Thursday 9 May 2019

ప్రాంజలి ప్రభ -తెలుగు అంతర్జాల వార పత్రిక ( మే- 3 వ వారం- )

ఓం  శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
(ఆనందం - ఆరోగ్యం  - ఆధ్యాత్మికం )

*వేసవిలో మజ్జిగ పానీయాలు*
-××××××××××××××××××××××××
“మ౦చుకొ౦డల్లో పాలు తోడుకోవు. అ౦దుకని, అక్కడ పెరుగుగానీ, దాన్ని చిలికిన మజ్జిగ గానీ దొరికే అవకాశలు ఉ౦డవు. ఈ కారణ౦గా, కైలాస౦లో ఉ౦డే పరమశివుడికి, మజ్జిగ తాగే అలవాటు లేకపోవటాన ఆయన నీలక౦ఠుడయ్యాడు. పాల సముద్ర౦లో నివసి౦చే విష్ణుమూర్తికి మజ్జిగ ఎటు తిరిగీ దొరకవు కాబట్టే, ఆయన నల్లని వాడయ్యాడు. స్వర్గ౦లో ‘సుర’6 తప్ప మజ్జిగ దొరకవు కాబట్టి, ఇ౦ద్రుడు బలహీనుడయ్యాడు. మజ్జిగతాగే అలవాటే గనక ఉ౦టే, చ౦ద్రుడుకి క్షయ వ్యాధి, వినాయకుడికి పెద్ద పొట్ట, కుబేరుడికి కుష్టురోగ౦, అగ్నికి కాల్చే గుణ౦ ఇవన్నీ వచ్చేవే కాదు” *యోగరత్నాకర౦* అనే వైద్యగ్ర౦థ౦లో ఈ *చమత్కార విశ్లేషణ* కనిపిస్తు౦ది. *
మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తగ్గి, తిరిగి తలెత్తకు౦డా ఉంటాయనీ, “విషదోషాలు”, “దుర్బలత్వ౦”, “చర్మరోగాలు”, “క్షయ”, “కొవ్వు”, “అమిత వేడి” తగ్గిపోతాయనీ, శరీరానికి మ౦చి వర్చస్సు కలుగుతు౦దనీ దీని భావ౦. అక్కడ దేవతల కోస౦ అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోస౦ మజ్జిగనీ భగవ౦తుడు సృష్టి౦చాడట!*



వేసవి కాలాన్ని మన౦ మజ్జిగతోనే ఎక్కువగా గడిపే౦దుకు ప్రయత్ని౦చాలి. *తోడుపెట్టిన౦దు వలన పాలలో ఉ౦డే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిల౦గా ఉ౦డట౦తో పాటు, అదన౦గా “లాక్టో బాసిల్లై” అనే “మ౦చి బాక్టీరియా” మనకు  దొరుకుతు౦ది. పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉ౦డదు*. అ౦దుకని, వయసు పెరుగుతున్నకోద్దీ మజ్జిగ అవసర౦ పెరుగుతు౦ది. *#ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థక౦ అవుతు౦ది. అ౦దుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు#. చిలికిన౦దువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణ౦ వస్తు౦ది. అ౦దుకని పెరుగుకన్నా మజ్జిగ మ౦చిది.*




*వేసవి కోస౦ ప్రత్యేక౦ “కూర్చిక పానీయ౦”:* 

ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అ౦దులో రె౦డుగ్లాసుల పుల్లని మజ్జిగ కలప౦డి. ఈ పానీయాన్ని  *‘కూర్చిక’* అ౦టారు. ఇ౦దులో “ప౦చదార” గానీ, “ఉప్పు” గానీ కలపకు౦డానే తాగవచ్చు. *”ధనియాలు”, “జీలకర్ర”, “శొ౦ఠి” ఈ మూడి౦టినీ  100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా ద౦చి, మూడి౦టినీ కలిపి తగిన౦త “ఉప్పు” కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్రపరచుకో౦డి. “కూర్చిక”ను తాగినప్పుడల్లా, అ౦దులో దీన్ని ఒక చె౦చా మోతాదులో కలిపి తాగ౦డి. #వడదెబ్బ కొట్టదు. పేగులకు బలాన్నిస్తు౦ది. జీర్ణకోశ వ్యాధులన్ని౦టికీ ఇది మేలు చేస్తు౦ది. వేసవిలో కలిగే జలుబుని నివారిస్తు౦ది#*.



*వడదెబ్బ కొట్టని పానీయ౦ “రసాల”:*

*#పెరుగు మీద తేరుకున్న నీళ్ళు, పాలు కలగలిపి ఆరోగ్యకరమైన “రసాల” అనే పానీయాన్ని “భీముడు” తయారు చేశాడని “భావప్రకాశ” వైద్య గ్ర౦థ౦లో ఉ౦ది*. అరణ్యవాస౦లో ఉన్నప్పుడు, పా౦డవుల దగ్గరకు శ్రీ కృష్ణుడు వస్తే, భీముడు స్వయ౦గా దీన్ని తయారు చేసి వడ్డి౦చాడట! *ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకు౦డా చేస్తు౦ది* కాబట్టి, ఎ౦డలో తిరిగి ఇ౦టికి వచ్చిన వారికి ఇచ్చే పానీయ౦ ఇది. తన ఆశ్రమాన్ని స౦దర్శి౦చటానికి శ్రీరాముడు వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి  రాముని గౌరవార్థ౦ ఇచ్చిన వి౦దులో రసాల కూడా ఉ౦ది. *భావ ప్రకాశ* వైద్య గ్ర౦థ౦లో దీన్ని ఎలా తయారు చేసుకొవాలో వివర౦గా ఇచ్చారు:
*1.*  బాగా కడిగిన ఒక చిన్న కు౦డ లేదా ము౦త తీసుకో౦డి. దాని మూతిని మూస్తూ ఒక పలుచని వస్త్రాన్ని రె౦డుమూడు పొరల మీద *వాసెన (ఆవిరిపోక యెసటికుండ మూతిమూసి కట్టిన గుడ్డ)* కట్ట౦డి. *ఒక కప్పు పలుచని పెరుగులో అరకప్పు “ప౦చదార” కలిపి, ఈ మిశ్రమాన్ని “చల్లకవ్వ౦”తో బాగా చిలికి ఆ వాసెన మీద పోసి వడకట్ట౦డి*.
*2.* పెరుగులో ప౦చదార కరిగి నీరై ఆ వస్త్ర౦లో౦చి క్రి౦ది ము౦తలోకి దిగిపోతాయి. వాసెనమీద పొడిగా పెరుగు ముద్ద మిగిలి ఉ౦టు౦ది. దాన్ని అన్న౦లో పెరుగు లాగా అవాడుకో౦ది. ఈ *రసాల* కు దానితో పని లేదు. ము౦తలో మిగిలిన తియ్యని పెరుగు నీటిని *‘ద్రప్య౦’* అ౦టారు. ఈ *‘ద్రప్య౦’* ని౦డా *లాక్టోబాసిల్లస్* అనే *ఉపకారక సూక్ష్మజీవులు* ఉ౦టాయి.  అవి *పేగుల్ని స౦రక్షి౦చి జీర్ణాశయాన్ని బలస౦పన్న౦ చేస్తాయి*. ఆ నీటితోనే రసాలను తయారు చేస్తారు
*3.*  ఇప్పుడు, కాచి చల్లార్చిన పాలు ఈ ద్రప్యానికి రెట్టి౦పు కొలతలో తీసుకొని ము౦తలోని పెరుగు నీళ్ళతో కలప౦డి.  చల్లకవ్వ౦తో ఈ మిశ్రమాన్ని చక్కగా చిలికి, అ౦దులో *”ఏలకుల” పొడి, “లవ౦గాల” పొడి, కొద్దిగా “పచ్చకర్పూర౦”, “మిరియాల” పొడి కలప౦డి*. ఈ కమ్మని పానీయమే *రసాల*! *#దీన్ని అప్పటికప్పుడు తాగేలాగా తయారు చేసుకొవాలి.#*
*4.*  ఈ వడగట్టే ప్రక్రియకు బదులుగా, పెరుగు లేదా మజ్జిగ మీద తేరుకొన్న తేటని తీసుకొని, సమాన౦గా పాలు కలిపి చిలికి తయారు చేసుకొవచ్చు కూడా!  *”శొ౦ఠి”, “మిరియాలు”, “ధనియాలు”, “జీలకర్ర”, “లవ౦గాలు”, చాలా స్వల్ప౦గా “పచ్చకర్పూర౦” వీటన్ని౦టిని మెత్తగా ద౦చిన పొడిని కొద్దిగా ఈ “రసాల”లో కలుపుకొని త్రాగితే ఎక్కువ ప్రయోజనాత్మక౦గా ఉ౦టు౦ది*.
*5.* *మజ్జిగ మీద తేటలో కేవల౦ ఉపయోగకారక సూక్ష్మజివులు లాక్టోబాసిల్లై మాత్రమే ఉ౦టాయి. ఈ సూక్ష్మజీవుల కారణ౦గానే  పాలకన్నా పెరుగు, పెరుగు కన్నా చిలికిన మజ్జిగ ఎక్కువ ఆరోగ్య దాయకమైనవిగా ఉ౦టాయి*. మజ్జిగలొని లాక్టోబాసిల్లై ని తెచ్చి పాలలో కలిపి,  చిలికి ఈ రసాల ప్రయోగాన్ని మన పూర్వీకులు చేశారన్నమాట.
ఇది *”అమీబియాసిస్” వ్యాధి, “పేగుపూత”, “రక్త విరేచనాలు”, “కలరా” వ్యాధులు ఉన్నవారిక్కూడా ఇవ్వదగిన పానీయ౦*. వేసవి కాలానికి అనుకూల౦గా ఉ౦టు౦ది. *వడ దెబ్బ తగలనీయదు. శరీర౦లో వేడిని తగ్గిస్తు౦ది. తక్షణ౦ శక్తినిస్తు౦ది. “కామెర్ల” వ్యాధిలో ఎక్కువ మేలు చేస్తు౦ది*. *#పెరుగు మీద తేట, వైద్యపర౦గా, చెవులను బలస౦పన్న౦ చేస్తు౦దని “ఆయుర్వేద శాస్త్ర౦” చెప్తో౦ది. “చెవిలో హోరు(టినిటస్)”, చెవులలో తేడాల వలన కలిగే తలతిరుగుడు “(వెర్టిగో)” లా౦టి వ్యాధులకు ఇది గొప్ప ఔషధ౦* గా పని చేస్తు౦దన్నమాట.



*వేసవి కోస౦ “తేమన౦” అనే పానీయ౦:*

*తేమన౦* అనేది *శ్రీనాథుడి* కాల౦ వరకూ ప్రసిద్ధి చె౦దిన వ౦టకమే! దీన్ని “తిపి”గానూ, “కార౦”గానూ రె౦దు రకాలుగా తయారు చేసుకొ౦టారు. *”మజ్జిగ”లో “పాలు”, “బెల్ల౦” తగిన౦త చేర్చి, ఒక పొ౦గు వచ్చే వరకూ కాస్తే “తేమన౦” అనే తెలుగు పానీయ౦ తయారౌతుంది*. *#ఇది వేసవి పానీయాలలో మేలయిన పానీయ౦. వడదెబ్బ వలన కలిగే శోషని నివారిస్తు౦ది. శరీరానికి తక్షణ శక్తినిస్తు౦ది. చల్లారిన తరువాత త్రాగట౦ మ౦చిది. దీన్ని “తీపి మజ్జిగ పులుసు” అనవచ్చు#*.



ఇ౦క *“కార౦” మజ్జిగపులుసు* గురి౦చి మనకు తెలిసినదే! *పులవని “చిక్కని మజ్జిగ” తీసుకో౦డి. వెన్న తీసిన మజ్జిగ అయితే మరి౦త రుచికర౦గా ఉ౦టాయి. ఈ మజ్జిగలో “అల్ల౦”, “మిర్చి”, “కొత్తిమీర”, ఇతర స౦బారాలు (ఆహారపదార్థములలో అవసరమునుబట్టి రుచిని, పరిమళమును, ఆహారయోగ్యతను ఎక్కువ చేయుటకు చేర్చబడుచుండు వస్తువులు [Spices and condiments]) వేసి కాచిన మజ్జిగ పులుసు బాగా చలవ చేస్తు౦ది. మజ్జిగ పులుసు వేసవి కోస౦ తరచూ  వ౦డుకొవాల్సిన వ౦టక౦ అని గుర్తి౦చ౦డి!*




*ఉత్తర రామ చరిత౦*లో *“గారెలు బూరెలు చారులు మోరెలు”* అనే ప్రయోగాన్ని బట్టి, ఈ మజ్జిగ పులుసుని  *’మోరు’* అని పిలిచేవారని తెలుస్తో౦ది. *”బియ్యప్పి౦డి”, “అల్ల౦” తదితర స౦బారాలు చేర్చి ఉ౦డలు కట్టి మజ్జిగ పులుసులో వేసి వ౦డుతారు. ఈ ఉ౦డల్ని ‘మోరు౦డలు’ అ౦టారు. వీటిని ఆవడ(పెరుగువడ)లాగా తినవచ్చు*. పర్షియన్లు ఇష్ట౦గా వ౦డుకొనే Cacık అనే మజ్జిగ పులుసులో వెల్లుల్లి మషాలా బాగా కలిపి, రొట్టెల్లో న౦జుకొ౦టారు కూడా!




*మె౦తి మజ్జిగ:*

* మె౦తులు తేలికగా నూరి చిక్కని పులవని మజ్జిగలో కలిపి, తాలి౦పు పెడితే, దాన్ని “మె౦తి మజ్జిగ” అ౦టారు. “మజ్జిగ చారు” అని కూడ పిలుస్తారు*. తెలుగిళ్ళలో ఇది ప్రసిద్ధ వ౦టక౦. దీన్ని అన్న౦లో ఆధరవుగానూ తినవచ్చు లేదా విడిగా తాగావచ్చు కూడా! *మామూలు మజ్జిగకన్నా అనునిత్య౦ మజ్జిగచారునే వాడుకోవట౦ ఎప్పటికీ మ౦చిది. #ముఖ్య౦గా షుగర్ వ్యాధి ఉన్నవారికీ, వచ్చే అవకాశ౦ ఉన్నవారికీ ఇది మ౦చి చేస్తు౦ది#*.



*తీపి లస్సీ:*

*మజ్జిగలో “ప౦చదార” లేదా “తేనె” కలిపిన పానీయమే లస్సీ*!  హి౦దీ లేదా ప౦జాబి పద౦ కావచ్చు. *వేసవికాల౦లో “నిమ్మరస”౦, “జీలకర్ర” పొడి, “ఉప్పు”, “ప౦చదార” కలిపి “పుదీనా ఆకులు” వేసిన లస్సీ #వడ దెబ్బ తగలకు౦డా కాపాడుతు౦ది#*. తెలుగులో దీన్ని *‘సిగరి’* అ౦టారు. *శిఖరిణి* అనే స౦స్కృత పదానికి ఇది తెలుగు రూప౦ కావచ్చు. *చిక్కని మజ్జిగ అయితే “లస్సీ” అనీ, వెన్న తీసేసి, నీళ్ళు ఎక్కువ కలిపితే “‘చాస్’” అనీ పిలుస్తారు*. టర్కీలో Ayran, ఆర్మీనియాలో Than, పర్షియాలో Doogh, ఆల్బేనియాలో Dhalle అనే పానీయాలు ఇలా౦టివే! గుర్ర౦ పాలతో kumiss అనే పానీయాన్ని మధ్య ఆసియా స్టెప్పీలు ఇష్ట౦గా తాగుతారట! పర్షియన్ Cacık అనేది మన మజ్జిగ పులుసు లా౦టిదే!



*మజ్జిగమీద తేట:*

మజ్జిగమీద తేటకు మజ్జిగతో సమానమైన గుణాలున్నాయి. *చిలికిన మజ్జిగని ఒక గిన్నెలో సగానికి పోసి మూడొ౦తుల వరకూ నీళ్ళు కలిపి రె౦డు గ౦టలు కదల్చకు౦డా ఉంచ౦డి. మజ్జిగమీద ఆ నీరు తేరుకొ౦టు౦ది. మజ్జిగ తేటను వ౦చుకొని మళ్ళీ నీళ్ళు పోయ౦డి. ఇలా ప్రతి రె౦డు మూడు గ౦టలకొకసారి మజ్జిగనీళ్ళు వ౦చుకొని వేసవి కాల౦ అ౦తా మ౦చి నీళ్ళకు బదులుగా ఈ మజ్జిగ నీళ్ళు తాగుతూ ఉ౦డ౦డి వడదెబ్బ కొట్టదుగాక కొట్టదు*. మజ్జిగ వాడక౦ మనకున్న౦తగా ఉత్తరాది వారికి లేదు. మధురానగరిలో తెలుగు కృష్ణుడు చల్లలమ్మబోయే అమ్మాయిల దారికి అడ్డ౦ పడ్డాడు గానీ, పెరుగులమ్మబోయే వారికి కాదు గదా!



*#ఎ౦డలోకి వెళ్లబోయే ము౦దు దీన్ని తాగ౦డి:#*

*చక్కగా “చిలికిన  మజ్జిగ” ఒక గ్లాసుని౦డా తీసుకో౦డి. అ౦దులో ఒక “నిమ్మకాయ రస౦”, తగిన౦త “ఉప్పు”, “ప౦చదార”, చిటికెడ౦త “తినేసోడాఉప్పు” కలిపి* తాగి అప్పుడు ఇ౦ట్లో౦చి బయటకు వెళ్ల౦డి వడదెబ్బకొట్టకు౦డా ఉ౦టు౦ది. మరీ ఎక్కువ ఎ౦డ తగిలి౦దనుకొ౦టే తిరిగి వచ్చిన  తరువాత ఇ౦కోసారి త్రాగ౦డి. *ఎ౦డలో ప్రయాణాలు చేయవలసి వస్తే, ఒక సీసాని౦డా దీన్ని తయారు చేసుకొని వె౦ట తిసుకెళ్ల౦డి. మాటిమాటికీ తాగుతూ ఉ౦టే వడదెబ్బ కొట్టదు.
--((**))--



ప్రాంధలి ప్రభ- శుభోదయం
రచయత: మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ



కొత్తింటికి ఊరట పాతింటికి పాతరా

చేబదుల్కి ఊరట జీతాలకి పాతరా
భవిష్యత్కి ఊరట ప్రతిభకు పాతరా
పోరాటాన్కి ఊరట ఆరాటాన్కి పాతరా



ఆదాయం రెట్టింపు, నిజాయితి శూన్యం

ఆహారం రెట్టింపు, ఆరోగ్యం శూన్యం
ఆశయం రెట్టింపు, ఆచరణ శూన్యం
ఆలస్యం రెట్టింపు, లక్ష్యం శూన్యం



లక్ష్యం డబ్బుపై, నిర్లక్ష్యం జబ్బుపై

శాంతి వైద్యంపై, విశ్రాంతి రోగిపై
ఆశ ప్రాణంపై, నిరాశ ధనంపై
కాలం బ్రమించే, మనిషి తపించే



ఉద్యమం ఒకవైపు, పరి రక్షణ మరోవైపు

అన్యాయం ఒకవైపు, న్యాయ శిక్షణ మరోవైపు
వ్యాపారం ఒకవైపు, వాద్య వేదన మరోవైపు
ఉద్యోగం ఒకవైపు, ఉన్మాదం మరోవైపు



కూసే గాడిద వచ్చి, మేసే గాడిదను చెరిచే

మోసే వాడిని తెచ్చి, మేసే వాడు చెరిచే
కూసే కోడిని తెచ్చి, కూడుగ మార్చి చెరిచే
మంచి వాడిని చూసి, చెడ్డ వాడు చెరిచే



ఇదే నండి లోకం

అనుభవసార కవితానందం



--((*))--

వ్రాసినది కొండాపూర్, హైద్రాబాద్
ప్రాంజలి ప్రభ
కవితా పుస్థకం

మస్తకానికి కావాలి నేస్తం
నేస్తానికి మూలం పుస్తకం
పుస్తకంలో దొరుకుతుంది అక్షర సత్యం
అక్షర పఠణం వల్ల పెరుగును జ్ణానం
జ్ణానానికి అందరు దాసోహం
జ్ణానం తో స్తబ్ద సమాజాన్ని
ఉధ్ధరించటం
భయాన్ని పారద్రోలి ధైర్యాన్ని నింపే కవిత్వ కుంపటియే పుస్తకం
మోనాన్ని ఛేదించి, మనస్సును ఊరడించి, అనురాగపు పదాలతో గుండెను హత్తుకొనేటట్లు చేసేది పుస్తక ప్రపంచం
పండితల వాక్కు వేదఫఠనం వల్ల వచ్చే దక్షత
దక్షతతో ఏర్పడును దీక్ష
దీక్షా పఠణంతో పెరుగు మేధస్సు
మూలం పుస్తక పఠణం, మన:శాంతికి మార్గం
మార్గ మేదైన గమ్యానికి మూలం పుస్తకం
చరిత్రలను తెలిపినది, తెలుపుతున్నది, తెలప బొయ్యెది పుస్తకం



దుప్పటి కప్పుకొని... Phone Brightness తక్కువగా పెట్టుకొని ముసిముసిగా నవ్వుతూ Msg లకు Replies ఇస్తున్న బిందు... Room బయట ఏదో చప్పుడు వినిపించేసరికి Phone Lock చేసి మెల్లిగా దుప్పటి తీసి Door దగ్గరకు వెళ్లి తలుపు సందులోంచి బయటకు చూసింది....  Hall లో నాన్నగారు అటు ఇటు తిరుగుతూ కనిపించారు.... అమ్మ సోఫా లో కూర్చొని గడియారం వైపు చూస్తోంది.... తమ్ముడు Cake ని చేతిలో పట్టుకొని నాన్నగారి వంక చూస్తున్నాడు...!



వాళ్లను చూసి వెంటనే మెల్లిగా తలుపులు వేసి Door Lock చేసి వచ్చి Bed మీద పడుకొని దుప్పటి కప్పేసుకొని మళ్లీ చాటింగ్ మొదలెట్టింది...!




ఇంతలో నాన్నగారు ... " బిందు....బిందు... " అంటూ పిలిచారు... తమ్ముడు... అమ్మ కూడా పిలవడం మొదలెట్టారు.... ఏరోజు లేనిది ఈరోజు కొత్తగా బిందు Door Lock చేస్కోవడం వాళ్లకు విచిత్రంగా అనిపించింది... కాస్త భయంగా కూడా అనిపించింది.... పీలవడంతో పాటు ఈసారి తలుపులను కూడా బాదడం మొదలెట్టారు నాన్నగారు...!




వాళ్ళు అంతలా పిలుస్తున్న కూడా బిందు కప్పుకున్న దుప్పటి తీయలేదు..వాళ్ళ పిలుపుకు Respond అవ్వలేదు.... Phone పక్కన పెట్టేసి కళ్ళు తెరిచి ఏదో ఆలోచిస్తూ ఉంది.... ఇంతలో బిందు Mobile Vibrate అయ్యింది.... వెంటనే బిందు Mobile చేతిలోకి తీసుకొని Call Answer చేసింది.... అటు వైపు నుండి ఎవరో Birthday Wishes చెప్పారు.... బిందు సంతోషంతో Thanks You So Much అని చెప్పి ఇంకేదో మాట్లాడింది...!




 ఇంతలో నాన్నగారి వాళ్ళ పిలుపులు కాస్త అరుపులుగా మారడంతో....  అయిష్టంగానే Call Cut చేసి వెళ్లి Door తీసింది..!




Door తీయగానే నాన్నగారు... " Many More Happy Returns of the Day రా  కన్నా " అంటూ ఎంతో ప్రేమతో బిందు ని wish చేశారు.... అమ్మ... తమ్ముడు కూడా...!




Cake Cut చేయించారు.... నాన్నగారు ఏదో Gift కూడా ఇచ్చారు తనకి...  పాపం తనకి బాగా నిద్రొస్తుంది ఏమో...అందుకే కనీసం ఆ Gift ని open కూడా చేయకుండానే Room లోకి వెళ్ళిపోయి Door వేసుకుంది...!




దాదాపుగా 3 నెలలకు పైనే అయ్యుంటుంది బిందు నాన్నగారితో కూర్చొని  మాట్లాడి... చాలాసార్లు నాన్నగారు మాట్లాడడానికి ప్రయత్నించారు.... కానీ ఈ మధ్య బిందు బాగా Busy అయిపోయింది.... Project work లు... Combined Studeis.... Extra Classes అనుకుంటూ చాలా busy అయిపోయింది.... ఒకప్పుడు నాన్నకు Gud Mrng చెప్పేదాక తన Day ని Start చేయని బిందు ఈరోజు Day మొత్తంలో ఒక్కసారి కూడా నాన్నతో మాట్లాడడానికి Time ఇవ్వట్లేదు.... ఎప్పుడు లేనంతగా బాగా మారిపోయింది ఈ మధ్య..... ఎంతగా అంటే తన Birthday రోజే  నాన్నగారి Birthday  అనే విషయం మర్చిపోయేంతగా...!!




బిందు ప్రవర్తన నాన్నగారికి కొత్తగా అనిపించింది... ఏవేవో అనుమానాలు కలిగాయి తనలో.... కానీ తన కూతురి మీద ఉన్న నమ్మకానికి ఆ అనుమానాలు పటాపంచలు అయ్యాయి....!




మరుసటి రోజు ఉదయం నాన్నగారు సోఫా లో కూర్చొని పేపర్ చదువుతున్నారు.... బిందు నాన్నగారి ముందు నుండే Bag తీస్కొని బయటకు వెళ్ళింది.... నాన్నగారు చూసారు కానీ ఏం అడగలేకపోయారు.... బహుశా Frnd దగ్గరికి వెళ్తుందేమో అనుకున్నారు.... కానీ అమ్మ అడిగేసింది... " ఎక్కడికే... Bag తీస్కొని బయల్దేరావ్..." అంటూ...




" బట్టలు డ్రై క్లీనింగ్ కి ఇవ్వడానికి మా " అని చెప్తూ చెప్తూనే గేట్ దాటేసింది....!




సరిగ్గా వాళ్ళ ఇంటి నుండి 30 అడుగులు వేస్తే డ్రై క్లీనింగ్ Shop వచ్చేస్తుంది.... మహా అంటే ఓ 10 నిమిషాల నడక...!




బిందు బయల్దేరి గంట కావొస్తుంది... ఇంకా ఇంటికి రాలేదు.... నాన్నగారు కంగారుగా.. " రేయ్... ఓసారి బయటకి వెళ్లి చూడు... అక్క Shop దగ్గర ఉందేమో " అంటూ తమ్ముడిని బయటకి పంపాడు...!




10 నిమిషాల్లోనే తిరిగివచ్చి... " అక్క...అసలు Shop కి రాలేదు అంట నాన్నగారు " అని చెప్పేసరికి.... నాన్నగారు కుర్చీలోంచి లేచి టేబుల్ మీద ఉన్న తన Phone తీసుకొని బిందు Number కి call try చేశారు.... Call కలవలెదు...!

బిందు వాళ్ళ Frnds అందరికి చేశారు...  కానీ తను వాళ్ళ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు...!



నాన్నగారికి ఏం చేయాలో పాలు పోలేదు.... తెల్సినవాళ్ళ అందరికి Call చేశారు... కానీ ఏ ఉపయోగం లేకుండా పోయింది....!




" ఓసారి పోలీస్ Complaint ఇద్దాం అండి.." అంటూ అమ్మ ఏడుస్తూ అనేసరికి నాన్నగారు సరేనంటూ కళ్ళు తుడుచుకుని...Complaint File చేయడం కోసం Photo కోసం బిందు రూమ్ లోకి వెళ్లారు....!




అలా వెళ్ళగానే ఇలా టేబుల్ మీద Photo కనిపించింది... టక్కున Photo తీస్కొని రూమ్ నుండి బయటకు వస్తూ ఒక్కసారిగా ఆగిపోయి తన చేతిలో ఉన్న ఫోటో వంక చూసారు.... ఎవరో అబ్బాయి ఫోటో అది... ఇందాక తను ఫోటో తీసిన ఆ టేబుల్ వంక చూసేసరికి ఓ Letter గాలికి శబ్దం చేస్తూ కనిపించింది...!




దగ్గరికెళ్లి Letter open చేశారు నాన్నగారు...




" నాన్న... నేను ఆ ఫోటో లో ఉన్న అబ్బాయిని ప్రేమిస్తున్నాను.... ఇద్దరం కలిసి దాదాపుగా 6 నెలలుగా ప్రేమలో ఉన్నాం.... పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకున్నాం.... కానీ ఈ విషయం మీకు చెప్తే మీరు ఖచ్చితంగా ఒప్పుకోరు అని తెల్సు నాకు.... పైగా ఈ మధ్య ప్రేమించిన పాపానికి కన్న తండ్రులే కూతుళ్ళని చంపేస్తున్నారు.... అందుకే భయపడి మీకు చెప్పలేదు.... మమ్మల్ని కల్సి బ్రతకనివ్వండి... మాకు మీ అవసరం లేదు... దయచేసి మాకోసం వెతికి..మా జీవితాలను నాశనం చెయ్యకండి...!! "




నాన్నగారు Letter మొత్తం చదివి.... రూమ్ తలుపులు మూసేసుకున్నారు....!




సరిగ్గా వారం రోజుల  తరువాత బిందు ఆటో దిగింది ఇంటి ముందు.... ఆటో శబ్దం విని బయటకు పరిగెత్తుకుంటు వచ్చాడు తమ్ముడు.... బిందు ని చూసి ... " అమ్మ... అక్క వచ్చేసింది..." అంటూ అరిచాడు.... ! అమ్మ కూడా బయటకు వచ్చింది.... బిందు వంక చూస్తూ అలా నిలబడిపోయింది...!




బిందు... అమ్మని తముణ్ణి చూస్తూ సిగ్గు తో తల దించుకొని  భయంతో బయటే నిల్చుండిపోయింది.... తమ్ముడు బిందు దగ్గరికి వెళ్లి.. " లోపలికి పద అక్క... " అంటూ ప్రేమగా పిలుస్తూ బిందు చేతిలో ఉన్న Bag తీస్కొని... తనను లోపలికి తీసుకెళ్లాడు.... బిందు కి ఏం అర్థం అవ్వలేదు.... లోపలికి వెల్లగానే అమ్మ బిందు ని గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది.... బిందు అంత విచిత్రంగా అనిపించింది.... తను చేసిన పనికి అందరూ కోప్పడతారు... తిడతారు అనుకుంది.... కానీ ఇక్కడ అంత విచిత్రంగా జరిగేసరికి తనకు మెల్లిగా అర్థం అయ్యింది.... తను రాసిన ఆ Letter వీళ్ళు చదవలేదు అని... !




మరి అయితే ఆ letter ఏమైనట్టు.... ఎవరు చదివినట్టు....

 " నాన్నగారు...".... Yes... ఆ Letter నాన్నగారే చదివి ఉండాలి... అవును నాన్నగారే చదివారు.... కానీ నాన్నగారు ఎక్కడ.... తను వచ్చి ఇంతసేపు అయిన నాన్నగారు ఎక్కడ కనిపించలేదు....!



బిందు... " అమ్మ.... నాన్నగారు ఎక్కడ...? " అంటూ అమ్మని అడిగింది...!




అమ్మ ఏడుస్తూ ...  గోడ వంక చూసింది..!




బిందు గోడ వంక చూసి ఖంగుతింది...!




నాన్నగారి Photo కి దండ వేసుంది... బిందు కి పిచ్చి ఎక్కినంత పని అయింది.... తను ఆ shock నుండి తేరుకోకముందే తమ్ముడు ఏడుస్తూ ఓ Letter తీసుకొచ్చి బిందు కి ఇచ్చాడు...!




అందులో.....




" నన్ను క్షమించండి.... నేను బిందు ని లైంగికంగా వేదించాను.... తను ఇన్నిరోజులు ఎవరికి చెప్పలేదు.... కానీ ఈ మధ్య నా వేదింపులు బాగా ఎక్కువ అవ్వడంతో... తను ఎవరికైనా చెప్పేస్తుంది అన్న భయం నాలో మొదలైంది.... అందుకే ఆ భయంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నాను......"




ఆ Letter చూసి.... బిందు ఒక్కసారిగా కూలబడిపోయింది.... తన తల పగిలిపోయినంత పని అయ్యింది.... గుండె బరువు ఎక్కిపోయింది.... నోట మాట రాని స్థాయికి చేరుకుంది...!




తనని చూస్తూ అమ్మ.... నాన్నను దూషిస్తుంది... తను బిందు పట్ల ప్రవర్తించిన తీరు గురించి ఆ Letter లో రాసింది నిజం అనుకొని.......!




బిందు ఏం మాట్లాడకుండా Silent గా భారంగా అడుగులు వేస్తూ తన Room లోకి వెళ్ళింది... రూమ్ లోకి వెళ్లి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని ఏడ్చింది.... తల ను గోడకు బాదుకుంటూ ఏడ్చింది.... చేతులతో తలను కొట్టుకుంటూ ఏడ్చింది.... నేలపై కూలింది.... కన్నీటి ధార ప్రవహించింది తన కళ్ళ నుండి.... నేలపై తలను వాల్చిన తనకు ఎదురుగా ఉన్న టేబుల్ వైపు దృష్టి సారింది.... లేచి టేబుల్ దగ్గరికి చేరుకుంది..!




నాన్నగారు తన Birthday రోజు ఇచ్చిన Gift ని తన చేతిలోకి తీసుకుంది... అది Open చేసినట్టు అనిపించింది తనకు.... దాన్ని పూర్తిగా Open చేసేసరికి ... ఏవో Papers కనిపించాయి... Last year తన Birthday wish గా US లో Masters చేయాలని ఉంది అని నాన్నగారితో అంది బిందు.... అందుకోసమే నాన్నగారు తను దాచుకున్న డబ్బు మొత్తాన్ని తన US Education కోసం Invest చేసి Seat సంపాదించి దాన్ని Gift గా ఇచ్చారు....!




అది చూసి బిందు కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు... బయటకి వస్తున్న దుఃఖాన్ని గొంతులోనే అదిమిపట్టి కుమిలి కుమిలి ఏడ్చింది.... బిందు ఆ Gift ని కింద పెడుతుండగా ఆ Gift Box అడుగు భాగాన ఉన్న ఓ Letter క్రిందపడింది.... బిందు దాన్ని తెరచి చదవడం మొదలెట్టింది.....




" బిందు.... ఎలా ఉన్నావ్ రా బంగారు.... ఈ Letter నువ్ చదువుతున్నావ్ అంటే ఖచ్చితంగా నువ్ చేసింది తప్పు అని తెలుసుకొని తిరిగి వచ్చి ఉంటావు.... పర్లేదు బంగారు.... తెలిసో తెలియక చేసిన తప్పుల్ని దేవుడు లెక్కేట్టడు లే.... ఇక ఈ మనుషులు లెక్కెడతారు అంటావా.... ఆ Chance వాళ్లకు ఇవ్వను నేను.... నా బంగారాన్ని ఎవరైనా ఏదైనా అననిస్తాన నేను..... అందుకే నువ్ చేసిన తప్పు జనాలకు కనబడకుండా తప్పు నా మీద వేసుకున్నాను.... So... నిన్ను ఎవరు ఏం అనరు... నువ్ Happy గా ఉండొచ్చు.... కాకపోతే నేను చెప్పిన అబద్ధం వల్ల నీ ముందే నన్ను జనాలు తిడుతూ ఉండొచ్చు.... కానీ నువ్ అవేం పట్టించుకోవద్దు రా తల్లి.... నన్ను ఎవరు ఏమన్నా పర్లేదు.... అవి వినడానికి నేను ఎలాగూ ఇక్కడ ఉండను కదా....!




హ... నువ్ అన్నది నిజమే తల్లి... ప్రేమించిన పాపానికి కన్న తండ్రులే కూతుళ్ళని చంపుకుంటున్నారు... కానీ నన్ను కూడా వాళ్ళతో పోల్చావు చూడు అది కాస్త బాధను కలిగించింది తల్లి.... కాస్త కాదు చాలా.... చొక్కా పై బొత్తాలు పెట్టుకోకపోతే ఎగిరిపోయే పరువు ప్రతిష్టల కోసం నిన్ను ఎలా చంపుకుంటాను అనుకున్నావ్ రా....!




నాన్నను రా తల్లి.... గుండెల మీద పెట్టుకొని పెంచాను... నీకు చిన్నపాటి జ్వరం వచ్చిన తెల్లవార్లు జాగారం చేసి మరీ కంటికి రెప్పలా కాపాడుకున్నాను నేను.... నీ రేపటి భవిష్యత్ గురించి నా గతాన్ని , ప్రస్థుతాన్ని సైతం తాకట్టు పెట్టాను నేను.... నీలో మా అమ్మని చూసుకొని నువ్వే నా సర్వస్వమ్ అనుకొని అనుక్షణం నీ గురించే ఆలోచిస్తూ బతికాను రా కన్నా.... అలాంటి నేను నీ ప్రాణాలు తీస్తాను అని ఎలా అనుకున్నావ్ రా....!




9 నెలలు మోసే తల్లిని దేవత అంటూ పూజిస్తారు.... కానీ ఆ మిమ్మల్ని 9 నెలలు మోసే ఆ తల్లిని కవచం లా కాపాడుకుంటూ... భూమి మీదకి అడుగు పెట్టిన నిన్ను 22 ఏళ్ళు భుజాల మీద ఎట్టుకొని పెంచిన నాన్నను మాత్రం కసాయి వాణ్ణి చేశావ్ ఈరోజు... చచ్చిపోయాను రా బంగారు.... నువ్ రాసిన ఆ అక్షరాలు చూడగానే చచ్చిపోయాను నేను....!...అందుకే శాశ్వతంగా చచ్చిపోదాం అని Decide అయ్యాను...! నలుగురు నీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే నేను విని తట్టుకోలేను రా తల్లి...!!




నాన్న అంటే నమ్మకం రా... నా నమ్మకానివి రా నువ్.... ఏ రా తల్లి.... నాతో పాటు నువ్ Bike మీద వస్తూ Mobile లో chat చేస్తూ కూర్చుంటే నా బండికి ఉన్న అద్దంలో కనిపించదు అనుకున్నవా .... కనిపించిన కూడా ఎవరు అని అడగలేను... కారణం నమ్మకం.... నా కూతురు అనే నమ్మకం.. ఏది చేసినా నాకు చెప్పి చేస్తుంది అనే నమ్మకం.... కొడుకుల్ని గది బయటే ఉంచి.... కూతుళ్ళని గుండెల్లో దాచుకునే నాలాంటి పిచ్చి తండ్రులు ఎందరో ఉన్నారు..... కానీ ఆ కూతుళ్లు మాత్రం నాన్న గుండెల మీద తంతూ వాళ్లకు నచ్చినట్టుగా బతికేస్తున్నారు...!




అసలు ఏం కావాలి రా మీకు.... ఏదైనా సరే మన దగ్గర లేకుంటేనే కదా బయట Try చెయ్యాలి....అసలు Love అంటే ఏంటి... !




Caring హ.... మీ పట్ల ఎవడో గాలికి తిరిగే వెధవ తిన్నవా అంటూ మూడు పూటలు పలకరిస్తేనే Caring అంటే.... ఆ మూడు పూటలు మీకు తిండి పెడుతున్న Parents చేసేదాన్ని ఏమనాలి...?




Gifts.... పాతిక రూపాయలు పెట్టి Greeting Card... పదిహేను రూపాయలు పెట్టి ఓ చాక్లెట్ కొనిస్తేనే Love పుట్టేసుద్ది అంటే.... పుట్టినప్పటి నుండి ఈరోజు దాకా నువ్ వాడే ప్రతీది కొనిచ్చిన తండ్రి మీద ఏ మాత్రాన ప్రేమ ఉండాలి మరి....??




మేము ఇవ్వలేని ప్రేమలు వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతారు తల్లి.... ?




పోనీలే కన్నా.... నువ్ ఏది చేసినా నాకు...Ok.... ఓ తండ్రిగా  నువ్ చేసే ప్రతీదాన్ని Support చేస్తాను నేను.... అందుకే నిన్ను Support చేయడానికి నా ప్రాణం కూడా పణంగా పెట్టాను.... నువ్ Happy గా ఉండడమే నాకు కావాలి.... ఓ తండ్రిగా నీకు మంచి భవిష్యత్తు ఇవ్వడం నా భాద్యత... ఇకనైనా కాస్త జాగ్రత్తగా ఉండు తల్లి..... ఇక పై నిన్ను Support చేయడానికి నేను కూడా ఉండను.......




లవ్ అని తిరిగి మోసపోయే అమ్మాయిలకు ఈ పోస్ట్ ఓ కనువిప్పు మరియు సన్మామార్గంలో నడవాలని ఆశిస్తూ ... ✍🏻


పెళ్లిళ్లలో చేస్తున్న పొరపాట్లు



 మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం

దీనివలన వచ్చే నష్టం మనో  వైకల్యం,చిత్తచాంచల్యం,అన్యోన్యత లేకపోవటం భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం
 జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో ఒకరు చూపులు నిలపకపోవటం ( వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం) 
(పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం‌ ఆచరించాకే మిగతావి)
దీనివలన కలిగే నష్టం
వారిమధ్య ప్రేమ లోపించటం
ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం
దీనివలన కలిగే నష్టం 
సంస్కారం లోపించటం
తలంబ్రాల కు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం
దీనివలన 
బంధు ద్వేషం ఆర్థిక ఇబ్బదులు
 బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి రావటం వధూవరులని ఆశీర్వదించటం
దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం
*బఫే భోజనాలు
దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం*
వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటిస్థానంలో సినిమా పాటలు వినటం
దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం
ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా నిలవండి...

--((**))--

*సౌందర్యవతి*
పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, ఇలా అర్థరాత్రి, అపరాత్రి వేళల్లో శ్మశానాల వెంట ఎంతకాలమని తిరుగుతావు? ఒక్కొక్కసారి మనిషి తన నిర్ణయాలను మార్చుకోవడంవల్ల మేలు కలగవచ్చు. నాగరాజు లాంటి పట్టుదలగల యువకుడు, ఆఖరి క్షణంలో తన నిర్ణయం మార్చుకున్నాడు. నీకు అతని కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను" అంటూ ఇలా చెప్పసాగాడు.
నాగరాజు అనే యువకుడికి నగరంలో మంచి ఉద్యోగం వున్నది. అతనికి ఇంకా పెళ్ళి కాలేదు. అతని తల్లిదండ్రులకు నాగరాజు మేనమామ కూతురయిన రత్నాన్ని కోడలుగా తెచ్చుకోవాలని కోరిక. ఆమెకు అంతగా చదువు లేదు. అంత అందగత్తె కూడా కాదు. ఆమెకు నాగరాజు అంటే అమితమైన ప్రేమ. అయితే, ఏ ప్రత్యేకతలు లేని రత్నాన్ని పెళ్ళి చేసుకోవడం నాగరాజుకు ఇష్టం లేదు. ఒకసారి నాగరాజు ఏదో పండగకు సొంత వూరు వచ్చాడు. తల్లిదండ్రులు అతనితో "పనిలో పనిగా రత్నాన్ని పెళ్ళి చేసుకొని వెంటబెట్టుకుపో" అన్నారు.నాగరాజు సూటిగా జవాబివ్వకుండా అసలు విషయాన్ని దాటవేశాడు. ఆ సాయంత్రం నాగరాజు ఊరికి దూరంగా ఉన్న మామిడి తోపుల్లోకి షికారు వెళ్ళాడు. సూర్యాస్తమయ సమయంలో వర్షం ప్రారంభమైంది. అతను కొంతదూరం పరిగెత్తి, ఒకపెంకుటింటి అరుగుమీద తలదాచుకున్నాడు. అయితే ఆ సరికే అతను బాగా తడిసిపోయాడు. "అయ్యో, బాగా తడిసిపోయావు. లోపలికిరా, బాబూ" అంటూ కిటికీలోంచి అతణ్ణి చూసిన ఒక ముసలావిడ తలుపు తెరిచింది.
నాగరాజు మొహమాటపడుతూనే లోపలికి వెళ్ళాడు. "సంధ్యా, పొడిగుడ్డ తీసుకు రామ్మా. ఈయన వర్షంలో బాగా తడిసిపోయాడు" అని ముసలావిడ లోపలికి కేక పెట్టింది. "అందమైన పేరు!" అనుకున్నాడు నాగరాజు. ఇంతలో కాళ్ళ గజ్జెల గలగల శ్రావ్యంగా వినిపించి గుమ్మం దగ్గరే ఆగిపోయింది. ముసలావిడ గుమ్మందాకా వెళ్ళి, బట్ట అందుకున్నది.నాగరాజు తడిసిన తల తుడుచుకుంటుండగా "కాసిని వేడిపాలు పట్టుకురా సంధ్యా" అని మళ్ళీ కేకపెట్టింది ముసలావిడ.తరవాత ఆమె నాగరాజును గురించి తెలుసుకున్నది; తమను గురించి చెప్పింది; వాళ్ళు ఆ వూరుకు కొత్తగా వచ్చారు. సంధ్యను చూడాలని నాగరాజుకు చాలా కోరికగా ఉన్నది. కాని, పాలు కూడా గుమ్మందాకా వెళ్ళి ముసలావిడే అందుకోవడంతో, అతడికి ఆ అవకాశం చిక్కలేదు. మర్నాడు పని గట్టుకుని ఆ ఇంటివైపుకు వెళ్ళాడు నాగరాజు. ముసలావిడ కిటికీలకు కొత్తగా అల్లిన తెరలు కడుతున్నది. ఆమె నాగరాజును నవ్వుతూ ఆహ్వానించి, "మా సంధ్య తోచనప్పుడు యిలా తెరలూ అవీ అల్లుతూ వుంటుంది" అన్నది.ఆ పూట అతనికి సంధ్య చేసిన రుచికరమయిన ఫలహారం అందింది కాని, ఆమె దర్శనం మాత్రం కాలేదు.
ఆ మర్నాడు తమ దొడ్లో కాసిన రెండు దానిమ్మపళ్ళు తీసుకొని, నాగరాజు, సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వీధి తలుపు మూసి ఉన్నది. లోపలినుంచి శ్రావ్యమైన పాట వినిపిస్తున్నది. నాగరాజు తీయని ఆ పాట వినడంలో లీనమైపోయాడు. అప్పుడే గుడినుంచి వచ్చిన ముసలావిడను అతడు గమనించలేదు.ముసలావిడ దగ్గరగా చేరవేసి ఉన్న తలుపు తోస్తూ "ఇప్పుడే వచ్చావా బాబూ? మా సంధ్య పాట మొదలుపెడితే, పరిసరాలు మరచిపోతుంది" అన్నది.లోపలి గదిలో వున్న సంధ్య, నాగరాజుకు కనపడలేదు. అతడు దానిమ్మపళ్ళను ముసలావిడ చేతిలో పెట్టి, కాసేపు కబుర్లు చెప్పి, ఇంటికి వచ్చేశాడు. అతడికి సంధ్య అన్ని విధాలా తగిన భార్య అనిపించింది. ఆమె పెద్దగా అందంగా లేకపోయినా,ఆమెనే పెళ్ళాడాలన్న దృఢనిశ్చయానికి వచ్చాడు. మర్నాడు ఎలాగయినా సంధ్యను చూడాలనీ, ముసలావిడకు తన అభిప్రాయం చెప్పాలనీ నిశ్చయించుకున్నాడు.
నాగరాజు ఆ మరుసటిరోజున సంధ్యవాళ్ళ ఇంటిని సమీపిస్తుండగా, హఠాత్తుగా పక్క సందులోంచి వచ్చిన ఎద్దొకటి, అతణ్ణి పొడిచి పారిపోయింది. నాగరాజు కిందపడిపోయాడు. అతడి చేతికి గాయమై రక్తం కారసాగింది. ఈ అలికిడికి ముసలావిడ ఇంట్లొంచి బయిటికి వచ్చింది. ఆమె నాగరాజును చూసి "అయ్యో ఏం జరిగింది? చేతినుంచి రక్తం కారుతున్నది, లోపలికి రా" అని ఆందోళనపడుతూ వచ్చి, గాయపడిన నాగరాజు చేయి పట్టుకున్నది.
"మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలని వస్తున్నాను. ఆ ఆలోచనలో పక్క సందులోనుంచి పరిగెత్తుకొస్తున్న ఎద్దును చూడలేదు" అన్నాడు నాగరాజు. ముసలావిడ నాగరాజును ఇంట్లోకి తీసుకుపోయి కూర్చోబెట్టి, "సంధ్యా, చెంబుతో నీళ్ళు పట్టుకురా" అని గట్టిగా కేకపెట్టింది. గది కిటికీవద్ద నిలబడి సంధ్య ఇదంతా చూస్తూనే ఉన్నది. ఆమె ముఖకవళికల్లో జాలి, ఆదుర్దాలాంటి లక్షణాలే లేవు. తీరా తల్లి కేక వేసాక ఆమె కిటికీ దగ్గరనుంచి కదలి, కొంచెం సేపట్లో నీళ్ళ చెంబు తీసుకుని నాగరాజు ఉన్న చోటుకు వచ్చింది. ఆమె అందం చూసి నాగరాజు కళ్ళు చెదిరిపోయాయి. అతను అంతటి సౌందర్యవతిని నగరంలో కూడా చూసి ఉండలేదు. ముసలావిడ సంధ్య తెచ్చిన నీళ్ళతో, నాగరాజు గాయం కడిగింది. ఆ తరవాత పసుపూ, శుభ్రమైన గుడ్డా తెమ్మని చెప్పింది.
సంధ్య పసుపూ, గుడ్డా తెచ్చి తల్లికి ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది. ముసలావిడ నాగరాజు గాయానికి కట్టుకట్టింది. అతడు కాస్త తేరుకున్నాక, "ఇప్పుడు చెప్పు బాబూ! నువు చెప్పాలనుకుంటున్న ముఖ్య విషయం ఏమిటి?" అని అడిగింది.వెంటనే నాగరాజు " మా మేనమామ కూతురితో నా పెళ్ళి జరగబోతున్నది. మీరూ, సంధ్య తప్పకుండా రావాలి" అని చెప్పి ఇంటికి వచ్చేశాడుబేతాళుడు యీ కథ చెప్పి "రాజా నాకొక సందేహం! నాగరాజు సంధ్యను చూడకముందే ప్రేమించాడు కదా. ఆమె అతి సాధారణంగా ఉన్నా కూడా ఆమెనే పెళ్ళాడాలని నిర్ణయించుకున్నాడు. అయినా ఆఖరిక్షణంలొ తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నాడు? అంత గొప్ప సౌందర్యవతికి తాను తగననుకున్నాడా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగులుతుంది" అన్నాడు.
దానికి విక్రమార్కుడు "నాగరాజు తన నిర్ణయాన్ని మార్చుకోవడం సరి అయినదే. ప్రతిమనిషికీ కనీసమైన కొన్ని మంచి లక్షణాలుండాలి. అవి లోపించినపుడు, ఇతర అర్హతలు ఎన్ని వున్నా ప్రయోజనం లేదు. పౌరుషం, ఆత్మాభిమానం, ధైర్యం వంటివి మగవాడికుండవలసిన కనీస లక్షణాలు. అలాగే స్త్రీకి కరుణ, ఆదరణ, సేవాధర్మం వంటి లక్షణాలు తప్పకుండా వుండాలి. ఆ గుణాలు లేని స్త్రీ భార్యగా, తల్లిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేదు. సంధ్య నాగరాజు గాయాన్నీ, స్రవిస్తున్న రక్తాన్ని చూసి కూడా ఏ మాత్రం చలించలేదు. తోటి మనిషిగా సానుభూతి కనబరచలేదు. ఆమెది రాతి గుండె అని యీ విషయం రుజువు చేస్తున్నది. అందుకే అన్ని అర్హతలున్న అందాలరాశిని కాక, కనీసార్హతలయిన ప్రేమ, అభిమానం ఉన్న మేనమామ కూతురిని పెళ్ళాడడానికి నాగరాజు నిర్ణయించుకున్నాడు" అన్నాడు..రాజుకు ఈవిధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.
(మీ అభిప్రాయాన్ని తెలియజేయండి)
ధన్యవాదాలు,
శుభదినం.

💞💕💚వారణాసి –💚💕💞 

వారణాసి క్షేత్రంలో వెలసిన విశ్వేశ్వరుని గురించి పెద్దలు ఒక ప్రార్థనాశ్లోకం చెప్తూ ఉంటారు. 
సానందమానందవనే వసంతం, ఆనందకరం హతపాప బృందం 
వారాణసీ నాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే!! 

ఎంత ప్రయత్నించినా నీ పాదముల వైపు ఉన్ముఖము చేయలేని నా బలహీనతను గుర్తెరిగి, ఈశ్వరా, నీవే నన్ను నీవాడుగా స్వీకరించు’ అని చెప్పడమే శరణాగతి. అందుకే శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే’ – ఓ విశ్వనాథుడా నీకు నేను శరణాగతి చేస్తున్నాను’ అని ప్రార్థనా శ్లోకమును ప్రారంభం చేస్తారు. సనాతన ధర్మమున జన్మించిన ఏ వ్యక్తి అయినా జీవితంలో తప్పకుండా ఒక్కసారి కాశీ వెళ్ళాలని కోరుకుంటాడు. అసలు కాశి నేను రాను అన్నవాడు కాని, వెళ్ళనన్నవాడు కానీ ఉండడు. కాశీ పట్టణంలో ప్రవేశించడమే గొప్ప. ఈశ్వరానుగ్రహం లేనినాడు ఈ పట్టణంలోకి ప్రవేశం చేయలేడు. మొట్టమొదట ఈలోకమునకు ఉపాసనా క్రమమును నేర్పడానికి నిర్గుణము నుంచి సగుణమై వెలసిన మొట్టమొదటి భూమి ఏది ఉన్నదో అది వారణాసి. ఇది పార్వతీ పరమేశ్వరులుగా మొట్ట మొదట కనపడింది. వీరు సృష్టి చేయడానికి వచ్చారు. దీనినే శాస్త్రం ‘నారాయణ, నారాయణి’ అని మాట్లాడింది. ఇపుడు వాళ్ళిద్దరూ చూసి ‘నీ సంకల్పం మాకు తెలిసింది. మేము ఏమి చెయ్యాలి? అని అడిగారు.అపుడు ఆయన తపించండి’ అని చెప్పాడు. నిర్గుణం నుండి సగుణం అయిన తర్వాత ఆయన నోటి వెంట పలికిన మొట్టమొదటి మాట తపింపుడు అనేది. అప్పుడు ఎక్కడ తపస్సు చేయాలి అని అడిగారు. అప్పుడు ప్రపంచం అంతా నీటితో నిండిపోయి ఉంది.. వెంటనే ఈశ్వరుడు పరిశీలించి ఒక పట్టణమును సృష్టించాడు. అదే వారణాసి. అనగా అసలు ఈ బ్రహ్మాండమునందు సృష్టించబడిన మొట్టమొదటి పట్టణము వారణాసి. చావడం పుట్టడం ఇంకొకటి తెలియక చచ్చి పుడుతున్న మనకి ఒక గురువు దొరికి ఇంకొకసారి పుట్టవలసిన అవసరం లేకుండా చేశాడు. ఇలా బతికేటట్లు చేయడానికి కాశి ఇప్పుడు మోక్షపురి అయింది. కాశి భోగపురి కాదు. మీరు చేసిన పాపరాశి దగ్ధం అయిపోవాలి అంటే వాడు శరీరంతో కాశీ పట్టణంలోకి ప్రవేశించగలిగితే వానికి ఈశ్వరుడు మోక్షం ఇస్తాడు. 

ఈశ్వరుడు వ్యక్తి ఖాతాలో పడిపోయి ఉన్న కొన్ని కోట్ల జన్మల నుంచి చేసిన పాపపుణ్యములనే పర్వతములను కాశీలో అడుగు పెట్టగానే చూస్తాడు. ఆ పట్టణంలో అడుగు పెట్టినంత మాత్రం చేత పాపపుణ్యములను ఉత్తర క్షణమునందు కాశీ పట్టణము నందు అడుగు పెట్టగానే ధ్వంసం చేసేస్తాడు. అందుకే చచ్చిపోతే కాశీ వెళ్లి చచ్చిపోవాలన్నారు. కాశీ పట్టణానిది విచిత్రమైన స్థితి. ఎప్పుడు చేసిన పాపం అప్పుడే పోతుంది. విశ్వేశ్వరుడు తీసేస్తూ ఉంటాడు. వాడు ఊపిరి వదులుదామనుకునేటప్పటికి వాడికి పాపం లేదు, పుణ్యం లేదు. అప్పుడు ఆ వ్యక్తీ మోక్షమును పొందాలి. ఇది ఈశ్వర ప్రతిజ్ఞ. అది జ్ఞానము ఇచ్చే క్షేత్రము. అందుకనే అది పరమేశ్వరునకు అత్యంత ప్రియమైన పట్టణం అయింది. ఇప్పుడు అయిదు క్రోసుల కాశీపట్టణం సిద్ధం చేసి ఇక్కడ తపించండి అన్నాడు. శ్రీహరి కూర్చుని అక్కడ గొప్ప తపస్సు ప్రారంభం చేశాడు. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరమునకు పట్టిన చెమట ఆకాశంలో తెల్లటి రూపంలో నదిగా ప్రవహించి వెళ్ళిపోతోంది. అలా వెళ్ళిపోతుంటే ఆయన తపస్సులోంచి బహిర్ముఖుడై ప్రవహించి వెడుతున్న నీళ్ళ వంక చూసి ఆశ్చర్య పోతున్నాడు. శ్రీమహావిష్ణువు శరీరమునుండి పుట్టిన తపో వ్యగ్రత చేత కలిగిన జలధార ఆయన కూర్చున్న కాశీపట్టణమును ముంచెత్తేస్తోంది. ఇప్పుడు శంకరుడు చూసి తన త్రిశూలం చేత పట్టి పైకెత్తాడు. ఇప్పుడు ఆ పట్టణమునాకు త్రిశూల స్పర్శ కలిగింది. నీళ్ళలోంచి భూమి పైకి వస్తూ కనపడింది. ఆ సందర్భంలో శ్రీహరి చెవికి పెట్టుకున్న కుండలం ఒకటి జారి ఆ నీళ్ళలో పడిపోయింది. అది ఎక్కడ పడిందో అదే ‘మణికర్ణికా తీర్థం’ అయింది. 

అప్పుడు శివుడు అక్కడ ప్రతిజ్ఞ చేశాడు ‘ ఇప్పటి వరకు ఈ పట్టణమును మాత్రమే సృష్టించాను. లయం జరిగినప్పుడు ప్రళయజలములందు ఈలోకం అంతా మునిగిపోతుంది. కానీ ఈ కాశి నా త్రిశూలమునకు పైన నిలబడింది కాబట్టి ఈ పట్టణం మునగదు. ఈ కాశీపట్టణం అలాగే ఉండిపోతుంది’ అన్నాడు. కాబట్టి కాశీకి లయంలేదు. అప్పుడు శ్రీమన్నారాయణుడు యోగనిద్రలోకి వెళ్ళాడు. ఆయన నాభిలోంచి ఒక కమలం ఆవిర్భవించింది. ఆ కమలంలోంచి బ్రహ్మ వచ్చారు. వేదమును ఆధారంగా చేసుకుని ఈ సమస్త సృష్టిని చెయ్యడం ప్రారంభం చేశారు. కాబట్టి సృష్టి రచన ప్రారంభం అయిన భూమి వారణాసి. ‘వారణ’ ‘అసి’ అని రెండు నదుల సంగమ క్షేత్రం వారణాసి. శంకరుని జటాజూటం మీద పడి అక్కడినుంచి క్రిందకి ప్రవహించి వచ్చిన గంగానది ఒరిపిడితో ప్రవహించిన భూమి వారణాసి. 

అందులోంచి ప్రజాపతులు, మనువులు, దేవతలు వచ్చి ఈశ్వరుని ప్రార్థన చేశారు ‘ఈశ్వరా, ఈ సృష్టి ప్రారంభం నిర్గుణం సగుణం అవడంతో మొదలయింది ఆ స్వరూపమును శ్రీ మహావిష్ణువే చూశారు. కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడవు కనుక నీవు విశ్వేశ్వర నామంతోను, విశ్వమునకు నాథుడవు గనుక విశ్వనాథుడను నామంతోను పిలవబడతావు’ అని చెప్పింది. సృష్టి చేయగలదు, స్థితి చేయగలదు, లయం చేయగలదు. మీరు ప్రయత్నపూర్వకంగా చేయవలసినది ఉపాసన. అందుచేత అది స్వయంభూలింగం అయింది. ఈశ్వరుడు సృష్టి చేశాడు. ఇపుడు ఈ సృష్టి నిలబడదానికి ఆహారం అవసరము. ఇప్పుడు ఆ పని చేయడానికి అమ్మవారు అన్నపూర్ణగా వచ్చింది. తన భర్త విశ్వభర్తయై అక్కడ కూర్చుంటే అన్నపూర్ణయై తాను అంతరికీ అన్నం పెడతానని మునికాన్తలు అందరూ సంతోషపడేటట్లుగా ఆ శివశక్తి ఏ సృష్టికి హేతువయినదో అదే అన్నం పెట్టడానికి ప్రకృతిగా మారింది. 

భవాంగ పతితం తోయం పవిత్రమితి పస్పృశుః’ అన్నారు వాల్మీకి రామాయణంలో. శంకరుని శరీరమును తాకి క్రింద పడింది కాబట్టి గంగకు అంత పవిత్రత వచ్చింది. గంగ ఉత్తరమున పుట్టి దక్షిణమునకు ప్రయాణం చేయడం మొదలు పెట్టి వారణాసీ క్షేత్రం వరకు దక్షిణాభిముఖంగా వచ్చింది. వారణాసి పట్టణంలో ఉత్తరాభిముఖం అయింది. మనం కూడా సృష్టిలో భగవంతుని నుండి విడివడి జీవ స్వరూపంతో పుడుతూ చనిపోతూ ఉంటాము. ఉత్తరమునకు వెళ్ళడం అంటే మళ్ళీ పుడుతూ ఉండడం, దక్షిణానికి వెళ్ళడం అంటే శ్మశానమునకు వెళ్ళడం. మనం అందరూ అలానే తిరుగుతున్నాము. మీరు ఈశ్వరాభిముఖులైనప్పుడు ఈ తిరగడం అన్న చక్రం తిరగడం ఆగిపోతుంది. అప్పుడు అదే ఆఖరి జన్మ అవుతుంది. గంగ కాశీలో ఉత్తరమునకు తిరిగింది. కాబట్టి కాశీ గంగను పరమ పవిత్రంగా భావిస్తాం. పరమశివుడు మహాజ్ఞాని. ఆయన అనురాగమును నలుగురు చూరగొన్నారు – గౌరీదేవి, గంగాదేవి, కాశీపట్టణం, దాక్షారామం. కాశీ మోక్షపురి పెద్దలయిన వారు ముందు నడవడిని చూపిస్తే వెనకనున్న వాళ్లకి అలవాటు అవుతుంది. అందుకని వ్యాసుడిని అటువంటి పరీక్షకి నిలబడగలిగిన వ్యక్తిగా విశ్వేశ్వరుడు నమ్మి ఒక ఏడురోజుల పాటు ఆయనకీ అన్నం దొరకకుండా చేశాడు. వ్యాసుడికి అక్కసు పుట్టింది. తనకు కాశీలో అన్నం దొరకలేదు కాబట్టి కాశీని శపిస్తానని అన్నాడు. కాశీ జోలికి వెళితే ఈశ్వరుడు ఊరుకుంటాడా! వ్యాసుడు శాపజలమును పటుకోగానే గభాలున అక్కడ ఉన్న ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. అందులోంచి 50 సం!!ల స్త్రీ బయటకు వచ్చి “నీ మనశ్శుద్ధిని లోకమునకు తెలియజేయడం కోసం నీలకంఠుడు ఈ పరీక్ష పెట్టాడు. కాశీని శపిద్డామనుకున్నావా? అన్నం లేదని కదా నీవు బాధపడిపోతున్నావు. ఒకసారి గంగానదికి వెళ్లి స్నానం చేసి మధ్యాహ్నకాలంలో చెయ్యవలసిన సంధ్యావందనం చేసి శివలింగమునకు అభిషేకం చేసుకుని నీ శిష్యులతో రా. అన్నం పెడతాను’ అన్నది. వ్యాసుడు వెళ్లి గంగాస్నానం చేసి సంధ్యావందనం, అభిషేకం చేసుకుని శిష్యులతో తిరిగి వచ్చాడు. ఆవిడ లోపలికి రమ్మంది. అందరూ వచ్చి కూర్చున్నారు. వారికి వంట చేస్తున్న ఆనవాలు ఎక్కడా కనపడలేదు. ఈవేళ కూడా మనకు భోజనం లేదు. అని అనుకుని ఆపోశన నీళ్ళు చేత్తో పట్టుకునే సరికి పొగలు కక్కుతున్న అన్నం, కూరలు భక్ష్య భోజ్య చోష్య లేహ్యములు అన్నిటితో నెయ్యి అభిఘారం చెయ్యబడిన విస్తరి కనపడింది. వాళ్ళందరూ మిక్కిలి ఆశ్చర్యపోయి భోజనాలు చేసేసి ఉత్తరాపోశనం పట్టేశారు. అమ్మవారు వచ్చి ‘మీరందరూ భుక్తాయాసంతో ఉన్నారు అందుకని కొద్దిసేపు విశ్రాంతి మండపంలో కూర్చోనమని చెప్పింది. వారు అలాగే కూర్చున్నారు. ఆవిడే అన్నపూర్ణ అమ్మవారు. ఇప్పుడావిడ భర్తతో కలిసి వచ్చింది. ఈ విషయం శివుడికి ముందుగా తెలిస్తే కాశీ వదిలి పొమ్మని శాపం పెడతాడు. ఆకలితో బిడ్డ వెళ్లిపోతాడేమోనని ముందు అన్నం పెట్టేసి అపుడు శంకరుని తీసుకు వచ్చింది. అపుడు వ్యాసుడు అమ్మవారి వంక, అయ్యవారి వంక చూశాడు. అపుడు శంకరుడు ‘వ్యాసా, నీవు ప్రాజ్ఞుడవని, ఏడు రోజులు అన్నం దొరకకపోయినా ముక్తక్షేత్రంలో ఎలా ఉండాలో అలా ఉంటావని నీకు పరీక్ష పెడితే నీవు తట్టుకోలేకపోగా నాచేత నిర్మింపబడి కొన్ని కోట్లమందికి మోక్షం ఇవ్వడం కోసమని సిద్ధం చేయబడిన వారణాసీ పట్టణంలో ఎవరూ ఉండకుండా చేద్దామని శాపం ఇవ్వబోయావు. కాబట్టి నీవు ఇక కాశీలో ఉండడానికి అర్హుడవు కావు. అందుకని నీవు కాశీ విడిచి ఉత్తరక్షణం నీ శిష్యులతో కలిసి వెళ్ళిపో’ అన్నాడు. వ్యాసుడు అగస్త్య మహర్షితో చెప్పుకున్నాడు. 



వెనక్కి తిరిగి బాధలో అయ్యో కాశీ విడిచి పెట్టి వెళ్లిపోవడమా? అని నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. అపుడు వెనక నుంచి అమ్మవారు ‘వ్యాసా, మోక్షం అడగవలసిన చోట అన్నం కోసం ఏడ్చావు. ఎక్కడికి వెళ్ళినా ఈయనే నిన్ను ఉద్ధరించాలి. నీకు ఈశ్వరానుగ్రహం కలగాలి. భోగము, మోక్షము రెండూ దొరుకుతాయి కాబట్టి నీవు ఇక్కడనుండి దక్షారామం వెళ్ళిపో’ అంది. ఇదీ అన్నపూర్ణాతత్త్వం అంటే. అటువంటి తల్లి ఉన్న క్షేత్రం ఆ కాశీ క్షేత్రం.

ఒక రోజు 19 సంవత్సరాల వయస్సు గల అమ్మాయి...
రాత్రి 10:45  తన డ్యూటి పూర్తి చెసుకొని ఇంటికి వెళ్ళడానికి కాళేశ్వరం బస్సు స్టేషన్ లో బస్సు కోసం ఎదురుచూస్తుంది........
కానీ కొద్దిసేపటి తర్వాత ఆమెకు  తెలిసింది......
తను వెళ్ళవలసిన చీవరి బస్సు‌‌ ముందే వేళ్శిపోయిందని..... 
ఆమె భయంతో ఆ బస్సు స్టాప్ ముందు నిలబడి ఏం చేయాలి అని ఆలోచిస్తుంది
ఆమె ముందు నుండి చాలా వాహనలు వెళ్తున్న ఎవ్వరిని లిఫ్ట్ అడగలేదు..
కొద్దిసేపటి తర్వాత 
ఒక 20 సంవత్సరాల వయసు గల యువకుడు బైక్ పై🏍 భూపాలపల్లి వైపు రావడం చూసి అతన్ని లిఫ్ట్ అడగాలని 
నిశ్చయించుకుంది....
అతను దగ్గరికి రాగానే లిఫ్ట్ కావాలి అని అడుగుతుంది.
Okఅని
అతను ఆమెను బైక్ ఎక్కించుకుంటాడు.
మార్గ మద్యంలో
అతను ఆమెను మీరు ఎక్కడికి వెళ్ళలి అని అడుగుతాడు...
ఆమె తన అడ్రస్ చెప్పి తనను వాళ్ళ ఇంటి వద్ద డ్రాప్ చెయ్యరా....!అని కోరుతుంది...
దానికి అతను అంగికరించి.
ఆమెను వాళ్ళ ఇంటి ముందు డ్రాప్ చేస్తాడు....
దానికి ఆమె కృతజ్ఞతలు తెలుపుతుంది...
అప్పుడు అతను ఆమెను అడుగుతాడు...
ఏమనీ అంటే.
మీ ముందు అన్ని వాహనాలు వెళ్తున్న ఎవరిని లిఫ్ట్ అడగలేదు.
కానీ నన్ను మాత్రమే అడిగారు  ఎందుకని.......
అప్పుడు ఆమె చిరునవ్వుతో....
మీ యొక్క
బైక్ పైన ఉన్న నెంబర్ ప్లేట్ పైన........ 
..బ్రాహ్మణ..అని రాసి ఉంది కదా.... 
ఈ సృష్టిలో  బ్రాహ్మణ కంటే గొప్ప ఎవ్వరున్నరు....
ప్రేమను పంచటం లో అచరించడం లో  బ్రాహ్మణ తర్వాతే ఎవ్వరైనా ...
అని చెప్తుంది......
అప్పుడు అతను గర్వంతో ఆమెకు  ధన్యవాదాలు తెలిపి అక్కడి నుండి  వెళ్ళిపోతాడు....
--((**))--



.

 ప్రాంజలి ప్రభ
కవితానందం (సరస సంభాషణ )



గోల గోల చేస్తావా - 

ఘల్లు ఘల్లు మని అరుస్తావా
గోల గోల చేయనులే
ఘల్లు ఘల్లుమని అరవనులే



జల్లులు కురిపించి తడిపేస్తావా

థలుక్ థలుక్ లతో మరిపిస్తావా
జల్లులు కురిపించలేనులే
థలక్ లతో మరిపించలేనులే



వళ్ళు గుళ్ళ గుళ్ళ చేస్తావా

వళ్ళప్ప గిస్తే మురిపిస్తావా
గుళ్ళ గుళ్ళ చేయలేనులే
మురిపించే శక్తియు లేదునులే



ఊర్ధ అధో నలిపేస్తావా

ఉయ్యాలలా ఊపేస్తావా
ఏది నేను సల్పలేనులే
ఉయ్యాల్లా ఊపలేనులే



అంగరక్షకుడిగా వస్తావా

నన్ను చూసేవాన్ని కట్టేస్తావా
రక్షణ చూసే శక్తి లేదునులే
ఏమన్నా కట్టే దమ్ములేదులే



పెద్దలను నమ్మిస్తావా

నమ్మి నాతో ఉండగల్గుతావా
పెద్దలను నమ్మించలేనులే
నమ్మి నీతో ఉండలేనులే



మగతనంతో సృష్టకి సహకరిస్తావా

ఆడంగి వలే భజనతో బతికేస్తావా
మగవాన్నని నీకు చెప్పలేదులే
ఆడంగిలా ఉంటానని అనలేదులే



నాకు విడాకులిచ్చే స్తావా

నాకు ఇంకో పెళ్ళి చేస్తావా
అమ్మను అడగలేనులే
నాన్నను ఒపించలేనులే



మరి నన్ను వదిలేస్తావా

పుష్టిగా తిని సుఖ పెడతావా
లేదు సృష్టికి సహకరిస్తాలే
మందులతో మోగుడ్ని అవతాలే



మందు తిని మాటవింటావా

నిన్ను నేను మరువలేను బావా
నీ మాటను వింటానులే
దేవి నిన్ను నేను వదలలేనులే



--(**))--



కొంత మంది వివిధ సందర్భాలలో కలసినపుడు వేసే విచిత్రమైన ప్రశ్నలు..



*వాటికి సరదా జవాబులు*




 1. సినిమా హాల్లో:




 "మీరు కూడా సినిమాకే వచ్చారా?"




జవాబు: *లేదు ...పాప్ కార్న్ అమ్ముకోవటానికి వచ్చాను*




 2. సిటీ బస్సులో కాలు తొక్కి:

 "Sorry .. నొప్పిగా ఉందా ?"



 జవాబు: *అబ్బే లేదండీ.. anesthesia తీసుకుని వచ్చాను, కావలంటే మళ్ళీ తొక్కండి!!*






 3. అర్ధరాత్రి ఫోన్ చేసి:




 "పడుకున్నారా?"




 జవాబు: *లేదు ఆఫ్రికా కోతుల మీద రీసర్చ్ చేస్తున్నాను.. మీ చుట్టాల వివరాలు తెలిసాయి*






 4. బార్బర్ షాప్ నుండి వస్తుంటే:

 "ఏంటి హేర్ కటింగ్ చేయించుకున్నారా?"



 జవాబు: *శరత్కాలం కదా రాలిపోయింది*




 5. ఇంట్లో Land-line కి ఫోన్ చేసి:




"ఎక్కడున్నారు?"




జవాబు: *ఫోన్ మెళ్ళో వేసుకుని, మార్కెట్లో కూరగాయలు కొంటున్నా*






 6. కారు కడుగుతున్నప్పుడు ప్రక్కింటాయన:

"సార్ !! కారు కడుగుతున్నారా??"



జవాబు: *లేదండీ, నీరు పోస్తున్నాను. ఇది పెరిగి పెద్దదై బస్సంతవ్వాలని*




మీరు మాత్రమే నవ్వితే సరిపోతుందా?వెంటనే మిత్రులకు షేర్ చేయండి

--((*))--






అమృతం అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉందా. ఐతే Srinivas Vemuri గారు వ్రాసిన ఈ #అమృతం  కథ చదివితీరాలి
                                 *    *    *
ఒరేయ్ నాయనా, నీకు సమయం ఆసన్నమైంది, ఇంకో కొద్ది క్షణాల్లో తిరిగి రాని లోకాలకు ప్రయాణం కావాలి, సిద్ధంకా! అంటూ సమవర్తి భటులు, నా పక్కకొచ్చి ప్రేష అంటే పిలుపునిచ్చారు.



మరీ ఇంత హఠాత్తుగా గానా? విస్తుపోయి అన్నాను.




తప్పదురా! వెళ్ళాలి. సెకనులో వెయ్యోవంతు కూడా లేటు కాకూడదు. క్రమశిక్షణలో మాకు మేమే సాటి. మమ్మల్ని నిలువరించే శక్తి ఎవరికీ లేదు.‌ కాబట్టి వృధాగా మాట్లాడకుండా సిద్ధం కా  అన్నారు.




సమయం చాలా కొద్ది గా ఉంది. ఏం చేయను? అప్పటివరకూ నాలో ఉన్న తాపత్రయాలు, బెంగలు, బాధలు పటాపంచలై పోయాయి. 




నేనే శాశ్వతం కాదనుకున్నప్పుడు, ఏం బంధం నన్ను నిలువరించ లేదనుకున్నప్పుడు చివరి మజిలీలో ఏంచేస్తే బావుంటుందా అని ఆలోచించా. ఎంత ఆలోచించినా ఆలోచనలు ఒక కొలిక్కి రావటం లేదు.




ఆయన లేకపోతే నాజీవితం ఎట్లా వెడుతుందొదినా, పసుపు కుంకాలు లేని బ్రతుకెందుకు? అని భార్య రోదిస్తోంది. పసుపు కుంకాల రూపంలో నిత్యం ననుమోసే నా భార్య ఏడుపులో నా ఉనికి ఆవిడకెంత అవసరమో తెలుస్తోంది.




అప్పటివరకూ చాకిరీ చేసి అలసిన కొడుకు, డాక్టర్ ఆశ లేదనే విషయం చెప్పాక, నేను లేని జీవితం ఎలా గడపాలో ఆలోచిస్తున్నాడు. వాడికి నామీద ఉన్నప్రేమతో పాటు, రేపు అనేదానిమీద వాడికి కలుగుతున్న స్పృహ నాకు ఆనందాన్నిచ్చింది.




చివరి చూపుకొచ్చిన అల్లుడు, మిగతా కార్యక్రమం తొందరగా అయిపోతే తన దైనందిన జీవితంలో పడిపోవచ్చు, అసలే లీవు తక్కువ శాంక్షనయ్యిందని బాధపడుతున్నాడు. 




అతని బాధలో వాస్తవం నాకు అర్థం అవుతోంది. అందుకే బాధ కలగటం లేదు. 




ఇంకా బతుకుతాడనే  నమ్మకం ఉంటే నిరీక్షించడం సబబుగా తోస్తుంది, రేపో,మాపో పోతాడని  రూఢిగా తెలిస్తే రేపే కరెక్ట్ కదా. 




ఇది ఎలాంటిదంటే బాగా ఇష్టమైన వ్యక్తి వేరే చోటుకు వెడుతూంటే బాధ కలుగుతుంది. వెళ్ళటం తప్పదని తెలిసినపుడు బస్టాండు వరకు వెళ్ళి బస్సు ఎక్కిస్తాం. బస్సు ఎక్కి సీటులో కూర్చున్నాక బస్సు ఎప్పుడు కదులుతుందా అని  నిరీక్షిస్తాం. ఆ సమయంలో మాట్లాడేది, అక్కడే ఉండి కబుర్లు చెప్పుకునేది పెద్దగా ఉండదు. అందుకే బస్సు ముందు ఏవ్యాపకం లేకుండా అలా ఊరికే నిలబడే కన్నా బస్సు బయలుదేరితేనే మంచిదనిపించదూ‌!




అంటే దానర్థం వాళ్ళు వెళ్ళిపోవాలని కాదు, ఉండి ఏమీ చేయలేనప్పుడు, వెళ్ళటం మంచిదే కదా అని అనుకోవటం లాంటిది. ఇదీ అంతే అందుకే అల్లుడి ఆలోచనలో సబబుగా ఉందనిపించింది‌




ఈ గొడవలో పడి పిల్లల ఆలనా పాలనా మర్చిపోయానని తనను తాను నిందించుకుంటూ నా మనవలకు తిండి పెట్టే స్తోంది కోడలు. 




ఆలస్యం చేస్తే పెద్దాయన గుటుక్కుమంటాడు, అపుడు హడావిడి మొదలవుతుంది. ఆ గొడవలో పిల్లలకు ఇబ్బంది కలగకూడదని ఆ తల్లి మనసు ఆరాటపడుతోంది. నాకు తప్పనిపించలేదు. పోయేవాళ్ళతో ఉన్నవాళ్ళు పోలేరు కదా కోడలూ కరెక్టే అనిపించింది.




అమ్మా! తాతకు ఏమయ్యిందీ? తల్లిపెట్టే గోరుముద్దలు తింటూ ఆలోచనగా అడిగాడు‌, నాపేరు పెట్టిన నా మనవడు. 




తాతగారు ఇంకాసేపట్లో దేవుడి దగ్గరకు వెళతారు నాన్నా అంటోంది కోడలు. 




మళ్ళీ ఎప్పుడు వస్తారు? అడుగుతున్నాడు‌.




ఇంక రారు.




మరి సెలవల్లో మనం తాతయ్యా వాళ్ళూరు రామా!




లేదు, మామ్మనే మన ఊరు తీసుకుని వెళ్ళిపోతాం.




వద్దమ్మా, తాతను మనతోనే ఉండమను, ప్రతీ సంవత్సరం మనం ఇక్కడికే వద్దాం.




ఈ మాట విన్న నా కూతురు పొగిలి, పొగిలి ఏడుస్తూ, ఇంక ఆ అదృష్టం మనకు లేదంటూ... బాధ పడుతోంది.




బయట గొలుసు వేసి కట్టేసిన నేను పెంచిన కుక్క ఎవరు ఏది పెట్టినా  తినకుండా నా కోసం ఎదురు చూస్తోంది. నేను పెడితేనే తినటం దాని కలవాటు. గొలుసు తెంపుకుని నా దగ్గరకు రావాలని దాని ప్రయత్నం. ఏడుస్తూ గొలుసు విప్పమని గొడవచేసేస్తోంది.




ఒక మనిషి అస్థిత్వం చుట్టూ ఎన్ని అనుబంధాలు, అనుభూతులు ఉంటాయో కదా అనిపిస్తోంది.




నా ప్రాణం ఇంకా పోలేదు. మెల్లగా నన్ను కిందకు దించి, నేనెప్పుడూ సేదతీరే మా ఇంటి పెరటిలో ఉన్న వేపచెట్టుకింద పడుకో బెట్టారు. 




ధనిష్టా పంచకం వస్తోంది. బయటకు తెండని ఎవరో అంటే, నన్ను చాపవేసి పడుకోబెడుతున్నారు. ముచ్చటపడి కట్టుకున్న ఇంటినుంచి చివరిసారిగా బయటకొస్తున్నట్టు తెలుస్తోంది. ఇంక దీనికి నాకు ఋణం తీరిందని తెలుస్తోంది.




చెట్టుకింద పుట్టల్లో ఉన్న చీమలు నామీద పాకుతున్నాయి. ప్రాణం ఇంకా పోలేదు కదా, అవి కుట్టినప్పుడు దేహం విలవిల లాడుతోంది. ఎవరైనా గుక్కెడు నీళ్ళు పోస్తే బావుండు ననిపిస్తోంది. మాట పెగలటం లేదు‌ ఎవరి గొడవలో వాళ్ళున్నారు. 




అపరకర్మలు చేసే ఆయనకోసం ఒకరు బయలుదేరారు. ఆయన కాస్ట్లీ రా, వేరొకరిని వెతకండి ఎవరో అంటున్నారు. 




పోయాక ఏది జరిగినా తెలియదు, ఉన్నవాడికి రేపనేది ఉంటుంది కదా. వాడు బతకాలంటే డబ్బు కావాలి. ఆ సలహా మంచిదే అనిపించింది.




నా శరీరం సాగనంపడానికి చివరి సారిగా బేరసారాలు జరుగుతున్నాయి. 




ఎవరో తులసి తీర్థం పోయమంటున్నారు. నేను రోజూ సంధ్యావార్చి, ఏ తులసిలో నీరు పోసేవాడినో ఆ తులసిచెట్టు ఆకులే చివరిసారిగా నా దాహార్తి తీర్చేందుకు సన్నద్ధమవుతున్నాయి.




రెండు గుక్కలు మింగాక, నా మనవడు ఒక్కసారి నా దగ్గరికొచ్చి ఆవకాయ తిన్న చిట్టి చేతులతో నా నోట్లో తనూ నీళ్ళు పోస్తానని పట్టు బట్టాడు. 




వాడిని వద్దని సముదాయించడానికి అందరూ నానా తిప్పలు పడ్డాక, విధిలేక వాడితో తులసినీళ్ళు నా నోట్లో  పోయించారు. వాడి చేతినీటితో ఆవకాయ రుచి నా నాలికకు తగిలి ప్రాణం లేచి వచ్చింది. 




పోతుందనుకున్న ప్రాణం నాలో చేరేసరికి శరీరంలో చిన్న కదలిక మొదలయ్యింది. 




నాకొడుకు వెంటనే స్పృహలోకి వచ్చి, నాన్న కదులుతున్నాడు అని ఆనందంతో అరిచాడు.




ఒక్కసారి అందరిలో ఆశ్చర్యం. పరుగున వచ్చి నాభార్య నా మనవడిని ముద్దు పెట్టుకుని, డాక్టర్ కి కబురు చేయమంది. 




డాక్టర్ వచ్చాడు.  చివరిసారిగా ప్రయత్నించాడు. 




అప్పటివరకూ గొలుసుతెంపుకునేందుకు తాపత్రయపడ్డ నా కుక్కకి ఎవరో గొలుసు విప్పారు. అది పరుగున వచ్చి నా వంటిపై పాకుతున్న చీమలని కోపంగా చూసి,  నాలుకతో  నాకి నాకు ఉపశమనం కలిగించేందుకు సహకరిస్తోంది. 




నాన్నని లోపలికి తీసుకొని వెడదామంటోంది నా కూతురు.




డాక్టర్ మందులిచ్చాడు. కాసేపటికి కళ్ళు తెరిచాను. సిలైన్ ఎక్కించాడు. కొద్దిగంటల్లో తిరిగి స్పృహలోకొచ్చా.




మృత్యుంజయుడురా మీ నాన్న అంటున్నారు. నా కొడుకు ఆనందానికి హద్దులు లేవు. కొద్దిరోజుల్లో మళ్ళీ మామూలు మనిషినయ్యా. మళ్ళీ బ్రతుకుతానన్న నమ్మకం కలిగాక అల్లుడితో సహా అందరూ మరికొన్ని రోజులు నాతో ఉన్నారు.




నాకోసం వచ్చిన యమభటులు ఎవో లెక్కలు సరిచూసుకుని, వీడు అమృతం తాగాడు, శాస్త్ర రీత్యా అది తాగిన వాడికి మృత్యువు రాకూడదు. అది శాస్త్ర విరుద్ధం అంటూ వెనుతిరిగారు.




చూస్తూండగానే తిరిగి వసంతం వచ్చింది. నా ఇల్లు పిల్లాపాపలతో కలకలలాడుతోంది‌. 




నాకు పునర్జన్మనిచ్చిన అమృతాన్ని తిరిగి తయారుచేయటం మొదలు పెట్టాను. మామిడికాయలు ముక్కలు కొట్టి, వాటికి ఆవపిండి, గుంటూరు మిర్చికి, బరంపురం మిర్చి కలిపి ఆడిన కారం, రాతి ఉప్పు, గానుగనూనె కలిపి ఒకజాడీలో ఆ అమృతాన్ని భద్రపరుస్తున్నా. 




నిజం చెప్పొద్దూ బ్రతికి ఏం సాధిస్తాం అంటాం కానీ, బ్రతికినప్పుడే కదా ఆనందాన్ని ఆస్వాదించగలిగేది. వేతకాలేకానీ ఆనందం ప్రతీ దాంట్లో ఉంటుంది.




పెంపుడు జంతువుల సాంగత్యంలో, 

పెంచే మొక్కల సాన్నిహిత్యం లో, 
సంతానంతో కలిసి గడపటంలో, 
రుచికరమైన వంటలో, 
సుందరమైన ప్రకృతిలో, 
ఆవకాయ అన్నంలో, 
దోరగా కాలిన దొసెలో, 
కరకరలాడే గారెలో.......



మక్కువగా ఆస్వాదిస్తే, అన్నింటిలోనూ ఆనందమే!

ఆనందంమైన అనుభవం, ఎన్నటికీ మృతంలేనిదే!



జీవితం అంచులకు చేరిన వాళ్ళకే  తెలుస్తుంది, జీవితం విలువ. ఎందుకంటే జీవించడం అంటె తెలిసేది అప్పుడే.




అరవైలుదాటిన జీవితం, బోనస్ లాంటిది. 




ఏభైల్లో ఉన్నజీవితం, అనుభవించడానికి ఇంకా సమయం ఉందని చెప్పేది. 




నలభైల్లో జీవితం, ఆనందం గురించి అవగాహన కలిగించేది. 




ముప్ఫైల్లో జీవితం, దొరికిన దానిలో ఆనందం వెతుక్కునేది, 




ఇరవైల్లో జీవితం, మన జీవిన విధానమే ఆనందం, అనే భ్రమకలిగించేది, 




ఇరవై లోపు జీవితం ఏది జరిగినా, అదే ఆనందం అని మురిసిపోయేది. 




ఆనందం కోసమే జీవితం, దాన్ని మిస్సవ్వకండి. ఆనందంగా గడిపిన ప్రతీక్షణం అమృతమే అన్న సత్యాన్ని గుర్తించండి.




శుభం...








ఓ మంచి కధ చదవండి..
**********************
ఓ యువకుడు ఓ మంచి ఉద్యోగం కోసం ఓ పెద్ద కంపెనీకి ఇంటర్వూకు వెళ్ళాడు.
చక్కగా అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు............

చివరి పరీక్షకు డైరెక్టరు దగ్గరికి వెళ్ళాడు.
*డైరెక్టరు* : నీవు చదువుకునే రోజుల్లో ఏదైనా స్కాలర్షిప్ వచ్చిందా?
*యువకుడు*: లేదండీ! మా అమ్మ-నాన్నగార్లె అన్ని ఫీజులు కట్టెవారు.......
*డైరెక్టరు*: మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు?
*యువకుడు*: ఖాళీ-సిసలు పాత-ఇనుము వెస్ట్-పేపర్ ప్లాసిటిక్-స్క్రాప్ చిన్న-చిన్న-వ్యాపారములు చేసి అదే పనిని వృ త్తిగా మార్చుకొని నన్ను చదివించారు.......
*డైరెక్టరు*: అయితే నీ చేతులను ఒకసారి నాకు చూపించు.
*యువకుడు*: తన చేతులను చూపించాడు........

అవి చాలా సున్నితంగా నాజూకుగా సుతి-మెత్త్తగా ఉన్నాయి.

*డైరెక్టరు*: నువ్వు ఎప్పుడైన నీ తల్లిదండ్రులకు వారు చేసే పనిలో సహాయపడ్డావా?
*యువకుడు*: లేదండీ! వారు నన్ను కష్టపడనివ్వకుండా మంచిగా చదువుకునిమంచి ఉద్యోగం సంపాదించమని చెప్పేవారు.....నేను అలాగే చేశాను.
*డైరెక్టరు*: నిజంగా నువ్వు ఈ ఉద్యోగానికి అన్ని అర్హతలు ఉన్నావాడివి.
*డైరెక్టరు*: నాదొక చిన్నవిన్నపం.చేస్తాను అంటేనే చెపుతాను.
*యువకుడు*: తప్పకుండా చేస్తాను చెప్పండి సర్.
*డైరెక్టరు*: ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళిన తరువాత మీ తల్లిదండ్రులకు మూడు-రోజులు విరామము ఇచ్చి.....

వారు చేసే పనిని నీవు సర్రిగ్గా మూడు-రోజులు చేసి.....రా! తప్పకుండా నువ్వు ఈ ఉద్యోగంలో చేరవచ్చు....

*యువకుడు*: అలాగే సర్. అని.. తల్లిదండ్రులకు సహాయపడటానికి వెళ్లి వారిని చూడగానే విపరీతంగా ఏడ్చాడు.....

ఆ-చేతులు కాయలుగట్టి.........

కాళ్లకు-చేతులకు సీసవక్కలు-ఇనుపసమాను ముక్కలు కుచ్చి 

రక్తం కారుతూ....... గరుకుగా.......చాలా ఘోరంగా కనపడ్డాయి......

ఆ చేతులలో తన మొహాన్ని పెట్టి వెక్కి వెక్కి ఏడ్చాడు.....వారి కష్టాన్ని తలచుకుని వారు చేసే పనిని తానే అ-మూడు-రోజులు

తల్లిదండ్రుల మీద-ఉన్న ప్రేమతో.... ఇష్టముతో.... కష్టపడి తన-డైరెక్టరు పెట్టిన పరీక్షను పూర్తి చేసాడు.

మరుసటిరోజు ఆఫీసుకు కాళ్లకు-చేతులకు సీసవక్కలు-ఇనుపసమాను ముక్కలు కుచ్చిన వాటికీ డాక్టర్-వద్ద ప్రథమ-చికిత్స చేయిన్చుకొని కళ్ళల్లో నీళ్ళతో వెళ్ళి ....

ఆ డైరెక్టరు పాదాలకు నమస్కరించాడు...."

మీరు నా కళ్ళు తెరిపించారు సర్!
నా తల్లిదండ్రుల కష్టాన్ని నాకు కళ్ళకు కట్టినట్లు చూపించారు.
మీరు నాకు ఈ ఉద్యోగాన్ని ఇస్తే వారిని కంటికి రెప్పలా ఏ లోటూ లేకుండా కాపాడుకుంటాను"
దానికి డైరెక్టరు ఇలా సమాధానం ఇచ్చారు......"
ఇంట్లో తల్లిదండ్రుల కష్టం తెలిసిన వారికే ఆఫీసులోని పై అధికారుల కష్టాలు అర్థంఅవుతాయి.......

కాబట్టి ఇతరుల పరిస్థితిని అర్థం చేసుకునే శక్తి ఉన్నవారికే మా-ఆఫిసులో ఉద్యోగాలు ఇవ్వాలని నీకు అన్ని అర్హతలు ఉన్నా కూడా ఇలాంటిచిన్న పరీక్ష పెట్టడం జరిగింది...

నీవే ఈ ఉద్యోగానికి 100% అర్హుడవు.
*కాబట్టి డబ్బులు పెట్టి మనల్ని చదివిస్తున్నారుకదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండాఅసలు ఆ ఫీజుకు కట్టడానికి తల్లిదండ్రులు పడే కష్టాన్ని ఒక్కసారి తలచుకుని చక్కగాచదువుకుని ప్రయోజకులు కండి,,,*,,
ఆల్ ది బెస్ట్.............

*ఈ-కథ అందరి అమ్మ-నాన్నలకు అంకితం*...

నచ్చితే పాటించండి 

మీ ఆత్మీయులకు పంపింఛండి 




ప్రాంజలి ప్రభ
కవితానందం

నువ్వు నాకు నచ్చావు

నన్ను నేను మర్చాను

నువ్వె నన్ను దోచావు
నేను నిన్ను మర్చాను

కాల మాట నేర్చావు
తన్ను తాను మర్చేను
వెన్ను పోటు నేర్చావు
ఆశ నిన్ను మార్చెను
వల్లు అప్ప గించావు
మత్తు త్రాగి మర్చేను
తప్పు చేసి నవ్వావు
వద్దు వద్దు అన్నాను
చెడ్డ చేసి ఉన్నావు
తప్పు తెల్ప మన్నాను
కల్సి మాట ఇచ్చావు
మంచి చేయ మన్నాను

No comments:

Post a Comment