మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు
మనస్సును శాంతింప చేసేందుకు
మనో నిగ్రహాన్ని అందించేందుకు
మనస్సును రంజింప చేసేందుకు
ప్రధాన పాత్ర మహిళలకే ఉన్నది
మమకారంతో సుఖం పంచేందుకు
అధికారంతో కఫ్టాలు ఎదుర్కొనెందుకు
సహకారంతో ప్రయానించెందుకు
ప్రధాన పాత్ర మహిళలకే ఉన్నది
జీవితం సశ్యశ్యామళంగా మారెందుకు
కుటుంబం గౌరవమర్యాదలను నిలిపేందుకు
వినయం విధేయత పదికాలాలు బతికేందుకు
ప్రధాన పాత్ర మహిళలపై ఉన్నది
కన్న బిడ్డలను చదివించి సాకేందుకు
ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు
మన్ననతో మానవత్వాన్ని బతికించేందుకు
ప్రధాన పాత్ర మహిళలపై ఉన్నది
కళను వృధ్ధి పరిచేందుకు
కళ ద్వారా ఉళ్ళాస పరిచేందుకు
కళతో కార్యోన్ముఖునిగా మార్చేందుకు
ప్రధాన పాత్ర మహిళలపై ఉన్నది
మహిళలను గౌరవించి ఆదరించుటకు
ప్రధాన పాత్ర మగవారికి కూడా ఉన్నది
--((**))--
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు
మల్లాప్రగడ రామకృష్ణ
త్యాగానికి మారు పేరు,
తనమయత్వానికి మరో పేరు
తారతమ్యం చూపక ప్రేమ పంచే పేరు
తామరాకుపై నీటిబిందువు బతుకు పేరు
తనకతానే సర్వం అర్పించుకునే వారు
మహోన్నత శక్తిని పంచే మహిళలే వారు
మగవాని హృదయంలో దాగి ఉండేవారు
మగవాని అర్థ శరీరంలో దాగి ఉండేవారు
మగవాని నాలుకపై దాగి ఉండేవారు
మగవాని తో జీవితాన్ని పంచి ఉండేవారు
మహోన్నత యుక్తిని పంచే మహిళలే వారు
నిద్దురలేస్తు యంత్రంలా తిరిగే వారు
వంటచేసి అందరి ఆకలి తీర్చేవారు
బిడ్డలను బడికి పంపి ధైర్యం చెప్పేవారు
బిడ్డలను చదివించి భర్తను నిద్రపుచ్చే వారు
మహోన్నత ముక్తిని పంచే మహిళలే వారు
--((**))--
No comments:
Post a Comment