నిరుద్యోగ ప్రయాణం 16వ రోజు (రోజు వారికధ)
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మాధవ్ నెమ్మదిగా నడుస్తున్నాడు
ఒక ఇంటి వద్ద ఒకటే ఏడుపు వినబడుతుంది
ఎందుకో అర్ధం కాలేదు
లోపలికెళ్ళి అడుగు తామంటే నీకెందుకు అనే తత్త్వం గల మనుషులు, కనీసం సహాయం చేద్దామని కూడా అనుకోరు. ఇంకా వారంటారు
ఇది రోజు జరిగే భగవతమేనండి మీదారి మీరు వెల్ల మనే వారున్నారు
ఎందుకైనా మంచిది అని మాధవ్
అక్కడున్న ఇంటోలోపలికి వెళ్లి ఎవరు ఇంట్లో అన్నాడు
ఒక మధ్య వయస్సు గల స్త్రీ ఏడుస్తూ వచ్చింది
ఏంజరిగిందమ్మా
ఏమని చెప్పేది బాబు
మావారికి ఎదో రోగం వచ్చింది అది ఇంతకీ తగ్గలేదు
డాక్టర్కి చుపించ బొయ్యారా
అందరికీ చూపించాం బాబు " నాపుస్తెలు బంగారం వెండి వస్తువులు అమ్మి 2 ,౦౦,౦౦౦ తెచ్చాడు మా అబ్బాయి
మరింకేమ్మ మందులు వాడొచ్చుగా
ఆ డబ్బు 5 రోజులు హాస్పటల్ ఖర్చుక్రింద అయి పోయింది, ఇక్కడ తగ్గే సూచనలు లేవు, నీవు డబ్బు కట్టలేవు, అని ఇంటికి పంపించారు. ఆక్సిజన్ పెడితే గాని బతకడుట
అట్లా ఇంటికి తెచ్చేస్తే బతికే దెట్లా
మా అబ్బాయి దగ్గరకు వెల్దామంటే, వాడు చిన్న రూమ్లో ఉంటాడుట, అసలే నాన్నకు రోగం వచ్చింది, నాకు షాపుల్లో జీతాలివ్వట్లా
నా పరిస్థితి తిండికి కరువైనది అమ్మా అని ఉత్తరం వ్రాసాడు
బంధువులు, చుట్టుప్రక్కవాళ్ళు అడగవచ్చుకదా సహాయం చేస్తారేమో
మీ ఇంట్లో రోగం ఉంది మేము రాలేము అన్నారు బాబు.
వెంటనే మాధవ్ అంబులెన్స్ కు ఫోన్ చేసాడు
అంబులెన్స్ వచ్చింది మరలా హాస్పటల్ కు తీసికెళ్ళాడు రోగిని
మానవ ప్రయత్నం చేద్దావమ్మా నీ అదృష్టం ఎలావుందో నేను చెప్పలేను.
నాకు తెల్సిన హాస్పటల్ చేరుస్తా
వారు నీకు పేషేంటుకు భోజనం పెడతారు, అవసరమైన మందులు వాడుతారు, నీవేమి భయపడకు
మనిషిని సగం భయమే కుంగతీస్తుంది అన్నాడు మాధవ్
అమ్మా ప్రతి ఒక్కరికి భాధలు ఉంటాయి.వాటిని ఎదుర్కొనే శక్తి భగవంతుడు ఇస్తాడు
అంటూ మాట్లాడుతున్నాడు మాధవ్
సముద్ర తీరాన ఒక కుర్రాడు ఆడుకుంటూ ఉండగా ఓ చెప్పు కనిపించకుండా పోయింది.
అతను వెంటనే "ఈ సముద్రం మహా దొంగ"అని రాశాడు. అట్లాగే డాక్టర్లు అందరూ చెడ్డ వారు కాదమ్మా ఎవరో డబ్బు కోసం ఆశించేవారుంటారు.
కాస్తంత దూరంలో ఒక వ్యక్తి అదే సముద్రంలో వల వేసి చేపలు పట్టాడు. ఆ రోజు తాననుకున్న దానికన్నా ఎక్కువ చేపలు దొరకడంతో "ఈ సముద్రం గొప్ప దాత" అని రాశాడు. అమ్మా హాస్పటల్లో చేరినవారందరూ రోగం తగ్గి తిరిగి రాగలరు , అప్పుడు అందరూ మంచి డాక్టర అంటారు, .
ఇంకొక వ్యక్తి ఈదుకుంటూ ప్రమాదవశాత్తు మునిగి పోయాడు. అతని తల్లి ‘ "ఈ సముద్రం నా కొడుకులాంటి అమాయకులను పొట్టన పెట్టుకున్న మహమ్మారి " అని రాసింది. అట్లాగే మందు వికసించో, చిన్నతప్పు జరిగో చనిపోతే డాక్టర్ మంచి వారు కాదంటారు ఇదేనమ్మా లోకం
ఒక పెద్దతను సముద్రంలోకి వెళ్లి ముత్యాలు సేకరించి విజయవంతంగా ఒడ్డుకు చేరి ఆ ఇసుకలో ‘ఈ సముద్రం ఒకటి చాలు జీవితమంతా హాయిగా బ్రతికేస్తాను "అని రాశాడు. అట్లాగే అవసరానికి సహాయపడి తగిన అందులు వాడి ఉచితంగా సేవలు చేసే డాక్టర్లు ఉన్నారు అన్నాడు మాధవ్
అనంతరం ఒక పెద్ద అల వచ్చింది. వీరందరూ రాసిన మాటలను తుడిచి పెట్టేసింది.
అందుకే నమ్మా ఏపుట్టలో ఏ పామున్నదో తెలియదు. సముద్రం లా ప్రశాంతంగా బతకాలమ్మ.
ఇద్దరూ కలసి హాస్పటల్లో చేర్చారు.
మాధవ్ అమ్మా నీవు డబ్బు కోసం భయపడకు నాకు చేతనైన వరకు సహాయము చేస్తాను. నీవు దేవునిపై నమ్మకం పెట్టుకో అన్నాడు మాధవ్
మాధవ్ కూడా హాస్పటల్లో ఉండి అవసరమైన మందులు తెచ్చి ఇచ్చి, అమ్మకు కూడా ఆహారము తెచ్చి సహాయపడ్డాడు.
ఈ హాస్పటల్ రోగికి సరిఅయిన మందు పడుట వల్ల మూడు రోజుల్లో కోలుకున్నాడు
అమ్మా మీ వారు కోరుకున్నారు ఇక నీవు ఇంటికి తీసుకెల్లఁవచ్చు
అమ్మా ఈ డబ్బు ఉంచమ్మా నీదగ్గర అవసరానికి పనికొస్తుంది
అమ్మా నాకు శెలవు ఇవమ్మ
నిన్ను పొమ్మని చెప్పఁలేను, ఉండమని అనలేను,
బాబు నాలాంటి వారి కేందరికో నీ సహాయము అవసరము
ఇద్దరికీ నమస్కరించి బయలుదేరాడు మాధవ్
అమ్మా నేను నిమిత్త మాత్రుడను అంతా ఆ హరిలీల
ప్రజల దారిద్రం తొలగించేది హరి భక్తే వజ్రాయుధంబు
అజ్ణాణమనే అంధకారం తొలగించేది నీ భానూదయంబు
దుర్భుద్ధి మాపి ధర్మబుద్ధి పెంచేది నీ సేవ దావానలంబు
నిత్య అమృత తత్వం ఇచ్చేది నీ స్మరణ దివ్యౌషధంబు
--(())--
నిరుద్యోగ ప్రయాణం 17వ రోజు (రోజు వారికధ)
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఏమి సౌందర్యము ఏమి సౌందర్యము
ఏమిటండి పొద్దున్నే లేచి ఈ వేళాకోళం
నేను ఎందుకు వేళాకోళం చేస్తానే
అద్భుతముగా ఉంది
ఏమిటి
నీవు ముగ్గు వేసే పద్దతి
కాస్త నోరుమూస్తారా
ప్రకృతి వర్ణించటం తప్పు కాదు కదే
తప్పు కాదు
మీవేషాలు నాకు తెలవవా
ఎం తెలుసే
అబ్బా ఉండండి చుక్కలు తప్పు పడ్డట్టున్నాయి
" ఎంత చక్కగా నింగి చుక్కలు తెంపి తెంపి ముంగిలి నింపి ఎంత అద్భుతముగా ఉంచావు రాధా *
ఇదిగో మీరు వెళ్తారా, ముగ్గు ఆపేయ మంటారా
ఆ ఆ నేనే వెళ్తాను
* మగువ వేసిన ముగ్గు గృహముకు నిగ్గు, శుభ శకునములు తెల్పు సిగ్గు*
బొగ్గు కాదు మీకు పొద్దున్నే కవిత్వం పుట్టినట్టుంది అదియు నేను వేసే ముగుపై
ఆ ...
చూసావా ఆ మెలికలు తిప్పుతూ నీవు ముగ్గువేస్తుంటే
ఆ వేస్తుంటే
వేస్తుంటే * ముగ్గుల్లో మెలికలు, మెలికతో యంత్రాలు, దుష్ట శక్తులను తరిమినట్లున్నది గుమ్మంలోనే "
ఏమిటండి మీ యంత్రపు గోల
ఏమిటా
ఆ ఏమిటీ
* ముగ్గు సౌఖ్యము నిచ్చు, సిరులను కూర్చు, సదనపు వదనమున వెలుగు పంచు *
హమ్మయ్య ఒక మంచి మాట చెప్పారు, ముగ్గెన్దుకు దండగ అనకుండా
నే నెప్పుడు మంచి మాటలే చెప్తాను, నీవే అర్ధం చేసుకోవటంలో వెనకపడతావ్
వెనక పడటం ముందు పడటం మాటలు ఇప్పుడు అవసరమా
అదికాదే
ఏది కాదు
* ముగ్గులో మర్మాలు, ధర్మాలు, ధర్మాలు ధార్మికత చిహ్నాలు చెపుదామని *
ఇదిగో మిగిలిన ముగ్గు మీరు వెయ్యండి నేను వెళ్తా
అంత పని చేయకే
నా కసలు ముగ్గేయటం రాదు అన్నాడు
తినటం వచ్చా
గోరు ముద్దలు పెడితే
అబ్బా నీతో మాట్లాడట౦ నావల్ల కాదు
అసలు నీకు తెలుసా
ముగ్గులో * వ్యాయామ మిమిడుంది,అలరిస్తుంది, అతివ లారోగ్యాన్ని పెంచుతుంది
ఎం భక్తి లేదా .
ఎందుకు లేదు * ముగ్గు ధనాత్మక శక్తికీ, ముక్తికీ, మార్గమే మగువలకు *
నా ముగ్గు అయిపోయింది
కదులుతారా కవిత్వం చెప్పఁమంటారా
చెప్పు చూద్దాం
చెపుతున్న ...... చెప్పు
కొన్ని నిజాలు అబద్దలుగా తెల్లారితే చాలు
కొన్ని అబద్దాలు నిజాలుగా చీకటిపడితే చాలు
కొన్ని ఏమి ఆశించవు ఎప్పుడూ కోపాలు
కొన్ని ఆశించేవి వదలవు తాపాలు
కొన్ని వెన్నెలను కోరుతాయి సుఖాలు
కొన్ని వెన్నెలే వద్దంటాయి దీపాలు
కొన్ని జీర్ణ మవుతాయి శాపాలు
కొన్ని జీర్ణమవ్వక బాధపెడతాయి మాటలు
కొన్ని నిద్ర పోనియ్యవు గురకలు
కొన్ని నిద్రలో ఉంచేస్తాయి చురకలు
కొన్ని పువ్వులు నవ్వు తాయి కళకళలు
కొన్ని పువ్వులు ఏడుస్తాయి విలవిలలు
కొన్ని ములగచెట్టుఎక్కిస్తాయి బాకీలు
కొన్ని నిలువునా ముంచేస్తాయి లూటీలు
కొన్ని హృదయాన్ని కెలుకుతాయి గిలిగింతలు
కొన్ని హృదయాన్ని తాకుతాయి చినుకులు
కొన్ని ఆకర్షణకు లోనవుతాయి చిత్త్రాలు
కొన్ని వికర్షించి నవ్వుతాయి ఆలోచనలు
కొన్ని కొంపలు ముంచుతాయి కోరికలు
కొన్ని కొండనే కరిగిస్తాయి ఓపికలు
కొన్ని తారుమారు చేస్తాయి బతుకులు
కొన్ని భయాన్ని కలిగిస్తాయి మెరుపులు
ఎదో ముగ్గు గురించి ఆట పట్టిందామనుకుంటే కొన్ని కొన్ని అని నా మతినే తిన్నావే
అవునండి మీరేనా కవిత్వం చెప్పేది నేను చెప్పలేనా అన్నది
హతవిధి ఎవ్వరితోనయినా మాట్లాడాచ్చు కానీ ఇంటి ఇల్లాలతో మాట్లాడటం కష్టం అని గొణిగాడు మాధవ్
ఏమిటంటున్నావు "ఏమిలేదే ముగ్గు బాగా వేశావు, నీ ముగ్గుకు అడ్డు రానులే ఇంకెప్పుడు
అట్లా అనకండి మీరు పక్కనుండి ఉడికిస్తూ ఉంటే
నాలో ఎదో ఎదో అని పిస్తుంది
ఎదో ఏదోనా
ఆ అదే
ఏమిటి కవిత్వం మల్లి చెపుతావా
ముందు కాఫీ తీసుకువస్తావా
నామతి మండా మిమ్మల్ని బాధ పెట్టాను అంటూ మంగళసూత్రాన్ని కళ్ళకు అద్దుకుంటూ ఖాఫికల్య్ తెచ్చింది శ్రీమతి రాధా కుమారి
త్రాగుతూ కధలు చెప్పుకుందాం
అబ్బా నాలిక కాలింది
మరి కాలాక ముద్దు పెట్టుకుంటుందా
ఆ....... ఆ...
ఆ మాటలకు నిద్దరలో ఉలిక్కి పడ్డాడు
ఇది కలా అని నవ్వు కున్నాడు మాధవ్
--(())_-
నిరుద్యోగ ప్రయాణం 18 వ రోజు (రోజు వారికధ)
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మాధవ్ నెమ్మదిగా ఒక నది వడ్డున ఉన్న దేవాలయానికి వెల్లాలని నిర్నయిన్చుకొని నడుస్తున్నాడు
నదిలో స్నానం చేసి దేవుణ్ణి దర్శించుకుందామని అనుకున్నాడు.
అక్కడ ఒక కుటుంబంలోని సభ్యులు కొంతమంది కోపంతో ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నారు
మాధవ్ నెమ్మదిగా అంత పెద్దగా అరుచుకొనుట దేనికి అని అక్కడ ఉన్న ఒకర్ని అడిగాడు.
వాడు తిన్నది అరగక అని ఊరుకున్నాడు.
వేరొకతన్ని అడిగాడు మాధవ్ గుడిదగ్గరకొచ్చినా వారు అలవాట్లు మార్చుకోరండి, మీదారి మీరు వెళ్ళండి. కాసేపు అరుచుకొని మరలా కలుసుకుంటారు. మధ్యలో మనం పొయ్యమా ఇది మా సమస్య నీకందుకు అంటారు అన్నాడు.
అయినా మాధవ్ మరొకడ్ని అడిగాడు
అతడు ఇలా సమాధానం చెప్పేడు, “వారు సహనాన్ని కోల్పోవడం వల్ల అరుస్తుంటారు”
మాధవ్
“ మనుషులు పక్కనే ఉన్నప్పుడు అలా అరవలసిన అవసరం ఏముంది?
మెల్లగా పక్కనే ఉన్నవాళ్ళకి నెమ్మదిగా చెప్పవచ్చు కదా” అన్నాడు మాధవ్
అందరూ కందకు లేని దురద కత్తిపీటకెందుకు అన్నట్లు ఇతనితో మాట్లాడి మన సమయం వ్యర్థం చేత ఎందుకు అని కదిలారు.
మీరు వెళ్ళకండి అన్నాడు మాధవ్
ఇలా వివరించాడు
.
ఇద్దరు వ్యక్తులు ఒకరిపట్ల ఒకరు కోపంగా ఉన్నప్పుడు వాళ్ళ హృదయాలు చాలా దూరం అయిపోతాయి. ఆ దూరాన్ని అధిగమించడం కోసం, వాళ్ళకి వినిపించడంకోసం అలా గట్టిగా అరుచుకుంటూ ఉంటారు. కోపం ఎక్కువయిన కొద్దీ తమ మధ్య పెరుగుతున్న దూరం కారణంగా మరింత గట్టిగా అరుచు కుంటారు. కావాలని పాత కక్ష లు మనసులో పెట్టుకొని వారి అరుస్తారు.
వచ్చిన వారిలో ఒకడు
అదే ఇద్దరు వ్యక్తులు ప్రేమగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? చెప్పండి అన్నాడు ?
వాళ్ళు ఏమాత్రం అరుచుకోకుండా ఎంతో మెల్లగా, మృదుమధురంగా మట్లాడుకుంటూ ఉంటారు, ఎందుకంటే వారి హృదయాలు ఎంతో దగ్గరగా ఉంటాయి కనుక. ప్రేమలో ఉన్నప్పుడు మనుషుల హృదయాల మధ్య దూరం చాల తక్కువగా, అసలు దూరమే లేనట్లుగా ఉంటుంది. వారి హృదయాలు దగ్గరవ్వాలని తపన ఎక్కువగా ఉంటుంది.
మరల ఉన్న వాళ్ళల్లో ఒకడు ఈవిధముగా అడిగాడు
మనుషులు ఒకరినొకరు గాఢంగా ప్రేమించినప్పుడు ఏంజరుగుతుంది?
వాళ్ళు మాట్లాడరు, ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ చాలా ప్రేమగా దగ్గరవుతారు. చివరకు వాళ్ళ్ళకు గుసగుసలతో కుడా అవసరం లేకుండా ఒకరి కళ్ళలో ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటూ చూపులతోనే మాట్లాడుకుంటారు.అంతే ఆవిధంగా ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నప్పుడు వారి హృదయాలమధ్య అసలు దూరమే లేకుండా దగ్గరవుతాయి.
.
“కాబట్టి మీరు వాదించుకునేటప్పుడు కోపంతో మీ హృదయలను దూరం చేసుకోకండి. మనుషుల మధ్య దూరం పెరిగే విధంగా మాట్లాడకండి.లేకపొతే ఆ దూరం ఎప్పటికీ దగ్గరకా లేనంతగా పెరిగిపోతుంది.”
మాధవ్ అన్నాడు మీరందరూ గమనించండి
"కోపం వచ్చినపుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడం ఉత్తమమైన పద్ధతి. అటువంటి కోపంలో మట్లాడే మాటలు అవతలి వ్యక్తి హృదయంపై చెరగని ముద్ర వేస్తాయి.కోపం మనల్ని మనకి ప్రియమైన వారి నుండి దూరం చేస్తుంది"
అప్పటి దాకా పోట్లాడుకున్నవారు మాధవ్ మాటలకు ఒక్క వారి ఆపేసారు. మదఃవ్ మాటలు ఒక కధ విన్నట్లుగా విన్నారు
అందులో ఉన్న ఒక వ్యక్తి ఇక గుడికి వెళ్లి దేవుణ్ణి దర్శించుకొని వద్దాం పదండి
ఆ ... పదండి ఆ సర్వేశ్వరుని దర్శించుకొని వద్దాం .
--((**))--
నిరుద్యోగ ప్రయాణం 19 వ రోజు (రోజు వారికధ)
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మాధవ్ నడుస్తూ పోతున్నాడు
వెనకనుండి పిలుపు వినబడినది
తిరిగి చూసి పలకరించాడు మాధవ్
మనం ఒక సెలవు రోజున సరదాగా షికారుకెళ్లి ఏదో విషయంపై మాట తేడా వచ్చింది.
వాదన పెరిగింది.
దీంతో మొదట నీవు నన్ను ఒక్క తోపు తోసావు, నేను పడ్డప్పుడు అక్కడే వున్న బురదలో "ఈరోజు నా స్నేహితుడు నన్ను తోసాడు '"అని రాశాను గురుతు, లేదా మాధవ్, నీవే తోసావ్ గుర్తు తెచ్చుకో .
మరొకసారి మనం జూ కు వెళ్ళినప్పుడు , పులి వెంబడించటం గమనించాము అప్పుడు నీవు భయపడుతూ ఉంటె నేను పులి నుండి నిన్ను రక్షించాను అదన్న గుర్తు ఉన్నదా మాధవ్ నీవు నన్ను రక్షించావా ఎట్లా
నిన్ను బావిలో తోసి నేను చెట్టు పైకి ఎక్కి కూర్చున్న ఎవరో ఒకరు బతకవచ్చు అని అదన్న గుర్తుందా
అప్పుడు జూ వారు రావటం పులిని పట్టుకోవటం జరిగింది.వారు మనల్ని చూడక వెళ్లి పోగా, నినేను దిగి బావిలోనుండి నిన్ను బాయటకు తీసా
మీరు ఎవరిని చూసి ఎవరును కున్నారు
మరలా గుర్తు తెచ్చుకోండి
నా పేరు మాధవ్
నాకు ఇంకా గుర్తు ఉంది
అప్పుడు నీవు "ఈరోజు నా మిత్రుడు నన్ను ప్రమాదం నుంచి రక్షించాడు.." అని ఓ బండరాయిపై చెక్కావు అదన్న గుర్తు ఉందా.
నీవు అప్పుడు అడిగావు రెండు చోట్ల ఎందుకు వ్రాసావు అని
అప్పుడు నేను చెప్పను
బురదలో వ్రాసినది నిలబడదు, కనీసం బండరాయి మీద వ్రాసింది నిలబడుతుందని వ్రాసాను అన్నాను. .
ఇంతకీ విషయం చెప్పండి
నా స్నేహితుడని నేనే ఇన్ని విషయాలు చెప్పినా, ఇంకా గుర్తుకు రాలేదంటే స్నేహానికి ద్రోహం చేస్తున్నావు మాధవ్
ఎందు కట్లాగంటారు నాకు గుర్తుకు రావటం లేదని చెప్పను అంతే
సరే ఇప్పుడు నేనడుగునా చెప్పు మనమిద్దరం ఒక గురువు వద్దకు వెళ్లి కొన్ని ప్రశ్నలడిగాము అదన్న గుర్తుందా
ఏ ప్రశ్నలు
మన రాత, భవిషత్తు గురించి అడిగాము
కోరుకున్నంత మాత్రాన దొరుకుతుందా? మన రాతలో ఉండాలి కదా?
సద్గురు:- మీరు కోరుకున్నారు అంటేనే అది మీ రాతలో ఉన్నట్లే.
అప్పుడు నీవు నవ్వుతు ఈ ప్రశ్న వేశావు
కోడి ముందా? గుడ్డు ముందా?
సద్గురు:- ముందు నీవు దేనిని చూస్తావో అదే ముందు. ఇంకా చెప్పాలంటే 'ఈ రెండింటిని ఎరిగిన నీవే ముందు'.
అందు కే అన్నారు ఎవరినైనా మరవచ్చు కానీ స్నేహితుణ్ని మరవకూడదన్నారు
"ఇచ్చింది మర్చిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే స్నేహం" అని.
స్నేహమనేది ఒకరోజు కాలక్షేపం కాదు.
అన్నాడు వచ్చినవాడు.ఇప్పడిదాకా చెప్పినవన్నీ ఒక్కటి కూడా గుర్తు లేదు అయినా స్నేహాన్ని మరిచే మనిషని కాదు.
నేను నీస్నేహితుడవైతే ఏమిచెపు దామనికున్నావు అది చెప్పు
నన్ను నీ స్నేహితునిగా గుర్తింపక పోయిననేను గుర్తించా కాబట్టి చెపుతున్నాను.
నీవు వెంకట సుబ్బారావుగారి అబ్బాయివి
కాదండి వెంకట రామారావుగారి అబ్బాయిని
మీది గుంటూరు కదూ
అవును మాది గుంటూరే
అరండల్ పేటలో ఉన్నారా
లేదండి నేను బ్రాడీపేటలో ఉన్నా
బాబు నన్ను క్షమించు
నేను అనుకున్న మాధవ్ నీవు కాదు
అచ్చు నీలాగే ఉంటాడు
అవునండి నాలాగా ఎడుగురుంటారు అందులో నేనొకణ్ణి అయిఉంటాను
నా చిన్నప్పటి స్నేహితుడు దొరకపోతాడా అని వెతుకుతున్నా
ఇక నేను ఏమి సెహెప్పినా నీకు అర్దహ్మ్ కాదు వస్తాను బాబు
ఏమిటో ఈ లోకం ఇలా మారిపోయినది
అందరూ ఎవరికోసమో వెతుకుతారు కానీ యితడు స్నేహితునికోసం వెతకటం ఇదే మొదటి సారి చూసా ... అంటూ కదిలాడు మాధవ్
__(())--
నిరుద్యోగ ప్రయాణం 20 వ రోజు (రోజు వారికధ)
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సుబ్బా రావు గారు బాగున్నారా
ఎం బాగో, అంటూ మీరే చూస్తున్నారు గా
మరి బాగున్నారా అని పలకరిస్తే ఎట్లాగయ్యా తిరుపతి రావు
ఎదో ఆనవాయితిగా మాట్లాడే మాటలు కదా మరి ఎం మాట్లాడాలి
సరేసరే
అమ్మాయి పెళ్ళికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి అనుకుంటా
ఏమి జరుగుట లేదు
ఎందుకు డబ్బులు లేవా
నన్ను విసిగించకు తిరపతిరావు (అట్టహాసం లేకుండా పెళ్ళిచేసినందుకు మనసులో భాద అది )
గత సంవత్సరం మీ అమ్మాయి పెళ్లి డాం డాం గ చేశాను చూసావుగా
ఆ చూసాను
ఒక్క సారి చెపుతా విను
నేను ఎటువంటి లోటు లేకుండా పెళ్లి చేశా తెలుసా
ఎట్లా చేసావ్ పెళ్లి
ఇట్లాగా
*ఎంత తింటాడు మనిషి? లక్క కట్టి కనీసం ఆరు వందలమంది భోజనం చేస్తే బాగుంటుందని వంటలు చెయిన్చాను తెలుసా, వేయిమంది దాకా భోజనం చేశారు తెలుసా
*దేంట్లో దొరుకుతుంది వినోదం? అని ఆలోచంచ కుండా, మిమిక్రి రికార్డ్ డాన్సు ,పెట్టి, మైకు మంటలు వినిపించాను తెలుసా
*ఎలా చేయాలి వేడుక? అని ఆలోచించక నా వేడుకే వేరు గులాబీ పూలు పంచి, అత్తరు జల్లి, ఆడవారికి జాకెట్టు గుడ్డ పండు తాంబూలం, వెండి కుంకుమ భరిన ఇచ్చి తృప్తి పారిచాను తెలుసా
*ఎలా ఖర్చు పెట్టాలి కష్టార్జితం? నేను ఎప్పుడూ అనుకునే వాన్ని కాదు, అమ్మాయి అబ్బాయి సుఖంగా జీవించాలని ఆశించేవాళ్ళం, తగు విధంగా ఖర్చు చేశాను తెలుసా
*ఏ రకంగా పెరుగుతుంది ఆప్యాయత? అనుకోక అందరినీ పిలిచాను , చతుర్ముఖ పారాయణం చేసె వాళ్ళను కూడా పిలిచాను, పాందాలు కట్టి మరీ ఆడించాను తెలుసా
*ఏది కడితే వస్తుంది హుందాతనం? ఆలోచించి కొబ్బరి మట్టలతో పందిరిని, మామిడి తోరణాలు రకరకాలు పూలతో, సన్నాయి మేళాలు ఏర్పాటు చేసి హుందా తనం కోసం కల్యాణమండపం లో ఘనంగా చేశాను తెలుసా
*ఏ విధంగా ఇనుమడిస్తుంది అందం? అని అనుకోకుండా కాళ్లకు పారాయణం, చేతికి గోరింటాకు, మెళ్ళో నగలు అందమైన వస్త్రములు, జడ కుచ్చులు, కళ్ళకు పట్టాలు చెవి దిద్దులు ఒకటేమిటి సహా జ స్త్రీ అందేమీ అందం, స్త్రీలకు పట్టు చీరలు, మొగవారికి పట్టు పంచలు పంచాను తెలుసా
*ఎలా పెరుగుతుంది ఆకర్షణ? ఊరేగింపు కూడా గుర్రం మీద నాలుగు విధుల బ్యాండు మేళం, పిట్రమాక్సు లైట్లు వెలుగుల్లో చిలకా గోరింకలు ఎంత బాగున్నారా ఐ దీవించేవారు
*ఏ విధంగా బలపడుతుంది బంధం? అటువారు ఇటువారు కలసి ఎదురు కోల్ జరుపుకుంటూ ఉండే సంబరమే సంబరము
ఒక్కసారి, ఆలోచించి ఆచరిస్తే పెళ్ళితో వస్తుంది జీవితంలోకి కళ.
వెంటనే సుబ్బారావు ఆ తర్వాత నీవు ఎలా గున్నావో నేను చూడలేదా
ఎందుకయ్యా గొప్పలు కు పోయి చివరికి ఏమని పించుకున్నావో గుర్తు లేదా తిరుపతిరావు
తిరపతి వెళ్లకుండానే సర్వం పోగొట్టుకున్న వ్
అది నావిషయం
సరే సరే నాగురించి నేను పడ్డ కష్టాలు నీవు పడకూడదని సలహా ఇద్దామనుకున్న
ఆ విషయం చెప్పు బాగుంది
అట్లైతె
*నిశ్చయ తాంబూలానికే జంటను కలపడానికి దండాలు ఉంగరాలు చుట్టాలు ఏమి లేకుండా అటు ఇద్దరు ఇటు ఇద్దరు పిలిచి భోజనం పెట్టు చాలు.
*పెళ్ళికి ముందే ఎంగేజ్ మెంటుకు వీడియో షూట్లు చేయటం వదిలేసి నలుగురికి తాబూలం ఇప్పిచు చాలు.
*గొప్ప కోసం ఆర్భాటంగా మండపాలు కట్టడం దేనికి ఎంచక్క ఇంటి ముందు తాటాకుల పందిరి వేసి రంగు కాగినాలు అంటించు చాలు,
*మెహిందీ పేరుతో మెహర్భానీ ప్రదర్శించడం దేనికి గోరింటాకు తెచ్చి చాలు,
*డిజైనర్ శారీస్ కు వేలకు వేలు ఖర్చుపెట్టడం దేనికి అందంగా ఉండే పట్టు వస్త్రాలు చాలు , *బ్రైడల్ మేకప్పంటూ బలిసినట్టు రెచ్చిపోవడం దేనికి కుడికాయారసంతో స్నానం మాచారించి సాంబ్రాని వేసి కుంకుమ బొట్టు ముఖానికి అందం, అది చాలు
*పట్టెడన్నానికి ప్లేటురేటు పెంచుతూ పోవటం దేనికి వంట వాళ్లతో వంటచేయించి వడ్డనచేస్తే చాలు
*దావత్ పేరుతో తాగితందనాలాడటం అసలు వద్దు మనకు అచ్చిరాదని అంటే చాలు
*కడుపు కట్టుకుని దాచింది హారతిచేయటం అంటే ఎక్కువ ఖర్చు చేసి బాధపడకుంటే చాలు
చాలా చెప్పావు తిరుపతి రావు ,సంతోషం
నాఉద్దేశ్యం కూడా చెప్తా విను
*పదిమందితో పట్టెడన్నం తింటే, *మనసు విప్పి హాయిగా మాట్లాడుకుంటే, *కార్యం జరిగే ఇంట చేతనైనంత సాయం చేస్తే, *సహజమైన అందానికి పెద్దపీట వేస్తే, *సాంప్రదాయం విధానానికి కట్టుబడి ఉంటే, *దాచిన సోమ్ము సద్వినియోగ పడితే,కార్యం చేసినవాడి బతుకు చీకటి కాదు. మధ్య తరగతి బతుకుల్లో వెలుగు పోదు. అనే నమ్మకములో బతికే మనుషులమ్ మనము
కానీ ఇది కరోనా కాలం
మిమ్మల్ని కూడా పిలవ దలుచుకోలేదు మా అమ్మాయి పెళ్లికి ఏమను కోకండి తిరుపతిరావుగారు
*ముహూర్తం చూసి పారేసే కార్డుకి, *పెళ్ళయిన వెంటనే తీసేసే పందిరికీ, *చెమటపడితే కారిపోయే రంగుకీ, *పెళ్ళినాడు మాత్రమే కట్టే వలువలకీ, *నాలుగు మెతుకు తింటే నిండిపోయే కడుపుకీ,*సరదాగా కబుర్లు చెపితే వచ్చే నవ్వుకీ, *ఒక్కరోజులో ముగిసిపోయే వేడుకకీ, ఉన్నదంతా ఊడ్చి పెడదామన్న లోకం వప్పుకోదు.
మాయ్ద రోగం వచ్చింది ఎటునుంచి వస్తుందో ఎవ్వరూ చెప్పఁలేరు, దానికి మందు లేదు
అందుకని
అమ్మాయికి పెళ్లి చేయటల్లేదా సుబ్బారావు
ఎందుకు చేయను
ఎంచక్కా రిజిస్టర్ ఆఫీసులో చేసేసాను పెళ్లి దండాలు మార్చి, అటు ఇటు పది మంది ఫోటులు తీసి వాట్సాప్లో స్నేహితులకు తెలియ పరిచా
ఇంతకీ మీ అల్లుడి పేరేంటి
"మాధవ్ "
ఏమనుకోకు మాఅమ్మాయి పెళ్లి అయిపోయింది రెండురోజులు క్రితమే
నీ సెల్ నెంబరు లేక నీకు ఫోట్లు పంపలేదు
ఆ ....
ఆ .....
ఇప్పటి దాకా నేను చెప్పిన మాటలన్నీ...... ....
నీ అనుభావం నీది ..... నా అనుభవం నాది
పిల్లలు బాగుపడి వాళ్ళ సంసారం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగితే చాలు
అంతే అంతే సుబ్బారావు
అంతేకదా తిరుపతిరావు
మాన స్నేహం ఎప్పటికీ మారదు ఆది మాత్రం గుర్తించుకో చాలు
అంతే
అంటూ కౌగలించుకున్నారు చిన్న నాటి స్నేహితులు
*****
ఈ కదా మీకు నచ్చితే షేర్ చెయ్యండి అందరికి ధన్య వాదములు
--(())--
నిరుద్యోగ ప్రయాణం 21 వ రోజు (రోజు వారికధ)
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
25-09-2020
శ్రద్ధాంజలి ఘటిస్తూ
బాలు స్వరం ... ప్రపంచానికి ఒక వరం
మధుర పాటలు మిగిల్చి .... మాకు తీరని లోటు
బాలు అస్తమయం .... ఒక దిగ్గజం కోల్పోయాము
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఎవరి దారి వారిది, దారులు వేరైనా గమ్యం ఒక్కటే అదే ధర్మో రక్షతి రక్షిత: అన్న సూక్తిగా సంగీతం ఒక కళ, ఆ కళ ఆధారముగా జీవన పోషణ ఒక అదృష్టం. కాలంతో ఎదురేగి సకల హృదయాలలో నిలిచిపోయే " పాట పంచామృతాన్ని పంచి పెట్టి" , కట్టు కధలు చెప్పి నేను కవ్విస్తుంటే నేను నవ్విస్తే మల్లి నవ్వాలి పకా పకా,అంటూ వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి, మమతలన్నీ మౌన గానంగా కదిలావు . . :
కోట్ల అభిమానుల్లో నేను ఒకడ్ని, మనమధ్య లేకపోయినా వారి గానం నిరంతరం హృదయాల్ని తాకుతుంది. "నాగొంతు శృతులోన నా గొంతు లయలోన " ఒక మాట పది పాటల మయంగా మారింది. అన్న మాట గుర్తుకొస్తున్నది. అదృష్ట వంతులకి సరస్వతికి ఎంత ఇష్టమో, సరస్వతికి బాలు పాట అంటే "ఏంతో ఇష్టం". స్నేహపరిమళాల్ని వేదజల్లి కుటుంబాల్ని నిలబెట్టే మహాను భావుడు. గానం ఆధ్యాత్మిక దైవాన్ని మనస్సులో ఉండే విధముగా, అర్ధమయ్యేవిధముగా, స్వరం తనమహత్తు అందరికి వీనుల విందుగా అందించారు. పాటల గొంతు మూగ పోయింది, నీపాద రాజీవము చేరు నిర్వాణ సోపాన మది. . ,
ఎందరో మహాను బావులు అందరికీ వందనములు," సింగారాన్ని పైరుల్లోన పాడాలి, బంగారాన్ని నవ్వుల్లోన పూవ్వుల్లాగా పాడాలి" కృషి ఉంటె మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవు తారు..వయసులో సంగీతమే జీవితమే గోపాలమే. "రా దిగిరా దివినుంచి భువికి దిగిరా" రామహరే, కృష్ణ హరే..
ऊँ!
----
"చక్కని గాత్రము భాషయు
చక్కని నటనము ప్రతిభయు శారద వరమే
మక్కువ నిచ్చెఁడి పాండితి
చుక్కల ఱేఁడే కనంగ సొగసుల ' బాలూ ' !!! "
శ్రద్ధాంజలి ఘటిస్తూ
తెలుగు లో వాక్ప టుత్వమ్ము పాట గాను
వ్యాక రణముతో పరిపూర్ణ పాట గాను .
కీర్తి కాదు జన హృదయ పాట గాను
నిలిచి పోయేటి మనసున పాట గాను
అలుపెరగక పోరినా విధి విలాస
మంత మరణ శయ్యపైకి కల లాగ
సాగె కాలుని కేమయ్యె కరుణ లేద
ఇది విచిత్రము చిత్రము మరణ శయ్య
జోలె పట్టి అడిగిన యమునికి దయయు
లేదు ఎందుకో చేసిన పుణ్య కధల
లాగ శరణు కోరిన ఆగ లేదు
పండితారాధ్యుల కళ ఇకముగిసియె
పాటల సిరిమూటలు ఎన్నొ ఆటలాగ
పంచె, హాని చేయని మనిషిగను బతుకు
ప్రాణి, గానము నలరించె వివరి వరకు
తిరిగి రానట్టి లోకాల వెంట చేరె
కక్ష కట్టియు పెద్ద శిక్షలనువేసె
కాల మంతయు పాటలు ప్రాణ మయ్యె
జీవ నమునకు మూలము మృత్యు వేట
వచ్చి పోతివా ప్రాంజలి ఘటన చూడు
(అపర గాన గంధర్వుని మృతికి చింతిస్తూ.... బాధాతప్త హృదయంతో.)
--(())--
నిరుద్యోగ ప్రయాణం 22 వ రోజు (రోజు వారికధ)
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మాధవ్ ఒక షాపు వద్దకు వచ్చి అక్కడ వక్కపొడి కొనుక్కొని తిరిగి వస్తున్నాడు
ఒక స్త్రీ చిన్న బాబును అదే పనిగా పట్టుకొని కొట్టుతుంది 'నీకు బుద్ధి లేదా నా వళ్లంతా తడిపావు పాడుచేసావు, అదేపనిగా ఏడుస్తావు నిన్ను ఎట్లాగరా పెంచేది అని మొట్ట కుంటుంది. వెనకే భర్త అంటున్నాడు పుట్టక పుట్టాడు గారాబంగా చూడక బాధపడతావే అన్నాడు. ముందు మీరు తీసుకు వెళ్లి ఆలా తిప్పుకు రండి అంటుంది.
అప్పుడే మాధవ్ నవ్వు కుంటున్నాడు
బాబును ఎత్తుకొని వచ్చి ఎందుకు నవ్వుతావు బాబు నీకు పెళ్లి అయితే ఆ కష్టాలు తెలుస్తాయి అన్నాడు
నవ్వుకుంటూ
నాలుగైదు నెలల పిల్లవాడు. మంచం మీద పడుకోబెట్ట బడి ఉన్నాడు. ఇంకా నిలబడటం, నడవటం రాని వాడు. ఇక మంచం దిగే యోచనే తెలియని వాడు.
ప్రక్కనే పడక్కుర్చీ లో నాన్న పుస్తకమేదో చదువుకుంటున్నాడు. ఇంతలో పిల్లవాడు మల మూత్రాలు విడిచాడు. ఆ పొత్తిగుడ్డ ల్లోనే గుండ్రంగా పొర్లాడు బోర్లా,వెల్లకిలా పడ్డాడు. ముక్కూ మొహమూ ఏకం చేసుకున్నాడు. బురద లో చేప పిల్ల లా తప తప కొట్టు కున్నాడు. చివరికి తన మురికి తనే భరించ లేక కెవ్వుమని ఏడుపు లంకించుకున్నాడు పిల్ల వాడి ఏడుపు విని నాన్న దగ్గరి కొచ్చాడు.
పిల్ల వాడు చేతులు పైకెత్తి ఎత్తుకోమన్నట్లుగా తండ్రి వైపు చూస్తూ క్యారు క్యారు మన్నాడు. మల మూత్రాలు ఒళ్ళంతా పుసుకుని దుర్గంధ భూయిష్టం గా ఉన్న కొడుకుని నాన్న చూశాడు, గానీ ఎత్తు కోలేదు. అంతలో పిల్లాడి ఏడుపు విని అమ్మ కూడా పరిగెట్టు కొచ్చింది. ” ఏమోయ్! వాడు చూడు! ఎలా ఉన్నాడో!?ఒంటి నిండా పూసుకున్నాడు!” అన్నట్లుగా చూసాడు నాన్న!
అమ్మని చూసి మరింత గట్టిగా ఏడుస్తూ చేతులు చాపాడు పిల్ల వాడు . అమ్మ… నాన్నలా దూరంగా ఉండి పోలేదు. ఒక్క ఉదుటున వచ్చి ఎత్తుకుంది స్నానాల గదికి తీసికెళ్ళి పీటేసుకు కూర్చుంది. చీర కుచ్చిళ్ళు మోకాళ్ళకి పైకి లాక్కుని, పిల్లాణ్ణి కాళ్ళ పైనేసుకుంది. నీళ్ళూ,సున్ని పిండీ వేసి.. చేపని రుద్దినట్టు రుద్ది కడిగింది.
పొడి తువ్వాలు పెట్టి ఒళ్ళంతా తుడిచింది. పరిమళాలు విరజిమ్మే గంధపు పొడులేవో రాసింది. బొట్టూ,కాటుకా పెట్టింది ఉతికిన జుబ్బా తొడిగింది.
బుగ్గన కాసంత దిష్టి చుక్క పెట్టి,ఎత్తి ముద్దులాడింది పిల్లవాడు ఏడుపు ఆపి కిల కిల నవ్వుతుండగా తెచ్చి నాన్న చేతికిచ్చింది. చదువుతున్న పుస్తకం అవతల పెట్టి, కొడుకు నెత్తుకుని నాన్న…” నా తండ్రే! నా బంగారు కొండే!..” అంటూ.. ముద్దులాడాడు. పిల్ల వాడు పరమానందం లో మునిగి పోయాడు.
భగవంతుడు నాన్న లాంటి వాడు!
మనం మురిగ్గా ఉంటే ఎత్తుకోడు, దగ్గరకి రాడు, రానివ్వడు సద్గురువు అమ్మ లాంటి వాడు. మన దోషత్రయాన్ని [మల విక్షేప ఆవరణ లు]దూషించడు. మన ఈషణ త్రయాన్ని [దార ధన పుత్ర ] చూసి ఈసడించడు.వాసనాత్రయాన్ని[లోక దేహ శాస్త్ర ] చూసి వద్దకు రావద్దని వారించడు. మన అహంకారాన్ని చూసి అసహ్యించు కోడు.
ఓపికగా మన చిత్తాన్ని శుధ్ధి చేసి మన అహంకారాన్ని అణచి వేసి, వాసనల్ని వదలగొట్టి ఈషణ,ఈర్ష్యాసూయల్ని దాటించి నిర్మల,విశుధ్ధుల్ని చేసి భగవంతునికి ప్రీతిపాత్రులమయ్యేట్లుగా చేస్తాడు. ఎందుకంటే… తారతమ్య సాంద్రత సమం కానిదే ఒక పదార్ధం మరో పదార్ధం లో కలసిపోదంటుంది భౌతిక శాస్త్రం.
బ్రహ్మమెంత నిర్దోషమో… అంత నిర్మలమైతే తప్ప బ్రహ్మస్వరూపులం కాలేమంటూంది గీత!
ఇహైవ తైర్జిత స్సర్గః,యేషాం సామ్యే స్థితం మనః।
నిర్దోషం హి సమం బ్రహ్మ,తస్మాద్బ్రహ్మణి తే స్థితాః॥
అందుకే మరి…..
ఎవరెంతగా అన్నా ఎవరెంతగా విన్నా, ఎంత చదివినా, ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినా, సద్గురువుని ఆశ్రయించటం తప్పనిసరి…అంటారు అనుభవజ్ఞులు.
అని అన్నాడు వచ్చిన వానితో
కష్టమంతా నాన్నది పేరు అమ్మకు ఎందుకు
ఆడవాళ్లకు ఓర్పు ఎక్కువా
మగవాళ్లకు అహం ఎక్కువా
గురువుకి ఓపిక ఎక్కువా
ఎంచెపుతున్నావో నాకేం అర్ధం కాలా
నా దారి నేను పోతున్న అంటూ వచ్చినవాడు వెళ్ళిపోయాడు
మాధవ్ నెమ్మదిగా సంచి తగిలించుకొని
బయలుదేరాడు
--(())--
నిరుద్యోగ ప్రయాణం 23 వ రోజు (రోజు వారికధ)
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మాధవ్ చిన్న నాటి స్నేహితుడు మెడికల్ రెప్ర్రాజెన్ట్ చేస్తున్నాడు అనుకోని విధముగా కలుసుకున్నారు
చాలా రోజులయింది మన కలసి అన్నాడు మాధవ్ తో రవి
అవును మనం కలసి చాలా రోజు లయింది
ఏమిటి ఇటు వచ్చావ్ అడిగాడు మాధవ్
ఇక్కడ ఒక చిన్న మీటింగ్ ఉన్నది
నేను రావచ్చా
రావచ్చు వెళదాం పదా
*జనరిక్_మందులు* గురించి ఒక మిత్రుడు చాలా గొప్పగా నిజాలను చెప్పాడు..... 👍*డబ్బులు* *ఎవరికి* *ఊరికే* *రావు* . 👌
*బ్రాండెడ్_మందులు*
➖➖➖✍
ఒక కొత్త మందును కనుగొనడానికి ఫార్మా కంపెనీలు అనేక పరిశోధనలు, పరీక్షలు చేసి మందును మార్కెట్ లోకి తీసుకొస్తాయి.
అందుకు ప్రతిఫలంగా ఆ మందు తయారీ పై ఆ కంపెనీకి కొంత కాలం పాటు ( *20 సం.లు*) పేటెంట్ హక్కులు ఉంటాయి..
అలా తయారు చేసిన మందులను *బ్రాండెడ్ డ్రగ్స్ లేదా స్టాండర్డ్ డ్రగ్స్ అంటారు*.
ఆ మందు యొక్క ఫార్ములా తెలిసినా ఏ ఫార్మా కంపెనీ అయినా సరే, దానిని పేటెంట్ ఉన్న కాలంలో పెటెంట్ పొందిన కంపెనీ అనుమతి లేకుండా ఆ మందు తయారు చేయకూడదు.
అలా పేటెంట్ లో ఉన్న మందులను ఇతరులు ఎవరైనా తయారు చేసి అమ్మితే వారు శిక్షార్హులౌతారు. అంటే ఆ మందుపై, మొట్ట మొదట తయారు చేసిన కంపెనీకే 20 సంవత్సరాల పాటు గుత్తాది పత్యం ఉంటుంది.
*నిజానికి ఆ మందును తయారు చేయడానికి అయ్యే ఖర్చుకూ, ఆ మందుపై కంపెనీ వసూలు చేసే అమ్మకపు ధరకు ఏ మాత్రం పొంతన ఉండదు. తయారీ ఖర్చు కంటే మందు యొక్క అమ్మకపు ధర అనేక రెట్లు అధికంగా ఉంటుంది.*
ఎందుకంటే ఆ మందు తయారీ కోసం "పరిశోధనలు మరియూ క్షేత్ర స్థాయి పరీక్షల (Clinical Trials)" నిమిత్తం మాకు చాలా డబ్బు ఖర్చైందని సదరు కంపెనీ వాదిస్తుంది.. కాబట్టి ఓ 20 సంవత్సరాల పాటు ఆ మందుపై దానిని తయారు చేసిన కంపెనీకి పేటెంట్ హక్కులు కల్పించి, పెట్టుబడి సొమ్మును రాబట్టుకోడానికి, ఆ మందును మొట్టమొదట తయారు చేసిన కంపెనీకి అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది.
మందు పై #మొట్టమొదటి తయారు చేసిన కంపెనీ యొక్క పేటెంట్ కాలం ముగిసిన తర్వాత, అవే కెమికల్స్ ను ఉపయోగించి, అదే ఫార్ములాతో, అదే మందును ఏ కంపనీ అయినా తయారు చేసి, మార్కెట్ లోకి విడుదల చేయొచ్చు.. అలా తయారు చేసిన మందులను " *జనరిక్_డ్రగ్స్*" అంటారు.
*జనరిక్ డ్రగ్స్* తయారు చేయటానికి ఫార్మా కంపెనీలు ఎటువంటి పరిశోధనలు కాని క్లినికల్ ట్రయల్స్ గాని జరపవలసిన అవసరం లేదు. అందువలన జనరిక్ డ్రగ్స్ ధరలు, బ్రాండెడ్ డ్రగ్స్ ధరలతో పోలిస్తే 30 నుండి 80 శాతం తక్కువ ధరలలో లభిస్తాయి. వీటిపై ముద్రించబడే యం.ఆర్.పీ కంటే చాలా తక్కువ రేటుకే వాటిని మనకు అమ్ముతారు.
తక్కువ ధరకు లభిస్తున్నాయి కాబట్టి నకిలీ మందులు అని, సరిగా పని చేస్తాయో చేయవో అని భయపడవలసిన అవసరం లేదు. *బ్రాండెడ్ మందుల తయారీలో పాటించాల్సిన ప్రమాణాలన్నీ జనరిక్ మందుల తయారీలోను పాటిస్తారు*. *బ్రాండెడ్ మందులెలా పనిచేస్తాయో, జనరిక్ మందులు కూడా ఖచ్చితంగా అలానే పనిచేస్తాయి*.
👉 కాని ప్రజలు జనరిక్ మందులకు అలవాటు పడితే ఫార్మాస్యూటికల్స్ కంపెనీలకూ, ఫార్మా ఏజెన్సీలకూ, మందుల షాపులకూ, అందరికీ నష్టమే కదా.
*అందుకనే జనరిక్ మందులపై, అవి బ్రాండెడ్ మందుల్లా పనిచేయవన్న పుకార్లు లేవదీస్తున్నారు*.. అది నిజం కాదు జనరిక్ మందులు బ్రాండెడ్ మందులతో సమానంగా పని చేస్తాయి.
బ్రాండెడ్ మందులు తయారు చేసే ఫార్మా కంపెనీలు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ద్వారా డాక్టర్లకు తమ బ్రాండెడ్ ఔషధాల గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వాటిని సూచించమని కోరుతుంటాయి. డాక్టర్ ఎంతమేర రాస్తే.. అంతమేర ప్రతిఫలాలను ముట్టజెబుతాయి. ఈ ఫలాలు ఉచిత విదేశీ పర్యటనలు, చెక్, బహుమతులు ఇలా పలు రూపాలుగా ఉంటాయి. *అందుకే బ్రాండెడ్ ఔషధాలు చాలా ఖరీదుగా ఉంటాయి*.
కొంత మంది వైద్యులు జనరిక్ మందులను సూచిస్తుంటారు. అవి వారి ఆస్పత్రి ప్రాంగణంలోనే లభిస్తాయి. వాటి ధర వాస్తవానికి చాలా తక్కువగా ఉన్నప్పటికీ వాటి మీద మీద ముద్రించబడిన ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కస్టమర్ అడిగితే ఒక 10 శాతం తగ్గిస్తారు. దాంతో కస్టమర్ సంతోషిస్తాడు. కాని ముద్రిత ధర కంటే 50 నుంచి 80 శాతం వరకు తక్కువ ధర ఉంటుంది.
ఉదాహరణకు జ్వరానికి సాధారణంగా డాక్టర్ వద్దకు వెల్లకుండానే చాలా మంది వాడే మందు "డోలో 650" (పారసెటమాల్ 650 మి గ్రా.) దీని ధర 15 టాబ్లెట్లకు 29 /- రూపాయలు. ఇదే టాబ్లెట్ ను సిప్లా కంపని "పారాసిప్ 650" పేరుతో తయారు చేసి అమ్ముతుంది , దాని ధర 10 టాబ్లెట్ లకు 18/- రూపాయలు. నిజానికి జనరిక్ మెడికల్ షాపులలో పారసెటమాల్ 650 మి గ్రా.
రూ. 4.50 /- లకు పది టాబ్లెట్ లభిస్తాయి.
నొప్పి నివారణకు వాడే డైక్లో ఫెనాక్ సోడియం ఎస్ఆర్ బ్రాండెడ్ (వోవిరాన్)10 మందుల ధర 51.91. కానీ ఇదే ఔషధం 10 మందుల జనరిక్ ధర జనఔషధి స్టోర్ లో Rs. 3.35 మాత్రమే. 100 ఎంఎల్ కాఫ్ సిరప్ బ్రాండెడ్ వి అయితే 33 రూపాయలు పైనే. జనరిక్ దగ్గు మందు జనఔషధి స్టోర్ లో 13 రూపాయలకే లభిస్తుంది. జ్వరం తగ్గడానికి వాడే ప్యారాసిటమాల్ 500 మి గ్రా. 10 మాత్రల ధర బ్రాండెడ్ అయితే 13 రూపాయలు. జనరిక్ అయితే 2.45రూపాయలే.
👉 సూక్ష్మంగా చెప్పాలంటే బేసిక్ ఫార్ములా ప్రకారం తయారైన మందును జనరిక్ మందు అంటారు. ఇదే సూత్రంతో కార్పొరేట్ కంపెనీలు పేరు మార్చి మందులు ఉత్పత్తి చేస్తున్నాయి. ధరలో తేడా తప్పితే మందు పనిచేయడంలో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. మందు పరిమాణం, రసాయనిక నామం, నాణ్యత ఒక్కటే గానీ.. లేబుల్, దానిపై బ్రాండ్ పేరు మారుతుంది.
జనరిక్ మందుల పట్ల సామాన్య ప్రజలకు చాలా అపోహలు అనుమానాలున్నాయి. వాటిని గూర్చి వివరించి ఉపయోగించేలా చేసే వ్యవస్థలు లేవు. ఇటీవల కాలంలో వీటిపట్ల ప్రజలకు కొంత అవగాహన పెరిగింది.
జన ఔషధి పధకం ద్వారా దేశంలో కొత్తగా 5000 మెడికల్ షాపులను ఏర్పాటు చేసారు. ఇలా ఎంతో మందికి ఉపాధి లభించడమే కాకుండా పేదలకు మందుల ఖర్చు మిగులుతుంది.
*అందరికీ జనరిక్ మందుల పట్ల అవగాహన పెంచి మనం కూడా వీలైనంత ఆ మందులు వాడి డ్రగ్ మరియు ఫార్మా మాఫియా దోపిడీ ని అరికట్టాలి.*✍
రవి ఈరోజు చాలా మంచి విషయాలు తెలుసుకున్న సంతోషం
మరి నాకు సెలవు ఇస్తావా
భోజనం చేసి కాసేపు మాట్లాడుకుందాం సాఆయ్నత్రం వెళ్ళవచ్చు మాధవ్
ఇనకి నీవేం చేస్తున్నావ్
కే రాఫ్ ప్లేట్ ఫారం
నీకు త్వరలో మంచి భవిషత్తు ఉంది మంచి ఉద్యోగం రావచ్చు
అవునూ నీవు గ్రూపు వన్ వ్రాసినట్లున్నావు కదా
ఇంటర్వ్యూలో పోయిన్ది
ఆ విషయాలు ఇప్పుడు ఎందుకు లేరా
వేరేవవిషయాలు చెప్పు
సరేలే పదా
--(())__
నిరుద్యోగ ప్రయాణం 24 వ రోజు (రోజు వారికధ)
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మాధవ్ నడుచుకుంటూవెళుతున్నాడు, ఒక చేటు క్రింద ఒక వృద్ధుడు చల్ల కుండ పెట్టుకొని కూర్చున్నాడు.
మాధవ్ త్రాగాడు
డబ్బు లివ్వ బోయాడు
వద్దు బాబు ఈ జన్మకి ఈ సహాయము చేయుటకు ఆ దేవుని పార్ధిస్తూ ఉన్నాను
ఏం తాత
ఈ పర్సు ఇట్లా పెట్టుకొని కూర్చున్నావు ని కదా ఏమిటో చెపుతావా
చెపుతా కూర్చో ఈ బ్రేడ్ తిను తాత
ప్రేమతో ఇచ్చావు తినను అనకూడదు
ఇంటికివేల్లక భార్యతో కలసి తింటాబాబు
కధ చెప్పఁటం మొదలుపెట్టాడు వృద్ధుడు
ఈ ప్రపంచములో బ్రతుకుట అనర్హులు, అనేవారులేరు, నాదృష్టిలో నేనన్నది మీరు ఈ వయసులో కుడా కష్టపడుట గురుంచి, అన్నాడు మాధవ్ అది నా కర్ద మైయింది, కానీ వయసు మీరినది అని ఊరికే కూర్చుంటే అనారోగ్యులుగా మారుటకు చేతులారా ఆహ్వానించిన వారు అవుతారు, బాబు ఎవరైనా వయసులో పడ్డ ఆకష్టాన్ని, చేసిన మంచి పనులను నలుగురితో వయసుని బట్టి పంచు కుంటూ ఉండటమే నిజమైన జీవితము అని నా భావన,అన్నాడు మాధవ్, ఆకలి తీర్చుకొనుకు వేరొకరిని ఇబ్బంది పెట్టకుండా, గుండెపోటు రాకుండా కష్టానికి తగ్గ ఫలితము తెచ్చుకోవటమే జీవితము కదా అన్నాడు వృద్ధుడు.
అవును ఎండలో నుంచోనిఉండేవాణ్ణి బతుకు కొరకు అన్నాడు వృద్ధుడు
అవు నను కోండి మీరు రోజూ ఆకలి కోసం మండు టెండలో నుంచోవటం అవసరమా అందులో కా ళ్ళకు చెప్పులు లేకుండా, తలపై గొడుగు లేకుండా కళ్ళకు జోడు లేకుండా ఉండి కష్టపడటం అవసరమా
నా భార్య వృద్ధురాలు, ఆమెకు కళ్ళు కూడా సరిగా కనబడవు, నాకు పుట్టిన కొడుకులు, కూతుర్లు ఎవరి దారి వారు చూసుకున్నారు, కానీ నాతో జీవితము పంచుకున్న నా శ్రీమతిని నేను తప్పక కాపాడు కోవాలి, వయసులో ఉన్నప్పుడు ఒకరికొకరం కష్టపడి పనిచేసు కున్నాము, ఆ కష్టమే నా పిల్లల భవిషత్తుకు మార్గం చూపినాము, రెక్కలు వచ్చిన పక్షులను ఆపలేముకదా, అవి ప్రపంచాన్ని అనుభవాలన్నీ తెలుసు కోవాలి కదా బాబు. వారు వారిపిల్లల బతుకు నేను చూడలేనని బతకమని బయఁటకు పంపాను. ఇప్పుడు పిలుద్దామన్న ఎక్కడు న్నారో తెలియదు బాబు నా పిల్లలు. అనారోగ్యంగా ఉన్న భార్యకు మందు ఇప్పించి బతుకుటకు ఇన్దురము వచ్చాము.
అవునండి మీరు చెప్పినది నిజమే మీ కష్టం వేరొకరికి రావద్దని ఆ దేవుడ్ని కోరు కుంటాను.
అవును బాబు ఇప్పటి నా వయసులో ఎటువంటి పని ఇచ్చే వారు లేరు, నాభార్యను ముందు బ్రతి కించు కోవాలి అందుకనే ప్రధాన వీధిలో ఉన్న ఒక హోటల్ ముందు నుంచోటానికి ఒప్పు కున్నాను అది కూడా 12 గంటలనుండి మూడు గంటల వరకు " భోజనం తయారు " అనే బోర్డు పట్టుకొని నుంచోని ఉంటే భోజనం ప్యాకెట్టు అన్నా దొరుకు తున్నది, మా ఇద్దరి కడుపు నిండి పోతున్నది.
అట్లా వీధిలో నుంచోవటం కష్టముగా లేదా. ఎందుకు లేదు మనసులో దృఢసంకల్పం, ఓర్పు ఉంటే ఎంతటి కష్టమైనా భరించ గలిగే శక్తి ఆభగవంతుడే నాకు ఇచ్చాడు.
ఒకరోజు నేను ఎండలోనుంచున్నప్పుడు నాకాళ్ళు బొబ్బ లెక్కాయి, తల మీద సూరీడు విలయ తాండవం చేస్తున్నాడు, అట్టి సమయములో నాకు విపరీతమైన దాహము వేసినది, దాహం తీర్చు కోవటానికి కూడా కదల కూడదు అది మేము పెట్టుకున్న నిభందన, అప్పడే దేవుల్లాగా కొందరు విద్యార్థులు కనిపించారు వారు హోటల్లో కి వచ్చి మంచినీరు బాటిల్సుతో మోహము కడుక్కొని, వంటి మీద పోసుకొని, త్రాగి నంత వరకు త్రాగి ఒకతను నా మొఖానా ఒక బాటిల్ విసిరాడు, ఆత్రుతతోఁ పట్టి త్రాగాలని అనుకున్నా, చేతికి చిక్కక అది క్రింద పడింది, చివరకు బాటిల్లో ఉన్న ఆ నాలుగు చుక్కలే నా ప్రాణాన్ని రాక్షించాయి.
అప్పుడే నాకు తెలిసిన బంధువులు వచ్చారు, వారితో పలకరించుట కుదరలేదు, వారు నా పరిస్థిని చూసి పలకరించుటకు సహకరించలేదు అప్పుడు నా పరిస్థితి భాదను పంచుకొనే స్థితి లేదు, చెప్పుకొనే పరిస్థితి లేదు, అప్పుడని పించింది గుర్తింపుకు విలువలేని చోట ఉండుట మంచిదేనా అని ఆలోచించాను, కానీ బ్రతుకు కోసం కొన్ని నిజాలు దాచాలని గుర్తుకు వచ్చి అట్లా ఉండి పోయాను.
ఇలా కొన్ని రోజులు సాగుతున్నాయి ఒకరోజు నేను నుంచొని ఉండే చోట హోటల్ మూసివేశారు ఎప్పుడేమి చేయాలో నాకు తోచలేదు నా అలవాటు మానుకోవటం ఎందుకని ఆరోజు ఒక బల్లమీ ద, ఇక్కడ మంచినీరు ఉచితముగా దొరుకును అని తెల్ల సుద్దతో వ్రాసి పట్టుకొని నుంచొని ఉన్నా, చాలామంది వచ్చి ఆగి మంచి నీరు త్రాగి నాకు డబ్బులు ఇవ్వ చూపారు, వారి వద్ద నేను ఎటు వంటి డబ్బు తీసు కోలేదు కానీ ఒక పాప చిన్న చాక్లెట్ ఇచ్చింది అది తీసుకు వచ్చి నాభార్యకు ఇచ్చాను ఇది నా ఈనాటి అహ్హరం అని చెప్పను. నవ్వుతూ నోటితో సగము కొరుక్కొని మిగతా సగము నాకు పంచింది సంతోషములో కష్టములో సమానముగా పంచుకో గలగాము. అప్పుడే ఒక కారులో మధ్య వయసులో ఉన్న వారు దాహం దాహం అని వచ్చారు వారికీ మంచి నీరు పోసా చాలా సంతోషమ్ముతో సాగనంపా.
తర్వాత కుండా దగ్గర ఆపేసు ఏపీడీ ఉండుట చూసా
దానిలో చాలా డబ్బు ఉంది
దానిలోనుండి మందులకు మంచినీళ్లకు ఖర్చు రాసిపెట్టి మరి డబ్బు వాడుతున్న ఆ దంపతులు మళ్ళీ వస్తారని ఎదురు చూస్తున్నాను
వారి ఋణం ఎప్పుడు తీర్చుకోవాలో
ఇప్పుడు కూర్చొని నీళ్ల దానం చేస్తునను బాబు
తాత ఈరోజు నేను కూర్చొంటా నీవు విశ్రాంతి తీసుకో తాత
నీకెందుకు బాబు
అట్లా అనకు తాత నేను నీకు రుణపడి ఉన్నా నీకొరకే అనుకో
మంచిది బాబు
--(())--
No comments:
Post a Comment