Monday, 26 September 2016

నీ ముఖ బింబాన్నిమరువ లేను

 ఓం శ్రీ రామ్ - ఓం శ్రీ కృష్ణ 

 

యత్నం నా యజ్ఞం 

మొసలి నోటనుబడ్డ కరిరాజు మొరలిడగ 
బిరాన పరగెత్తి బ్రోచావు, వరదుడవు! 
అరుపులే వినబడున? ఆర్తి కనబడదా? 
ఏమాయె నీ కరుణ? ఎందుకీ జాగరణ? 

ముదుసలిచ్చిన పండ్లు ముదమార తిన్నావు, 
యెదలోన చోటిచ్చి ఆదుకున్నావు! 
నా కర్మఫలములు ఇంక పండనే లేదు, 
పచ్చి కాయలు స్వామి, నీకెట్ల పెట్టమంటావు? 
పాదాల చెంతనే చిత్తాన్ని నాటాను, 
పందిరై నీవుంటే పరిపక్వమౌతాను, 
ఆత్మ అర్పణ చేసి సంతృప్తి పడతాను! 

ఊగు సాయము సేయు ఉడుతనే గమనించి 
ఆదరించానంటూ చేవ్రాలు ఇచ్చావే! 
నా లోన కదలిక కనిపంచదా స్వామి? 
రాత మార్చను రాకుంటివిదియేమి? 

అటుకులిచ్చిన వాడే ఆప్తుడని అంటే, 
అదేం కుదరదు, ఒప్పుకోను, నేనూ నీతో 
దాగుడుమూతలాడుతూ దారి తప్పాను! 
కాలం కళ్ళు కప్పి నీనుండి వేరుచేసింది, 
కలి చేతుల్లోకి కర్కశంగా విసిరివేసింది! 
దూరమై విలపిస్తున్నాను, 
చేరువవ్వాలని తపిస్తున్నాను! 

నాకు తెలిసిందొకటే వేదం, ఆర్తి నాదం! 
నాకు తెలిసిందోకటే మంత్రం, హరే రామ, హరే కృష్ణ! 

అర్థం చేసుకో తృష్ణ!



ఓంకారంబతి సుందరం
బదియె వేదోపాంగ సారంబుగా,
ప్రాకారంబులవే
దిశాంతములుగా రాజిల్ల మోదంబుగా,
శ్రీకారంబగుచున్
శుభాలనిడు నిశ్శేషా విశేషంబుగా,
ఆకారంబులు లేని
భావమగుటన్, ఆదివ్య మంత్రంబుగా!
29/9 నా పాట 

నీ ముఖ బింబాన్నిమరువ లేను
నీ అమాయకపు చూపులు వదల లేను 
నీ చిరు దరహాస మాటలను మరువ లేను

నా మదిలో నీ ఉనికిని విడువ లేదు
నీ దర్శన కోరే నా మనసు వేదన తగ్గ లేదు
నీ ఒక్క ఓదార్పు కోసం జీవిస్తున్నాను
నా బ్రతుకులో అనుక్షణం నీకోసం
అన్వేషణా, ఆరాధనా తప్పుట లేదు  

నీ ముఖ బింబాన్నిమరువ లేను
నీ అమాయకపు చూపులు వదల లేను 

నీ వెక్కడున్నావో తెలియని భ్రమలో ఉన్నాను
నీ కొరకు సందిగ్ద మనస్సుతో తిరుగు తున్నాను 
నీ కొరకు మరణ శాసనాన్ని ఆహ్వానిస్తున్నాను
నీ కొరకు ప్రేమ తపస్విగా మారి యున్నాను

నీ ముఖ బింబాన్నిమరువ లేను
నీ అమాయకపు చూపులు వదల లేను 

ఇప్పుడు నాకు పంచ భూతాలు ఆప్తులు
తరువులు నాకు దోస్తులు

చరిత్రలో అల్లన మెల్లన వలపులు
చల్లని వెచ్చని కలిపే హృదయం నీది
చీకటి వెన్నెలలో మరిపించే
రసిక రాసకేళి మనసు నీది
పులకించే కనులతో వెదికే
కలలు పండించే సహృదయం నీది

నీ ముఖ బింబాన్నిమరువ లేను
నీ అమాయకపు చూపులు వదల లేను 
ఈ మట్టిలో కలిసే లోపు నేను తెలిపే
నిజం తెలుసుకో, నాకోసం ఒక్క కన్నీటి
చుక్క రాల్చు, అంతకన్నా నేను
ఏమి కోరేదిలేదు, నేను వ్రాసిన
ప్రేమ సుఘందాని స్వీకరిస్తే చాలు   

నీ ముఖ బింబాన్నిమరువ లేను
నీ అమాయకపు చూపులు వదల లేను 


1 comment: