ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమా:(ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం )
🌹🌸 హృదయార్పణం🌸🌹
మనిషి తనకు మానవజన్మ ప్రసాదించిన భగవంతుడికి అనేక విధాలుగా పూజలు చేస్తుంటాడు....
పూజా సమయంలో యథాశక్తి తనకు ఉన్నంతలో
పత్రమో,
పుష్పమో,
ఫలమో,
జలమో సమర్పించుకుంటూ ఉంటాడు.
ఈ విధంగా సమర్పించడం కృతజ్ఞతా సూచకం అయితే కావచ్చునేమోగానీ, అసలు మనిషి భగవంతుడికి సమర్పించగల శక్తిమంతుడేనా?
ఇలా ఆలోచిస్తే, ఎంతమాత్రం కాదని చెప్పవచ్చు.
భగవంతుడిదే ఆ యావత్‌సృష్టి. అలాంటివాడికి భక్తుడు ఇచ్చే కానుకలు అత్యల్పమైనవే.
కానీ ఏదో ఒకటి సమర్పించకపోతే భక్తుడి మనసు వూరుకోదు.
పూర్వం ఒక యోగి భగవంతుణ్ని అర్చించడానికి సిద్ధమయ్యాడు.
అప్పుడు అతడిలో వివేకం ఉదయించింది.
పూజలో ఒక్కొక్క ఉపచారాన్నీ చేస్తూ భగవంతుడితో ఇలా విన్నవించుకున్నాడు- 'పరమేశ్వరా!
నీవు బ్రహ్మాండమంతా నిండి ఉన్నావు. కనుక నిన్ను ఎలా ఆవాహన చేయాలి?
అన్నింటికీ ఆధారమై నీవు ఉండగా నీకు ఆసనం ఎక్కడ వేయాలి?
నిరంతరం స్వచ్ఛంగా ఉండే నీకు కాళ్లు కడుక్కోవడానికి నీళ్లెందుకు?
పరిశుద్ధుడవైన నీకు ఆచమనం అవసరమా?
నిత్యనిర్మలుడవైన నీకు స్నానం ఎలా చేయించాలి?
ప్రపంచమంతా నీలోనే ఉండగా నీకు వస్త్రం ఎలా ధరింపజేయాలి?
గోత్ర వర్ణాలకు అతీతుడవైన నీకు యజ్ఞోపవీతం అవసరమా?
ఏ లేపనాలూ అవసరం లేని నీకు గంధం ఎలా పూయాలి?
నిత్య పరిమళుడవైన నీకు పూలు పెట్టడం ఎందుకు?
మహిమతోనే వెలిగిపోయే నీకు ఆభరణాలు తొడగాలా?
నిరంజనుడవైన నీకు ధూపం వేయడం సరి అయినదేనా?
జగత్తుకే సాక్షిగా నిలిచిన నీకు దీపం అవసరమా?
నిజమైన ఆనందంతో నిలిచే నీకు నైవేద్యం ఎందుకు?
విశ్వానికే ఆనందాన్ని అందించే నీకు తాంబూలాన్ని అర్పించి సంతృప్తిపరచగలనా?
అంతమే లేకుండా అంతటా వ్యాపించిన నీకు ప్రదక్షిణం ఎలా చేయాలి?
అద్వయుడవైన నీకు నమస్కారం ఎలా చేయాలి?
వేదాలే నిన్ను స్తుతించడానికి శక్తి చాలనివి అవుతుంటే నేను నిన్ను ఎలా స్తుతించాలి?'
ఈ పలుకుల్లో నిజం లేకపోలేదు.
భగవంతుడి ముందు ఎంతటి మానవోత్తముడైనా అత్యల్పుడే.
వీడి శక్తి భగవంతుడి ముందు పరిగణనలోకి రానే రాదు.
అయినా భగవంతుడు మనిషి చేసే పూజలను స్వీకరిస్తున్నాడంటే ఆయన అపార కారుణ్యం వర్ణించలేనిది.
నిజంగా భగవంతుడు మనిషి నుంచి కోరేవి సంపదలు కావు.
వస్తువులు అంతకన్నా కావు.
ఆయన మనిషి నుంచి హృదయార్పణను కోరతాడు.
భక్తితో స్మరిస్తే చాలునంటాడు.
కానీ మనిషి మనసు చంచలం. చపలం. స్థిరంగా ఒకచోట ఉండదు.
లౌకిక లంపటాల వల్ల భగవంతుడిపై లగ్నం కాదు.
అందుకే.......
శంకరభగవత్పాదులు-
'ఓ పరమేశ్వరా!
నా మనసు ఒక కోతి వంటిది.
అది ఎప్పుడూ సంసారవాంఛ అనే అడవిలో తిరుగుతూ ఉంటుంది.
భార్యాపుత్రుల ప్రేమ అనే చెట్టుకొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉంటుంది.
క్షణం తీరిక లేకుండా అటూ ఇటూ పరుగులు తీస్తుంటుంది.
అందువల్ల నా మనసు అనే కోతిని నీకు అర్పిస్తున్నాను.
దాన్ని తాడుతో గట్టిగా కట్టి నీ అధీనంలో ఉంచుకో' అని ప్రార్థిస్తారు.
సామాన్య భక్తులను తరింపజేయడానికి ఆయన చేసిన విన్నపం ఇది.
'ఓ పరమేశ్వరా! బంగారుకొండ మేరుపర్వతమే
నీ చేతిలో ఉంది.
అపార ధనవంతుడైన కుబేరుడు
నీ పాదదాసుడై ఉన్నాడు.
కల్పవృక్షం, కామధేనువు, చింతామణి
నీ ఇంటిలోనే ఉన్నాయి.
షోడశ కళలను కురిపించే చంద్రుడు అమృతాన్ని వర్షిస్తూ నీ తలపైనే ఉన్నాడు.
సమస్త మంగళాలనూ కలిగించే పార్వతీదేవి సర్వమంగళయై నీ పక్కనే ఉంది.
కనుక నీకు నేనేమీ ఇవ్వలేను.
నా దగ్గర ఉన్నది ఒక్క మనసే.
అది నీకు సమర్పిస్తున్నాను!'
అని హృదయాన్ని అర్పిస్తే భగవంతుడు ఎంతో ఇష్టపడతాడు.
అచంచల విశ్వాసం, అకుంఠిత భక్తి, అన్నింటినీ నివేదించగల మనసు ఉంటే చాలు.
భగవంతుడు ఏ రూపంలో ఉన్నా పూజల్ని అందుకుంటాడు.
అట్టహాసాలు, ఆర్భాటాలు నిజమైన పూజలు కావు.
హృదయార్పణమే పూజ.
నిశ్చల ధ్యానమే భక్తి.
అంతేకానీ లోకమంతా చూడాలని చేసే నటనలు పూజలు కావు. ఈ సత్యాన్ని మనిషి గ్రహిస్తే మేలు!
ధర్మో రక్షతి రక్షితః
ఓం శ్రీరాం - శ్రీ మాత్రేనమ:
(ఆనందం -ఆరోగ్యం - ఆధ్యాత్మికం )
ప్రాంజలి ప్రభ_- నేటి శార్దూల పద్యం
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
కాలాన్నీ కనుచూపులో మటుమయం చేసేది హాస్యాను భా
వోన్మత్తే మనసే తనూభవముగా చేసేది
ప్రేమాను భా
వోన్మత్తే బ్రతుకే సకాలములుగా చూసేది
మాతృత్వ భా
వోన్మత్తే కధలే వినోదములుగా చెప్పేది
తండ్రేసుమా
నేటి kavitaa nandam
పదవికి రిటైర్మెంట్ ఉంటుంది కానీ
మనసుకు రిటైర్మెంట్ ఉండదు
రాజకీయ మంటే త్రాసులా ఆశావాదం
నాలుగురు కోసం బతకాలి
కష్ట నష్టాలు తీర్చాలి
ఓర్పు ఓదార్పులతో కదలాలి
కూరిమితో విజయపధంగా నడిపించాలి
అందరి శ్రేయోభిలాషగా ఉండాలి
కొందరికి కొమ్ము కాస్తే
కొందరి చెప్పు చేతలలో నడిస్తే
ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని స్థితికి వస్తే
ఏరువాక పొంగు ఏమి చేస్తుందో అదే గతి పడుతుంది
కాలం ఎప్పుడు నీ సొంతం కాదు
తప్పు ఎక్కడ జరిగిందో నెమరువేసుకో
ముందున్న మంచికాలం కోసం వేచి ఉండు
అభిమానామ్ మారదు, ఉపయోగించుకొనే
తెలివి నీవెంట ఉంది ఓర్పు ఓదార్పు తో వుండు
--((**))--
నాలో శ్రుంగారం ఉట్టి పడుతుంటే
ఒంటరిగా కూర్చుంటావేమిర మోగడా
చేను చిక్కగాఉంది సర్దుకు పొమ్మంటే
బిత్రచూపులతో ఉంటావేమిర మోగడా
సెలయేరులో స్నానమాడమంటే
కప్పలు చూసి భయమేమిటిరా మోగడా
తడిసిన బట్టల్తో కవ్విస్తూ ఉంటే
కళ్ళుమూసి జపంచేస్తావేమిటరా మోగడా
నన్ను పైకెత్తి పట్టి మోయరా అంటూ ఉంటే
శక్తినీ నీరు కార్చి ఉంటావేమిటిరా మోగడా
ఉంగరంలొ వేలు దూర్చరా అంటూఉంటే
ఉంరం వద్దు అంటు ఉడాయిస్తావేమిరా మోగడా
నేటి ప్రాంజలి ప్రభ కవితానందం
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
దానవత్వపు లక్షణములే కనలేను
మానవత్వపు లక్షణములు వినలేను
ప్రేమతత్వపు లక్షణములు అనలేను
తల్లితత్వము తండ్రిగుణము తెలిపాను
కదిలి కనులు కడుక్కుని చూడలేను ,
కడలి సిరులు వెతుక్కొని ఆపలేను
వెకిలి పనులు ఎదుర్కొని చెప్పలేను
సగటు మనిషి మనస్సుని నమ్మలేను
దానవులు వేరుగ లేరు మనుజులలో చూసాను
కాలమును నమ్మగ లేరు మగువలలో చూసాను
భావమును చెప్పఁగ లేరు సమయములో చూసాను
కారణమును చెప్పను లేను మనసులలో చుసాను
దాస్టికము , దౌర్జన్యము , దురహంకారము వదిలాను
ధార్మికము, దాతృత్వము, పరహింసారము వదిలాను
మౌనమును, మాధత్వము, మదనాకారము వదిలాను
సేవయును, ప్రేమత్వము, మనొ ప్రాహాసము తలిచాను
--((*))--
యావగించు కొనే వారే ప్రేమ చూపుతారు
కోపగించు కొనే వారే మాట తప్పుతారు
కౌగలించు కొనే వారే తోసి బత్కుతారు
వారిమాట తొనే బత్కి గట్టు చేరువారు
యాచించుటే అలవాటుగ మారిన,
ద్రోహాముతో తలపోటుగా మరినా
స్వార్ధాముతో పనిపోటుగా మారినా
వారందరూ కనువిప్పుగా చేరునా
యాంచిపక ఎవరు తోడు వచ్చుదురో
దానమును ఎవరు ఇస్తు ఉండెదరో
ప్రాణమును ఎవరు పోస్తు ఉండెదరో
వారు మన మనసు లోనె ఉండెదరూ
--((**))--
కన్నవారి నెపము లెంచి కంటనీరు తెప్పించిన వాడు ,
ఉన్న వారి పరువు లెంచి కంట నీరు తెప్పించిన వాడు
అన్న వారి పలుకు నెంచి పంట నీరు తప్పించిన వాడు
అన్నమేది తినక దొంగ బుద్ధి చేసి ఒప్పించిన వాడు
పద్యాలకి నెలవు తెలుగు నేల యండి
విద్యాలయ వెలుగు తెలుగు ప్రాణ మండి
అధ్యాయము మలుపు తెలుగు వారె నండి
గద్యాలయ మనసు తెలిపు విద్య నండి
పద్యమెందుకన్న తెలుగు కవితలజిలుగుతెలిపే,
విద్య వద్ధునన్న వెలుగు సొగసులు మెరుపు తెలిపే
సాధ్య మే ననున్న జిలుగు పలుకులు మనసు తెలిపే
బాధ్య తే ననున్న వెతల కధల పలుకులు దులిపే
నీది నీదని త్యజించిన నిలువు దోపిడి
నాది నాదని చూపించిన మనసు దోపిడి
వద్దు వద్దని రోదించిన సొగసు దోపిడి
మంచి చెడ్డను చెప్పించిన వయసు దోపిడి
నాదు నీదుల జత గూడిన నాడే సర్వం
చేదు తీపిల రుచి చూసిన నాడే సర్వం
కాలు చేతులు పని చేసిన నాడే సర్వం
మేను బాధలు ఒక గుర్తులు అంటె సర్వం
బ్రతుకు బాటను మార్చు మాట ఇదని తెల్పు
తెలివి తేటను చూపు చేయు పనిని కల్పు
మనసు వేటను ఆపు నేత పలుకు సల్పు
వయసు ఆటను మాను చేయి కలిపి తెల్పు
చేత కాదన్న పలుకు ఎట్టి స్థితి అన్కు
వద్దు లేదన్న చిలుకు నమ్మి మాట పల్కు
నిద్ర లేదన్న వణకు పుట్టు నట్లు చిల్కు
సద్దు లేకున్న కునుకు వద్దు సొమ్ము కుల్కు
ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ
ఏ కాంతను కోరక కాంతా సేవ చేయుటే
ఏ ముష్టిని కోరక జీవా నంద పొందుటే
ఏ కాలము కోరక సేవా నంద పొందుటే
ఏ వేషము వేయక ఉన్న సౌఖ్య మోందుటే
ఏ వెన్నెల మనసు ఆస్వాదిస్తూ ఉంటే
ఏ కన్నెల సొగసు ఆకర్షిస్తూ ఉంటే
ఏ వన్నెల వయసు సేవాచెస్తూ ఉంటే
ఏ మన్నన తలుపు తట్టి లేపు తుంటే
సున్నితము సునిశితము సుందరమగు మాట
మానసిక మధురతము మన్ననమగు మాట
లాలితము ముఖలితము జాలితమగు మాట
మాయతము కలియుగము కాలమయము మాట
మీగడే కట్టని పాల నందు వెన్నయు నుండదు
జీవమే కల్వని ఆశ యందు పుట్టుక ఉండదు
ప్రేమయే పండని చోటు యందు మన్నన ఉండదు
ద్వేషమే ఉండిన చోట ప్రేమ పండక మానదు
మన్నన జేయ తగు నేరికైన మదియు మెచ్చ
వడ్డన చేయు తిను వారికైనా కళలు మెచ్చు
తక్కువ చేయు తగు వారికైన మనసు మెచ్చు
ఎక్కువ చేసి చెడు వారికైన అలసి మెచ్చు
నేటి కవితానందం
రచయత:మల్లాప్రగడ రామకృష్ణ
విద్యా అవిద్యా స్వరూపానంద
ప్రకృతి వికృతి పరమానంద
కఫ్ట సుఖాల తో సమయానంద
దీక్ష కక్షల తో కురుక్షేత్రా నంద
నీతికి అవినీతికి మూలానంద
చీకటి వెలుగుల నయనా నంద
మంచి చెడు మాయచేయునంద
పుణ్య పాప కల్పించే ఆనంద
ధర్మా ధర్మ విచక్షణా నంద
సత్యా సత్య అన్వేషణా నంద
కర్మా కర్మ సిధ్ధాంతా నంద
ఆరోగ్య వైరాగ్యా సునంద
కాల అకాల నిశ్చితాత్మానంద
ద్వేష విద్వేష కల్పణానంద
స్వరూప అస్వరూప నంద
న్యాయ అన్యాయ భావానంద
సౌందర్య అసౌందర్యానంద
కార్య అకార్య స్వీకృతానంద
జీవ నిర్జీవ సంఘర్షణానంద
చింతా సంతోష ప్రకృతానంద
నేటికి ఏ నాటికి బేధము లేదు, అదే ప్రకృతి,
సేవకి ఏ ప్రేమకి భేదము లేదు, అదే మనసు
అప్పుకి ఏ తప్పుకి భేదము లేదు, అదే సగటు
తల్లికి ఏ తండ్రికి భేదము లేదు, అదే మమత
మీట నొక్కిన పనిచేయు యంత్రము మెచ్చవచ్చు ,
పీట ఎక్కిన పలికే కుతంత్రము మెచ్చవచ్చు
పాట పాడిన వినసొంపు తంత్రము మెచ్చవచ్చు
పూట కూడుకు బతికించు మంత్రము మెచ్చవచ్చు
మారినది మనుష్య ప్రకృతి వికృతముగ ,
కల్సినది అనూహ్య ప్రకృతి వికృతముగ
చేయునది సమస్య ఆకృతి వికృతముగ
జీవితము వినూత్న స్వకృతి వికృతముగ
నీతి ధర్మము కాలములెల్ల నొక్కటియే
జాతి ధర్మము దేశము అంత నొక్కటియే
ఖ్యాతి ధర్మము చేసిన మేలు నొక్కటియే
గీత ధర్మము తెల్సిన మేలు నొక్కటియే
సంస్కృతి మారవచ్చు , సౌజన్యము కాదు
ఆకృతి మారవచ్చు , అన్యూన్యము కాదు
ప్రకృతి మారవచ్చు, సామాన్యము కాదు
జాగృతి మారవచ్చు, కారుణ్యము కాదు
►►అబ్దుల్ కలాం గారు ఎంతో ముందుచూపుతో రాసిన అరుదైన లేఖ◄◄
**************************
2002 లో దేశంలో నీటి కరువు అధికంగా ఉండడంతో...
అబ్దుల్ కలాం గారు 2070 వ సంవత్సరంలో
నీటి కరువు ఎలా ఉండబోతుందో ఊహిస్తూ ఒక లెటర్ ని రాసారు..
ఆ లెటర్ ని ఒక బ్రిటిష్ పత్రిక వాళ్ళకి
ప్రెజెంటేషన్ లాగా అబ్దుల్ కలాం పంపించారు..!!
అబ్దుల్ కలాం చేసిన ఈ ఊహా చాలా మందిని భయపెట్టింది…!!
దానితో పాటే ప్రకృతి ని రక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేసింది..!!
.
ఆ లెటర్ యధాతథంగా మీకోసం..!!
.
ఇది 2070..!!
నేను ఇప్పుడే 50 ఏళ్ళు దాటాను..!!
కానీ నా రూపం చూడటనికి 85 ఏళ్ళుగా అనిపిస్తుంది..!!
నేను తీవ్రమైన మూత్రపిండ సమస్యలను ఎదురుకుంటున్నాను..!!
ఎందుకంటే నేను ఎక్కువగా నీరు త్రాగను, త్రాగలేను..!!
అంత నీరు ఇప్పుడు అందుబాటులో లేదు..!!
నేను ఇక ఎక్కువ కాలం బ్రతకను, అదే నాకున్న పెద్ద భయం..!!
ఇప్పుడున్న సమాజంలో..
అతి ఎక్కువ వయసున్న వ్యక్తులలో నేను కూడా ఒకడిని..!!
.
నాకు గుర్తుంది అప్పుడు నాకు 5 ఏళ్ళు..!!
అప్పడంతా పరిస్థితి వేరుగా ఉండేది..!!
ఉద్యానవనాల్లో ఎన్నో చెట్లు ఉండేవి..!!
ఇళ్ళలో చక్కని తోటలు ఉండేవి..!!
దాదాపు అరగంట పాటు షవర్ స్నానం చేసి ఆనందించేవాడిని..!!
కానీ ఇప్పుడా పరిస్థితి లేదు..!!
ఇప్పుడు అంత నీరెక్కడుంది కనుక..!!
అందుకే మేమిప్పుడు రసాయనపూత పూసిన
టవల్స్‌తో శరీరాన్ని శుభ్రపరుచుకుంటున్నాము..!!
స్నానం చేయడమనేది అసలు లేనేలేదు..!!
రసాయనాలతో శరీరం తుడుచుకోవడమే అందరూ చేస్తున్నారు..!!
.
ఇంతకముందు ఆడవాళ్ళకు అందమైన జుట్టు ఉండేది..!!
కానీ ఇప్పుడు నీటి వాడకం తగ్గించడనికి అందరూ..
రోజు తల మొత్తం నున్నగా షేవ్ చేసుకుంటున్నారు..!!
అప్పట్లో మా నాన్నగారు కారుని పైప్‌తో కడిగేవారు..!!
ఇప్పుడా విషయం మా అబ్బాయికి చెప్తే,
అంత నీరెలా వృధా చేస్తారంటూ నమ్మడంలేదు..!!
నాకు గుర్తుంది, నీటిని కాపాడండి,
సేవ్ వాటర్ అంటూ హెచ్చరికలు, వాల్ పోస్టర్లు ఉండేవి..!!
రేడియో, టి.వీ.ల్లో కూడా ప్రచారం చేసేవారు..!!
కానీ అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు..!!
నీరనేది ఎప్పటికీ తరగని వనరని మా భావన..!!
.
కానీ ఇప్పుడు చూస్తే, నదులు, చెరువులు, బోర్లు
డ్యాములన్నీ పూర్తిగా ఎండిపోయాయి,
లేదా పూర్తిగా కలుషితమయ్యాయి..!!
పరిశ్రమలు కూడా నిలిచిపోయాయి,నిరుద్యోగం దారుణంగా పెరిగిపోయింది..!!
నీటి నుంచి ఉప్పును వేరు చేసే ప్లాంట్లు
మాత్రమే అధికశాతం ఉద్యోగ అవసరాలు తీరుస్తున్నాయి..!!
వాటిలో పని చేసే కార్మీకులు
డబ్బులకు బదులుగా నీటిని జీతం రూపంలో తీసుకుంటున్నారు..!!
నీరు కొనుక్కోవడమే గగనం అయ్యింది..!!
.
రోడ్డు మీద నీటి బాటిళ్ళు తీసుకువెళ్ళేవారిని చంపి..
ఆ నీటిని దోచుకోవడం కోసం చేసే నేరాలు పెరిగిపోయాయి..!!
నీటిబాటిల్ కోసం అగంతకులు గన్‌తో భయపెడుతున్నారు..!!
80% ఆహారం అంతా కృతిమమే..!!
నీరు లేకపోతే ఏం పండుతుంది..??
.
గత రోజులలో కాస్త వయసున్న వ్యక్తి
రోజుకి కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని సిపార్సు చేసేవారు..!!
ఇప్పుడు కేవలం అరగ్లాసు నీరు త్రాగే ‘అవకాశం’ మాత్రమే ఇస్తున్నారు..!!
అంతకంటే ఎక్కువ నీరు త్రాగనివ్వరు..!!
ఇప్పుడు మేము వాడి పడేసే బట్టలు ఉపయోగిస్తున్నాము..!!
ఇంతకముందు వలే నేసిన బట్టలు వాడే రోజులు ఎప్పుడో పోయాయి..!!
అటువంటి బట్టలు ధరించినా, వాటిని శుభ్రపరచడానికి నీరుంటే కదా..!!
.
ఇప్పుడు మేము డ్రైనేజి వ్యవస్థకు బదులుగా సెప్టిక్ ట్యాంకు వాడుతున్నాము..!!
ఎందుకంటే డ్రైనేజి వ్యవస్థకు కూడా నీరు అవసరం..!!
జనాల యొక్క బాహ్యరూపం చాలా భయంకరంగా ఉంది..!!
ముడతలు పడి, డిహైడ్రేషన్ కారణంగా కృశించి,
అతినీలలోహిత కిరణాల కారణంగా శరీరం మొత్తం కురుపులు పడి,
ఓజోన్ పొర లేని కారణంగా చాలా దారుణమైన
చర్మవ్యాధులతో జనం తారసపడుతున్నారు..!!
.
చర్మక్యాన్సర్, మూత్రపిండ సంబంధిత
వ్యాధులే మరణాలకు ముఖ్యకారణాలు..!!
చర్మం అధికంగా పొడిబారడం వలన
20 ఏళ్ళ యువకులు 40 ఏళ్ళ వారిలా కనిపిస్తున్నారు..!!
శాస్త్రవేత్తలు పరిశోధించినా, ఎటువంటి మార్గం కనుగొనలేకపోతున్నారు..!!
నీటిని ఉత్పత్తి చేయలేము, చెట్లు, పచ్చదనం తగ్గిన
కారణంగా ప్రాణవాయువు నాణ్యత తగ్గిపోయింది..!!
ఆధునికతరాల వారి మేధాశక్తి దారుణంగా క్షీణించిపోయింది..!!
పురుషుల వీర్యకణాల్లో కూడా తేడాలు సంక్రమించాయి..!!
ఆ కారణంగా కొత్తగా పుట్టే పిల్లలు అనేక
అవయవ లోపాలతో, రోగాలతో పుడుతున్నారు..!!
.
గాలి పీలుస్తున్నందుకు గానూ ప్రభుత్వం
ఇప్పుడు మా దగ్గరి నుంచి డబ్బులు వసూల్ చేస్తోంది..!!
137 కూబిక్ మీటర్ల గాలి మాత్రమే తీసుకునే అవకాశం ఇస్తోంది..!!
ప్రజల ఊపిరి తిత్తులు ఎప్పుడో చెడిపోయాయి,
అందుకే ఇప్పుడు సౌరశక్తితో నడిచే యాంత్రికమైన ఊపిరి తిత్తులు కనుగొన్నారు..!!
వాటిని వెంటిలేటేడ్ జోన్స్ అనే ప్రత్యేక స్థలాల్లో అమరుస్తారు..!!
డబ్బులు కట్టలేని వాళ్ళని వెంటిలేటేడ్ జోన్స్ నుండి వెళ్ళగొడతారు..!!
అక్కడ కూడా ప్రజలు పీల్చే గాలి
మంచిదేమీ కాదు కానీ ఏదో పూటగడుస్తుందంతే..!!
కొన్ని దేశాల్లో ఇప్పటికి నదుల పక్కన పచ్చని మైదానాలు ఉన్నాయి..!!
కానీ వాటిని రక్షించడం కోసం
దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యం అక్కడ ఉంది..!!
నీరు ఎంతో ప్రియమైనదిగా మారిపోయింది..!!
బంగారం, వజ్రాలకంటే విలువైనదిగా అయిపోయింది..!!
.
నేనుడే చోట వృక్షాలు అసలే లేవు..!!
ఎందుకంటే అక్కడ వర్షాలు అస్సలుకే పడవు..!!
ఎప్పుడైన వర్షం పడినా, అది యాసిడ్ వర్షమే అవుతుంది..!!
20 వ శతాబ్ధంలో పరిశ్రమలు చేసిన కాలుష్యం,
అణు ప్రయోగాల కారణంగా ఋతువుల క్రమం దెబ్బతిన్నది..!!
అప్పట్లో ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడమని ఎందరో మొత్తుకున్నారు..!!
కానీ ఎవరూ వినలేదు, విన్నా పట్టించుకోలేదు..!!
నా కొడుకు, నా యవ్వనం గురించి మాట్లాడమన్నప్పుడు
పచ్చని బైళ్ళ గురించి, అందమైన పువ్వుల గురించి,
వానల గురించి, నదులు, డ్యాముల్లో ఈత కొట్టడం గురించి,
చేపలు పట్టడం గురించి, కడుపు నిండుగా
నీరు త్రాగడం గురించి, ప్రజల ఆరోగ్యం గురించే మాట్లాడుతాను..!!
.
అప్పుడు వాడు
‘నాన్నా.. ఇప్పుడు నీళ్ళెందుకు లేవు..??’ అని
అడగ్గానే నా గొంతులో వెలక్కాయ పడినట్టు అవుతుంది..!!
నాకు కలిగే అపరాధభావం నుంచి బయటపడలేను..!!
ఎందుకంటే నా తరమే పర్యావరణవినాశనానికి దోహదపడింది..!!
ఎన్ని హెచ్చరికలు చేసిన బేఖాతరు చేసింది..!!
ఇప్పుడు నా పిల్లలు దానికి భారీ మూల్యం చెల్లిస్తున్నారు...!!
నిజాయతీగా చెప్పాలంటే ఈ భూమి మీద జీవం ఇక ఎంతో కాలం ఉండదు...!!
పర్యావరణ విధ్వంసం దారుణమైన
స్థితికి చేరుకుంది, ఇప్పుడేమి చేసినా ఫలితం ఉండదు..!!
కాలంలో వెనక్కు వెళ్ళి మానవాళికి ఎలా చెప్పాలని ఉంది...!!
ఈ భూమాతను కాపాడటానికి
ఇంకా మనకు సమయం మిగిలే ఉందని..కానీ అదెలా సాధ్యం..!!
.
మీ అబ్దుల్ కలాం...!!
.
ఇంకా సమయం మిగిలే ఉంది..
భూమాతను, ప్రకృతిని కాపాడటానికి...!!
రండి చేయి, చేయి కలుపుదాం…!!
.
2002 వ సంవత్సరంలో 2070 పరిస్థితిని ఊహించి రాసిన లెటర్ ని
చూస్తుంటే కలాం గారు రాసింది 2070 కంటే ముందే జరిగేలా ఉంది..!!
ప్రస్తుతానికి తాగడానికి , వాడుకోవడానికి నీళ్లు ఉన్నాయి కదా అని
నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ లో నీళ్ల కోసం యుద్దాలు చేసే పరిస్థితి రావొచ్చు..!!
.
(Courtesy : Website)
==((**))==
తెలుగు భాష నేర్చుకుందాం
రచాయిట: మల్లాప్రగడ రామకృష్ణ
మధుర ఫల రసంబు మదిని రంజించు,
లతల పరిమళంబు మదిని రంజించు
మగువ సుమ ఫలంబు మదిని రంజించు
వరుని సమ భావంబు మదిని రంజించు
మృదువుగ బలుకు మాట మందిని మెప్పించు,
కటువుగ బలుకు మాట మౌనము ఛేదించు
బిగువుగ బలుకు మాట బయ్యము పుట్టించు
చురుకుగ బాలుకు మాట తెల్వియు తెప్పించు
శరణమే నిక్కమన్న నాడు ప్రేమను పంచుట చాలదా
తరుణమే నిక్కమన్న నాడు సేవను చేయుట చాలదా
ప్రణయమే నిక్కమన్న నాడు ఇచ్చుట పుచ్చుట చాలదా
మరణమే నిక్కమన్న నాడు మంచిగ పోయిన చాలదా
బ్రతుకు బాటను మార్చు మాట ఇది
మనిషి వేటను మార్చు మాట ఇది
మదన కోర్కను తీర్చు మాట ఇది
కలసి లోటును తీర్చు మాట ఇది
--((**))--
ప్రాంజలి ప్రభ - శ్లోక సూక్తులు
నేటి ప్రాంజలి ప్రభ
నెట్టింట్లోకి పుస్తకం!
► కోటి పుస్తకాలను అందరికీ అందుబాటులోకి తెచ్చిన కేంద్రం.
► ఖరగ్‌పూర్ ఐఐటీ సాయంతో హెచ్‌ఆర్‌డీ మినిస్ట్రీ భారీ కసరత్తు
► ఒకటో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు అన్ని రకాల పుస్తకాలు.
► కేవలం ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. ఓ గ్రంథాలయం ఉన్నట్టే.
► దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన నేషనల్ డిజిటల్ లైబ్రరీ
ఉద్యోగ పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్థులైనా..
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులైనా..
ఫలానా పుస్తకం దొరకడం లేదన్న బెంగ అక్కర్లేదు.
కాలేజీ లైబ్రరీలో ఒకే పుస్తకం ఉందే.. దానిని వేరొకరికి ఇచ్చేశారు... ఇక తానెలా చదువుకునేది? అన్న ఆందోళన
కాలేజీ విద్యార్థులకు అవసరం లేదు.
యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్, రాష్ట్ర సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్స్,NCERT ఎ సిలబస్‌కు సంబంధించిన రిఫరెన్సు పుస్తకాలను
ఎలా కొనాలనే ఆలోచనా వద్దు. ఇప్పుడివన్నీ ఒకేచోటే అందుబాటులోకి వచ్చాయి ఇవే కాదు.. ఒకటో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు
అవసరమైన రిఫరెన్సు పుస్తకాల దాకా అన్నీ అందుబాటులో ఉన్నాయి.
ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు.
వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే వాటికి సంబంధించిన
వీడియోలు చూడవచ్చు. ఆడియోలను వినవచ్చు. PDF కాపీలను కూడా పొందొచ్చు.
ఇందుకు కావాల్సిందల్లా ఇంటర్నెట్ సదుపాయం. అదొక్కటి ఉంటే ఏ పుస్తకం అయినా చదువుకోవచ్చు. ఒకటి కాదు.. రెండు కాదు.. కోటికిపైగా పుస్తకాలను, ఆర్టికల్స్, రచనలను, విమర్శనా వ్యాసాలు..
నెట్ ఉంటేచాలు నట్టింట్లో ఉన్నట్లే.
ఐఐటీ ఖరగ్‌పూర్ సాయంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ భారీ కసరత్తును చేసింది.
https://ndl.iitkgp.ac.in
పై క్లిక్ చేసి అవసరమైన పుస్తకాన్ని చదువుకునే సదుపాయాన్ని అందుబాటు లోకి తెచ్చింది.
అదనంగా నయా పైసా ఖర్చు లేదు.
ఇంటర్నెట్ కనెక్షన్ ఒక్కటుంటే చాలు... అదనంగా నయాపైసా ఖర్చు లేకుండా డిజిటల్ పుస్తకాలు, ఆర్టికల్స్, వీడియోలు, ఆడియోలు చూడొచ్చు.
సాధారణ గ్రంథాలయాల తరహాలో డిపాజిట్లు అక్కర్లేదు. అవసరమైన పుస్తకాన్ని వెతుక్కునేందుకు ఎక్కువ సమయం కూడా అవసరం లేదు.
ఒక్క క్లిక్‌తో కావాల్సిన పుస్తకాన్ని చదువుకోవచ్చు.
అన్ని రంగాల పుస్తకాలూ..
దేశంలోని పలు యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు చెందిన పుస్తకాలను డిజిటలైజ్ చేసి ఈ డిజిటల్ గ్రంథాలయం లో ఉంచారు.
సాధారణ విద్య నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకు.. చరిత్ర నుంచి సాహిత్యం వరకు.. అన్ని రంగాలకు చెందిన పుస్తకాలు డిజిటల్ లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులే కాదు పరిశోధకులు, పఠనాసక్తి ఉన్నవారు తమకు కావాల్సిన భాషలో డిజిటల్ పుస్తకాలను చదువుకోవచ్చు. ఇంగ్లిషే కాదు.. అనేక విదేశీ భాషలకు సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి.
జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) పుస్తకాలన్నింటినీ కూడా కంప్యూటరీకరించి ఇందులో ఉంచారు.
అంతే కాదు త్వరలో మెుబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
డిజిటల్ లైబ్రరీ ప్రత్యేకతలు ఎన్నెన్నో...
► 70కి పైగా భాషల్లో... కోటికి పైగా ఈ–పుస్తకాలు
► 2 లక్షల మంది ప్రముఖుల 3 లక్షల ఆర్టికల్స్
► లక్ష మంది భారతీయ విద్యార్థుల థీసిస్‌లు
► రాతప్రతులు, వివిధ భాషల్లో ఆడియో లెక్చర్లు
► 18 వేలకు పైగా వీడియో ఉపన్యాసాలు
► 33 వేలకు పైగా గత ప్రశ్నా పత్రాలు
► యూనివర్సిటీలు, పాఠశాల బోర్డుల ప్రశ్నా పత్రాలు, జవాబులు
► వ్యవసాయం, సైన్స్, టెక్నాలజీ రంగాల వెబ్ కోర్సులు
► సమాచార నిధి, వార్షిక నివేదికలు, 12 వేలకు పైగా వివిధ నివేదికలు
► సాంకేతిక కోర్సుల నివేదికలు, న్యాయ తీర్పులు
పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే వారికి ప్రయోజనం ఎంతో...
పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్థులకు ఈ డిజిటల్ లైబ్రరీతో ఎంతో ప్రయోజనం చేకూరనుంది. గత పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు అడిగారు? వాటిని ఎలా పరిష్కరించారో తెలుసుకోవచ్చు. అయితే వాటికి సంబంధించి మార్కెట్ లో ఉన్న పుస్తకాలను కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక్క క్లిక్‌తో వాటిని పొందవచ్చు.
రిజిస్ట్రేషన్ సులభం
డిజిటల్ లైబ్రరీలో పుస్తకాలు తీసుకోవడం చాలా సులభం. ఈ–మెయిల్ ఐడీ, తాము చదువుతున్న కోర్సు, యూనివర్సిటీ పేరు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేస్తే చాలు.
ఈ వివరాలను నమోదు చేసిన తరువాత తాము పేర్కొన్న ఈ–మెయిల్ ఐడీకి లింకు వస్తుంది. ఈ లింకుపై క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
ఆ తరువాత ఈ–మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ నమోదు చేసి లైబ్రరీలో లాగిన్ కావచ్చు.
విద్యార్థులు, అభ్యర్థులు తమకు అవసరమైన విభాగాల వారీగా పుస్తకాలు, వీడియో, ఆడియో పాఠాలు, లెక్చర్లు, ఉపన్యాసాలు వెతికి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
--((**))--
తెలుగు భాష నేర్చు కుందాం
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
వచ్చితిమి వసుధన కొద్దిరోజులు నుండి పోవగ
తెచ్చితిమి మనసున కొన్ని కోర్కలు మండి పోవఁగ
నచ్చితిమి కలియుగ కోటి విద్యలు నేర్వ పోవఁగ
మెచ్చితిమి తరువులు చేయు మేలును పిల్వ పోవఁగ
వట్టిపోవును బంధములు బాంధవ్యములు నిక్కముగా
కట్టివేయును కాలమున ప్రేమమ్ము లత నిక్కముగా
చుట్టి వేయును దేశమున సౌందర్యములు నిక్కముగా
పట్టివేయును జీవితము ప్రాబల్యములు నిక్కముగా
వలదు వెంపరలాడుట నేను నాదన్న లాభము కొరకై ,
మగువ మాటకు ఆడుట ఏమి కాదన్న ప్రేమము కొరకై
తగువ వీడుట మానుట మేను సౌఖ్యమ్ము కోరుట కొరకై
అరువు పొందియు ఖర్చులు చేసి జీతమ్ము పొందుట కొరకై
విడిచి పోవుటకు ముందు మంచి చేసిపొమ్ము
వలచి వీడుటకు ముందు ప్రేమ పంచి పొమ్ము
తలచి మనుటకు ముందు సేవ చేసి పొమ్ము
కవియు అనుటకు ముందు సత్య వాక్కు సొమ్ము
--((**))--
1 . శ్లో:-గుణోభూషయతేరూపం
శీలంభూషయతేకులమ్
సిధ్ధర్భూషయతేవిద్యాం
భోగోభూషయతేధనం.
శుభోదయమ్.
పౌలస్త్యః కథమన్యదారహరణే దోషం న విజ్ఞాతవా
నక్షైశ్చాపి యుధిష్ఠిరేణ రమతా జ్ఞాతో న దోషో సు కిమ్,
రామేణాపి వనే న హేమహరిణస్యాసంభవో లక్షితః
ప్రత్యాసన్న విపత్తి మూఢమనసాం ప్రాయో మతిః క్షీయతే.
పరభార్యను హరించడం పాపమని రావణుడు ఎట్లు గ్రహించలేక పోయాడు?
జూదం ఆడడం మంచిది కాదని ధర్మరాజుకు తెలియదా?
బంగారు లేడి ఉండదన్న విషయం వనవాసంలో ఉన్నప్పుడు రామునికి ఎందుకు తెలియదు?
ఆపదలు రానున్నప్పుడు బహుశా మనస్సులు పని చేయక గొప్పవారి బుద్ధి కూడా క్షీణిస్తుంది.
హితోపదేశమ్ అందం గుణం వల్ల,కులం నడవడివల్ల,చదువు కార్యసిధ్ధివల్ల,ధనం అనుభవం వల్ల రాణిస్తాయి.
2 . శ్లో:-ధర్మయేవహతోహన్తి
"ధర్మోరక్షతిరక్షితః"
తస్మాధ్ధర్మోనహన్తవ్యో
మానోధర్మోహతీవథీత్.
భా:-ధర్మానికినాశనంతలపెడితే,ఆప్రయత్నం చేసినవడినే నాశనం చేస్తుంది.ధర్మాన్ని రక్షించిన వారిని ఆ ధర్మమేరక్షిస్తుంది. కాబట్టి ధర్మానికి ప్రమాదం రాకుండా చూడాలి.
--((**))--
ప్రాంజలి ప్రభ - శ్లోక సూక్తులు
3 . శ్లో-ఉదారస్యతృణంవిత్తం
శూరస్యమరణంతృణం
విరక్తస్యతృణంభార్యా
నిస్పృహస్యతృణంజగత్.
భా:- ఉదారబుధ్ధికలవాడికిధనం,శూరునికిమరణం,విరక్తుడికిభార్య,కోరికల్లేనివాడికి లోకం...గడ్డి పరకతో సమానం.
4 . శ్లో:-జ్ఞాన విద్యా విహీనస్య
విద్యాజాలం నిరర్ధకం
కంఠ సూత్రం వినా నారీ
వానేకైః భూషణైర్యుతా.
భా:-స్త్రీకిమంగళసూత్రం లేకుండా ఎన్ని నగలున్నా అలంకారం కానట్టే,జ్ఞాన శూన్యుడికి ఎన్ని విద్యలున్నా వ్యర్ధమే.
నేటి ప్రాంజలి ప్రభ శ్లోకం
శ్లో : విత్తంబన్దుర్వయః కర్మ విద్యా భవతి పజ్చమీ
ఏతాని మాన్యస్తానాని గరీయో యద్యదుత్తరమ్
భావము: - డబ్బు, చుట్టరికాలు, వయస్సు , కర్మము, విద్య, ఈ యైదును పూజ్య మైనవి. గౌరవించ దగినవి. ఇవి ఒకదాని కంటే మరొకటి ఉన్నతము. ధనము కంటే బంధుత్వము, బంధుత్వము కంటే, వయస్సు, వయస్సు కంటే క ర్మము, కర్మము కంటే విద్యయు శ్రేష్టమైనవి. కావున విద్యావంతుడు. అందరికంటే మిన్నాయని చెప్పదగును.
--((**))--
అడియాసఁజేసియర్ధుల
కిడనిపిసినికిడడు దేవుడెన్నఁడు,దూడం
గుడువంగనీకబిదికినఁ
దొడుకిడునేపాలుతన్నితొలగకయరుణా.
భా:-తల్లిదగ్గర పాలు కుడవా(తాగా)లని ఆశపడ్డ దూడని తాగనీకుండా వెనక్కి లాగి మనుషులు పాలు పిండడానికి ప్రయత్నిస్తే ఆ ఆవు మూతిపగిలేట్టుతంతుంది.అలాగే కోరికల సాకారం కోసం ప్రయత్నించే వారికి మనం స్వార్ధబుధ్ధితో అడ్డుపడితే దేవుడు ఏదో ఒక రూపంలో జెల్లకాయ కొడతాడు.(కాబట్టి ఇతరుల ప్రయత్నాలకి అడ్డుపడకండి)

No comments:
Post a Comment