Monday, 8 April 2019


 

 

ప్రాంజలి ప్రభ 

సేకరణ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

శ్రీనాథ కవి సార్వభౌముడు: సంక్షిప్త కధ 

కవి సార్వభౌముని చాటువు

కొందరు భైరవాశ్వములు కొందరు పార్థుని తేరి టెక్కెముల్

కొందరు ప్రాక్కిటీశ్వరులు కొందరు పార్థుని ఎక్కిరింతలున్

కొందరు కృష్ణ జన్మమున కూసినవారాలు ఈ సదస్సు లో

అందరు నందరే మరియు నందరు నందరు నందరే గనన్

భావము : భైరవుని రథానికి పూన్చేది కుక్కలను, అర్జనుని రథ పతాకము పై గల గుర్తు 'కపి రాజు' ఆంజనేయుడు,సముద్రములో మునుగు భూమిని లేవనెత్తినది వరాహాహావతారములో విష్ణువు అంటే ఇక్కడ అన్వయములో మాత్రము పందులు, కృష్ణ జన్మ సమయమున కూసినవి గాడ్దెలు,(వసుదేవుడు-గాడ్దె కాళ్ళు), సభలో కూర్చున్నవారంతా ఈ జంతువులతో సమానమని నర్మగర్భంగా వంగ్య పూరితమైన ఈ పద్యాన్ని, ఒక రాజు,సభలో గల తన ఆస్థాన కవులను గూర్చి గొప్పగా చెప్పంటూ ఈ సమస్య ఇస్తే,శ్రీనాధులవవారు పై విధంగా తెలిపినారు .

పరమకల్యాణి! యోభాగీరథీగంగ! వార్థిభామిని! పోయివత్తునమ్మ!

అమరేంద్రులార! లోలార్క కేశవులార! వనజసంభవ! పోయివత్తునయ్య!

శ్రీవిశాలాక్షి! దాక్షిణ్య పుణ్యకటాక్ష! వాసవార్చిత! పోయివత్తునమ్మ!

శ్రీపూర్ణభద్ర పారిషద నాయకులార! వటుకభైరవ! పోయివత్తునయ్య!


తీర్థ సంవాసులార! కృతార్థులార!

పాశుపతులార! భాగ్యసంపన్నులార!

మందిరోద్యాన వాటికా మఠములార!

పోయివచ్చెద మీకాశిపురము విడిచి||


కలహంసి! రారాదె కదలి నాతోఁగూడి, నీవేల వత్తమ్మ నెమ్మినుండి

కదళికాకాంతార! కదలి రాననుగూఁడి, నీవేల వత్తమ్మ నెమ్మినుండి

శ్రీవిశాలాక్షి! విచ్చేయు నాతోఁగూడి, నీవేల వత్తమ్మ నెమ్మినుండి

నాతోడఁ గూడి యంతర్గేహ! యేతెమ్ము, నీవేల వత్తమ్మ నెమ్మినుండి


ప్రాంజలి ప్రభ ... అంతర్జాల హాస్యప్రభ (101)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


49. T .V లో

శుభలేఖ చివర గమనిక అని వ్రాసిఉన్నది అది ఏమిటో అని చదివింది పార్వతమ్మగారు

మీరు రాలేదని ఎవ్వరు అనుకోరు, T .V లో వస్తుంది చూడండి

మిమ్మలిని ఖర్చు పెట్టుకొని రమ్మని మేము గట్టిగా చెప్పటములేదు

ఇట్లు మీ భవదీయుడు ........................ 

 

50. రచయత

రచయత స్నేహితుడితో సంభాషణలు జరుపుతున్నాడు

స్నేహితుడు : కవిగారు మీ రచనలు ముద్రణలు ఎప్పుడవుతాయి

కవి: కడుపుతో ఉన్నవారు బిడ్డను 9నెలలు మోస్తేగాని బిడ్డ బయటకు రాదు అవును

మరి నా రచనలు ముద్రణ అవటానికి ఎన్ని నెలలు పాడుతాయో ....... 


51. వాగుడు మనిషి

ఒక యువకుడు ఆపకుండా ఉపన్యా స మిస్తున్నాడు ఎవరతను

ఈ వాగే గుణం కుటుంమ్బము నుమ్చి వచ్చింది

నికెట్లా  తెలుసు

ఏముంది వాళ్ళ తాత లెక్చరర్ , వాళ్ళనాన్న రాజకీయనాయకుడు

వాళ్ళ అన్నయ్య లాయరు , ఇక వాళ్ళ అమ్మ ఒక స్త్రీ కదా


52. కొత్తరకంజబ్బు

మా ఆవిడకు కొత్తరకం జబ్బు వచ్చింది

రాత్రి  2 గంటల వరకు నిద్ర పోకుండా వేచి ఉంటుంది

అరె పాపం అంతవర ఎం చేస్తుంటుంది

నాకోసం ఎదురు చూస్తూ ఉంటుంది ...................    


91. చక చక

మూడు  రోజుల్లో  చక చక నడుస్తానన్నారు

నా ఆరోగ్యం కోసం ఉన్న కారు అమ్మికదా  డాక్టరు ఫీజు కట్టింది

ఇక చక చక నడవక చస్తాన అన్నడుభార్యతో  ....................

92. బిల్లు

పెళ్ళిచూపులు అంటు ఒక ఇంటికి వచ్చి స్వీట్ అనీ బాగున్నాయి అన్నారు

ముందు  పిల్ల నచ్చితే వెంటనే చెప్పండి

లేదా మీరుతిన్న వాటికి బిల్లు కట్టి మరీ వెళ్ళండి ...........

93. భర్త

అప్పుడే నూరెల్లు నిండి నాయా అని ఏడుస్తున్నాడు ఒకడు

ఎవరు పోయారు అంత పెద్దగా ఎడు స్తున్నరు 

మా ఆవిడ రెండవ భర్త .........ఆఅ .............

మీరెంన్నో  భర్త మీ ఆవిడకు .....



ప్రాంజలి ప్రభ (1)
నేటి పద్యం (మల్లాప్రగడ రామకృష్ణ)  

కమలములు నీట బాసిన 
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్‌ 
తమ తమ నెలవులు దప్పిన 
తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ. 

భావం- ఏ వస్తువయైనా సరే తమ తమ స్థానములలో ఉన్నప్పుడే వాటి మద్య స్నేహ భాందవ్యం చక్కగా సాగుతుంది. ఎపుడయితే ఆ స్థానాలు  విడిచిపెడతారో తమ మిత్రులే శత్రువులుగా మారతారు. కమలము నీటిలో ఉన్నంత వరకే సూర్యకాంతికి వికసించును. ఎపుడైతే నీటిని విడుచునో అదే సూర్యకాంతికి వాడిపోవును.

--((**))--


ప్రాంజలి ప్రభ (2)


నేటి పద్యం (మల్లాప్రగడ రామకృష్ణ)  
భర్తృహరి సుభాషితం ! 

"ఆపదలందు ధైర్య గుణ మంచిత సంపదలందు తాల్మియున్ 
భూపసభాంతరాళమున పుష్కల వాక్చతురత్వమాజి బా 
హా పటుశక్తియున్ యశమునం దనురక్తియు విద్యయందు వాం 
ఛా పరివృద్దియున్ బకృతి సిద్ధ గుణంబుల సజ్జానాళికిన్" 

భావం: 


ఆపదలు వచ్చినప్పుడు దైర్యము, ఐశ్వర్యము వచ్చినప్పుడు ఓర్పు, సభ యందు వాక్చతుర్యము, యుద్దము నందు శౌర్యము చూపుట, కీర్తి యందు ఆసక్తి, విద్యలను నేర్పుట యందు గొప్పకోరిక అనునవి మాహాత్ములకు పుట్టుకతో వచ్చిన స్వభావగుణములు.

--((**))--


విష్ణుండు విశ్వంబు, విష్ణునికంటెను;
వేఱేమియును లేదు విశ్వమునకు
భవవృద్ధిలయము లా పరమేశుచే నగు;
నీ వెఱుంగుదు గాదె నీ ముఖమున
నెఱిఁగింప బడ్డది యేక దేశమున నీ;
భువన భద్రమునకై పుట్టినట్టి
హరికళాజాతుండ వని విచారింపుము, ;
రమణతో హరిపరాక్రమము లెల్ల.....
టీకా:
విష్ణుండు = శ్రీహరే; విశ్వంబు = విశ్వము; విష్ణుని = హరి; కంటెను = కంటే; వేఱు = వేరైనది; ఏమియును = ఏమీకూడా; లేదు = లేదు; విశ్వము = విశ్వము; కున్ = కు; భవ = సృష్టి; వృద్ధి = స్థితి; లయములు = లయములు; ఆ = ఆ; పరమేశు = పరమమైన ఈశుని / భగవంతుని; చేన్ = చేతనే; అగున్ = అగును; నీవు = నీవు; ఎఱుంగుదు = తెలియుదువు; కాదె = కదా; నీ = నీ; ముఖమునన్ = నోటిద్వారానే; ఎఱిఁగింపబడ్డది = చెప్పబడినది; యేకదేశమునన్ = అంశముగ; ఈ = ఈ; భువన = లోకముల; భద్రమున = క్షేమము; కై = కొరకు; పుట్టినట్టి = అవతరించినట్టి; హరి = హరియొక్క; కళ = అంశతో; జాతుండవు = జన్మించినవాడవు; అని = అని; విచారింపుము = తెలిసికొనుము; రమణ = ప్రీతి; తోన్ = తో; హరి = హరియొక్క; పరాక్రమములు = సామర్థ్యములు; ఎల్లన్ = సమస్తము;
.
భావము:
ఈ విశాల ప్రపంచంలో విష్ణువు కంటె ఇతర మైనది ఏదీ లేదు. ఈ విశ్వమంతా విష్ణుమయం. ఆ పరమేశ్వరుని సంకల్పం చేతనే ఈ ప్రపంచానికి సృష్టి స్థితిసంహారాలు ఏర్పడుతుంటాయి. వ్యాస మహర్షీ! నీవు సర్వజ్ఞుడవు నీకు తెలియంది ఏముంది. నీవే ఒక చోట ఈ విషయాన్ని చెప్పి ఉన్నావు. ఈ విశ్వకల్యాణం కోసం మహావిష్ణువు అంశతో జన్నించానన్న మాట గుర్తు చేసుకో. అందువల్ల నీవు శ్రీహరి లీలావతారాలలోని విక్రమ విశేషాలను సంస్తుతించు మానవుని జ్ఞానానికీ, అధ్యయనానికీ, ఔదార్యానికీ, అనుష్ఠానానికీ, తపస్సుకూ, ధైర్యానికీ, సంపదకూ ప్రయోజనం పుణ్యశ్లోకుడైన పురుషోత్తముణ్ణి స్తుతించటమే.
(పోతన తెలుగు భాగవతం.)

--((**))--

మానవజన్మ - సుగుణాలు 

హస్తస్య భూషణం దానం -- చేతులకు దానమే భూషణం 
సత్యం కంఠస్య భూషణం -- కంఠమునకు సత్యమే భూషణం 
శ్రోతస్య భూషణం శాస్త్రం -- చెవికి ధర్మ వచనములే ఆభరణం. 
ఇవే సహజమైన, శాశ్వతమైన భూషణాలని ఘోషించాడు భర్తృహరి. మానవ ధర్మానికి సంబంధించిన ఈ సుగుణాలు లేకుంటే మానవజన్మ వ్యర్ధమవుతుందని హెచ్చరించాడు.    

ఒక అడవిలో మనుష్య శవం ఉంది. కొద్ది దూరంలో మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ శవాన్ని తినేందుకు నక్క ముందుగా శవం చేతులను సమీపించింది. ఆ మహర్షికి అతరాయం కలిగి కన్నులు తెరచి చూశాడు. వెంటనే దివ్య  దృష్టితో చనిపోయిన ఆ వ్యక్తిని గురించి తెలుసుకున్నాడు. నక్కను ఉద్దేశించి " ఈతని చేతులు ఎన్నడూ దానం చేసి ఎరుగవు. కనుక వాటిని తినకూడదని" అన్నాడు. అప్పుడా నక్క చేతులను వదలి చెవులను తినబోగా, " ఈతని చెవులు ఏనాడు ధర్మశాస్త్రాలు గాని, ఆత్మజ్ఞానానికి సంబంధించిన అంశాలనుగాని వినలేదు. కాబట్టి చెవులు ముట్టతగినవి కావు" అని అన్నాడు. అప్పుడా నక్క కళ్ళను తినబోయింది. " ఈ నేత్రాలెన్నడు సాధువులను దర్శించినవి కావు. కనుక తినరాదని" అన్నాడు. అప్పుడా నక్క కాళ్ళను తిందామనుకుంది. అది గ్రహించి, " ఆ కాళ్ళు ఏనాడు మానవులను భవసాగరమునుంచి తరింప సజ్జనులను, తీర్ధాలను దర్శించి ఎరుగవు. కావున తినడానికి తగినవి కావని" అన్నాడు. 

మృతుడి ఉదరం అన్యాయార్జితంతో పెరిగింది కాబట్టి అదీ తినకూడనిదేనని మహర్షి చెప్పాడు. అప్పుడా నక్క కనీసం తలనైనా తిని తన పొట్ట నింపుకొందామనుకుంది. బతికి ఉండగా ఇతగాడి తల గర్వంతో మిడిసిపడుతుండేది. అదీ  తినేందుకు తగింది కాదని మహర్షి వారించాడు. మహర్షి ఆ నక్కకు తన ఆశ్రమంలోని కందమూలములు ఇచ్చి దాని క్షుద్భాధ తీర్చి పంపాడు. 

" సత్యవాది, ధర్మాత్ముడు, సదాచారశీలి . సౌశీల్యమూర్తిగా మనిషి మెలగితేనే మానవధర్మాన్ని సంపూర్ణంగా నిర్వర్తించినట్లు " అని ఈ కధ ద్వారా మనం గ్రహించాల్సినది.

--((**))--




శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(0801)
(శ్రీ శేషప్ప కవి)
.
సీ|| తనువులోఁ బ్రాణముల్ తరలిపోయెడివేళ
నీ స్వరూపమును ధ్యానించునతఁడు
నిమిషమాత్రములోన నిన్నుఁ జేరునుగాని,
యమునిచేతికిఁ జిక్కిశ్రమలఁబడఁడు;
పరమసంతోషాన భజనఁ జేసెడి వాని
పుణ్య మేమనవచ్చు భోగిశయన !
మోక్షము నీ దాస ముఖ్యుల కగు గాని
నరక మెక్కడిదయ్య నళిననేత్ర !
.
తే|| కమలనాభుని మహిమలు కానలేని
తుచ్ఛులకు ముక్తి దొరకుట దుర్లభంబు
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!


సీ|| లోకమం దెవఁడైన లోభిమానవుఁడున్న
భిక్షమర్ధికిఁ జేతఁ బెట్టలేఁడు,
తాను బెట్టకయున్నఁ దగవు పుట్టదుకాని
యొరులు పెట్టఁగజూచి యోర్వలేఁడు,
దాతదగ్గఱఁ జేరి తన ముల్లె పోయినట్లు
జిహ్వతోఁ జాడీలు చెప్పు చుండు
ఫలము విఘ్నంబైనఁబలు సంతసము నందు,
మేలుకలిగినఁ జాల మిణుఁకుచుండు,
.
తే|| శ్రీరమానాధ ! యిటువంటి క్రూరునకును
భిక్షుకుల శత్రువని పేరు బెట్టవచ్చు,
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!


No comments:

Post a Comment