Sunday, 3 March 2019



ఓం నమః శివాయ...ఓం నమః శివాయ...ఓం నమః శివాయ...

సంపాదించిన "అస్థి పాస్థులు" ఏమి లేవు "పరమేశ్వర"
అనుగ్రహించే "ఐశ్వర్యం" తప్ప.....
పోగొట్టుకున్న "బంధాలు" "అనుబంధాలు" ఏమి లేవు...
ఈశ్వరుని సేవాకు అంటకమైన "సంకెళ్ళు" తప్ప....
పుణ్యకార్యములాచరిస్తూ, చిత్తమంతయు నీపై ఉంచుట తప్ప 
మనస్సు సక్రమ మార్గంలో ఉంచవా ఓం నమః శివాయ

అంటూ ఉపనిషత్తులు, భగవద్గీత మున్నగు ప్రామాణిక గ్రంధములందు గల ధర్మ రహస్యములను సర్వ జనులకు అర్ధమయ్యే విధముగా "తత్వసారము" లను 
ఆ పరమేశ్వరుడు తెలిపినంతవరకు తెలపాలని మహాశివరాత్రి సంధర్బముగా వ్రాయుటకు సంకల్పించాను  చక్కగా మననము చేసుకొని ఆనందానుభూతిని బడయగలరని విశ్వసించు చున్నాను. 
        
ప్రాంజలి ప్రభ  "ఆత్మీయ" మిత్రులందరికీ, మరియు ప్రతిఒక్కరికి మహా శివరాత్రి శుభకాంక్షలు
                                                                     
                                                                     మీ మిత్రుడు..
                                                               మల్లాప్రగడ రామకృష్ణ 
                                                                    ప్రాంజలి ప్రభ 

ప్రాంజలి ప్రభ - తత్వసారము (1 ) 


తత్వసారము తెలుసుకోరన్నా 
సద్గురినిచేంత, నిజము కనుగొని లాభమొందన్నా ....2 

ఆలుబిడ్డలు వెంట రారన్నా 
నిజమెఱిగి నీవు, బంధుజాలపు మమత విడన్నా  ....

తనువు నిత్యము కాదురోరన్నా 
ధరణిపై నది ఎల్లకాలము ఉండబోదన్నా ....

గీత సతతము ఆశ్రయించన్నా 
ఉపనిషత్తుల సారమే యది తెలుసుకోరన్నా ..... 

పాముకాదు తాడురోరన్నా
దీప కాంతిలో, సత్య విషయము తెలుసుకోరన్నా ....

తనువు చూసి మురిసిపోకన్నా 
మట్టిబొమ్మది అందమేమియు లేదు లేదన్నా ..... 

మట్టి వంటిది దేహమోరన్నా        
జడమైనది యది, చిత్వరూపము కాదు కాదన్నా ....

మనసుపైన జయము పొందన్నా 
ఇంద్రియంబుల, టక్కు చూసి మోసపోకన్నా 

పాము పాము అని కేక వేయకురన్నా
పాము కాదది, చేదబావి త్రాడు మాత్రమేరన్నా 


ఓం నమః శివాయ...ఓం నమః శివాయ...ఓం నమః శివాయ...
--((**))--   

ప్రాంజలి ప్రభ - తత్వసారము (2 )

ఓం నమః శివాయ...

మనసుతోటి పోరు సలపన్నా 
మలినచిత్తము ముక్తిపథమున అడ్డుయగునన్నా ....

విషయమందున ఆశవలదన్నా 
అనుభవించినకొలది ఆశపెరుగు తరగిపోదన్నా....

దేహనౌకను కొంటివోరన్నా
విలువగలిగిన వస్తువియ్యది తెలిసికోరన్నా .....

రేపు రేపని పలకవద్దన్నా 
తల్లితండ్రుల సేవలో వాయిదావేయవద్దన్నా .....

సుఖము వెలుపల లేదురోరన్నా
ఎల్లసుఖము ఆత్మానందంలో కలదురోరన్నా ....

దృశ్యమందున ప్రీతియుంచకురన్నా 
దృక్స్వరూపమునందు ప్రితికలిగియుండురన్నా ...

ఆయువేమియు స్థిరముకాదన్నా
త్వరగ దేవుని పాదకమలము శరణువేడన్నా ....

పామరత్వము పారద్రోలన్నా 
దైవ విద్య లేమిచె మానవత్వము వ్యర్ధమగునన్నా ....

జీవబ్రహ్మము లేకమేయన్నా 
వారి ఐక్యము తెలసి బంధము తొలగద్రోయన్నా ....

ఓం నమః శివాయ...ఓం నమః శివాయ...ఓం నమః శివాయ...


--((**))--

ప్రాంజలి ప్రభ - తత్వసారము (3 )
ఓం నమః శివాయ...

మట్టిబొమ్మవు నీవు కాదన్నా 
పరమార్ధపు సత్యము జాగుచేయక తెలిసికోరన్నా .......

కామదాసుడు కాకుమోరన్నా 
కామంబు శత్రువని గీతాశాస్త్రము పలుకుచున్నాదన్నా......  

విశ్వమంతా దేవుడే ఉన్నారన్నా 
నీహృదయంలో నాహృదయంలో ఉన్నారని తెల్సుకోరన్నా.....

రామనామము నీకు శరణమన్నా 
యెల్లఁవేళల తారకంబును జపము చేయుమురన్నా ....

ప్రణవమంత్రము జపము చేయరన్నా 
ఓంకారనాదము ఇల్లదిక్కుల మారుమ్రోగురన్నా ....

దైవనామము ఉచ్చరించురన్నా 
తారకంబది భవసాగరంబును దాటవేయరన్నా ....

రక్త మాంసపు తోలుబొమ్మన్నా 
కాయమందున సారమైనది ఒకటి లేదన్నా .... 

జన్మ జన్మకు కర్మ అంటురన్నా 
నరజన్మమునందు కర్మ జ్ఞాన భక్తి  వైచుమురన్నా ...

తత్వ మర్మము తెలుసుకోరన్నా 
బ్రహ్మ సత్యము అచంచలము పలుకుమొరన్నా .... 


ఓం నమః శివాయ...ఓం నమః శివాయ...ఓం నమః శివాయ...

--((**))--

ప్రాంజలి ప్రభ - తత్వసారము (4 )


ఓం నమః శివాయ...

భోగములకై  ఆశపడకన్నా  
భోగంబుచేతను యోగమంతయు దూరమగునన్నా ...  

సజ్జనంబుతే మైత్రి చేయరన్నా
దుర్జనంబును దూరదూరము విడిచిపెట్టన్నా ....

భారమేమియు లేకయుండన్నా    
దృశ్యవస్తువు భారమేయని తెలిసికోరన్నా ....

దృశ్యవస్తువు నమ్ముకొనకన్నా
కనిపించువస్తువు కాలమందున లీనమగునన్నా .... 

బింబసుఖమును కోరుకనుమన్నా 
ప్రతిబింబసుఖము, ఎంతయైనా విలువలేదన్నా .....

బ్రతుకు పరిమితి అల్పమోరన్నా 
చిగురాకు అంచును అంచుబొట్టును పోలి యుందన్నా ... 

మాయవలలో చిక్కుపడకన్నా 
బహుజాగరూకతతో దానిజాడలు తెలుసుకోరన్నా ....

విషయసుఖము కోరబోకన్నా 
ఆత్మశాంతికి భంగకరమే యగును ఒరన్నా ...

పుణ్యకార్యము వదలబోకన్నా 
పుణ్యంబుచేతను పాపమంతయు భస్మమగునన్నా ...


ఓం నమః శివాయ...ఓం నమః శివాయ...ఓం నమః శివాయ...

--((**))--

ప్రాంజలి ప్రభ - తత్వ సారం (5)

ఓం నమ: శివాయః

జ్ణాన యోగము నాశ్రయించన్నా
జ్ణానసిధ్ధికి భక్తి కర్మలు సాయపడురన్నా ......

మాయ యోక్క మర్మమెరుగన్నా
ఉన్నదానిని లేనిదానిగ చూపునో రన్నా......

ధ్యాన నిష్టను అభ్యసించన్నా
ధ్యాన మందును చిత్త మిటునటు కదల రాదన్నా......

ఎన్ని తిన్నను తృప్తి లేదన్నా
భోగ జాలపు అనుభవానికి అంతు లేదన్నా...

మనిషి కాయువు అల్పమోరన్నా
నూరు ఏడుల వయసు కలదని మురిసి పోకన్నా....

కాలమంతయు విలువ గలదన్నా
బహుజాగరూకతతో దానినంతను గడుపుకోరన్నా.....

జీవితం బతి చంచలంబన్నా
విశ్వమందున చెంచలత్వము లేనీదేదన్నా...

నిన్ను నీవు తెలీసికో రన్నా
నిన్ను తెలియక ఏది తెలిసిన వ్యర్థమేనన్నా....

పంచకోశములోన యుందన్నా
ఆత్మ దీపము తెరల వెనుక దాగియుందన్నా.....
(అన్నమయ, ప్రాణమయ,మనోమయ, విజ్ఞానమయ,ఆనందమయ..పంచకోశములు)

--((**))--

 ప్రాంజలి ప్రభ - తత్వ సారం (6)
ఓం నమ: శివాయః

గర్వభావము వదిలి వేయన్నా 
సృష్టి లోన భూమియంతో స్వల్పమగునన్నా ...

దైవచింతన కలిగి  యుండన్నా 
నిద్ద్రలేవగా దైవనామము స్మరణ చేయన్నా .... 

ఎట్టిప్రాణికి కీడు వలదన్నా 
కీడుచేసిన నిన్ను నీవే కొట్టినట్లన్నా ....

దేహమందున సొగసు లేదన్నా
సొగసు అంతయు ఆత్మలోఁ కలదురోరన్నా ....  

క్షణికమైనది జీవితంబన్నా 
పరమార్థ తత్వము జాగుచేయక తెలుసుకోరన్నా ...

దివ్యమంత్రము జపము చేయన్నా 
పరమాత్మ కృపచే సాధనంబులు సుళువు అగునన్నా ...

కాలమెంతో విలువ కలదన్నా 
క్షణమైనా దానిని ఖచేయకు భోగమందన్నా 

గీతవిద్యను చదువు కోరన్నా 
అద్దానియందున, ఉపనిషత్తుల సారముందన్నా ...

సాధనంబును చేయవలెనన్నా 
అనుభూతియంతయు సాధనంబుచె గట్టిపడునన్నా ...  


ఓం నమః శివాయ...ఓం నమః శివాయ...ఓం నమః శివాయ...

--((**))--

--((**))-- 


Image may contain: 2 people



No comments:

Post a Comment