ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్
ప్రాంజలి ప్రభ - (సేకరణ అంతర్జాలం )
సర్వేజనా సుఖినోభవంతు
గణపత్యుపనిషత్
(అథర్వణ వేదాంతర్గతము)
శ్లో II యన్నత్వా మునయస్సర్వే నిర్విఘ్నం యాన్తి తత్పదమ్ I
గణేశోపనిష ద్వేద్యం తద్బ్రహ్మైవాస్మి సర్వగమ్ II
తా :- ఏ గణపతిని నమస్కరించి మునులందరును ఆయన యొక్క పదమును నిర్వఘ్నముగా పొందుచున్నారో,గణేశోపనిషద్వేద్యుడగు సర్వవ్యాపియైన ఆ బ్రహ్మనే నేను.
మం. శ్లో II ఓమ్ లం నమస్తే గణపతయే, త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి, త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం ధర్తాసి,త్వమేవ కేవలం హర్తాసి, త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి,త్వం సాక్షాదాత్మాసి నిత్యం, ఋతం వచ్మి, సత్యం వచ్మి, అవ త్వం మామ్, అవ వక్తారమ్, అవ శ్రోతారమ్, అవ దాతారమ్, అవ ధాతారమ్, అవానూచాన మవశిష్యమ్,అవ పురస్తాత్, అవ దక్షిణాత్తాత్, అవ పశ్చాత్తాత్, అవో త్తరాత్తాత్, అవ చోర్ధ్వాత్తాత్, అవాధరాత్తాత్, సర్వతో మాం పాహి, పాహి సమంతాత్, త్వం వాఙ్మయః, త్వం చిన్మయః,త్వ మానందమయః త్వం బ్రహ్మమయః, త్వం సచ్చిదానందా ద్వితీయోఽసి, త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వం జ్ఞానమయో విజ్ఞానమయోఽసి, సర్వం జగదిదం త్వత్తో జాయతే సర్వం జగదిదం త్వత్త స్తిష్ఠతి సర్వం జగదిదం త్వయి లయమేష్యతి.
(1) తా :- ఓం లం గణపతి కొరకు నమస్కారము. నీవు ప్రత్యక్షమైన తత్త్వమవు. నీవే కేవల కర్తవు. కేవల ధర్తవు. కేవల హర్తవు. ఈ సర్వ జగత్ స్వరూప బ్రహ్మవు నీవే. నీవు నిత్యమైన ఆత్మవు. నిజము పల్కుదును, ఋతము పల్కుదును, నీవు నన్ను రక్షింపుము, అనూచానుడైన శిష్యుని రక్షింపుము. ముందు, వెనుక, కుడి, యెడమలను రక్షింపుము. పైన, క్రింద, అంతటను రక్షింపుము. నీవు వాఙ్మయుడవు, చిన్మయుడవు, ఆనందమయుడవు,బ్రహ్మమయుడవు. సచ్చిదానందుడవు, అద్వితీయుడవు,ప్రత్యక్ష బ్రహ్మవు, జ్ఞానమయుడవు, విజ్ఞానమయుడవు, ఈ జగత్తంతయు నీ వలననే పుట్టుచున్నది. నీ వలననే ఇదంతయు నిలబడినది. నీయందే ఇదంతయు లయమగును.
మం. శ్లో II సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి, త్వం భూమి రాపోఽ నలోఽనిలో నభః, త్వం చత్వారి వాక్పరిమితా పదాని, త్వం గుణ త్రయాతీతః, త్వం దేహ త్రయాతీతః,త్వం కాల త్రయాతీతః, త్వం మూలాధారే స్థితోఽసి నిత్యమ్,త్వం శక్తి త్రయాత్మకః, త్వాం యోగినో ధ్యాయంతి నిత్యమ్,త్వం బ్రహ్మా త్వం విష్ణుః త్వం రుద్రః త్వమింద్రః త్వమగ్నిః త్వం వాయుః త్వం సూర్యః త్వం చంద్రమాః త్వం బ్రహ్మభూర్భువస్సువరోమ్, గణాదీన్పూర్వ ముచ్చార్య వర్ణాదీన్ తదనంతరమ్, అనుస్వారః పరతరః అర్ధేదులసితం తథా, తారేణ యుక్త మేత దేవ తవ మనుస్వరూపమ్, గకారః పూర్వ రూపమ్, అకారో మధ్యమరూపమ్, అనుస్వార శ్చాంత్య రూపమ్, బిందు రుత్తర రూపమ్, నాద స్సన్ధానమ్, సంహితా సంధిః, సైషా గాణేశీ విద్యా, గణక ఋషిః, నృచద్గాయత్రీ ఛందః, శ్రీ మహాగణపతి ర్దేవతా, ఓం గం గణపతయే నమః, ఏక దంతాయ విద్మహే వక్రతుణ్డాయ ధీమహి, తన్నోదంతిః ప్రచోదయాత్
(2)తా :- ఈ జగత్తంతయు నీయందే నమ్మిక కల్గియున్నది. నీవు భూమివి, ఉదకమువు, అగ్నివి, వాయువవు, ఆకాశమువు,నాల్గు పరిమితములైన వాక్కువి, గుణత్రయాతీతుడవు,దేహత్రయాతీతుడవు,
కాలత్రయాతీతుడవు,మూలాధారమందు నిత్యము నుందువు, శక్తిత్రయాత్మ కుడవు, నిన్ను యోగులు నిత్యము ధ్యానింతురు. నీవు బ్రహ్మవు, విష్ణవవు, రుద్రుడవు,ఇంద్రుడవు, అగ్నివి, వాయువవు, సూర్యుడవు, చంద్రుడవు,భూమివి, భువర్లోక సువర్లోక స్వరూపుడవు; గణాదులను ముందుచెప్పి, వర్ణాదులను తర్వాత చెప్పి; అనుస్వారము నర్ధేందువుతోను, తారయుక్తముగా చెప్పిన ఇదే నీ మూలమంత్రము. పూర్వరూపము గకారము, అకారము మధ్యమ రూపము, అనుస్వారము మంత్రరూపము. బిందువుత్తర రూపము; నాదము సంధానము, సంహిత సంధి, ఆ ఇదియే గణేశ సంబంధియైన విద్య, గణకుడు ఋషి. నృచద్గాయత్రి ఛందస్సు, శ్రీ మహాగణపతి దేవత. ఓం గం గణపతయే నమః, ఏక దంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తన్నోదంతిః ప్రచోదయాత్ అని మంత్రము.
మం. శ్లో II ఏకదంతం చతుర్హస్తం బిభ్రాణం పాశ మంకుశమ్,అభయం వరదం హస్తైర్దధానం మూషికధ్వజమ్, రక్తం లంబోదరం శూర్ప సుకర్ణం రక్తవాససమ్,రక్తగన్ధానులిప్తాంగం రక్తపుష్పై స్సుపూజితమ్,భక్తానుకంపినం దేవం జగత్కారణ మచ్యుతమ్,ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్పరమ్, ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః, నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయైకదంతాయ విఘ్న వినాశినే,శివసుతాయ వరదమూర్తయే నమోనమః ఏత దథర్వశిరో యోఽధీతే, స బ్రహ్మ భూయాయ కల్పతే, స సర్వత స్సుఖ మేధతే. స సర్వవిఘ్నైర్న బాధ్యతే, స పంచమహాపాతకోపపాతకాత్ ప్రముచ్యతే,సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి, ప్రాత రధీయానో రాత్రికృతం పాపం నాశయతి, సాయం ప్రాతః ప్రయుంజానోఽపాపో భవతి, ధర్మార్థకామమోక్షం చ విందతి,ఇద మథర్వశీర్ష మశిష్యాయ న దేయమ్, యో యది మోహా ద్దాస్యతి స పాపీయాన్భవతి, సహస్రావర్తనా ద్యం యం కామ మధీతే తం త మనేన సాధయేత్
(3) తా :- ఏకదంతుడు, నాలుగు హస్తములు కలవాడు,పాశమును అంకుశమును ధరించినవాడు, అభయ వరద ముద్రలు కలవాడు, మూషికధ్వజుడు, ఎర్రనివాడు,లంబోదరుడు, శూర్పకర్ణుడు. ఎర్రని వస్త్రము కలవాడు. రక్తగంధము పూసికొన్నవాడు. రక్త పుష్పములతో పూజింపబడినవాడు. భక్తులను దయచూచువాడు,దేవుడు, జగత్కారణుడు, అచ్యుతుడు, సృష్ట్యాదిలో ఆవిర్భవించినవాడు, ప్రకృతి పురుషుని కన్న పరుడు. ఇట్టి గణపతిని ఏ యోగి నిత్యము ధ్యానించునో అతడు యోగి శ్రేష్ఠుడు. వ్రాత పతికి నమస్కారము. గణపతికి,ప్రమథపతికి, లంబోదరునకు, ఏకదంతునికి, విఘ్న వినాశకునకు, శివసుతునకు, వరద మూర్తికి నమస్కారము. ఈ అథర్వోపనిషత్తు నెవదధ్యయనము చేయునో, అతడు బ్రహత్వము నందును. అతడన్నిట సుఖము నందును. అతడు యే విఘ్నములచే బాధింపబడడు. అతడు పంచ మహాపాతకముల నుండి, ఉపపాతకముల నుండి ముక్తుడగును. సాయం సమయమున చదివినచో పగటివేళ చేసిన పాపము పోవును. ప్రాతఃకాలమున పఠించిన,రాత్రివేళ చేసిన పాపము పోవును. రాత్రి పగలు చదివిన,పాపములేని వాడగును. ధర్మార్థ కామమోక్షములను పొందును. దీనిని శిష్యుడు కానివాని కియ్యరాదు. ఒకవేళ ఎవడైనా అజ్ఞానము వలన ఇచ్చిన, వాడు పాపిష్ఠుడగును. వెయ్యిసార్లు పఠించిన దేనిని కోరిన అది సిద్ధించును.
మం. శ్లో ||
అనేన గణపతి మభిషిఞ్చతి, స వాగ్మీ భవతి,చతుర్థ్యా మనశ్నన్ జపతి స
విద్యావాన్ భవతి,ఇత్యథర్వణవాక్యమ్, బ్రహ్మాద్యాచరణం విద్యా న్న బిభేతి
కదాచనేతి, యో దుర్వాంకురై ర్యజతి స వైశ్రవణోపమో భవతి, యో లాజైర్యజతి స
యశోవా న్భవతి స మేధావా న్భవతి, యో మోదకసహస్రేణ యజతి సవాంఛితఫల మవాప్నోతి,
యస్సాజ్య సమిద్భిర్యజతి స సర్వం లభతే, స సర్వ లభతే, అష్టౌ బ్రాహ్మణా
స్సమ్యగ్గ్రాహ యిత్వా సూర్యవర్చస్వీ భవతి, సూర్యగ్రహణే మహానద్యాం ప్రతిమా
సన్నిధౌ వా జప్త్వా ససిద్ధమన్త్రోభవతి, మహావిఘ్నాత్ ప్రముచ్యతే,
మహాదోషాత్ ప్రముచ్యతే, స సర్వవి ద్భవతి. స సర్వవి ద్భవతి య ఏవం వేద
ఇత్యుపనిషత్ (గణపత్యుపనిషత్ సమాప్తా)
(4) తా :- దీనితో గణపతిని అభిషేకించిన, అతడు వక్త అగును. చతుర్థీ తిథినాడు ఉపవాసముండి జపించిన విద్యావంతుడగును. అని అథర్వణ వాక్యము. ఎప్పుడును భయపడని బ్రహ్మాద్యాచరణము తెలియవలెను. ఎవడు దుర్వాంకురములతో పూజించునో వాడు కుబేరునితో సమానుడగును. లాజలతో హోమము చేసిన కీర్తివంతుడగును. మేధావియగును. మోదక సహస్రముతో హోమము చేసిన కోరిన ఫలము పొందును. ఆజ్యముతో కూడిన సమిధలతో హోమము చేసిన సర్వమును పొందును. ఎనిమిది మంది బ్రాహ్మణులతో చేయించిన సూర్యవర్చస్వి యగును. సూర్యగ్రహణమున మహానదియందు, ప్ర తిమాసన్నిధిలో జపించిన సిద్ధమంత్రుడగును. మహావిఘ్నముల నుండి విడువబడును. మహాదోష విముక్తగును. సర్వవేత్త యగును. ఎవడిట్లు తెలియునో, ఇది ఉపనిషత్తు, ఇది గణపత్యుపనిషత్తు.
(4) తా :- దీనితో గణపతిని అభిషేకించిన, అతడు వక్త అగును. చతుర్థీ తిథినాడు ఉపవాసముండి జపించిన విద్యావంతుడగును. అని అథర్వణ వాక్యము. ఎప్పుడును భయపడని బ్రహ్మాద్యాచరణము తెలియవలెను. ఎవడు దుర్వాంకురములతో పూజించునో వాడు కుబేరునితో సమానుడగును. లాజలతో హోమము చేసిన కీర్తివంతుడగును. మేధావియగును. మోదక సహస్రముతో హోమము చేసిన కోరిన ఫలము పొందును. ఆజ్యముతో కూడిన సమిధలతో హోమము చేసిన సర్వమును పొందును. ఎనిమిది మంది బ్రాహ్మణులతో చేయించిన సూర్యవర్చస్వి యగును. సూర్యగ్రహణమున మహానదియందు, ప్ర తిమాసన్నిధిలో జపించిన సిద్ధమంత్రుడగును. మహావిఘ్నముల నుండి విడువబడును. మహాదోష విముక్తగును. సర్వవేత్త యగును. ఎవడిట్లు తెలియునో, ఇది ఉపనిషత్తు, ఇది గణపత్యుపనిషత్తు.
(గణపత్యుపనిషత్తు సమాప్తము).
--((**))--
om sri ram
ReplyDelete