Wednesday, 28 September 2016

*శ్రమకు ఫలితం లేదు,

 ఓం శ్రీ రామ్  - ఓం శ్రీ కృష్ణ
సరేజానా సుఖినోభవంతు

*శ్రమకు ఫలితం లేదు,
శ్రమకు ఫలితం లేదు, తెలివి కీ పని లేదు
కళ్లప్పగించి చేసే పనినీ తెలుప లేనిది కవిత్వం కాలేదు  

పకృతి ఏమి శ్రమ పడుతుందని అంటున్నారు
సూర్య చంద్రులు ఏమి శ్రమ పడుతున్నారంటున్నారు
కాల చక్రం ఎలా తిరుతున్నదో చెప్పమంటున్నారు   
దేవుణ్ణి చూపమని వాదన చేసే వారున్నారు

కానీ కాలు కదపకుండా, నడుం వంగ కుండా
ఈ కలియుగంలో జీవనం నడుపుతున్నారంటున్నారు
ధన మదం తో,  శ్రమను దోచుకుంటూ కాయ కష్టాన్ని
విలువ ఇవ్వ కుండా, యంత్రములను ద్వారా
పనులు సాగింది శ్రామికుల, కర్షకుల పొట్ట కొట్టుతున్నారు

మట్టి విలువను పెంచే, ఇష్టా రాజ్యాన్ని పట్టించుకోలేరు
కడుపు కోత గుర్తించక కష్ట పెట్టే వారిని పట్టించు కోరు
కోటీశ్వరుని వదిలి, బీదవారిని ఏడిపిస్తున్నారు      
వితండ వాదులకు, స్వార్ధ పరులకు  అవకాశాలు
మెరుగు, కష్ట జీవులకు శ్రామికులకు కష్టాలు
కళ్ళల్లో సుడులుగా తిరుగు ఏమిటి ఈ లోకం      

ఎప్పుడు  పోవును  స్వార్ధపు పోరాటాలు
ఎప్పుడు పోవును  రాజకీయ కుతంత్రాలు
ఎప్పుడు పోవును మనుషుల మధ్య భేదాలు
ఎప్పుడు పోవును ధనికుని అహంకార మాటలు
 
శ్రమకు ఫలితం లేదు, తెలివి కీ పని లేదు
కళ్లప్పగించి చేసే పనినీ తెలుప లేనిది కవిత్వం కాలేదు 

--((*))-- 

నందా - షోడశి

ఈ వృత్తము వాగ్వల్లభలో పేర్కొనబడినది. ఇది కూడ షోడశి ప్రత్యేకతయే. ఇందులో పాదమునకు నాలుగు షణ్మాత్రలు. గానయోగ్యమైన వృత్తము ఇది. క్రింద నా ఉదాహరణములు -

నందా - త/య/స/భ/స/గ UUII UUII - UUII IIUU
16 అష్టి 15565

ఆనందపు టాకాశము - నందుంటిని వెలుఁగై నే
నానందపు టంభోనిధి - యందుంటిని మణియై నే
నానందపు టారామము - నందుంటిని విరియై నే
నానందపు టాకారము - నందుంటిని లలియై నేన్

నీవే గద నా పున్నెము - నీవెగద సిరి లాలీ
నీవేగద నా తారక - నీవేగద శశి లాలీ
నీవేగద నా డెందము - నీవేగద లలి లాలీ
నీవేగద నా సర్వము - నీవెగద వనమాలీ

ఏమో మది నీకై యిట - నిట్టుల్ బ్రియ తలపోసెన్
ఏమో హృది నీకై యిట - నిట్టుల్ బ్రియ చలియించెన్
బ్రేమమ్మన నిట్లుండునె - ప్రీతించఁగ నిటులౌనే
రా ముందుగ నా మానస - రాసమ్మున నటియించన్
 

No comments:

Post a Comment