Tuesday, 8 September 2020

నిరుద్యోగి ప్రయాణం - 1 నుండి 10 వరకు (రోజువారి కధలు )


Say A Little Prayer

ప్రాంజలిప్రభ - అంర్జాల పత్రిక 
నిరుద్యోగి ప్రయాణం -10 (రోజువారి కధ ) 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ,

మాధవుడు నడుడ్స్తూ అలా ఒక ఇంటి ముందు ఆగాడు 
అక్కడ అన్న సంతర్పణం చేస్తున్నారు, అది కూడా ఒక కుక్క బొమ్మ పెట్టి దానికి దందా వేసి మరి  
అక్కడ ఒకరిని అడిగాడు మాధవ్ 
ఈరోజు ఎమన్నా స్పెషల్ 
లేదండి 
మరి దేనికి అన్న దానము 
కుక్క చని పోయిన ఆరోజుట 
అందుకని ఈరోజు అన్న దానము 
ఎందుకు బాబు అలా చూస్తావ్ 
ఈకాలం లొ మనిషి మనిషిని గుర్తించుటలేదు, కుక్కమీద ప్రేమతో మరి పెడుతున్నారు 
వంటలు చాలా బాగున్నాయి అన్నాడు 
అందరు అన్నం ప్లేట్లో అన్నం పెట్టించుకుని తింటుంటే మాదహెవ్ మాత్రం 
భైరవా నమస్కారం 
అంటూ 
దండం పెడుతూ కుక్క ఫోటో దగ్గర నిలుచున్నాడు 
బాబు భోంచేయకుండా కుక్కకు నమస్కరిస్తున్నావు 
కుక్క ఎంత పుణ్యం చేసుకుందో అని ఆలోచిస్తున్నాను 
అవును బాబు కుక్క కధ నీకు చెపుతా
ముందు ఆకలి తీర్చుకో, ఆత్మారాముని బాధ పెట్టకు అన్నాడు 
అట్లాగే అంటూ భోజనం చేసాడు మాధవ్ 
ఫోటో దగ్గర ఉన్న వాని వద్దకు వచ్చి కుక్క కధ చెపుతారా 
కధ చెప్పఁటం మొదలు పెట్టాడు ఒక పెద్ద అయినా       
ఇది నా చిన్నప్పుడు కధ బాబు 

"ఏమిట్రా బాబు కుక్కపిల్ల అరుపు ఇంటిలో విన బడుతున్నది, అవునమ్మా నేనే తీసు కొని వచ్చా, పాపం చలికి వణుకుతున్నది, రగ్గు కప్పుకొని మరీ తీసుకొనివచ్చా, ఎక్కడ తెచ్చావో  అక్కడ వదిలిరా, వాలమ్మ ఏడుస్తుంది, అవునమ్మ వాలమ్మ  కోసం చాలా సేపు వెతికాను ఎక్కడా కన బడలేదు అందుకే తెచ్చా, కాస్త అన్నం పెట్టు ఆకలేస్తున్నదేమో, ఇదిగో ఈ అన్నం పెట్టి ఎక్కడన్నా వదలేసిరా, లేదమ్మా నేనే పెంచుకుంటా, మీ నాన్న ఒప్పుకోడు, నీవే వప్పించ్చమ్మ.సరే దాన్ని జాగర్తగా చూసుకోవాలి, అట్లాగేనమ్మా .

తండ్రి రావటం, కుక్కపిల్ల చెప్పులు కొరకటం జరిగి పోయినాయి, కొడుకు గమనించి నాన్న ఈ పాత చెప్పులు బాగాలేదు అవి పారేస్తున్నాను కొత్తవి కొనుక్కో అన్నాడు, అవునండి కొత్తివి కొనుక్కోండి. ఏమిటే నీవు కూడా కొడుకును సమర్దిస్తావు.

నాన్న కుక్క అరుస్తున్నది, అవును ఉండు లైటు వేస్తా, ఎవరూ అటు పరుగేట్టేది అని గట్టిగా ఆరిచాడు, అప్పుడు దొంగలు పక్కింట్లో పడి దోచుకొని వెళ్లినట్లు గమనించారు. పక్కట్లోకి వెళ్లి ఓదార్చి, పరామర్శించి,పోలీస్ ఫోన్ చేసారు. 

ఒక సారి కుక్కపిల్లను వెంట పెట్టుకొని విందుకు బయలు దేరారు, అందరూ చూస్తుండగా పాయసంలో మూతిపెట్టి  అరుస్తున్నది.  అక్కడున్న వారు కుక్కను కొట్ట పోయి గిన్నెను కొట్టారు, గిన్నేనుండి దొర్లిన పాయసంలో బల్లి కనిపించింది. అందరు కుక్క పిల్లను మెచ్చుకున్నారు.
ప్రాణాలను రక్షించినందుకు. 

కుక్కకు రకరకాల ఆటలు నేర్పారు,  పరిగెడుతూ గుంటలో పడింది, గుంటలో పాముతో పోరాడింది, పామును చంపివేసింది.

పాము విషముకుక్కకు ఎక్కకుండా డాక్టర్ సలహా ప్రకారము ఇంజక్షన్ చేయించారువారు. ఆ యింట్లో వారు కుక్కను భైరవునిగా భావించి పూజచేసి గారెల దండ వేసారు. కన్నా బిడ్డ లాగా చూస్తున్నారు.

అనుకోని విధముగా అందరూ కలసి ఊరికి పోవలసి వచ్చింది. కుక్క పిల్లను ప్రక్క ఇంటివారికి ఇచ్చి బయలు దేర బోయారు.  .

 ఆ ప్రక్క  యింట్లో ఉంచిన  కుక్క పిల్ల   ఒకటే ఏడుస్తూ పరుగెడుతూ మాకరు క్రిండ పడి  చని పోయింది. ఒక్కసారిగా మాబాబుకేవ్వుమని అరిచాడు, అపుడు చనిపోయిన కుక్క పిల్లను తీసుకువచ్చి మా తోటలో పాతిపెట్టాము. 

అప్పుడే పిడుగు లాంటి వార్త ' మేము వెళ్ళే ట్రైన్ ను కొందరు దుండగులు పెట్రోల్ పోసి తగలేసి నట్లు చాలా మంది సజీవ దహన మైనట్లు తెలిసింది.' మాప్రాణాల కోరకు  తన ప్రాణాన్ని అర్పించిన కుక్క పిల్ల చనిపోయిన రోజు అన్నదానము చేస్తున్నాము, అందుకే  మా యింట్లో కుక్క ఫొటోకు దండ వేశాము ఇది కధ "                   
భైరవ నీకు ఇవే నా నమస్కారాలు కధ చెప్పిన వానికి నమస్కరించి బయలు దేరాడు మాధవ్ .
                                

ప్రాంజలిప్రభ - అంర్జాల పత్రిక 
నిరుద్యోగి ప్రయాణం -9 (రోజువారి కధ ) 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ,


మాధవ్ అలా నడుచుకుంటూ అక్కడ దగ్గర గా ఉన్న ఆంజనేయస్వామి గుడికి వెళ్లి గుమ్మానికి నమస్కరించి లోపలకు వెల్లి ప్రదక్షణలు చేసి దేవునికి నమస్కరించి ప్రక్కనే ఉన్న స్థలములో పద్మాసనం వేసుకొని ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ ఓం శ్రీరామ అంటూ మనసులో ధ్యానం చేస్తున్నాడు. 

అప్పుడే అక్కడ ఉన్న పూజారిగారు పూజ పులా గురించి ఈవిధముగా తెలియపరుస్తున్నారు. 
అప్పుడే ఎవరో భక్తుడు కూర్చున్న మాధవుని చేతిలో కొబ్బరిచిప్ప, పళ్ళు పెట్టి వెళ్లారు. ఎవుని ప్రసాదంగా స్వీకరించే.  

పూజకు పూలు

అహింస  ప్రథమం  పుష్పం 
పుష్పం  ఇంద్రియ  నిగ్రహః 
సర్వ భూత దయా పుష్పం 
క్షమా  పుష్పం  విశేషతః |
జ్ఞాన  పుష్పం  తప: పుష్పం      
శాంతి  పుష్పం  తథైవ  చ 
సత్యం  అష్ట విధం  పుష్పో: 
విష్ణో:  ప్రీతి కరం  భవేత్ ||
      ******

1. అహింసా పుష్పం:
ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమేదేవునికి సమర్పించే ప్రధమ పుష్పం... 

 2. ఇంద్రియ నిగ్రహం:
చేతులు, కాళ్లు మొదలైన కర్మేంద్రియాలు లను అదుపులో ఉంచుకోవడమే దేవుని అందించాల్సిన రెండో పుష్పం.... 

 3. దయ:
కష్టాల్లో, బాధలో ఉన్న వారిబాధను తొలగించడానికి చేసేదే దయ..... 
ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం.

 4. క్షమ:
ఎవరైనా మనకి అపకారం చేసినా,ఓర్పుతో సహించడమే క్షమ.... 
ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం.

 5. ధ్యానం:
ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం..... 
ఇది దేవుని అందించే ఐదో పుష్పం.

 6. తపస్సు:
మానసిక ( మనస్సు),వాచిక (మాట),కాయక( శరీరం)లకు నియమాలు ఉండడం తపస్సు.... 
ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం.

 7. జ్ఞానం:
పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం... 
ఇది దేవుని అర్చించాల్సిన ఏడవ పుష్పం.

 8. సత్యం:
ఇతరుల కు బాధ కలుగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం... 
ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం.

ఎనిమిది పుస్పాలను నియము గా ఆచరించి తే దేవునికి పుస్పాల్తో పూజ చేసినట్లే 
కనుక ప్రతిఒక్కరు భక్తితో భగవంతుని కొలుస్తూ మానవాభ్యదాయానికి సహకరిస్తూ ఉంటె నిత్య సుమంగళం 
అని ముగించారు. 
మాధవ్ మరలా దేవునికి సాష్టాంగ నమస్కరించి బయాటకు వచ్చే 

__(())--
 

GANESHA FESTIVAL Painting by Suraj Prajapati | Saatchi Art

ప్రాంజలిప్రభ - అంర్జాల పత్రిక 
  నిరుద్యోగి ప్రయాణం -8 (రోజువారి కధ ) 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ,

మాధవ్ బయటకువచ్చాడే గాని మనసు మనసులో లేదు. డాక్టర్ ఆరోగ్యం కుదుట పడేవరకు ఉండకుండా వచ్చేయటం ధర్మమా మరి ధర్మమ్ము కదా అని అమ్రిమారి ఆలోచిస్తున్నాడు. 
అప్పులే మాధవ్ ఆత్మ ఐ విధంగా బయటకు వచ్చి చెపుతున్నది.

ఎవరికీ ఎవరు సహాయము చేయరు చేసినా ఋణము ఉన్నంత వరుకుమాత్రమే నీవు మనసులో దిగులు అనవసరము అందరికన్నా నీవు మంచి పని చేసావు      

నీకు ధర్మం గురియించి చెపుతా విను అంటూ ఆత్మ చెప్పటం మొదలుపెట్టింది 

ధర్మం.

అందరూ అంటుంటారు ధర్మమే గెలుస్తుంది అని.. అది తప్పు.. ధర్మం దానంతట అదే గెలవటం కాదు.. నువ్వు గెలిపించాలి, మనం కలిసి గెలిపించాలి.. అర్థం కాలేదా...

అయితే రండి... ఒక్కసారి నెత్తుటితో తడిసిన చరిత్ర పుస్తకాలలోకి తొంగి చూడండి..

త్రేతాయుగంలో రాముడి భార్యను రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు, సరేలే ధర్మమే గెలుస్తుంది కదా, తన సీత తిరిగి వస్తుంది అని రాముడు చేతులు కట్టుకొని గుమ్మం వైపు చూస్తూ కూర్చోలేదు.. రావణాసురుడి మీదా ధర్మయుద్ధం ప్రకటించాడు. ఆ రాముడికి అఖండ వానర సైన్యం తోడై ధర్మం వైపుకు అడుగులు వేశారు, ఆ యుద్ధంలో రాముడికి సైతం గాయాలు అయ్యాయి. తన భుజాలను, తొడ భాగాల చర్మాన్ని బాణాలు చీల్చుకొని వెళ్ళాయి. నరాలు తెగి రక్తం చిందుతున్నా సరే తట్టుకొని నిలబడ్డాడు, పోరాడాడు, యద్ధంలో గెలిచాడు.. ధర్మం గెలిచింది...

ద్వాపరయగంలో కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు తను దేవుడు కదా అని ఓక సామాన్య మానవుడు లా యుద్దాన్ని చూడలేదు.. ధర్మం చూసుకున్నాడు. పాండవుల పక్షాన నిలుచున్నాడు. అర్జునుడికి రథ సారధిగా మారాడు, గుర్రానికి గుగ్గిళ్లు పెట్టాడు, దాని పేడ ఎత్తేశాడు. స్నానాలు చేయించాడు. 

ఆ యుద్ధంలో రథాన్ని నడుపుతూ ఆ వేగంలో వెనకాల అర్జునుడి మాటాలు వినపడవు గనుక అర్జునుడు తన కాలుతో కృష్ణుడి కటి భాగంలో ఎటువైపు తగిలిస్తే రథాన్ని అటువైపు తిప్పాలని ముందుగనే అనుకున్నారు.. అలా కాళ్ళతో కూడా తన్నించుకున్నాడు...  అవన్ని ధర్మం కోసమే చేసాడు. ధర్మాన్ని గెలిపించడం కోసమే చేసాడు. అలా కురుక్షేత్ర యద్ధం ముగిసింది, ధర్మం గెలిచింది..

కలియుగం ఇప్పుడు కూడా మనం ప్రతిరోజు సమస్యలతో పోరాడుతునే వున్నాం.. ప్రతి ఒక్కరి మదిలో మంచికి చెడుకి యుద్ధం జరుగుతునే వుంది.. నువ్వు నమ్మితే అది నిజం మాత్రమే అవుతుంది.. ఆచరిస్తే ధర్మం అవుతుంది. అది భవిష్యత్ తరాలకు మార్గదర్శకం అవుతుంది.

అదే నువ్వు నా, ని, తన, మన భేదాలను పక్కన పెట్టి న్యాయం ఆలోచిస్తేనే ధర్మం అర్థం అవుతుంది..
అలా ఆలోచించి పోరాడిన రోజే ధర్మం గెలుస్తుంది, తెగించి అలా ధర్మం వైపుకు నిలబడిన రోజు నీ వెనకాల ప్రపంచమే నడుస్తుంది..

మన ధర్మాన్ని కాపాడుకుందాం. మన భావితరాలకు అందిద్దాము...

అబ్బా ఎంత చక్కగా చెప్పావు త్రేతాయుగం, ద్వాపరయుగం గురించి చెప్పావు ఇది కలి యుగం
గాంధీగారు ఉన్నారుగా గోచిపెట్టి బ్రిటిష్ వారిని గడగడ లాడించి మనకు స్వతంత్రం తెచ్చారు 
అందుకే నేను చెప్పేది నీ గమ్యం నీవు సాగిపో అక్షరాలా నిజం ఇదే ధర్మం 
 
ఆమాటలు విన్న మాధవ్ బాయలు డిపోతున్నాడు కుండపోత వర్షం ఎం చెయ్యాలో తోచక అక్కడే ఉన్న ఒక వరండాలో నుంచొని ఉన్నాడు, వర్షం   త గ్గా క వెళదామని.....
    

 .ఈ కధ ఇంకా ఉంది ... 9

మీ అమూల్యమైన అభిప్రాయలు షేర్ చేసి తెలపగలరు ఒక నిరుద్యోగ యాత్రకు ..  
--(())--
--(())--

ప్రాంజలిప్రభ - అంర్జాల పత్రిక 
  నిరుద్యోగి ప్రయాణం -7 (రోజువారి కధ ) 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ,
                                                                
మాధవ్ వచ్చిన వారు పడిపోయిన మనిషి తాలూక అనుకున్నాడు. అవ్వ ఇచ్చిన పైకము మంచికి ఉపయోగ పడింది చాలు అంటూ అక్కడ మంచినీళ్ల క్యానులో నీరు త్రాగి ప్రక్కనే ఉన్న వినాయకునికి నమస్కరించి బ్యాగు తగిలించు కొని బయటకు వచ్చేసాడు. ఇక అంతా ఒ పరమాత్ముడు చూసు కుంటాడు అంటూ నడుస్తున్నాడు.
మరలా వచ్చి

ఇక అంతా ఆ పరమాత్ముడు చూసు కుంటాడు అంటూ 

అక్కడ ఉన్న కాగితంపై వ్రాసి డాక్టర్కు ఇచ్చి నమస్కరించి బయటకు నడిచాడు. డాక్టర్ చదువు తున్నాడు.

నేను మీకు తెలియదు, మీరు నాకు తెలియదు, మన ఇద్దరి మధ్య కేవలము కొన్ని గంటలు. నేనొక నిరుద్యోగిని, ఉద్యోగం కోసం దేశాల వెంట తిరుగు తున్నాను.
 మనకు ఏది కావాలో మనకు తెలీదు. మన ఆరోగ్యం మనచేతిలో ఉన్న కొన్ని సంఘటనలు బలహీన పరచవచ్చు. చెడు మార్గం నడవవచ్చు అంత మాత్రాన నిన్ను నీవు మరిచి పోయటేట్లుగ ఉండుట ఆవసరమా.

మనల్ని సృష్టించిన పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. పరమాత్మని కొలిచేటప్పుడు కష్టం రావచ్చు కానీ నువ్వు చేసిన పని ఫలితం వచ్చే వరకు వేచి చూడాల్సిందే.. ఏదో ఒకరోజు ఫలం వచ్చి తీరు తుంది. ఫలితం రాకుండా మాత్రం ఉండదు.

"మిత్రత్వం కోసం ప్రాణం ఇవ్వడం కష్టం ఏమీ కాదు
 అంతటి త్యాగం చేసే స్నేహితుడిని పొందటమే కష్టం"

" కాల ప్రవాహంలో ఎవరి ప్రయాణం ఎవరితోనూ శాశ్వతం కాదు.....!
ఎవరి ప్రయాణమైన ప్రాణమన  "జ్యోతి" వెలుగుతున్నంతవరకే......!!" 

డాక్టర్ గారు ఇక నాకు శెలవు. మీ ఆరోగ్యం కోలుకోవాలని ఆదేవుని ప్రార్ధిస్తూ నాయాత్రకు నేను వెళ్ళొస్తా నండి

 .ఈ కధ ఇంకా ఉంది ... 8

మీ అమూల్యమైన అభిప్రాయలు షేర్ చేసి తెలపగలరు ఒక నిరుద్యోగ యాత్రకు ..  
--(())--

సశేషం..........8





ప్రాంజలిప్రభ - అంర్జాల పత్రిక 
  నిరుద్యోగి ప్రయాణం -6 (రోజువారి కధ ) 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ,

నమస్తే అవ్వ నాకు శెలవు ఇస్తావా, ఈ లోకంలో నేను అనేది తెలుకోవాలి, నేను దేశానికి ఏమి చేయగలుగుతాను అర్ధం చేసుకోవాలి, నా వళ్ళ పరాయి వాళ్ళకు ఎంత మందికి ఉపయోగం ఉంటుందో తెలుసుకోవాలి, మనిషిగా నలుగురికి సేవలు చేసి బతకాలని నా ముఖ్య ఉద్దేశ్యము అవ్వ.  

మంచి మాట చెప్పావు బాబు
ఉదేశ్యము గొప్పదే ఆచరణకు వచ్చేటప్పటికల్లా  నిన్నుకమ్ముకొని వేరు చేస్తాయి బాబు 
అవేమిటి బాబు    
ముఖ్యముగా " ఆశ, పాశము, ధనము, ప్రేమ  "  ఇందులో ఏ ఒక్కటి పెరిగినా నీలో అహం పెరుగుతుంది అప్పుడు నీమాట మారుతుంది తర్వాత పశ్చాత్తాప పడినా ఫలిత ముండదు అందుకే చెపుతున్నా. 

వివరంగా చెప్పవా అవ్వ 

వ్యసనాల యువరాణి, మాయల చేసే మహారాణి, బ్రతుకుని మార్చె మధురవాణి. 
వీటిని నీవు ఎప్పుడు ఆశించకు. గుట్టుగ నుండే మాటలు బయటకు వచ్చాయనుకో వాటివల్ల మనసు చెడు మమత వీడు. 

మాటవల్ల మనసు వల్ల అదనపు అవయవముగా మారి అవయవాలన్నిటిని ఆడిస్తూ కుళ్ళి పోయే విధముగా మారుస్తుంది, అందుకే పెదవి దాటి వచ్చిన మాట ముత్యాల మూటలాగా ఉండాలి తప్ప గార్ధభ స్వరముగా ఉండ కూడదు.           

ప్రపంచం, దేశం, తల్లి తండ్రులు నాకేం చేసారు అని మనసుకు కూడా ఆలోచన రాకూడదు,. నీ దృఢ సంకల్పం, నీ ధైర్యం, నీకు రక్ష, ఎవరో ఎదో చేస్తారని ఎదురు చూసి మోసపోకు, జీవిత మనేది కొంత నల్లేరు గా మరికొంత పల్లేరుగా మారుతుంది, అవి కూడా కాల చక్రంలా తిరుగుతాయి.  అధైర్య పడితే నిన్ను నీవు రక్షించు కోలేవు, భ్రమలకు చిక్కి పతనమై పోతావు.          
కొన్ని సౌకర్యం కోసం సృష్టిస్తే, సృష్టించిన వాణ్ణే శాసిస్తోంది.  దాన్ని నమ్మిన వాళ్ళను ఒక అట ఆడిస్తుంది మనసు లేని వాడుగా మారుస్తుంది.
విలువైన సమయాన్ని తనలోనే చూపిస్తూ చిత్రంగా హరిస్తోంది, పరాయివాళ్ళు పక్కప్రక్కనే ఉన్నా యంత్రాన్ని ప్రేమించే పిచ్చివాళ్ళను చేసింది వ్యసనపరులుగా మార్చింది.
ఒకటని కాదు ఆధునిక పనిముట్లు అన్నీ అలాంటివే ( కంప్యూటర్ , టి .వి .సెల్ ఫోన్ వాహనము ఇంకా ) యువతను పెడద్రోవ పట్టిస్తోంది, సమాజాన్ని పట్టి పీడిస్తోంది. 

మనుష్యుల ఆరోగ్యంతో ఆడుకుంటుంది, విద్యా వ్యవస్థనే, అభివృద్ధినే, చెప్పే విధానము పోయి అధ్యాపకుల భవిషత్తు ప్రశ్నర్థకంగా మారుస్తుంది,   నాశనం చేస్తుంది ఇది అవసరమా?  మనిషి మేధస్సును ఉపయోగించుకొని చేసే పనికి యంత్ర ముద్వారా చేసే పనికి యంతో వ్యత్యాసము ఉంది. పది మంది చేసే పని ఒక రోబో చేస్తుందని చెపుతారు కానీ పది మంది చేసే పనితో వందమంది దాకా బతుకుతారు ఒక రోబో చేసే పనిలో ఎంత మంది బతుకులు పోతాయో ? మీరే చెప్పండి. నిరుద్యోగులు పెరుగుట తప్ప.       

ఓ బాబు విజ్ఞానం కోసం చేసింది అజ్ఞానంగా వాడకు, ఊడిగం చేయించుకో, అంతేగాని బానిసగా మారకు. 

దేన్నెక్కడుంచాలో  అక్కడే ఉంచు నెత్తినెట్టుకున్నావో పాతాళానికి తొక్కేస్తుంది. అన్నీ నేను చేయగలనని తల దూర్చకు, నిన్ను గుర్తించి నీ పనితనాన్ని గుర్తించి నిన్ను ఆశపరునిగా మార్చని వారి మధ్య బతుకు సాగించు బాబు. 

ఇట్లా ఎదో ముసలిది చప్పిందని తక్కువచేయకు, నేను చెప్పిన వణ్ణి గుర్తించుకొని,ఆచరిస్తే నీ  మనసు ప్రశాంతముగా ఉంటుంది, నీ చుట్టూ ఉన్న వారి మనస్సు కూడా ప్రశాంత పడుతుంది.
మనస్సు ప్రశాంతముగా ఉంటె సాధించలేనిది లేదు. 
  
చివరగా ఒక్క విషయము చెపుతా 

"సమయం వ్యర్థం చేయకు, మాట దాటి ప్రవర్తించకు "
"నాకు ఎవ్వరు లేరని అనుకోకు, అంతా నా వారని అనుకోని బతుకు "

అవ్వా నన్ను దీవించు  
నా  దీవెనలు .... .....
చూడవ్వ పెద్దదానివి, కల్ముషం లేని మనస్సుతో ఉన్న దానివి, ఆ అమ్మవారే నీరూపంలో నాకు హిత బోధ చేసినదానివి అనుకుంటా నవ్వ . 
"దీర్ఘాయుషుమాన్ భవ " 

చూడు బాబు అక్కడ ఉన్న డబ్బా తీసుకురా 
అట్లాగే అవ్వా 
ఇదిగో బాబు నాదగ్గరున్న పైసలు ఇవే నీవు తీసుకో 
అవ్వా మరి నీకు 
నాకు పెంక్షన్ వస్తుంది ఎటువంటి భయములేదు 
నేను ఒక్కరికన్నా సహాయము చేశానని తృప్తిగా జీవితం సాగిస్తా 

వెళ్ళొస్తా అవ్వా 
బాబూ 
అవ్వా 
ఏ నాటి బంధమో ఈ కలయిక 
అవునవ్వ నిన్ను వదలి నేను పోలేక పోతున్నాను 
వద్దు బాబు ఇక్కడ ఉంటె బావిలో కప్పలాగా ఏమి తెలుసు కోలేవు 
రాలి పోయే జీవితము నాది, వర్ధమాన జీవితం నీది 
నిన్ను నేను ఆపినా స్వార్ధం నాది అవుతుంది బాబు 
బయలు దేరు, బయలుదేరు 
అవ్వా బాబు 
అవ్వా బాబు .......   .....


 .ఈ కధ ఇంకా ఉంది ... 7

మీ అమూల్యమైన అభిప్రాయలు షేర్ చేసి తెలపగలరు ఒక నిరుద్యోగ యాత్రకు ..  
--(())--





ప్రాంజలిప్రభ - అంర్జాల పాత్రిక 
  నిరుద్యోగి ప్రయాణం -5 (రోజువారి కధ ) 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ, 6281190539


అవ్వ చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత మాధవ్ నాకు సెలవిస్తే ఈ లోకంలో నేను సేవ చేయటానికి పోవాలి అవ్వ. 

చూడు నిన్ను ఏమీ అడగను, ఈలోకంలో మనుష్యులను మాత్రం నమ్మి వారే మంచి వారని అనుకోకు. ఈ ప్రపంచంలో పంచ భూతాలు తప్ప మరి ఏవి ఎవరును సహాయం చేయవు. చేసినా ఎదో ఆశించి సహాయం చేస్తాయి. మనల్ని ఋణం లోనికి మారుస్తాయి. జన్మ జన్మలకు తీర్చుకొనే విధముగా మనల్ని ఆశకు లోను చేస్తాయి. 
తప్పించుకోవటం  రాదా 
తపించు కోవటం ఎందుకు రాదు 
స్త్రీని గౌరవించిన చోట, తల్లి తండ్రులను ప్రేమించిన చోట, ఉన్న ప్రాంతానికి సహాయము చేసుకున్న చోట, మాటల తో మంచిని చెప్పి అనుకరించిన చోట ఎటువంటింభాధలు కష్టాలు ఉండవు. 
 అవ్వ పంచ  భూతాల గురించి చెప్పవా 
సరే అట్లా కూర్చో 
ఈ  కుర్చి లో నడుము వాల్చి నిదానంగా చెపుతాను విను బాబు 

బ్రహ్మ దేవుడు "పంచభూతాలను" పిలిచి ఒక్కో వరం కోరుకోమన్నాడు. 
అవునా 
అవును నే  చెప్పేది విను , మధ్యలో ప్రశ్నలు వేయకు
అట్లాగే అవ్వా 
ఎక్కడ దాక చెప్పను పంచభూతాలను బ్రహ్మ పిలిచారన్నావు, వరాలు కోరుకోమన్నాడు అన్నావు 
ఆ అవును విను 
   
వరం కోసం తొందర పడిన "ఆకాశం" అందరికంటే పైన ఉండాలని కోరింది. ఎవరికీ అందనంత ఎత్తులో నిలిపాడు 

బ్రహ్మ. 

ఆకాశం మీద కూర్చునే వరాన్ని "సూర్యుడు" కోరడంతో నేటికీ ఆకాశం మీద విహరిస్తున్నాడు. 

వారిద్దరి మీద ఆధిపత్యం చేసే వరమడిగిన "జలం"  మేఘాల రూపంలో మారి... ఆకాశం మీద  
పెత్తనం చలాయిస్తూనే.. కొన్నిసార్లు సూర్యుడుని కప్పేస్తుంది. 

పై ముగ్గురినీ జయించే శక్తిని "వాయువు"  కోరడంతో  పెనుగాలులు వీచినప్పుడు రేగే దుమ్ము ధూళికి మేఘాలు పటాపంచలవడం....

సూర్యుడు, ఆకాశం కనుమరుగవడం జరుగుతాయి.

చివరివరకు సహనంగా వేచి చూసింది భూదేవి పై నలుగురూ నాకు సేవచేయాలని కోరడంతో
బ్రహ్మ అనుగ్రహించాడు. 

అప్పటినుండి ఆకాశం భూదేవికి గొడుగు పడుతోంది వేడి, వెలుగు ఇస్తున్నాడు సూర్యుడు.
వర్షం కురిపించి చల్లబరుస్తోంది జలం సమస్త జీవకోటికీ ప్రాణవాయువు అందిస్తున్నాడు వాయువు. 

సహనంతో మెలిగి వరం కోరిన భూదేవికి  ..
మిగతా భూతాలు సేవకులయ్యాయి. 

సహనవంతులు అద్భుత ఫలితాలు పొందగలరని   నిరూపించడానికి ఈ కథ చాలు.              
ఈ కథ చిన్నదిగా ఉన్న చాలా అర్ధం ఉంది. 
           
సహనానికి ప్రతిరూపం స్త్రీ 

అందుకే భూదేవిని ఓర్పు, సహనాలకు ప్రతి- రూపంగా చెప్పారు పెద్దలు.

సహనం అంటే నిగ్రహం పాటించడం. కష్టాల్లో ఉన్నప్పుడు ఉద్వేగాన్ని దాటవేయడం లేదా వాయిదా వేయడం. 

బాధను అధిగమించడమే సహనం. సహనంగా ఆలోచించే వారికి సమస్యలు దూరమవుతాయి. 

కొన్ని సార్లు ఏదైనా పెద్ద సమస్య ఎదురైతే చావు వైపు నడిచే బదులు సహనంగా ఆలోచిస్తే పరిష్కారం కనిపిస్తుంది. 

సరైన  ఆలోచన కలగనప్పుడు అనుభవజ్ఞుల్ని  ఆశ్రయిస్తే పరిష్కారం దొరుకుతుంది.

అందుకే బాబు నేచెప్పేది ఒక్కటే నీ  సంకల్పం నిన్ను బతికిస్తుంది. 
నీ నమ్మకం నీకు తోడు ఉంటుంది, తల్లి తండ్రుల దీవెన ఎప్పుడు నీ వెంట ఉంటాయి. ఆ దేవుడే నీకు ధైర్యమిచ్చి పంచభూతాలు తోడుగా నిన్ను అనుకరిస్తాయి అవియే ఈజన్మ సంతృప్తికి ఆధారాలు 
మరి ధనము అవ్వ 
ధనము బతికి బతికించు కోవటానికి ఉంటె చాలు ఆశకు పోతే ఆరోగ్యం చెడి కుటుంబ నాశనానికి తోడవుతుంది. 
బాబు ఇంతసేపుఉన్నవుగా భోజనం చేసి వేళ్ళు 
అవ్వ ఈరోజు వంట నేను చేస్తా నువు తింటావుగా 
చూడు బాబు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎవరు పెట్టినా వద్దన కూడదు 
అట్లాగే అవ్వ ఒక్క పది నిముషాలు ఆగు 
అట్లాగే .......  అట్లాగే ....

--(())--    


 .ఈ కధ ఇంకా ఉంది ... 6

మీ అమూల్యమైన అభిప్రాయలు షేర్ చేసి తెలపగలరు ఒక నిరుద్యోగ యాత్రకు ..  




ప్రాంజలిప్రభ - అంర్జాల పాత్రిక 
  నిరుద్యోగి ప్రయాణం -4 (రోజువారి కధ ) 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ, 6281190539

మాధవ్ ప్రయాణం బస్సు ఆక్సడెంట్ మరియు గురువు గారి సంభాషణ ఇంకా చదవండి 4  వ భాగము 

మాధవ్ ఆలా రోడ్డు మీద నడుస్తూ పోతున్నాడు. ఏంచెయ్యాలి, ఎలా బతకాలి, ఈ లోకాన్ని ఎలా అర్ధ౦ చేసుకోవాలి అనుకుంటూ ఉండగా వేగంగా మోటార్ బైకులు శబ్దం విని పక్కకు జరిగాడు అదే సమయాన ప్రక్కనే ఉన్న ఒక ముసలమ్మా నెమ్మదిగా నడుస్తూ పోతున్నది. అవ్వ ఎటు పోతున్నావు అని అడిగాడు మాధవ్ చూడు బాబు నీవెవ్వరో కొత్తగా నన్ను పలకరిస్తున్నావు అంటూ ఒక్కసారి మాధవుని ప్రక్కకు లాగింది మాధవకు కళ్ళు తిరిగినంత పనైంది. ఎం జారుతున్నాదో  అర్ధం కాలేదు. దూరంగా రెండు బైకులు ఒకదాని కొకటి గుద్దుకొని నలుగురు ప్రక్క  ప్రక్కనే పడిపోయారు, వారిని లేపే మూగారు ప్రజలు, అవ్వే నన్ను రక్షించింది, ఆ బైకు నన్ను తాకేది అప్పుడు నా పరిస్థితి ఎలాఉండేదో అని అన్నాడు అవ్వతో. 

చూడు బాబు యవ్వన విన్యాసాలు ఇట్లాగే ఉంటాయి, పిల్లలపై  ప్రేమ పెంచు కుంటారు తల్లి తండ్రులు వారు అడిగిన వణ్ణి కొనిపెడతారు వారి ప్రవర్తనలు చూసి ఏమి అనలేక బాధ పడతారు, వాడి కర్మ వాడు అనుభవస్తాడు, ఎన్ని సార్లు చెప్పినా వినడు అంటారు కొందరు, వాడి చేసే చేష్టలు చూసి ఏమీ అనలేక మావాడు చాలా మంచివాడు బుద్ధిమంతుడు అని చెపుతారు. 

అవ్వా నన్ను రక్షించ బోయి నీ సంచి లాంటిది క్రింద పడింది. అందరూ నన్ను వదిలించు కున్నారు నేను మాత్రం ఇది పట్టుకొని వేలాడుతున్న అదే నాకు కొండంత ధైర్యం ఇస్తున్నది. నాకు దారి చూపుతుంది. 
అవ్వా దీనిలో ఏమున్నాయి 
నీవే చూడు 
ఏమి లేవనుకుంటాను 
సరిగ్గా చూడు 
ఆ ఉన్నాయి 
12  రాగి పైసలు 
ఇంకా ఏమున్నాయి హనుమంతుని ఫోటో 
ఏమిటవ్వ ఈ ఫోటో పైసలు కధ 

చెపుతా బాబు ఏమనుకోకపోతే ఆబంకులో టీ అమ్ముతారు ఓ కప్పు టి నువ్వు త్రాగి నాకు తెస్తావా.
తెస్తానవ్వా నువ్వు ఇక్కడే కూర్చో అని బంకు దగ్గర కెళ్ళాడు.
బంకు వాడు ముస్సల్ది ఏమైంది నువ్వు వచ్చావు, నువ్వెవరు అని అడిగాడు 
వివరాలు నీకు అవసరమా 
ముందు టీ లు ఇవ్వు 
అబ్బో పిల్లోడు ఇంతలేడు అంత గట్టిగా మాట్లాడుతున్నాడు అంటూ గొణిగి టి పోసి ఇచ్చాడు 
డబ్బులు తీసుకోవా 
వద్దులే బాబు ఈ టీ నే కదా అవ్వకు తీసుకెళ్ళు అన్నాడు 
వాడి మాటలకు ఏమీ అర్ధం కాకా రెండు కప్పులు పట్టుకొని అవ్వకు ఒక కప్పుఇచ్చి మరో కప్పుతో టీ త్రాగుతున్నాడు మాధవ్       
అవ్వా ఆ టీ వాడు ముందు దురుసుగా మాట్లాడి తర్వాత డబ్బులక్కరలేదన్నాడు 
వాడు నాకొడుకు బాబు వీడు కాక ఇంకా ముగ్గురున్నారు వాళ్ళ కధలు ఇప్పుడు నీకు చెప్పి బాధ పెట్టడం, నేను బాధ పడటం నాకు ఇష్టం లేదు. 
సరే అవ్వ 
ఆ సంచి కధ చెపుతావా              
       
 " బాబూ ! అది నాకు చిన్నప్పుడు మా నాన్న ఇచ్చిన సంచి పర్సు . అప్పుడు నాకు మా అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం . అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో పెట్టుకున్నాను . కాలం గడిచే కొద్దీ నేను చాలా అందంగా ఉన్నాను అని నాకు అభిప్రాయం కలిగింది . అందుకని నేను అప్పుడు నా పర్సు లో నా ఫోటో పెట్టుకున్నాను . "
 .
నాకో ఉద్యోగం వచ్చి పెళ్లి అయ్యింది . నా భర్త చాలా అందగాడు  నాకు బావ అంటే చాలా ప్రేమ అపుడు బావ ఫోటో నా పర్సులో పెట్టుకున్నాను  . 
 .
ఇక జీవిత సమరంలో  నాకు కొడుకులు  పుట్టారు  . వాళ్లంటే నాకు చాలా ఇష్టం . వాళ్ల  కోసం నేను ఉద్యోగం చేసాను 
ఏమి మీ ఆయన ఉద్యోగం చేయడా 
ఎందుకు చెయ్యడు చేస్తాడు జీతమంతా కల్లు, సారాయి దుకాణాలకు ధార పోస్తాడు ఒక వైపు భర్తను పిల్లలను కష్ట పడి వాళ్ళు వేసే వేషాల్ని తట్టుకొని సంసారం సాగించాను.
ఆ చప్పు అవ్వా   
ఆఫీసు వదల గానే ఇంటికి వచ్చి వాడితోనే, పిల్లలతోను  లోకం అన్నట్టుగా గడిపేదానిని . వాళ్ళని  భుజాల మీద మోస్తూ రోజంతా గడిపేదానిని . వాళ్ల ని నా పక్కనే పడుకోబెట్టుకునే వాడిని మావారికి చాలా కోపం వచ్చేది పిల్లలు పుట్టాక నన్ను దూరం పెడుతున్నావని . వాళ్లే  నా లోకం . అపుడు నా సంచి  పర్సులో వాల్ల ఫోటోలు  పెట్టుకునే దాన్ని . వాళ్ళ ఇపుడు ఎవరి దారి వారయ్యారు, ఎంత  సేపటికి నా పెంక్షన్ డబ్బులకోసం నన్ను ఉంచుకొనేవాళ్ళు నేనంటే నేను ఉంచుకుంటానని అందరు వదిలి పెట్టారు నేను ఇట్లా ఉన్నాను. 
అవ్వా కొడుకులు నిన్ను చూసుకోవటంలేదా, సహాయం చేయుటలేదా 

ఎం సహాయమంటావు బాబు మనవలు మనవరాళ్లు పెరిగేటప్పడికల్లా, సంపాదన పెరిగేటప్పడికల్లా, నువ్వేం పెట్టావు మాకు అనే ప్రశ్నకు మారారు, వాళ్ళను ఏమి అనలేక  నేను బయఁట రూములో ఉంటానంటే ఎవ్వరూ మాట్లాడలేదు . నా భర్త  మూడు సంవత్సరాల క్రితం చనిపొయ్యాడు  . ఇపుడు నన్ను నేను చూసుకోడానికి భయం వేస్తోంది . అందుకని నాకు తోడు గా హనుమంతుని ఫోటో  పెట్టుకున్నాను (ఆఫొటోలన్నీ తీసివేసి) . ఆయనే నాకు ఇప్పుడు తోడు . నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు . నా విచారానికిఆయనే  ఓదారుస్తాడు . నాతో ఎప్పుడూ ఉండే ఆయనను ఎప్పుడో నా పర్సులో పెట్టుకోవలసిన ఆయనను నేను చాలా ఆలస్యంగా గుర్తించాను . ఇపుడు నేను ఆయనతో గడుపుతున్నాను . " 

 ఆ హనుమంతుడే మాకులదైవం నాకు కొండంత ధైర్యం ఇస్తాడు నా కలలోకి వచ్చి నన్ను నీ  కొడుకు అనుకోవమ్మా నీకు అన్నీ దగ్గరుండి సహాయం చేస్తాను అంటూ ఉన్నాడు కలలో. ఇది బాబు ఈ జీవితం ఇంకా ఎన్నాళ్ళో ......  ఈ ప్రయాణం ఇంకా ఎన్నాళ్ళో ....
అనుకున్నాడు మాధవ్ ..... ..... ....
   .--(())--
 .ఈ కధ ఇంకా ఉంది ... 4

మీ అమూల్యమైన అభిప్రాయలు షేర్ చేసి తెలపగలరు ఒక నిరుద్యోగ యాత్రకు ..  

1 comment: