-01 -03 -2023 నాటి రచనలు
సమస్యను పరిష్కరించడం
ఉదయ రాగ గీతం
గజిల్... దైవమా
నేటి కధ . (కలసిన హృదయాలు)
1 . ప్రాంజలి ప్రభ... సమస్యను పరిష్కరించడం..... 01 -౦౩-2023
కారము కన్నులన్ జొనిపి కాంతుని పిల్చెను కామకే ళి కిన్
...
ఉ:: జీరయు కాదులే మగువ జేష్టలు మగ్గుత మారమేమియున్
నేరము ఏలనో ఇపుడు. నీడల పంచన సేవచేయుటన్
సారము నాది నీదియగు సాధణ శోధన చెందుటే అహం
కారము కన్నులన్ జొనిపి కాంతుని పిల్చెను కామకే ళి కిన్
.....
ప్రాంజలి ... ఉదయ రాగ గీతం 01/03/2023.
*****
పాట సందర్భంపై నా విశ్లేషణ.
*********
పార్వతీ పర మేశ్వర శృంగార ఆటవెలది సరస సల్లాప గీతమ్ ...!
పల్లవి:-
****
పా:: ఓర చూపు నిన్ను ఓర్పుగా చూడంగ
నాదు చిలిపి ఊహ నాట్య మాడె
కోర మీస మేను కోరియు తిప్పంగ
నాదు వలపు వీణ నాట్య మాడె
ప:: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా ....
ప:: దోర వన్నె చేయి దోభూచు ఆడంగ
నా తణువు అగ్గి నటన అయ్యె
బుగ్గ గిల్ల చుంటె బురబుర పొంగేను
సిగ్గు చీర విడిచి చిందు లయ్యె
ప:: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా ....
ప. పా :: ఓర చూపు నిన్ను ఓర్పుగా చూడంగ
నాదు చిలిపి ఊహ నాట్య మాడె
దోర వన్నె చేయి దోభూచు ఆడంగ
నా తణువు అగ్గి నటన అయ్యె
చరణం:-
***
పా:: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా ....
పా :: మనసు దోచు చున్న మగ మహారాజువి
సామ జవర గమన సాహ సంబు
కొంత నాకు పంచు కోరిక తీర్చుమా
అంత నీవు దోచు ఆశ గాను
ప:: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా ....
ప. :: ఇదియు సంతసమ్ము ఇన్నాళ్ళు నాలోన
అంద మంత నీది ఆత్ర మేను
కొత్త దనము తెచ్చు కోరు వసంతము
అందు కొమ్ము నన్ను ఆత్ర మేను
పా :: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా ....
ప:: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా ....
పల్లవి:-
****
ప. పా :: ఓర చూపు నిన్ను ఓర్పుగా చూడంగ
నాదు చిలిపి ఊహ నాట్య మాడె
దోర వన్నె చేయి దోభూచు ఆడంగ
నా తణువు అగ్గి నటన అయ్యె
చరణం:-
****
పా:: ఎన్ని లక్షణాలు ఏలనమ్మాళిలే
నీదు వేష మాయ నిజము యేన
ఇన్ని నాళ్ళు నమ్మె ఇష్ట మాయా మగడా
నీదు ఆశ తీర్చ నిజము గాను
పా :: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా ....
ప:: గాలి లోని పలుకు గాళమై పట్టెనే
గంధ పరిమళాలు గాయ మేను
వెన్నె కళల మోము వేగమై పిలిచెను
నీదు చుంభ నముయె నాదు జపము
పా :: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా ....
పా:: ప్రాణ మేను నీది ప్రాయము దోచుకో
కమ్ము కొమ్ము నన్ను కాల మిదియు
ఈక్షణమ్ము నేను ఇష్టమ్ము చేసెద
సత్య పలుకు నాది సమయ మిదియు
పా :: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా ....
పల్లవి:-
***
పా. ప:: ఓర చూపు నిన్ను ఓర్పుగా చూడంగ
నాదు చిలిపి ఊహ నాట్య మాడె
కోర మీస మేను కోరియు తిప్పంగ
నాదు వలపు వీణ నాట్య మాడె
**********
గజిల్... దైవమా 01=03=2024
నిన్ను నేను ప్రార్థించే ఒకందుకే దైవమా
నాలోనిది, లోభిత్వo, అనుమానం దైవమా
సంకుచితత్వాన్ని సమూలంగానే చేధించు
కష్టసుఖాలను తేలికగ పొందాలి దైవమా
భరించే శక్తిని తేలికగ నాకు ప్రసాదించు.
ప్రేమను నీ సేవలొ ఫలప్రదం చేయు దైవమా
పేదవారిని తిరస్కరించకుండా ఆదరించు
అధికార గర్వం లేని ప్రేమపెంచు దైవమా
నా హృదయాన్ని అహరహాలు జపం చేయ కరుణించు
ఇంతకన్న నాకు వేరే ఏమీ వద్దు దైవమా
తలవంచకుండా వుండే బలాన్ని అనుగ్రహించు.
కష్టాలను ఓదార్చు గుణము నాకివ్వు దైవమా
ప్రేమతో నా సర్వస్వాన్నీ, నీకే అర్పితం దైవమా
నీ ఇచ్ఛకు సమర్పించు శక్తినివ్వు దైవమా
.......
ప్రాంజలి
01-03-2023 నేటి కధ . (కలసిన హృదయాలు)
నాన్న నాకప్పుడే పెళ్ళికి తొందరెందుకు, నాకు మంచి ఉద్యోగము రాలేదు, ఈ ట్యూషన్సు వల్ల పెళ్లి చేసుకుంటే కష్టం కదా.
అట్లా నేను అనుకుంటే నాకు అసలు పెళ్లి అయ్యేదే కాదు, ఎందుకంటే నా పెళ్లప్పుడు మునిసి పాలిటీ అత్తర్, చెత్త వ్యాన్ డ్రైవర్ పనిచేసే వాడ్ని, అందరూ పెళైన కొత్తలో చెత్త బాబాయి అనేవాళ్ళు, వాళ్ళు అలా అన్నారని మీ అమ్మను ఎప్పుడూ భాద పెట్ట లేదు.
నీవేమి భయపడకు ఆ దేవుడు వ్రాసి నట్లే జరుగుతుంది అంతా మనకోసం జరిగిందను కోవాలి ఎంత చెట్టుకు అంతే గాలి అయిన మానవ ప్రయత్నం చేయాలి కదా, నీవేమి ఆశలకు పోవటం లేదు కదా, కంతకు తగ్గ బొంత కోసం వెతు కుంటున్నావు, ఏమో నాన్న నీవు చెప్పావు కాబట్టి అమ్మాయిని చూసి వస్తా, నాకు నచ్చక పోతే నచ్చ లేదని చెపుతా అంతకు ఇష్ట మైతేనే పిల్లని చూస్తా, సరే నీతోపాటు పక్క ఇంటి గోపాలం గారిని తీసుకొనివెళ్ళు అన్నాడు.
ఆలా పిల్లను చూడటం నచ్చలేదని నాన్నకు చెప్పఁటం జరిగింది.
ఎందుకు నచ్చలేదో చెప్పాలి, అమ్మాయి వాళ్లు నీచేత కంప్యూటర్, జిరాక్స్ మిషన్ కొని ఇంటర్ నెట్ సెంటర్ పెడుతారుట, స్వతంత్రంగా బ్రతక వచ్చు ఇలా ట్యూషన్సు చెప్పే బదులు ఒక్కసారి ఆలోచించు, అది అంత తెలికకదా, నిన్ను వదలి వెళ్ళి బతకాలనిలేదు.
అది కాదు నాన్న" పిల్ల ", నాకునచ్చలా పిల్ల కళ్ళు గాజుకళ్ళు, పగలు చూడాలంటే నాకు భయ మేసింది, ఇక రాత్రి విషయం తలుచు కుంటే ఇంకా భయమేస్తుంది.
సరేరా మన గోపాలం గారి చుట్టా లెవరో ఉన్నారట చూసి వస్తావా.
నాన్న నేను మాత్రం ముందు చూడను, నీవు చూసి నచ్చింది, చూడరా అంటే చూస్తాను అంతే చివరికి మానాన్న గారు చూసిన సంభంధము కుదిరింది.
పెళ్లి రంగ రంగ వైభవముగా జరిగింది, పార్వతి పరమేశ్వరులు అని దీవించారు, నాకు గవర్నమెంటు ఉద్యోగమూ వచ్చింది, నాన్న గారిని వదలి వేరొక ఊరులో ఉద్యోగ నిమిత్తము కాపురం పెట్ట వలసి వచ్చినది. (నాన్న గారు గుడిలో పూజారిగా ఉంటాను, ఈ వయసులో మీ మధ్య నేనెందుకు అని మమ్ము భాగ్య నగరానికి పంపించారు.
ఇంతకీ నాపేరు చెప్పలేదు కదా, నాపేరు మాధవ్ భార్యపేరు రాధ
ఇక సంసారంలో సరిగమలు వినండి
నన్ను పొద్దున్నే రాధ నిద్ర లేపుతుంది వాకింగ్ పొమ్మంటుంది, తనేమో పాలు ఆలస్యముగా వస్తే వాడితో గొడవ పెట్టు కుంటుంది, పని అమ్మాయి ముందు వస్తే నా నిద్ర చెడ గొట్టావ్ అని ఎగిరి పడు తుంది, నేను తిరిగి వచ్చాక కూడా రుస రుస లాడుతూ ఉంటుంది, పే పరు బాయ్ ఇంటిలోకి విసిరేశాడని వానితో గొడవ పెట్టు కుంటుంది, నేను ఎన్ని సార్లు చెప్పిన వాళ్ళతో తగాదా పడ కూడ దన్నా విని పించుకోదు, నన్నే ఉరిమి ఉరిమి చూస్తుంది, అప్పుడను కూనే వాణ్ని ఇలాంటి వాళ్ళను కాలమే బాగు చేయాలి, నోటితో న్యాయం చెప్పఁటం కన్నా మౌనం గా ఉండుట మేలు అని తలచి కాపురము చేస్తున్నాను. టివి అదే పనిగా చూస్తుంది, సీరియల్సస్ లో లీనమై పోతుంది, వంటకాలు చూసి రోజు కొక వంటకం తయారు చేస్తుంది .
ఏదన్నా అంటే ఈ వయసులో కాక ఏ వయసులో సుఖపడతాం అంటుంది, పిల్లలు మాత్రం ఇపుడే వద్దంటుంది, మీ సంపాదన పిల్లలు ఉంటే సరి పోదంటుంది. ఎవరు ఏమి చెప్పిన ఇట్టే నమ్మేస్తుంది, ఆఫీసులో ఆలస్య మైనదనుకో ఆరోజు నాకు పస్తే నోరు చేసుకొని కాపురం చేస్తుంది.
ఒక రోజు నాన్నగారు మా ఇంటికి వచ్చారు, ఎరా ఆలా ఉన్నావు, కోడల పిల్ల లేవ లేదా, వంట్లో నలతగా ఉన్నది. అందుకని నేనే గ్రైండర్ లో పప్పు రుబ్బి దోశలు వేయుటకు నేను రడీగా ఉన్నా నాన్న, నీవు కాళ్ళు చేతులు కడుక్కొని రా, నీకు దోశలు పెడతాను, నాకు తొందర లేదురా, ఇప్పుడే రైల్లో దిగి ప్రక్కనే ఉన్న హోటల్లో టిఫిన్ తిని వచ్చానురా, నీవు ఆఫీసుకు పోతావేమోనని తొందరగా వచ్చాను, నీవు అమ్మాయి తినండి, నీ పరిస్థితి చూస్తుంటే నాకు దిగులుగా ఉందిరా, నాన్న నేను ఆఫీసుకు పోయి వచ్చాక అన్నీ మాట్లాడు కుందాం, నేను కూడా నా స్నేహితుని కొడుకు మ్యారేజ్ చూసి వస్తాను . అమ్మాయికి ఒకేమారు చెప్పి పోతాను పిలుస్తావా.
రాధా అని పిలిచాడు.
మావయ్యగారు ఎప్పుడు వచ్చారు, ఏమిటి చెప్పకుండా వచ్చారు, సరేలేండి భోజనం చేసి మరి వెళ్ళండి.
ఏమిటే ఆ మాటలు నాన్నతో
నేనేం తప్పు మాట్లాడ లేదు ఉన్న నిజం చెప్పా అంతేకదా
బాబు మీ సంసారం చూసాక మీకు కొన్ని విషయాలు చెప్పి వెళతాను అన్నాడు అట్లాగే నాన్న.
ఏమిటండి, మీనాన్న నాకు చెప్పేది అన్నది
మా నాన్నగారు వెళ్ళేదాకా అన్న నీ నోరు కంట్రోల్లో పెట్టుకో, లేదా నేను చేయి చేసు కోవాల్సి ఉంటుంది,
ఏమిటి మీ చేయి లేస్తుంది, మీ నాన్న కోసం మీరు చెప్పినట్లుగా బుద్ధిమంతురాలుగా ఉంటాను నోరు ఎత్తను అన్నది.
చూడు బాబు మారాలి మారాలి భార్య అని ఆమె చెప్పిన వన్నీ కోపంతోగాని ప్రేమతో గాని చేయటం తప్పు కాదు, కాని నేను ఉద్యోగం చేస్తున్నాను అని అహంకారము భార్య ముందు ప్రదర్శించ కూడదు, భార్య భర్తలలో ఎవరికి ఎవరు ఎక్కువకాదు .. తక్కువ కాదు ... సమానమే
మనస్పర్థలు రాకుండా ఎప్పుడూ నవ్వుతూ ప్రతి విషయము సాల్వు చేసు కోవాలి, పెద్దలు కుదిర్చిన పెళ్లి ఆయన ఒకరి కొకరు ప్రేమను పంచుకొని సంసారాన్ని స్వర్గమయం చేసుకోండి, ఇంతకు ముందు ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం నాముందు కీచులాటలు మాత్రం ప్రవర్తించ కండి.
మీ సంతోషానికి నేను అడ్డురాను, మీరు ఏ తిండి పెడితే అదే తింటాను, నాకు పెన్షన్ వస్తుంది అది కూడా మీకే నేను ఇక్కడ ఉన్నంత కాలము మీకే ఇస్తాను.
మీరు చేయాల్సిందల్లా ఒక్కటే నాకు మనవుడో మనవరాలో ఇవ్వండి వాళ్ళతో ఆడు కుంటూ ఇక్కడే ఉంటా .
అప్పుడే మావయ్యగారు నన్ను క్షమించండి తప్పుగా మాట్లాడితే మన్నించండి, మీరు ఇష్టమున్న రోజులు ఇక్కడ ఉండవచ్చు
నాన్న మీరు ఎక్కడికీ పోనక్కరల్లేదు ఇక్కడే ఉండండి.
మీరు కీచులాట లాడితే మాత్రము ఇక్కడ ఉండలేను ముందే చెపుతున్నాను.
చీకటి పడింది, మావయ్యగారు పడుకొనే గది చూపించి, మంచి నీళ్లు పెట్టి ఏ అవసరము వచ్చిన మీ అబ్బాయి నా సెల్లు నెంబర్లు ఇవి ఫోన్ చేయండి అనిచెప్పి పడక గది చేరి భర్తతో ఇంటి పనులు అన్నీ నే చూసు కుంటా, ఆఫీసు పనులు మీరు చూసుకోండి
అబ్బా ఈ రోజు పండు వెన్నలుగా ఉన్నది మంచం పై ఒకరికొకరు తన్మయత్వంలో మునిగి తేలారు, ఏవండీ నేను కూడా ఉద్యోగం చేయనా, మీ నాన్నగారు కూడా ఉన్నారుగా, ఇప్పుడు మనకు డబ్బుని గూర్చి ఆలోచించ వద్దు పిల్లలగురించి ఆలోచిద్దాం, అవునండి మనకు పిల్లలు కావాలి, మీ నాన్నగారు కూడా ఉండాలి, (శంకరం మనసులో అను కున్నాడు ఇంట్లో పెద్దలు ఉంటె ఆ యిల్లు సుఖశాంతితో ఉంటుంది) అంటూ వారిరువురి హృదయాలు ఆనందంతో నిండినాయి.
రచయిత మల్లాప్రగడ రామకృష్ణ ,
--((*))--
No comments:
Post a Comment