Tuesday, 29 September 2020

నిరుద్యోగ ప్రయాణం స్టోరీస్ (10/2020)


నిరుద్యోగ ప్రయాణం 25 వ రోజు (రోజు వారికధ) (01-10-2020)

ప్రాంజలి ప్రభ  .. అంతర్జాల పత్రిక

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


మాధవ్ ఒక ఇంటి వద్ద పోట్లాడుకుంటునట్లు గమనించాడు వాళ్ళ సమస్య ఏదోవిధముగా పరిష్కారం చెయ్యాలని ఉహించాడు 

అందులో ఒకణ్ణి పిలిచి  చూడయ్యా అన్నాడు 

నేను నీకు అయ్యా .... అయ్యా అంటూ అరిచాడు 

కాదు కాదు మనం .. మానవులుగా బతకటం కాదు.. మానవత్వంతో బతకాలి 

ఎక్కడుందయ్యా మానవత్వం 

ఎందుకు ఆ గొడవ 

ఆస్తి తగాదా కాదు, ప్రేమ గురించా కాదు, చుట్టాల మధ్య కాదు  

మరి ఏమిటయ్యా 

పక్కింటి చెట్టు కొమ్మ ఇటు వచ్చిందని అరుపు 

ఐకమత్యం లేదు    

ఐకమత్యం అంటే మనం కుక్కమీద రాయి విసిరితే కుక్కపారిపోతుంది. అదే.. తేనెతుట్టి మీద విసిరితే మనమే పారిపోవాలి ! 

పక్క తేన తుట్టె ఉందని తెలిసి కూడా పోట్లాట పెట్టుకునన్వాడు మూర్ఖుడు 

అంటే   ... నేను మూర్ఖుడ్నా .....  మూర్ఖుడ్నా 

తగాదా ఆపి ఆడవాళ్లు వచ్చారు 

ఏమిటి ఈమాటలు మా మీద 

అయ్యో రామ ఆమె తోడు మీమీద కాదు 

ఈ బాబు ఎదో చెపు తుంటే ఊ ,,,కొడుతున్నా .... అంతే 

అంతేనా 

అంతే 

నీకు తెలుసా     

ఇద్దరు కొట్టుకుంటే.. ఒక్కరే గెలుస్తారు. రాజీపడితే... ఇద్దరూ గెలుస్తారు !

అర్ధం చేసుకోండి, అన్నాడు మాధవ్   

చుడండి భగవంతుని సృష్టి అద్భుతమే. అందులో నువ్వూ భాగమే.. అందులో నువ్వూ భాగమే అది తెలుసుకుని దాన్ని అనుభవించు, ఆనందించు.అని ఇద్దరితో అన్నాడు మాధవ్ 

ఏమాటయ్య నీవు చెప్పేది ఇద్దరం ఒకటే ఎట్లావుతాం 

అయితే కర్రలు ఇస్తా కొట్టుకోండి అన్నాడు 

ఇది మా ఇద్దరి మధ్య గొడవ నీవు తప్పుకో అన్నారు 

అవునా 

నీకు కష్టమొస్తే భగవంతుడిలా పక్కవాణ్ణి పిలుస్తావా, ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని రావాలని పక్కాయన కోరడు అది గుర్తుపెట్టుకో దానికి తోడు కష్టం   సులువుగా దాటే శక్తి నీకిస్తాడు. కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే... నీకు గొడుగుపట్టి కాపాడతాడు...నీ  పక్క ఇంటి వారే అని  గుర్తుంచుకో 

జ్ఞానం.. ఉన్న వారు ఆలోచించి మాట్లాడుతారు . అజ్ఞానం.. ఉణ్ణవారే మాట తప్పి ప్రవర్తిస్తారు మీరిద్దరూ  అట్లు కాకూడదు నిజమా  

నిజమేబాబు 

అయినా 

కొబ్బరిచెట్టు పెరిగేకొద్దీ పాతమట్టలు రాలిపోతాయి. జ్ఞానం కలిగేకొద్దీ తనపర భేదాలు తొలగిపోతాయి.కాబట్టి ఇచ్చి పుచ్చుకొనేటట్లు ఉంటేనే మీరు బాగుపడతారు 

అందరూ బాగుపడతారు 

నీవు పుండు లాంటి వాడవు మాటలాపితే 

పుండు మానితే పొలుసు అదేపోతుంది. 

అదేపనిగా పోట్లాడితే 

పుండు మానకుండానే పొలుసు పీకేస్తే… పుండు తీవ్రమై రక్తం కారుతుంది ! జ్ఞానసిద్ధి అంచెలంచెలుగా కలుగుతుంది . ఆత్రపడితే లాభంలేదు !


బాబు నువ్వెవరో మాకు కళ్ళు తెరిపించావు 


ప్రేమను పటుత్వ పరిచేల ఉంటె మార్పు 

మనసు మాటలు స్వశ్చత ఉంటె మార్పు  

స్త్రీ పురుష సంయోగంతోను వచ్చు మార్పు 

మానవత్వాన్ని బతికించె తెలివి మార్పు 


కాలమార్పుకు సహకరిం చుటయు మార్పు 

మాయ తరిమే కాలాన్ని కోరు మార్పు  

రోగమును తర్మె ఓషధ లోన మార్పు 

పుడమి తల్లియు కరుణించు టందు మార్పు 

 

ఇన్ని మార్పల్లో మీరిద్దరూ మారటం చాలా సంతోషముగా ఉన్నది 

ఇక నాకు సెలవిస్తే నేను బయలు దేరుతాను అన్నాడు మాధవ్ 


ఇద్దరి చేతుల్ని కలిపి బయలు దేరాడు మాధవ్ 


--(())--

నిరుద్యోగ ప్రయాణం 26 వ రోజు (రోజు వారికధ) (02-10-2020)

ప్రాంజలి ప్రభ  .. అంతర్జాల పత్రిక

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


మాధవ్ బజారులో ఉన్న ఒక దుకాణము దగ్గరకు చేరాడు అక్కడ కొందరు మాట్లాడుకుంటున్నారు 
రూపాయ విలువ పడి పోయింది ఎట్లా చెప్ప గలవు 
ఊరికినే తక్కువగా దొరికే ఉప్పు ఎంత రేటు పెరిగి పోయిందో 
మరి ఏంటో కష్టపడిరైతు  చెరకు పండించి మిల్లు ద్వారా పంచదార తయారు చేసింది మరి పెరిగింది అది మాత్రం తగ్గిందా     
అసలు ఉప్పుకి పంచదారకు తేడాతెలుసా ఏముంది తీపి ఉప్పు నే కదా అన్నాడు 
అప్పుడే అక్కడ ఉన్న మాధవ్ ఇలా చెప్పాడు 
ఉప్పులాగ కటువుగా మాట్లాడే వాడు నిజమైన మిత్రుడు... 
చక్కెర లాగ మాట్లాడి మోసగించే వాడు నీచుడు._*, 
ఉప్పులో ఎప్పుడూ పురుగులు పడ్డ దాఖలాలు లేవు.. 
తీపిలో పురుగులు పడని రోజూ లేదు..
అవునవును మీరన్నది నిజమే మరీ .....  

అయితే పాలకు కల్లు కి తేడా చెప్పు అన్నాడు అందులో ఒకడు 
పాలు అమ్మేవాడు ఇల్లిల్లు తిరగాలి.. 
కల్లు అమ్మేవాడి దగ్గరికే అందరు వెళతారు._*
పాలల్లో నీళ్ళు కలిపి నావా అని అడుగుతారు.. 
కల్లు లో నీళ్ళు కలిపినా  తాగుతారు._*
ఆహాహా యేమి ఈలోకం..

అసలు నువ్వెందు కొచ్చావు బజారుకు అన్నాడు ఒకడు    
పట్టీలు కొందామని వచ్చాను ధర బాగా పెరిగి పోయింది 
అవును పట్టీల విలువ వేల రూపాయల్లో... కాని వేసేది కాళ్ళకి అంటూ గొణిగాడు .... 
విలువ ముఖ్యము కాదు.. ఎక్కడ పెట్టు కుంటామనేది ముఖ్యము. అందులో సంతోషముంది అవసరమైనప్పుడు అప్పు పుడుతుంది కదా అన్నాడు మాధవ్ 
బాగా చెప్పావు బాబు 
ఇప్పుడు కొనక పొతే మరెప్పుడు కొనుకుంటాడు నేను కొనమని చెపుతున్నా  
సంపాదించినప్పుడే కొనుక్కోవాలి 
బంగారం గొలుసు కొనుక్కొని పొతే మీ భార్య సంతోషము ఎవ్వరూ చెప్పఁలేరు అన్నాడు మాధవ్ 
అందులో ఒకడు అన్నాడు 
హే మానవా ! ఈ జీవితం అంత విలువైనదేమి కాదు..
ఏడుస్తూ ఈ లోకంలో అడుగిడుతావు. 
ఏడిపిస్తూ ఈ లోకాన్ని వదలి వెళ్ళిపోతావు..
సంపాదించినది సుఖపడి సుఖపెట్టు అన్నాడు వేరొకడు అవును నీవు అన్నది అక్షరాలా నిజము ఏ క్షణంలో ఎం జరుగు తుందో ఎవ్వరూ చెప్పఁలేరు 
అంటూ మాటల్లోమునిగి పోయారు వారు 
ఎమన్నా జరిగినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కొరకు చేసేవే జరుగుతాయి 
అవును ఎన్నో సంవత్సరాల నుండి సాగని రామాలయం నిర్మాణం జరుగు తుందట  అన్నాడు ఒకడు 
జరుగుతుందట కాదు జరుగుతుంది అన్నాడు మరొకడు 
ఒక్కటేంటి ఇంకా ముఖమైన సంఘటనలు దేశంలో చోటుచేసుకున్నాయి  
ఏమిటవి 

ఒకప్పుడు నోట్లు రద్దు కి వ్యతిరేకించారు, ఇప్పుడు అందరూ ఫోన్ పే, గూగుల్ పే, పేటియం వాడుతున్నారు.

స్వచ్ఛ భారత్ ను వ్యతిరేకించారు, ఇప్పుడు అందరూ స్వచ్ఛత వైపు చూస్తున్నారు.

రామాలయం నిర్మాణానికి వ్యతిరేకించారు,  మత ఘర్షణలకు దారి తీస్తుంది అన్నారు
ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో నిర్మాణం జరుగుతుంది.

370 ఆర్టికల్ కు వ్యతిరేకించారు, ఇప్పుడు ప్రశాంతవంతమైన కాశ్మీర్ ను చూస్తున్నారు

ట్రిపుల్ తలాక్ ను వ్యతిరేకించారు,  ముస్లిం మహిళల ముఖంలో ఆనందం చూస్తున్నారు

 శత్రు దేశాల మీద దేశాల మీద దాడులను వ్యతిరేకించారు, ఇప్పుడు శత్రు దేశాలు మన దేశాన్ని చూసి భయపడుతూ ఉంటే చూస్తున్నారు
 అలాగే...... 
ఇంగ్లీసు మీడియం వద్దు తెలుగులో భోదన కావాలి అంటున్నారు, బలవంతం మీద ఇంగీసు బోధన ను వ్యతిరేకిస్తున్నారు, దాని ఫలితాలు చూస్తారు  
నూతన విద్యా విధానం ను, వ్యవసాయ బిల్లు ను వ్యతిరేకిస్తున్నారు 
దాని ఫలితాలు చూస్తారు 
చూసి ఆనందిస్తారు.  తార్వాతే తెలుసుకుంటారు 
ఎవరికైనా దిగితేకాని లోతు తెలియదు, ఏదైనా వస్తువును కొంటె కానీ ధర తెలియదుఅన్నాడు ఒకడు 
అవును బాబు పెద్ద మార్పులు మేము అశించము, మాకు ఉండేందుకు ఇల్లు, కట్టుకునేందుకు గుడ్డ, తినేందుకు తిండి ఉంటె చాలు. 
మరి నాయకుఅల్ను ఎన్నుకునేందుకు ఓటు వద్దా అన్నాడు మాధవ్ 
కావాలిబాబు ఓటు కార్డు, ఆరోగ్యకార్డు, వ్యవసాయ కార్డు,ఆధార్ కార్డు, 
అందుకే నేను అంటాను భరత దేశ ప్రగతికి,  మనవంతు సహాయము చేద్దాం, దేశ సేవకు సహకరించుకొందాం 
అంతేనా అన్నాడు మాధవ్ 
మేమందరం ఐకమత్యంగా ఒకే కుటుంబంగా ఉంటాం అన్నారు 
మీరు ఎదో కొనుక్కుందామని వచ్చారు మరిచినట్లు ఉన్నారు 
అవును మీ మాటల్లో మరిచాము 
కొనుక్కొని చీకటి పడేలోపు ఇంటికి చేరాలి అన్నాడు ఒకడు 
మాధవ్ నవ్వు కుంటూ బయలు దేరాడు అక్కడ నుండి .......       
అలా సాగింది మదఃవ్ నిరుద్యోగి ప్రయాణం .....

--(())--

నిరుద్యోగ ప్రయాణం 27 వ రోజు (రోజు వారికధ) (03-10-2020)

ప్రాంజలి ప్రభ  .. అంతర్జాల పత్రిక

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


                 మాదవ్ అప్పుడు బస్సు ఎక్కాడు ఇక్కడా సీటు లేకపోతే నుంచొని ఉన్నాడు, అంతలో ఇధ్దరు వృద్ధులెక్కారు వారికీ సీటు లేదు 
మాధవ్ వృద్ధులు కూర్చొనే సీటులో కుర్రోళ్ళు కూర్చొని ఉన్నారు వారిని లెమ్మన్నాడు కానీ వాళ్ళు లేవ లేదు కండక్టర్ పిలిచి అడిగాడు వాళ్ళు లేవకపోతే బస్సు ఆపేస్తానన్నాడు అయినా కదల్లేదు, డ్రైవర్ వద్దకు పోయి బస్సు ఆపించారు. 
కూర్చున్న వ్యక్తులు క్రిందకు దిగి పరుషవాక్యాలు వల్లించారు. 
వృద్ధుల్ని కూర్చోపెట్టాడు 
ఎక్కడకి వెళుతున్నారు అనిఅడిగాడు 
నా బాల్య స్నేహితుడు జడ్జి చేసి రిటైరయ్యాడు కలుద్దామని పోతున్నాము.
మీరు పేద వాళ్ళుగా ఉన్నారు మీకు తోడు రమ్మంటారా అని అడిగాడు మాధవ్ 
సరే బాబు మాతోటి రా అన్నాడు 
అప్పటికే ఫంక్షన్ అయిపోయినట్లు ఉన్నది,అన్ని సర్దు తున్నారు 
ఆయినప్పడికి  స్నేహితుని  కలుసుకొనేటప్పటి కి  ఎక్కడ లేని హుషారు వచ్చింది. 
సంతో షానికి హద్దుల్లేవు
మాటల్లో వృద్ధాప్యంలో మేము చేయవలసిన జాగర్త లేమన్న ఉంటె చెప్పురా అన్నాడు. 
ముందు విందు చేయండి. తర్వాత మాటలు అన్నాడు 
ఈ అబ్బాయి మీ అల్లుడా కాదు 
బస్సులో నాకు తోడుగా వచ్చాడు, అవును నీకు ఆంధ్రకు కొడుకులు కదూ అన్నాడు 
సరే  అన్నాడు స్నేహితుడు.                  

నేను నీకు చెప్పేవి కొంచం కష్టమవ్వచ్చు అయినా నా అనుభవాలను తెలుపుతాను అన్నాడు 

           ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ కొడుకు కోడలుతో కలిసి ఉండకండి. అవసరమైతే వారిని అద్దె ఇంట్లో ఉండమనండి, మీ పిల్లలతో మీరు ఎంత దూరంగా ఉంటే మీ వియ్యంకులతో, మీ కోడలితో మీ బంధుత్వాలు అంత బాగా ఉంటాయి. .
           
           మీ కుమారుడి భార్యను కేవలం అతని భార్యగా మాత్రమే చూడండి లేదా ఒక ఫ్రెండ్ గా చూడండి అంతే తప్ప ఆమెను మీ కుమార్తెగా చూడొద్దు . మీ అబ్బాయిని అన్నట్టుగానే ఆమెను కూడా పొరపాటున ఒక మాట కూడా అనవద్దు అది ఆమె జీవితాంతం గుర్తు పెట్టుకుంటుంది .ఆమెను తిట్టే హక్కు కేవలం ఆమె తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది .

          మీ కోడలి అలవాట్లు లేక ప్రవర్తన అది మీ అబ్బాయి సమస్య మీకు అసలు సంబంధం లేదు , అనవసరం కూడా.

          .ఒకవేళ మీరు కలిసి ఉంటున్నా కూడా ఎవరి పనులు వారు చేసుకోండి .వారికి సంబంధించిన ఏ పని మీరు చేయొద్దు .ఒకవేళ మీ కోడలు మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటే కనుక తిరిగి ఏమీ ఆశించకుండా మాత్రమే ఆ పని మీరు చేయండి .మీ కుమారుడి కుటుంబ సమస్యలు మీ మీద వేసుకోకండి .

          .మీ కొడుకు కోడలు వాగ్యుద్ధాలు చేసుకుంటున్నప్పుడు మీరు చెవిటి వారిలా ఉండిపోండి సాధారణంగా పెద్దలు కల్పించుకోవటం వారికి ఇష్టం ఉండదు.

          .మీ మనుమలు పూర్తిగా మీ కొడుకు కోడలు యొక్క ఆస్తి వారు వారి పిల్లల్ని ఎలా పెంచుకుంటారో అది వారి ఇష్టం .

          .మీ కోడలు మిమ్మల్ని గౌరవించవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు అలా ఆశించకండి . ఒక మంచి వ్యక్తిగా మసులుకోమని మాత్రమే మీరు మీ కుమారుడికి చెప్పండి .

          .మీ రిటైర్మెంట్ కోసం మీరు ఎక్కువగా ప్రణాళికలు రచించుకోండి. మీ మిగతా జీవితం సంతోషంగా ఉండేలా చూసుకోవాలి .  మీ డబ్బు మీదగ్గరే ఉంచు కోండి పిల్లల కోసం ఇలాల్ని పొలమని కొనకండి 

         . రిటైర్ అయిన తర్వాత మీ రోజులు ఎంత హాయిగా గడుపుకుంటారో అది మీ ఇష్టం .ఇంతకాలం మీరు దాచుకున్న సొమ్మును హాయిగా ఖర్చు పెట్టుకోండి మీ డబ్బులు మీకు పనికిరాకుండా పోయేలా చూసుకోరాదు.

           మనుమల మీద మీకు ఎటువంటి హక్కు లేదు అది మీ సంతానానికి దేవుడిచ్చిన వరం .వారిమీద అతిగా ప్రేమను పెంచుకోకండి. 

           ఓపిక ఉన్నదని కూతురింటికిపోదామా, కొడుకింటికి పోదామా అని వృద్ధా స్రావం చేయకండి
నా సలహా ప్రకారం ఎవరి వద్ద ఉండ నవసరము లేదు. కొడుకులకు కూతుర్లకు మీరు సహాయవలసిన కార్యములు అవసరములు ఉంటె నిర్వహించండి. 

          సాధయమైనత వరకు వృద్ధాప్యంలో మనస్సు శాంతిగా ఉండాలి అనురాగ భందాల  వెంట పడకండి  ఓపిక ఉన్నతనంతవరకు దైవపూజ చేస్తూ, ఆరోగ్యసూత్రాలు పాటిస్తూ జీవితం జరిగిపోతే చాలనిపిస్తుంది నాకు అన్నాడు రిటైర్డ్ జాడి గారు. 

          నీవు చాలా అనుభవజ్ఞుడిలా చెపుతున్నావు.

          నేను ఎన్నో కేసులు చూసాను, అందువల్ల నేను చెప్పగలిగాను 

          ఈ మాటలు అన్నీ నీకు వర్తిస్తాయని చెప్పను నీ అదృష్టము బట్టి నీ బిడ్డల ప్రేమ బట్టి 
మారవచ్చు అన్నాడు.
 
మాధవ్ తో బయలు దేరారు వృద్ధ దంపతులు

నేను అడుగుతున్నానని ఈమెను కోకండి 
మీకు ఎంత మంది పిల్లలు  
 ముగ్గురు కొడుకులు 
మీరు ఎవరి వద్ద ఉంటున్నారు 
నా ఇంటిలోనే 
పిల్లలకు పెళ్లి కాలేదా 
అందిరికీ పెళ్లిళ్లయినాయి 
ఎవరి దగ్గర నైనా ఉండొచ్చుగా 
అదే ఎలా పోవాలని ఆలోచిస్తున్నాము 
ఎలా పోయేదేంటి 
నాకొడుకులు  కోడళ్లు పిల్లలు బస్సులో వస్తుంటే బస్సు తగలబడి స్వర్గంలో ఉన్నారు 
అక్కడికే మేము పోవాలి అన్నారు వారు 
కంట నీరు పెట్టు కున్నాడు మాధవ్ .....  
వాల్ళను ఎలా ఓదార్చాలో తెలియక బాయలు దేరాడు మాధవ్ 

--(())--

నిరుద్యోగ ప్రయాణం 28 వ రోజు (రోజు వారికధ) (04-10-2020)

ప్రాంజలి ప్రభ  .. అంతర్జాల పత్రిక

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


మాధవ్ ప్రయాణ మయ్యాడు దారిలో చెరువు వద్ద ఒక బర్రెను కొనుక్కొనే వారు వచ్చారు వారికీ బ్రోకర్ కొమ్ములు చేపించి భారం చెపుతున్నాడు. 
కొనేవాళళ్తో మీరు ఇష్టమైతే తీసుకోండి లేకపోతె వెళ్లి పోండి అన్నారు. వేడెవడోడబ్బు మదమెక్కి కొట్టుకుంటున్నాడు అని వెళ్లి పొయ్యారు అప్పుడు మాధవ్ బరమాడి డబ్బులు నీళ్ళల్లో వేసాడు వెంటనే బర్రెను తోలుకొని బయలు దేరాడు. చివరకు నీళ్లల్లో పడ్డ డబ్బు తీసుకోలేక బాధపడ్డాడు. 
ఆశకుపోతే దురాశే ఎదురైనది. మాధవ్ బర్రెను కొన్నారేటుకన్నా తక్కువకమ్మి మరలా బయలుదేరాడు. ఆగ్రామంలో ఒక మల్లయోధుడు నాకంటే గొపప్వారులేరని విర్రవీగాడు. అతన్ని ఒక్కఁడేబాబుతో మాధవ్ లొంగదీసాడు. 
నీవు నాకన్నా బలవంతుడవు కానీ నీకున్న బలహీనత అహం. ఆహం మీద దెబ్బకొట్టి గెలిచానను            
నీకు ఒక కదా చెబుతాను విను అన్నాడు మాధవ్ 

అహం ఉన్న వ్యక్తికి ఎన్ని తెలివితేటలు ఉన్నా పరాభవం తప్పదు  

ఒక మహానగరం లో ఒక గొప్ప శిల్పి వుండేవాడు. ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే, పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పునూ పట్టలేక పోయేవారు. ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గది లోకి వెళితే, అవన్నీ ప్రాణమున్న వాటివిగా, మన పక్కన వున్నట్టు, మనకు చేయి అందిస్తున్నట్టు, మనతో మాట్లాడుతున్నట్టు ... సజీవంగా వుండేవి.. ఎటూవంటివారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే! ఆ అసాధారణ ప్రతిభ, నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని [ Ego ] నింపాయి.

ఇదిలావుండగా, ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని, జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి  'మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా!" అని చెప్పాడు.

శిల్పికి చెమటలు పట్టాయి, ఆయన ఇలా అనుకొన్నాడు, నేను బ్రహ్మ లాంటివాడిని కదా! ఆయన [ బ్రహ్మ ] మనుషులను సృష్టిస్తే, ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా.... అనిపించే శిల్పాలు సృష్టిస్తాను... కాబట్టి, నేను అపర బ్రహ్మ అవుతాను. మృత్యువు వచ్చిన రోజున నాలాగే వున్న మరో ఏడు శిల్పాలను చెక్కి వుంచుతాను. అపుడు మృత్యు దేవత ప్రాణమున్న శిల్పి ఎవరో, బొమ్మ ఏదో కనుక్కోలేక  వెళ్ళిపోతుంది. నేను మృత్యువుకు దొరకను అని ఉపాయం పన్నాడు. 

అచ్చు తనలాగా వున్న శిల్పాలు ఏడు చెక్కి, మృత్యు దేవత వచ్చే రోజున ఒక దాని వెనుక దాక్కొన్నాడు. 

మృత్యుదేవత ఆ గది లోకి వచ్చింది. శిల్పి శ్వాసను పూర్తిగా నియంత్రించి కదలకుండా నిలుచున్నాడు. దేవత వెతుకుతూ వస్తోంది. ఊపిరి బిగపట్టి చూస్తున్నాడు శిల్పి. ఇక కనుక్కోలేదులే అని అనుకొన్నాడు.  శిల్పి ప్రతిభకు మృత్యు దేవత ఆశ్చర్య పోయింది.  ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో... శిల్పమేదో... కనుక్కోలేక పోయింది. 

ఇక తనవల్ల కాదని వచ్చిన దారినే వెళ్ళి పోవాలనుకొని  వెనుతిరిగింది. శిల్పి ఆనందనాకి అవధులు లేవు. తన తెలివితేటలను తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడుకుంటున్నాడు. ఇంతలో దేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి "ఈ శిల్పి" ఎవరోకానీ, ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు ! కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేసాడు! అంది. 

 అంతే ! మన అపరబ్రహ్మకు అహం దెబ్బతింది. తన వృత్తి జీవితంలో ఇప్పటివరకు హేమాహేమీలు  ఒక్కరుకూడా వంక పెట్టలేదు. అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటుందా! ఈ దేవత... అనుకున్నాడు. వెంటనే తాను దాక్కొన్నాడు అన్న సంగతి కూడా మరచి కోపంతో  '' ఏది ? ఎక్కడుంది తప్పు చూపించు? అంతా చక్కగావుంది. ఏ తప్పూ లేదు!" అనేసాడు.

అపుడు మృత్యుదేవత నవ్వుతూ.... నాకు తెలుసు అందులో ఏ తప్పూ లేదని. కానీ నిన్ను గుర్తించడానికి  చెప్పానంతే. నేనేమీ నిన్ను పట్టుకోలేదు, నీకు నువ్వే పట్టుబడ్డావు!  "ప్రాణాధార మైన నీ శ్వాసను కూడా నియంత్రించ గలిగావు కానీ, నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించ లేకపోయావు, చివరకు అదే నిన్ను పట్టించింది" అని ఆయన్ను తీసుకెళ్ళి పోయింది.

మనం పెంచుకొనే అహంభావం [ Ego ] అంత ప్రమాదకరమైనది. అది సత్యాన్ని చూడనివ్వదు, వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు, మనం అనుకొన్నదే సరైంది, ఇతరులదే తప్పు అని మనం అనుకొనేలాగా చేస్తుంది. నెమ్మదిగా అది స్వార్థానికి దారి తీసి ''నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు'' అనుకొంటాము. స్వార్థం ప్రకృతి విరుద్ధం, దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహన్ని అడ్డుకొనే దెయ్యం స్వార్థం. 

మీరు గమనించారా ? 
'' అహంభావం '' అనే పదం లోంచి ' అహం ' తీసేస్తే మిగిలేది ' భావం ' అంటే  ' అర్థం ' అర్థమైతే అనర్థం జరగదు అంటూ అందరికీ మాధవ్ చెప్పి బాయలు దేరాడు ముందుకీ 
...(()))..


నిరుద్యోగ ప్రయాణం 29 వ రోజు (రోజు వారికధ) (05-10-2020)

ప్రాంజలి ప్రభ  .. అంతర్జాల పత్రిక

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 



మాధవ్ నెమమ్దిగా నడుస్తున్నాడు, దారిలో ఒక ముసలాయన పడ్డాడు 
బాగున్నారా అని అడిగాడు 
బాగున్నాను బాబు 
మీబాల్య విషయాలు తెలపగలరా 
చెపుతాబాబు ఇలా కూర్చో  నాలాంటి వారి ఎందరో అనుభవాలు మరలా గుర్తుచేసుకుంటారు 

 55  to ౭౦  .... years    నిండిన   మేము మా అనుభవాలు  ఇలా కూర్చో  .
         
స్వచ్చమైన     గాలి  నీళ్ళు,.      పచ్చటి  పొలాలు.  పరిశుభ్రమైన.    వాతావరణం  లో  పుట్టి.    పెరిగిన   వాళ్ళం... తలపై   నుండి,  చెంపల   మీదకు     కారిపోయేలా    నూనె రాసుకుని...
చేతికి     పుస్తకాల.   సంచి తగిలించుకుని...,
ఒక్కడిగా.    బయలుదేరి    దారిలో స్నేహితులను ఒక్కొక్కళ్లను.      కలుస్తూ పెద్దగుంపుగా.  కిలోమీటర్ల    దూరంలో     ఉన్న  బడికి     కాళ్లకు    చెప్పులు    లేకుండా    నడచి   వెళ్ళిన     తరం వాళ్ళం, జారిపోయే    నిక్కరు    మీదకు   మొలతాడు.   లాక్కుంటు ..., చిరుగు.    బొక్కలకు    గుడ్డ ముక్కలు    అతుకులేయించుకున్న వాళ్ళం  

10 వ తరగతి    అయ్యే  వరకు    నిక్కరు.   వేసుకున్న.  ,  తరం మాదే.
గోలీలు,     బొంగరాలు, కర్రా బిళ్ళ, నేలా బండ,. ఏడు పెంకులాట.....
 బంతి పుచ్చుకుని.   నేరుగా కొట్టేసుకుంటే    బంతి    లాగ  వంటి మీద    ముద్ర   పడే      ముద్రబాల్.   లాంటి    ఆటలాడిన తరం...,

బడికి    వేసవి కాలం.   , సెలవులు రాగానే   తాటి చెట్లూ,. ..  సీమ తుమ్మ చెట్లూ    ఈతచెట్లు    ఎక్కి కాయలు.   కోసుకొని    తిన్న వాళ్ళం,   చెరువులు,     కాలవల్లో స్నానాలు     చేసిన   వాళ్ళం.   , తాటి   బుర్రలు     బండితో ఆడినోళ్లం...
దీపావళి  కి.    తాటి    బొగ్గుల రవ్వల   దివిటీ    కోసం   వళ్ళంతా మసి   పూసుకొని     మరీ     తయారు చేసుకనే    వాళ్ళం.
5  ఐదు పైసల    ఐస్   తిన్నది   మేమె. ,,  .  పది    పైసలతో   బళ్ళో.  మ్యాజిక్   షో.   చూసింది    మేమే.... 
వర్షం   వస్తె   తాటాకు.  గొడుగూ,    యూరియా   సంచులు, కప్పుకుని   బడికి  వెళ్ళిన    వాళ్ళం..
 books     కోసం     పరీక్షలు అయినప్పటి    నుండి   ముందు తరగతి   వాళ్ళని    బతిమాలిన తరం.
సెకెండ్   హ్యాండ్    సైకిల్  తొ  పక్క.   తొక్కుడుతో      సైకిల్ నేర్చుకున్నోల్లo     మేమే...
ఉత్తరాలు.., రాసుకున్న..   ,అందుకున్న తరంవాళ్ళం... 
పండగ    సెలవులు, వేసవి   సెలవులు. , ,దసరా,  సంక్రాంతి   సెలవులు ఎన్ని సెలవులు.   వొచ్చినా   ఐదు పైసలు   ఖర్చులేకుండా    ఆనందాన్ని.   అనుభవించిన    తరంవోళ్ళం...,

  పెద్దలు.  /పిల్లలూ అందరం    వీధి    అరుగుల మీద కూర్చుని   ఎన్నో     సాయంత్రాలు/రాత్రులు   ఆనందంగా    కబుర్లు చెప్పుకుని.   పొట్ట    చెక్కలయ్యేలా నవ్వుకున్నదీ మేమే.... 

 ఊర్లో,.  ఎవరి   ఇంట్లో    ఏ వేడుక  జరిగినా,.   మన   ఇంట్లో  జరిగినట్లు,.    అంతా మాదే. ,
అంతామేమే.  అన్నట్లుగా    భావించి    స్వచ్చందంగా. / నిస్వార్థంగా    పాలుపంచుకున్న    తరం   మాదే...

ఉర్లో   ఒక    ఇంట్లో   దొంగలు  పడ్డారని ,.  పిల్లలు.    అందరం  కలిసి    ఊరు  చుట్టూ    తెల్లవార్లూ   ఎన్నో రాత్రులు టార్చిలైట్స్,    కర్రలు  పట్టుకుని  కాపలా కాసిన    వాళ్ళం  మేమే.
ప్రతీ పండగను ,పండగల్లోని సంతోషాలను ,సంబరాలను ఆస్వాదించిందిన తరం మాదే, మేమే...
చుట్టాలు    వస్తేనే అమ్మ     కోడిగుడ్డు, బంగాళాదుంప కూర.   , వండి పెట్టిన  తరం....
అత్తయ్యా, మామయ్య,.  ,పిన్ని,,    బాబాయ్,   అక్కా   ,బావ       అంటూ ఆప్యాయంగా    పిలుచుకున్న  తరం మాదే.స్కూలు    మాష్టారు    కనపడితే భయంతో    పక్కనున్న     సందుల్లోకి    పారిపోయిన   తరం... ,పుల్లల    పొయ్యి    మీద   అన్నం/కూర     ఉడుకుతున్నప్పడు   వచ్చే అద్బుతమైన    పరిమళాన్ని ఆస్వాదించిన   తరం.   వాళ్ళం..,
పొయ్య     మీదనుంచి.   నేరుగా    పళ్ళెం   లోకి    వచ్చిన   వేడి  వేడి అన్నంలో   ఆవకాయ,    వెన్నపూస వేసుకుని    పొయ్యి   దగ్గరే  తాతయ్యలు.    అమ్మమ్మ/నాయనమ్మ, ,   అమ్మా    నాన్నా, పెదనాన్న. ,, ,పెద్దమ్మ,, . పిన్ని బాబాయ్,.    అత్తయ్య    మామయ్య,   అక్కలు    చెల్లెళ్లు    అన్నయ్యలు   తమ్ముళ్లు   అందరం    ఒకే.   దగ్గర   చేరి    మధురమై.      అనుభూతితో  కూర్చుని   అన్నం.  తిన్న    తరం ..,.

అమ్మమ్మలు. / నాయమ్మల   చేత గోరుముద్దలు   తిన్నది,.   అనగనగా ఒక రాజు....      కథలు   విన్నది  ,

నూనె పిండితో    నలుగు పెట్టించుకుని     కుంకుడు  కాయ పులుసుతో      తలంటు   స్నానం చేయించు కున్న      తరం... మాదే

రేడియో,దూరదర్శన్ టూరింగ్ టాకీస్,.   కాలం చూచిన వాళ్ళం... .
 25 పైసల.   నేల   టిక్కెట్  తో నేల   మీద   కూర్చుని,75 పైసల బెంచి,1.25 పైసలు   chair   టిక్కెట్ తో  , కూర్చుని    సినిమా  చూచిందీ    మేమే...
 స్కూల్   , కాలేజీ   రోజుల్లోనే ఎలక్షన్లు   చూచిన    వాళ్ళం.. .🍂
అమ్మా   నాన్నా    తో     సంవత్సరానికి   ఒక సారి,   పరీక్ష పాస్     అయ్యావా.. ..    అని మాత్రమే    అడిగించు కున్న   తరం వాళ్ళం...
చూడు బాబు మాతరానికి నేటి తరానికి చాలా వ్యత్యాసం ఉన్నది. 
నాన్న గారిని డబ్బులు అడగాలంటె చాలా భయ పడేవాళ్ళం, 1౦ మంది పిల్లలని ఒక్కడు పోషించేవాడు నేడు ఒక్కడ్ని క్కని వాడిపోషణకి ఇద్దరూ కష్టపడే లోకం     
ఈనాడు అవకాశాలు ఎక్కువఉన్నాయి, సంపాదన ఎక్కువుంది, ఆనాడు కళలు విలువ బట్టి గౌరవము ఉండేది. ఈనాడు కళకూడా వ్యాపారవస్తువుగా మారింది. 
ఆనాడు డాక్టర్లను దేవునిగా కొలిచేవారు ... ఈనాడు నేను చెప్పనవసరము లేదు అంతా కలియుగ మాయ .బాబు 
నమస్తే తాతగారు మీరు చాలా అంచివిషయాలు తెలియయపరిచారు ధన్యవాదములు అని చెప్పి కదిలాడు మాధవ్ ....

--(())--
నిరుద్యోగ ప్రయాణం 30 వ రోజు (రోజు వారికధ) (06-10-2020)

ప్రాంజలి ప్రభ  .. అంతర్జాల పత్రిక

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


మాధవ్ ఒక స్కూలు వద్దకు  చేరాడు అప్ఫు డే పాత విద్యార్థులు ఒకచోట చేరుతున్నారు. 
మీరు కూడా లోపలకు రండి మాధవ్ గారు అన్న పిలుపుకు అటు చూసాడు. 
పక్కింటి చిన్న నాటి రాధ పిలుపు
ఏమిటి మీరు ఇక్కడ టీచ రా
తప్పదు కదా మాధవ్ ప్రేమను పంచుతూ ఇలా సాగిపోతుంది 
పెల్లి చేసుకోలేదా
మాధవ్ ఇంకా కరుణించి లేదుకదా
నాకు ఉద్యోగం రాలేదు మన ప్రేమ పండే దాక ఉండ గలుగు తావానాజీవితం నీకోసమే సరే నీ అనుభవాలు జ్ఞాపకాలు చెప్పి అందరికీ తెలియ పరుచు.

      నా జీవితంలో నేను చాలా కోల్పోయాను నాకు ఇష్టమైనవన్నీ కోల్పోయాను ఇష్టమైన వారికి కూడా  నేను ఇప్పుడు  *భారమై పోయాను * అని ఏ నిముషము మనసులోకి రానీయకుండా శరీర వాంఛ్ఛలకు  చిక్కు కుండా ఉండాలి.సమయాన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా చదువుకోవాలి ప్రతిఒక్కరు. 

      జీవితం లో సంతోషంగా ఉండాలంటే కారులు , బంగ్లాలు ఉండవలసిన అవసరం లేదు మన బాధను పంచుకుని మనమే తన ఆస్తిగా భావించే నిజాయితీ గల బంధముంటే చాలు . అదియే నమ్మకముగా మనస్సుకు తృప్తి నిచ్చేది గా ఉండి ఒకరికొకరు ఏక మయ్యె వారుగా ఉండాలి అన్నాడు మాధవ్.

సీస పద్యము ... వెల్గుచుండఁ 
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

పరుగులు ఉండవు ... పలకరింపు వెలుగుకు 
బతుకులు నిత్యమూ .. వెల్గుచుండు 
ఉరకలు ఉండవు ... ఉయ్యాల ఊపులు 
ఉజ్వల వెల్గులు .... మారుచుండు 
కరుణతొ ఉన్నను ... కారుణ్య తలపులు 
కమనీయ వెల్గులు ... వచ్చు చుండు 
సహనము చూపుతూ ... సాహస మునుచూపు 
సౌందర్య వెల్గులు ... సేవ చేయు 
 
తేటగీత 
సమరమును చేయుటయు తేలికగను ఉండు 
సహనమును చూపు టయు నిత్య కృత్య మవ్వు
నిముషమును కూడ నష్టము చేయ కుండు 
సమము తెలుపుట సౌందర్య భావమేను 
   
--(())--
     జీవితంలో ఎవ్వరినైనా క్షమించండి కానీ  మీ సహాయం తీసుకుని మళ్ళీ మిమ్మల్నే వెన్నుపోటు పొడిచే వాళ్ళను మాత్రం ఎప్పటికీ క్షమించకండి . లోకాన్ని కాలాన్ని అనుకరించి జీవితాన్ని సాగించాలి.

     మనలో మనకు పలకరింపులు లేకపోతే అనుబంధాలు ఉండవు ఒకరిని ఒకరు గౌరవించుకోకపోతే ప్రేమలుండవు నమ్మకం అనేది లేకపోతే ఒకరితో ఒకరు ఉండలేరు .

వ్యక్తిత్వ వికాసం పేరుతో మనుషుల్ని స్వార్థపరులుగా మార్చే పుస్తకాల పఠనం హానికరం. తననీ, తన చుట్టూ వున్న సమాజాన్ని సరయిన రీతిన అర్థం చేసుకోడానికి ఉపకరించేది నిజమైన వ్యక్తిత్వం. సాటి మనుషులకు వీలయినంత మంచిని చేయాలన్న తపనకు లోను చేసే రచనల సముదాయమే ఉత్తమ సాహిత్యం.నిత్యమూ చదువుతూ ఉండాలి 

 వివేచనకి తావునిచ్చే పుస్తకాలు చదవితే మానవీయ సంస్కారం పెంపొందుతుంది. అన్యాయాన్ని నిరసించడం, న్యాయం పక్షాన నిలబడటం అసంకల్పితంగానే అలవడుతుంది. వివక్షాపూరితమైన, సంకుచితమైన ఆలోచనల్ని, చర్యల్ని ప్రతిఘటించే చైతన్యం పదునెక్కుతుంది. ఈరకమైన జ్ఞానాన్నీ, బుద్ధినీ ప్రసాదించే పుస్తకాల పఠనం ఒక కళ. ఈ కళ ఎంతగా పరివ్యాప్తమయితే సమాజం అంతగా సరికొత్త ఆలోచనలతో, ఆచరణతో విరాజిల్లుతుంది.

     మనమంటే విలువలేనివాళ్ళ దగ్గరికి వెళ్లి పదే పదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదిలించు కోవడమే మంచిది. స్వతంత్రముగా బతుకును వెళ్లబుచ్చి నలుగురికి సహాయపడుతూ సమయాన్ని సద్వినియోగం చేయాలి .
మాధవ్ ఉపన్యాసం ముగించాడు . వచ్చినవారందరు చప్పట్లు కొట్టారు సంతోషము పట్టలేక. 
రాధ పలకరింపుతో మనసుకదలి మరలా మనము ఏకమయ్యే సమయము ఇప్పుడు కాదు కనుక అనుమతి ఇస్తే లోకంలో ఉద్యోగం సంపాదించి తిరిగి వస్తాను అంటూ కదిలాడు మాధవ్ 

--(())--
నిరుద్యోగ ప్రయాణం 31 వ రోజు (రోజు వారికధ) (07-10-2020)

ప్రాంజలి ప్రభ  .. అంతర్జాల పత్రిక

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


మాధవ్ ను రాధ అడిగింది ఈరోజు మాఇంటికి వచ్చి ఆతిథ్యము తీసుకోవచ్చుగా ఏమి స్పెషల్ అని అడిగాడు మాధవ్ 
మా అమ్మ నాన్నల పుట్టినరోజు ఈరోజే 
ఇద్దరు ఒకేరోజు పుట్టారా అవును ఒకేరోజు పుట్టారు 2సం వత్సరాల తేడాతో
అవునా మరి నాకు తెలియదే 
అసలు నీవు ఈ లోకంలో ఉంటేగా 
నిజమే దేశాలవెంట తిరుగుతున్నానుకదా 
అదికాదు నా  భావన 
నా హృదయంలో ఇరుక్కు పోయావు 
ఎప్పుడు బయటకు వచ్చి ముద్దులిస్తావని చుస్తున్నా లేకపతే సరే  
ఏమిటి ఇంట డెకరేషన్ చేసావు 
అవును ఈ కాలనిలో ఉన్న పిల్లలందరిని పిలిచాను, కేకు కట్చేసి అందరికి పెట్టుదామని ఏర్పాట్లు 
వీటికి మీనాన్నగారు  ఒప్పుకున్నారా  
మానాన్న మా అమ్మ కోరిక మీర ఈ ఏర్పాట్లు 
మైకు కూడా పెట్టావ్ ఎందుకూ 
అవును పిల్లలు పాటలు పాడి, డాన్సు చేస్తారు 
నీ అద్భుతమైన మాటలు పిల్లలకు తెలపాలి అన్నది 
ఆమ్మో పేద్ద పనే పెట్టావే రాధ 
సరే తప్పదుగా రాధ 
అజ్నవేయడం, ఈమాధవ్  ఆచరించకపోవటం ఉంటె అసలు ఇక్కడినుండి నీవు కదలనిస్తావా అన్నాడు మాధవ్ 
అంతలేదు అంటూ నవ్వుకుంటూ లోపలకు వెళ్ళింది రాధ 
ముందు ఈ టిఫిన్ తిని పెట్టండి 
ఏమిటి టిఫెనేనా 
మరింకేం కావాలి 
ఏది కావాలంటే అది ఇస్తా 
ఆమ్మో అంటూ ముందు తల్లి తండ్రులను పలకరించాడు మాధవ్ 
బాగుణ్ణవా బాబు ముందు టిఫిన్ తిను తర్వాత అన్ని మాట్లాడుకుందాం అన్నారు రాధా తల్లితండ్రులు    
చెకచెకా టిఫిన్ తిని కాఫీతాగి ఇక చెప్పండి 
మేము చెప్పేది ఏముంది చూస్తూనేఉన్నావుగా 
నీవు వప్పుకుంటే ఆముచ్చట కూడా తీర్చి కాశి రమేశ్వరం వెల్దామనుకుంటునామ్
ఆ అమృతఘడియలు ఇంకా రాలేదు అన్నాడు మాధవ్  
ఈ రోజు మంచిరోజు కదా నీ ఉద్దేశ్యము చెప్పవచ్చు 
నాకు ఉద్యోగంవచ్చాక పెళ్లి మాట చెపుతానుగా  
సారె బాబు నీమాట కాదనలేము విప్పించి నీకు మా రాధనిచ్చి పెళ్లి చేయలేము ఆకాలం వచ్చేహడావు ఆగుతాములే 
సాయన్త్రం చుట్టుపక్కలవార్లు వాళ్ల  పిల్లలు వచ్చారు .
తల్లి తండ్రుల ద్వారా  కేక్ కట్ చే యించి అందరికి పెట్టింది 
మాధవ్ నీవు తల్లి తండ్రుల గురించి నాలుగు మాటలు తెల్పు అన్నది రాధ 
అసలు లోకానికి మాత ఆదిపరాశక్తి అంటూ మెదలుపెట్టాడు 
   పిల్లలు వినండి 

అమ్మ .. ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. తరువాత నీకు పాలిచ్చి పెంచుతుంది అనగా నీకు ఊపిరి పోస్తుంది , మేధాశక్తి పెంచుతుంది అలాగే ఆకలి తెలీయకుండా అమ్మ చూస్తుంది, పడిపోకుండా పట్టుకోవాలని అమ్మ చూస్తుంది.తన అనుభవాలను విద్యలా బోధిస్తుంది అమ్మ.
 
నాన్న .. ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు. ఆ అపరిచయమమనేది లోకం, లోకంలో ఉన్న వింతలూ విడ్డురాలు, ఒకటేమిటి అన్ని తెలియపరుస్తాడు నాన్న, చెయ్ పట్టుకొని నడక నేర్పిస్తాడు నాన్న, ఆకలి విలువ తెలిసెలా నాన్న చేస్తాడు పడినా పైకి లేపాలని నాన్న చెప్తాడు. నీ అనుభవమే విద్య అని తెలిసెలా చేస్తాడు నాన్న     

అమ్మ ప్రేమను నీ పసిప్రాయం నుండే తెలుసుకొగలవు.       But... కానీ ....
నాన్న ప్రేమను నువ్వు నాన్నవుఅయ్యాకే తెలుసుకోగలవు...

నీకో జరిగిన కదా చెపుతా విను బాబు అంటూ చిన్న కధ చెప్పటం మెడలు పెట్టాడు మాధవ్ 

ఎన్ని చెప్పినా వినేవాడు కాడు, ఒక పిల్లవాడు అయినా గారాబంగా పెంచారు, అడిగినవన్నీ కొన్నారు, వద్దన్నవి తినటం వల్ల ఆరోగ్యం పాడైపోయిది డాక్టర్లు గుండె ఆపరేషన్ చేస్తేనే బతుకుతాడు అన్నారు డాక్టర్ 
     
కొడుకు :ఈ రోజు నా గుండె operation నాన్న  అమ్మ నాన్న చెప్పిన మాటలు వినలేదని భాధ పడ్డాడు. 
అప్పుడేమయినది 
నాన్న తో మాట్లాడాడు  
నాన్న :తెలుసురా ఎందుకు బయపడుతున్నావ్ నేను ఉన్నానుకదా నీకు 
కొడుకు :i love u నాన్న 
నాన్న :i love u too ra చెపుతూ  ఏడ్చాడు 
Operastion తరువాత ఎప్పుడైతే ఆ అబ్బాయ్ కి మెలుకువ వచ్చిందో కళ్ళ ముందు ఒక్క ఫ్రెండ్ ఉన్నాడు 
కొడుకు :మా నాన్న ఎక్కడా 
ఫ్రెండ్ :నీకు తెలియదా నీకు గుండె ఏవరిచ్చారో  మీ నాన్నేనురా !
కొడుకు :గుండె పగిలేల ఏడవడం మొదలుపెట్టాడు 
అప్పుడు గుండె నుండి ఒక్క శబ్దం వచ్చింది  ఏడవకురా నీ గుండె చప్పుడులో నేను ఎప్పుడు నీతో బ్రతికే ఉంటానురా 
కొడుకు :i miss you నాన్న 
మన కాళ్ల మీద మనం 
నిలబడ్డామని అమ్మ నాన్నని దూరం పెట్టకు. మనం ఇలా నిలబడడానికి అమ్మ నాన్న మన ముందుండి  నడిపించారు మర్చిపోకు మన  భారాన్ని  అంత నాన్న మోస్తూ మనల్ని నడిపించాడు మనం సంతోషగా బ్రతకడానికి తన ప్రాణాలను  దరబోసే వాడు నాన్న 

అందుకే నేను చెపుతున్నా 

జీవితం అమ్మది - జీవనం నాన్నది.
అమ్మ భద్రత - నాన్న బాధ్యత.
నడక అమ్మది - నడవడిక నాన్నది
అమ్మ అలోచన-నాన్న ఆచరణ

కళ్ళు మూసేవరకూ ప్రేమించేది "అమ్మ"
కళ్ళల్లో ప్రేమ కనబడకుండా ప్రేమించేది "నాన్న..."🚶

ప్రియురాలు, స్నేహితుడు, భార్య, పిల్లలు అందరూ తల్లి తండ్రుల తర్వాతే 
   
కళ్ళు మూసుకుని ప్రేమించేది ప్రియురాలు
కళ్ళు తెరుచుకుని ప్రేమించేది స్నేహితురాలు
కళ్ళు ఉరిమి ప్రేమించేది భార్య
కల్లా కపటం లేని ప్రేమ పిల్లలది 
భేదభావం లేని భోధన మాష్టారిది 

మాధవ్ మాటలకు అందరూ తన్మయులైనారు 
ఇలా సాగింది ఈరోజు మాధవుని ప్రయాణమం .
--(())-- 
    
నిరుద్యోగ ప్రయాణం 32 వ రోజు (రోజు వారికధ) (8-10-2020_)

ప్రాంజలి ప్రభ  .. అంతర్జాల పత్రిక

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


మాధవ్ పిల్లలను పిలిచి బుద్ధికుశలత గురించి ఒక చక్కని కధ చెప్పఁటం ప్రారంభించాడు 
అందరూ కూర్చొని వింటున్నారు.   
 
బుద్ధికుశలత

కులాన్ని చూడకు గుణాన్ని చూడు అని చాటి కధ.

భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ యూనివర్సిటీ ఏది...?

బెనారస్ హిందూ యూనివర్సిటీ!

దాన్ని ఎవరు స్థాపించారు?

మదన్ మోహన్ మాలవీయ
ఆయన దీనిని విరాళాలు సేకరించి కట్టించారు...! 

ఆయన్ని చాలా మంది "నువ్వు మదన్ మోహన్ మాలవీయవి కావు బాబూ. నువ్వు మనీ మేకింగ్ మెషీన్ వి" అని హాస్యమాడేవారు కూడా...! 

అంత ఓపిగ్గా, పట్టుదలగా ఆయన విరాళాలు సేకరించేవారు.

ఇదే క్రమంలో ఆయన నిజాం దగ్గరకి వెళ్లారు. నిజాం మహా పిసినారి. పైపెచ్చు మహా మత దురహంకారి...!

" నీకెంత ధైర్యం...హిందూ యూనివర్సిటీ కోసం నేను విరాళం ఇవ్వాలా" అంటూ తన చెప్పును విసిరేశాడు కోపంగా..

మాలవీయ మారు మాట్లాడలేదు...!
ఆ చెప్పును కళ్లకద్దుకుని "మహా ప్రసాదం" అంటూ బయటకి వచ్చేశాడు.

బాగా రద్దీగా ఉన్న కూడలిలో నిజాం చెప్పుని ఉంచి, దాన్ని అమ్మకానికి పెట్టాడు.
నిజాం ప్రభువు చెప్పును కొనేందుకు జనం ఎగబడ్డారు..!

పోటీ పెరిగింది. వేలం మొదలైంది.
ఈ సంగతి నిజాం చెవిన బడింది.

నవాబుగారి చెప్పు తక్కువకి వేలం పోతే పరువునష్టం. ఆ చెప్పు మాలవీయ చేతికి ఎలా వచ్చిందో తెలిస్తే సర్వభ్రష్టం...! 

ఆ చెప్పును ఏ బిచ్చగాడో వేసుకుంటే ప్రతిష్ఠ మూసీ పాలు!!!

అందుకే నిజాం ప్రభువు తన సేవకుల్ని పిలిచి "ఎంత ధరైనా ఫరవాలేదు. నా చెప్పును కొని తీసుకురండి" అని పురమాయించాడు...!

చివరికి భారీ ధరకు తన చెప్పును తానే కొనుక్కున్నాడు నిజాం నవాబు. నిజానికి నిజాం తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు...!

మాలవీయ గారు నిజాం
లాంటి వాడి నుంచి కూడా "తివిరి ఇసుమున తైలమ్ము తీయవచ్చు" అని నిరూపించారు...!

బహుశా మనస్సు వుంటే మార్గం ఉంటుంది అంటే ఇదే కాబోలు.

జీవితమూ నిజాం నవాబు లాంటిదే. అది ఒక చెప్పే విసిరేస్తుంది. మనమూ *మదన్ మోహన్ మాలవీయ లాగా ఆ అరకొర అవకాశాన్ని కూడా వాడుకుంటామా లేదా అన్నదే అసలు ప్రశ్న!!!

అన్నట్టు...మన దేశపు ధ్యేయవాక్యం "సత్యమేవ జయతే" ని ఆధునిక కాలంలో మొట్టమొదటగా ఉపయోగించిందీ మదన్ మోహన్ మాలవీయ గారే...!

అలాగే గాంధీ గారు ఒకనాడు రైలులో వెలుతుంటే కాళ్లదగ్గర చెప్పులు ఎవరో తన్ను కెళ్లారు ఒక చెప్పే ఉంది, రెండోచేప్పు ఏదా అని చూస్తే తలుపుదగ్గర పడిపోయేటట్లు ఉన్నది పట్టుకుందామని ప్రయత్నించగా అది జారి పోయిందివెంటనే రెండో చెప్పు కూడా విసిరేశాడు ప్రక్కన ఉన్న మనిషి ఎందుకు పారేశారు అని అడిగారు. అవి కొత్త చెప్పులు ఎవరికీ దొరికిన ఉపయోగం ఉంటుంది కదా అన్నాడు 
     
అలాగే గాంధీ గారు కొల్లాయి గుడ్డతో బ్రిటిష్ వారిని తరిమి కొట్టాడు అని చెప్పాడు మాధవ్ 
బాగుణ్నది కధ 
గాంధీ గారు ఎప్పుడూ అనేవారు చేదుఅణకు, చెడు వినకు, చెడు కనకు అనేవారు పిల్లలు మీరు కూడా మంచిగా కధలో ఉన్న నీతి అనుకరించి నడవడిక ఉండాలి ..
అట్లాగే అన్నారు ... ఇంకొ కధ చెప్పు 
రేపుచెప్పుకుందాం ఆడు కోండి అన్నాడు మాధవ్ ..
అట్లాగే 
అంటూ సంచి తగిలించుకొని బాయలు దేరాడు మాధవ్ 

--(())_-

నిరుద్యోగ ప్రయాణం 33 వ రోజు (రోజు వారికధ) (9-10-2020)

ప్రాంజలి ప్రభ  .. అంతర్జాల పత్రిక

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


మాధవ్ చెట్టు కింద ఆడుతున్న పిల్లలను పిలిచి కధ చెప్పాడు
మీరు చదవండి
విక్రమాదిత్య మహారాజు ఒక రాత్రి తన జాతకం వ్రాయబడిన కాగితాన్ని చదువుతుంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది.
నేను పుట్టిన రోజే ప్రపంచం లో అనేకమంది పుట్టి వుంటారు.
కానీ వాళ్ళంతా రాజులు కాలేదు.
నేనే ఎందుకయ్యాను ?
ఈ గొప్ప స్థానం నాకే ఎందుకు దక్కింది ? 
మరుసటి రోజు సభ లో పండితుల ముందు ఇదే ప్రశ్న పెడితే వాళ్ళు చెప్పిన జవాబు రాజుకు తృప్తి ఇవ్వలేదు. 
అపుడు ఒక వృద్ధ పండితుడు '' రాజా! ఈ నగరానికి తూర్పున  బయట వున్న అడవిలో ఒక సన్యాసి వున్నాడు. 
ఆయనను కలవండి. 
జవాబు దొరుకుతుంది'' అన్నాడు. 
రాజు వెళ్ళాడు. అపుడు ఆ సన్యాసి బొగ్గు తింటున్నాడు
అది చూసి రాజు ఆశ్చర్యపోయి
తన ప్రశ్న ఆయన ముందు పెడితే....
 ఆయన అన్నాడు : ''ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరం లో ఇలాంటిదే మరొక గుడిశె వుంది. అందులో ఒక సన్యాసి వున్నాడు , ఆయన్ను కలవండి.''
నిరాశపడినా, 
రాజు రెండవ సన్యాసి కోసం వెళ్ళాడు. 
రాజు ఆయన్ని చూసినపుడు , ఆ సన్యాసి మట్టి 
తింటున్నాడు
రాజు కాస్త ఇబ్బందిపడ్డాడు.
కానీ తన ప్రశ్ననైతే అడిగాడు.
కానీ ఆ సన్యాసి రాజు మీద కోపంతో గట్టిగా అరచి అక్కడినుండి వెళ్ళిపో అని కసురుకున్నాడు
 రాజుకూ కోపం వచ్చినా, సన్యాసి కాబట్టి ఆయన్ని ఏమీ అనలేదు. 
తిరిగి వెళ్ళి పోతుంటే సన్యాసి రాజుతో ఇలా అంటాడు : ''ఇదే దారిలో వెళితే ఒక గ్రామం వస్తుంది.
అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా వుంటాడు. వెంటనే అతన్ని కలవండి.'
రాజుకంతా గందరగోళంగా వుంది. అయినా అక్కడికెళతాడు. 
చనిపోవడానికి సిద్ధంగా వున్న ఆ అబ్బాయిని కలిసి తన ప్రశ్న అడిగాడు. 
అపుడు ఆ అబ్బాయి అన్నాడు
''గత జన్మ లో నలుగురు వ్యక్తులు ఒక రాత్రి అడవిలో దారి తప్పివుంటారు. 
ఆకలేస్తే వాళ్ళ దగ్గరున్న రొట్టెలు తిందామని చెట్టు క్రింద ఆగివుంటారు.
తినబోతుంటే అక్కడికి బాగా ఆకలేసి, నీరసంగా వున్న ఒక ముసలి వ్యక్తి వచ్చి తనకూ కొంచెం ఆహారం ఇవ్వమని అడిగితే ఆ నలుగురిలో మొదటీవాడు కోపంతో 
''నీకు ఇస్తే నేను బొగ్గు తినాలా?'' అని కసురుకొంటాడు.
రెండవ వ్యక్తిని అడిగితే..
''నీకు ఈ రొట్టె ఇస్తే నేను మట్టి తినాల్సిందే'' అని వెటకారంగా అంటాడు.
మూడవ వాడు 
''రొట్టె తినకపోతే ఈ రాత్రికే చస్తావా ?'' అని నీచంగా మాట్లాడాడు. 
కానీ నాల్గవ వ్యక్తి మాత్రం ''తాతా! నీవు చాలా నీరసంగా వున్నావు. ఈ రొట్టె తిను.'' అని తాను తినబోతున్న రొట్టెను ఇచ్చేసాడు.
ఆ నాల్గవ వ్యక్తివి నువ్వే రాజా'' అని అన్నాడు. 
రాజు దిగ్భ్రాంతికి లోనయ్యాడు. 
రాజా నీ పుణ్యం వల్ల రాజుగా జన్మించావు. అనవసరమయిన మీమాంసలతో కాలం వృథా చేయక ప్రజలను కన్న తండ్రి వలె పాలించు అని చెప్పి కనులు మూసినాడు.
*మంచిమాట*
దానం సంపద వంటిది. అందరికీ పంచండి. ప్రతిఫలంగా అది పుణ్యాన్ని అందిస్తుంది.
ఓ చెడ్డ మాట అప్పులాంటిది. ప్రతిగా వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తుంది.
పిల్లలూ కధ బాగున్నదా
ఇంకొకటి చెప్పండి
రేపు మల్లా రండి మరో కధ చెపుతా
అట్లాగే..ఇక ఆడుకుంటాం
సరే
సరే అన్నారు పిల్లలు
**//**

నిరుద్యోగ ప్రయాణం 34 వ రోజు (రోజు వారికధ) (10-10-2020)

ప్రాంజలి ప్రభ  .. అంతర్జాల పత్రిక

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


ఒక పెద్ద హాలు వద్ద  పండితులు ఒకే చోటకూర్చొని అష్టావధానం చేస్తున్నారు, అక్కడ ప్రేక్షకుల్లో కూర్చొని వింటున్నాడు మాధవ్   
అవధానంలో అప్రస్తుత ప్రసంగాలు*_ 👌
〰️〰️〰️〰️🌹💐〰️〰️〰️〰️
ప్రశ్నికుడు:-
1 . రైలు పట్టాలకూ,      కాలి పట్టాలకూ       అనుబంధం ఏమిటి?
అవధాని:-
రైలు పట్టాల మీద వుంటుంది, కాలి మీద పట్టాలుంటాయి.

ప్రాశ్నికుడు:-
2 . కనలేని స్త్రీమూర్తి ఎవరు?
అవధాని:-
న్యాయస్థానములో వున్న న్యాయదేవత. కళ్ళకు గంతలు కట్టి వుంటారు కదా!
ప్రా:-
3 . సోమవారాన్ని 'మండే'       అనెందుకంటారు?
అవ:- ఆదివారం హాయిగా భోంచేసి పడుకుంటాము కదా సోమవారం పొద్దున్నే పనికెళ్లాలంటే ఒళ్ళు మండుతుంది కదా! అందుకని 'మండే' అంటారు.
ప్రా:-
4 . ఒక పిల్లవాడు ఇంటినుండి పారిపోతే కనిపించుటలేదు అని ప్రకటిస్తారు కదా! దానికి పిల్లాడి స్పందన ఏమిటి?
అవ:- కని-పెంచుట లేదు .
ప్రా:-
5 . ఈ రోజుల్లో పిల్లలు      తల్లిని Head Cook గా      చూస్తున్నారు      మరి తండ్రిని
     ఎలాచూస్తున్నారు?
అవ:-ATM లాగా చూస్తున్నారు.
ప్రా:-
6 . సభలో ఎవరైనా       ఆవులిస్తే మీరేమి చేస్తారు?
అవ:-పాలిచ్చేవైతే అవధానం అయ్యాక యింటికి తోలుకెళ్తా .
ప్రా:-
7 . మనిషికి        ఆనందాన్నిచ్చే సిటీ ఏది?
అవ:-'పబ్లిసిటీ '
ప్రా:-
8 . తుద+ తుద = తుట్టతుద,       కడ  + కడ = కట్టకడ       అవుతుంది కదా! 
      అరటి + అరటి        ఏమవుతువుంది?
అవ:-
అర టీ + అర టీ ఫుల్ టీ అవుతుంది.
ప్రా:-
9 . క్రికెట్ ప్లేయరుకీ,     అవధానికీ      సామ్యం ఉందా?
అవ:-
వాళ్ళు  world play కి వెళ్తారు , మేము  words play కి వెళ్తాము.
ప్రా:-
10 . 'పురుషులందు పుణ్యపురుషులు వేరయా' అన్నాడు వేమన, ఇప్పుడు మీరేమంటారు? 
అవ:-"పురుషులందు పుణ్యపురుషులు ఏరయా? అంటాను.
ప్రా:-
11 . దేవుని గుడికి          తాళం వెయ్యాలా?          
అవ:-
భజన జరిగే చోట  తాళం తప్పనిసరి.
ప్రా:-
12 . అద్దం ముందున్న         ఆడువారికీ,         మైకు ముందున్న
        అమాత్యులకీ         తేడా ఏమిటి?
అవ:- ఇద్దరికీ సమయం తెలియదు!

 చదివి ఆనందించండి - పద ప్రయోగ వినోదాన్ని పదిమందికీ పంచండి.🤣😉😄
〰️〰️〰️〰️🌹💐〰️〰️〰️

మాధవ్ పిల్లలతో మరో కొత్త కథను చెప్పటం మొదలుపెట్టాడు, పిల్లలు సావధానంగా కూర్చొని వింటున్నారు 
ఇది చాల చాలా పాతకధ 

        చాలా కాలం క్రితం ఓ పెద్ద పండ్ల చెట్టు ఉండేది. ఓ చిన్న పిల్లవాడు చాలా ఇష్టంగా, ప్రేమగా దాని చుట్టూ ఆడుకునేవాడు.  

        ఓ రోజు చెట్టు పైకి ఎక్కాడు,పండ్లు కోసుకొని తిన్నాడు, ఆ చెట్టు నీడలో కాసేపు పడుకున్నాడు. ఆ అబ్బాయి ఆ చెట్టును ఎంతగానో ప్రేమించాడు, ఆ చెట్టు కూడా ఆ అబ్బాయి తన వద్ద ఆడుకోవడాన్ని చాలా ఇష్టపడింది, అతన్ని అమితంగా ప్రేమించింది. 

       కాలం గడిచింది, చిన్న పిల్లవాడు పెరిగి పెద్ద వాడైయ్యాడు. ఇప్పుడు ఎక్కువగా ఆ చెట్టు నీడలో ఆడుకోవడం లేదు

       కొంత కాలం తర్వాత ఓ రోజు ఆ బాలుడు చెట్టు వద్దకు వెళ్లాడు,ఎందుకో విచారంగా ఉన్నాడు. "రా వచ్చి నా వద్ద ఆడుకో"  అని చెట్టు అడిగింది. 

        బాలుడు:- "నేనింకా చిన్న పిల్లాడిని కాను, చెట్ల చుట్టూ తిరుగుతూ ఆడుకునే వయసు కాదు నాది, నాకిప్పుడు ఆడుకోడానికి బొమ్మలు కావాలి, అవి కొనడానికి డబ్బులు కావాలి " అన్నాడు. 

        చెట్టు :- "నా దగ్గర డబ్బులు అయితే లేవు, కానీ నువ్వు ఓ పని చేయవచ్చు, నా పండ్లన్ని కోసుకుని వెళ్లి అమ్మివేయి, దానితో నీకు డబ్బులు వస్తాయి" అని అన్నది. 

        బాలుడు ఎంతోషంగా ఆ చెట్టు పండ్లన్ని కోసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు.. చెట్టు తనకోసం దిగులు పడుతూ, దుఃఖంతో ఉంది. 

         క్రమంగా ఆ బాలుడు పెద్దవాడై యువకుడిగా మారాడు, ఓ రోజు అతను రావడం చూసి చెట్టు చాలా సంతోషిపడి "రా నా వద్దకు వచ్చి ఆడుకో" అని ఆహ్వానించింది 

         "నీతో ఆడుకునే సమయం లేదు నాకు, నా కుటుంబం కోసం పని చేయాలి. మేము ఉండటానికి ఓ మంచి ఇళ్ళు కట్టుకోవాలి, నువ్వేమైనా సహాయం చేయగలవా"? అని అడిగాడు. 

          "నా వద్ద ఇల్లు లేదు, అయితే నా కొమ్మలు నీకు సహాయపడతాయి, వాటిని తీసుకో, నీ ఇళ్ళు కట్టుకో " అని చెట్టు అన్నది. అతను ఆ చెట్టు కొమ్మలన్ని నరికి సంతోషంగా తీసుకుపోయాడు. 

           అతను సంతోషంగా వెళ్లడం చూసి చెట్టు చాలా ఆనందపడింది, కాని అతను మళ్ళి తిరిగి రాలేదు, చెట్టు మరల విచారిస్తూ ఒంటరిగా ఉంది. 

            బాగా ఎండగా ఉన్న ఓ వేసవి కాలం రోజు అతను మళ్ళి వచ్చాడు, చెట్టుకు ఆనందంగా అనిపించింది. "రా వచ్చి నాతో ఆడుకో" అని అడిగింది, నేను ముసలివాన్ని అయ్యాను ఆడుకోలేను, ఈ ఎండల నుండి ఉపశమనం పొందటానికి నేను సముద్ర ప్రయాణం చేయాలనుకుంటున్నా, దానికి నాకో పడవ కావాలి, నువ్వు ఇస్తావా అని అడిగాడు

             నీ పడవ కోసం నా చెట్టు కాండము ఉపయోగపడుతుంది, నా కాండాన్ని నరికి తీసుకెళ్లు, దానితో మంచి పడవ చేసుకుని, హాయిగా ప్రయాణం చేయి, అని చెట్టు అన్నది. 

            అతను సంతోషంగా చెట్టు కాండాన్ని నరికి తీసుకపోయి, పడవ చేయించుకుని, హాయిగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు, చాలా కాలం చెట్టుకు అతను తిరిగి తన మొఖం చూపించలేదు. 

            చివరిగా, చాలా కాలానికి అతను మళ్లీ చెట్టు వద్దకు వచ్చాడు.. 
నాయనా.. నీకు ఇవ్వడానికి నా వద్ద ఏవి మిగలలేదు, పండ్లు కూడా లేవు అని చెట్టు అన్నది.. 
ఏమి ఇబ్బంది లేదు, నాకు తినడానికి పళ్ళు లేవులే అన్నాడు.. 

             చెట్ట: నువ్వు ఎక్కడానికి నాకు కాండం కూడా లేదు. 
ఎక్కడానికి నాకు బలమూ లేదు, ముసలి వాన్ని కదా అని అన్నాడు .. 

              నిజంగా నీకివ్వడానికి నావద్ద ఏమీ లేదు, చచ్చిపోతున్న నా వేర్లు తప్ప, అంటూ ఏడుస్తూ చెప్పింది చెట్టు. 

             నాక్కూడా ఇపుడు ఏది అవసరం లేదు, చాలా అలసిపోయాను, విశ్రాంతి తీసుకోడానికి ఓ మంచి ఆసరా కావాలి అన్నాడు. 

            వృద్ధ చెట్టు వేర్లు ఒరిగి విశ్రాంతి తీసుకోడానికి మంచివి, అనుకూలంగా ఉంటాయి నాయనా, రా వచ్చి నా వేర్లపై ఒరిగి కాస్త విశ్రాంతి తీసుకో అన్నది చెట్టు, అతను కూర్చున్నాడు, సంతోషంతో ఏడుస్తూ సేదతీర్చింది చెట్టు. 

           ఇది మనందరి కథ, ఆ చెట్టు మన తల్లిదండ్రులు లాంటిది. చిన్నప్పుడు అందరం తల్లిదండ్రుల వద్ద వారితో ఆడుకుంటాం. 

           కొంచెం పెద్దగయ్యాక వారిని వదిలి పెడ్తాం, మనకు అవసరమైనప్పుడు లేదా ఏదైన కష్టం వచ్చినప్పుడు మాత్రమే మన తల్లిదండ్రుల వద్దకు వెళతాం. వారు ఏ పరిస్థితిలో ఉన్నా సాధ్యమైనంతలో మీరు సంతోషంగా ఉండటానికి చేయాలసినదంతా చేస్తారు. 

          చెట్టు పట్ల ఆ బాలుడు చాలా నిర్దయగా ప్రవర్తించాడు అని మీకు అనిపించొచ్చు. కాని మన తల్లిదండ్రుల పట్ల మనం కూడా అదే చేస్తున్నాం.

          మనకు భరోసాగా వాళ్లను చూస్తాం, మనకు సర్వస్వం దార పోసినా కనీసం కృతజ్ఞత చూపం. కాని అప్పటికే సమయం మించి పోతుంది. 

       ఈ కథలోని నీతి.. 

          మీ తల్లిదండ్రులని ప్రేమగా సంరక్షించండి. వారు కూర్చున్న ఖాళీ కుర్చీలని చూసినప్పుడు మీకు వారి విలువ, వారు లేని లోటు తెలియవస్తుంది. 

       మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగా ప్రేమించారో తెలుసుకోలేం.  మనమూ తల్లిదండ్రులుగా మారినపుడే అనుభవంలోకి వస్తుంది.

పిల్లలూ కదా బాగున్నదా 
చాల చాలా బాగున్నది అంటూ కదిలారు 
--(())__



No comments:

Post a Comment