ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
ఆనందం - ఆరోగ్యం ఆధ్యాత్మికం
ఒక అద్భుతమైన కథ
రాత్రి చీకటి పడుతోంది. తాళం వేసిఉన్న ఇనుప ద్వారం బయట నుండి ఒక పిలుపు. ఎవరా అని వచ్చి చూశాను. గుమ్మం ముందు ఒక పెద్దాయన ఉన్నారు. చాలా దూరం వచ్చినట్లుగా నలిగిపోయిన బట్టలు చేతిలో చిన్న సంచి తో నిలబడి ఉన్నారు. అయన తన చేతిలోని చిన్న కాగితం లోకి చూస్తూ "ఆనంద్, నెంబర్ 8, యోగానంద వీధి ఇదే కదూ!" అని అడిగారు. "అవును నేనే ఆనంద్. ఇదే చిరునామా. మీరూ ..." అని నసిగాను. అయన చిన్నగా వణుకుతూ తడారి పోయిన తన పెదవులను నాలుక తో తడుపుకుంటూ "బాబూ! నేను మీ నాన్నగారి మిత్రుడిని. మీ ఊరినుండే వస్తున్నాను. నాన్నగారు మీకు ఈ ఉత్తరం ఇచ్చి మీ సాయం తీసుకోమన్నారు" ఉత్తరాన్ని చేతిలో పెట్టారు.
అయన ఆ ఉత్తరం ఇవ్వగానే "నాన్నగారా?" అంటూ ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆత్రంగా చదివాను. అందులో "ప్రియమైన ఆనంద్! నీకు నా ఆశీర్వాదములు. ఈ ఉత్తరం తీసుకుని వచ్చిన వ్యక్తి నా స్నేహితుడు. పేరు రామయ్య. చాలా కష్టజీవి. కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక ఆక్సిడెంట్ లో చనిపోయాడు. నష్టపరిహారం కోసం తిరుగుతున్నాడు. అది వస్తే అయనకు, ఆయన భార్యకు రోజు గడవడానికి కాస్త తోడవుతుంది. ఆక్సిడెంట్ జరిగిన తరువాత పోలీస్ వారి విచారణలు, ట్రావెల్స్ వారు ఇస్తామని అన్న నష్టపరిహారపు పేపర్లు అన్ని సేకరించి నీకు పంపాను. డబ్బులు Head Office లో తీసుకోమన్నారు. ఆయనకు హైదరాబాద్ కొత్త. ఏమి తెలియదు. నువ్వు ఆయనకు సహాయం చేస్తావని నమ్ముతున్నాను. ఆరోగ్యం జాగ్రత్త. కుదిరినప్పుడు ఒక్కసారి ఊరికి రావాల్సిందిగా కోరుతూ
మీ నాన్న" అని ఉంది.
నన్నే చూస్తూ నిలబడి ఉన్నారు రామయ్యగారు. ఒక్క నిమిషం అలోచించి ఆయనను లోనికి ఆహ్వానించాను. మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చి "ఏమైనా తిన్నారా" అని అడిగాను. "లేదు బాబూ. ప్రయాణం ఆలస్యం కావడంతో నాతో పాటు తెచ్చుకున్న రెండు పళ్ళు మాత్రం తిన్నాన"ని చెప్పారు.
నాలుగు దోశలు వేసుకొచ్చి అందులో కొద్దిగా ఊరగాయ వేసి ఆయన చేతిలో పెట్టాను. "మీరు తింటూ ఉండండి" అని చెప్పి, ఆ గది బయటకు వచ్చి కొన్ని ఫోన్ లు చేసుకొని తిరిగి ఆయన దగ్గరకు వచ్చాను. నేను వచ్చి చూసే సరికి ఆయన దోశలు ఆరగించి, చేతిలో ఏవో పేపర్లు పట్టుకుని కూర్చున్నారు. నన్ను చూసి ఆ పేపర్ లు నా చేతిలో పెట్టారు. అందులో ఆక్సిడెంట్ లో చనిపోయిన వారి అబ్బాయి ఫోటో కూడా ఉంది. కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు. సుమారు 22 సంవత్సరాల వయసు ఉంటుంది. నా కళ్ళలో నీళ్లు తిరిగాయి.
"ఇతడు నా ఒక్కగానొక్క కొడుకు. అంతకు ముందు పుట్టినవారు చిన్నతనం లోనే అనేక కారణాల వలన చనిపోయారు. ఇతడు మాత్రమే మాకు మిగిలాడు. పేరు మహేష్. కష్టపడి చదివించాను. బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకున్నాడు. మమ్మల్ని చూసుకుంటానని, కష్టాలన్నీ తీరపోతాయని చెప్పి ఉద్యోగంలో చేరాడు. ఆ రోజు రోడ్ దాటుతుండగా ఆక్సిడెంట్ జరిగింది. అక్కడికక్కడే చనిపోయాడు. నష్టపరిహారం తీసుకోవడం ఇష్టం లేక బిడ్డ పైన వచ్చిన పైకం వద్దనుకున్నాము. కానీ రోజు రోజుకీ నాలో శక్తి తగ్గిపోతోంది. నా భార్య ఆరోగ్యం బాగా లేదు. మీ నాన్నగారి బలవంతం మీద ఇప్పుడు వచ్చాను. నా కొడుకు సహాయం చేస్తారని చెప్పి ఈ ఉత్తరం ఇచ్చి పంపారు మీ నాన్నగారు" అని ముగించారాయన.
"సరే పొద్దు పోయింది, పడుకోండి" అని చెప్పి నేను కూడా నిదురపోయాడు
పొద్దున లేచి స్నానాదికాలు ముగించుకుని, కాఫీ తాగి ఇద్దరం బయల్దేరాము. దారిలో టిఫిన్ ముగించుకుని ఆయన తీసుకొచ్చిన పేపర్ల లోని అడ్రెస్ ప్రకారాం ఆ ఆఫీస్ కు చేరుకున్నాము. "ఆనంద్! ఇక నేను చూసుకుంటాను. నువ్వు ఆఫీస్ వెళ్ళు బాబు" అన్నారాయన. "పర్లేదండి. నేను లీవ్ పెట్టాను" అన్నాను. దగ్గరుండి ఆ నష్టపరిహారం ఇప్పించాను. చాలా థాంక్స్ బాబూ! నేను ఊరికి బయల్దేరుతాను. మా ఆవిడ ఒక్కతే ఉంటుంది ఇంట్లో" అని చెప్పి తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యారు రామయ్య గారు. "రండి, నేను మిమ్మల్ని బస్సు ఎక్కించి వెళ్తా" అని చెప్పి, టిక్కెట్ తీసి ఇచ్చి, ఇప్పుడే వస్తానని వెళ్లి దారిలో తినడానికి పళ్ళు అవి తెచ్చి రామయ్య చేతిలో పెట్టాను.
ఆయన సంతోషంగా "ఆనంద్ బాబూ! నాకోసం సెలవు పెట్టుకొని, చాలా సాయం చేశావు. ఊరు వెళ్ళగానే మీ నాన్నకు అన్ని విషయాలు చెప్పాలి. కృతజ్ఞతలు తెలియచేయాలి అన్నాడు.
అప్పుడు నేను నవ్వుతూ రామయ్య గారి చేతులు పట్టుకుని "నేను మీ స్నేహితుడి కొడుకు ఆనంద్ ని కాదండీ. నా పేరు కూడా అరవింద్. మీరు చిరునామా మారి నా దగ్గరకు వచ్చారు. ఆ ఆనంద్ ఇంటికి వెళ్లాలంటే అంత రాత్రిపూట మరో 2 km ప్రయాణం చేయాలి. మీరేమో అలసిపోయి ఉన్నారు. అందుకే నేను నిజం చెప్పలేదు. మీరు తెచ్చిన లెటర్ లో ఫోన్ నెంబర్ ఉండడంతో వారికి ఫోన్ చేశాను. ఆ ఆనంద్ ఏదో పని మీద వేరే ఊరు వెళ్లారట. ఆయన భార్య చెప్పారు. మీ మిత్రుడికి విషయం చెప్పాను. అయన చాల బాధ పడ్డారు. నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పడంతో కాస్త కుదుట పడ్డారు. మీకు జరిగిన నష్టం నేను తీర్చలేనిది. కానీ ఏదో నాకు చేతనైన సహాయం చెయ్యాలనిపించింది. నాకు ఆ తృప్తి చాలండి" అన్నాను. బస్సు కదలడం తో ఒక్కసారి రామయ్యగారు తన కన్నీటితో నా చేతులను తడిపేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. "నువ్వు బాగుండాలి బాబు" అని ఆశీర్వదించారు. ఆ మాటే చాలనుకున్నాను నేను. పదిహేను సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు ఈ రామయ్య గారిని చూస్తూ ఉంటే ఆయన ముఖం లో మా నాన్నగారు కనిపించారు.
ఆకాశంలోకి చూశాను. అక్కడే ఎక్కడో ఉండి ఉంటారు మానాన్న. "నాన్నా! నా అభివృద్ధి చూడడానికి ఈ రూపంలో వచ్చావా నువ్వు! ఒక ఉత్తరం తీసుకువచ్చి నాకు చూపి నేను సాయం చేస్తానో లేదో అని పరీక్షించావా? మీ వంటి ఉత్తమమైన తండ్రికి కొడుకుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను నాన్నా! మీకు సంతోషమేనా నాన్నా!" అంటూ ఆనంద బాష్పాలు రాల్చాను.
"సాయం చెయ్యడానికి మనసు ఉంటే చాలు. మిగిలినవన్నీ
దానికి తోడుగా నిలబడతాయి"
ఈ కథ చదవగానే నాకు కళ్లల్లో నీళ్లు వచ్చాయి
నాకు మానాన గుర్తొచ్చాడు
ఇట్లు మీ ప్రియమైన స్నేహితుడు
--((**))--
నిథి చాల సుఖమా ?(సేకరణ)
ప్రాంజలి ప్రభ
రేపటి నుండి రికార్డ్ స్థాయిలో ఎండలు --వడగాడ్పులుంటాయని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు -సాధ్యమైనంత వరకూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకూ అవసరమైతే సొంత పనులకోసం తప్ప బయటికి వెళ్లకండి --మరో ముఖ్య సూచన --బైక్ పై వెళ్లేటప్పుడు --ఎండలో వున్నప్పుడు సెల్ మాట్లాడకండి--ఎందుకంటే ఫోన్లు పేలిపోయే ప్రమాదం వుంది --అదే విధంగా బైక్ లు కార్లు ఎక్కువ సేపు ఎండలో వున్నా ప్రమాదం జరగవచ్చు --ఎక్కువగా మంచినీరు తాగండి ---ఇవన్నీ మీకు తెలియనవి కాదు --కాకపోతే ప్రకృతి ధర్మం తప్పదు --రేపటి నుండి 8 వరకూ కాస్త జాగ్రత్తగా వుందాం...
మే నెల 7 వ తేదీ
మంగళ వారము అక్షయతృతీయ రోజున
బంగారం తప్పక కొనాలా?
అక్షయతృతీయ అంటే ఏమిటి?వివరణ?
ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి చందనోత్సవం.
అదే రోజున పరశురామ జయంతి మరిన్ని అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు.
అక్షయ తృతీయ ప్రాముఖ్యత
1. పరశురాముని జన్మదినం
2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం
3. త్రేతాయుగం మొదలైన దినం
4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం
5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో,
వ్రాయడం మొదలుపెట్టిన దినం
6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర”
ఇచ్చిన దినం
7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా
నియమింపబడిన దినం
8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం
9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం
10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.
అక్షయ తృతీయ రోజున బంగారం తప్పక కొనాలా?
అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది.ఈ రోజున కొన్నది
అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని
కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది.
అసలు అటువంటివి కొనాలని అనుకుని డబ్బు లేకున్నా అప్పు చేసో, తప్పు చేసో కొంటే, కొన్న బంగారం అక్షయం అవడం అటుంచి చేసిన అప్పులు, తప్పులు
తత్సంబంధ పాపాలు అక్షయం అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి.
అసలు ఈరోజున బంగారం కొనాలి అని శాస్త్రంలో ఎక్కడా చెప్పబడిలేదు.
ఇది కేవలం వ్యాపార జిమ్మిక్ మాత్రమే
అక్షయ తృతీయ నాడు, మనం చేపట్టిన ఏ కార్య ఫలమైనా, [ అది పుణ్యం కావచ్చు;లేదా పాపం కావచ్చు.] అక్షయంగా, నిరంతరం, జన్మలతో సంబంధం
లేకుండా, మన వెంట వస్తూనే ఉంటుంది.
పుణ్య కర్మలన్నీ విహితమైనవే. అందునా, ఆ రోజు ఓ కొత్త కుండలో గానీ,
కూజాలో గానీ, మంచి నీరు పోసి, దాహార్తులకు శ్రధ్ధతో సమర్పిస్తే, ఎన్ని జన్మలలోనూ, మన జీవుడికి దాహంతో గొంతు ఎండి పోయే పరిస్థితి రాదు.
అతిధులకు, అభ్యాగతులకు, పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే,
ఏ రోజూ ఆకలితో మనం అలమటించవలసిన రోజు రాదు.
వస్త్రదానం వల్ల తదనుగుణ ఫలితం లభిస్తుంది.
అర్హులకు స్వయంపాకం, దక్షిణ, తాంబూలాదులు సమర్పించుకుంటే,
మన ఉత్తర జన్మలలో, వాటికి లోటు రాదు.
గొడుగులు, చెప్పులు, విసన కర్రల లాటివి దానం చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఆ రోజు నిషిధ్ధ కర్మల జోలికి వెళ్ళక పోవడం ఎంతో శ్రేయస్కరం.
ఓ సారి పరిశీలిస్తే,"భాగవతం" ప్రధమ స్కంధం ప్రకారం, పరీక్షిన్మహా రాజు
కలి పురుషుడికి ఐదు నివాస స్థానాలను కేటాయించాడు.
అవి:
1 .జూదం, 2 . మద్య పానం, 3 . స్త్రీలు, 4 . ప్రాణి వధ, 5 . బంగారం.
వీటితో పాటు కలి కి లభించినవి
ఇంకో ఐదు*
అసత్యం, గర్వం, కామం, హింస, వైరం.
జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆ పైన ఉన్న ఐదిటికీ ఇవి అనుషంగికాలు.
ఆ పై ఐదిటినీ ఇవి నీడలా వెన్నంటే ఉంటాయి.
అక్షయ తృతీయ రోజు ఎవరైనా, ఈ ఐదిటిలో దేని జోలికి వెళ్ళినా,
కలి పురుషుడి దుష్ప్రభావం అక్షయంగా వెంటాడుతూనే ఉంటుంది.
--((**))--
స్థిత ప్రజ్ఞుని లక్షణములు
🕉ఓంశ్రీమాత్రేనమః🕉
అద్వైత చైతన్య జాగృతి
(గీత 2వ అధ్యాయమున 55వ శ్లోకము నుండి)
1) కోర్కెలను విడచినవాడు (ప్రజహాతి కామాన్).
2) ఆత్మయందు సంతుష్టి బొందువాడు (ఆత్మన్యేవాత్మనా తుష్టః).
3) దుఃఖములందు క్షోభ నొందకుండవాడు (దుఃఖేష్వను ద్విగ్న మనాః).
4) సుఖములయం దాసక్తి లేకుండువాడు (సుఖేషు విగత స్పృహః).
5) రాగ, భయ, క్రోధములు లేనివాడు (వీత రాగ భయ క్రోధః).
6) సమస్త విషయములయందును అభిమానము లేనివాడు (యస్సర్వ త్రాభిస్నేహః).
7) ప్రియా ప్రియములు సంభవించినను. సంతోషముగాని ద్వేషముగాని లేనివాడు (తత్తత్ప్రాప్యశుభాశుభమ్ నాభినందతి నద్వేష్టి).
విషయము నింద్రియముల నుండి మరల్పువాడు (యదా సంహరతే చా యం కూర్మోంగాని వ సర్వశః ఇంద్రియా ణీంద్రియార్ధేభ్య స్తస్యప్రజ్ఞా ప్రతిష్ఠితా ||
గీతా 2-58) భక్తుని లక్షణమలు:-
(గీత 12వ అధ్యయమున 13వ శ్లోకమునుండి)
1) ఏ ప్రాణిని ద్వేషింపకుండుట.
2) మైత్రి.
3) కరుణ.
4) మమత్వము లేకుండుట.
5) అహంకారము లేకుండుట.
6) సుఖదుఃఖము లందు సమత్వము.
7) ఓర్పు నిత్య సంతుష్టి.
9) మనో నిగ్రహము.
10) దృఢ నిశ్యయము.
11) మనోబుద్ధులను భగ వంతునకు సమర్పించుట.
12) లోకమువలన తాను గాని తన వలన లోకముగాని భయపడకుండుట.
13) హర్షము క్రోధము భయము లేకుండుట.
14) దేనియందును అపేక్షలేకుండుట.
15) శుచిత్వము కలిగియుండుట.
16) కార్య సామర్థ్యము.
17) తటస్థత్వము.
18) మనోవ్యాకులత లేకుండుట.
19) సర్వ కర్మఫల త్యాగము.
20)హర్షము లేకుండుట.
21) ద్వేషము లేకుండుట.
22) శోకము లేకుండుట.
23)కోరిక లేకుండట.
24) శుభాశుభ పరిత్యాగము.
25) శత్రుమిత్రులందు సమత్వము.
26) మానావ మానములయందు సమభావము.
27) శీతోష్టములందు సమత్వము.
28) సుఖదుఃఖము లయందు సమ భావము.
29) సంగవర్జిత్వము.
30) నిందాస్తుతు లందు సమత్వము.
31)మౌనము.
32) దొరకిన దానితో సంతుష్టి.
33) నివాసము నందభిమానము లేకుండుట.
34) స్థిరబుద్ధి.
35) భగవంతుని యందు భక్తి.
స్థితప్రజ్ఞునికి చెప్పిన లక్షణములను పరిశీలించిన భక్తుని లక్షణములు నవియేయని గమనించవచ్చును.
--((**))--
వారానికి ఏడు రోజులు ఎందుకు !?
రోజుకు 24 hours కదా hour అనే పదం ఎక్కడిది ??
ఆదివారం తర్వాత సోమవారం ఎందుకు ? మంగళ వారం రావొచ్చుగా ??
ఈ ప్రశ్నలకి జవాబు చెప్పే మందు > మనలో కూడా చాలా మందికి తెలియని విషయాలు తెలుసుకుందాం..
ప్రపంచంలో ఏదేశానికి లేని జ్ఞాన సంపద మన సొత్తు..
ఎన్నో వేల లక్షల సంవత్సరాల నుండి... మిగతా దేశాలు వారు గ్రహాలు అంటే ఏంటో తెలియక ముందే నవ గ్రహలను గుర్తించిన ఘనత మనదే..
ఏ రోజు ఎప్పుడు సూర్యోదయం అవుతుంది ?ఎప్పుడు సూర్యాస్తమయం అవుతుంది ?
ఎప్పుడు చంద్రగ్రహణం ? ఎప్పుడు సూర్యగ్రహణం ?
ఏ కార్తెలో ఏ పంట పండించాలి ఇవన్నీ కూడా మన భారతీయులు చేతి వేళ్ళు లెక్కలతో వేసి చెప్పినవే.. ఎటువంటి పరికరాలు టెలిస్కోపులు లేకుండా సాధించినవే..
పైన ప్రశ్నకి జవాబు..
మన వాడుకలో ప్రతి రోజుకి ఒక పేరు ఉంది. ఆది వారము, సోమ వారము, మంగళ వారము, బుధ వారము, గురు వారము, శుక్ర వారము, శని వారము. ఇవి ఏడు. ఇలా ఈ ఏడు రోజులకు ఏడు పేర్లు ఎందుకు పెట్టారు ?
ఆ పేర్ల నిర్ణయానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి వుంది. నిర్ధిష్టమైన పద్ధతిలో పూర్వ కాలంలో భారత మహర్షులు ఆ పేర్లను నిర్ణయించారు. ఆ పేర్ల నిర్ణయానికి శాస్త్రీయమైన కారణాలున్నందునే ఆ పేర్లే ప్రపంచ వ్యాప్తంగా ఆచరణలో నేటికి ఉన్నాయి.
భారత కాలమానంలో హోరా అనగా ఒక గంట అని అర్థం. దీని నుండి పుట్టినదే ఇంగ్లీషు HOUR. ఒక రోజుకు 24 గంటలుంటాయి, అంటే 24 హోరాలు. ఒక రోజులో ఉన్న 24 గంటలు (24 హోరాలు) కూడా ఏడు హోరాల చక్రంలో తిరుగుతాయి.. ఆ 7 హోరాలకి ఏడు పేర్లున్నాయి. అవి వరుసగా... (ఈ వరుసలోనే) శని, గురుడు, కుజుడు, రవి, శుక్ర, బుధ, చంద్ర హోరాలు ప్రతి రోజూ వుంటాయి.
ఈ 7 హోరాలే ప్రతి రోజు 24 గంటల్లో ఉంటాయి.. 7 గంటల కొకసారి ఈ 7 హోరాలు పూర్తీ అయ్యాక మళ్ళీ మొదటి హోరాకి వస్తుంది.. అంటే శని హోరా నుండి చంద్ర హోరాకి మళ్ళీ శని హోరాకి..
ఉదాహరణకు ఆదివారము రవి హోరాతో ప్రారంభం అయి మూడు సార్లు పూర్తికాగా (3 సార్లు 7 హోరాలు 3x7 = 21 హోరాలు) 22వ హోరాపేరు మళ్ళీ రవి హోరా వస్తుంది. 23వ హోరా పేరు ఆ వరుసలో శుక్ర హోరా అవుతుంది. 24 వ హోరా బుధ హోర అవుతుంది. దాంతో ఒక రోజు పూర్తవుతుంది.
ఆతర్వాత హోరా 25వ హోరా. అనగా తరువాతి రోజు మొదటి హోరా దాని పేరు చంద్ర హోరా. అనగా సోమవారము. అనగా చంద్ర హోరాతో ప్రారంభ మౌతుంది. ఏరోజు ఏ హోరాతో ప్రారంభమవుతుందో ఆ రోజుకు ఆ హోరా పేరున దానికి ఆ పేరు వుంటుంది.
చంద్ర హోరాతో ప్రారంభమైనది గాన అది సోమ వారము. ఈ విధంగానే మిగిలిన దినములు కూడా ఆయా హోరాల పేరన పేర్లు ఏర్పడతాయి.
రవి (సూర్యుడు) హోరాతో ప్రారంభం = రవివారం, ఆదిత్య అన్నా కూడా సూర్యుడు పేరే.. సో ఆదివారం, భానుడు అన్న కూడా సూర్యుడే భానువారం (కర్ణాటక, తమిళనాడులో భానువారం వాడుతారు) ఇలా ఆయా హోరాలు బట్టి రోజుల పేర్లు వచ్చాయి...
ఆదివారం తరవాత సోమవారం ఎందుకు రావాలి ? మంగళ వారం రాకూడదా ??
రాదు.... ఏందుకంటే ఆదివారం రవి హోరా ప్రారంభం అయ్యింది, తరువాత రోజు అంటే సోమవారం చంద్ర హోరాతో ప్రారంభం అయ్యింది కాబట్టి..
ఇది మన భారతీయుల గొప్పతనం.. ఈ విషయాలు తెలియక మనల్ని మనం చిన్న చూపు చూసుకుంటాం..
ప్రపంచంలో దేశమయినా మన పద్ధతి ఫాలో అవ్వాల్సిందే.. కానీ మనకి మాత్రం మనం అన్నా మన దేశమన్నా లోకువ...
ఇంత నిర్థిష్టమైన పద్ధతిలో వారమునకు పేర్లు పెట్టారు గనుకనే భారతదేశ సంప్రదాయాన్ని ప్రపంచమంతా అనుసరిస్తున్నది..
జయహో భారత్

ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ - శృంగార సాహిత్యం
తరుణామృతం
సర్వేజనా సుఖినోభవంతు
మ. మ . త (పెద్దలకు మాత్రమే )-1
మనసు మనసు తరుణామృతం - సాహిత్య వచన శృంగార కావ్యం
(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ)
------
పచ్చటి తోటయందు పసిడి రంగుతోడ, ఓరచూపు ఇంపుతోడ, అడుగులు దడా దాడా అనుచుండ, జారేడు కుచకుంభాలు కదులుచుండ, కాల్నడక పోవు చుండ, వదనాంచలమందున చిన్కుల చెమట, మడుగులా మారుచుండగా, వయ్యారంగా మల్లిక కన్పించే.
పసిదానిమ్మ పండు చాయ, కొసరు ఆ కుసుమ గంధి కోమలపు తోడలు (లేలేత తామర స్వేత తూడులా లేక పాల లాంటి అరటి ఊచలా )
జారు చెమ్మ, నేలరారు ముత్యాల వరుస, సహజ సౌందర్యముతో వెలసిల్లు చుండా, పదహారో వసంతంలో అడుగుపెట్టి, వయసు వన్నెలతో, మాయని మెరుపు కాన వస్తున్నది, బాల్యము వెడలి, నవ యవ్వనపు మొలకులతో లేత సిగ్గుల దొంతరలతో, మధుర మంద హాసంగా ఉండి, నడుస్తుంటే, పురజనులు " ఆ ఆ " అని నోరు తెరచి, సొంగ కార్చు చుండే, ముందుకు నడుస్తున్నప్పుడు, ముందు వెనుక ఎవరున్నారు అనే జ్యాస అనేది లేదు, మరియు అమె కళ్ళకు ఎమీ కనిపించలేదు, కాని ఏదో తెలియని వయసు పొంగే మెరుపు ఆవహించినదని మాత్రం అర్ధం అవుతున్నది, ఆమె ఏ శృంగార దేవత, కారణము ఏమగునో అని పలువురు ముచ్చట్లు చెప్పుకొనసాగిరి, సౌందర్యదేవత నడచి వెళ్ళినట్లు తన్మయులై ఉన్నారు ఆసమయాన? ఇంకాఉంది
స్థిత ప్రజ్ఞుని లక్షణములు
🕉ఓంశ్రీమాత్రేనమః🕉
అద్వైత చైతన్య జాగృతి
(గీత 2వ అధ్యాయమున 55వ శ్లోకము నుండి)
1) కోర్కెలను విడచినవాడు (ప్రజహాతి కామాన్).
2) ఆత్మయందు సంతుష్టి బొందువాడు (ఆత్మన్యేవాత్మనా తుష్టః).
3) దుఃఖములందు క్షోభ నొందకుండవాడు (దుఃఖేష్వను ద్విగ్న మనాః).
4) సుఖములయం దాసక్తి లేకుండువాడు (సుఖేషు విగత స్పృహః).
5) రాగ, భయ, క్రోధములు లేనివాడు (వీత రాగ భయ క్రోధః).
6) సమస్త విషయములయందును అభిమానము లేనివాడు (యస్సర్వ త్రాభిస్నేహః).
7) ప్రియా ప్రియములు సంభవించినను. సంతోషముగాని ద్వేషముగాని లేనివాడు (తత్తత్ప్రాప్యశుభాశుభమ్ నాభినందతి నద్వేష్టి).
విషయము నింద్రియముల నుండి మరల్పువాడు (యదా సంహరతే చా యం కూర్మోంగాని వ సర్వశః ఇంద్రియా ణీంద్రియార్ధేభ్య స్తస్యప్రజ్ఞా ప్రతిష్ఠితా ||
గీతా 2-58) భక్తుని లక్షణమలు:-
(గీత 12వ అధ్యయమున 13వ శ్లోకమునుండి)
1) ఏ ప్రాణిని ద్వేషింపకుండుట.
2) మైత్రి.
3) కరుణ.
4) మమత్వము లేకుండుట.
5) అహంకారము లేకుండుట.
6) సుఖదుఃఖము లందు సమత్వము.
7) ఓర్పు నిత్య సంతుష్టి.
9) మనో నిగ్రహము.
10) దృఢ నిశ్యయము.
11) మనోబుద్ధులను భగ వంతునకు సమర్పించుట.
12) లోకమువలన తాను గాని తన వలన లోకముగాని భయపడకుండుట.
13) హర్షము క్రోధము భయము లేకుండుట.
14) దేనియందును అపేక్షలేకుండుట.
15) శుచిత్వము కలిగియుండుట.
16) కార్య సామర్థ్యము.
17) తటస్థత్వము.
18) మనోవ్యాకులత లేకుండుట.
19) సర్వ కర్మఫల త్యాగము.
20)హర్షము లేకుండుట.
21) ద్వేషము లేకుండుట.
22) శోకము లేకుండుట.
23)కోరిక లేకుండట.
24) శుభాశుభ పరిత్యాగము.
25) శత్రుమిత్రులందు సమత్వము.
26) మానావ మానములయందు సమభావము.
27) శీతోష్టములందు సమత్వము.
28) సుఖదుఃఖము లయందు సమ భావము.
29) సంగవర్జిత్వము.
30) నిందాస్తుతు లందు సమత్వము.
31)మౌనము.
32) దొరకిన దానితో సంతుష్టి.
33) నివాసము నందభిమానము లేకుండుట.
34) స్థిరబుద్ధి.
35) భగవంతుని యందు భక్తి.
స్థితప్రజ్ఞునికి చెప్పిన లక్షణములను పరిశీలించిన భక్తుని లక్షణములు నవియేయని గమనించవచ్చును.
--((**))--
వారానికి ఏడు రోజులు ఎందుకు !?
రోజుకు 24 hours కదా hour అనే పదం ఎక్కడిది ??
ఆదివారం తర్వాత సోమవారం ఎందుకు ? మంగళ వారం రావొచ్చుగా ??
ఈ ప్రశ్నలకి జవాబు చెప్పే మందు > మనలో కూడా చాలా మందికి తెలియని విషయాలు తెలుసుకుందాం..
ప్రపంచంలో ఏదేశానికి లేని జ్ఞాన సంపద మన సొత్తు..
ఎన్నో వేల లక్షల సంవత్సరాల నుండి... మిగతా దేశాలు వారు గ్రహాలు అంటే ఏంటో తెలియక ముందే నవ గ్రహలను గుర్తించిన ఘనత మనదే..
ఏ రోజు ఎప్పుడు సూర్యోదయం అవుతుంది ?ఎప్పుడు సూర్యాస్తమయం అవుతుంది ?
ఎప్పుడు చంద్రగ్రహణం ? ఎప్పుడు సూర్యగ్రహణం ?
ఏ కార్తెలో ఏ పంట పండించాలి ఇవన్నీ కూడా మన భారతీయులు చేతి వేళ్ళు లెక్కలతో వేసి చెప్పినవే.. ఎటువంటి పరికరాలు టెలిస్కోపులు లేకుండా సాధించినవే..
పైన ప్రశ్నకి జవాబు..
మన వాడుకలో ప్రతి రోజుకి ఒక పేరు ఉంది. ఆది వారము, సోమ వారము, మంగళ వారము, బుధ వారము, గురు వారము, శుక్ర వారము, శని వారము. ఇవి ఏడు. ఇలా ఈ ఏడు రోజులకు ఏడు పేర్లు ఎందుకు పెట్టారు ?
ఆ పేర్ల నిర్ణయానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి వుంది. నిర్ధిష్టమైన పద్ధతిలో పూర్వ కాలంలో భారత మహర్షులు ఆ పేర్లను నిర్ణయించారు. ఆ పేర్ల నిర్ణయానికి శాస్త్రీయమైన కారణాలున్నందునే ఆ పేర్లే ప్రపంచ వ్యాప్తంగా ఆచరణలో నేటికి ఉన్నాయి.
భారత కాలమానంలో హోరా అనగా ఒక గంట అని అర్థం. దీని నుండి పుట్టినదే ఇంగ్లీషు HOUR. ఒక రోజుకు 24 గంటలుంటాయి, అంటే 24 హోరాలు. ఒక రోజులో ఉన్న 24 గంటలు (24 హోరాలు) కూడా ఏడు హోరాల చక్రంలో తిరుగుతాయి.. ఆ 7 హోరాలకి ఏడు పేర్లున్నాయి. అవి వరుసగా... (ఈ వరుసలోనే) శని, గురుడు, కుజుడు, రవి, శుక్ర, బుధ, చంద్ర హోరాలు ప్రతి రోజూ వుంటాయి.
ఈ 7 హోరాలే ప్రతి రోజు 24 గంటల్లో ఉంటాయి.. 7 గంటల కొకసారి ఈ 7 హోరాలు పూర్తీ అయ్యాక మళ్ళీ మొదటి హోరాకి వస్తుంది.. అంటే శని హోరా నుండి చంద్ర హోరాకి మళ్ళీ శని హోరాకి..
ఉదాహరణకు ఆదివారము రవి హోరాతో ప్రారంభం అయి మూడు సార్లు పూర్తికాగా (3 సార్లు 7 హోరాలు 3x7 = 21 హోరాలు) 22వ హోరాపేరు మళ్ళీ రవి హోరా వస్తుంది. 23వ హోరా పేరు ఆ వరుసలో శుక్ర హోరా అవుతుంది. 24 వ హోరా బుధ హోర అవుతుంది. దాంతో ఒక రోజు పూర్తవుతుంది.
ఆతర్వాత హోరా 25వ హోరా. అనగా తరువాతి రోజు మొదటి హోరా దాని పేరు చంద్ర హోరా. అనగా సోమవారము. అనగా చంద్ర హోరాతో ప్రారంభ మౌతుంది. ఏరోజు ఏ హోరాతో ప్రారంభమవుతుందో ఆ రోజుకు ఆ హోరా పేరున దానికి ఆ పేరు వుంటుంది.
చంద్ర హోరాతో ప్రారంభమైనది గాన అది సోమ వారము. ఈ విధంగానే మిగిలిన దినములు కూడా ఆయా హోరాల పేరన పేర్లు ఏర్పడతాయి.
రవి (సూర్యుడు) హోరాతో ప్రారంభం = రవివారం, ఆదిత్య అన్నా కూడా సూర్యుడు పేరే.. సో ఆదివారం, భానుడు అన్న కూడా సూర్యుడే భానువారం (కర్ణాటక, తమిళనాడులో భానువారం వాడుతారు) ఇలా ఆయా హోరాలు బట్టి రోజుల పేర్లు వచ్చాయి...
ఆదివారం తరవాత సోమవారం ఎందుకు రావాలి ? మంగళ వారం రాకూడదా ??
రాదు.... ఏందుకంటే ఆదివారం రవి హోరా ప్రారంభం అయ్యింది, తరువాత రోజు అంటే సోమవారం చంద్ర హోరాతో ప్రారంభం అయ్యింది కాబట్టి..
ఇది మన భారతీయుల గొప్పతనం.. ఈ విషయాలు తెలియక మనల్ని మనం చిన్న చూపు చూసుకుంటాం..
ప్రపంచంలో దేశమయినా మన పద్ధతి ఫాలో అవ్వాల్సిందే.. కానీ మనకి మాత్రం మనం అన్నా మన దేశమన్నా లోకువ...
ఇంత నిర్థిష్టమైన పద్ధతిలో వారమునకు పేర్లు పెట్టారు గనుకనే భారతదేశ సంప్రదాయాన్ని ప్రపంచమంతా అనుసరిస్తున్నది..
జయహో భారత్
"వృక్షో రక్షతి రక్షితః "
త్వరలోనే మామిడి, నేరేడు, పనస వంటి పండ్లు మనకు దొరుకుతాయి.
మీరు ఆ పండ్లు తిన్న తరువాత గింజలను పడేయవద్దు. గింజలను కడిగి మీ బైక్/కార్/సైకిల్ లో తీసుకొని వెళ్ళండి.
మీరు ప్రయాణము చేస్తున్నప్పుడు హైవే చుట్టుపక్కల కానీ ఖాళీస్థలాల్లో ఈ గింజల్ని విసరండి లేదా చల్లండి.
వచ్చే వర్షా కాలంలో అవి సులభంగా మొలకెత్తు తాయి. ఈ ప్రయత్నం తో మనం ఒక్కొక్కరం ఒక చెట్టు పెంచకల్గినా ప్రపంచాన్నీ కాపాడుకోనే ప్రయత్నము సఫలమవుతుంది. సతారా, రత్నగిరి (మహారాష్ట్ర) ప్రాంతాలలో ఈ పథకం ప్రవేశ పెట్టారు.
ఇతర రాష్ట్రాల,జిల్లాల ప్రజలను కూడా ఇది పాటించమని విన్నపాలు చేస్తున్నారు. చాలామంది ప్రజలు ఈ అద్భుతమైన ప్రణాళికలో పాల్గొని ప్రకృతి సంరక్షణలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు.
మీరందరూ కూడా దీనిలో పాల్గొని మీవంతు కృషి చేస్తే మన ముందు తరాల వారికి మేలు చేసిన వాళ్ళమవుతాము.
"వృక్షో రక్షతి రక్షితః "
--((**))--
తెలంగాణ సాహిత్య కళాపీఠం కవితల పోటీలో
మొదటి బహుమతి పొందిన కవిత
చెమట చుక్కలూ ...ఇంకిపోయేనా
-------------------------------------------
బతుకు బండి చిన్నదాయే
సీమరైతు వ్యధ పెద్దదాయే
ప్రతి ఏటా కరువాయే
కరువుతోనే చెలిమాయేనా
రైతుబతుకు అప్పుల కుప్పాయేనా
అయ్యో!! నా రైతు బతుకు ఆగమాయేనా!!
పసులకు మేతే కరువాయే
గొడ్లను సంతకు తోలుకుపోయే
పసులు కసాయి కటికల పాలయేనా
అయ్యో!! అయ్యో!!!
పసులబంధం తెగిపోయేనా
రైతు ఏడుపు అరణ్యరోదనాయే
వల్లకాడు బాదలాయే
ఇల్లుగడిచే దారిలేదాయే-
నా రైతన్నలకు
రాగిసంకటి జొన్నరొట్టె కరువాయే
గొడ్డుకారం మంటాయే
తుంట బీడీనే దిక్కాయేరా
నా రైతన్నకు
వొక్కాకుతిత్తీ ఖాలీ ఆయేరా
సున్నమే నీకు దిక్కాయేరా
నింగిలో మేఘాల జాడ కానరాదాయే
సప్తవర్ణాల హరివిల్లు కలలాయేనా
వాన చినుకులు కరువాయేనా
పలుగు పార మూలకేసారా
నా రైతులారా దుక్కి దుఃఖం
ఎన్నడాగేనూ??!
కంటి నీరు కరిగి కన్నీటీ వరదాయేనా
చెమట చుక్కలూ .... ఇంకిపోయేనా
కరువు రక్కసి కోరల్లో
నీ బతుకు బలాయేనన్నా నా...
రాయలసీమ రైతన్నా......
నీకు వలస దారే దిక్కాయేనా!
రచన: మాణిక్యం ఇసాక్
కొత్తచెరువు
ఎవరికి తెలుసు?
_____
నీవు మాట్లాడిన
ఆ మాటలే
చివరి మాటలు
అవుతాయనీ
నీవు మింగిన
ఆ మెతుకులే
చివరి మెతుకులు
అవుతాయనీ
నీవు త్రాగిన
ఆ నీరే
కాశీ తీర్థం
అవుతుందనీ
నువ్వు పీల్చిన
ఆ శ్వాసే
తుది శ్వాస
అవుతుందనీ
నీవు చూసిన
ఆ చూపే
కడ చూపు
అవుతుందనీ
నీవు మూసిన
ఆ కనురెప్పలే
శాశ్వతంగా
మూతపడతాయనీ
నీ గుండె దడ
ఆ మోతే
కడ మోత
మోగుతుందనీ
నీవున్న
ఆ స్థానమే
జీవితపు
చివరి మజిలీనేమో
ఎవరికి తెలుసు?
అందుకే ....
నీవు జీవితంలో
చిరస్థాయిగా
జనుల హృదయాలలో
చిరస్థాయిగా నిలిచిపోయే
మంచి పనులు చేయి!
💐💐💐💐💐💐
రచన: మాణిక్యం ఇసాక్
_____
నీవు మాట్లాడిన
ఆ మాటలే
చివరి మాటలు
అవుతాయనీ
నీవు మింగిన
ఆ మెతుకులే
చివరి మెతుకులు
అవుతాయనీ
నీవు త్రాగిన
ఆ నీరే
కాశీ తీర్థం
అవుతుందనీ
నువ్వు పీల్చిన
ఆ శ్వాసే
తుది శ్వాస
అవుతుందనీ
నీవు చూసిన
ఆ చూపే
కడ చూపు
అవుతుందనీ
నీవు మూసిన
ఆ కనురెప్పలే
శాశ్వతంగా
మూతపడతాయనీ
నీ గుండె దడ
ఆ మోతే
కడ మోత
మోగుతుందనీ
నీవున్న
ఆ స్థానమే
జీవితపు
చివరి మజిలీనేమో
ఎవరికి తెలుసు?
అందుకే ....
నీవు జీవితంలో
చిరస్థాయిగా
జనుల హృదయాలలో
చిరస్థాయిగా నిలిచిపోయే
మంచి పనులు చేయి!
💐💐💐💐💐💐
రచన: మాణిక్యం ఇసాక్
No comments:
Post a Comment