Tuesday, 15 September 2020

నిరుద్యోగి ప్రయాణం -11 నుంచి 15 (రోజువారి కధలు )


నిరుద్యోగి ప్రయాణం -15 (రోజువారి కధ ) 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ,

నెమ్మదిగా నడుస్తున్నాడు మాధవ్ 

గురువుగారు ఏమిటి అంత దిగులుగా ఉన్నారు అని అడిగాడు మాధవ్ 
ఎవరు నీవు 

నాకు గుర్తు రావటం లేదు, సులోచనాలు వచ్చినాయి, గుర్తు పట్టలేక పోతున్నాను. మీరు పాఠాలు చెప్పారు, నేను సరిగా చెప్పఁలేకపోతే కొట్టారు. 
కొట్టి ఉంటా బాబు ఎదో బతుకు తెరువుకోసం మిమ్మల్ని బాధ పెట్టి ఉంటా
ఈ మందులు కొనుక్కుందామని వచ్చాను
ఈ రాతలు అర్ధం కావటం లేదు
గురువు గారు నేను మందులు తెస్తాను డాక్టర్ చీటి  ఇవ్వండి, ఇదిగో ఈ ప్రక్కన ఉన్న బల్లపై కూర్చోండి. బాబు ఎక్సపైర్ డేట్లు చూసి మరి తే బాబు 
ఇదిగో డబ్బులు తీసుకో 
వద్దండి నాదగ్గరున్నాయి నేను కొని తెస్తాను 
చూడు బాబు    
నా శిష్యులలో ఎందరో మంచి ఉద్యోగాస్తులుగాఉన్నారు " మంచి దేహధారుడ్యము, అందమైన భార్య, పేరు ప్రతిష్టలు, మేరు సమానమైన ధనం ఉన్నా,"  గురువు ను గుర్తించలేని స్థితిలో ఉన్నారు. నీవు గుర్తించి నందుకు సంతోషముగా ఉంది బాబు .            

అంతమాటనకండి
 
భార్య, ధనము, పిల్లలు, వారి పిల్లలు, ఇళ్ళు, బంధువులు, గొప్ప వంశంలో జన్మ ఉన్నప్పటికి మిమల్ని నిర్లక్ష్యం చేయటం తప్పే, అందరూ అలాంటి వారు కారండి. నాలాంటి వారు కూడా ఉన్నారు.  
ఇదిగో నండి మీరు కోరిన మందులు తెచ్చాను. 
అవును నీపేరేమిటి అన్నావు 
మాధవ్  
అవును బాబు నాలో అహం పెరిగింది అనుకుంటా " ఆరు వేదాంగములు (శిక్ష, చందస్సు, వ్యాకరణం, నిరుక్త, కల్ప, జ్యోతిష్య), నాలుగు వేదాలు, గద్య పద్య రాయగల జ్ఞానం ఉన్నానేను ఆశగా బతుకుతున్నా కాని  తెలుగు భాషనే బోధనా భాషగా తీసేస్తున్నారు. నాలాంటి పండితులు ఎందరో బాధపడే స్థాయి గూర్చి ఆలోచిస్తూ నడుస్తున్న అందుకే నిన్ను గుర్తు పట్టలేదు. 

అవును గురువుగారు " స్వదేశంలో చదివి హోదా పలుకుబడి, అందరూ మెచ్చే గుణము, మంచి జీవితం ఉన్నా  విదేశాలలోకి వెళ్లి  మన భాషను తక్కువ చేసే వారు ఎక్కవయ్యారు, మాతృ భాషను కోరే తలితండ్రులే కరువయ్యారు తెలుగు తల్లి ఆత్మ ఘోష తప్పక కలుగు తుంది. 

తప్పు బాబు అట్లా అనకు మారుతున్న కాలం బట్టి మనం మారాలి  

గొప్ప రాజులు మహారాజుల చేత సేవింపబడి, తెలుగు  ఖ్యాతి నలుదెశలా వ్యాపించి ప్రపంచమంతా  దయాగుణాన్ని పెంచి  ప్రశంస లందుకొన్న భాషను చులకన అవుతన్నదే అని బాధ.   

ఎదో ఈ ముసలివాడు చెపుతున్నాడని అనుకోకు భూమి గుడ్రముగా ఉన్నది. మరలా తెలుగు భాష వృద్ధిపరిచే రోజులు వస్తాయి 
  
భోగము, యోగము, ఇష్టము, అగ్నికార్యము, విషయ సుఖము, విత్తములపై నీ మనస్సు విరక్తి పొందినా మాతృభాష అనురక్తి వేరు బాబు. అమ్మ అంటే హృదయం ద్రవిస్తుంది నాన్న అంటే మనసే కరుగుతుంది.  
గురువుగారు మీరు ఎక్కడికి వెళ్ళాలి 
ఈ పక్క సందులో ఉంది బాబు మా యిల్లు
గురువుగారు మీ ఇంటిదాకా వచ్చి దింపుతాను, అసలే వర్షం వచ్చే సూచనలు వస్తున్నాయి 
నేను వెళ్తాను లేబాబు గొడుగు కూడా తెచ్చు కున్నగా పర్వాలేదు వెళ్తాను 
అట్లా అనకండి ముందు గొడుగు ఇవ్వండి నేను తీసి పట్టుకుంటా ముందు మీరు నడవండి  
అంతేనా 
అంతే     
 
వెలకట్టలేని మణులు, రత్నాలు, వజ్రవైఢూర్యాలు చేయలేని సహాయము నీవు చేస్తున్నావు చక్కని మాటలతో మనస్సు హాయిని నింపుతున్నావు. ఏతల్లి కన్నదో బాబు నిన్ను ఆశీర్వదించటం తప్ప నేను ఏమి సహాయం చేయలేను 
మీ ఆశీర్వాదాలు నాకు కొండంత బలం 
పద్యాలు చెపుతా విను బాబు, నెమ్మదిగా నడుచుకుంటూ పోదాము 
అట్లాగే గురువు గారు 

బ్రతికి నిద్ర నున్న - తెలివితో ఎదురున్న 
జ్ఞాన దీప మహిమ గానలేడు 
జ్ఞాని నిదురయందు కనునయ్య జాగృతిన్ 
గుర్తు లేని వాని బతుకు లాగ 

జ్ఞాన మిచ్చు ప్రజ్ఞ జవసత్త్వ మిచ్చును 
బ్రతుకు నందు స్ఫూర్తి భవిత నిచ్చు 
మంచి చేయుటందు మనసిచ్చి చెడుచూపి  
జ్ఞాన మయ్యె  బతుకు వేద మయ్యె 

విధ్యేన సదృశమ్ దానం నభూతో నభవిష్యతి 
తస్మా ద్విజ్జ్య విశేషేణ ధాతు విచ్ఛన్తి మానవా 

 విద్య దానమునకు సమాన మైన దానము లేదు, భూతభవిషత్తు కాలంలో అంతకు మించిన దానం లేదంటే అతిశ యోక్తి కాదేమో అందుకే విద్య సార్ధకతను సంతరించు కుంటుంది.
చూడు బాబు ఇంటిదాకా వచ్చావు భోజనం చేసి వెళ్ళు బాబు 
అట్లాగే గురువుగారు మీ మాట ఎప్పటికీ శిరసావహిస్తా 
భోజనం చేసి ఆది దంపతులగు "గురువు గురుపత్నికి " పాదాభి వందనమ్ము చేసి బాయలు దేరాడు మాధవ్ . 

--(())--

నిరుద్యోగి ప్రయాణం -14 (రోజువారి కధ ) 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ,
నెమ్మదిగా నడుస్తున్నాడు మాధవ్ 

అదే రోడ్డున ఒక పెద్ద మనిషి మాధవ్ ని ఆపి నీకు బుద్ది అసలు ఉందా అన్నాడు 

ఇప్పుడు నేను చేసిన తప్పు ఏమిటి అని అడిగాడు 

ఇలా రోడ్డు వెంబడి తిరిగే బదులు ఏదైనా ఉద్యోగం చేయవచ్చుకదా 

మీరు ఉద్యోగం ఇస్తారా 

ఏ ఉద్యోగమైనా చేస్తాను 

అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను సమాధానము చెప్పు 

నీకు కోటి రూపాయలు నేను ఇస్తే, ఏమి చేస్తావ్ అని అడిగాడు. 

గంటలో ఖర్చు చేసి నీకు చూపిస్తా 

డబ్బులు ఇస్తావా అన్నాడు 

వెంటనే జంకుతూ 

ఎట్లాఖర్చు చేస్తావో ముందు  చెప్పు అన్నాడు 

ధైర్యం ఉంటె ఇవ్వు, చేతకాని మాటలు చెప్పకు అన్నాడు మాధవ్  

చేతిలో డబ్బు లేకపోతే ఇంట్లో ఉన్న కూరగాయలు తినేసి ఊరుకుంటావ్..జేబునిండా డబ్బు ఉంటే స్టార్ హోటల్‌కు వెళ్లి అవే కూరగాయలు తిని ఆనందిస్తావ్..! అది డబ్బు ఖర్చు కదా ?

డబ్బు లేని రోజున ....సైకిల్ మీద ఆఫీసుకు వెళతావ్...డబ్బులు ఎక్కువైతే అదే సైకిల్ ఇంట్లోనే ఎక్కి ఎక్కర్‌సైజ్‌లు చేస్తావ్..., ఆధునిక పరికరాలు వాడి డబ్బు దుర్వినియోగం చేయటం కాదా ? 

డబ్బులు లేనప్పుడు సంపాదన కోసం చెప్పులు అరిగేలా నడుస్తావ్...డబ్బు ఎక్కువైతే పెరిగిన కొవ్వు కరిగించుకొనేందుకు నడుస్తావ్..., రోజుకొక షూ వాడతావ్, చెప్పులు లేని వాణ్ని చూసి ఈర్ష్య పడుతావు ఇది కూడా డబ్బు మయము కాదా ?   

డబ్బు లేనప్పుడు కుదురుకొనేందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటావ్ డబ్బు ఎక్కువయినప్పుడు విడాకులు కావాలనుకుంటావ్ ...డబ్బు ఖర్చు చేయలేక సతమవుతావు కాదా ?

డబ్బు లేనప్పుడు ....నీ భార్య నీ సెక్రటరీ అవుతుంది....డబ్బు ఎక్కువైతే ....నీ సెక్రటరీయే భార్య అవుతుంది....అంటే బుద్ధులు మరి పోతాయి ఇది నిజము కాదా? 

డబ్బు లేనప్పడు ....సంపన్నుడిలా నటిస్తావు...డబ్బు ఉన్నప్పడు ....నిరుపేదలా నటిస్తావు...,బిచ్చం వెయ్యటానికి కూడా వెనకాడుతావ్, డబ్బు లేనప్పుడు హాయిగా నిద్ర పోతావ్, డబ్బు ఉంటె నిద్ర పోలేవు కదా ?   

డబ్బు మహా చెడ్డది అంటావ్.. అయినా ....సంపదను పోగుచేయడం మానవ్..., ఎదో సాధించాలని తపనతో తిరుగు తుంటావ్ దీనికి అంతం లేదుకదా?

అందుకే 

మనిషీ ... ఓ! మనిషీ!! ఇలా నిన్ను నీవు మోసం చేసుకొనేందుకు ....ఏ రోజునా వెనకడుగు వేయవ్!

ఇది డబ్బు మహత్యం కాదా , డబ్బుతో ఏదైనా కొనవచ్చు అనుకుంటావు, కానీ మనసును కొనలేవు కాదా ?  

 జీవితంలో ఏది శాశ్వతం కాదు, డబ్బున్న అది నిన్ను బతికించదు, . మనకు కూడా మరణం ఉందన్న విషయం మరువకూడదు. కాదా ?

 అందుకే, బతికనాళ్ళు ఎవరిని ద్వేషించకుండా, అందరిని కలుపుకుంటూ, అందరితో సంతోషంగా జీవిస్తూ, అందరికి ప్రేమను పంచుకుంటూ, అందరి ప్రేమను పొందుతూ.., పెదవిపై ఎల్లప్పుడూ చిరునవ్వు ఉండేలా జీవించమంటున్నాను.ఉన్న డబ్బును సద్వినియోగము చేసి మనుషుల హృదయాలలో ఉంటె నీవు చనిపోయినా నిన్ను గుర్తించేవారుంటారు.  ...

ఇంతకీ కోటి రూపాయలు ఇస్తే ఏమి చేస్తావో చెప్పుట లేదు 

నీవు ఇచ్చే డబ్బు ధర్మపరమైన సంపదనైతే వెంటనే ఖర్చు చేసి లెక్క చూపుతా, అదే అధర్మ పరమైతే ఖర్చులు లెక్క చూపే అవసరము లేదు. 

నీది ధర్మ సంపాదన ? అధర్మ సంపాదన నిర్ధారణ చేసి చెప్పు ?

అదేమి నేనెట్లు చెప్పగలను 

చెప్పలేనప్పుడు ఎవ్వరిని చులకన చేయకు, ప్రశ్నించకు ఇదే నా సలహా .....

అంటూ బయలు దేరాడు మాధవ్  చెప్పి ..... ....

నీకో విషయం చెపుతా కష్టంతో వచ్చే డబ్బు ఖర్చవు చేసిన సుఖము ఉంటుంది, ఉచితంగా వచ్చిన డబ్బులో భయము అనుమానము వచ్చి మనసు లేక తిప్పుతుంది కాదా   

--(())--     


Buy art prints of this Nandalal Bose Paintings art inscribed with his wise quotes on Tallenge Store and showcase patriotism. Available as framed prints, canvas art wraps and table top easel art. Best Prices. Free shipping. Cash on Delivery.

ప్రాంజలిప్రభ - అంర్జాల పత్రిక 
నిరుద్యోగి ప్రయాణం -13 (రోజువారి కధ ) 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ,

మాధవ్  నెమ్మదిగా నడుచు కుంటూ వెళుతున్నాడు అప్పడే ఒకరు కారులో వచ్చి మాధవ్ ను ఆపి  ఒక దండ తెచ్చి మేడలో వేసాడు విద్యార్థి నాయకుడు " మాధవ్ " జిందాబాద్ 

నేను నాయకుడ్ని కాదు 

అది తెలుసు కాని మాకు ఒకరు కావాలి నీవు ఖాళీగా దొరికావ్ మేము చెప్పినట్లు నీవు చెప్పాలి అంతే 

నీవు మైకులో మాట్లాడాలి మాగురించి 

అసలు మీరెవరు 

మాగురించి ఈ కాగితంలో ఉన్నాయి అన్ని చదువు కో 

నీకు ఉపన్యాసము చెప్పినందుకు కొంత డబ్బు ఇస్తాము 

అసలు మీరెవరు 

కొద్దిక్షణాలు విద్యార్థులను ఉపన్యాసంతో ఆపాలి, వాళ్ళ నాయకుడు రాలేదని ఒకటే అరుపులు మొదలైనాయి 

సభ అంతా రసా బాసము అవుతుంది

అయితే నాకుతోచినది చెప్పఁగలను 

మీరు ఏమి చెప్పినా అభ్యంతరము లేదు ఒక గంట ఆప గలిగితే చాలు అన్నారు 

మాటకు కట్టుబడిన మాధవ్ గురువుగారు చెప్పినవే చెప్పాలనుకున్నాడు 

మీ అందరి సమక్షమున మొదటగా పంచ భూతములకు నమస్కరిస్తున్నాను, తల్లి తండ్రులకు గురువులకు, ప్రేక్షక మహాశయులకు, ఎందరో మహాను బావులకు అందరికి వందనాలు అన్నాడు మాధవ్ 

అంతే ఒకటే  చెప్పఁట్లు     

విద్యార్థి దశ కత్తికన్నా పదునైనది, నాలుక అంతకన్నా పదునైనది,  ఎందుకంటే ఈ నాలుక తో మనుషులు ఇతరుల మనస్సును, వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తుంది. అందువల్ల ప్రతిఒక్కరు మాట పొల్లు పోకుండా జాగర్తగా ఉండాలి. ఒక్క మాటవళ్ళ ఎన్నో కుటుంబాలు నాశనమైనట్లు తెలుసు, పూజకు నాలుకే, తిట్టుకు నాలుకే అలాగే కత్తి చంపు కోటానికి, మనిషి  బతికించటానికి ఉపయోగ పడుతుంది. 

అందుకే మాట గుట్టుగా ఉండి ప్రేమ పట్టుగా ఉండాలి, విద్య చేయి పట్టుగా ఉండాలి   అన్నారు పెద్దలు    

అంతే ఒకటే  చెప్పఁట్లు 

సమయ మన్నది మరువలేనిది,  సందర్భాను సారం సమయ ఫలితం ఉంటుంది. మనకు అత్యంత దూరంలో వున్నది గడిచి పోయిన కాలం.ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని తీసుకు రాలేము, ఆ కాలంలోకి వెళ్లలేము. అందుకే వున్న ఈ సమయాన్నే మంచి పనులకు సద్విని యోగం చేసుకోవాలి. ఎంత డబ్బు వున్నా కూడా మనం గడిచిన కాలంలోకి వెళ్లలేము.

అందుకే కాలాన్ని దుర్వినియోగము చేస్తే జీవితం నాశనమై పోతుంది. కోటీశ్వరుడవ్వాలన్న, బికారిగా మారాలన్న, ఒక్క నిముషము చాలు అన్నాడు మాధవ్  

అంతే ఒకటే  చెప్పఁట్లు   

ఈ ప్రపంచాన్ని నడిపించేది సూర్యుడు, భూమి, గురువు, తల్లి తండ్రులు అని చెపుతారు అవేమి కావు.  మనం చేసిన, చేస్తున్న పాప పుణ్యాలు మాత్రమే మనల్ని మన కుటుంబాలను రక్షించుతాయి. అందుకే మనం చేసే ప్రతి పనిలో ఏది పుణ్యమో, ఏది పాపమో తెలుసుకొనే బుద్ధి మనకు పరమాత్ముడిచ్చాడు ఆశలకు పోక వత్తిడిలకు లొంగక నిజాయితిగా నిజము చెప్పి బతకండి      

అంతే ఒకటే  చెప్పఁట్లు 

అసలు ఈ ప్రపంచములో అత్యంత కఠినమైనది బరువైనది ఏమిటో తెలుసా  

చాలామంది, వజ్రము, ఇనుము, ఏనుగు అని అంటారు ఇవేమి కావు " కఠినమైనది అనేది "మాట ఇవ్వడం" మాట ఇవ్వడం తేలికే కానీ నిలబెట్టు కోవడమే చాలా కష్టం. 

ఇచ్చిన మాటను నిలబెట్టుకొన్నవాడు పురాణాల లో హరిచంద్రుడు, శ్రీ రామ చంద్రుడు, శిబి, బలి చక్రవర్తి   అని తెలుసు  కలియుగంలో కూడా అలాంటి వాళ్ళు  ఉండొచ్చు.  

నాకు  ఈ సమయం ఇచ్చిన పెద్దలకు, విద్యార్థులకు నమస్కారాలు 

ఇంకా మాట్లాడాలి అంటూ అరిచారు ప్రేక్షకులు, విద్యార్థి నాయకుడు మాధవ్ జిందాబాద్ అని అరిచారు     

సరే మీ మాటలకు ఏకీభవిస్తాను 2  నిముషాలు మాట్లాడుతాను, తర్వాతి వారికీ అవకాశ మివ్వాలి

మీరందరు క్రమశిక్షణ పాటించే విద్యార్ధులు అవునా అన్నాడు మాధవ్ 

అవును అవును అన్నారు.    

మీకో విషయం చెప్పాలి మనకు దగ్గరగా ఉండేవారెవరు 

తల్లి తండ్రి గురువు పిల్లలు అని అనుకుంటారు కానే కాదు మనకు దగ్గరగా ఉండేది మన చావు.

అందరూ దూరమైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు చావు అనేది ఖచ్చితం.

అది పుట్టుకతోనే మనవెంట వచ్చింది. అందుకే మన కర్తవ్యం దేశసేవకు అంకితం, మన వల్ల ఒక్కడన్నా బాగుపడాలి నష్ట పోకూడదు, ఎప్పుడో వచ్చే మృత్యువు గూర్చి ఆలోచించకు. చచ్చినా  బతికినా సింహాల్లా బతకాలన్నారు మాగురువుగారు అన్నాడు మాధవ్ 

అంతే ఒకటే  చెప్పఁట్లు 

ఇక పొతే,  ప్రపంచంలో తేలికైనది అనేది ఒకరిని చూసి వ్యంగ్యంగా మాట్లాడడం. బీదరికాన్ని ఎగతాళి చేయటం, కులాన్ని చులకన చేయటం. ప్రపంచంలో సులువైనది అనేది మరొకరి మనస్సును విరగ్గొట్టడం, ఇంతకంటే సులువు ఏదీ లేదు. ఎవరు ఎవరికి తక్కువ కాదు ప్రతి ఒక్కరిలో ఎదో ఒక కళ దాగి ఉంటుంది అది వెలికి రావటానికి కొంత సమయము పడుతుంది అందువల్ల ఎవరన్నా తక్కువ చేసిన అధైర్యపడక జీవితాన్ని సాగించాలి. పిరికి వాడిలా బతక కూడదు అన్నాడు మాధవ్.     

మీ కందరికి మరొక్క సారి నమస్కరిస్తున్న మీరనుకున్నట్లుగా విద్యార్థి నాయకుణ్ణి నేను కాదు, మీ విద్యార్థి సమస్యలగురించి మీ నాయకుడు మాధవ్ మాట్లాడుతాడు, నేను  ఉద్యోగం కోసం బయలుదేరిన మీ లాగా చదువుకున్న విద్యార్థిని. మీ నాయకుడు మాధవ్ వచ్చాడు మాట్లాడుతాడు నాకు సెలవు ఇప్పించండి అంటూ స్టేజి నుండి దిగాడు మాధవ్ . 

మీరు చాలా బాగా మాట్లాడారు ఇదిగో ఈ పైకము ఉంచండి అన్నారు. నాకు ఏమీ ఇవ్వకండి మీ ఆదరణ నాకు సంతోషము కలిగినది చాలు అన్నాడు మాధవ్ . 

మీరేమన్న ఇవ్వాలనుకుంటే రాత్రనక పగలనక దేశ సేవ చేసే వీరసైనక నిధికి పంపండి అదే నేను కోరుకొనేది 

అట్లాగే 

చూడండి నేను సాటి  విద్యార్ధులను ఉత్తేజపరిచి సక్రమ మార్గాల్లో నడవాలని చిన్న ఆశ మాత్రమే 

ఇంకా ఉంది ...14 

కధలు మీకు నచ్చితే షేర్ చెయ్యండి, స్నేహాన్నిపెంచుకోండి కధ ఇలా సాగిపోతుంది నిరుజ్యోగి యాత్ర  

--(())--  

   --(())-- 


ప్రాంజలిప్రభ - అంర్జాల పత్రిక 
నిరుద్యోగి ప్రయాణం -12 (రోజువారి కధ ) 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ,

మాధవ్ నడుస్తూ ఉంటె 

ఒరేయ్ మాధవ్ నేను నీ చిన్న నాటి స్నేహితున్ని మరిచావా 

నాకు గుర్తు లేదు మీ రెవరో చెప్పండి 

మీ ఇంటి వేప చెట్టు దగ్గర మనము ఆడుకొనే వాళ్ళం 

గుర్తు రాలా 

పర్వాలేదు నీవు మాత్రం నాకు బాగా గుర్తు అందుకనే పిలిచా 

ఇంతకీ ఏమిటి విషయం 

ఏమి లేదు ఊరికినే పిలిచాను అంతే

ఊరికే ఎందుకు పిలవటం డబ్బు లిస్తానని పిలవచ్చు కదా 

ఏమిటీ నేను నీకెప్పుడు బాకీ ఉన్నాను 

మర్చి పొయ్యవా 

మనం వ్యాపచెట్టు క్రింద ఆడె టప్పుడు నీవు పక్కింట్లో పరుశు తెమ్మన్నావు 

నేనా 

ఆ నీవ్వే  

నేను తేలేదు అనుకుంటా 

తెచ్చావు గుర్తు తెచ్చుకో 

ఆ పర్సులో డబ్బు లేదు ఓ ఉత్తరం ఉంది 

అవును ఇప్పుడు గుర్తొచ్చింది 

అది ప్రేమ లెటర్ 

అవును అదే ప్రేమ లెటర్ 

నాకు ఇంకా గుర్తు ఉంది 


" సీతారాములు కాలేజీలో చేరారు, అక్కడ నవ్వుల మధ్య చదువు నత్తనడక సాగుతున్నది. 

సీత మాత్రం అందరిలో ఒక మణి పూసగా ఉన్నది, హుందాతనంతో వన్నెతెచ్చే  విధంగా మృదు మధుర పలుకులతో గురువుల సైతం ఆకర్షణకు లోనైనది. 

దృఢ సంకల్పంతో చదువుతున్నది అప్పుడే ఎవరో లెటర్ ఇచ్చారు, చదవటం ప్రారంభించింది సీత.

పండు వెన్నెల కాంతివా, నిండు పున్నమి బ్రాంతివా, అంబరంలో మెరిసే మెరుపువా , తల్కు తల్కు మెరిసే తారవా, ఉదయపు కిరణానివా, ఇదే నా సుప్రభాతం 


"నులు వెచ్చని సమయంలో శీతల పవనంలా కమ్మాలని ఉంది 

పున్నమి జాబిలి వెన్నెలలో జాము రాత్రి గడపాలని ఉంది

చిగురాటాకుల సవ్వడిలో తన్మయత్వం చెందాలని ఉంది

పూల  పరిమళాలతో     పరవసించి పోవాలని ఉంది      

ఎదను ఎందుకు మీటావు హృదయతాపము ఎందుకు పొందుతావు 

అందుకో అధరాలు  నీవు పిలిచేవరకు వేచి ఉండే 

 నీ రావణ కాదు రామ చదివి చింపేసింది సీత 

గుర్తుంది 

భలే చెప్పవే ఇది గుర్తు లేదా అని చెప్పఁటం మొదలు పెట్టాడు మాధవ్ 

  

ప్రణవ పీఠము ఎక్కువా గొల్వ నిన్ను 

ముందు నాదేవి అయినావు భయము వలదు 

భావమును తెల్పి విజ్ఞత చూపు చున్న 

సరణి నీవైకిరిని మార్చు  నన్ను చూడు 


బ్రహ్మయేమన ఏకము సమము తెల్పె 

మనసు గమనించి అర్ధము చేసు కొమ్ము 

కనక హారము నీకొరకు కొని ఉంచ 

కమ్మ నైనకలలనుతీర్చు కొను చిలక 


దొండ పండుపెదవుల దానఉగ నీవు 

మించు మోవి సొబగులతొ నన్ను చేరి 

మధురమగు ఖంఠ ముకలిగి మత్తు పెంచి 

మన్మధుని నాలొ పిలిచావు హృదయ చిలక 


బాబు నన్ను క్షమించు 

నీవు నా స్నేహితుడవు కావు, ఎదో పొట్ట కూటికి నాలుగు మాటలు చెప్పి వారు ఇచ్చే పైకము కొరకు ఆశపడి వాడిని అంతే కాని నేను మోసగాడ్నికాను. 

అవును నీవు నాస్నేహితుడవు కావని నాకు తెలుసు 

అందుకే నిన్ను క్షమించు తున్నాను. 

ఇది కూడా మోసమే పరులను మాటలలో ఉంచి దోచుకోవటం కాదా 

అవును అని తల ఊపాడు

మాటల్లో ముంచి బార్ కెళదామా, అంటావు బాగా త్రాగించి జేబులో ఉన్నవి దోచి ఉడాయిస్తావు. 

అవునా 

అవును అని తల ఊపాడు 

ఇంకెప్పుడు ఇలా మనుష్యులను మోసం చేయకు 

నన్ను క్షమించు బాబు ఇక నేను వస్తాను 

ఈ రోజు నాకు పస్తే అంటూ గొనుకుంటున్నాడు

ఆగు 

నేను చెప్పి నాటు చేస్తావా 

చేస్తాను, ఇంకెప్పుడు మోసం చెయ్యను 

సరే ఉండు అంటూ  

సైకిల్ షాపువద్దకు పోయి లోపల ఉన్న వారిని కలసి మాట్లాడాడు 

షాపువాడు వచ్చి మిమ్మల్ని పనిలోకి రమ్మని పిలిచాడు అని చెప్పాడు మాధవ్ 

నాకు పని ఇచ్చాడా 

ఇచ్చాడు బుద్ధిగా చేసుకో 

నెమ్మదిగా మాధవ్ కదులుతూ సాగి పొయ్యాడు 

లోకంలో ఎలాంటి వారు ఎందరో మరెందరో వారిని మార్చాలి దేశపురోభివృద్ధికి తోడ్పడాలి కదా 

కదా ....... కదా  అవును అంటూ అంతర్వాణి పలుకులు 

                       ఇంకా ఉంది ...12 

కధలు మీకు నచ్చితే షేర్ చెయ్యండి, స్నేహాన్నిపెంచుకోండి కధ ఇలా సాగిపోతుంది నిరుజ్యోగి యాత్ర  

--(())--  

No photo description available.

 

ప్రాంజలిప్రభ - అంర్జాల పత్రిక 
నిరుద్యోగి ప్రయాణం -11 (రోజువారి కధ ) 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ,

మాధవ్ ఒక ఇంటి ముందు ఆగాడు ఆఇంటిలో పోట్లాట జరుగు తుంది ఎందుకో అర్ధం కాలేదు.
తర్వాత తెలిసింది.  భర్త ఎప్పుడు పూజాపునస్కారాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు అవి భార్యకు ఇష్టం లేదని అర్ధం అయ్యింది. 
భార్య అంటున్నది 
మనం కొత్త పద్ధతిలో పోవాలి, ఈ ఆచారాలు కూడు పెట్టవు
అవునే మనం ఎంత సంపాదించినా పిడికెడు అన్నమే తినేది, మనశాంతి ఉండదే, 
అది కాదండీ పిల్లలు పైకి వచ్చారు వారి అచ్చట ముచ్చట ఎవరు తీరుస్తారు. 
నీవు నేను తీర్చేది ఏమి ఉండదు, కర్మాను సారం బిడ్డలు వారి భవిషత్తు మనకు తెలిసినంత వరకు మంచే చేస్తున్నాము కదా. 
ఇదిగో ఆదేవతా విగ్రహాలు పట్టుకొని కూర్చుంటే లాభం లేదు. 
అట్లాఅనకే 
అప్పుడే మాధవ్ లోపలకు వచ్చాడు 
నమస్కారమండి 
ఎవరు బాబు నీవు అని అడిగింది 
మీ సంభాషణ విన్నాను ఒక కధ చెపుతాను వినండి అన్నాడు. 
ఏమిటీ నీవు మాకు కదా చెప్పేంత వాడువా అన్నది ఇల్లాలు
ఎదో నా మనసు ఊరుకోక ఎదో చెబుదామని ఆలోచించా అంతే 
వెళ్లొస్తానండి 
అసలు నిన్నెవరూ పిలిచారు 
ఆగవే అతనేదో కథే గా చెప్పేది 
నీకు నాకు నష్టం లేదుగా అన్నాడు 
చూడు బాబు అలా కూర్చో, 
మంచినీళ్లు కావాలా
ఇవ్వండి, నీరు త్రాగక కధ చెప్పటం మొదలు పెట్టాడు            
       
ఒక ఊర్లో ఒక శాస్త్రి గారు వుండేవారు ఆయన పరమ నిష్ఠాగరిష్టుడు. వాళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తున్న శివ పంచాయతనం వుండేది. శాస్త్రి గారు రోజూ నమకచమకములతో అభిషేకము చేసి శ్రద్దగా పూజచేస్తూ వుండేవారు.

ఒకరోజు వాళ్ళ ఇంటి ఆవిడ గారెలు చేసి, వాళ్ళ పాలేరు కు నాలుగు పెట్టినది. వాడు కమ్మగా తిని, అమ్మా ఇంక నాలుగు వడలు పెట్టు అమ్మా అన్నాడు. ఇంటి ఆవిడ “లేవురా అయిపోయినాయి” అన్నది. అదేంటి అమ్మగారు ఇంట్లో ఇంకా 23 గారెలు పెట్టుకొని లేవు అంటారు అని అన్నాడు.
ఆవిడ వంటింట్లోకి వెళ్లి లెక్క పెడితే సరిగ్గా 23   గారెలు వున్నాయి. నీకెలా తెలుసురా అని అడిగినది తెలుసులెండి అని వాడు అన్నాడు. ఈ విషయాన్ని తన భర్త కు తెలిపినది ఆ మహా ఇల్లాలు. శాస్త్రి గారు పాలేరును నిలదీసినాడు ..నీకు ఎలా తెలుసు అని. తెలుసు లెండి గురువు గారు అన్నాడు. వదల లేదు శాస్త్రి గారు. అదొక విద్య లెండి నాకు మా అయ్య నుంచి వచ్చినది,
నాకు ఒక యక్షిణి చెవులో చెబుతుంది ఇదంతా అన్నాడు.

ఆ రోజు రాత్రికి శాస్త్రి గారికి నిద్ర పట్టలేదు. ప్రక్క రోజు పాలేరును అడిగాడు. ఒరేయ్ ఇన్ని రోజుల
నుంచి నేను పూజ చేస్తున్నాను, నాకు ఏ విద్య రాలేదు, ఏ శక్తి రాలేదు, నీకు ఈ విద్య ఎలా వచ్చినది? ఆ మంత్రము ఏమిటో నాకు చెప్పరా అని అడిగినాడు.

విధి లేక పాలేరు ఆ మంత్రాన్ని (కర్ణ పిశాచి)
మంత్రమును గురువు గారికి చెప్పినాడు. ప్రక్క రోజు గురువు గారు శ్రద్దగా ఆ మంత్రాన్ని
పఠించినాడు. కర్ణ పిశాచి ఇంటి బయట నుంచి పలికినది.
శాస్త్రి గారూ అని పిలిచినది. ఏమి కావాలి అని అడిగినది.
గురువు గారు ఇంట్లో నుంచి ఎవరూ అని అడిగినాడు. నేను కర్ణ పిశాచిని (యక్షిణి) మీ ఇంట్లోకి
రావాలంటే ఆ పూజా మందిరములోని దేవతా మూర్తులను బయట పడెయ్యండి, నేను లోపలి
వస్తాను అని అన్నది. శాస్త్రి గారి గుండె గుభేలు మన్నది. అప్పుడు అర్ధమైనది. ఒరేయ్ మా ఇంట్లో పూజా మందిరములోని దేవతా మూర్తులు ఎంత శక్తి వంతమైనవో, వాటి వలనే గదా ఈ పిశాచము లోనికి రాలేదు. ఇలా ఎన్ని రోజుల నుంచి నన్ను నా కుటుంబాన్ని దుష్ట శక్తుల నుంచి కాపాడు తున్నాయో గదా, ఇన్నాళ్ళు నాకు తెలియ లేదు, పెద్దలు ఇచ్చిన నిజమైన ఆస్తి ఇదే కదా అని, నీవూ వద్దు, నీ మంత్రము వద్దు అని ఆ పిశాచాన్ని వెళ్లి పొమ్మన్నాడు. తన పూజా మందిరములోకి వెళ్లి ఆ పరమ శివుని కాళ్ళ మీద పడి కృతజ్ఞతతో “ ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ నమః” అని చెంపలు వేసుకొన్నాడు. మంత్ర
విద్య వున్నది నమ్మకము శ్రద్ధ అవసరము దేనికైనా.

పూజా మందిరములో వున్న విగ్రహాలు పాతవైనా, అరిగి పోయినా మీ తాత ముత్తాతలు పూజించినవి అవి. వాటిల్లో ఎంతో శక్తి దాగి వుంటుంది. వాటిల్ని పారేయకండి. భక్తితో ఒక్క పుష్పం పెట్టండి. అవి చైతన్య మౌతాయి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతాయి.

అమ్మ నేను చెప్పేంత వాడిని కాను, మానవుడు తనప్రయత్నం చేయటమే ఫలితం ఆశించకూడదు, అంతా ఆ పరమేశ్వరుడు చూసుకుంటాడు, అంతా ఆ పరమేశ్వరుడు చూసుకుంటాడు, అంటూ బయటకు నడిచాడు 
అప్పుడు భార్య నేను తప్పుగా మాట్లాడానండి, నన్ను క్షమించండి 
మనిద్దరిమధ్య క్షమాపణలు దేనికే 
ఆ పరమేశ్వరుని ప్రార్ధిస్తూ ఈ శేషజీవితం ఎటువంటిఆశలు లేకుండా సాగితే చాలని వేడుకుందాం 
అట్లాగే 
ఓంనమ:శివాయ   ఓంనమ:శివాయ  ఓంనమ:శివాయ 
--(())--
 
                                                                                   ఇంకా ఉంది ...12 
కధలు మీకు నచ్చితే షేర్ చెయ్యండి, స్నేహాన్నిపెంచుకోండి కధ ఇలా సాగిపోతుంది నిరుజ్యోగి యాత్ర  

No comments:

Post a Comment