ఆచారాలు -అంతరార్థం:-
ఆలయాల్లో గంటలు ఉండడం…
ఆలయాల్లో ఉండే గంటను ఏడు సార్లు కొడితే మన శరీరంలో ఉన్న ఏడు చక్రాలు ఉత్తేజం అవుతాయట. అంతేకాదు మెదడు కుడి, ఎడమ భాగాలు రెండూ కొంత సేపు ఏకమవుతాయట. దీంతోమన మనస్సుకు ప్రశాంతత కలుగుతుందట. ఏకాగ్రత పెరుగుతుందట. గంటను మోగించడం వల్ల ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క్రిములు నాశనమవుతాయట.
ఆడవారు గాజులు ధరించడం వెనుక…
ఆ గాజుల వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట. గాజులు ఎల్లప్పుడూ చేతి నరాలకు తాకుతూ ఉండడం వల్ల బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుందట.
పిల్లలకు చెవులు కుట్టించడం…
చిన్నారులకు చెవులు కుట్టించడం సహజమే. ప్రధానంగా ఆడపిల్లలకు, ఆ మాటకొస్తే కొంత మంది మగ పిల్లలకు కూడా చెవులు కుట్టిస్తారు. అయితే ఇలా కుట్టించడం వల్ల ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి దాంతో వారికి వచ్చే అనారోగ్యాలు పోతాయట. ప్రధానంగా ఆస్తమా వంటి వ్యాధులు రావట.
రావి చెట్టును పూజించడం…
హిందువుల్లో అధిక శాతం మంది రావి చెట్టుకు పూజలు చేస్తారు. ఈ చెట్లయితే ఎక్కువగా దేవాలయాల్లోనే ఉంటాయి. అయితే సాధారణంగా చెట్లన్నీ పగటి పూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తే ఈ చెట్టు మాత్రం రాత్రి పూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందట. దీంతోనే రావి చెట్టును పూజిస్తారు.
కాలి వేళ్లకు మెట్టెలు ధరించడం…
హిందూ సాంప్రదాయంలో పెళ్లయిన మహిళలు కాలికి మెట్టెలను ధరిస్తారు. ఇలా ధరించడం వల్ల ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి వారి గుండె నుంచి గర్భాశయానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుందట. అయితే వెండి మెట్టెలు ధరిస్తే ప్రకృతిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ వారి శరీరంలోకి ప్రవేశిస్తుందట.
నిద్రించేటప్పుడు తలను ఉత్తరానికి పెట్టకపోవడం..
భూమికి అయస్కాంత క్షేత్రం ఉన్నట్టుగానే మన శరీరానికి కూడా అయస్కాంత క్షేత్రం ఉంటుందట. ఒక వేళ మనం ఉత్తరం దిశగా తలను పెట్టి పడుకుంటే మన శరీరంలో ఉన్న ఐరన్ మెదడుకు ప్రవహించి బీపీ, గుండె సంబంధ సమస్యలు వస్తాయట. తలనొప్పి, అల్జీమర్స్, పార్కిన్‌సన్స్ డిసీజ్ వంటి వ్యాధులు వస్తాయట. కాబట్టి తలను ఉత్తరం దిశకు పెట్టి నిద్రించకూడదట.
నుదుటన కుంకుమ బొట్టు ధరించడం…
నుదుటన కుంకుమ బొట్టును ధరిస్తే అక్కడి నరాలు ఉత్తేజితమై పీయూష గ్రంథిని యాక్టివేట్ చేస్తాయట. దీంతో బీపీ, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయట.
ఎదుటి వారికి రెండు చేతులతో నమస్కరించడం...
ఎదురుగా ఉన్న వారికి రెండు చేతులతో నమస్కరిస్తే మనం వారిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటామట. ఎలాగంటే రెండు చేతులను జోడించినప్పుడు చేతి వేళ్లన్నీ కలిసిపోయి ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి మన జ్ఞాపకశక్తిని పెంచుతాయట. దీంతోపాటు మెదడు పనితీరు కూడా మెరుగు పడుతుందట.
నేలపై కూర్చుని భోజనం చేయడం…
నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల పద్మాసనం భంగిమ వస్తుంది. దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరిగి జీర్ణాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయట.
కారమైన ఆహారం ముందు, స్వీట్లు తరువాత తినడం…
భోజనం చేసినప్పుడు ముందుగా కారంగా ఉండే ఆహారం తినడం వల్ల జీర్ణాశయంలో జీర్ణక్రియకు అవసరమైన ఆమ్లాలు బాగా ఉత్పత్తి అవుతాయట. దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుందట. అయితే భోజనం మొదట్లోనే స్వీట్లు తింటే అది మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణంచేయనీయదట.
నదుల్లో నాణేలు వేయడం…
ఒకప్పుడు మన దగ్గర రాగితో చేసిన నాణేలు చలామణీలో ఉండేవి. ఈ కారణంగా ఆ నాణేలను నదుల్లో వేస్తే ఆ రాగి అంతా ఆ నీటిని శుద్ధి చేసేదట. దీంతో ఆ నీటిని తాగేవారికి ఎన్నో అనారోగ్యాలు దూరమయ్యేవట.
ఉపవాసం ఉండడం…
హిందువుల్లో అధిక శాతం మంది వారంలో ఏదో ఒక రోజు దేవుడికి ఉపవాసం ఉంటారు కదా.ఆయుర్వేద ప్రకారం అలా ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఉపవాస సమయంలో మన జీర్ణవ్యవస్థకు పూర్తిగా విశ్రాంతి లభించి శరీరంలో ఉన్న పలు విష పదార్థాలు బయటకు వెళ్లగొట్ట బడతాయట. దీంతోపాటు దేహం తనకు తాను మరమ్మత్తులు చేసుకుంటుందట. ఉపవాసం ఉండడం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు రావట!!
!ఋషి స్నానం,
దేవ స్నానం,
మానవ స్నానం,
రాక్షస స్నానం...
ఇంతకీ మీది ఏ స్నానం...?
బారెడు పొద్దెక్కినా నిద్ర లేవకుండా పడుకోవడం ఇపుడు సిటీలలోనే కాదు... పల్లెటూళ్ళలోనూ ఫ్యాషన్‌గా మారింది.
అర్థరాత్రి వరకు సినిమాలు, టీవీలు, ఛాటింగులతో గడిపేసి... ఉదయం ఎంతకీ నిద్రలేవరు.
సూర్యుడు నడినెత్తిన చేరిన తర్వాత స్నానం చేస్తుంటారు.
కానీ, ఇది మంచి పద్ధతి కాదుంటున్నాయి శాస్త్రాలు. అసలు స్నానం ఎపుడు చేయాలి...?
దాన్నిబట్టి ఉండే ఫలితాలు ఇవిగో...
తెల్లవారుజామున 4-5 గంటల మధ్య స్నానం చేయడం అత్యుత్తమం. దీన్ని రుషిస్నానం అంటారు.
5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దేవస్నానం అంటారు. ఇది మధ్యమం.
ఇక 6 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానవ స్నానం అంటారు. ఇది అధమం.
ఇక 7 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు.
ఇది అధమాతి అధమం.
కాబట్టి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, రుషిస్నానం చేయడం పుణ్యప్రదం.
ఇక స్నానాల్లోకెల్లా చన్నీటి స్నానం ఉత్తమమైనది.
ప్రవాహ ఉదకంలో స్నానం చేయడం ఉత్తమోత్తమం.
చెరువులో స్నానం మద్యమం నూతి(బావి) వద్ద స్నానం చెయడం అధమం.
వేయి పనులున్నా వాటిని వదిలి సమయానికి స్నానం చేయాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.
ఒక నదిలో స్నానం చేసినప్పుడు ఇంకో నదిని దూషించకూడదు.
కొన్ని స్పాలలో, ఆయుర్వేదశాలల్లో చాకొలేట్, మట్టి వంటి ఇతర పదార్థాలతో స్నానం చేయటానికి ప్రత్యేక వసతులు ఉంటాయి.
షాంపేనుతో స్నానం చేసిన ఉదాహరణలు అక్కడక్కడా కనిపిస్తాయి. అంతేకాకుండా ఆరుబయట సూర్యుని కిరణాలు శరీరాన్ని తాకేట్టు పరుండటాన్ని కూడా స్నానంగా పరిగణిస్తారు.
ఈ సూర్య స్నానం (సన్ బాతింగ్) ముఖ్యంగా పాశ్చాత్య ప్రజలలో ప్రసిద్ధి చెందినది.
⛱ *పురాణాలలో స్నానం :*
మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినది జలం, అగ్ని. అగ్నితో శుద్ధి చేసుకోవడం వీలుబడదు.
అగ్ని యందలి దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి చెప్పబడింది.
⛱ *మంత్ర స్నానం:*
వేదమందు చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రములను ఉచ్ఛరిస్తూ చేయునది "మంత్ర స్నానం"
⛱ *భౌమ స్నానం :*
పుణ్య నదులలో దొరుకు మన్ను లేక పుట్టమన్ను మొదలగు పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రాలతో చేసేది "భౌమ స్నానం".
⛱ *ఆగ్నేయ స్నానం:*
సమస్త పాపములను దగ్ధం చేసే పుణ్య రాశిని చేకూర్చే భస్మమును మంత్ర సహితంగా లేదా శివ నామమును ఉచ్ఛరిస్తూ ధరించి చేసేది "ఆగ్నేయ స్నానం"
⛱ *వాయువ్య స్నానం:* ముప్పది మూడు కోట్ల దేవతులు నివశించు గోమాత పాద ధూళి చేత చేసేది "వాయువ్య స్నానం"
⛱ *దివ్య స్నానం:*
లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అగు సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వానలో స్నానం చేయడం "దివ్య స్నానం".
ఇది అరుదైనది. దీనికి వాతావరణం అనుకూలించాలి.
⛱ *వారుణ స్నానం:*
పుణ్య నదులలో స్నానం ఆచరించడం
"వారుణ స్నానం".
⛱ *మానస స్నానం :*
నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మత్సర అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం
"మానస స్నానం".
ఇది మహత్తర స్నానం.
మహా ఋషులచేత ఆచరింప బడుతుంది. ఈ స్నానం కోసం అందరూ ప్రయత్నం చేయాలి.
*స్నానాలు రకాలు*
*మానస స్నానం:*
దైవాన్ని స్మరిస్తూ, మనసును నిలిపి చేయు స్నానం.
*క్రియాంగ స్నానం:*
జపం, మంత్రతర్పణ చేయుటకు చేసే స్నానం.
*దైవ స్నానం:*
ఉదయం 4-5 గంటల మధ్య చేయు స్నానం.
*మంత్ర స్నానం:*
వైదిక మంత్రాలను చదువుతూ చేసే స్నానం.
*రుషి స్నానం:*
ఉదయం 5-6 గంటల మధ్య చేయు స్నానం.
*మానవ స్నానం:*
ఉదయం 6-7 గంటల మధ్య చేయు స్నానం.
*రాక్షస స్నానం:*
ఉదయం 7 గంటల తరవాత చేసే స్నానం.
*ఆతప స్నానం:*
ఎండలో నిలబడి శరీరాన్ని శుద్ధి చేసుకునే స్నానం.
*మలాపకర్షణ స్నానం:*
మాలిన్యం పోవుటకు చేయు స్నానం.
(సేకరణ )
No comments:
Post a Comment