Friday, 3 May 2019

ప్రాంజలి ప్రభ -తెలుగు అంతర్జాల వార పత్రిక ( మే- మేదటివారం- శుక్రవారం )

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:  (15/12
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం_



  ఒకప్పుడు...పరీక్ష రిజల్ట్స్ వస్తున్నాయంటే చాలు.. 
ముందు రోజు రాత్రి నిద్ర వుండేది కాదు.
నిద్రలోనూ భగవంతునికి మొక్కులే! 

ఫస్టు క్లాసు అక్కర్లేదు కానీ పేపర్లో నెంబరు వుండేలా చూడమని దేవుడికి పదే పదే అర్జీలు.

ఉదయాన్నే లేచి.. పేపరు కోసం సెంటర్లోకి పరుగు 
అప్పటికే కిల్లీ బడ్డీ దగ్గర అన్ సోల్డ్ పేపర్లు అన్నీ సోల్డ్ అయిపోతే..

వీధిలో ఎవరు పేపరు వేయించుకుంటారా అని వెదుకులాట.

ఎలాగోలా ఒక పేపరు సంపాధిస్తే.. పది మంది మిత్రులు పోటీ..
కంగార్లో నెంబరు సరిగ్గా కనిపించకపోవడం..
  
రెగ్యులర్ నెంబర్లు ఒకవైపు, కంపార్ట్ మెంట్ నెంబర్లు మరో వైపు వాటిలో మళ్లీ, ఫస్టు, సెకండు, థర్డ్ క్లాస్ లు.  ఫస్టు క్లాసులు అయితే..రెండుమూడు వరసలే! సెకండ్ మరికొంచెం..థర్డ్ క్లాసయితే... సగం పేజీ..   మొదట ఫస్ట్ క్లాస్ కాలమ్ లో వెదుకులాట.-ఆశ..

నెంబర్ లేకపోయే సరికి మనకు అంత సీను లేదులే అనుకుని సెకండ్ క్లాస్ ఆపై థర్డ్ క్లాస్ కాలమ్స్ లో నెంబరు వెదుకులాట..

హమ్మయ్య నెంబరు వుంది అనుకోగానే వేయి ఏనుగుల బలం.. కొండంత ఆనందం.. పాస్ అయిన హాల్ టిక్కెట్ నెంబరు వున్న పేపరు భద్రంగా దాచుకోవడం.

ఆ తర్వాత, నా ముందు నెంబరు, తర్వాత నెంబరు వుందో లేదో చూడటం.. అదో ఆనందం..

ఇక అక్కడ నుంచి ఎవరెవరు పాసయ్యారు.. ఏ క్లాసులో పాసయ్యారు..

గోల గోల.. రిజల్ట్ చూడటానికి రానివాళ్ల ఇంటికి అంతా గుంపుగా వెళ్లి ఆనందం పంచుకోవడం..

ఫెయిల్ అయిన వాళ్ల ఇళ్లకు ఓదార్పు యాత్ర.

ఇక అక్కడ నుంచి మాస్టార్ల ఇళ్లకు వెళ్లి రిజల్ట్స్ చెప్పుకోవడం.. వాళ్లతో ఆనందం పంచుకోవడం..

ఈలోగా ఇంటి దగ్గర అమ్మ నాన్న, అన్న తమ్ముడు అంతా వీధిలో మీటింగు మావోడు పాసయ్యాడు అంటే పాసయ్యాడని..

స్వీట్లు..అదే అమ్మచేసిన లడ్డూల  పంపకం..

ఇక ఆ రోజంతా .. ఇంట్లో .. వీధిలో మనమే హీరో..

కట్ చేస్తే..

ఇప్పుడు...
ఆ ఆనందం.. గర్వం.. సంతృప్తి.. ఏవీ..?? 

ఇప్పడు ....పరీక్ష పాసైన పిల్లల్లో అవేవీ కనిపించడం లేదు.. ప్రతి ఇంట్లోనూ పాసయినా... ఏడుపే!

అంతా నిర్లిప్తత..
పాసయ్యామా అని కాదు.. ఎన్ని మార్క్లులొచ్చాయ్.. ఇదీ ప్రశ్న

ఎన్ని మార్కులొచ్చినా.. ఇంకా వస్తే బావుండేది.. సంతృప్తి ఎక్కడా..?

ప్చ్..

చిన్న చిన్న ఆనందాలకు పిల్లలు దూరం అవుతున్నారు..
కాదు మనం కూడా దూరం చేస్తున్నాం.

చదివే యంత్రాలవుతున్నారు..
ర్యాంకులను ఇచ్చే ప్రింటర్లు అవుతున్నారు..

విద్యార్థులు మాయం అవుతున్నారు..

మిషన్లులా మిగులుతున్నారు..  

ఈనాటి పరిస్థితులు తప్పక  మారాలి..
  ఇంటర్ ఫలితాలు వచ్చాయి.  నాకు తెలిసిన ఓ పదిమంది పిల్లలు పరీక్షలు రాసిన వారిలో ఉన్నారు.  వారి రిజుల్త్స్ కనుక్కుందామని కొందరికి ఫోన్ చేసాను.  ఒక అమ్మాయికి ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ రిసీవ్ చేసుకింది.  "అమ్మాయి కు మూడ్ బాగా లేదు. పడుకుంది"  అని చెప్పింది ఆమె.  ఆ పిల్ల చాలా తెలివికలది.  పొరపాటున తప్పిందా అని అనుమానం వచ్చి "ఎన్ని మార్కులు వచ్చాయి?" అని అడిగాను.  975 అని జవాబిచ్చిది ఆమె.  అబ్బో.... చాలా మంచి మార్కులు... మరి మూడ్ బాగా లేకపోవడం ఏమిటి?  అన్నాను.  985 ఎక్స్పెక్ట్ చేసింది.  దాంతో డిప్రెషన్ లో ఉంది.  మాకు కూడా తృప్తి లేదు. అందుకే ఎక్కడికీ వెళ్ళలేదు"  అని చెప్పింది ఆమె.

  మరొకరికి ఫోన్ చేసాను.  ఆ అమ్మాయి పెద్దగా ఏడుస్తున్న సౌండ్ వినిపించింది.  వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకుంది.  " మార్కులు బాగా తక్కువ వచ్చాయి.  పొద్దుటినుంచి ఏడుస్తున్నది. ఓదార్చడం మా వల్ల కావడం లేదు"  అన్నది ఆమె.  "ఎన్ని వచ్చాయి?" అడిగాను. " 985 వచ్చాయి."  చెప్పింది ఆమె.  నాకు చిరుకోపం వచ్చింది.  "పార్టీ అడుగుతాము అని మీరు అలా అంటున్నారు.  985 అంటే చాలా గొప్ప మార్కులు కదా? "  అన్నాను.  "మార్కులు రాగానే వాళ్ళ కాలేజి నుంచి ఎవరో ఫోన్ చేసారు.  ఇంకొక్క రెండు మార్కులు వచ్చినట్లయితే, నీ పేరు, ఫోటో ఫ్లెక్సీ లకు ఎక్కేది.  మంచి చాన్స్ మిస్ చేసుకున్నావు.  ఇంత తక్కువ వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చెయ్యలేదు"  అని అన్నదట ఆమె ఎవరో...దాంతో దిగులు పడింది."  అన్నది ఆ తల్లి.  

 మరొకరికి ఫోన్ చేస్తే వాళ్ళ డాడి మాట్లాడాడు.  "ఎన్నో ఆశలు  పెట్టుకున్నాం. డాక్టర్ని చేయ్యాలనుకున్నాము.  20 వేలు పెట్టి స్మార్ట్ ఫోన్ కొనిచ్చాము.  అయిదారు వేల రూపాయల్ డ్రస్సులు అడిగితె కొనిపెట్టాము.  లక్షల ఫీజులు కట్టాము.  కాలేజి కి వెళ్ళడానికి హోండా ఆక్తివా కావాలంటే కొనిపెట్టాము.  చివరకు 965 మార్కులు తెచ్చుకుని మా ఆశలు నీరు కార్చింది.  వాళ్ళ అమ్మ కోపం పట్టలేక చీపురు కట్టే తో చితక కొట్టింది.  ఇద్దరు ఏడుస్తూ గదిలో పడుకున్నారు. "  చెప్పాడు ఆ జనకుడు.  

 మరొకరికి ఫోన్ చేస్తే 750 మార్కులు వచ్చాయట.  వాళ్లకు అప్పటి నుంచి అన్నం నీళ్ళు లేకుండా పడుకున్నారట.   అయిదారుగురు పిల్లలకు 850-950 మధ్యన మార్కులు వచ్చాయి.  వాళ్ళు  కూడా తీవ్ర నిరాశలో కూరుకుపోయి, ఇక  జీవితం వ్యర్ధం అన్నంతగా కుమిలి పోతున్నారు.  

  750 వచ్చినా, 850 వచ్చినా, 985 వచ్చినా ఎవరికీ సంతోషం లేదు.  అందరూ ఏడుస్తున్నారు.  

 లోపం ఎక్కడుంది?  విద్యా వ్యవస్థ లోనా?  టీచర్ల లోనా, చదువుల లోనా, పిల్లల లోనా, తల్లితండ్రుల లోనా, సమాజం లోనా, ప్రభుత్వం లోనా?  

  ఇప్పుడు 40 ఏళ్ల వయసు దాటి దేశ విదేశాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్న వారంతా టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు అత్తెసరు మార్కులతో పాస్ అయిన వారేనని ఈ పిల్లలు, తల్లితండ్రులు ఎప్పుడు తెలుసకుంటారు? 

         ఏ బోధి వృక్షం కింద కూర్చుంటే  వీళ్ళకు జ్ఞానోదయం అవుతుంది?

--((**))--




శృంగార సాహాత్యం 
నాలో శ్రుంగారం ఉట్టి పడుతుంటే 
ఒంటరిగా కూర్చుంటావేమిర మోగడా
చేను చిక్కగాఉంది సర్దుకు పొమ్మంటే
బిత్రచూపులతో ఉంటావేమిర మోగడా

సెలయేరులో స్నానమాడమంటే 
కప్పలు చూసి భయమేమిటిరా మోగడా
తడిసిన బట్టల్తో కవ్విస్తూ ఉంటే
కళ్ళుమూసి జపంచేస్తావేమిటరా మోగడా

నన్ను పైకెత్తి పట్టి మోయరా అంటూ ఉంటే
శక్తినీ నీరు కార్చి ఉంటావేమిటిరా మోగడా
ఉంగరం తెచ్చా వేలు దూర్చరా అంటూఉంటే
ఉంగరం వద్దు అంటు ఉడాయిస్తా వేమిరా మోగడా

ఇంద్రియ తృప్తి తో ఏలుకోరా అంటూ ఉంటే
జీవిత లక్ష్యం అనితెల్సుకోక ఉంటా వేమిరా మోగుడా
దిగంబర రహస్యాన్ని తల్సుకోరా అంటూఉంటే
ఆత్మవిశ్వాసం తో అంతా మిథ్య అంటా వేమిరా మోగడా

--((**))--



కావ్యశాస్త్రవినోదేన కాలో గచ్ఛతి ధీమతామ్!
వ్యసనేన చ మూర్ఖాణాం నిద్రయా కలహేన వా!!
                       నీతిశాస్త్రం
                 భావము
మనిషి పుట్టినదగ్గరనుండి కాలంతోనే ముడిపడి జీవిస్తూ ఉంటాడు. ఐతే కాలం గడుస్తున్నా ఏమీ తోచనివానికి కాలం గడుస్తున్నట్లు అనిపించదు. దానికోసం మనిషి రెండవిధములైన మార్గాలలో ప్రవర్తిస్తాడు. అందులో ఒకటి తన జన్మని చరితార్థం చేసే మార్గం. రెండవది తన జీవితం సుఖంగా సాగుతోందనే భ్రమలో తనని పారవేసి జీవితాన్ని నాశనం చేసే మార్గం. మొదటిమార్గాన్ని ఎంచుకునే వ్యక్తి వివేకవంతునిగా పరిగణించబడతాడు. రెండవమార్గంలో పయనించే వ్యక్తి మూర్ఖునిగా పరిగణించబడతాడు. 
కావ్యములను గాని శాస్త్రమునుగాని బాగా పరిశోధిస్తూ వాటిని సజ్జనులతో చర్చిస్తూ కాలం గడిపేవారు వివేకవంతులు. కావ్యముల రసమును ఆస్వాదించలేనివారు మరియు శాస్త్రప్రసంగములపై వైముఖ్యము గలవారు ఏదో విధంగా కాలం గడపడం కోసం ఇంద్రియలోలులై ఆకర్షణలకు లోబర్చే విషయములను సదా కోరుతూ వాటితో వ్యసనపరులుగా మారతారు. కొందరు అనాలోచితకర్మలతో మందబుద్ధులై ప్రవర్తిస్తూ అపకీర్తిపాలౌతూ ఉంటారు. బుద్ధిమాంద్యమే నిద్ర అని చెప్పబడుతుంది. మరికొందరు ఇతరులను విమర్శిస్తూ ఎవరు వారితో కలహిస్తారా? అని ఎదురుచూస్తూ కలహాలతో కాలం గడుపుతూ ఉంటారు. ఏది ఏమైనా సరియైన పద్ధతిలో కాలం గడపడానికి ఎంతో పుణ్యసంస్కారం కావాలి... ఆ సంస్కారం పరాంబికయొక్క అనుగ్రహంతోనే సిద్ధించాలి.. 
మీ 
గోపాల శర్మ
--((**))--

జీవితం
----------------------
తెల్లని కాగితంపై
పిచ్చి గీతల
వర్ణమాల వర్ణాల
నిర్మల నిష్కల్మష
పసితనపు పసిబుగ్గల
అమాయక బాల్యజీవితం

కొంటె తనపు 
హరివిల్లు వర్ణాలతో
మనసు కుంచెతో
గీసిన లేవలపుల
కలలు చిత్రాల
లేత యవ్వనజీవితం

ఒడిదుడుకుల
అనుభవ పాటలతో
జీవిత వర్ణాల
రంగులు వెలిసి
కోర్కెల త్యాగాలతో
బరువు బాధ్యతలతో
నడ్డివిరిగే నడిప్రాయజీవితం

తొలి ఉషాకిరణాల
వెలుగుల ఆశతో
అరుణ వర్ణాల
మలి సంధ్య వేళలో
కృంగే పొద్దున
నిశిరాతిరిలో
గడిపే మలివయసుజీవితం


రచన: మాణిక్యం ఇసాక్


రాజకీయాలకు పెన్షన్ వ్యతిరేకంగా సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేయబడింది.

ఈ విషయాన్ని సపోర్ట్ చేయండి మరియు షేర్ చేయండి 

ఇప్పుడు నాయకుల నాయకుడు సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు, మీ అంచనా కోసం దీనిని పంపుతున్నారు ..

భారతదేశం యొక్క ప్రియమైన / గౌరవనీయమైన పౌరులు ... మీరు ఈ సందేశాన్ని చదవడానికి అభ్యర్థించబడ్డారు మరియు మీరు అంగీకరించినట్లయితే దయచేసి మీ సహకారం తో అందరు వ్యక్తులకు పంపండి మరియు వారందరు ప్రతి ఒక్కరికి  పంపమని అడుగుదాం.

మూడు రోజుల్లో, ఈ సందేశం మొత్తం భారతదేశంలో అందరికీ అందాలి. ప్రతి పౌరుడు భారతదేశంలో తన స్వరాన్ని వినిపించాలి. __

2018 అభివృద్ధి చట్టం

ఎంపీలు పింఛను పొందరాదు .ఎందుకంటే రాజకీయాలు అనేవి ఉద్యోగం లేదా ఉపాధి కాదు, కానీ ఉచిత సేవ. - మాత్రమే 
రాజకీయాలు అనేవి పబ్లిక్ రిప్రజెంటేషన్ చట్టం ప్రకారం ఎన్నికలు, దాని పునర్నిర్మాణంపై పదవీ విరమణ లేదు, కానీ వారు అదే పరిస్థితిలో తిరిగి ఎన్నిక అవుతారు. (ప్రస్తుతం 5 సంవత్సరాల సేవ తరువాత వారు పింఛను పొందుతున్నారు).

ఈ విషయంలో మరొక సమస్య ఏమిటంటే, ఒక వ్యక్తి ఒక కౌన్సిలర్ గా ఎన్నిక అవుతాడు, తరువాత శాసన సభ్యుడుగా అవుతాడు మరియు శాసన సభ్యుడు అవుతాడు, అప్పుడు అతను ఒకటి కాదు, మూడు పెన్షన్లు పొందుతున్నాడు.

 వెంటనే ఈ ACT ని ఆపడానికి    దేశం లో ఉన్న పౌరులు పాల్గొనాలి. ఇది ఆపటానకి ప్రయత్నం చేయక పోతే అది ఒక గొప్ప ద్రోహం అవుతుంది....

సెంట్రల్ పే కమిషన్ తో, MP ల జీతం, భత్యం సవరించబడింది .... ఇది ఆదాయపు పన్ను పరిధిలోకి తీసుకురావాలి ....

 ప్రస్తుతానికి, ఎంపీలు వారి వేతనాలు మరియు అనుమతులను తమకు ఓటు వేయడం ద్వారా పెంచుతారు, ఆ సమయంలో అన్ని పార్టీలు ఐక్యమయ్యాయి.

MP లు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నుండి తొలగించబడాలి .. ప్రస్తుతం వారి మరియు భారత ప్రజల ఆరోగ్యం వంటి ఆరోగ్య సంరక్షణ  చికిత్స విదేశాల్లో జరుగుతుంది ఇతర పౌరునికి లా శ్రద్ధ తీసుకోవాలి .. వారు విదేశాల్లో కాకుండా పూర్తి గా , తమ సొంత ఖర్చుతో జరిగేలా చట్టం రావాలి .

విద్యుత్తు, నీరు మరియు ఫోన్ బిల్లు వంటి అన్ని రాయితీలు అంతం కావాలి. (వారు అటువంటి అనేక రాయితీలను తొలగించి  వారు కూడా క్రమంగా తప్పకుండా కట్టేలా చూడాలి.)

క్రిమినల్స్ ఎన్నికలలో పోటీ చేయకూడదు అనుమానాస్పద వ్యక్తులను నిరోధించడం చేయాలి, శిక్షాత్మక రికార్డులు, నేరారోపణలు మరియు నిర్ణయం, గతంలో ఉంటే వారిని  ప్రస్తుత పార్లమెంటు నండి నిషేధించాలి.

కార్యాలయంలోని రాజకీయవేత్తల కారణంగా వారి వలన జరిగే ఆర్థిక నష్టాన్ని కూడా వారి నుండి తిరిగి పొందవచ్చు, వారి నామినీలు, ఆస్తులు - MP లు సాధారణ పౌరులకు వర్తించే అన్ని నిబంధనలు కూడా అనుసరించాలి.

పౌరులచే ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ ఎటువంటి డీడక్షన్ MPలు, MLAలు, ఇతర సబ్సిడీలు, పార్లమెంటు క్యాంటీన్లో సబ్సిడీ ఆహారాలతో సహా వెనక్కి తీసుకోవాలి.

పార్లమెంటులో పనిచేయడం ఒక గౌరవం, దోపిడీ కోసం ఒక లాభదాయక వృత్తి కాదు.

ఉచిత రైలు మరియు విమానం ప్రయాణం ఆపాలి.

సామాన్య మానవుడు వారి సరదాలను ఎందుకు భరించాలి?

ప్రతి వ్యక్తి కనీసం ఇరవై మందితో కమ్యూనికేట్ చేస్తే, భారతదేశంలో చాలా మంది ప్రజలు ఈ సందేశాన్ని పొందడానికి మూడు రోజులు మాత్రమే సమయం ఉంది .

ఈ సమస్యను తొలగించటానికి ఇది సరైన సమయం కాదా?

మీరు దీనిని అంగీకరిస్తే, ఈ మెసేజ్ ను forward చేయండి.

లేకపోతే, దీన్ని తొలగించండి.

మీరు నా 20+ మందిలో ఒకరు, దయచేసి దీన్ని కొనసాగించండి ...

ధన్యవాదాలు. జైహింద్ వందే మాతరం ... 🙏

--((**))--




హార్ట్ ఎటాక్ అనే చింత,  టెన్షన్లను ఇప్పుడిక వదిలివేయండి. 
ఒక శుభవార్త 
ఈ క్రింది వీడియో జాగ్రత్తగా చూడండి 
ఒక క్రొత్త టెక్నిక్ తో కేవలం ఐదు వేల రూపాయలతో మాత్రమే గుండెలోని బ్లాకేజీలను  ఆపరేషన్ లేకుండా డైరెక్టుగా  తొలగించుకోవచ్చును 
.......ఈ గొప్ప అవకాశము బాంబేలోని జేజే హాస్పిటల్ లో కలదు .ఇంతటి అద్భుతమైన శుభ సమాచారాన్ని మరియు ఈ వీడియోని అన్ని గ్రూపులకు ,నీకు తెలిసిన అందరికీ వెంటనే షేర్ చేయగలరు షేర్ చేయగలరు .ఇలాంటి మంచి సమాచారాన్ని పదిమందికి తెలిపి అందరి మరియు దేవుని ఆశీర్వాదాలు పొందగలరు 🙏🙏




ప్రాంజలి చైతన్యగీతం
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

పోరాటం నీదేరా
పోరాట ప్రతిభ నీలోఉందిరా
నిజం తెల్సి పోరాటం సల్పరా

ఎగసి పడే ఉప్పెనలా
ఉరకలుపెట్టే నిప్పులా
చెడుని చంపే భానంలా
విశ్వ శాంతి కోసం పోరాడరా

పోరాటం నీదేరా
పోరాట ప్రతిభ నీలో ఉందిరా
నిజం తెల్సి పోరాటం సల్పరా

సుర్యుడిలా వెలుగు నిందిస్తూ
చంద్రడిలా వెన్నెల నందిస్తూ
పృధ్విలా భారానంతా మోస్తూ
ధర్మపోరు చెయ్యాలిరా

పోరాటం నీదేరా
పోరాట ప్రతిభ నీలో ఉందిరా
నిజం తెల్సి పోరాటం సల్పరా

బానిస సంకెళ్లు తెంచేందుకు రావాలిరా
ఆర్త నాదాన్ని ఆదుకోవుటకు రావాలిరా
అన్నార్తులకు ఆహారం సమర్థంగా ఇద్దాం రారా 
అన్యాయాన్ని అధర్మాన్ని  ఎదుర్కుందారారా

పోరాటం నీదేరా
పోరాట ప్రతిభ నీలో ఉందిరా
నిజం తెల్సి పోరాటం సల్పరా

--((*))--

.


No comments:

Post a Comment