Saturday, 6 April 2019

వికారి సంవత్సరం నుండి (ప్రాంజలి ప్రభ ఆదివార పత్రిక ) 7/ 2 0 1 9

ఓం శ్రీ రాం - శ్రీ మత్రేనమ: - శ్రీ కృష్ణాయ నమ:
మాలక్ష్యం " ఆనందం -ఆరోగ్యం - ఆధ్యాత్మికం "
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రికను 
 చదవండి-చదవమని చెప్పండి 

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
మల్లాప్రగడ రామకృష్ణ కధలు  -2
  
పిల్లలపై ప్రేమ ?

ఏమిటి రామచంద్ర రావుగారు అంత దిగులుగా ఉన్నారు, ఏమీ లేదండి మాధవ్ గారు ఆధునిక ఎలక్ట్రానిక్ మరియు కంప్యూటర్ వచ్చినప్పడి నుండి పిల్లలు చెడి పోతున్నారు. ఎందు కండి అట్లా అంటారు, మీరే మనవళ్ళకు ఆడుకొనే వస్తువుగా సెల్ కొని బెడుతున్నారు, వాళ్ళముందే మాపిల్లలు యిట్టె సెల్లు లాక్కొని ఆడుకుంటారు, మాకు కూడా రాదు అదేదో గొప్ప విద్యగా చెప్పుకుంటారు వాళ్లకు తెలియటంలేదు చిన్నప్పుడే కళ్ళు దెబ్బతింటాయని, అది ఒక వ్యసనంగా మారుతుందని,కఖరీదైనవి కొని ఇవ్వడం  చిన్నవాళ్లకు అవసరమా, టివి చూడమని చెప్పటం అవసరమా, మీరు ఒక్కసారి ఆలోచించండి పిల్లలకు సరిఅయిన వ్యాయామమం లేకుండా మార్కులు రావాలని అదేపనిగా చదివిస్తునారు. చివరికి చిన్నపిల్లలకు కళ్లజోడులు, పెద్దవాళ్ళు మాట్లాడినట్లు మాటలు వస్తున్నాయి. మనం కష్ట పడుతున్నాము పిల్లలు కష్టపడకూడదని అడిగిందల్లా కొని ఇచ్చే పరిస్థితి వచ్చింది,
ఇదీ నిజమే ఏమిటో, నా చిన్నతనంలో మా ఊళ్ళోనే విద్యుత్తు లేదు. అటువంటిది ఈ నాడు అరచేతిలో సెల్ ఫోను పెట్టుకుని అన్ని టి.వి.ఛానెల్స్ చూసెయ్యగలుగుతున్నాను. ప్రపంచంలో ఎక్కడున్న
వాళ్ళనైనా ప్రత్యక్షంగా చూస్తూ మాట్లాడెయ్య గలుగుతున్నాను. మానవా, నీ జిజ్జాసకు, మేథాశక్తికి జోహార్లు. ఆవకాయ పచ్చడి నుంచి ఆకాశంలోకి దూసుకెళ్ళే రాకెట్లదాకా కనిపెట్టేసావు. ఇంకా నువ్వు ఎన్నెన్ని అద్భుతాలను ఆవిష్కరించబోతున్నావో!అంటూ మాట్లాడుకుంటూ నడుస్తున్నారు.

ఒక చెట్టు క్రింద ఒక వ్యాను పై చిన్న స్టేజ్ ఏర్పాటు చేసి  పిల్లద్వారా ఈ పాతపాట పాడిస్తూ యాచిస్తున్నాడు. 

ఇంతేనా మా జీవితం మమ్ము గుర్తించే వారు లేరా
ఆదుకొని కూడు, గుడ్డ, ఆశ్రమం, కల్పించేవారు లేరా
అభం శుభం తెలియని  పసి కూనలం
అమ్మా నాన్న తెలియని పుడమి బిడ్డలం
ఆశా పాశములేని ప్రకృతి అనాధ పుత్రులం
ఆకలి తట్టుకొనే ఉండే చితికిన బతుకులం
ఆదరణ కరువై బిక్షమె ఆధార జీవులం
జక్కగా ఉన్నా సుబ్రములేని చిన్నారులం        
వీధి వీధి తిరుగుతున్న దిక్కులేని ప్రాణులం
కాలవ వొడ్డున గుడిసెలలో వన్నెదగ్గిన బాలలం  
తెగిన గాలిపటం వలే ఎగిరే ఎంగిలి ఇస్తరాకులం
    

ఇంతేనా మా జీవితం మమ్ము గుర్తించే వారు లేరా
ఆదుకొని కూడు, గుడ్డ, ఆశ్రమం, కల్పించేవారు లేరా

సూర్య కిరణాల వెలుగులే మాకు మార్గాలు
చంద్ర కిరణాల వెన్నెలే మాకు శయనాలు
చెట్ల ఫలాలు, గాలులు మాకు ఆహారాలు
పుడమి తల్లి మాకు నిత్యా నిత్య ఆశ్రమాలు
నీలి ఆకాశ పక్షులు మేఘాలే మాకు చుట్టాలు
మా బ్రతుకంతా నిత్యా అగ్ని హోత్రాలు


ఇంతేనా మా జీవితం మమ్ము గుర్తించే వారు లేరా
ఆదుకొని కూడు, గుడ్డ, ఆశ్రమం, కల్పించేవారు లేరా

సూర్యుడు తూర్పునే ఉదయించును
నీరు అడ్డంకులు వచ్చినపల్లమునకు జారును
చెట్ల గాలి సమస్త ప్రాణులను రక్షించును
పుడమితల్లి సమస్తము తనలో దాచును
పైవాటి ధర్మాలు మార్చే వారు ఎవ్వరు లేరు
మమ్ము ఆదుకొనే వారు అసలు ఈజగతి లో లేరా        
ఇంతేనా మా జీవితం మమ్ము గుర్తించే వారు లేరా
ఆదుకొని కూడు, గుడ్డ, ఆశ్రమం, కల్పించేవారు లేరా

వెంటనే ఆర్గనైజర్ వద్దకు మాధవ్ రామచంద్ర రావు చేరారు, నీవు పిల్లలతో పాటలు పాడించి అడుక్కోవటం తప్పు మేము పోలీసులకు చెప్పి నిన్ను అరెష్టు చేసి పిల్లలను ఎదో ఆశ్రమంలో చెరిపిస్తాము, నీకు ఆశ్రమం కల్పిస్తాము అన్నారు.
Image may contain: 1 person
తొందర పడకండి మా ప్రధాన గీతము విన్నారు, తర్వాత చిన్న నాటికలు ఏకపాత్రాభినయనాలు ఉన్నాయి చూడగలరు.

ఏది ఏమైనా మీరు చేసేది తప్పు అని ముక్తఖంఠముగా అన్నారు.  
అయితే మీరు మీ ఉద్యోగాలు మానేసి నాతోబాటు ఉండండి, నేను చేసే వృత్తిని గమనించండి అప్పుడు నన్ను పోలీసులకు అప్పచెప్పండి అని వినయంగా చెప్పాడు ఆర్గనైజర్ .
బుర్ర ఉండి మాట్లాడుతున్నావా మమ్మల్ని ఉండమంటావా అని కోపంగా అడిగాడు రామచంద్రరావు
రామచంద్ర రావు కోపం తెచ్చుకోకు అన్నాడు మాధవ్. అతను చెప్పిన విషయంలో ఏదైనా మంచి ఉండొచ్చు నిదానం అన్నాడు.

అవును పెద్దలారా మీ పనులు మానుకొని ఒక్కసారి గమనించండి అంటేనే అంత కోపం వచ్చింది, నిత్యం మీలాంటి వారి సూటి పోటీ మాటలు విని రూపాయి రూపాయి సేకరించటం మాకు ఎంత కష్టమో మీకు తెలుసా, ఇవ్వాళా ఇక్కడ మరోరోజు వేరోచోట మాకు చేతనైన విద్యను చూపించి ప్రజలను నవ్వించి బ్రతుకు తున్నాము అన్నాడు.
      
ఈ పిల్లలెవరు ఆనాధలు కాదు, చదువుకున్న విద్యార్థులు, వారికి నేను రోజుకూలి ఇస్తాను భోజనం, ఆశ్రమం కల్పిస్తాను. వారికి ఉద్యోగమూ వచ్చేవరకే మావద్ద ఉంటారు తర్వాత వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోతారు, మేము ప్రేమించుకున్నవారికి ఉచితముగా పెళ్లి చేసి చక్కటి భోజనం ఏర్పాటు చేస్తాము, ఇక్కడకొచ్చేవారు ఒకనాటి నటుల బిడ్డలు, వారి కులవృత్తి వదులు కోలేక నటన ప్రవర్తిస్తున్నారు. మేము స్కూలల్లో, కాలేజీలల్లో ప్రత్యేక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి వాటిమీద వచ్చే ఆదాయము చదువుకొనే విద్యార్థుల పారితోషికంగా అందిస్తున్నాము, మేము నిత్యా కష్ట జీవులం, ఇతరుల కష్టాలను ఆదుకొని
జీవించే డబ్బులు లేని జీవులం. ఇక్కడ ఆగి చూస్తున్న వారిని చందాల రూపములో అడుగుతాము కాని మరోవిధము కాదు అని తెలియపరిచారు.  

 ఈయన చెప్పిన విషయం బట్టి వీరికి పెద్ద నెట్ వర్కు ఉన్నట్లు ఉన్నది, మనం కలగ చేసు కుంటే మనమే ఇరుక్కుంటాం, కోర్టు చుట్టూ తిరగాల్సి పని ఉంటుంది అన్నాడు రామచంద్రరావు.

తొందర పడకు కొంత విషయం తెలిసింది, నాకేదో అనుమానంగా ఉన్నది అసలు మీరెవరో మాకు తెలుపుతారా నిజంగా అన్నాడు మాధవ్ , మీరెక్కడ ఉంటారో చిరునామా తెలపండి అన్నాడు.

అప్పుడే ఆర్గనైజర్ పిల్లలకు డబ్బులిచ్చి తర్వాత కార్యక్రమము నిర్వహించమని పురమాయించి    అలారండి ఆ హోటల్ ల్లో కూర్చొని మాట్లాడు కుందాం అన్నాడు

అప్పుడే మాధవ్ కు ఫోన్ వచ్చింది ఇంటి దగ్గర నుంచి 
ఏమిటి విషయం అని అడుగగా శ్రీమతి రాధ ఏమండి మన బాబు ఇంకా ఇంటికి రాలేదు ఎక్కడకు పోయాడో తెలియటు లేదు అని ఏడుస్తూ తెలిపింది. ఏడవకు ఏడ్చి అన్న చెప్పు, చెప్పి అన్న ఏడువు ఎప్పటి నుంచి కనపడ లేదు. పొద్దున్న స్కూలులో దించి వచ్చా తర్వాత ఇంటికి రాలేదు, మరలా  స్కూలుకు ఫోన్ చేస్తే ఈ రోజు స్కూల్ కు రాలేదని తెలిసింది. నాకు భయముగా ఉన్నది నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను ధైర్యంగా ఉండు అని సమాధానము చెప్పాడు. 

ఏమిటండి కంగారుగా ఉన్నారు ఏమీ లేదు మాబాబు కనబడుట లేదుట, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి 8 ఏళ్ళు ఉన్నాయి అన్నాడు. 
ఏది మీ అబ్బాయి ఫోటో ఇవ్వండి చూస్తాను ఫోటో చూసి వెంటనే ఎవరికో ఫోన్ చేసాడు. పిల్లవాణ్ణి తీసుకొచ్చాడు. 
చూడండి నేను అన్నానని అనుకోవద్దు మీపిల్లవాడి అభిరుచి అనుకరించి విద్య నేర్పించండి, ఈనాడు పిల్లల ఆలోచనలు చాలా మారినాయి, నేను డాక్టర్ చదివాను, నీవు డాక్టర్ చదవాలి అని వయసు తగ్గ జ్ఞానాన్ని కన్నా ఎక్కవ జ్ఞానం నేర్పించాలని ఆశించటం తప్పు. పిల్లలు అటు చదువుకోలేక యిటు వారి అభిరుచి ప్రకారము ఉండలేక ఈ చిన్న వయసులో భాధ పెడుతున్నారు తల్లి తండ్రులు. 
ఇంతకీ మా పిల్లవాడు మీకు ఎక్కడ దొరికాడు. 
చెప్పాం గదండీ మాపొట్ట నింపుకోవటానికి పిల్లలు వస్తున్నారు వారికి మాకు వచ్చిన విద్యలు నేర్పుతున్నాము పిల్లల అడ్రస్సులు అన్నీ మాదగ్గర ఉంటాయి ఏరోజుకారోజు పెద్దలకు తెలియ పరుస్తాము. 
ఈరోజు మాదగ్గరున్న పిల్లలు బ్రేక్ డాన్సు చేస్తుంటే మీబాబు చూస్తూ ఉన్నాడు అందువల్ల వెంటనే మీకు చెప్ప గలిగాను అన్నాడు ఆర్గనైజర్. 
మీరు అక్కడ ఇక్కడా తీరుగా కుండా ఉండేందుకు నేను ఒక స్కూలు పెడతాను దానికి మిరే మానేజర్, అయినా మీదగ్గర వచ్చిన పిల్లలకు డాన్సు చేయించి వాళ్లకు డబ్బులివ్వడం మంచిదా, క్షమించండి మా దగ్గరకు అందరూ బీదవాళ్ళ పిల్లలే వస్తారు అన్నాడు. 
ఏది ఏమైనా తప్పు ఈరోజుతో నీదగ్గర ఉన్న పిల్లలందరి చిరునామాలతో నాదగ్గరకు ఈ అడ్రస్సుకు వచ్చేయ్.పిల్లల అభిరుచి బట్టి మంచి విద్య నేర్పించే వయసు డబ్బు నాదగ్గర ఉన్నది వెంటనే కలవు. 
అట్లాగే సార్ . 
ఏమిటి మాధవ్ నీవు అన్నమాటలు నాకర్ధం కాలేదు, నీదగ్గర డబ్బు ఉందా, వాళ్ళను నీవు చదివిస్తావా 
చూడు రామచంద్రరావు గారు మనం మంచి తలంపుతో  చేసిన పనికి విఘ్నము ఉండదు అదే నా నమ్మకము, అప్పుడే ఫోన్ ఏమండి బాబు 
బాబును తీసుకోని వస్తున్నాను గాబరా పడకు వస్తున్నాను అన్నాడు రాధతో మాధవ్ . 

--((*))--                       

నాయకుని ఆదర్శం*(3)

ఆరోజు మాతృ దినోత్సవం. ఈసందర్భంగా కొత్తగా కట్టిన అనాధాశ్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అందులో వృద్ధుల్ని, మరోవైపు అనాధల్ని చేర్చుకొని భోజనాలు, దుస్తులు, ఇతర అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎంతోమంది తమ తల్లుల్ని సరిగా చూడక, పట్టించుకోకుండా ఆశ్రమాల్లో చేర్పిస్తున్నారు. ఆరోజు కొత్తగా ఎన్నికయిన ప్రజాప్రతినిధి గురునాథం గార్ని ప్రారంభోత్సవానికి పిలిచారు. ఉదయం నుంచే అనాధలు, వృద్ధులంతా పడిగాపులు కాస్తున్నారు. వాళ్లకొక ఆశ్రయం దొరుకుతోందని ఆశగా ఎదురుచూస్తున్నారు.
సభా కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిధులంతా వచ్చారు. ప్రసంగాలు వినిపించారు. వృద్ధులు, అనాధలపై జాలి చూపించారు.
‘దిక్కూమొక్కూ లేక చెప్పుకోటానికి నా అనే వాళ్లు లేని రోడ్ల మీద తిరిగే బిచ్చగత్తెల్ని, వృద్ధుల్ని చూస్తుంటే మా కడుపు తరుక్కు పోయింది. అందుకే అలాంటివారి కోసం ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాం. మీకందరికీ ఇక్కడ రక్షణ కల్పిస్తాం. ఈరోజు నుంచి మీరంతా ఇక్కడ నిర్భయంగా ఉండవచ్చు. ఇక్కడ మీకు కావలసిన సదుపాయాలన్నీ సమకూరుస్తారు. మీ లాంటి అనాధల కోసం, వృద్ధుల కోసమే ఈ భవనం కట్టించారు’ అంటూ గురునాథం గారు వేదికపై చేసిన ప్రసంగానికి జనం చప్పట్లు కొట్టారు.
ఒకసారి ఆయన అందరి వైపూ తేరిపార చూసి ‘నేను ఊరికే ఉపన్యాసం చెప్పే వాడిననుకొంటున్నారా? ఏదైనా చెప్పేటప్పుడు ఆచరించి చెప్పాలి అంటారు. అలాంటి వారిలో నేను మొదటి రకం వాడిని. ఇక్కడ చేరే వృద్ధులందరూ నా తల్లి లాంటివారు. నాకేమాత్రం స్వార్థం లేదు. అందుకే చేర్పిస్తున్నాను. మా అమ్మగారు నా మాట ఎప్పుడూ జవదాటదు. ఇక్కడుండే మహిళలందరికీ చేదోడువాదోడుగా ఉంటుందని మీకందరికీ మాట ఇస్తున్నాను’.. అనగానే మళ్లీ చప్పట్లు మార్మోగాయి. ఆ తర్వాత అందరూ ముక్కున వేలేసుకున్నారు.
‘ దుర్మార్గుడా! తల్లినని కూడా చూడకుండా నన్ను వృద్ధాశ్రమంలో చేర్పించి ఆదర్శవంతుడను అనిపించుకోవాలని చూస్తున్నావా? ఈరకంగా నన్ను వదిలించుకోవాలనుకున్నావా?’ అని మనసులోనే తిట్టుకుంటూ వేదికపైకి వచ్చింది సుబ్బాయమ్మ గారు.
‘అందరికీ నమస్కారం! ఇది వృద్ధాశ్రమం. కొడుకులుండి కూడా తల్లుల్ని సరిగ్గా చూడకుండా, పట్టించుకోకుండా, మంచానపడితే ఎక్కడ చాకిరీ చేయాల్సి వస్తుందోనని కన్నతల్లుల్ని వదిలించుకోవాలని మిమ్మల్ని ఈ ఆశ్రమంలో చేర్పిస్తున్నారు. అలాగే నా కొడుకు కూడా! ఎంతో ఆదర్శవంతుడు. ఏ పనైనా ఆచరించి చూపిన తర్వాతనే దాన్ని ఆచరణలో పెట్టే మనస్తత్వం వీడిది. చిన్నప్పటి నుంచీ రామాయణ, మహాభారత గాథలన్నీ, దేశ నాయకుల జీవిత చరిత్రలన్నీ విని వంట బట్టించుకున్నవాడు. ఈ ఆశ్రమంలో వృద్ధులే కాక మతిస్థిమితం లేని వాళ్లు, వికలాంగులు, ఎంతోమంది అనాధలున్నారు. నా కొడుకు గురునాథం కూడా మానసిక వికలాంగుడు. ఏం మాట్లాడతాడో పాపం.. తెలియని స్థితిలో ఉన్నాడు. నా కొడుకు బాగుపడాలని, వాడి మానసిక పరిస్థితి పూర్తిగా నయం కావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఏ తల్లయినా బిడ్డల క్షేమం కోరుకుంటుంది. అందుకే నా కొడుకుని ఇదే ఆశ్రమంలో చేర్పించి సరైన వైద్యం అందిస్తే తిరిగి బాగుపడతాడని ఆశిస్తూ ఇక్కడున్న అనాధలతో పాటు నా కొడుకు గురునాథంను కూడా చేర్పిస్తున్నాను. ఈరోజు నుంచి అనాధాశ్రమంలో నా బిడ్డకింత చోటు కల్పించాలని కోరుకుంటున్నాను’ అంటూ నిర్వాహకులను వేడుకుంది.
వేదికపై వున్న గురునాథం తల్లి మాటలకు షాకయ్యాడు. పళ్లు పటపటా కొరుకుతూ కోపంతో తల్లివైపు చూశాడు.
‘అమ్మా! ఏమిటి నువ్వు చేసిన పని. నన్ను ఈ అనాధాశ్రమంలో చేర్పిస్తావా? అసలు నువ్వు తల్లివేనా? నాకేం ఖర్మ ఇక్కడ చేరటానికి? నా ఇంట్లో సకల సౌకర్యాలతో రాజభోగం అనుభవిస్తున్నాను. అసలు నీకేం హక్కుంది నన్ను ఇక్కడ చేర్పించటానికి?.. అంటూ తల్లి మీద విరుచుకుపడ్డాడు.
‘ఒరే! అదే ప్రశ్న నేను నిన్నడుగుతున్నాను. పది నెలలు మోసి, కని, పెంచి, పెద్దచేసి ఇంతవాడిని చేస్తే తల్లి అనే గౌరవం కూడా లేకుండా ఈ ఆశ్రమంలో నన్ను చేర్చాలని తీసుకొచ్చావు. నిన్ను కూడా చేర్పిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీ కర్థమవుతుంది. మీనాన్న సంపాదించిన ఆస్తిలో సగం వాటా నాది. ఆస్తి వదులుకుని అనాధాశ్రమంలో ఉండాల్సిన అవసరం నాకు లేదు. నీలాంటి కొడుకులకు బుద్ధి చెప్పాలంటే ఒకటే మార్గం. నా వంతు ఆస్తిని ఈ ఆశ్రమానికి విరాళంగా రాస్తున్నాను. నేను ఇక్కడే ఉండటానికి నిర్ణయించుకున్నాను’ అంటూ వేదిక పైనుంచి దిగి వృద్ధుల్లో కలిసిపోయింది సుబ్బాయమ్మ. గురునాథం గుండె ఆగిపోయినంత పనైంది.
సేకరణ అంతర్జాలం - తాటికోల పద్మావతి,
=-((**))-


మల్లాప్రగడ రామకృష్ణ కధలు  -4

రాధాబాయ్.
అది ఒక చిన్న గ్రామం, నగరానికి దూరముగా ఉన్నది,  సూర్యుడు ఉదయిస్తున్నాడు, పల్లెవాసులు మేల్కొంటున్నారు, కాలకృత్యాలు తీసుకొని నిత్య విధులకు ఉపక్రమించుటకు ప్రయత్నం చేస్తున్నారు, పేపేరు కోసం ఎదురు చూస్తున్నారు, ఇక్కడే రెండు ఎకరాల విస్తీర్ణంలో పూలచెట్ల మధ్య చుట్టు కొబ్బరి చెట్లు ఉన్న ప్రాంతము నందు ఒక ఆశ్రమము కాదు, అది స్త్రీ బాధిత రక్షణ హనుమాన్ నిలయం, దీనిని
నిర్వహిస్తున్నది రాధాబాయ్ గారు, ఈమెకు పెద్ద వయసు ఉంటుందనుకున్నారో పప్పులో కాలేసినట్లే కేవలము 40 వత్సరములు ఎప్పుడు పచ్చటి వస్త్రములు ధరిస్తూ స్త్రీ రక్షణా కేంద్రముగా భాద్యతలు వహిస్తున్నది.

అప్పుడే టివి, రేడియో, పత్రికా, విలేఖరులు వచ్చారు మీరు స్త్రీల కోసం ప్రత్యేకంగా ఏర్పటు చేయడంలో అంతరార్ధం ఏమిటి ?
మీలో స్త్రీలు ఎవరు లేరా వారే చెప్పగలరు దీనికి సమాధానము, నేను చేసే పనుల్లో తప్పులుంటే నాకు తెలియపరచండి లేదా నేను స్త్రీలకు ఏమిచేయాలో మీరు తెలియ పరచండి అని అడిగింది వచ్చిన విలేఖరులను రాధాబాయ్.
అందులో వచ్చిన ఒకరు మేము అడిగిన వాటికి సమాధానములు చెప్పకపోతే మేము వ్రాసే వ్రాతలకు భాధ్యతలు మీరే అన్నాడు.
ఎవరో ఆమాట అన్నది అతన్ని ముందుకు రమ్మన మనండి , ప్రశ్నలు అడగమనండి
మీరు ఆడవారిని ఆదరించినట్లు నటిస్తున్నారని నాకు అనుమానం అది నిజమేనా?
మీ అమ్మగారు, మీ చెల్లి అక్క గాని ఇక్కడ చేర్చండి పూర్తిగా ఉచిత వసతి, భోజనము, విద్యలు నేర్చుకొనుటకు అవకాశము కల్పిస్తాను, పంపించండి వారే మీకు సమాధానము చెప్పగలరు. ఎవరైనా సరే అభ్యంతరము లేదు
మీరు చందాల రూపములో తీసుకుంటున్నారు అని  తెలిసింది  అది నిజమేనా.
మీకు ఆధారాలు ఎమన్నా ఉంటె చూపి అడగండి, ఆధారాలు లేకుండా ప్రశ్నలు వేయకండి.
ఆధారాలు మాదగ్గరున్నాయి రేపు సమాధానములు మీరే చెప్పు కోవాలి తెలుసా.
చూడండి నేను సత్యం, ధర్మం, న్యాయం మా ఆయుధాలు "విద్య, వ్యాయామము, ఉచిత భోజనము, వసతి, చేతికి పనికల్పించటం  మరియు నిత్యము వేద పండితులచే ధర్మ బోధలు "
చివరగా స్త్రీలకు మీరు చెప్పేదేమిటి ఏదైనా చెప్పండి
నేను ఒకటే చెప్పేది స్త్రీలకు  
             
ఓ వనితలారా  ఓ వనిత లారా, తెన్ను తప్పి పోబోకు, నిన్ను నువ్వు కోల్పోకు, నీకున్న ధర్మాన్ని ఆచరించుటలో కష్ట నష్టాలను తెలిపుకొని బ్రతుకుదాం, నలుగురికి సహాయ పడుతూ సాగుదాం  

ఆగకుండా కదిలిపోతూ, సాగి పోదాం, స్త్రీ శక్తి నిరూపిద్దాం, అడ్డులన్నీ దాటుకుంటూ, ఎదురుదెబ్బలు తగిలితే, బెదిరింపులు కలిగితే, ఆగిపోకుండా సాగుదాం

భయంతో ఆగిపోకు, న్యాయ పయనాన్ని ఆపబోకు, ఎదురు నిలిచే వారిని చూసి అదిరిపోకు, బెదిరించిన
బెదిరిపోకు, నీవు నమ్మిన సిద్ధాంతాన్ని అనుకరించి సాగిపోదాం … సాగిపోదాం ..

ఎంతదూరం సాగినా, ఎన్ని మలుపులు తిరిగినా, అలసిపోకు, సొలసిపోకు, అలసిపోయి
సొలసిపోయి, జీవితాన్ని అర్పించి నష్ట బోకు, ధైర్యమే ఆయుధముగా సాగిపోదాం  సాగిపోదాం  ఓ వనిత లారా ... .

ధైర్యం విడవకు, పిరికి దానిగా మారకు, నీకెవరూ దిక్కులేరని, నీకెవరూ తోడు రారని, నెన్నెవ్వరూ  గుర్తించ లేదని, మన్ననంటూ నీకు లేదని, రోదించకు, బాధపడుకు, బాధపడుతూ-నీ ప్రజ్జను
వేధించకు, కష్టాలకు లొంగకు, కలతలకు అందకు, నష్టాలకు కుంగకు, నైజాన్ని వీడకు, పెద్దలను గురువులను ప్రేమిస్తూ సాగిపోదాం …వనితలారా , సాగిపోదాం … వనితలారా

ప్రతికూల పరిస్థితులను, చెండాడుతూ, చీల్చుకుంటూ, సాగిపో వనితా సాగిపో వనితా, నీకు ఆదర్శ్యం  ఉదయభాను కిరణాలుగా చీకటిని తరిమి వెలుగును నింపే పద్దతిలో జీవించుదాం .. సాగిపోదాం …వనితలారా , సాగిపోదాం … వనితలారా

భారత్ మాతాకి జై, నన్ను కన్న తల్లి తండ్రులకు జై, విద్య నేర్పిన గురువులకు జై, పంచ భూతములకు జై, రక్తమంతా వక్కటే, దేశాన్ని సస్యస్యామలంగా మార్చటమే మాధ్యేయం, మా సత్ సంకల్పానికి అందరి సహకారం అవసరం, కలసి మెలసి బ్రతుకుదాం, సాగిపోదాం …వనితలారా , సాగిపోదాం … వనితలారా, సాగిపోదాం …వనితలారా , సాగిపోదాం … వనితలారా
    
అంటూ పాట పాడింది రాధాబాయ్
అక్కడకు వచ్చిన విలేకర్లు అందరు ఆపకుండా చప్పట్లు కొట్టారు

చప్పట్లు కొట్టడం కాదు మీవంతు సహాయంగా ఏమి ఇవ్వగలరో చెప్పండి అన్నది.
అందరూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు.

మేము మీ ఖ్యాతిని, తెలివిని, మీరు చేసున్న కృషిని ప్రపంచ ప్రజలకు తెలియ పర్చాలను కున్నాము
అన్నారు.
నేను ఒకటే చెపుతాను అన్నం తింటేనే ఆకలి తీరుతుంది, అన్నాన్ని చుస్తే ఆకలి తీరుతుందా ?
అట్లాగే నాకు ఎవరి ప్రచారము అవసరము లేదు, మా సహాయము పొందినవారు చెప్పే వాక్యాలే మాకు ప్రచారాలు అన్నది.

అయితే ఇంట పెద్ద ఆశ్రమం కట్టడానికి ఎవరి సహాయము డబ్బు తీసుకున్నారో తెలుపుతారా అని అడిగాడు.

మీరు ఇక్కడకు రావడానికి నెంబరు షిప్ రుసుము కట్టారు కదా అదే మాకు పెట్టుబడి, నిత్యావసర వస్తువులు శుభ్రపరచి ప్యాకెట్లద్వారా తక్కువధరకు ఇవ్వడం, పేదలకు వస్త్రములు తక్కువధరకు అందచేయడం మా ఉద్దేశ్యం.

నేను సహజముగా కోటీశ్వరు రాలను, ఇంతమంది సాహాయ్యము తో ఇంకా సంపాదించ గలిగాను ప్రభుత్వానికి తగు విధముగా టాక్సు కడుతున్నాను.
నానినాదం

" సువాసన పువ్వువై ఆకర్షించి పరిమళాలను పంచు
  వెలుతురు దీపమై హృదయాంతర వేదన తొలగించు
  దుర్మార్గాన్ని ధైర్యంతో ఎదుర్కొని ధర్మాన్ని రక్షించు
  దేవుణ్ణి, గురువు,పెద్దల్ని, ప్రేమించి జీవితం సాగించు "
                 
మీ భర్త,  మీపాప విషయాలు గురించి చెపుతారా.
ముందు మీ కందరికీ భోజనాలు ఏర్పాటు చేసాను, భోజనము చేసిన తరువాత కొన్ని విషయాలు తెలుసు కోగలరు, మీకందరికీ ధన్యవాదములు తెలియపరుస్తూ ఇప్పటికి ముగిస్తున్నాను, మరల మధ్యాన్నం 3 గంటలకు మంచి విషయాలు తెలుసు కుందాము అని చెప్పి లోపలకు వెళ్ళింది రాధాబాయ్.      

విలేఖరు లందురూ ఒకచోట చేరిన వారితో రాధాబాయ్ చెప్పటం మొదలు పెట్టింది. 
మీరు సమయ పాలన చేసే వారని నాకు తెలుసు, మావారి పేరు మాధవ్ పోలీస్ ఆఫీసర్, ఒకరోజు డ్యూటీ లో  ఎదో ఫోన్ రావటం వల్ల అక్కడికి వెళ్లారు, అక్కడ ఒక అమ్మాయిని దారునంగా   బలాత్క రించి చంపేశారు, వారితో పోరాడటం వల్ల  కొంత మంది చనిపోయి కొందరు పారి పోయారు, దుర్మార్గుల కుట్రకు  నా భర్త కూతురు బలై పోయారు, మావారి చివరి కోరిక స్త్రీలకు ధైర్యము కల్పించే ఆశ్రమమును స్థాపించి ధైర్యవంతులుగా మార్చే శక్తి మనం ఆరాధించే ఆంజనేయుడే మనకు రక్షణగా ఉంటాడు, నాకు మన పాపకు బ్రహ్మ వ్రాసిన కాలము వచ్చింది, నీ ధైర్యమే నీ కుబలం, నీ ఊపిరి నీకు శక్తి అంటూ నేలకు ఒదిగారు, కళ్ళవెంబడి నీరు కారుస్తూ అందరికి నమస్కారము చేసినది, విషాద గాధ విని అందరూ అలా ఉండి పోయారు .



           --(()))--

నోట్లమార్పిడి ? (కధ ) (5)


గురువుగారు మన ఆశ్రమంలోకి  ఎవరో కారులో వచ్చారు  మీ దర్సనమ్ కోసం అన్నాడు శిష్యుడు, మనం బ్రతుకు తుంది వాళ్ళ మీదే కదా వెంటనే  రమ్మన మని చెప్పు  అన్నారు గురువుగారు. 
నమస్కారాలతో స్థిరాసనముల మీద ఎదురెదురు  కూర్చొని ఉన్నారు. 

మీరొచ్చిన పని గురించి., మీరు భయ పడ నవసరంలేదు, శిష్యా  బ్యాగ్ తీసుకోని రశీదు  ఇవ్వు  అని చెప్పాడు గురువుగారు. 
గురువుగారు నన్ను క్షమించండి అవి రెండు వేల  నోట్లు,  తెలుసు నాయనా వాటిని మార్చే  పద్ధతులు మాకు తెలుసు, నీవు అంతా  శ్రీ కృష్ణార్పణం అని తలుచుకో, మీ  లాంటి వారి దయ వలనే కదా ఈ   ఆశ్రమము నడప గలుగు తున్నాము. అందరికి ఎవ్వరూ న్యాయం చేయలేరు అంటూ గురువుగారు లేచారు,  వచ్చిన వ్యక్తి  లేచాడు

మేము ఇచ్చే ప్రసాదము తీసుకోని మరి వెళ్ళండి, ఇక మీరు నిశ్చింతగా నిద్రపోవచ్చు, మీరు ఇచ్చిన మావంతు తీసుకోని మిగతా వాటితో ఇక్కడ భవనము  నిర్మిస్తా ను అది మీ పేరుతో, ఈ రశీదు జాగర్తగా ఉంచుకోండి ఇన్కమ్ టాక్సు వారు అడిగితే  చూపండి అని చెప్పాడు.

ఏమిటండి రశీదు మీద ఈరోజు డేటు ఉన్నది. అది మీ జాగర్త, మా జాగర్త కోసం ఇవ్వటం జరిగింది. గురువుగారు వచ్చినవారు వెళ్లారు మరి మనం ఏం చేద్దాం ఈ డబ్బుతో ఎట్లా మారుస్తాం, మన బిల్డింగ్ కాంట్రాక్టర్ కు ఇచ్చివేయ్ అతను  చూసు కుంటాడు, అట్లాగే చేస్తాను గురువుగారు. మరి ఎం ఇంకా నుంచున్నావు.
కొందరు డబ్బును దుర్వినియోగం చేస్తున్నారు. ఎందుకు ?

అందరికి ఎవ్వరూ న్యాయం చేయలేరు, కొందరు వారు ఎలా సంపాయించారో అలాగే ఖర్చుపెడతారు నీకు తెలుసా చెపుతా విను   
                       
భారత ప్రభుత్వము నోట్ల మార్పిడికి కొందరికి భయము, చెమట పట్టించింది. పుకార్లు పుట్టించారు, ప్రజను రెచ్చగొట్ట దలిచారు కానీ ప్రభుత్వము వారు కట్టు దిట్టముగా నోట్లు విడుదల చేశారు, కొన్ని జాగర్తలు    తీసుకుంటున్నారు   ప్రభుత్వము వారు కృషి చేస్తున్నారు ప్రభుత్వము లక్ష్యం నల్ల కుబేరులను బయట పెట్టడం, బీదలకు అందుబాటులో కొత్త నోట్లు తేవడం వారి లక్ష్యం 
      
నల్లకుబేరుల గుండెలో ఒక్క సరిగా గణ గణ గంటలా గుండె మ్రోగు తున్నది, 500,1000 రూపాయల నోట్లు ఏంచేయాలో తెలియక రకరక పద్దతిలో సద్వినియోగం, దుర్వినియోగం చేస్తున్నారు మహా మనుషులుగా చెలామని అవు తున్నారు.

44 లక్షల నోట్లను దేవాలయ హుండీలో వేసి వెళ్లారు ఒక  అజ్ఞానవ్యక్తి 

లారీలో లక్షలు తరలిస్తు  యాక్సిడెంటు తో ఒకచోట దొరికి నట్లు, ఇద్దరు పట్టుకున్నట్లు  వివరాలు తెలుసుకోవాటాకి పోలీసులు ప్రయత్నిస్తున్నారు

నడిబజారులో నోట్ల ముక్కలుగా చింపి కుప్ప  గమనించారు  అలా అట్లా ఎవరుచేసారో వెతుకుతున్నారు, పోలీసులు.

కొందరు   మధ్యవర్తులద్వారా బ్యాంకు లో కట్టవలసిన లోన్ల క్రింద కట్టేస్తున్నారు.
మరి కొందరు బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు కొంటున్నారు.

కొందరు బ్యాంకులో ఉన్న మేనేజర్ లను లోబరుచుకుని నోట్లు మారుస్తున్నారు. 

ఏది ఏమైనా ప్రజలు చిల్లర దొరకక కష్ట పడుతున్నారు. 
నిజమే శిష్యా  ప్రభుత్వమువారు 100 నోట్లు అందుబాటులో తేకుండా చేయటం, ఏ.టి.యంలు బందు చేయటం, బ్యాంకులో మాత్రమే నోట్లు మార్చుకోవాలని చెప్పఁటం, కొంత  దురదృష్టకరం అని నా కనిపించింది. 
దీనివల్ల వ్యాపారాలు పడిపోయినాయి, రియల్ ఎస్టేట్ పడిపోయింది, పెళ్లి ళ్లు ఆగి పోయినాయి, ఇంకా ఎన్నో మరి ఎన్నో . 

గురువుగారు మారేది లేదా, ఎందుకు మారదు అంతా మారుతుంది, గోరంత  కష్టాన్ని కొండంత కష్టముగా కొన్ని టీవీలు చూపుతున్నారు, కొందరి       బాధలను  చూపేడు తున్నారు, ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్నారు అది తప్పు, ఇప్పుడు మనం ఇస్తున్నట్లు 2000 నోట్లకు చిల్లర, వారు కూడా ఇవ్వటానికి ప్రయత్నిమ్చాలి.                 

ఎవ్వరూ కష్టపడకూడదు, కష్టాలు సాస్వితముగా ఉండవని తెలుసుకోండి.   

*.పెద్ద నోట్లు కష్టమనుకోకు

వేల రూపాయల నోట్లు
కళ్ళ ముందు కదిలి పోతున్నాయే   
మనసులో ఉన్న ఆశలన్నీ
నీరు కారి మరిగి పోతున్నాయే 

2000 రూపాయల నోటుతో
దిక్కులు తిరిగినా చిల్లర దొరక దాయే 
సుఖము దేవుడెరుగు
తిండిలేక దు:ఖముతో నిద్ర రాదా యే

ప్రజలకు ఆశల సంకేతాలు
ఎన్నిఉన్నా ఆచరణ సూన్యమాయే 
గడవబోయే కాలం దృష్టిలో
పెట్టుకొని ధైర్యంగా బ్రతకాలోయి

జ్ఞాపకాల కలలు వమ్మైనా
కరిగిపోయినా నోట్లతో భాద పడకోయి 
స్నేహమే నవ్వుగా అంతా
మనమంచి కోసమే అని భావించాలోయి

కలతలు వదలి సంతోషముతో
నోట్లు మార్చుకొని జీవించాలోయి 
లెక్కలు లేని నోట్లు ఉన్నా,
అలవికాని చిక్కులున్నా బెదర కోయి  

చేరలేని దూరాన్ని చేరుస్తూ,
మమకారపు తీరాలు చూడాలోయ్
ఎదురు చూపులకు కావాలోయ్,
ప్రేమ ఫలితాలికి కావాలోయ్   

కొత్తనోట్లను వాడండి ,, పాతనోట్లు బ్యాంకులో జమా చేయండి  

--((**))--

ఆదివారం: "5 " కధలు  మరియు 
సోమవారం: మహాశివుని కధలు 
మంగళవారం: సుందరకాండ చరిత్ర 
బుధవారం : శ్లోకాలు, సూక్తులు 
గురువారం : పురాణాలు, భగవద్గీత     
శుక్రవారం : లలితా సహస్త్ర నామ భాష్యం 
శనివారం : విష్ణుసహస్రనామ భాష్యం

No comments:

Post a Comment