ఆవిష్కరించ వలెనన్న కోరిక గలిగినచో శరీరములోని వాయువులలో కదలిక గల్గును. ఆ వాయువుచే అభిహతమై మూలాధార స్థానము నుండి శబ్దము బయలుదేరి నాభిని, హృదయమును, కంఠమును దాటి తిన్నగా శిరస్థానమును చేరును. అచట నుండి పైకి పోవ వీలు లేక కంఠము నుండి ముఖము గుండా వెలికి వచ్చును. అట్లు వచ్చునప్పుడు నోటిలోని ఆయా స్థానములలో వాయువు యొక్క తాకిడిచే శబ్దముగా వెలికి వచ్చును. ఇందు హనుమకు, శబ్ధమునకు సాపత్యమును చూద్దాము.

1 హనుమ వాయువు వలన జన్మించాడు. శబ్దము కూడా వాయువు వలననే జనియించింది.
2 పుట్టగానే హనుమ సూర్య మండలము వైపు (సమాధి అవస్థ) కు పోయెను. శబ్దము కూడా ముందుగా శిరస్సు వైపు సాగును. అటు పోవ వీలుగాక నోటి నుండి వెలుపలికి వచ్చును. నోటిలోని ఆయా వర్ణముల అభివ్యక్త స్థానములే అంజన, కనుక అంజనాసుతుడు అయ్యెను.
3 సూర్యుని నుండి క్రిందకు పడిపోటచే దౌడలు సొట్ట  బోయి   హనుమ గా పేరు వచ్చినది. శబ్దము గూడ శిరఃస్థానము నుండి నోటిలోని దౌడల కదలికచే వర్ణ రూపమున వెలుపలికి వచ్చును గాన శబ్దము గూడ "హనుమ" అగును.
4 శబ్ద సామర్థ్యము వలన అవసరమైన కార్యములు నెరవేర్చుటలో మంత్రి వలే పని చేయును. స్వాధ్యాయన ప్రవచన శీలి యగు సుగ్రీవునకు హనుమ సచివుడు.
ఇట్టి హనుమయే రాముని సీతమ్మతో  కలుపును.
*శ్రీరామ జయరామ జయజయ రామ*
సీతారామ మనోభిరామ కళ్యాణ రామ 
సమస్త జనరక్షక పాలన రామ .. ఓం శ్రీరాం 
/మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
--(())--