ఓం శ్రీ రామ్ - ఓం శ్రీ మాత్రేనమ: - ఓం శ్రీ కృష్ణాయనమ:
ప్రాంజలి ప్రభ- షోడశ నిత్యాదేవతా ఉపాసన
రదేవత అయిన శ్రీ లలితయే మహానిత్య. ఆ చైతన్యం నుండి వెలువడే కాలస్వరూప
చైతన్య కిరణాలే పాడ్యమి మొదలు పౌర్ణమి మొదలు పౌర్ణమి లేక అమావాస్య వరకుగల
తిథి దేవతలే నిత్యలు. కల్ప వాటికల మధ్య షడ్రుతువుల తమ తమ ప్రభలతో విలసించే
చోట శక్తుల సమూహం మధ్యంలో సంగీత, నృత్య, వాద్యవిలాసాలు జరుగుతుండగా కోటి
సూర్యప్రభలను వెదజల్లే సింహాసమందు లలితా మహా నిత్యాదేవి విరాజిల్లుతోంది.
ఆమె నేత్రములు కారుణ్య పూరితములై అమృతం వెదజల్లుతున్నారు. ఆ తల్లి ముఖం
మందహాసపూరితమైవుంది. ఆమె శరీరం నుండి వచ్చే ప్రకాశ కిరణాలు అమృత ప్రవాహస
మానములు. ఆమె చూపులు సాధకులకు అత్యంత శ్రేయోదాయకాలై కోర్కెలను ఈడేర్చుతాయి.
ఆమె వివి ధ రకాలుగా అలంకరించబడిన ఏనుగులు, గుఱ్ఱములు మొదలైన రాజమర్యాద
చిహ్నాలతో పరివృతమై వుంది. లలితా పరమేశ్వరికి సమానమైన వస్త్రాలు, అభరణాలనే
ధరించిన పదిహేనుగురు నిత్యలతో సేవిం పబడుతోంది. ఈ మహానిత్యాదేవి శ్రీచక్ర
మధ్యనున్న త్రికోణమనందు విరాజిల్లుతోంది.
ఈ సర్వసిద్ధిప్రద చక్రమునకు వెలుపల కామేశ్వరి మొదలు చిత్రా తిథినిత్యా దేవతలచే సేవింపబడుతోంది. మహానిత్యాను పూజించితే ఇహలోక సౌఖ్యములు కలగడమే కాక మోక్ష సామ్రాజ్యం కూడా అతి సులభంగా లభిస్తుంది.
1. కామేశ్వరీ నిత్యా..
కామేశ్వరీ నిత్యాదేవత కోటి ఉదయ సూర్యల కాంతితో ప్రభవిల్లుతోంది. మాణిక్యరత్నాలు పొదిగిన కిరీ టం శిరస్సునందు ప్రకాశించగా, కంఠమునందు గ్రైవేయకము అనే కంఠాభరణం శోభిల్లుతోంది. నడుము న బంగారు వడ్డాణం, చేతులకు కంకణాలు, అంగుళీయకాలు శోభిల్లగా పాదములందు బంగారపు మట -టలు, చిరు గంటలు మ్రోయు మంజీరాలతో విలసిల్లుతోంది.
శరీరం అరుణ కాంతితో విరాజిల్లుతూ, శిరస్సున బాలచంద్రుడు శోభిల్లగా మందహాసంతో కరుణాపూరిత నేత్రాలతో దర్శనమిస్తోంది. చేతులలో ఇక్షు కోదండం పుష్పబాణములు, పాశాంకుశాలు, అమృతపూరిత రత్నకలశం, వరద హస్తం మొదలుగా గల ఆరు హస్తాలతో శోభిల్లుతోంది.
పూజా ఫలం:- ఈ దేవిని పూజించితే కుటుంబంలోని వారికి ఆయురారోగ్యం, మనస్సునందు శాంతి, రోగ రహితమైన శరీరం క్రమంగా లభిస్తుంది. ఈమె ఆరాధన ప్రత్యేకంగా మానవజాతికి అంతకూ ఆయురా రోగ్యప్రదం.
2. భగమాలినీ నిత్యా..
భగమాలినీ నిత్య షడ్భుజయై ఉత్పలం, పాశము, చెరుకువిల్లు ఎడమ హస్తమునందు, వికసించిన పద్మం, అంకుశం, పుష్పబాణాలు కుడిచేతులందు ప్రకాశిస్తాయి. అందమైన అరుణ దేహచ్ఛాయ కలిగి, మందహాస పూరితమైన వదనంలో మూడుకన్నులతో ప్రకాశిస్తుంది. పద్మాసనమందు ఆసీనురాలై శక్తు లతో పరివేష్టించబడి వుంది భగమాలిని.
పూజా ఫలం:- భగమాలినీ నిత్యాదేవిని పూజించితే శత్రుజయం, జనాకర్షణం కలుగుతాయి. ప్రత్యేకించి గర్భిణీ స్ర్తీల గర్భమును రక్షించి గర్భస్రావములను అరికట్టి, సుఖప్రసవం, సంతానప్రాప్తిని అను గ్రహిస్తుంది.
3. నిత్య క్లిన్నా
ఎర్రని కాంతి పుంజములు వెదజల్లే దేహకాంతిని ఇనుమడింపజేసే రక్తచందన లేపనంతో, చిరునవ్వులొలికే ముఖకాంతిని ఇనుమడింపజేసి మూడు కన్నులను కలిగి ఉంది. ఈ తల్లి ఫాల భాగము నందు చెమట బిందువులు, ప్రకాశించే ముత్యములవలె శోభిల్లుతున్నాయి. శిరస్సున నెలవంకను ధరించి ఉంది. చతుర్భుజగా పాశాంకుశములను ధరించి అభయముద్రను వహించి, అమృత కలశమును ధరించి దర్శనమిచ్చే ఈ తల్లి సకల భయహారిణి. ఈమె వికసించిన పంకజమునందు ఆసీనురాలై సర్వకామ ప్రపూరిణిగా, మదాలసగా దర్శనమిస్తోంది.
పూజా ఫలం:- ఈమె భక్తుల దాంపత్య జీవితమునందు ఆన్యోన్య అనురాగమును వర్థిల్లజేస్తూ, పరస్పరం మనోవాక్కాయముల యందు చిత్తశుద్ధిని ఏర్పరచి, కుటుంబ జీవితమునందు తల్లిదండ్రులు, సంతానం, భార్యభర్తలు మొదలైన వారిలో పరస్పర అనురాగమును, వాత్సల్యమును పెంపొందించి ఐకమత్యంతో కూడిన ఆదర్శవంతమైన కుటుంబమును వర్థిల్లజేస్తుంది.
4. భేరుండా నిత్యా
భేరండా నిత్యాదేవి మేలిమి బంగారు శరీర కాంతి కలిగి, త్రినేత్రాలతో మందహాసపూరితమైన సౌందర్యవంతమైన ముఖారవిందంతో భక్తులను అనుగ్రహిస్తుంది. సర్వాంగముల యందు మణి గణ భూషితములైన దివ్య ఆభరణాలను ధరించింది. పాశ, అంకుశములు, ధనుర్బాణములు, గద, త్రిశూలం, వజ్రాయుధం, డాలు ధరించిన అష్టభుజగా వెలుగొందుతోంది.
పూజా ఫలం:- భేరుండా దేవి భక్తులను అపమృత్యువు నుండి కాపాడి, విషం మొదలైన ప్రాణాపాయకరమైన ప్రమాదాల నుండి శరీరమును, ఆత్మను రక్షిస్తుంది.
5. వహ్ని వాసినీ నిత్యా
నిత్యనవయౌవన శాలియై మేలిమి బంగారు రంగు దేహకాంతిని వెదజల్లుతూ చిరునవ్వు కలిగి పద్మసన్నిభ వదనంతో, త్రినేత్రాలతో ప్రకాశిస్తోంది. పసిడి బంగారు కాంతి గల పట్టు వస్త్రాలను, మాణిక్యరత్నములు పొదిగిన ఆభరణాలు కలిగి, నలుదిశలా కాంతి పుంజాలతో విరాజిల్లుతోంది. ఆ తల్లి శరీర ప్రకాశం మణిఖచితములైన కంకణములచేత, నవరత్న ములు పొదిగిన వడ్డాణంతోను, ముత్యాల ఆభరణాలతోను విరాజిల్లుతోంది. ఎడమ చేతు లందు ఉత్పలం, బంగారపు కొమ్ము, పుష్పబాణం, దానిమ్మ ఫలం ధరించి యుండి, శక్తులచే ఆవరింపబడి ఉంది.
పూజా ఫలం:- ఈ వహ్నివాసినీ నిత్య అసమాన శరీరకాంతిని ప్రకాశింపచేస్తూ ముల్లో కాలలో సాటిలేనంత ఇహ సౌఖ్యములు ప్రసాదిస్తుంది.
6. మహావజ్రేశ్వరీ నిత్యా
మహావజ్రేశ్వరీ నిత్య త్రికోణం, షట్కోణం, పద్మదళాలు, భూపురం కల్గిన యంత్రము నందు బంగారు సింహాసనంపై విరాజిల్లుతోంది. చతుర్భుజములందు పాశ, అంకుశములు, ఇక్షుకోదండము, దానిమ్మపండు కల్గి త్రినేత్రాలతో శోభిల్లుతోంది. రక్తపుష్పమాలలు, రక్తవ స్త్రములను ధరించి నానాలంకారభూషితగా రాజిల్లుతోంది. సాధకులకు అనుగ్రహాన్ని ప్రసా దించే వీక్షణములు కల్గి, పద్మముఖంతో అలరారుతోంది.
ఫలశ్రుతి :- మహావజ్రేశ్వరీదేవి భక్తులను కష్టాలనుండి కాపాడి, అన్ని తాపములను నివారించే వజ్రం వలె భక్తులను అనుగ్రహిస్తోంది.
7. శివదూతీ నిత్యా
మండువేసవిలోని మధ్యాహ్నకాల చంఢభానుని కాంతివలె ప్రకాశిస్తూ త్రినేత్రయై ఉంది. రక్తవస్త్రం ధరించి సర్వాభరణ భూషితయై నవరత్న ప్రభాపుంజం వలె ప్రకాశిస్తోంది. చల్లని మందహాసంతో, వికసించిన మోము కల్గినదై ఋషులచే సంస్తూయమానమైంది. శివదూతీ నిత్యా వామహస్తమునందు పాశం, గద, డాలు, రత్న ఖచిత చషక పాత్రలను, దక్షిణ హస్తమందు అంకుశం, ఖడ్గం, కుఠారం, పద్మములను కల్గి ఉంది.
ఫలశ్రుతి :- భక్తుల అధర్మమును నాశనం చేసి ధర్మాచరణమును అభివృద్ధిపరుస్తూ, ఇష్టకామ్యములనిచ్చి అనుగ్రహిస్తుంది.
8. త్వరితా నిత్యా
త్వరితా నిత్యా శ్యామవర్ణపు అంగఛాయ కల్గి అతిశోభాయమానమైన యవ్వనంతో శోభిల్లుతూ, త్రినేత్ర యై, చతర్భుజాలతో, కరుణాపూరిత నేత్రాలతో, అత్యంత సుందరమైన పద్మవదనంతో రాజిల్లుతోంది. సర్వవర్ణాల వారిచే ఆరాధించబడే ఉగ్రరూపం కల్గి ఆకుపచ్చరంగు వస్తమ్రులు ధరించి ఉంది.
కర్ణములందు నాగములను తాటంకములుగా, భుజములందు జంటనాగములను భుజకీర్తులుగా, పాదములందు జంటనాగములను నూపురాలుగా, కటి ప్రదేశమున జంట నాగములను వడ్డాణంగా ధరించి, కిరీటం నందు నెమలి పింఛములను ధరించి, శోభాయమానమవుతోంది. గురువిందగింజల మాలలచే అలంకరిం చబడిన కుచమండలం కల్గినదై, చతుర్భజములందు పాశ, అంకుశ, వరద, అభయముద్రలతో శోభిల్లుతోంది.
ఫలశ్రుతి :- త్వరితా నిత్యా ఆరోగ్యమును, ధన సంపత్తిని, సుందరమైన శరీరకాంతిని, దీర్ఘాయుష్షును భక్తులకు ప్రసాదిస్తుంది. జీవితంలో సర్వతోముఖ అభివృద్ధిని కావించి సర్వవిధ విషరోగాల నుండి కాపాడుతుంది.
9. కులసుందరీ నిత్యా
కులసుందరీ నిత్యా ఆరుముఖాలతో ఎర్రని శరీరకాంతి కలిగి, ఎర్రని కాంతులు వెదజల్లే శక్తులచే సేవించబడుతూ రక్తవస్త్రాలు ధరించి, రక్తచందన లేపనయై, మూడుకన్నులు కలదై చల్లని చిరునవ్వుతో, ఎనలేని రత్నమణులచే కూర్చబడిన కిరీటముచే జ్వలిస్తోంది. తాటంకాలు, కేయూరాలు, ఉజ్వలమైన నూ పురాలు, రక్తవర్ణ పుష్పగుచ్ఛాలతో సుశోభితమైన వక్షస్థలం కలది. కారుణ్య ఆనందభరితమైన వదనం గల ది. అరుణాంబుజమునందు ఆసీనురాలై ఉంది. ద్వాదశ భుజయుక్తయై సర్వవాజ్మయ అధిష్టాత్రియై విల సిల్లుతోంది. పగడపుమాల, పద్మము, రత్నములచే పొదగబడిన బంగారు కమండలం, అమృత చషకం, దానిమ్మపండు, వ్యాఖ్యానముద్ర, పుస్తకం వికసించిన పద్మం, బంగారు ఘంటం, రత్నమాలా శంఖం, వరదముద్రలు 12 హస్తములందు శోభిల్లుతున్నాయి. దేవ, గంధర్వ, కిన్నెర, యక్ష, రాక్షస, దేవ ఋషులు, సిద్దులు, విద్యా ధరులచే స్తుతింపబడుతోంది.
ఫలశ్రుతి :- వాక్శుద్ధి కొరకు తెల్లని కాంతివంతమైన రూపం కల కులసుందరీ నిత్యాదేవిని ధ్యానించి, పూజించాలి. ఐశ్వర్య సిద్ధి కొరకు బంగారు రూపంకల దేవిని పూజించాలి. శత్రునివారణ, అపమృత్యు నివారణకు పొగరంగు కల దేవిని ధ్యానించాలి. వాదించే వారి వాగ్బంధనం కొరకు నల్లని రంగుగల కులసుందరీ నిత్యాదేవిని ఆరాధించాలి.
10. నిత్యా నిత్యా!
శ్రీ నిత్యా నిత్య ఉదయసూర్యుని కాంతితో విరాజిల్లు ముఖం కలది. మాణిక్యాలతో పొదగబడిన కిరీటం కలది. మాణిక్యపు రంగు వస్త్రాలు ధరించి ఉంటుంది. చిరునవ్వుతో ప్రకాశిస్తున్న ఆరుముఖాలు కలిగి, ప్రతీముఖం నందు త్రినేత్రములు, 12 భుజములు కలిగి ఉంది. వామహస్తమందు పాశం, రుద్రాక్షమాల, చెరుకువిల్లు, డాలు, త్రిశూలం, వరదహస్తం, దక్షిణ హస్తమందు అంకుశం, పుస్తకం, పుష్పబాణాలు, ఖ డ్గం, కపాలం, అభయహస్తములను కలిగి ఉంది. ఈ విధమైన ఆయుధాలతో సమస్త చరాచర ప్రాణికోటిని తమ తమ స్థానములందు (లేక శరీరములందు) స్థిరంగా ఉండేలా శాసిస్తుంది. తను సర్వాత్మికగా, సర్వ వ్యాపక చైతన్యశక్తియై ఉంది.
ఫలశ్రుతి :- నిత్యా నిత్య సాధకులకు శరీర దృఢత్మమును, ఆధ్యాత్మశక్తులను పెంపొందింపచేసి అణి మాది అష్టసిద్ధులను ప్రసాదిస్తుంది.
11. శ్రీ నీలపతాక నిత్యా
ఇంద్రనీలపు శరీర కాంతిని కల్గి అయిదు ముఖాలతో ప్రతిముఖం నందు త్రినేత్రం కల్గినదై, మణులతో ప్రకాశించే కిరీటంతో విరాజిల్లుతోంది. రత్నకాంతులు వెదజల్లే దేహకాంతితో, చిరునవ్వు ముఖా లతో ప్రకాశిస్తోంది. ఎడమ చేతులందు పాశం, పతాకము, చర్మవేష్ఠం, శంఖం, చాపం, వరద హస్తములను కలిగి ఉంది. కుడి చేతులలో అంకుశం, శక్తి ఆయుధం, ఖడ్గం, బాణం, అభయ హ స్తములను కల్గి ఉంది. నీలపతాక నిత్య తన వలెనే ఆకారం, వర్ణం, వేషం, ఆభరణాలు ధరించిన శక్తి బృందములతో సమావిష్ఠమై ఉంది.
ఫలశ్రుతి :- పరీక్షలయందు ఉత్తీర్ణత, కోర్టు వ్యవహారాలలో విజయం సాధించడానికి నీలపతాక నిత్యను పూజించాలి.
12. శ్రీ విజయా నిత్యా
పది ముఖాలు, పది భుజాలు, ప్రతిముఖంనందు మూడు కళ్ళు, చంద్రరేఖలతో విలసిల్లే కిరీటం కలది. పీతాంబరం ధరించి సర్వాభరణ సంయుక్తయై ఉదయించే సూర్యబింబకాంతి కలి గి చిరునవ్వులొలికేది.
శంఖం, పాశం, డాలు, చాపం, కల్హార పుష్పాలను ఎడమవైపు హస్తము లందు, చక్రం, అంకుశం, ఖడ్గం, బాణం, దానిమ్మ ఫలాలను కుడివైపు హస్తాలందు కలిగి ఉంది. ఈ ఆయుధాలను ప్రయోగించే సమయంలో ఉగ్రరూపం ధరిస్తుంది. ఉపాసకులకు విజయా నిత్య సింహావాహినియై సౌమ్యంగా దర్శనమిస్తుంది.
యుద్ధాలందు పులి వాహనమును అధిరోహించి శక్తి పరివార సైన్యంతో దర్శనమిస్తుంది. పూజా సమయాలలో మిగిలిన అనుష్టాన సమయాల్లో సుఖాసీనయై దర్శనమిస్తుంది. శక్తులం దరూ విజయా నిత్యా వలెనే రూపాలు నిత్య సాధకులకు యుద్ధాలందు విజయాన్ని ఋణ విముక్తి ని, న్యాయస్థాన వ్యవహారములందు విజయాన్ని ఇస్తుంది.
ఫలశ్రుతి :- ఉపాసకులు ఎల్లపుడూ సౌమ్య ఆకారమునే పూజించాలి. ఉగ్రపూజలందు రుద్ర రూపం కలిగిన విజయానిత్యను సింహవాహినిగా, తన శక్తిసమూహములు పులుల మీద ఆసీనులయినట్లుగా పూజించితే అభివాంఛితాలు నెరవేరుతాయి.
13. సర్వమంగళా నిత్యా
బంగారపు శరీరకాంతిని కల్గి ముత్యాలు మొదలైన భూషణాలు ధరించి మాణిక్యాలతో పొదగ బడిన కిరీటమును ధరించి ఉంటుంది. దయతో కూడిన నేత్రాలు కలదై పద్మాసనం నందు ద్వి భుజగా అష్టదళం, షోడశదళములు చతుర్ద్వార సమన్వితమైన భూపురము కలయంత్రం నందు అధిష్టానమై ఉంది.
కుడి హస్తమందు దానిమ్మ పండును, వామ హస్తమందు భక్తులకు ప్రసాదిం చడానికి ధనపాత్రను కలిగింది. తన రూపం వలెనే భూషణాలను ధరించిన శక్తి సమూహం కల్గి 76 సంఖ్యకల్గిన సూర్య, చంద్ర గోళముల నుండి ఉద్భవించిన అక్షర శక్తులతో కూడా విరా జిల్లుతోంది.
ఫలశ్రుతి :- భక్తులకు ఇహసౌఖ్యములనిస్తుంది. భక్తులకు ప్రయాణములందు ఆటంకాలను తొలగించి, రక్షణ కల్గిస్తుంది.
14. జ్వాలామాలిని నిత్యా
శిఖలతో మండుతున్న అగ్నికి సమానమైన కాంతి కలిగి మాణిక్యాలతో పొదగబడిన ఉజ్వలమైన కిరీ టంతో శోభిల్లుతూ ఆరు ముఖములు, పన్నెండు భుజాలతో జ్వాలామాలినీ నిత్యా విలసిల్లుతోంది.పాశం, అంకుశం, ఖడ్గం, డాలు, బాణం, చాపం, గదా, త్రిశూలం, అగ్ని, వరద హస్తము, అభయ హస్తం, పద్మములను హస్తములందు ధరించి ఉంటుంది.
తనవలెనే ఆకార ఆభరణములను ధరించిన శక్తిపరివార సమన్వితయై, చిరునవ్వుతో ప్రకాశించే ముఖ పద్మాలతో, త్రినేత్రం కల్గి ఉంది.
ఫలశ్రుతి :- జ్వాలా మాలిని నిత్యాను పూజించే భక్తులకు ధనలాభం కలిగించి, ఇతరులపై విజయాన్ని సాధించే శక్తిని ప్రసాదించి, దాంపత్య సుఖాన్నిచ్చి, శత్రువిజయం ప్రసాదిస్తుంది.
15. శ్రీ చిత్రా నిత్యా
చిత్రా నిత్య ఉదయభానుని ప్రకాశం వంటి శరీరకాంతిని కల్గి, నవరత్న ఖచిత కిరీటమును ధరించి, త్రినేత్రయై, నానా చిత్ర వర్ణములు కల్గిన పట్టు వస్త్రాలు ధరించినదై, మందహాసపూరితమైన ముఖకమలం కలది. ఈ నిత్య సర్వానందమయిగా సదా భక్తులకు వాంఛితార్థములనిచ్చే నిత్యాగా ప్రకాశిస్తోంది. చతర్భు జములందు పాశ అంకుశాలు, అభయవరద ముద్రలతో విలసిల్లుతోంది.
ఫలశ్రుతి :- చిత్రా నిత్యాదేవి ఇహలోక సుఖములను ప్రసాదిస్తూ ఇతరులను తన పక్షమునకు ఆకర్షించే శక్తిని ప్రసాదించి, ఆకస్మికంగా నవనిధులను ప్రసాదిస్తుంది.
శక్తి స్వరూపిణి అయిన ఆ లలితాపరమేశ్వరి ఇన్ని రూపాలలో భక్తులను అనుగ్రహిస్తుంది. ఆ తల్లి కరుణకు పాత్రులు కావడం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాల్సి ఉంది.
--((**))--
No comments:
Post a Comment