నేటి ఆలోచనా పద్యాలు
ఎంత చక్కని దో ఎంత చిక్కగాను నవ్వు చున్నాదే
ఎంత పల్కులతో ఎంత చూపులతో హృదయము దోచెనులె
ఎంత చోద్యముయే ఎంత హాస్యము యే హృదయ చింత పెరిగె
ఎంత ముఖ్యమో ను ఎంత సహనమ్మే హృదయ వాంఛ కలిగె
ప్రేమ సుగంధమో ప్రేమ వలపు వీణ రాగ మరందమో
కోమల పుష్పమో కోకిల గానమో రాస లీలలు గా
కౌమిది హర్షమో కన్నుల పిలుపుయో సుందరభావమై
నా మది నిల్వదే ననుయె కరుణించవె నామనోనేత్రివి
ఆమె లావణ్యం ఆమె లాలిత్వం నాకు సంతోషం
ఆమె కారుణ్యం ఆమె కర్తవ్యం నాకు విశ్వాసం
ఆమె ధారుఢ్యం ఆమె దేహత్వం నాకు రాహిత్యం
ఆమె వాస్తవం ఆమె వాత్సల్యం నాకు సమ్మోహం
ఊహ లలో మునిగి ఊయల లో ఊగి ఊరుకో లేకయె
స్నేహితుల తోను స్నేహము బంధమై మనసు హాయి గూర్చె
దాహము తీర్చుటే దరిన సేవ చేసి సహన సహ కారము
దేహము పరులకే దాన ధర్మాలను చేయు విశ్రాంతిగ
నచ్చె మదీయ భావమునె నాది మనస్సు పంచునే సదా
మెచ్చె ను నీ కళా వరము మాయను మాపి వచ్చెదా సదా
సచ్చరి తంబునే తెలిసి సర్వము పంచెదా సదా
నా చెలి హృద్యమే సుఖము నేడు ఫలించు శక్తిగా
ప్రకృతి లో జడత్వం మాయ మోహం
సుకృతి యే ధనత్వం మాయ లక్ష్యం
వికృతి యే ఋణత్వం మాయ వైనం
యి ధృతి యే సమత్వం మాయ లోకం
రోగము వచ్చెనే యువతి రాగము దేనికి ఇప్పుడేగదా
భోగము ఎందుకే ధనము పంచితి ఆశను తీర్చలేను గా
వేగము వద్దులే బతుకు వాంఛను మానుట కోరుటే సదా
రాగము తెల్పకే విషయ లభ్యము దైవము తీర్పు యే కథా
మనిషి తెలివి మీరి మాయ చెంత చేరి అంత తెల్సననే
కనులు ఉన్న నిన్ను కాన లేని బతుకు ఆశ పాముతోను
మనసు పద్మాన్నే పంచ లేకయె శివ పూజకు పువ్వులను
కోనసీమ పండు కొండనెక్కి తెచ్చి నిన్ను మరిచె మనిషి
పాప మనె బీజం మొలచి మోక్కగాను ఎదిగి వృక్ష మయ్యె
ఒప్పు కర్మఫలం ఓర్పు కొమ్మలై పూర్వ జన్మ యుక్తి
మెప్పు శరీరమే మొగ్గలు ఆకులై వీర్య ఫలపుష్పమె
తాపముయె దుఃఖం తపము సంసారం పండు పుట్టి రాలు
నేటి ఆలోచనా పద్యాలు
మాకును తెల్పకే కధలు మానస మంతయు తిప్పుటే భయమ్
వేకువ జామునే కలిసి వేదన పల్కులె పల్కుటే వినమ్
మీకును మీకు మీకు మరి మీకును మీకును మీకు మీకునున్
మోక్కెద నేను నేను విను మాటలు వద్దులె బంధనం కథే
అక్షర విన్యాసం అర్ధము నేతెల్పె అలుపెరుగని విధము
సాక్షి సామరస్య శక్తి నివ్వకయే సాదు వాద మొద్దు
మొక్షమేది రాదు మోడుగా మార్చ క నన్ను బతక నివ్వు
అక్షర సత్య మే ఆప కుండా పలకాలని దైవ మనె
విత్తు నే తినే ను విజయ చీమలు గా మానవ మృగాలే
చెత్త నే తినే జాతి పక్షులు గా మొలక ఎత్త కుండ
మత్తు గాను నెమరు మొక్కనుతినేసియు మనుష జన్మ ఇదియు
ఎత్తులెన్నేసిన ఏదయలేనట్టి వెధవ బతుకు దారి
నిదుర లోన గూడ నిప్పు అనియు అరిచి భయము తెచ్చు చుండు
కదిరి లాత్రిప్పుచు కలవ రించు చుండె మనసు తో మానవ
ఉదయ వెలుగులా గ ఊరు కోక ఆస్వాదించే ప్రకృతిలొ
అద్భుతం బుగాను కలము పట్టి కవిత తృప్తి అమోఘమ్ము
మనస్సే పాదాల్నే తలచుతు విధి ప్రేమికుడు నై
వయస్సే ధ్యానం గా సకలము శుభ కారకుడనై
ఉషస్సే విశ్వం గా కళలకు విజయా మనసు నై
సమస్యే కాలం తో కధలు గ తెలి పేందుకు శివా
వెల కాంతల అంద మంత సుడి లయ గుండున్
కల కాంతకు సాటి రారు కవలయ మందున్
కల విద్యలు ఎన్నియైన బతుకును మార్చవ్
కుల విద్యకు సాటి రావు నిజమును కాదా
కాలము నాది కాదని ని గర్జన దేనికి ఆపుమా మనో
ఉల్లము జల్లుగా అయిన ఊయల లాగున అర్వకే మనో
మల్లిక వచ్చెనే మనసు మాయ గా మోహము కమ్మెనే మనో
ఏలిక వల్లనే ఇదియు ఏకము ఏమియు తెల్యటం లేదే
విజయం తధ్యము తొందరెందుకును దేవేంద్రా యి వేలంబునన్
సృజనా నందము శోభ నిచ్చును లె యీ విశ్వాస కాలమ్మునన్
భజనే వద్దులె సేవ భావముతొ నాకర్షించి సంతోష రా
గజనీ ముద్దులు పంచి శంకరుని నాకర్షింపు పూసెజ్జకున్
"ఉత్పలమాల..
చక్కని చంద్రపూర్ణతకు సాటియ యామె ముఖమ్ముఁనెంచఁగన్
చిక్కని లేఁతఁగౌనుఁగన చేడియకుండెడి మధ్యభాగమౌ
మక్కువ నొందగా నిడును మాటయు చేష్టయు హావభావముల్ ..
చెక్కిన బొమ్మచిత్రముగఁజేసెను నాట్యమునెల్లవీధులన్ !!! "
----------------------------------------
( ఇందులో.. చివరి పాదమే.. సమస్య )..
----------------------------------------
ఉత్పలమాల
ఎక్కువమోసమే వినయ వాంఛలు వాళ్లనె కల్గు చుండగన్
మక్కువ కాలమే విషయ మౌనము బంధము తెల్పదాల్చగన్
చక్కని మాటలే మమత జూపెను భాష్యమువల్ల గాధలన్
చెక్కిన బొమ్మచిత్రముగఁజేసెను నాట్యమునెల్లవీధులన్ !!! "
"ఉత్పలమాల..
----
కుంజరశోభితాననుఁడ ! గుహ్యజపాదులుఁజేసెదన్ మదిన్
అంజలులిచ్చుచున్ సువినయాన్విత బుద్ధిని శ్రద్ధతోడుతన్..
కంజదళాక్షసేవితుఁడ కర్ణవిశాలుఁడ ! వక్రతుండుఁడా !
భంజకుఁడీవెగా సకలభాగ్యవినాశక విఘ్నరాశికిన్ !!! "
-
సంతస మయ్యెనన్ విషయ శాంతిని కోరియు మోహనంబులో
పంతము పొయ్యినన్ సహజ మౌనము కొరిక తీర్చు తంబులో
చెంతకు చేరియున్ మనసు జాలిని చూపియు సంతసంబులో
అంతయు కాలమున్ జరుపు సహజ లిలయు పొందుమోదమున్
సుంతయు బ్రేమ లేని శృతి జూచి సతీ మణి పొందు మోదమన్
పంతము తోను కోపములు పెర్గి పతీ మనసు నందు తాపమున్
శాంతము కొర్కు ఆశయము సౌఖ్య మనే వయసు నందు శోభయున్
కాంతిని కోరి కాలముతొ కావ్య మతీ సతి పతీ సమానమున్
నేటి సమస్యను పూరించుట 01 -07 -2021.....
మాతయె పెంచెరా మనసు ప్రేరణ కల్గుట జీవితంబునన్
దాతయె అయ్యెరా సహజ తప్పులు చెప్పుచు సాధనంబునన్
శాంతము కోరెరా ఇపుడు శాపము వల్లన కోపసంబునన్
సీతయె చంపెరా విమల శ్రీరఘురాముని సంతసంబునన్
సీత = పృథ్వి
సౌందర్యలహరి శ్రీ శంకర భగవత్పాద విరచితము. ఇది 100 శ్లోకములతో కూడిన దేవీ స్తుతి గ్రంథము. పరబ్రహ్మ తత్త్వాన్ని 'శాంతం, శివం, సుందరం' అని పేర్కొంటాము. ఆ పరతత్త్వం, తత్స్వరూప సౌందర్య స్వభావ ప్రవర్తనాలు మానవాకృతిని దాల్చి, స్త్రీమూర్తిగా అభివ్యక్తమైతే ఎలావుంటుందో ఈ గ్రంథంలో అత్యంత మనోజ్ఞంగా వర్ణింపబడి ఉన్నవి. అంటే నిర్గుణ నిరాకార పరబ్రహ్మంను సగుణ సాకార రూపంలో ఉపాసించడానికి ఉపయుక్తమయ్యే అక్షరమాలారత్నం ఈ గ్రంథం. శ్లోకాలన్నీ మృదుమధుర గంభీరాలై, ప్రసాదసౌకుమార్యాలై వెలయుచు, భక్తిశ్రద్ధలతో చదివే దేవీభక్తులకు అనిర్వాచ్యమైన మనశ్శాంతిని కలుగజేస్తాయనడంలో అతిశయోక్తి లేదు.
ఈ గ్రంథంలో దేవీ సౌందర్యం, స్వరూప - సంస్థితి - గుణ - చేష్టా - ప్రభావ - తత్త్వసౌందర్యాల - స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ భేదాలతో అత్యంత మనోహరంగా వర్ణించటం వలన శ్రీ శంకర భగవత్పాద విరచిత ఈ దేవీస్తుతికి సౌందర్యలహరి అనే నామకరణం ఎంతో సముచితంగా ఉంది. ఈ దేవియే యోగమాయ. ఆదిశక్తి ఐన ఈ తల్లి దుర్గాది శక్తిరూపాలను పొంది ఈ కలియుగంలో సర్వత్రా పూజలందుకుంటున్నది. ఆదిపరాశక్తియే ప్రతిగ్రామంలోనూ గ్రామశక్తిగావివిధ నామాలతో వెలయుచు ప్రతి గ్రామానికీ గ్రామశక్తి యై ప్రధాన దేవతగా ఉంటుంది.
పాండవులు అజ్ఞాతవాసానికి బయలుదేరుతున్నప్పుడు అది జ్ఞాతం కాకుండా ఉండడానికి దుర్గాస్తవం చేసి ఉన్నారు. అర్జునుడు కౌరవులతో సంగ్రామానికి మూందు శ్రీకృష్ణ ప్రేరితుడై దుర్గాదేవిని పూజించాడు. ఉపనయం సమయంలో మొదట ఉపదేశింప బడేది గాయత్రీ మంత్రమే కదా! అందువల్ల ప్రతి వ్యక్తీ మొదట శక్తి ఉపాసకుడే అవుతున్నాడు.
జగజ్జనని ఐన శ్రీదేవి తనను ఉపాసించే భక్తులను తన కన్నబిడ్డల్లా ప్రేమించి భుక్తి ముక్తులను తప్పక ప్రసాదిస్తుంది. అందువల్ల ఎల్లరూ తమ శక్త్యానుసారం పరాశక్తి, ఆదిశక్తి, శ్రీ రాజరాజేశ్వరీ, లలిత, శ్రీ మహాత్రిపురసుందరి అనే నామాలతో విరాజిల్లే శ్రీదేవిని ఉపాసించి శ్రీమాత అనుగ్రహంతో ఐహిక సుఖాలను మాత్రమే కాకుండ పునరావృత్తిరహితమూ, నిరతిశయ సుఖమూ అమృతధామము ఐన మోక్షాన్ని పొందుదురు గాక!
1 శ్లో|| శివః శక్త్యాయుక్తోయది భవతి శక్తః ప్రభవితుం
న చే దేవం దేవో నఖలు కుశలః స్పందితు మపి |
అతస్త్వా మారాధ్యాం హరిహర విరఞ్చాదిభిరపి
ప్రణంతుం స్తో్తుంవా కథ మకృత పుణ్యః ప్రభవతి ||
అమ్మా, ఓ భగవతీ! సర్వమంగల సహితుడయిన శివుడు జగన్నిర్మాణశక్తివయిన నీతో కూడితేనేకాని జగాలను సృజించడానికి సమర్థుడు కాడు; నీతో కూడకపోతే ఆ దేవుడు తాను కదలటానికి సైతం అశక్తుడు. అలాంటప్పుడు హరి హర బ్రహ్మాదుల చేతను పూజింపదగిన నిన్ను మ్రొక్కటానికిగాని, స్తుతించటానికి గాని పూర్వజన్మలో పుణ్యం చేయని వ్యక్తి ఎలా సమర్థుడవుతాడు? కాడు.
*************
2 శ్లో|| తనీయాంసం పాంసుం తవచరణ పజ్కేరుహ భవం
విరిఞ్చిస్సఞ్చిన్వన్ విరచయతి లోకా నవికలమ్ |
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళనవిధిమ్ ||
*************
3 శ్లో|| అవిద్యానా మంతస్తిమిర మిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తబక మకరంద స్రుతి ఝరీ |
దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి ||
4 శ్లో|| త్వదన్యః పాణిభ్యా మభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా |
భయాత్త్రాతుం దాతుం ఫలమపిచ వాఞ్చాసమధికం
శరణ్యే లోకానాం తవహిచరణా వేవ నిపుణౌ ||
*************
5 శ్లో|| హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ |
స్మరో పి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా
మునీనా మప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్ ||
6 శ్లో|| ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః
వసంత స్సామంతో మలయమరు దాయోధన రథః |
తథా ప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్
అపాజ్గాత్తే లబ్ధ్వా జగదిద మనజ్గో విజయతే ||
*************
7 శ్లో|| క్వణత్కాఞ్చీదామా కరికలభ కుంభస్తననతా
పరిక్షీణామధ్యే పరిణత శరచ్చంద్రవదనా |
ధనుర్బాణాన్ పాశం సృణి మపి దధానా కరతలైః
పురస్తా దాస్తాం నః పురమథితు రాహో పురుషికా ||
సౌందర్యలహరి
8 శ్లో|| సుధాసింధోర్మధ్యే సురవిటపివాటీపరివృతే
మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే|
శివాకారే మఞ్చే పరమశివపర్యజ్కనిలయామ్
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ ||
తల్లీ! పాలకడలి నడుమ నెలకొన్న రత్నాల దీవిలో, కల్పవృక్షాల వరుసతో చుట్టబడినదైన కదంబచెట్ల పూలతోటలలో చెలువొందే చింతామణులతో నిర్మితమైన గృహంలో, పరబ్రహ్మ అయినటువంటి పరమశివ పర్యంకనిలయవై, మంగళరూపమైన ( త్రికోణపు) పానుపుపై, నిరతిశయానంద ప్రవాహ స్వరూపిణివైన నిన్ను కొందరు ధన్యులుమాత్రం సేవిస్తున్నారు. (అందరికీ సామాన్యంగా నీ సేవ లభించదని భావం).
2 శ్లో|| తనీయాంసం పాంసుం తవచరణ పజ్కేరుహ భవం
విరిఞ్చిస్సఞ్చిన్వన్ విరచయతి లోకా నవికలమ్ |
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళనవిధిమ్ ||
*************
No comments:
Post a Comment