Saturday, 22 November 2025

 రమణ మహర్షి..భగవాన్ స్మృతులు - *5

🪷

అధికారులు, బిచ్చగాళ్ళు, ధనవంతులు, సన్యాసులు, భక్తులు, రూపవంతులైన స్త్రీలు ఎవ్వరూ ఆయన దృష్టిని తీసుకోలేక పోయేవారు. కొందరు ఎన్నో ప్రశ్నలతో వచ్చి, అడగడం ప్రారంభిస్తే ఎంతకీ పలికే వారు కారు, ఒకర్ని పిలిచి పలకరించి, ఎన్నో విషయాలు చెప్పేవారు. కొందరిని ఏ కారణం లేకుండా, తనని పలకరించగానే కసిరి కొట్టేవారు. కొందర్ని గట్టిగా తిట్టేవారు హాస్యం పట్టించి, వెక్కిరించి, అందరూ నవ్వేటట్లు చేసేవారు.

సీసపద్యం

కసిరి కొట్టి కనులు కథలుగా తిప్పియు

 నవ్వించి నవ్వుతూ నటన జూప

కలలోన కనిపించ కలవరించి పిలవ

కొందర్ని చూడక కోప భావ

భక్తుని యాకృతి బంధము నో ర్పుగా

భావభవపలుకు భయము తొలగ

వచ్చి వేచిన కోప వాక్కులు తీరుగు

నమ్మిన వారికి నమ్మ పలుకు

గీత


విషము కన్న మూర్ఖ చెలిమి విషము యగుట 

తెలిసి నడవ గలుగు తీరు తెలప గోరు 

సూరి జనుల సుస్నేహము సూత్ర మగుట 

అమృత తుల్యమౌను పలుకు నవిని లోన 


🌼 సీస పద్యం – సరళ భావం

**

కొంతమంది చిన్న చిన్న మాటలతో, కనులతో సంకేతాలతో

నవ్వులు రేపుతూ, నటిస్తూ ప్రవర్తిస్తారు.

కొందరు మనసులో, కలల్లో కనిపించి

మనలను కలవరపరిచే వారు ఉంటారు;

కొందరిని మాత్రం చూడాలని అనిపించదు—పరిచయం కోపమే తెస్తుంది.

భక్తుడు ఈ బంధాలన్నిటినీ సహనంతో భరిస్తాడు;

భగవద్భావం అతని హృదయంలో నిలిచితే

అన్నిటి భయాలు తొలగిపోతాయి.

ఎవరైనా కోపంతో వస్తే,

భక్తుని సమక్షంలో ఆ కోప పెల్లుబికిన మాటలు కూడా తగ్గిపోతాయి.

సత్యంగా నమ్మిన వారికి మాత్రమే

అతను నిజమైన మాట చెప్పుతాడు.


🌼 గీత – సరళ భావం


మూర్ఖుడితో స్నేహం —

విషం కంటే ప్రమాదం.

జీవితంలో ఎవరి వెంట నడవాలో,

ఎవరి నుండి దూరంగా ఉండాలో తెలుసుకొని ఉండాలి —

కొందరికి అది నేర్పాలి.

పండితులు, జ్ఞానులు, మంచివారి స్నేహం

ప్రాణాధారం లాంటి గొప్ప సూత్రం.

వారి మాటలు —

అమృతంలా మనసులో తేలికగా, శాంతిగా ప్రవహిస్తాయి.


కొందరు భక్తులు ఆశ్రమం నుంచి వెళ్ళిపోయిన తరువాత భగవాన్ కలల్లో కనపడి రమ్మంటారు. లేదా, ఆ  భక్తుడికే యెంతో నిలువ లేని ఆతృత కలుగుతుంది, భగవాన్ని యెప్పుడు చూస్తానా అని, దూరాల నుంచి, ఇబ్బందుల్లో నుంచి ఏదీ లక్ష్యం చేయక యెప్పుడు యెప్పుడు అంటూ వస్తాడు ఆశ్రమానికి. అతను వచ్చేప్పటికి భగవాన్ తల రెండో వైపు తిరిగి ఉంటుంది, అటు చూడరు, పలకరించరు. చిరునవ్వు నవ్వరు కొన్ని రోజులు. ఈలోపల యెందర్ని పలుకరిస్తారో ప్రేమగా పిలచి, మాట్లాడి, కుశల ప్రశ్నలు వేస్తారో!

కొందరు వుండేవారు. వారికి అందరి ముందూ భగవాన్ తో మాట్లాడడం గొప్ప. అందరి వంకా చూస్తూ, ఏవో కాయితాలో పుస్తకమో పట్టుకుని, ఏదో సందేహాన్ని కల్పించుకుని వెళ్ళి భగవాన్ని పలకరించి మాట్లాడతారు- మధ్య మధ్య చుట్టూ వున్న వారి వంక గర్వంగా చూస్తూ అంత స్వల్పమైన విషయాన్ని యెంతోసేపు మాట్లాడతారు, వాళ్ళతో భగవాన్, దూరం నుంచి వచ్చి; త్వరలో వెళ్ళవలసిన ఇంకోరు తమ సందేహాలతో రోజులకి రోజులు వుండిపోవలసిందే. యెవ్వరికేది అవసరమో, ఏది వారిని తనకి కట్టి వేస్తుందో, ఏది వారి అహాన్ని అణుస్తుందో ఆ విధంగా జరిగిపోయేది భగవాన్ ద్వారా.

సశేషం..


No comments:

Post a Comment